హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: కార్తీక్‌ని ద‌క్కించుకునేందుకు దొరికిన‌ మ‌రో అస్త్రం.. ఆనందంతో తేలిపోతున్న మౌనిత‌

Karthika Deepam: కార్తీక్‌ని ద‌క్కించుకునేందుకు దొరికిన‌ మ‌రో అస్త్రం.. ఆనందంతో తేలిపోతున్న మౌనిత‌

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకునే క్ర‌మంలో దీప ప‌లుమార్లు కార్తీక్‌ని సైతం ఎదురిస్తోంది. మ‌రోవైపు మౌనిత నిజ స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాల‌నుకున్న అంజి.. అందుకు త‌న‌కు సాయం చేయాలంటూ దేవ‌త‌ను మొక్కుకుంటాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో అంజి బ‌య‌ట‌కు రాగానే మౌనిత కారులో వెళుతుండ‌టం చూస్తాడు. దీంతో వెంట‌నే ఆమెను ఫాలో అవుతూ వెళ్తాడు.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకునే క్ర‌మంలో దీప ప‌లుమార్లు కార్తీక్‌ని సైతం ఎదురిస్తోంది. మ‌రోవైపు మౌనిత నిజ స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాల‌నుకున్న అంజి.. అందుకు త‌న‌కు సాయం చేయాలంటూ దేవ‌త‌ను మొక్కుకుంటాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో అంజి బ‌య‌ట‌కు రాగానే మౌనిత కారులో వెళుతుండ‌టం చూస్తాడు. దీంతో వెంట‌నే ఆమెను ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక లాయ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన మౌనిత‌.. హిమ, దీప క‌స్ట‌డీలో నుంచి కార్తీక్ క‌స్ట‌డీలోకి రావాలంటే ఏం చేయాలి సుజాత గారు.. అస‌లు కేసు నిల‌బ‌డుతుందా..? మ‌న‌వైపు వాద‌న బ‌లంగా ఉంటుందా..? అని అడుగుతుంది. దానికి లాయ‌ర్ పిల్ల‌ల క‌స్ట‌డీ విష‌యంలో కోర్టు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అంత తేలిగ్గా ఒక నిర్ణ‌యానికి రాదు. పిల్ల‌ల మ‌నోభావాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోని తీసుకుంటుంది అని అంటుంది. దానికి మౌనిత‌.. కానా ఆ హిమ ఏ రోజైతే పుట్టిందో ఆ రోజు నుంచే కార్తీక్ చేతుల్లో పెట్టారు. అప్ప‌టినుంచి కంటికి రెప్ప‌లా పెంచుకున్నాడు. ఇప్పుడొచ్చి దీప అత‌డి ఎమోష‌న్స్‌తో ఆడుకుంటోంది. మనం వేసే కేసుతో అటు దీప టోట‌ల్‌గా ఓడిపోవాలి. కార్తీక్ గెల‌వాలి. హిమ కార్తీక్ క‌స్ట‌డీలోనే పెర‌గాలి అంటుంది. దానికి లాయ‌ర్.. సాధార‌ణంగా పిల్ల‌లు మేజ‌ర్లు అయ్యే వ‌ర‌కు మ‌న‌స్ఫూర్తిగా ఎవ‌రి ద‌గ్గ‌ర ఉండాలో గ‌మ‌నించి కోర్టు నిర్ణ‌యం తీసుకుంటుంది. హిమ కార్తీక్ ద‌గ్గ‌రే ఉంటాన‌ని కోర్టుకు చెబితే ఎవ్వ‌రూ ఏమీ చేయ‌లేరు అని అంటుంది. దానికి మౌనిత సంతోష‌ప‌డుతూ.. అవునా..అయితే హిమ‌కు కార్తీక్ అంటే చాలా ఇష్టం. దీప‌నే అమ్మ అని ఈ మ‌ధ్య‌నే తెలిసింది. కాబ‌ట్టి హిమ‌ను మెల్ల‌గా ట్యూన్ చేయాలి. థ్యాంక్యు సో మ‌చ్ సుజాత గారు. ఈ కేసు గురించి మీతో మాట్లాడిన త‌రువాత మంచి హోప్ వ‌చ్చింది నాకు. థ్యాంక్యు మెరీ మ‌చ్. నేను ఇక వ‌స్తాను అని అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తోంది.

  ఆ త‌రువాత ప్రియ‌మ‌ణి ఫోన్ చేయ‌డంతో.. చెప్పు డియ‌ర్ అంటూ సంతోషంగా ప‌ల‌క‌రిస్తుంది. ఏం అమ్మా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా క‌సురుకునేవారు అని అడ‌గ్గా.. అవును చాలా ఉత్సాహంగా ఉన్నాను, చాలా ఉల్లాసంగా ఉన్నాను అని అంటుంది. దానికి ప్రియ‌మ‌ణి.. ఏంట‌మ్మా ఎవ‌రికైనా చెడు జ‌రిగిందా..? ఎవ‌రివైనా కాపురాలు కూల్చారా..? ఛ నా శాడిజం త‌గ‌లెయ్య. ఆరు నెల‌లు సావాసం చేసే స‌రికి మీ బుద్ధులు నాకు వ‌చ్చిన‌ట్లు ఉన్నాయ‌మ్మా అని అంటుంది. వెంట‌నే మౌనిత‌.. ఇప్పుడు లాయ‌ర్ ద‌గ్గ‌ర నుంచి వ‌స్తున్నాను. హిమ‌, త్వ‌ర‌లోనే మీ డాక్ట‌ర్ అయ్య ద‌గ్గ‌ర‌కు వ‌స్తుందే అనగా.. అవునా.. అదే జ‌రిగితే పిల్ల‌కు త‌ల్లిగా ఉంటాన‌ని వెళ్లి కార్తీక్ అయ్య‌తో క‌లిసిపోండ‌మ్మా అని ప్రియ‌మ‌ణి అంటుంది. దానికి మౌనిత స‌రే అన‌గా.. అమ్మా అమ్మా.. ఆ వాచ్‌మెన్ ఇచ్చిన చిన్న స్టౌవ్ మీద చేయ‌లేక‌పోతున్నాన‌మ్మా. దీప‌మ్మ క‌త్తిరించిన గ్యాస్ పైపు మ‌ళ్లీ వేయించ‌నే లేదు. ఇవాళ అయినా వ‌చ్చేట‌ప్పుడు తీసుకురండ‌మ్మా అని ప్రియ‌మ‌ణి అడ‌గ్గా.. స‌రేన‌ని అక్క‌డి నుంచి బ‌య‌లుదేరుతుంది. ఇక ఆ మాట‌ల‌కు అక్క‌డే ఉన్న అంజి వింటాడు.

  ఇక మ‌రోవైపు ఆటోలో హిమ‌ను దీప తీసుకొని రాగానే అంజి ఫోన్ చేస్తాడు. చెప్పు అని దీప అన‌గా.. మీతో ఒక ముఖ్య‌మైన విష‌యం చెప్పాల‌మ్మా అని అంటాడు. దేని గురించ‌ని దీప అడ‌గ్గా.. మౌనిత ద‌గ్గ‌ర విష‌యాన్ని చెబుతాడు. మీరు వ‌చ్చాక పూర్తి వివ‌రాలు చెబుతాను అని అన‌గా.. ఎక్క‌డికి రావాలి అని దీప అడ‌గ‌టంతో అంజి అడ్ర‌స్ చెబుతాడు. దీంతో వార‌ణాసి బ‌య‌ట‌కు వెళ్దామ‌ని అంటుంది. ఆ త‌రువాత హిమ‌ను లోప‌లికి వెళ్ల‌మ‌ని.. మ‌ళ్లీ చెప్స‌కుండా ఎక్క‌డికీ వెళ్ల‌వు కదా అని అడ‌గ్గా.. ఎక్క‌డికీ వెళ్ల‌న‌మ్మా.. నా మీద కోపం వ‌చ్చిందా..? అని హిమ అడుగుతుంది. దానికి దీప కోపం ఏం కాదు, బాధ వేసింది అని చెప్పి.. స‌రేలే అవ‌న్నీ వ‌చ్చిన త‌రువాత మాట్లాడుకుందాం. ఈ అమ్మ‌ను బాధ‌పెట్టే ప‌ని ఇంకోసారి చేయ‌కు అని చెప్పి అక్క‌డి నుంచి వెళుతుంది.

  ఇక కార్తీక్ ఒక చోట ఆగి.. హిమ‌, దీప‌తో వెళ్లే స‌న్నివేశాన్ని.. అమ్మ‌ను వ‌దిలి ఉండ‌లేనంటూ హిమ చెప్పిన మాట‌ల‌ను.. హిమ‌ను తెచ్చుకో లేదంటే హిమ‌ను మ‌ర్చిపో అని ఆదిత్య చెప్పిన మాట‌ల‌ను.. హిమ‌ను తీసుకెళ్లే స‌మ‌యంలో ప‌ర్మిష‌న్ అవ‌స‌రం లేదంటూ దీప చెప్పిన మాట‌ల‌ను గుర్తుచేసుకుంటూ ఉంటాడు. ఆ త‌రువాత హిమ‌ను మ‌ర్చిపోవ‌డం ఇంపాజిబుల్. పోని హిమ‌ను తెచ్చుకుందాం అంటే.. హిమ, దీప‌, సౌర్య‌ను తీసుకుర‌మ్మంటుంది. ఆ దీప‌, అమ్మ క‌లిసి హిమ‌కు బాగా నూరిపోసిన‌ట్లు ఉన్నారు. ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కారులో వెళుతూ.. కార్తీక్‌ని చూసిన అంజి ఆగిపోతాడు. డాక్ట‌ర్ బాబు ఇక్క‌డ ఉన్నాడేంటి.. దీప‌మ్మ‌ను ర‌మ్మ‌న్నానే.. ప‌ర్వాలేదులే.. కాసేపు వెయిట్ చేస్తారు. ఇదంతా దీప‌మ్మ కోస‌మే కదా.. ఇవాళ ఆ మౌనిత పాపం పండింది. దాని చ‌రిత్ర అంతా చెప్తాను. అది నా చేత హిమ‌ను చంపించిన విష‌యం కూడా చెప్పేస్తాను. డాక్ట‌ర్ బాబుకు నా మీద కోపం వ‌చ్చినా స‌రే.. జైలుకు పంపించినా స‌రే అని కార్తీక్‌వైపు వెళ్ల‌బోతుంటాడు. ఇక అంజిని చూసిన కార్తీక్.. అత‌డు వాహ‌నాలు ప‌ట్టించుకోకుండా త‌నవైపు వ‌చ్చే విష‌యాన్ని గ‌మ‌నిస్తాడు. ఈ క్ర‌మంలో ఓ కారు గుద్ద‌బోతుండ‌గా.. లాగి ఏంటి అంతలా ఆలోచిస్త‌న్నావు. కాసేపు ఆగితే ఏమ‌య్యేది అని అంటాడు.

  దానికి అంజి మ‌న‌సులో ఓ భ‌యంక‌రమైన నిజం. మీతో చెప్ప‌క‌ముందే మాధి అయ్యేది అని అనుకుంటాడు. స‌మ‌యానికి న‌న్ను కాపాడిన వాళ్లే నాకు దేవుడు డాక్ట‌ర్ బాబు అని చెబుతాడు. స‌రేలే ఏంటి ఇటు వ‌చ్చావు అని కార్తీక్ అడ‌గ్గా.. మీతో ఒక విష‌యం చెప్పాలి డాక్ట‌ర్ బాబు అంటాడు. నాతోనా అని కార్తీక్ అడ‌గ్గా.. అది విని మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియ‌ట్లేదు అని అంటాడు. దానికి కార్తీక్.. దేని గురించి అని అడ‌గ్గా.. మౌనిత గురించి అంటాడు. వెంట‌నే కార్తీక్.. ఆపురా.. ఎవ‌రు పంపించారు నిన్ను. ఎంత ఇచ్చారు నీకు..? అని అంటాడు. దానికి అంజి.. డాక్ట‌ర్ బాబు నేను అలా డ‌బ్బు కోసం అబ‌ద్దం చెప్పే మ‌నిషిని కాదు. నేను చెప్పేది పూర్తిగా అని అంటూ ఉండ‌గా.. విన‌ను నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు. అంద‌రూ అయిపోయారు. చివ‌ర‌కు నువ్వు మిగిలిపోయావా..? నీతో చెప్పిస్తే న‌మ్మేస్తాననుకున్నారా..! అని కార్తీక్ అంటాడు. దానికి అంజి.. నేను చెప్పేది అని అంటూ ఉండ‌గానే.. ష‌ట‌ప్.. ఇంక ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్తీ వాళ్లు అంద‌రినీ ఉసిగొల్పుతుందా..? ఏమ‌నుకుంటోంది.? అని కార్తీక్ అంటాడు.

  నాకు ఎవ్వ‌రూ ఏం చెప్ప‌లేదు డాక్ట‌ర్ బాబు అని అంజి అనగా.. రేయ్ ఆపు, ఆప‌మ‌న్నానా..? నువ్వు డ్రైవ‌ర్‌వి. డ్రైవ‌ర్‌లానే ఉండు. అంతే త‌ప్ప నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల్లో జోక్యం చేసుకోకు అని కార్తీక్ అంటాడు. దానికి అంజి .. నాకు ఒక్క అవ‌కాశం అని అడుగుతుండగా.. నేనే ఇస్తున్నాను. ఆఖ‌రి అవ‌కాశం. ఇంకొక్క మాట‌.. ఇంకొక్క మాట నువ్వు మౌనిత గురించి చెప్పాల‌నుకున్నావో వెంట‌నే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసిప‌డేస్తాను. వెళ్లు అంటాడు. దాంతో అంజి అక్క‌డి నుంచి వెళ‌తాడు. ఇక కారులో చాక్లెట్ తినుకుంటూ సంతోషంగా వ‌స్తోన్న మౌనిత‌.. హిమ చ‌ట్ట ప్ర‌కారం కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. ఇక నా కార్తీక్, దీప ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఆ దీప పెంచిన ప్రేమ గొప్ప‌దా.. క‌న్న ప్రేమ గొప్ప‌దా..? అని మాట్లాడ‌లేదు. నోరు మూసుకొని కోర్టు చెప్పిన‌ట్లు చేస్తుంది. నాకు లైన్ క్లియ‌ర్ అవుతుంది. మౌనిత నీకు మంచి రోజులు వ‌చ్చేశాయి. ఈ గుడ్‌న్యూస్‌ని కార్తీక్‌కి చెప్పేయాలి అని ఫోన్ తీసి త‌రువాత లేదు.. ఈ స్వీట్ న్యూస్‌ని డైరెక్ట్‌గా నా కార్తీక్‌కి చెబుతా అని వెళుతుంది.

  ఇక సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు బ‌య‌ట‌కు వెళుతుండ‌గా..ఎక్క‌డ‌కు మ‌మ్మీ అని ఆదిత్య అడుగుతాడు. ఎయిర్‌పోర్టుకు రా అని చెప్పిన సౌంద‌ర్య‌.. లేక‌పోతే ఏంటిరా.. క‌నిపించ‌ట్లే.. టిఫెన్ చేయ‌డానికి డైనింగ్ టేబుల్ ద‌గ్గ‌ర‌కు వెళుతున్నాము అని అంటుంది. ఎలా ఆక‌లేస్తుంది మ‌మ్మీ అని ఆదిత్య అడ‌గ్గా.. జీర్ణాశ‌యం ఫంక్ష‌న్ స‌రిగా ఉంటే.. హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఉత్ప‌త్తి పెరిగి.. జ‌ట‌రాగ్నం ఉత్ప‌న్న‌మై క‌డుపులో టైమ్‌కి గంట కొడుతుంది. దాన్నే ఆకలి అంటారు అని సౌంద‌ర్య అంటుంది. దానికి ఆదిత్య‌.. నేను సైన్స్‌లో అడ‌గ‌లేదు అని ఆదిత్య అన‌గా.. నువ్వు ఏ సెన్స్‌లో అడిగావో నాకు తెలుసు అంటుంది. అన్న‌య్య అలా ఉంటే.. మీ ఇద్ద‌రు ఇలా ఎందుకు ఉన్నారు అని ఆదిత్య అడ‌గ్గా.. మ‌రి ఏం చేయాలిరా అని ఆనంద‌రావు అడుగుతాడు. అన్న‌య్య బాధ‌ను పోగొట్టే మార్గం ఏంటో మీకు తెలీదా అని ఆదిత్య అడుగుతాడు. ఇక సౌంద‌ర్య.. మీ అన్న‌య్య బతుకులో చీక‌టి పోగొట్టే మార్గం కోస‌మే ఇన్నాళ్లు వెతికాము. ఇంకా దొర‌క‌లేదు అని అంటుంది.

  దానికి ఆదిత్య‌.. అన్న‌య్య హిమ మీద బెంగ‌పెట్టుకున్నాడు మ‌మ్మీ అని అంటాడు. మరి హిమ అన్న‌య్య మీద బెంగ‌పెట్టుకోలేదా..? అని సౌంద‌ర్య అడ‌గ్గా.. వ‌దిన బ‌ల‌వంతంగా తీసుకెళ్లింది క‌దా అని ఆదిత్య అంటాడు. హిమ రానంటున్నా బ‌ల‌వంతంగా లాక్కెళ్లిందా.?? మీ అన్న‌య్య క‌చ్చితంగా వ‌స్తాడ‌న్న న‌మ్మకంతోనే క‌దా హిమ వెళ్లింది. వాడే వెళ‌తాడు క‌దా అని అని సౌంద‌ర్య అంటుంది. అన్న‌య్య వెళితే వ‌దిన పంపిస్తుందా.?? అని ఆదిత్య అడ‌గ్గా.. అది వాళ్లిద్ద‌రు తేల్చుకుంటారు క‌దా అని సౌంద‌ర్య అన‌గా.. అయితే మీకేం సంబంధం లేదా..? అని ఆదిత్య అడుగుతాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. పోని ఏం చేయ‌మంటావో నువ్వే చెప్పు అని సౌంద‌ర్య అడ‌గ్గా.. మ‌న‌మే వ‌దిన ఇంటికి వెళ్లి హిమ‌ను తీసుకొద్దాం అని అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. దానికి అక్క‌డ ఏం త‌క్కువ అయ్యింది. ఇక్క‌డ క‌న్నా అక్క‌డే ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటుంది అని చెబుతుంది. కానీ అన్న‌య్య మీద బెంగ పెట్టుకొని ఉంటుంది క‌దా అని ఆదిత్య అన‌గా.. అప్పుడు నువ్వు, నేను వెళ్ల‌డం ఎందుకు.. మీ అన్న‌య్య‌నే వెళ్ల‌మ‌ని చెప్ప‌చ్చు క‌దా అంటుంది. దానికి ఆదిత్య‌.. అరే అన్న‌య్య గురించి ఇంత కూడా ఆలోచించ‌వేంటి మ‌మ్మీ. ఎప్పుడు చూసినా వ‌దిన గురించే ఆలోచిస్తావు. వ‌దిన కోసం అన్న‌య్యతో గొడ‌వ‌పెట్టుకుంటావు. కొడుకు కంటే కోడ‌లిని నెత్తిన‌మీద పెట్టుకుంది అన్న ఇమేజ్ కోసం పాకులాడుతావేంటి మ‌మ్మీ అని అంటాడు.

  దానికి ఆదిత్య చెంప చెళ్లుమ‌నిపిస్తుంది సౌంద‌ర్య‌. ఏంటిరా.. నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నావు. నీకు వారానికో ఒపీనియ‌న్ మారిన‌ట్లు మమ్మ‌ల్ని.. పూట‌కో ర‌కంగా ఉండాలంటావా..? ఏంటిరా నువ్వు మాట్లాడేది.. నేను కోడ‌లిని నెత్తిన మీద పెట్టుకోవ‌డం ఏంటిరా..? దాని వ్య‌క్తిత్వమే దాన్ని అంత ఎత్తున నిల‌బెట్టింది తెలుసా..? మీ అన్న‌య్య బాధ‌ప‌డుతున్నాడు అంటావేంటి..? మీ అన్న‌య్య అంద‌రినీ బాధ‌పెడుతున్నాడు. భార్యని, బిడ్డ‌ని, క‌న్న‌వాళ్ల‌ని అంద‌రినీ వాడు బాధ‌పెడుతున్నాడు. అపార్థం చేసుకుంటున్నాడు. అనుమానిస్తున్నాడు, అవ‌మానిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు. అయినా నేను నా కొడుకుని నెత్తినే పెట్టుకొని చూసుకుంటున్నాను. ఎందుకంటే.. ఆ ఒక్క మాయ గానీ వాడిని క‌మ్మేసి ఉండ‌క‌పోతే మీ అన్న‌య్య మ‌చ్చ లేని చంద‌మామ కాబ‌ట్టి. వాడు నిజంగా దేశోద్ధార‌కుడే కాబ‌ట్టి. ఆ అనుమాన‌మ‌నే స‌న్న‌టి తెర తొలిగిపోయిన త‌రువాత.. వాడు కూడా ప‌శ్చాత్తాపంతో ద‌హించుకుపోతాడురా. అంత‌వ‌ర‌కు.. ఆ రోజు వ‌ర‌కు మీ వ‌దిన స‌హ‌నం స‌రిహ‌ద్దులు దాట‌కూడ‌ద‌ని అత్త‌గా నేను అండ‌గా నిల‌బ‌డ్డాను. కానీ కోడ‌లిని నెత్తిన పెట్టుకొని కొడుకుని పాతాళానికి తోసేదాన్ని అయితే దాన్ని లాక్కొచ్చి ఈ ఇంట్లో కూర్చొబెట్టి.. తాళం గుత్తి చేతికొచ్చి ఆస్తి ప‌త్రాల‌న్నీ చేతిలో పెట్టేదాన్ని. అంతేగానీ కూడికోసం ఆ కూటే తాను అమ్ముకొని బ‌తుకుతూ ఉంటే చూస్తూ ఊరుకునేదాన్ని కాదు అని ఆవేశంతో మాట్లాడుతుంది.

  ఇక ఆనంద‌రావుతో మీరేంటి అలానే ఉన్నారు. మీరు టిఫిన్ తిన్నాక ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఈ లిల్లీపుట్‌తో మ‌న‌కేంటి..?ర‌ండి అని వెళుతుంది. ఇక ఆదిత్య‌తో.. మ‌నం మ‌నుషులంరా. మానులం కాదు.. సీజ‌న్‌ని బ‌ట్టి మార‌డానికి. అన్న మీద అంత ప్రేమే ఉంటే.. నీకు ద‌మ్మే ఉంటే వాడి మ‌న‌సులో నుంచి ఆ అనుమానాన్ని పోగొట్టి అప్పుడు మాట్లాడు అని చెబుతుంది. ఇక ఆదిత్య ఆవేశంతో సోఫాను కొట్టి లోప‌లికి వెళ‌తాడు.

  ఇక అంజి కోసం ఎదురుచూస్తున్న దీప‌.. అంజి ఏదో చెప్పాలి అన్నాడు. అది ఏంటి.. ఆ మౌనిత విష‌య‌మా..? లేక డాక్ట‌ర్ బాబు విష‌య‌మా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ లోపు అంజి అక్క‌డ‌కు వ‌స్తాడు. ఇక దీప ద‌గ్గ‌ర‌కు వెళ్లిన అంజిని ఏమైంది అంజి ఇంత ఆల‌స్య‌మైంది అన‌గా.. దారిలో ఇద్ద‌రు దేవుళ్లు క‌నిపించారు అమ్మా. ఒక దేవ‌త సాయం చేసింది. ఇంకో దేవుడు గాయం చేశాడు అని అంటాడు. ఏం జ‌రిగింది అని దీప అడ‌గ్గా.. ఆ మౌనిత చాలా ప్లాన్‌లు చేస్తుంద‌మ్మా..డాక్ట‌ర్ బాబును మంచి చేసుకోవ‌డానికి, న‌మ్మించ‌డానికి, మీ నుంచి దూరం చేసి త‌న ద‌గ్గ‌ర చేసుకోవ‌డానికి ఎంత‌కైనా తెగించేస్తుంది అని చెప్తాడు. దానికి దీప‌.. అది నీకు ప‌దేళ్ల క్రిత‌మే తెలుసు. నాకు ప‌రిచ‌యం అయ్యాక తెలుసు అని దీప అంటుంది. కానీ అంత తెలివైన డాక్ట‌ర్ బాబుకు ఎప్ప‌టికీ తెలీదు. ఆయ‌నంత‌కు ఆయ‌న తెలుసుకోలేడు. నాలాంటి వాళ్లు చెప్పినా న‌మ్మేలా లేడు అని అంజి అంటాడు. నువ్వు చెప్పే ప్ర‌య‌త్నం చేశావా..? అని దీప అడ‌గ్గా.. చేశాన‌మ్మా అని అంజి అంటాడు. నిన్ను ఎవ‌రు పంపించారు..? మౌనిత గురించి చెడుగా చెప్ప‌డానికి ఎంత ఇచ్చారు..? అని తిట్టి పంపించారు. మీరు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌మ్మా అని అంజి సూచిస్తాడు. ఇక ఇవాళ మౌనిత‌ను ఫాలో అయ్యాన‌మ్మా.. లాయ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌లిసింది అని అంజి చెప్ప‌గా.. ఎందుకు అని దీప అడుగుతుంది. లీగ‌ల్‌గా హిమ‌ను డాక్ట‌ర్ బాబు ద‌గ్గ‌ర‌కు ర‌ప్పిస్తుందంటా అని అంజి అంటాడు. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో వాళ్లిద్ద‌రు మాట్లాడుకుంటుండ‌గా.. మౌనిత అక్క‌డ‌కు వెళ్లి కార్తీక్‌ని నా వాడిని చేసుకుంటాన‌ని మాట్లాడ‌టం.. నా లెక్క‌లు నాకు ఉన్నాయంటూ దీప చెప్ప‌డం జ‌ర‌గుతుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

  ఉత్తమ కథలు