KARTHIKA DEEPAM SERIAL UPDATE KARTHIK REFUSES TO LEARN THE TRUTH ELSEWHERE SOUNDARYA FAMILY UNHAPPY MNJ
Karthika Deepam: ఏ మాత్రం తగ్గని కార్తీక్.. వంటలక్కపై సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. (Karthika Deepam)
Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో కార్తీక్ ఇంటికి వెళుతుంది దీప. ఆ సమయంలో కార్తీక్ డైనింగ్ టేబుల్ మీద టిఫెన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంట్లోకి వెళుతూ సౌందర్య మాటాలను గుర్తు చేసుకుంటుంది దీప. ఇక ఇంట్లోకి రాగానే దీపను చూస్తాడు కార్తీక్. సౌందర్య పెట్టిన మెసేజ్‌ని, మోనిత అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు. ఆ తరువాత మనసులో ఓహో మోనిత చెబితే కొట్టిపడేశాను.
Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో కార్తీక్ ఇంటికి వెళుతుంది దీప. ఆ సమయంలో కార్తీక్ డైనింగ్ టేబుల్ మీద టిఫెన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంట్లోకి వెళుతూ సౌందర్య మాటాలను గుర్తు చేసుకుంటుంది దీప. ఇక ఇంట్లోకి రాగానే దీపను చూస్తాడు కార్తీక్. సౌందర్య పెట్టిన మెసేజ్‌ని, మోనిత అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు. ఆ తరువాత మనసులో ఓహో మోనిత చెబితే కొట్టిపడేశాను. నిజంగా ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న మాట అనుకుంటాడు. ఆ తరువాత రా నీ కోసమే చూస్తున్నాను అని దీపను పిలుస్తాడు కార్తీక్. ఇక కార్తీక్ దగ్గరకు వెళ్లిన దీప.. చుట్టూ పరిసరాలను చూస్తూ ఉంటుంది. వెంటనే కార్తీక్.. ఎవ్వరూ రాలేదు కదా అని అడగ్గా లేదని దీప చెబుతుంది. ఇక్కడ కూడా ఎవరు లేరని కార్తీక్ చెబుతాడు. అనంతరం దీప నేను అది చెప్పబోతుండగా.. తెలుసు అని కార్తీక్ అంటాడు. ఏంటి అని దీప అనగా.. అదే నేను అన్నావు కదా. నీ గురించి సరికొత్తగా పరిచయం చేసుకోబోతుంటే నాకు తెలుసు అన్నాను అన్న మాట. ఎలా తెలుసో నీకు తెలుసు అని కార్తీక్ అంటాడు.
ఇక దీప.. అది కాదు. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు వచ్చింది అని చెబుతుండగా.. అదీ తెలుసు అని కార్తీక్ అంటాడు. ఏం తెలుసని దీప అడగ్గా.. నాకేం తెలిస్తే నీకెందుకు గానీ తినే టైమ్‌కి ఎవరు వచ్చినా ఇంట్లో తిని వెళ్లమనడం అలవాటు. రా టేస్ట్ చూడు అని దోసెలను చూస్తాడు కార్తీక్. అవి చల్లారిపోగా.. అయ్యయ్యో చల్లారిపోయాయే. వీళ్లు ఎప్పుడో మాలతితో చేయించి తొందరగా పంపినట్లు ఉన్నారు. అదేలే మాలతిని ఏదో పనిమీద పంపినట్లు ఉన్నారు. ఉండు నేను వేడివేడిగా దోసెలు వేసి పెడతాను అని కార్తీక్ అంటాడు. మీరా.. వద్దు అని దీప అనగా.. నీ ఉప్మా కంటే బావుంటాయిలే. భయపడకు అని కిచెన్‌లోకి తీసుకెళతాడు.
తరువాత కిచెన్‌లోకి వెళ్లి రా అని దీపను పిలుస్తాడు. ఇదుగో పొద్దే బాగా కలిపేసి పెట్టారు. పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎంతైనా మా అమ్మ డైరెక్షనే డైరెక్షన్. వెరీ పర్పెక్ట్ అని కార్తీక్ అంటాడు. ఇక దీప నేను వచ్చింది అని చెబుతుండగా.. ఆటోలోనేగా. అది కూడా అమ్మ త్వరగా రా అని రాసి ఉన్న ఆటోలోనే కదా అని కార్తీక్ అంటాడు. ఇక ఏంటి అలా ఉన్నావు. ఎవరు లేరనా.. ఎవరు రారనా.. నేనేంటి దోసెలేంటి పెట్టడం ఏంటి అనా అని కార్తీక్ అంటాడు. వెంటనే దీప నేను మీతో మాట్లాడాలి అనగా తెలుసు అని కార్తీక్ అంటాడు. ఏం తెలుసని దీప అడగ్గా.. ఏదో చెప్పాలని వచ్చావని అని కార్తీక్ అంటాడు. మరి నన్ను అని దీప అంటుండగా.. అతిథిలా చూస్తున్నాననా. ఈ తిధి నాకు బాగా కలిసి వచ్చిందిలే. అన్నీ ముందే తెలుసు అని చెప్పగలిగే ఙ్ఞానం అబ్బింది అని కార్తీక్ అంటాడు. ఇక దీప.. నేను చెప్పేదానికి మీరు మాట్లాడేదానికి, మీరు ఇప్పుడు చేసే మర్యాదలకు అని అంటుడగా.. నూనె వేయగా, నెయ్యి వేయనా.. నెయ్యి నీకు ఇష్టమేగా నెయ్యి వేస్తాలే. నేతి గారెలు విని ఉంటావు గానీ నేతి దోసెలు విని ఉండవు. అది ఈ డాక్టర్ బాబు స్పెషల్ డిష్ వంటలక్క అని కార్తీక్ అంటాడు.
ఇక నన్ను మీరు అని దీప చెప్పబోతుండగా.. ఏ మాత్రం తక్కువ అంచనా వేయట్లేదు. నువ్వు ఉప్మా బాగా చేస్తావు. కానీ ఉప్మా నేను జీవితంలో ముట్టనని నీకు తెలుసు. ఉప్మా అనే పదమే ఎంగిలి అయిపోయింది అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప గతంలో కార్తీక్ దీని కడుపులో పుట్టే బిడ్డకు తండ్రిని నేను కాదు అన్న మాటలను గుర్తు చేసుకుంటుంది. ఇక దోసెను వేసిన కార్తీక్ దాన్ని ప్లేట్లో పెట్టి అల్లం చట్నీ కారంగానే ఉంటుంది. కానీ దోసెలోకి అదే బావుంటుంది అని వేసి దీపకు ఇస్తాడు. ఆ తరువాత మరో దోసె వేస్తూ ఈసారి కరకరలాడేలాగా అని కార్తీక్ అంటాడు. ఇక దీప మీరు కొంచెం శాంతంగా అని ఏదో చెప్పబోతుండగా.. శాంతంగా లేకపోతే పెనుము మీద పేలాలు ఎగిరినట్లు ఎగిరిపడుతున్నానా.. ప్రశాంతంగానే ఉన్నాను. ఎందుకు గొడవ. నీ వెనుక పటాలం పటాలమే ఉంది. నువ్వు వస్తావని తెలీక ఆ పటాలం గుడికి వెళ్లింది. అమాయకులు ఎవరబ్బా.. వాళ్లా, నేనా..అవును మా అమ్మ అందరినీ తీసుకొని ఏ గుడికి వెళ్లింది. ఎన్నింటి దాకా రాదు అని కార్తీక్ అడుగుతాడు.
ఇక దీప డాక్టర్ బాబు నేను చెప్పేది అని అంటుండగా.. ఎన్నేళ్లు వినాలి దీప అని కార్తీక్ అంటాడు. ఆ తరువాత తెలుసని దీప అనగా.. ఏం తెలుసు అని కార్తీక్ అడుగుతాడు. ఏమీ లేదని దీప చెప్పగా.. అయితే తినేసి వెళ్లు అని కార్తీక్ అంటాడు. దాంతో దీప ఆ దోసెను అక్కడే పెట్టి.. విషయం ఎప్పుడో ఎంగిలి అయిపోయింది అని అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. వెంటనే వెళ్లొద్దు. మా అమ్మ వాళ్లు తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండాలి నువ్వు అని కార్తీక్ అంటాడు. అయితే ఆ మాటలను పట్టించుకోకుండా దీప వెళ్లిపోతుంది.
మరోవైపు సౌందర్య, ఆనందరావులో కారులో వస్తుంటారు. ఆనందరావు ఏంటి ఆలోచిస్తున్నావు కార్తీక్ గురించా అని అడగ్గా.. కాదు. దీప గురించి. గుడి పేరు చెప్పి బయటకు వచ్చాము. వాళ్లిద్దరికి ప్రైవసీ ఉండాలని అని సౌందర్య అంటుంది. ఇక ఆనందరావు నువ్వు గుడిలో కూడా దీప గురించి మొక్కుకున్నావని నాకు తెలుసు అని అంటాడు. దానికి సౌందర్య.. వాళ్లిద్దరు కలిస్తే వెయ్యి దీపాలు వెలిగిస్తానని మొక్కుకున్నాను అని అంటుంది. ఇక ఆనందరావు.. కలవడం, విడిపోవడం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అనుమానం చెద పురుగులాంటిది సౌందర్య. అది ఒక్కసారి ప్రవేశిస్తే నమ్మకం అనే చెట్టును కూకటి వేళ్లతో సహా కూల్చేస్తుంది అని అంటాడు.వెంటనే సౌందర్య.. దీప ఎలాంటిదో మన అందరికీ తెలుసు.అది దేవుడు ముందు వెలిగించిన దీపం లాంటిది. ఆ నిజం వాడికి తెలియాలి కదా. అదే మన ప్రయత్నం అని అంటుంది. దానికి ఆనందరావు.. ఇంతమంది ఓ నిజాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కార్తీక్ అబద్దం చుట్టూనే తిరుగుతున్నాడు అని అంటాడు. వెంటనే సౌందర్య.. వాడికి ఎంత చెప్పి చూశాను. తులసి విషయం చెబుతుంటే పట్టించుకోకుండా ఉన్నాడు. నేను చెప్పినా వినిపించుకోలేదు అని అంటుంది.
దానికి ఆనందరావు.. మరి అయితే ఇప్పుడెలా అని ప్రశ్నిస్తాడు. దీపకు చెప్పాను. వాడికి అర్థం అయ్యేలా, నెమ్మదిగా, శాంతంగా, అసలు అర్థం అయ్యేలా చెప్పమని అని సౌందర్య అనగా.. వాడు వింటాడా. విని నమ్ముతాడు. విని భార్య పిల్లలతో కలిసి ఉంటాడా అని ఆనందరావు ప్రశ్నిస్తాడు. వెంటనే సౌందర్య.. నాకైతే నమ్మకం ఉందండి. దీప ప్రసక్తి తెస్తే ఇదివరకట్లా విసుక్కోవడం లేదు. తిట్టడం లేదు. అంటే ఏంటి.. వాడు కూడా ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు అని అంటుంది. అయితే దీప ఈ పాటికి వాడికి అంతా చెప్పేసి ఉంటుంది అంటావా అని ఆనందరావు అడగ్గా.. అవును. తన పొరపాటు తెలుసుకొని ఉంటాడు. మీరే చూడండి. మనం వెళ్లగానే భార్య భర్తలిద్దరూ నవ్వుతూ ఎదురొస్తారు అని సౌందర్య అంటుంది. దానికి ఆనందరావు ఆ మాట వింటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. నీ ఆశ అబద్ధం కాకూడదు అని అంటాడు. ఇక సౌందర్య.. చెప్పాగా. కార్తీక్, దీప కచ్చితంగా కలిసిపోయి ఉంటారు అని అంటుంది.
ఇక దీప సౌందర్య ఇంటి ముందు కూర్చొని కార్తీక్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ధీనంగా ఉంటుంది. కారులలో నుంచి సౌందర్య, ఆనందరావు, ఆదిత్య, శ్రావ్య, సౌర్య, హిమలు దిగుతారు. అంతా దీప దగ్గరకు వెళతారు. దీపను చూసిన సౌందర్య.. దీప ఏమైందే. ఎందుకిలా ఇక్కడ కూర్చున్నావు అని ప్రశ్నిస్తుంది. సౌర్య, హిమలు దీపను పలకరించినా పలకదు. ఇక పిల్లలిద్దరినీ పైకి తీసుకెళ్లమని శ్రావ్యకు చెబుతుంది సౌందర్య. ఆ తరువాత శ్రావ్య, సౌర్య, హిమ, దీపు గాడు పైకి వెళతారు. ఏం జరిగిందమ్మా అని ఆనందరావు అడగ్గా.. జరిగింది దీప చెబుతుంది. అంటే వినదలుచుకోలేదా అని సౌందర్య అడగ్గా.. నమ్మదలుచుకోలేదు అని దీప అంటుంది. పద లోపలికి అని దీపను సౌందర్య తీసుకెళుతుంది.
ఇక లోపల కార్తీక్.. స్వాగతం. మీకోసమే చూస్తున్నాను. అందుకే ఉండమన్నాను అని అంటాడు. ఇప్పటికా ఎప్పటికా అని సౌందర్య అడగ్గా.. ఎంత తెలివైన ప్రశ్న వేశావు మమ్మీ. నా జవాబు తెలిసి నువ్వు వేసే ప్రశ్నలు చూస్తుంటే తెలివి తేటలు మీ అత్తా కోడళ్ల వారసత్వ సంపద ఏమో అన్న డౌట్ వస్తుంది అని కార్తీక్ అంటాడు. ఇక అంత తెలివే ఉంటే అది గడప బయట ఎందుకు కూర్చొని ఉంటుందిరా అని సౌందర్య ప్రశ్నిస్తుంది. వెంటనే కార్తీక్.. మీకు అంత నమ్మకం ఉంటే నేను ఇంటి బయట ఉంటానని చెప్పాను కదా. మీ కోడలికి మీరు పట్టం కట్టి కూర్చోబెడతారో. పటం కట్టి పూజ గదిలో పెడతారో నాకు అనవసరం అని అంటాడు.
ఇక సౌందర్య కోపంగా.. ఏదిరా నీకు అనవసరం. ఉరి శిక్ష పడిన ఖైదీకి కూడా ఆఖరి కోరిక అడగమనే అవకాశం ఇస్తారు అని అనగా.. ఇక్కడ శిక్ష పడింది నాకు అని కార్తీక్ అంటాడు. మరి ఇది అనుభవించేది ఏంటి అని సౌందర్య అడగ్గా.. అది చేసిన తప్పుకు శిక్ష. ఇది చెయ్యని నేరానికి శిక్ష అని కార్తీక్ అంటాడు. ఆ శిక్ష వేసే అధికారం నీకు ఉన్నప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారో వినే అవకాశం కూడా ఇవ్వాలి అని సౌందర్య అనగా.. ఇవ్వను అని కార్తీక్ అంటాడు.
ఎందుకు అని సౌందర్య ప్రశ్నించగా.. ఇది రాయబడిన స్క్రిప్ట్. మీ ఇద్దరు కలిసి రాసుకున్న కథనం. అది నాకు తెలుసు అని కార్తీక్ అంటాడు. వెంటనే ఏం తెలుసు డాక్టర్ బాబు మీకు. మీకు చాలా తెలుసని. మీరు చాలా తెలివిగల వారని, ఎదుటివారంతా మిమ్మల్ని ఒక భ్రమలోకి నెట్టివేయాలని చూస్తున్నారని, మీరు నమ్మిందే సిద్ధాంతమని, మీ గురించి మీరు చాలా అనుకుంటున్నారు. కానీ మీకేం తెలీదని, కనీసం ఎదుటివారిని అంచనా కూడా వేయలేరని నాకు ఇవాళే పూర్తిగా తెలిసింది. అత్తయ్య చెబితే వినిపించుకోలేదు. నేను చెప్పబోతే అవకాశమే ఇవ్వలేదు. అన్నీ మీకు తెలుసని మీ చుట్టూ ఒక గెర్రె గీసుకొని బతుకుతూ ఉంటారే, ఒక్కసారి మీరు ఆ గెర్రె నుంచి బయటకు వచ్చి చెప్పేది వింటే అని దీప అంటూ ఉండగా.. ఏం చెప్తారు మీరంతా అని కార్తీక్ అంటాడు.
ఎవరి గురించి ఎవరికి చెబుతారు. నువ్వేంటో నాకు చెబుతావా.. నేను ఏంటన్నది నాకు చెబుతావా.. ఏం చెబుతావు అని కార్తీక్ అడుగుతాడు. దానికి దీప.. నన్ను నేను రుజువు చేసుకోవడానికి నాకు దొరికిన ఒకే ఒక్క ఆధారం గురించి చెబుతాను అని అంటుంది. వెంటనే కార్తీక్.. నువ్వు రుజువు చేయడానికి నేను కదా సాక్ష్యం అని అంటాడు. అలా అనుకుంటూనే ఇన్నేళ్లు నన్ను బలిపశువును చేశారు అని దీప అనగా.. అంటే ఇప్పుడు నేను బలిపశువును అవ్వాలా. ఏం చెబుతారు. ఎవ్వరికీ చెబుతారు. అస్సలు నమ్మగలిగే విషయమేనా అది అని కార్తీక్ అంటాడు. అంటే ఎవరు చెప్పినా మీరు నమ్మరా అని దీప ప్రశ్నించగా.. చెప్పడానికి తులసి ఉంటే కదా. మీరు అల్లుకొచ్చిన కథను నన్ను నమ్మించేలా చేయాలని చూశారు. అదేదో తేల్చుకోవాలని వెళితే తులసి ఇల్లు ఖాళీ చేసి పారిపోయింది. తను చెప్పిందే నిజమై ఉంటే మొహం చాటేసి ఎందుకు పారిపోతుంది అని కార్తీక్ అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమోలో దీపను నెరజాన అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తాడు కార్తీక్. కార్తీక దీపం కొనసాగుతోంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.