Karthika Deepam: కార్తీక్ మ‌రో షాకింగ్ నిర్ణ‌యం.. సౌర్య‌ను త‌మ‌కు ఇచ్చేయ‌మ‌న్న సంతాన‌ల‌క్ష్మి

కార్తీక దీపం

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో త‌నకు పిల్ల‌లు పుడ‌తారో లేదో తెలుసుకునేందుకు మ‌ళ్లీ టెస్ట్ చేయించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు కార్తీక్, మోనిత‌తో అంటాడు. దాంతో మోనిత షాక్‌కి గురి అవుతుంది. మ‌రోవైపు దీప వారిని వెతుక్కుంటూ మెడిక‌ల్ షాప్ వ్య‌క్తి టిఫిన్ సెంట‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి వెళ‌తాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో వార‌ణాసి, దీప ద‌గ్గ‌ర‌కు వెళ‌తాడు. అక్కా ఇప్పుడే ఎవ‌రో వ‌చ్చి వెళ్లారు

 • Share this:
  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో త‌నకు పిల్ల‌లు పుడ‌తారో లేదో తెలుసుకునేందుకు మ‌ళ్లీ టెస్ట్ చేయించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు కార్తీక్, మోనిత‌తో అంటాడు. దాంతో మోనిత షాక్‌కి గురి అవుతుంది. మ‌రోవైపు దీప వారిని వెతుక్కుంటూ మెడిక‌ల్ షాప్ వ్య‌క్తి టిఫిన్ సెంట‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి వెళ‌తాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో వార‌ణాసి, దీప ద‌గ్గ‌ర‌కు వెళ‌తాడు. అక్కా ఇప్పుడే ఎవ‌రో వ‌చ్చి వెళ్లారు అక్కా. వాడి వాల‌కం చూస్తుంటే మ‌న కోసం వెతుకుతున్న‌ట్లుగా అనిపించింది అని వార‌ణాసి అంటాడు. ఏంటి అని దీప అన‌గా.. అడుగో అక్క‌డ వెళ్తున్నాడంటూ చూపిస్తాడు. మ‌న‌ల‌ను వెతుకున్నాడ‌ని నీకెందుకు అనిపించింది అని దీప అడ‌గ్గా.. ఇక్క‌డికి కొత్త‌గా ఎవ‌రైనా వ‌చ్చారా అని అడిగాడు, మీరు కూడా కొత్త‌గా క‌నిపిస్తున్నారు అన్నాడు. మా బాబాయ్ పేరు చెప్పి ఈ ఊరే అని త‌ప్పించుకున్నాను అని అంటాడు. ఆ త‌రువాత దీప‌.. ఎవ‌రు వెత‌క‌డం మొద‌లుపెట్టారు. అత్త‌య్య‌, మా నాన్న‌, డాక్ట‌ర్ బాబా అని అంటుంది.

  మ‌రోవైపు సౌంద‌ర్య‌, ఆనంద‌రావుకు కాఫీ తీసుకురాగా.. వ‌ద్దు అక్క‌డ పెట్టు అని చెబుతాడు. ఆ త‌రువాత సౌంద‌ర్య కూర్చుంటుంది. ఆదిత్య కూడా అక్క‌డికి వస్తాడు. ఏంటి అలా డ‌ల్‌గా ఉన్నారు. మ‌న‌కు మంచి రోజులు రాబోతున్నాయి అని ఆదిత్య అన‌గా.. నీకు న‌మ్మ‌కం ఉందారా అని ఆనంద‌రావు అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. వాడికి కార్తీక్ గురించి పూర్తిగా తెలీదులెండి అని అంటాడు. దాంతో మీకే అన్న‌య్య గురించి పూర్తిగా తెలీదు అని ఆదిత్య అన‌గా.. ఇన్ని రోజులు వాడికి శ‌త్రువుల్లా మారిపోతున్నాము అని తెలిసినా, చెవిలో గూడు క‌ట్టుకొని మ‌రీ చెబుతున్నాము. అప్పుడు విన‌ని వాడు నువ్వు చెప్తే వింటాడా అని సౌంద‌ర్య అన‌గా.. మీరు శ‌త్రువులా చెప్పారు. నేను శ్రేయోభిలాషిలా చెప్పాను అని ఆదిత్య అంటాడు. రెండు పెగ్గులు ఎక్కువ పోశావు అంతే క‌దా అని ఆనంద‌రావు అన‌గా.. కాదు రెండు ముక్క‌ల్లో అర్థ‌మ‌య్యేలా చెప్పాను అని ఆదిత్య చెబుతాడు. మ‌నం కోరుకున్న‌ది జ‌రగ‌దు. దీప అందుకే వెళ్లిపోయింది. విర‌క్తి పుట్టి, వీడు ఇక మార‌డు అని అర్థ‌మై పిల్ల‌ల‌ను తీసుకొని మ‌రీ వెళ్లిపోయింది. మ‌నం వాళ్లిద్ద‌రు క‌ల‌వాల‌ని కోరుకోగ‌లం గానీ క‌లిసేలా ఎప్ప‌టికీ చేయ‌లేము రా అని ఆనంద‌రావు అంటాడు.

  వెంట‌నే ఆదిత్య‌.. లేదు డాడీ. అన్న‌య్య‌కు త‌న వైపు నుంచి ఎలాంటి ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేద‌న్న సంగ‌తి రాత్రే అర్థ‌మైంది అని అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. అర్థ‌మైతే ప‌రీక్ష చేయించుకోవ‌డానికి హాస్పిట‌ల్‌కి వెళ్లాలి. సాయంత్రం వాడు వ‌స్తే తెలుస్తుంది అని అంటుంది. అస‌లు రాత్రి ఏం మాట్లాడి క‌న్విన్స్ చేశావురా అని ఆనంద‌రావు అడ‌గ్గా.. ఏం లేదు డాడీ. అన్న‌య్య రెస్పాన్సిబులిటీస్‌ని గుర్తు చేశాను. రాత్రి అయితే ఏం మాట్లాడ‌కుండా భోజ‌నం చేసి ప‌డుకున్నాడు. అయినా నేను వ‌ద‌ల‌లేదు. అన్న‌య్య ఈగో హ‌ర్ట్ అయ్యేలా మాట్లాడాను అని ఆదిత్య అంటాడు. ఏమ‌న్నాడు అని సౌంద‌ర్య అడ‌గ్గా.. మీరంతా చెప్పేది అబ‌ద్ధం. మీరంతా భ్ర‌మ‌లో ఉన్నార‌ని నిరూపిస్తాను అని అన్నాడ‌ని ఆదిత్య అంటాడు. అయితే వాడిలో ఆలోచ‌న మొద‌ల‌య్యి ఉంటుందా అని ఆనంద‌రావు అన‌గా.. మొద‌లైతే అంత‌క‌న్నా కావ‌ల్సింది ఏముంటుందండి అని సౌంద‌ర్య అంటుంది. ఆ దేవుడి ద‌య వ‌ల‌న కార్తీక్ మారిపోతే బావుండు. నేను పోయే లోపు పెద్దోడి కుటుంబాన్ని మ‌న ఇంట్లో మ‌ళ్లీ చూస్తానో లేదో అని ఆనంద‌రావు అన‌గా.. ఏమండి ఇప్పుడే క‌దా మ‌న‌లో ఆశ చిగురించింది, అప్పుడే తుంచేస్తారేంటి. చూద్దాం ఆదిత్య వ‌ల‌న అయినా వాడిలో మార్పు వ‌చ్చి పరీక్ష చేయించుకుంటే అప్పుడు దీప‌ను వాడే వెతికి తీసుకొస్తాడు అని సౌంద‌ర్య అంటుంది. మ‌మ్మీ అది త‌ప్ప‌కుండా జ‌రుగుతుంది అని ఆదిత్య అంటాడు.

  ఇక దీప భోజనం తినేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటుంది. అయితే ఏదో త‌ల తిరిగిన‌ట్లుగా ఉండ‌టంతో అలానే కూర్చుంటుంది. భ‌గ‌వంతుడా నా బాధ‌ల‌కు తోడు ఇప్పుడు కొత్త‌గా ఆరోగ్య సమ‌స్య మొద‌లుకాబోతుందా.. నాకు ఏదైనా తీవ్రమైన జ‌బ్బు రాబోతుందా.. ఎందుకు ఇలా జ‌రిగింది. ఎక్కువ‌గా ఆలోచించ‌డం వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి వ‌ల్ల ఒక‌వేళ నాకు ఏదైనా అయితే నా బిడ్డ‌ల ప‌రిస్థితి ఏంటి వాళ్లు ఏమైపోతారు. లేదు లేదు. నేను సంపాదించే ప్ర‌తి రూపాయి నా బిడ్డ‌ల చ‌దువు కోస‌మే పొదుపు చేయాలి. నా ఆరోగ్యం కోసం ఖ‌ర్చు అయిపోకూడ‌దు. వీళ్ల‌కు తెలిస్తే చ‌దువే వ‌ద్దంటారు. టిఫిన్ బండి ద‌గ్గ‌ర‌కు వ‌స్తాం అంటారు. నాకు ఎలాగూ త‌ప్ప‌దు. బిడ్డ‌ల‌కు మాత్రం ఆ ప‌రిస్థితి రానివ్వ‌ను. వాళ్లు చ‌దువుకోవాలి, ప్ర‌యోజ‌కులు అవ్వాలి అని మ‌న‌సులో అనుకుంటుంది. ఆ త‌రువాత సౌర్య‌, హిమ వ‌స్తారు. బండి మొత్తం తుడిచేశామ‌మ్మాఅని సౌర్య అన‌గా.. సామాన్లు అన్ని స‌ర్దేశాం కూడా అని హిమ అంటుంది. దాంతో దీప కోపంగా.. ఎవ‌రు చేయ‌మ‌న్నారు మిమ్మ‌ల్ని. మీకు భోజ‌నం పెట్టి నేను వెళ్లి చేసుకునేదాన్ని క‌దా అని అంటుంది. మ‌న‌ప‌నే క‌ద‌మ్మా అని సౌర్య అన‌గా.. మ‌న ప‌ని కాదు. నా ప‌ని. మీకేం ప‌ని. మీరు చ‌దువుకునే పిల్ల‌లు మీరు ఎందుకు చేస్తున్నారు ఆ ప‌నులు అని దీప అంటుంది. నువ్వు ఒక్క‌దానివే చేయ‌లేవ‌ని అని హిమ అన‌గా.. ఎవ‌ర‌న్నారు. నాకు ఇవాళ ఈ ప‌ని కొత్తా. ఎన్నేళ్ల నుంచి వండ‌టం, వార్చ‌డం, తోమడం, క‌డ‌గ‌టం.. ఇదే క‌దా నా బ‌తుకు. ఇప్పుడు మీరొచ్చి ఇవ‌న్నీ చేయ‌క‌పోతే కొంప‌లు మునిగిపోతాయా అని కోపంగా అంటుంది. దాంతో హిమ సారీ అమ్మా అని చెప్ప‌గా.. నీకు ఇంత కోపం వ‌స్తుంద‌ని అనుకోలేద‌మ్మా అని సౌర్య అంటుంది. దాంతో ఇది కోపం కాద‌మ్మా. మీరెంత, మీ వ‌య‌సెంత‌. మీ చిట్టి చిట్టి చేతుల‌తో ఆ గిన్నెలు తోముతూ క‌డుగుతూ ఉంటే త‌ల్లిగా నేను త‌ట్టుకోలేను. న‌న్ను డాక్ట‌ర్ భార్య‌వి అన్నారే. మీరు డాక్ట‌ర్ బాబు కూతుళ్లు క‌దా. గ్రేట్ ఇండ‌స్ట్రియ‌లిస్ట్ ఆనంద‌రావు గారి మ‌న‌వ‌రాళ్లు క‌దా. మీరు ఇలా ప‌నులు చేస్తే వాళ్ల‌కు మాత్రం గౌర‌వ‌మా.. ప‌ని బాట అంటూ బండి ద‌గ్గ‌రికి మాటిమాటికి రాకండి. పెన్ను, పుస్త‌కాలు ప‌ట్టుకోవాల్సిన చేత్తో ఎంగిలి ప్లేట్లు క‌డ‌గ‌కండి. చచ్చిపోవాల‌నిపిస్తుంది నాకు అని దీప ఎమోష‌న‌ల్ అవుతుంది. స‌రేన‌మ్మా అని సౌర్య అన‌గా.. మంచి స్కూల్ చూసుకునేదాకా పుస్త‌కాలు ఉన్నాయి క‌దా.. ఇంట్లోనే ఉండి చ‌దువుకోండి. ఏం కావాల‌న్నా అడ‌గండి నేను తెచ్చి పెడ‌తాను. మీ కోసం నేను బ్ర‌తికే ఉన్నాను. బ్ర‌తికే ఉంటాను అని ద‌గ్గ‌తుంది. దాంతో పిల్ల‌లు దీప‌కు నీళ్లు అందిస్తారు. ఆ త‌రువాత సౌర్య‌.. ఇక చాలు. నువ్వు మాట్లాడ‌కు. చూడు ఎలా ద‌గ్గు వ‌స్తుందో. బండి ద‌గ్గ‌ర‌కు రాములే అమ్మా. నువ్వు అర‌వ‌కు. తిన్నాక మందులేసుకో అని అంటుంది. ఇక పిల్ల‌ల‌కు భోజ‌నం పెడుతుంది దీప‌.

