హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: అలా అయితే మోనిత‌ను ఎప్ప‌టికీ పెళ్లి చేసుకోనన్న కార్తీక్.. దీపను వెతికించేందుకు సౌంద‌ర్య కీల‌క నిర్ణ‌యం

Karthika Deepam: అలా అయితే మోనిత‌ను ఎప్ప‌టికీ పెళ్లి చేసుకోనన్న కార్తీక్.. దీపను వెతికించేందుకు సౌంద‌ర్య కీల‌క నిర్ణ‌యం

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతుంది. శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో దీప ఎక్క‌డుందో చెప్పాల‌ని సౌంద‌ర్య‌ను అడుగుతుంటాడు కార్తీక్. త‌న‌కు తెలియ‌ద‌ని సౌంద‌ర్య చెబుతున్న ఆమె నుంచి ఎలాగైనా స‌మాధానం రాబట్టాల‌ని చూస్తుంటాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో వారి సంభాష‌ణ కొన‌సాగుతుంది. కార్తీక్ మాట్లాడుతూ.. దీప బ‌త‌కడానికి, జీవితాంతం తిని కూర్చోడానికి ఎంత కావాలంటే అంత ఇద్దాం. ఎంతైనా అది ఒక‌ప్ప‌టి నా భార్య‌. అది తిండికి, బ‌ట్ట‌కి ఇబ్బంది ప‌డుతుంటే నాకు బాధ‌గానే ఉంటుంది.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతుంది. శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో దీప ఎక్క‌డుందో చెప్పాల‌ని సౌంద‌ర్య‌ను అడుగుతుంటాడు కార్తీక్. త‌న‌కు తెలియ‌ద‌ని సౌంద‌ర్య చెబుతున్న ఆమె నుంచి ఎలాగైనా స‌మాధానం రాబట్టాల‌ని చూస్తుంటాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో వారి సంభాష‌ణ కొన‌సాగుతుంది. కార్తీక్ మాట్లాడుతూ.. దీప బ‌త‌కడానికి, జీవితాంతం తిని కూర్చోడానికి ఎంత కావాలంటే అంత ఇద్దాం. ఎంతైనా అది ఒక‌ప్ప‌టి నా భార్య‌. అది తిండికి, బ‌ట్ట‌కి ఇబ్బంది ప‌డుతుంటే నాకు బాధ‌గానే ఉంటుంది. దీపకు కావాల్సింది ఇచ్చేసి పిల్ల‌లిద్ద‌రినీ మ‌నం తెచ్చుకుందాం అని అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య చెంప ప‌గుల‌గొడ‌తానురా. ఆ మాట అంటే అని అంటుంది. అదేంటి మ‌మ్మీ అని కార్తీక్ అన‌గా.. సౌభాగ్యాన్ని వ‌దులుకొని ఆస్తి కోసం మాతృత్వాన్ని అమ్మేసుకుంటే అది అస‌లు ఆడ‌దే కాదు. అది నా కోడ‌లే కాదు. ఎంత త‌క్కువ అంచ‌నా వేశావురా నా కోడ‌లు వ్య‌క్తిత్వాన్ని అని అంటుంది.

  ఇక కార్తీక్.. నేను త‌క్కువ చేసి మాట్లాడ‌ట్లేదు మ‌మ్మీ. నేను నా కూతురుని ప్రేమ‌గా పెంచుకున్నాను. కానీ ఆ అర్థం లేని ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వ‌ల‌న ఆ పేద‌లు కూడా పేదిర‌కంలో మ‌గ్గిపోతున్నారు మ‌మ్మీ అని అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. ఆ పిల్ల‌ల ఉసురు నీకు తగులుతుంద‌న్న పాప‌భీతే ఉంటే నువ్వే స్వ‌యంగా వెతికి నీ భార్య‌పిల్ల‌లంద‌రినీ ఇంటికి తీసుకురారా. అదీ ఒప్పుకుంటే వ‌స్తాన‌ని ఒప్పుకుంటే అని అంటుంది. రాన‌ని చెప్పిందా అని కార్తీక్ అడ‌గ్గా.. రాను అనుకొని వెళ్లింది అని సౌంద‌ర్య చెబుతుంది. అది నీకెలా తెలుసు అని కార్తీక్ అడ‌గ్గా.. అమ్మ‌ను అడిగి చూడు అని సౌంద‌ర్య అంటుంది. నీతో నిజంగా ట‌చ్‌లో లేదా అని కార్తీక్ అడ‌గ్గా.. నీకు అస‌లు ఆలోచించే మెదడు కూడా లేదా అని సౌంద‌ర్య చెబుతుంది. అది ఎక్క‌డుందో నీకే తెలుసు అని కార్తీక్ అన‌గా.. అది ఎక్క‌డుందో తెలిస్తే మేమిద్ద‌రం ఇక్క‌డెందుకు ఉంటాము అని అంటుంది. హిమ కోసం నేను దిగి రావాల‌నే వెళ్లింది అని కార్తీక్ అన‌గా.. అంత దిగి రావాల్సిన ఖ‌ర్మ దానికి లేదు అని సౌంద‌ర్య అంటుంది. అయితే చెప్ప‌వా అని కార్తీక్ అడ‌గ్గా.. తెలిస్తే చెప్పేదాన్నే అని సౌంద‌ర్య చెబుతుంది. ఇక పైకి వెళుతూ కార్తీక్.. మ‌మ్మీ. నీకు ఒక విష‌యం చెప్పాలి. అది విన్నాక నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు. లేద‌నుకుంటే నేను చేయాల‌నుకున్న‌దే చేస్తా. మోనిత నాకు ఒక ప్రామిస్ చేసింది. బ‌దులుగా నేను మోనిత‌కు ఒక ప్రామిస్ చేశాను అని అంటాడు. ఏంట‌ది అని సౌంద‌ర్య అడ‌గ్గా.. హిమ ఎక్క‌డ ఉన్నా వెతికి తీసుకొస్తాన‌ని మోనిత నాకు ప్రామిస్ చేసింది అని కార్తీక్ అన‌గా.. అందుకు బ‌దులుగా అని సౌంద‌ర్య అడుగుతుంది. మోనిత‌ను పెళ్లి చేసుకుంటాన‌ని నేను ప్రామిస్ చేశాను అని కార్తీక్ చెబుతాడు. దాంతో ఇంట్లో అంద‌రూ షాక్‌కి గురి అవుతారు.

  ఆ త‌రువాత కార్తీక్.. ఇప్పుడు చెప్పు మ‌మ్మీ. హిమ ఆచూకీ నువ్వే చెప్పావు అనుకో నేను మోనిత‌ను పెళ్లి చేసుకోను. మోనిత ద్వారా హిమ ఆచూకీ తెలిసింద‌నుకో నేను మాట మీద నిల‌బ‌డి మోనిత‌ను పెళ్లి చేసుకుంటాను. క‌మాన్ మ‌మ్మీ. ఆలోచించుకో. నువ్వు చెప్పినా స‌రే. వెళ్లి తెచ్చినా స‌రే. ర‌మ్మ‌న్నా స‌రే. ఫ‌ల‌నా చోట ఉంద‌న్నా స‌రే. నీ వ‌ల్ల హిమ నాకు దొరికితే నేను మోనిత‌ను ఎప్ప‌టికీ పెళ్లి చేసుకోను. వెంట‌నే అక్క‌ర్లేదు. బాగా ఆలోచించుకొని చెప్పు అని పైకి వెళుతుంటాడు. వెంట‌నే కార్తీక్ ఒక్క నిమిషం అని సౌంద‌ర్య ఆపుతుంది. కూతురు కోసం క‌ట్టుకున్న దాన్ని వ‌దిలి ఇంకొక దాని మెడ‌లో తాళి క‌ట్ట‌డానికి నువ్వు సిద్ధ‌ప‌డ్డావంటే ఇది నీ మూర్ఖ‌త్వానికి పరాకాష్ట అనుకోవాలా.. నీ కూతురు మీద నీకు అంత ప్రేమ ఉంద‌నుకోవాలా.. పుట్టి ఇన్నేళ్లు అయినా నా అనుభ‌వంలో ఇలాంటి ప్ర‌శ్న ఎదురుకాలేదురా అని సౌంద‌ర‌య అన‌గా.. కూతురు మీద ప్రేమ మ‌మ్మీ. మూర్ఖుడినైన తండ్రిని నేను. న‌న్ను ప‌రాకాష్ట‌కు తీసుకెళ్లిన మూర్ఖ‌త్వం పేరు తండ్రి ప్రేమ అని పైకి వెళ‌తాడు.

  ఆ త‌రువాత సౌంద‌ర్య‌.. పొర‌పాటున దీప ఎక్క‌డుంది అన్న‌ది మోనిత క‌నిపెడితే. వాడు మాట‌కు క‌ట్టుబ‌డి మోనిత‌ను పెళ్లి చేసుకుంటాడు. దీప కాపురం, బిడ్డ‌ల భవిష్య‌త్ స‌ర్వ‌నాశ‌నం అయిపోతుందండి అని అంటుంది. వెంట‌నే ఆనంద‌రావు.. ఒక‌వేళ అదే జ‌రిగితే అన‌గా.. నేను ప్రాణాల‌తో ఉండ‌గా అది జ‌ర‌గ‌నివ్వ‌ను అని సౌంద‌ర్య చెబుతుంది.

  ఇక దీప బండి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఒక క‌స్ట‌మ‌ర్ ఇడ్లీ అడుగుతాడు. దీప తీసుకొచ్చి ఇచ్చాక దాన్ని తింటూ చాలా బావుంది. చ‌ట్నీ అదిరిపోయింది అని అంటాడు. ఆ త‌రువాత రేటు ఎక్కువ ఉంటుందేమో అనుకుంటూ బాబు ప్లేట్ ఇడ్లీ ఎంత అని వార‌ణాసిని అడుగుతాడు. ప‌ది రూపాయ‌ల‌ని వార‌ణాసి చెప్ప‌గా.. ఏంటి ప‌ది రూపాయ‌లేనా. ఇంత త‌క్కువ రేటులో ఇంత టేస్టీ ఇడ్లీలు పెడుతున్నారా అని ఇంకో నాలుగు వేయ‌మ‌ని చెబుతాడు. దీప తీసుకొచ్చి వేయ‌గా.. ఇంత మంచి వాళ్ల‌ని నేను ఎక్క‌డా చూడ‌లేదు. ఇక చూడు నేను నా ఫ్రెండ్స్‌ని ఇక్క‌డే తిన‌మ‌ని చెబుతాను. ఒక్క‌సారి తిన్నారంటే ఇంకెప్పుడు వ‌దల‌రు అని ఆ క‌స్ట‌మ‌ర్ అంటాడు. థ్యాంక్స్ అన్న అని వార‌ణాసి అన‌గా.. నువ్వేంటి అన్నా నేను థ్యాంక్స్ చెప్పాలి. చూడ‌టానికి ఈ అమ్మ అన్న‌పూర్ణ‌లాగా ఉంది. చేతులెత్తి న‌మ‌స్క‌రించాల‌నిపిస్తోంది అని డ‌బ్బులు ఇచ్చి అక్క‌డి నుంచి ఆ క‌స్ట‌మ‌ర్ వెళతాడు.

  ఇక సౌర్య‌.. ఏరా వార‌ణాసి వ‌స్తార‌న్నావు. ఇంకా రాలేదు క‌దా అని అడుగుతుంది. వ‌స్తారమ్మా అని వార‌ణాసి అన‌గా.. ఏంట‌మ్మా అని దీప అడుగుతుంది. దానికి సౌర్య‌.. నేను ఒక ఐడియాను చెప్పాన‌మ్మా. అది గ‌నుక స‌క్సెస్ అయితే నువ్వు న‌లుగురు అసిస్టెంట్‌ల‌ను పెట్టుకోవాల్సి వ‌స్తుంది. అంత బిజినెస్ జ‌రుగుతుంది అని చెబుతుంది. అవునా ఏంటి ఐడియా అని హిమ అడ‌గ్గా.. స‌స్పెన్స్ మీరే చూస్తారుగా అని సౌర్య చెబుతుంది. ఇక వార‌ణాసి.. ఒక ఐదు నిమిషాల్లో అద్భుతం జ‌రుగుతుంది అని అంటాడు. వెంట‌నే హిమ‌.. ఎవ‌రు వ‌చ్చేది. నాన్న అని అడుగుతుంది. దాంతో అంద‌రూ కాస్త చిన్న‌బోతారు.

  మ‌రోవైపు ముర‌ళీకృష్ణ ఇంటికి సౌంద‌ర్య వెళుతుంది. అక్కడ భాగ్యం మాట్లాడుతూ.. ఏదైనా అవ‌స‌రం అయితే నాకు తెలిసి కొంత‌, నాకు తెలీకుండా కొంత ఇస్తాన‌ని ఈయ‌న చెప్పారు వ‌దిన‌. నేను కూడా ఇదివ‌ర‌కులాగా దాన్ని ఏం అనట్లేదు. దానికి అంత క‌ష్ట‌మైతే క‌న్న‌తండ్రి ద‌గ్గ‌ర‌కు రావొచ్చు క‌దా. రానీక‌పోతే లోకం అంతా న‌న్నే అంటార‌ని నోరు మూసుకొని ఉండేదాన్ని క‌దా. అయినా మా సంగ‌తి వ‌దిలేయండి. దానికి క‌న్న‌త‌ల్లి లేదు. ఎంత చూసినా నేను స‌వ‌తి త‌ల్లినే. మీరు మాత్రం సొంత కూతురిలాగా చూశారు క‌దా. ఏ క‌ష్టం వ‌చ్చినా మీతోనైనా చెప్పాలి క‌దా. మీకు చెప్పుకుండా పోతే ఏమ‌నాలి వ‌దినా అని అంటుంది. వెంట‌నే ముర‌ళీకృష్ణ ఏమీ అనొద్దు. ఎవ్వ‌రూ ఏమీ అన‌కూడ‌దు. క‌ల‌లు, కోరిక‌లు, ఆశ‌లు అన్నీ చంపేసుకొని ఇన్నాళ్లు ఒక అడ‌విలో బ‌తుకుతూ ఉంటే ఎవ్వ‌రూ ఆ వ‌న‌వాసాన్ని విడిచి మా ఇంటికి ర‌మ్మ‌ని గ‌ట్టిగా చెప్ప‌లేక‌పోయారు. పుట్టిళ్లు ర‌మ్మ‌న‌లేదు. అత్తిళ్లు రానివ్వ‌లేదు. మీరు దీప‌ను తీసుకొస్తే మీ అబ్బాయి ఇల్లు వ‌దిలి వెళ్లిపోతాను అంటాడు కాబ‌ట్టి మీరు తీసుకురాలేదు. ఇక నేను ర‌మ్మంటే గంజి తాగుతూ నా ఇంట్లోనే ప‌డి ఉంటానంటే నేనూ తీసుకురాలేక‌పోయాను. ఇంటింటికో కార‌ణం ఉంది. కానీ ఇప్పుడు దీప లేదు. దాని చీక‌టి బ‌తుకులో దీపం వెల‌గ‌ద‌ని వెళ్లిపోయింది అని అంటాడు.

  వెంట‌నే సౌంద‌ర్య‌.. ముర‌ళీకృష్ణ గారు. ఇది ఎవ్వ‌రి నిస్స‌హాయ‌త‌ను వెలిబుచ్చే స‌మ‌యం కాదు. ఎందుకంటే ఒక్క నా కొడుకు త‌ప్ప ప్ర‌తి ఒక్క‌రు డాక్ట‌ర్ బాబును వంట‌ల‌క్క‌కు క‌ల‌పాల‌నే చూశారు. క‌ల‌వాల‌నే కోరుకున్నారు. అంద‌రి మ‌న‌సులోని సంకల్పానికి కూడా బ‌లం లేకుండా ఎందుకు ఇలా జ‌రిగిందో అర్థం కావ‌డం లేదు. దీప ఇల్లు వ‌దిలి వెళ్లిపోతే ఇక్క‌డే ఇంకో ఇంట్లో ఉంది అని స‌రిపెట్టుకునే దాన్ని. కానీ దీప ఊరు వ‌దిలి వెళ్లిపోయింది. అంటే ఇంకెప్పుడు మ‌న ఊరికి రాదు, మ‌న ఇంటికి రాదు అని అర్థం. కాబ‌ట్టి త‌న ఉనికి తెలీకుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునే ఉంటుంది. ఎక్క‌డికో దూరంగా వెళ్లిపోయి ఉంటుంది అని అంటుంది. దానికి ముర‌ళీకృష్ణ‌.. అస‌లు దీప అంత క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం ఏంట‌మ్మా అని అడుగుతాడు. దాంతో అన్ని గుర్తు చేసుకున్న సౌంద‌ర్య‌.. దీప ఎందుకు వెళ్లిపోయిందంటే ఏం చెప్ప‌ను ముర‌ళీకృష్ణ గారు. అస‌లు ఇప్ప‌టిదాకా ఎందుకు ఉందో, ఎందుకు ఉండాలో కూడా తెలీక బ‌తికింది నా బంగారు త‌ల్లి. మీ ఇంట్లో సుఖ‌ప‌డ‌లేదు. మా ఇంట్లోనూ సుఖ‌ప‌డ‌లేదు. అత్త వారింట్లో అడుగుపెట్టాక భ‌ర్త‌తో మ‌హా అంటే ఆరు నెల‌లు సంతోషంగా గ‌డిపిందేమో. దాని జీవితంలో ఆ ఆరు నెల‌లే అది సుఖ సంతోషాలు, భోగ‌భాగ్యాలు అనుభ‌వించింది. అంత‌కు ముందు ఆ త‌రువాత దాని జీవితం నిస్సారంగా, నిస్తేజంగానూ గ‌డిచిపోయింది. తను బ‌త‌కాలి, బిడ్డ‌ను బ‌తికించాలి, కాపురాన్ని నిల‌బెట్టుకోవాలి అని పోరాడి, పోరాడి, పోరాడి అలిసిపోయింది. ఎందుకు దీప వెళ్లిపోయింది అంటే ఏం చెప్ప‌ను. సాక్షిగా నేనే ఉన్నాను. అగ్ని సాక్షిగా తాళి క‌ట్టిన భ‌ర్త అగ్నిలో దూకినా న‌మ్మ‌ను అన్నాడు. అత్త వారింట్లో ఆత్మ‌గౌర‌వానికి అగ్ని పరీక్ష జ‌రిగింది. దీప అగ్గిలో దూకినా న‌మ్మ‌ను, న‌మ్మ‌లేను అన్న‌వాళ్లను ఇంకా న‌మ్ముకునేంత పిచ్చిది కాదు. ఆ అవివేకం నుంచి బ‌య‌ట‌ప‌డింది. సంస్కార‌మే లేని ఇంట్లో సంసారం ఏం వెల‌గ‌బెడుతుంది. కారుణ్యమే లేని మ‌నిషితో కాపురం ఏం చేస్తుంది. ఆశ చ‌చ్చి, మ‌న‌సు చ‌చ్చి, న‌మ్మ‌కం చ‌చ్చి, విర‌క్తితో వైరాగ్యంతో ఒక న‌మ‌స్కారం పెట్టి గ‌డ‌ప దాటింది. మా ఇంటికి తలుపు మూసుకుపోయాక ఇక ఇక్క‌డ ఎందుకు అని ఊరు దాటింది.

  భ‌ర్త‌నే దేవుడిగా, అత్తింటినే దేవాల‌యంగా భావించిన నా కోడ‌లు శిథిలం అయిపోయిన గుడిలో పూజ‌కు అర్హ‌త లేని రాతి విగ్ర‌హాల మ‌ధ్య ఉండ‌లేక గుండె రాయి చేసుకొని త‌రిలిపోయింది అని అంటుంది. ఇక ముర‌ళీకృష్ణ‌.. కనీసం ఇక్క‌డైనా ఉండి ఉంటే క‌ళ్ల ముందు ఉంద‌న్న తృప్తితో ఉండేవాళ్లం. ఇప్పుడు ఎక్క‌డుందో ఎన్ని క‌ష్టాలు ప‌డుతుందో అని అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. వీల్లేదు. క‌ష్టాలు ప‌డ‌టానికి వీల్లేదు. నా కోడలు, నా వార‌సులు అనుభ‌వించాల్సిన ఐశ్వ‌ర్యాన్ని నేను వాళ్ల‌కు అప్ప‌చెప్ప‌కుండా వ‌దిలిపెట్ట‌ను. ముర‌ళీకృష్ణ గారు. నా కొడుకు మారినా, మార‌క‌పోయినా నా కోడ‌లిని మాత్రం వంట‌రిగా బ‌త‌కాల్సిన అవ‌స‌రం రానివ్వ‌ను. వాళ్లు పేద‌రికంలో మ‌గ్గిపోతుంటే ఇక్క‌డ మేము అష్ట ఐశ్వ‌ర్యాలు అనుభ‌విస్తూ సంతోషంగా ఉండ‌లేము. ముర‌ళీకృష్ణ గారు ఎలాగైనా స‌రే దీప ఆచూకీ క‌నుక్కోవాలి. ఎంత ఖ‌ర్చు అయినా స‌రే నేను పెట్టుకుంటాను. వెత‌కండి. నా కోడ‌లిని వెత‌కండి అని డ‌బ్బుల‌ను ఇస్తుంది. మీరు ఆఫీసుకు సెల‌వు పెట్టండి. ఇది ఆఫీషియ‌ల్ క్యాంప్ అని నేను మ‌న ఆఫీసులో చెబుతాను. మీరు ఏ ఊరు వెళితే ఆ ఊర్లో మ‌న‌వాళ్లు మీరు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తారు. గాలించండి. ఊరూరా గాలించండి. ఇదే కాదు. మీ అకౌంట్‌లో నేను కావ‌ల్సినంత డ‌బ్బు వేయిస్తూనే ఉంటాను. మీరు దీప‌ను వెతికి ప‌ట్టుకొండి చాలు. దాన్ని నేను తీసుకొస్తాను అని అంటుంది. వెంట‌నే ముర‌ళీకృష్ణ‌.. దీప తిరిగి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉందా అమ్మ అని అడ‌గ్గా.. వెన‌క్కి తీసుకురావాల‌న్నా దృఢ‌మైన సంక‌ల్పం నాలో ఉంది. ఇది మీ కూతురు స‌మ‌స్య‌. దీప గానీ, పిల్ల‌లు గానీ.. ఆ మోనిత కంట ప‌డ‌క‌ముందే మనం క‌నిపెట్టాలి అని అంటుంది. వెంట‌నే ముర‌ళీకృష్ణ మాట్లాడుతూ.. నిజానికి నా కూతురిని వెత‌క‌డానికి నేను డ‌బ్బులు తీసుకోకూడ‌దు. కానీ ఎన్ని ఊర్లు వెత‌కాలో, ఎన్ని రోజులు ప‌డుతుందో, ఎంత డ‌బ్బు ఖ‌ర్చు అవుతుందో కాబ్టట్టి అని అంటుండ‌గా.. మీరు అలా ఆలోచించ‌కండి ముర‌ళీకృష్ణ గారు. నేను నా కోడ‌లి కోసం ఈ ఖ‌ర్చు పెట్టిస్తున్నాను. మీరు ఇవాళే బ‌య‌లుదేరండి వ‌స్తాను. ఆ స్టుపిడ్‌ని, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని త్వ‌ర‌గా వెతికి ప‌ట్టుకోండి ప్లీజ్ అని చెప్పి వెళుతుంది.

  ఇక కారు వ‌స్తుండ‌గా.. దాన్ని చూస్తూ హిమ నాన్నేమో ఆ కారులో నాన్నేమో అని ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే ఒక ఆమె దిగి ఇడ్లీ, దోసె కావాలి అని చెబుతుంది. దాంతో వార‌ణాసి దోసె తీసుకొచ్చి ఇస్తాడు. కొబ్బ‌రి చ‌ట్నీ బావుంద‌ని ఆమె అన‌గా.. దీప థ్యాంక్స్ చెబుతుంది. ఇక సౌర్య‌ను ప‌క్క‌కు తీసుకుపోయిన హిమ‌.. ఏంటి మీరిద్ద‌రు న‌వ్వుకుంటున్నారు అని అడుగుతుంది. ఇదే నా ఐడియా అని చెబుతుంది. కార్తీక దీపం కొన‌సాగుతుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు