• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KARTHIKA DEEPAM SERIAL UPDATE KARTHIK LEARNS DEEPA PLAN ELSEWHERE MOUNITHA STRONG WORDS TO KARTHIK MNJ

Karthika Deepam: అస‌లు కార‌ణం తెలుసుకున్న కార్తీక్.. దీప ప్లాన్‌ని రివ‌ర్స్ చేస్తానంటూ

Karthika Deepam: అస‌లు కార‌ణం తెలుసుకున్న కార్తీక్.. దీప ప్లాన్‌ని రివ‌ర్స్ చేస్తానంటూ

కార్తీక దీపం సీరియల్ (Karthika Deepam)

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో మౌనిత త‌న ఇంట్లో.. నా ఊహ నిజం అవుతుంద‌ని సంతోషించాను కానీ ఆ ఊహ ఊహ‌గానే మిగిలిపోతుంద‌ని అస్స‌లు ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు. ఆ తుల‌సికి విహారి వ‌ల్ల సంతాన‌యోగ్యం లేద‌న్న విష‌యం కార్తీక్‌కి తెలిస్తే ఇంకేమైనా ఉందా.. అనుమానం వ‌చ్చి ఎంక్వైరీ చేస్తాడు. అంతే తీగ లాగ‌గానే ఢొంక మొత్తం క‌దులుతుంది. దీని వెనుక నేను ఉన్నాన‌న్న విష‌యం తెలుస్తుంది.

  • Share this:
    తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో మౌనిత త‌న ఇంట్లో.. నా ఊహ నిజం అవుతుంద‌ని సంతోషించాను కానీ ఆ ఊహ ఊహ‌గానే మిగిలిపోతుంద‌ని అస్స‌లు ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు. ఆ తుల‌సికి విహారి వ‌ల్ల సంతాన‌యోగ్యం లేద‌న్న విష‌యం కార్తీక్‌కి తెలిస్తే ఇంకేమైనా ఉందా.. అనుమానం వ‌చ్చి ఎంక్వైరీ చేస్తాడు. అంతే తీగ లాగ‌గానే ఢొంక మొత్తం క‌దులుతుంది. దీని వెనుక నేను ఉన్నాన‌న్న విష‌యం తెలుస్తుంది. ఇక కార్తీక్ నేను ఎన్ని అబ‌ద్దాలు చెప్పినా చచ్చినా న‌మ్మ‌డు. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ.. ప్రియ‌మ‌ణిని పిలిచి కాఫీ ఇవ్వ‌మ‌ని చెబుతుంది. ఆ త‌రువాత వ‌ద్దు నీ ప‌ని చూసుకో అని చెబుతుంది. ఏమైంద‌మ్మా అని ప్రియ‌మ‌ణి అడ‌గ్గా.. నేను ఒక‌టి అనుకుంటే ఇంకొక‌టి జ‌రుగుతుందే అదే నా టెన్ష‌న్. అస‌లు ఎందుకే భ‌గ‌వంతుడు నా నుదుటిన ఇలాంటి రాత రాశాడు. ఒక‌రోజు బావుంటే, ఇంకోరోజు టెన్ష‌న్‌గా ఉండాల్సి వ‌స్తుంది. ఛ‌.. ఈ టెన్ష‌న్ లేకుండా జీవితాంతం నేను బావుండే రోజులే రావా.. ఎందుకే నా లైఫ్ ఇలా త‌గ‌ల‌డింది అని అంటుంది. దానికి ప్రియ‌మ‌ణి నువ్వేం బాధ‌ప‌డ‌క‌మ్మా. ఇలాంటి స‌మ‌యాల్లోనే ఆ దేవుడిపై భారం వేయాలి. ఆయ‌నే ఏదొక దారి చూపిస్తాడు అంటుంది. ఇక మౌనిత‌.. ఏంటే దేవుడి మీద భారం వేసేది. అస‌లు ఆ దేవుడు నాకేం చేశాడే. ఏం పాపాలు ఎవ్వ‌రూ చేయ‌రా.. మ‌నుషులంద‌రూ చేస్తారు క‌దా అలాగే నేను చేశా. కానీ మిగిలిన వాళ్లంద‌రూ హ్యాపీగా ఉండి, నాకు మాత్రం ఎందుకు ఇన్ని క‌ష్టాలు అని అంటుంది. వెంట‌నే ప్రియ‌మ‌ణి.. అది కాద‌మ్మా అని అన‌గా.. ప్లీజ్ ప్రియ‌మ‌ణి నీతో వాదించే ఓపిక కూడా నాకు లేదు. వెళ్లి నీ ప‌ని చూసుకో అని మౌనిత చెబుతుంది. ఆ త‌రువాత మౌనిత‌.. ఆ దీప, తుల‌సిని క‌లిసినా డేంజ‌రే. అస‌లు విష‌యం తెలిస్తే ఆ దీప ఊరుకోదు. డైరెక్ట్‌గా వెళ్లి సౌంద‌ర్య‌కు చెబుతుంది. అంతే కార్తీక్‌కి వెళ్లి అస‌లు నిజం చెప్తే వాళ్లంద‌రూ ఒక‌టి అవుతారు. నేను ఒంటరిదాన్ని అవుతాను. లేదు అలా ఎప్ప‌టికీ జ‌ర‌గ‌కూడ‌దు. ఏదో ఒక‌టి చేసి నేను దీని నుంచి బ‌య‌ట‌ప‌డాలి. లేక‌పోతే నా లైఫ్ రిస్క్‌లో ప‌డుతుంది అని అనుకుంటుంది.

    ఇక ఇంట్లో దీప ఏదో ఆలోచ‌న‌లో ఉండ‌గా.. ముర‌ళీకృష్ణ కూర‌గాయాలు తీసుకొస్తారు. ఆ త‌రువాత తుల‌సి వ‌చ్చింద‌న్న విష‌యం ముర‌ళీకృష్ణ, దీప‌కు చెప్తాడు. ఒకసారి ఫోన్ చేయ‌మ‌ని చెప్పింద‌ని చెప్తాడు. దాంతో దీప ఫోన్ చేయ‌గా.. నంబ‌ర్ స్విచ్ఛాఫ్ వ‌స్తుంది. మ‌రోవైపు సౌర్య ఏదో ఆలోచిస్తూ కూర్చోగా.. కార్తీక్ వ‌స్తాడు. ఏం రౌడీ.. ప్ర‌పంచం ఎలా బాగుప‌డుతుంది అని ఆలోచిస్తున్నావా అని కార్తీక్ అడ‌గ్గా.. మీ గురించే ఆలోచిస్తున్నాను అని సౌర్య చెబుతుంది. నా గురించా ఏంటి అని కార్తీక్ అడ‌గ్గా.. హిమ మా అమ్మ కూతురే క‌దా. నేను కూడా మా అమ్మ కూతురినే క‌దా. హిమ మిమ్మ‌ల్ని డాడీ అంటుంది క‌దా. మ‌రి నేను ఎందుకు అంద‌రి ముందు నాన్న అని పిల‌వ‌కూడ‌దు నాన్న‌. అమ్మ మీ భార్య క‌దా. మీరు అమ్మ భ‌ర్తనే క‌దా. మేమిద్ద‌రం మీ పిల్ల‌ల‌మే క‌దా. చెల్లి మాత్రం పిలిచి, నేను మాత్రం ఎందుకు పిల‌వ‌కూడదు నాన్న‌. ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచ‌న రాలేదు. ఇక్క‌డికి వ‌చ్చాక వ‌చ్చింది. అమ్మ మీద కోపంతో వ‌ద్ద‌న్నావేమో అనుకున్నాను. హిమ కూడా అమ్మ కూతురే అని తెలిశాక హిమ డాడీ అని పిలుస్తున్నా నువ్వు ఏమీ అన‌డం లేదు. నేను ఎందుకు రెండు రోజులు మాత్రమే అది ఎవ్వ‌రూ లేన‌ప్పుడు మాత్ర‌మే నాన్న అని పిల‌వాలి. నేను చిన్న పిల్ల‌ను అని, నాకు ఏం తెలీద‌ని అనుకోవ‌ద్దు. నాకు అన్ని తెలుసు. నువ్వే మా నాన్న‌వ‌ని ఎప్పుడో తెలుసు. హిమ నా చెల్లెలే అని ఎప్పుడో తెలుసు. చాలా తెలుసు నాకు. కానీ అంద‌రూ పిల్ల‌లు నాన్న‌ను నాన్న అనే అంటారు. అనొచ్చా అని ఎవ్వ‌రూ అడ‌గ‌రు. నేను ఎందుకు అడ‌గాలి అని ప్ర‌శ్నిస్తుంది.