  మ‌రోవైపు కార్తీక్ కారులో వెళుతూ ఆదిత్య మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నిజంగా దీప త‌ప్పు చేయ‌లేదా. ప‌దేళ్లుగా నేను భ్ర‌మ‌లోనే ఉన్నానా.. లేదు లేదు నేను అంత మూర్ఖుడిని కాదు. అంత బ్లైండ్‌గా నింద వేయ‌లేదు. అంత కుసంస్కారం కాదు నాది. చేయ‌ని త‌ప్పుకు క‌ట్టుకున్న భార్య‌ను అనుమానించే కారెక్ట‌ర్ నాది కాదు. కానే కాదు. కానీ ఇప్పుడు నాకు పిల్ల‌లు పుడ‌తారో లేదో తెలుసుకోవ‌డానికి టెస్ట్ చేయించుకుంటే మ‌ళ్లీ ఇదివ‌ర‌క‌టి రిజ‌ల్టే వ‌స్తే. ఆ నిజం బ‌య‌ట‌పడితే.. ఈసారి హిమ‌ను కూడా ఇంట్లో వాళ్లు దూరం పెట్టేస్తారు. అది నేను భ‌రించ‌లేను. నా వ‌ల్ల కాదు. నా వ‌ల్ల కాదు అని అనుకుంటాడు.

  ఇక మోనిత, మెడిక‌ల్ షాప్ వ్య‌క్తితో మాట్లాడుతూ ఉంటుంది. అవును త‌ల్లితో పాటు ఇద్ద‌రు పిల్ల‌లు ఉంటారు అని మోనిత చెప్ప‌గా.. పిల్ల‌లు అంటే గుర్తు ప‌డ‌తాను కానీ వాళ్ల అమ్మ క‌నిపించ‌లేదు మేడ‌మ్ అని అంటాడు. మీ షాప్‌కి వ‌చ్చారు అంటే మీ ఊర్లోనే ఉంటారు. పాతిక వేలు కాదు యాభై వేలు ఇస్తాను. ఇల్లు ఇల్లు గాలించండి. ఆవిడ‌కు వ‌చ్చిన ప‌ని కేవ‌లం వంట చేయ‌డ‌మే. కాబ‌ట్టి ఏ టిఫిన్ సెంట‌రో, క‌ర్రీల పాయింటో, భ‌జ్జీల కొట్టో పెట్టుకొని ఉంటుంది. ఇంత‌కు ఏ ఊరు అన్నారు అని మోనిత అడ‌గ్గా.. ఫోన్ స‌రిగ్గా వినిపించ‌దు. దాంతో మోనిత అస‌హ‌నానికి గురి అవుతుంది. మ‌ళ్లీ కాల్ చేసినా క‌ల‌వ‌దు. మరోవైపు హోటల్ లో వెయిటర్ తో మురళీ కృష్ణ  మాట్లాడుతుండగా.. ఆ తరువాత భాగ్యం ఫోన్ చేస్తుంది.. వారిద్దరి మధ్య కూడా కాసేపు ఫన్నీ కన్వర్జేషన్ ఉంటుంది. ఇక ఆ తరువాత దీప, పిల్లల ఫొటోలను వెయిటర్ కి చూపించి వారు కనిపిస్తే ఫోన్ చేయమని చెప్తాడు.

  ఇక దీప ఇంట్లో ఉండ‌గా.. సంతాన‌ల‌క్ష్మి వ‌చ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎందుక‌క్కా నీకు ఈ శ్ర‌మ నేను చేస్తాను క‌దా అని దీప అన‌గా.. చేయ‌నియ్‌లే దీప‌. ఇంటి ద‌గ్గ‌ర నాకు ప‌నా, బాటా.. పిల్లా జ‌ల్లా. ఇంత ఉడికేసి డ‌బ్బాలో పెట్టిస్తే ఆయ‌న పొద్దున వెళ్లి సాయంత్రం వ‌స్తారు. అప్ప‌టి దాకా ఒక్క‌దాన్నే టీవీ ఎంత సేప‌ని చూస్తాను. అదే పిల్లలు ఉంటే వారికి తినిపించ‌డం, తాగిపించ‌డం, ముడ్డి క‌డగ‌డం, ప‌క్క త‌డిపితే దుప్ప‌ట్లు ఉతుక్కోవ‌డం.. వాళ్ల‌కు అవ‌నీ, ఇవ‌నీ చేస్తూ పోతుంటే ఇక ఖాళీ ఏముంటుంది. పేరుకే సంతాన‌ల‌క్ష్మి కానీ నా జీవితంలో సంతానం లేదు. ఇక పుట్ట‌ర‌ని డాక్ట‌ర్లు తేల్చేశారు దీప‌ అని అంటుంది. అప్పుడు తుల‌సి మాటల‌ను దీప గుర్తు చేసుకుంటుంది.

  ఆ త‌రువాత సంతాన‌ల‌క్ష్మి.. ఎక్క‌ని కొండా లేదు. మొక్క‌ని బండా లేదు. పార్ధ‌న‌లు, అభిషేకాలు, మొక్కులు, పొర్లు దండాలు.. ఎన్ని చేస్తే ఏం లాభం ఉంది. ఆ దేవుడికి నా మీద ద‌య క‌ల‌గ‌లేదు. నాటు మందు, ప‌సురు మందు, ఇంగ్లీష్ మందు, ఆ ప‌తి, ఈ ప‌తి ఏ ప‌తిని న‌మ్ముకున్నా లాభం లేక‌పోయింది. ఒక బిడ్డ‌ను ఇవ్వ‌రా దేవుడా అంటే నీ గ‌ర్భ‌సంచి స‌రిగా లేదులేవే.. వ‌చ్చే జ‌న్మ‌లో గంపెడు సంతానాన్ని కందువులేవే పోవే అన్నాడు. ఏం చేస్తాం. ఏడ్చేస్తాం, తుడిచేస్తాం. మ‌న‌సును రాయి చేసుకుంటాం అంతేగా. అన్న‌ట్లు అస‌లు విష‌యం చెప్పాలి. అందుకే వ‌చ్చాను. మా ఆయ‌న‌కు నీ గురించి చెప్పాను దీప అయ్యో అని బోలెడంత జాలి ప‌డిపోయారు. ఇంత చిన్న వ‌య‌సులోనే ఎంత క‌ష్టం వ‌చ్చింది అని బాగా బాధ‌ప‌డిపోయారు అని అంటుంది. ఎందుకు అంత జాలి ప‌డిపోయే ప‌రిస్థితుల్లో నేనేం ఉన్నాను. ప‌ని చేసుకొని బ్ర‌తుకుతున్నాను. అదేమంత ద‌య‌నీయ‌మైన పరిస్థితి కాదే అని దీప అన‌గా.. దాని గురించి కాదులే. ఎంతైనా ఇడ్లీ బండి సంపాద‌న మిన‌ప‌ప్పు కొన‌డానికి, ఇడ్లీ ర‌వ్వ కొన‌డానికే స‌రిపోతుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఎలా పోషించుకుంటావు అని ఇద్ద‌రం ఆలోచించాము సుమా అని సంతాన‌ల‌క్ష్మి అంటుంది. దేవుడి ద‌య వ‌ల్ల బండి ద‌గ్గ‌ర‌కు ప‌ది మంది వ‌స్తున్నారు. బావున్నాయి అంటున్నారు. ఏదో అలా గ‌డిచిపోతుంది అని దీప అన‌గా.. ఎంత గ‌డిచిపోయినా ఇప్పుడు ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌ను పోషించాలి. చ‌దివించాలి, మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేయాలి. నీ వ‌ల్ల ఏం అవుతుంది చెప్ప‌మ్మా.

  ఇదుగో అక్కా అని పిలిచావు కాబ‌ట్టి నా సొంత చెల్లెలువు అనుకొని ఒక మాట చెబుతాను అని సంతాన ల‌క్ష్మి అంటుంది. ఏంట‌ది అని దీప అడ‌గ్గా.. మీ పెద్ద‌మ్మాయి సౌర్య‌ను మాకు ఇచ్చేయ‌కూడ‌దు. పువ్వులో పెట్టుకొని చూసుకుంటాం అని సంతాన ల‌క్ష్మి అన‌గా.. దీప ఆవేశంతో అక్కా అని పైకి లేస్తుంది. ఆ త‌రువాత నేను చెప్పేది విను దీప అని సంతాన‌ల‌క్ష్మి అన‌గా.. చాలు విన్న‌ది చాలు. చెట్టుకు కాయ బ‌రువా. త‌ల్లికి బిడ్డ బ‌రువా.. నా బిడ్డ‌ల‌ను నేను పువ్వుల్లో పెట్టుకొని పోషించుకోగ‌ల‌ను. ద‌య‌చేసి పొర‌పాటున కూడా నా బిడ్డ‌ను ఇవ్వ‌మ‌ని అడ‌గొద్దు. నేను బ్ర‌తికేది వాళ్ల కోసం. వాళ్లు లేక‌పోతే నేను ఎప్పుడో ఈ లోకాన్ని వ‌దిలేసి వెళ్లిపోయేదాన్ని అని దీప అన‌గా.. క్ష‌మించు దీప నిన్ను బాధ‌పెట్టానేమో. ఏదో బిడ్డ‌ల మీద ప్రేమ‌ను చంపుకోలేక ఆ మ‌మ‌కారంతో అడిగానే త‌ప్ప నిన్ను త‌క్కువ చేయాల‌ని కాదు అని సంతాన‌ల‌క్ష్మి అక్క‌డి నుంచి వెళుతుంది. ఆ త‌రువాత దీప ఏడుస్తుంటుంది. కార్తీక దీపం కొన‌సాగుతోంది.
  Published by:Manjula S
  First published: