హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: మౌనిత గురించి చెడుగా ఎవ్వ‌రు చెప్పినా న‌మ్మ‌ను.. స్ప‌ష్టంగా చెప్పేసిన కార్తీక్

Karthika Deepam: మౌనిత గురించి చెడుగా ఎవ్వ‌రు చెప్పినా న‌మ్మ‌ను.. స్ప‌ష్టంగా చెప్పేసిన కార్తీక్

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. నిన్న‌టి ఎపిసోడ్‌లో నిన్ను డాక్ట‌ర్ బాబు ద‌గ్గ‌ర ఎలా దోషిగా నిల‌బెట్టాలో నాకు తెలుసంటూ మౌనిత‌కు దీప చెబుతుంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో అంజి, మౌనిత గురించి చెడుగా చెప్పాల‌నుకున్నాడంటూ సౌంద‌ర్య ద‌గ్గ‌ర ఫైర్ అవుతుంటాడు

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. నిన్న‌టి ఎపిసోడ్‌లో నిన్ను డాక్ట‌ర్ బాబు ద‌గ్గ‌ర ఎలా దోషిగా నిల‌బెట్టాలో నాకు తెలుసంటూ మౌనిత‌కు దీప చెబుతుంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో అంజి, మౌనిత గురించి చెడుగా చెప్పాల‌నుకున్నాడంటూ సౌంద‌ర్య ద‌గ్గ‌ర ఫైర్ అవుతుంటాడు. ఆఖ‌రికి అంజి కూడా నాకు చెప్పేంత‌టి వాడు అయ్యాడా..? అని కార్తీక్ అంటాడు. ఏ అంజి అని సౌంద‌ర్య అడ‌గ్గా.. డ్రైవ‌ర్ అంజి అని కార్తీక్ అంటాడు. వాడు ఏం చెప్పాడు అని సౌంద‌ర్య అడ‌గ్గా.. నువ్వు ఏం చెప్పి పంపించావో అదే చెప్పాల‌ని చూశాడు అని కార్తీక్ అంటాడు. నేను వాడితో ఏం చెప్ప‌మంటానురా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. ఏం చెప్ప‌మంటావు ఆ మౌనిత గురించి చెడుగా చెప్ప‌మంటావు లేదంటే దీప గురించి మంచిగా చెప్ప‌మంటావు అని అంటాడు. వెంట‌నే ఆదిత్య‌.. ఏంటి అన్న‌య్య నువ్వు అనేది ఆ అంజి గాడు ఏం చెప్పాడు అని అడుగుతాడు. ఏదో మౌనిత మీద చెడుగా చెప్ప‌బోయాడు అని కార్తీక్ అంటాడు. నిన్న గాక మొన్న వచ్చిన‌వాడికి మౌనిత గురించి ఎలా తెలిసింది..? తెలిసినా వాడు నీతో చెప్ప‌డం ఏంటి..? ఏంటి మ‌మ్మీ ఇదంతా.. ఇంటి విష‌యాల‌న్నీ డ్రైవ‌ర్‌తో డిస్కస్ చేయ‌డం ఏంటి..? మ‌న స్థాయికి ఇలాంటివ‌న్నీ అవ‌స‌ర‌మా..? అని అడుగుతాడు.

  దానికి కార్తీక్.. అమ్మ గారికి ఎంత నెట్‌వ‌ర్క్ ఉందో నీకేం తెలుసురా.. ఈవిడ‌కు తోడు ఆవిడ‌.. మా మాజీ ఆవిడ. ఆవిడ‌కు మామూలు ఫ్యాన్సా.. ఆటో డ్రైవ‌ర్లందరూ అండ‌గా ఉండి అక్క అని పిలుస్తూ కావాల్సిన సాయం చేస్తున్నారు. అంద‌రు క‌లిసి డాక్ట‌ర్ బాబును బ‌ఫూన్‌ని చేసి ఆడుకుంటున్నారు అని అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. రేయ్ స్టుపిడ్ అంటుంది. దానికి ఆదిత్య‌.. అనుకున్నా.. స్టుపిడ్ అని నోరు మూయిస్తావ‌ని ముందే అనుకున్నా. అయితే సుపుత్రా లేదంటే స్టుపిడ్. నోరు మూయించి డ్రైవ‌ర్ల ముందు అలుసయ్యేలా చేస్తున్నావు అంటాడు. రేయ్ ఏంటిరా ఇది. కాస్త తెలుసుకొని మాట్లాడండిరా. ఎవ‌రి మీద ఎలాంటి ఆరోప‌ణ చేస్తున్నారో కాస్త ఇంకితంగా ఆలోచించండిరా అని అంటుంది.

  మ‌మ్మీ.. మీ ఇద్ద‌రిలో ఎవ‌రు చెప్పారో, ఎందుకు చెప్పారో.. ఆ డ్రైవ‌ర్ ఎందుకు నాతో మాట్లాడాడో అన‌వ‌స‌రం. వాడికి ఇవ్వాల్సిన డోస్ వాడికి ఇచ్చాను. కానీ ఒక్క‌టి మాత్రం గుర్తుపెట్టుకో. మౌనిత గురించి చెడుగా ఎవ్వ‌రు చెప్పినా నేను న‌మ్మ‌ను. ఆఖ‌రికి మౌనిత గురించి మౌనితే చెప్పినా నేను న‌మ్మ‌ను. అవ‌న్నీ నువ్వో, వంట‌ల‌క్కో చెప్పిస్తున్నార‌ని నాకు అర్థ‌మైపోయింది అని అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. మంచిదిరా.. నేను చీక‌ట్లోకే వెళ‌తాను, రాత్రినే ముట్టుకుంటాను, వెలుతురుని కొట్టేస్తాను, దీపాన్ని ఊదేస్తాను అని నువ్వు ఎన్ని మాట‌లు అనుకున్నా ఒక్క‌టి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో.. దీప ఇప్పుడు దీపంలా లేదు కార్తీక దీపంలా లేదు, ఆఖండ‌జ్యోతిలా ఉంది. అగ్నిశిఖ‌లా జ్వ‌లిస్తోంది. దాని జోలికి ఎవ్వ‌రూ వెళ్ల‌లేరు. ఆ అగ్నిజ్వాల‌ను క‌ల్లెత్తి చూడ‌లేరు. తాక‌లేరు. ఆఫ్ట్రాల్ మౌనిత.. శ‌ల‌బంగా మారిపోయి శ‌క‌లంలా విరిగిపోతుంది అని అంటుంది. ఇక సౌంద‌ర్య మాట‌ల త‌రువాత ఆదిత్య‌, కార్తీక్ అక్క‌డి నుంచి వెళ‌తారు. దీంతో సౌంద‌ర్య కాస్త బాధ‌ప‌డుతుంది.

  ఇక దీప ఆటోలో వెళుతూ.. అంజి చెప్పిన మాట‌ల‌ను, మౌనిత చెప్పిన‌ గుర్తుచేసుకుంటుంది. ఇక ఎక్క‌డ ఆపాలా అక్క అని వార‌ణాసి అడ‌గ్గా దీప ప‌ల‌క‌దు. ఇంట్లో సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు ఫోన్లు ప‌ట్టుకొని ఫోన్లు చేస్తూ ఉంటారు. మీరు ఎవ‌రికి అని సౌంద‌ర్య అడ‌గ్గా.. నువ్వు ఎవ‌రికి అని ఆనంద‌రావు అడుగుతాడు. నేను దీప‌కి అని సౌంద‌ర్య చెప్ప‌గా.. నేను అంజికి అని ఆనంద‌రావు అంటాడు. వాడికెందుకు అని సౌంద‌ర్య అడ‌గ్గా.. కార్తీక్‌తో ఏదో చెప్పాల‌నుకున్నాడు క‌దా అని ఆనంద‌రావు అంటాడు. ఫోన్ క‌లిసిందా అని సౌంద‌ర్య అడ‌గ్గా లేద‌ని ఆనంద‌రావు అంటాడు. మ‌రి దీప‌కు క‌లిసిందా అని ఆనంద‌రావు అడ‌గ్గా.. లేద‌ని చెబుతుంది. ఆ త‌రువాత సౌంద‌ర్య‌.. మీరు అన్న‌ట్లు అంజి, కార్తీక్‌తో ఏం చెప్పాల‌నుకున్నాడో తెలుసుకోవాలి అని అంటుంది.

  ఇక అదే స‌మ‌యానికి అంజి ఇంట్లోకి వ‌స్తాడు. అదుగో వ‌చ్చాడ‌ని ఆనంద‌రావు అంటాడు. ఇక ఆనంద‌రావు కారు స‌ర్వీసింగ్‌కి ఇవ్వ‌మ‌న్నాను ఇచ్చావా.?? అని అడగ్గా.. ఇచ్చాను స‌ర్ అని అంజి అంటాడు. ఉద‌యం అన‌గా వెళ్లావు, ఎందుకింత ఆల‌స్యమైంద‌ని సౌంద‌ర్య అడ‌గ్గా.. అంజి ఉద‌యం జ‌రిగిన‌వ‌న్నీ గుర్తు చేసుకుంటాడు. అస‌లు నీ ఫోన్ ఎందుకు స్విచ్ఛాప్ పెట్టుకున్నావు అని ఆనంద‌రావు అడ‌గ్గా.. నా ఫోన్ ప‌గిలిపోయింది స‌ర్. జీతం రాగానే కొత్త‌ది కొంటాను అని అంజి అంటాడు. కొత్త‌ది రావ‌డానికి జీత‌మే రావాలా.?? అడ్వాన్స్ తీసుకో అని ఆనంద‌రావు అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. అదంతా ప‌క్క‌న‌పెట్టు.. నువ్వు మా కార్తీక్‌ని క‌లిసి ఏదో చెప్ప‌బోయావ‌ట. ఏంట‌ది.. ఏం చెప్పాల‌నుకున్నావు.. ఎవ‌రి గురించి చెప్పాల‌నుకున్నావు.. చెప్పు అంజి.. నీకేం తెలుస‌ని చెప్పాల‌నుకున్నావు.. ఎవ‌రి గురించో చెప్పు అని ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేస్తుంటుండి. దాంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ అంజి.. డాక్ట‌ర్ బాబుకు దీప‌మ్మ చెబితేనే న‌మ్మ‌లేదు. ఇంక నేను చెబితే న‌మ్ముతారా..? ఈ అమ్మ గారితో అంతా చెప్పేస్తాను. ఈవిడే చూసుకుంటారు. నాకేం జ‌రిగినా ప‌ర్వాలేదు. ఆ మౌనిత పీడ వ‌దిలిపోవాలి అని అనుకుంటాడు. ఇక ఆనంద‌రావు మాట్లాడవేంటి అంజి అన‌గా.. అవును నేను డాక్ట‌ర్ బాబుతో ఓ మాట చెప్పాల‌నుకున్నాను అని అంజి అంటాడు. కానీ అనేలోపు కార్తీక్ వచ్చి.. అంజిని కొడ‌తాడు.

  వెంట‌నే సౌంద‌ర్య‌.. కార్తీక్ ఏంటి ఈ ఆవేశం అని అన‌గా.. అలా తొంద‌ర‌ప‌డ్డావేంటిరా అని ఆనంద‌రావు అంటాడు. మీకేం తెలుసు డాడీ వీడి గురించి. వీడు దాని భ‌క్తుడిగా మారిపోయాడు. అదేం చెప్తే అది చెప్ప‌డానికి త‌యారైపోయాడు అని కార్తీక్ అంటాడు. ఇక సౌంద‌ర్య‌.. వీడి గురించి నాకు తెలీదు. కానీ దానికి ఇంకొక‌రితో చెప్పించే అల‌వాటు లేదు అని అంటుంది. ఎందుకు లేదు. దాన్ని తీసుకెళ్లి ఎక్క‌డో హిమాల‌య ప‌ర్వ‌తాల మీద పెడితే.. మౌంట్ ఎవ‌రెస్ట్ ఎక్కిన భార‌తీయ మ‌హిళ‌గా పేరు వ‌స్తుందేమో గానీ.. నా దృష్టిలో మాత్రం అది ఇంకా పాత‌ళంలోని క‌నిపిస్తుంది అని కార్తీక్ అంటాడు. మ‌నం ఇప్పుడు అంజి గురించి మాట్లాడుతున్నాం అని ఆనంద‌రావు అన‌గా.. వీడి గురించి మ‌నం మాట్లాడ‌టానికి ఏం లేదు. వీడు, నీ కోడ‌లు క‌లిసి రోడ్ల మీద మంత‌నాలు జ‌రుపుతున్నారు. మౌనిత చూసి ఏంటి ఇది అని ద‌గ్గ‌రికి వెళ్లి అడిగితే.. నువ్వేం మాట్లాడినా రికార్డు చేస్తామ‌ని ఫోన్లు చూసి బెదిరించార‌ట అని కార్తీక్ అంటాడు. వెంట‌నే అంజి అబ‌ద్దం అన‌గా.. ష‌ట‌ప్.. మీ ఇద్ద‌రి ఫోన్లు ప‌గ‌ల‌గొట్టింది ఎవ‌రు అని కార్తీక్ అడ‌గ్గా.. ఆ మౌనితే అని అంజి చెబుతాడు. ఎక్క‌డ ప‌గ‌ల‌గొట్టింది రోడ్డు మీదే క‌దా అని కార్తీక్ అడ‌గ్గా..అవును కానీ అని అంజి చెప్ప‌బోతాడు. వెంట‌నే కార్తీక్.. నువ్వు నోర్ముయ్. విన్నారుగా మ‌మ్మీ.. రోడ్డు మీద ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్లు అని అంటాడు. దానికి అంజి.. న‌డిచి వెళ్తుంటే డ్రాప్ చేస్తాన‌న్నాను డాక్ట‌ర్ బాబు అని అంటాడు.

  రేయ్ మాట్లాడ‌కు.. మాట్లాడ‌ద్దు అన్నానా.. నాకు మౌనిత ఫోన్ చేసి అంతా చెప్పింది. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో.. మౌనిత‌ను ఏం అన్నారో అన్ని తెలుసు నాకు.. ఏమ‌నుకుంటున్నావురా నువ్వు.. నువ్వు డ్రైవ‌ర్‌వి మెకానిక్‌వి కాదు. సంసారాల మెకానిక్‌వి అంత‌క‌న్నా కాదు. వెళ్లి నీ ప‌ని చూసుకో.. లేదంటే ఆ ప‌ని కూడా ఉండ‌దు. గుర్తు పెట్టుకో.. వెళ్లు అని అంజి అక్క‌డి నుంచి వెళ‌తాడు. ఇక కార్తీక్.. మీరు కూడా ఏంటి.. డ్రైవ‌ర్ ద‌గ్గ‌ర మ‌న ఇంటి విష‌యాలు డిస్క‌స్ చేయ‌డం అవ‌స‌ర‌మా..? అని కోపంగా అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

  ఇక మౌనిత ఇంట్లోకి అస‌హ‌నంగా వెళ్ల‌గా.. ప్రియ‌మ‌ణి ఫోన్‌లో మాట్లాడుతుంటుంది. కుద‌ర‌దు బాబు. ఇక్క‌డ మా అమ్మ గారి పెళ్లి ఇవాళో రేపో అన్న‌ట్లుగా ఉంది. ఈసారి మంగ‌ళ‌గిరి తిరునాళ్లు మీరే ఎంజాయ్ చేయండి అని ప్రియ‌మ‌ణి ఫోన్‌లో చెబుతుంటుంది. ఆ మాట‌లు విన్న మౌనిత‌.. ఇది అన్న‌ట్లు.. నా పెళ్లి అంత త్వ‌ర‌గా జ‌రుగుతుందా..? నేనేదో అక్క‌డ పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఊగిపోయాను అని మ‌న‌సులో అనుకుంటూ దీప చెప్పిన మాట‌లు గుర్తు చేసుకుంటుంది. నా సంగ‌తుల‌న్నీ తెలిసిన‌ట్లు దీప మాట్లాడుతుంది.. ఏదైనా ప్లాన్‌లో ఉన్నారా..? అని మౌనిత ఆలోచిస్తుండ‌గా.. ప్రియ‌మ‌ణి ఫోన్ పెట్టేసి ఆమె ద‌గ్గ‌ర‌కి వ‌స్తుంది. అమ్మా మీరెప్పుడు వ‌చ్చారు..? కాఫీ తీసుకురానా..? మీరు హిమ గురించి గుడ్‌న్యూస్ చెప్పిన త‌రువాత మీరు రాగానే స్ట్రాంగ్ కాఫీ ఇద్దామ‌ని ఇప్పుడే పెట్టా అని ప్రియ‌మ‌ణి అంటుంది. స‌రే తీసుకురాపో అనగా.. ప్రియ‌మ‌ణి లోప‌లికి వెళుతుంది. ఇక మౌనిత రాంగ్ స్టెప్ వేశానా.? అన్ని పాజిటివ్‌గా వెళుతుంటే వెళ్ల‌నివ్వ‌కుండా నేనే అడ్డుప‌డ్డానా.. ఆ దీప వెళ్లి సౌంద‌ర్య‌తో చెబుతుంది. ఆవిడ‌కు అంజి గాడు పూర్తి విష‌యం చెప్పేస్తే.. చెప్పే లోపు ఈ అంజి గాడిని సిటీ నుంచి త‌రిమేయాలి అని అనుకుంటుంది. ఇక కాఫీ ఇచ్చిన ప్రియ‌మ‌ణి.. ఏంట‌మ్మా సంతోషంగా లేరు అని అడుగుతుంది. ప్రియ‌మ‌ణి.. నువ్వు న‌న్ను ఇష్ట‌ప‌డినంత‌గా కార్తీక్ అయ్య న‌న్ను ప్రేమిస్తున్నాడంటావా..? అని అడుగుతుంది. ఏంట‌మ్మా.. ఇందాక అంత హుషారుగా మాట్లాడారు. ఇప్పుడు మ‌ళ్లీ ఇదంతా.. క‌థ మ‌ళ్లీ మొద‌టిగా వ‌చ్చిందా ఏంటి అని ప్రియ‌మ‌ణి అడుగుతుంది. అవును క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిందా ఏంటి అని మౌనిత మ‌న‌సులో అనుకుంటూ ఏం లేదు నువ్వు వెళ్లు అని ప్రియ‌మ‌ణికి చెబుతుంది. దీంతో ప్రియ‌మ‌ణి అక్క‌డి నుంచి వెళుతుంది.

  ఇక కార్తీక్ ఇంట్లో ఉండ‌గా.. ఆదిత్య వంట రూమ్‌లో కుస్తీలు ప‌డుతూ ఉంటాడు. ఇక ఆదిత్య చేయి కాల‌డంతో అర‌వ‌గా.. కార్తీక్ లోప‌లికి వెళ్లి ఏమైంది అంటాడు. చేయి కాలింద‌న్న‌య్యా అని ఆదిత్య అన‌గా.. నువ్వు ఎందుకు ఇక్క‌డికి వ‌చ్చావు అని కార్తీక్ అడుగుతాడు. దీపు గాడికి పాల కోసం వ‌చ్చాను. క్లాత్‌తో ప‌ట్టుకోవాల్సింది చేత్తో ప‌ట్టుకున్నాను అని ఆదిత్య అంటాడు. నీకు రాని ప‌నుల జోలికి ఎందుకు వ‌స్తావురా..? శ‌్రావ్య లేదా..? అని అడుగుతాడు. ఉంది. దీపు గాడు ఏడుస్తుంటే వాడిని ప‌ట్టుకొని కూర్చుంది అంటాడు. వాడిని నువ్వు ఎత్తుకొని శ్రావ్య‌ను పంపించ‌చ్చు క‌దా అని కార్తీక్ అడ‌గ్గా..అయ్యో అన్న‌య్య నా కొడుకు టాప్ లేచిపోయేలా ఏడుస్తాడు. వాడి ఏడుపు భ‌రించ‌డం కంటే ఇలా చేయి కాల్చుకోవ‌డమే బావుంటుంది అని అంటాడు. ఇక కార్తీక్.. ఉండు నేను స‌హాయం చేస్తాను అని ప‌ట్టుకారుతో పాలు తీస్తుంటాడు. అదే స‌మ‌యానికి దీప ఇంట్లోకి వ‌చ్చి డాక్ట‌ర్ బాబు అని పిలుస్తుంది. ఇది ఎందుకు వ‌చ్చింది ఇప్పుడు అని కార్తీక్ అన‌గా.. ఏమో అన్న‌య్య అని ఆదిత్య అంటాడు. ఇక వారిద్ద‌రు కిచెన్‌లో నుంచి వ‌స్తుండ‌గా.. ఏంటి అన్న‌ద‌మ్ములిద్దరు కిచెన్‌లో నుంచి వ‌స్తున్నారు అని అడుగుతుంది. నువ్వు ఎందుకు వ‌చ్చావ‌ని కార్తీక్ అడ‌గ్గా.. తైత‌క్క‌లాడ‌టానికి అని దీప అంటుంది.

  ఆ త‌రువాత కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి జేబులో వెతుకుతూ ఉంటుంది. ఏయ్ ఏం చేస్తున్నావు చ‌క్కిలిగిలి పెడుతున్నావు అని కార్తీక్ అన‌గా.. నేనేం చక్కిలిగిలి పెట్ట‌డానికి రాలేదు. బాగా కిత‌కిత‌లు అవుతుందా అయ్య‌గారికి.. మీ ఫోన్ ఎక్క‌డా.. అని వెతుకుతూ ఉంటుంది. నా ఫోన్ ఎందుకే నీకు అని కార్తీక్ అడుగుతుండ‌గా.. చెప్తాను ఉండండి అని వెనుక‌జేబులో ఉన్న ఫోన్‌ని తీసుకుంటుంది. ఇక దీప చేష్ట‌ల‌కు ప‌క్క‌నే ఉన్న ఆదిత్య న‌వ్వుతూ ఉంటాడు. ఇక నువ్వు ఆగు, నువ్వు దూరంగా జ‌రుగు, అస‌లు నా ఫోన్ ఎందుకే నీకు.. ఏం చేస్తున్నావే నువ్వు అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను ఉండండి. అన్నింటికి తొంద‌రే మీకు అంటూ ఈ ఫోన్‌లో సిమ్‌ని ఎలా తీయాలి అని అడుగుతుంది. ఇక్క‌డివ్వు నేను తీస్తాను అని అంటాడు. ఇక ఏం చేస్తున్నావే అని కార్తీక్ అడ‌గ్గా.. ఆగుతారా..? లేక మ‌ళ్లీ చ‌క్కిలిగిలి పెట్ట‌మంటారా..? అని చెప్పి..కార్తీక్ ఫోన్‌లో నుంచి సిమ్‌ని తీసి, త‌న సిమ్‌ని అందులో వేసుకుంటుంది.

  ఏం చేస్తున్నావే అని కార్తీక్ అడ‌గ్గా.. ఇదుగోండి మీ సిమ్ కార్డు అని సిమ్ ఇస్తుంది. మ‌రి నా ఫోన్ అన‌గా.. త‌న ప‌గిలిన ఫోన్‌ని ఇచ్చి ఇదుగోండి పండుగ చేసుకోండి అని కార్తీక్ చేతిలో పెడుతుంది. నా ఫోన్ తీసుకుంటావేంటి..? అని కార్తీక్ అడ‌గ్గా.. ఆ కాకి మెడ‌ది రోడ్డు మీద నా ఫోన్ ప‌గ‌ల‌గొట్టేసింది. నేను కూడా న‌డి రోడ్డు మీద దాని త‌ల‌కాయ ప‌గ‌ల‌గొట్టేసేదాన్నే. ఫ‌లానా డాక్ట‌ర్ బాబు భార్య అంటూ ప్ర‌జ‌లు ప‌లు ర‌కాలుగా అంటార‌ని ఊరుకున్నాను అని అంటుంది. అయితే నా ఫోన్ తీసుకుంటావా..? అని కార్తీక్ అడ‌గ్గా.. మొగుడి ఫోన్ పెళ్లాం తీసుకుంటే త‌ప్పేంటి అని దీప అడుగుతుంది. ఏం ఆదిత్య త‌ప్పంటావా..? అని దీప అడ‌గ్గా.. నేను చచ్చినా అన‌ను వ‌దినా అంటాడు. దానికి దీప‌.. విన్నారా.. మీకేం త‌క్కువ కోట్ల ఆస్తి ఉంది. మ‌ళ్లీ కొత్త‌ది కొనుక్కోండి అంటుంది. మౌనిత ఫోన్ ప‌గ‌ల‌గొడితే నా ఫోన్ తీసుకుంటావేంటి..? అని కార్తీక్ అడ‌గ్గా.. అయితే వెళ్లి దాని ఫోన్ ప‌గ‌ల‌గొట్టేయ‌నా.. ఏ ఆయుధాలు అక్క‌ర్లేదు ఒక గ‌రిటె చాలు అని దీప అంటుంది. వంట‌ల‌క్క బుద్ది పోనిచ్చుకోలేదు అని కార్తీక్ అన‌గా.. మీ ఫోన్ నేను తీసుకుంటే త‌ప్పా.. మ‌రి నా ఫోన్ ఆ కాకి మెడ‌ది ప‌గ‌ల‌గొట్టేస్తే త‌ప్పులేదా.. ఏం ఆదిత్య త‌ప్పులేదా..? అని అడుగుతుంది. ఎందుకు లేదు. ఆవిడ ఎవ‌రు నీ ఫోన్ ప‌గ‌ల‌గొట్ట‌డానికి అని ఆదిత్య అంటాడు. ఇక దీప‌.. హా అందుకే ఇది తీసుకెళ్ల‌డానికి వ‌చ్చాను. మీ సిమ్‌ని మీకే ఇచ్చాను సుమా అని కార్తీక్‌ని గిల్లుతుంది.

  ఏయ్ ఏంటి ఇది అని కార్తీక్ అడ‌గ్గా.. ఏదైనా ఇస్తే ఇచ్చిన వాళ్ల‌కు ఇచ్చిన‌ట్లు గుర్తు ఉండ‌టానికి ఇలానే గిల్లుతారు మా ఆడ‌వాళ్లు అని చెబుతుంది. అస‌లు మౌనిత నీ ఫోన్ ఎందుకు ప‌గ‌ల‌గొట్టిందే.. నువ్వు, ఆ డ్రైవ‌ర్ అంజి ఏదో ప్లాన్ చేస్తున్నారు. దానికేనా అని కార్తీక్ అడుగుతాడు. దాని బొంద.. మేమేదో క‌ష్ట‌సుఖాలు మాట్లాడుకుంటుంటే అదే కారు ఆపి మ‌రీ వ‌చ్చింది. ఎవ‌డు ర‌మ్మ‌న్నారు.. ఎవ‌రు ఫోన్లు ప‌గ‌ల‌గొట్ట‌మ‌న్నారు..? ఇక నుంచి అది ఏం డ్యామేజ్ చేసినా బిల్లు మీకే. అందుకే దాన్ని నా జోలికి రావొద్ద‌ని చెప్పండి అని చెబుతుంది. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావ‌డం లేదే..? అని కార్తీక్ అన‌గా.. ప‌దేళ్లుగా నేను మొత్తుకునేది అదే. న‌న్ను అర్థం చేసుకోండి అని. స‌రేలే ఆ టైమ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. వ‌స్తా. అన్న‌ట్లు డ్రైవ‌ర్ అంజికి కూడా కొత్త ఫోన్ కొనివ్వండి. వాడి ఫోన్ కూడా ప‌గ‌ల‌గొట్టేసింది. ఆ మెంట‌ల్ మొహంది. వ‌స్తానండి. ఆదిత్య వ‌స్తా అని చెప్పి అక్క‌డి నుంచి వెళుతుంది. ఇలా జ‌రిగిదేంటి అన్న‌య్యా..వ‌దిన ఏడుస్తూనో, అరుస్తూనో రావ‌డం మానేసి ఇలా స్కూల్ మార్చేసింది అని అక్క‌డి నుంచి వెళ‌తాడు. ఇక దీప ఇచ్చిన ఫోన్‌ని కోపంగా గోడ‌కు వేసి కొడ‌తాడు కార్తీక్. కార్తీక దీపం కొన‌సాగనుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Television News

  ఉత్తమ కథలు