    దానికి కార్తీక్.. నువ్వు ప్ర‌శ్న‌లు వేసి విసిగిస్తావ‌ని మీ అమ్మ, నేను ఊరికే అంటాము కానీ.. నీ ప్ర‌తి ప్ర‌శ్న‌కు అర్థం ఉంటుంది. ఆ ప్ర‌శ్న ప్ర‌శ్న‌కు మా దగ్గ‌ర జ‌వాబు ఉంటుంది. నీకు అన్ని ఒక్కొక్క‌టి తెలిసిపోయినట్లు ఈ ప్ర‌శ్న‌కు జ‌వాబు చెప్పే రోజు వ‌స్తుంది. ఆ జ‌వాబు నీకు న‌చ్చేదో న‌చ్చ‌నిదో ఏదైనా విన‌డానికి సిద్ధంగా ఉండాలి అని అంటాడు. ఇక సౌర్య ఇప్పుడు అన‌గా.. ఇద్ద‌రం క‌లిసి భోజ‌నం చేద్దాం అని కార్తీక్ అంటాడు. ఆ త‌రువాత రావే రౌడీ ఆక‌లి వేస్తుంది అన‌గా.. అయితే ఇప్పుడు చెప్ప‌రా అని సౌర్య అడుగుతుంది. దానికి కార్తీక్.. ఆక‌లి వేస్తుంది అన్నాన అని కిందికి తీసుకెళ‌తాడు.
    ఇక ముర‌ళీకృష్ణ‌కు కాఫీ తీసుకొచ్చిన దీప‌.. రేపు మా ఇంటికి వెళ‌తామ‌ని చెబుతుంది. దానికి ముర‌ళీకృష్ణ ఇక్క‌డ ఏదైనా ఇబ్బంది ఉందా అని అడ‌గ్గా.. ఇబ్బంది ఏం లేదు నాన్న‌. మేము ఉన్న‌న్ని రోజులు నువ్వు లీవ్ పెట్టాలి. అన‌వ‌స‌రంగా నీ ఆఫీస్ పోతుంది క‌దా నాన్న అని దీప అంటుంది. దానికి ముర‌ళీకృష్ణ‌.. దాంతోముంది అమ్మా. నీ పెళ్లైన ఇన్నేళ్ల‌లో నువ్వు వ‌చ్చింది ఇప్పుడే క‌దా అని అంటాడు. ఇక అక్క‌డ ఇల్లు చూసుకునే వారు కూడా లేరు. స‌రోజ‌క్క కూడా ఊరెళ్లింది అని దీప చెబుతుంది. ఇక ముర‌ళీకృష్ణ‌.. ఎందుక‌మ్మా అక్క‌డ ఊరికే రెంట్ క‌ట్టాలి. నీ ఆదాయ‌మేమో ఆగిపోయింది. ఎక్క‌డి నుంచి తెచ్చి క‌డ‌తావు. ఖాళీ చేసి ఇక్క‌డ‌కు వ‌చ్చేయ‌చ్చు క‌దమ్మా అని అన‌గా.. వ‌చ్చేదాన్ని అయితే అత్త‌గారి గ‌డ‌ప దాటిన‌ప్పుడే వ‌చ్చేదాన్ని నాన్న‌. నేను ఎవ‌రికీ భారంగా ఉండ‌లేను. అందులోనూ త‌ల్లి లేని పుట్టింట్లో.. భ‌ర్త ప్రేమ లేని అత్తింట్లో నాలాంటి ఆడ‌వాళ్లు ఉండ‌లేరు. విడిగా ఉంటేనే ఈ మాత్ర‌మైనా మ‌ర్యాద‌లు మిగిలి ఉంటాయి అని చెబుతుంది. దానికి ముర‌ళీకృష్ణ‌.. నీ ఇష్టాన్ని, నీ అయిష్టాన్ని రెండింటిని గౌర‌విస్తాన‌మ్మా. నీకు ఎలా మంచిద‌ని తోస్తే అలా చేయ్. నువ్వు ఇక్కడ ఉంటే హిమ కోసం డాక్ట‌ర్ బాబు మ‌న‌స్ఫూర్తిగా రాలేక‌పోతున్నాడు. అక్క‌డుంటే హిమ కోసం అయినా డాక్ట‌ర్ బాబు వ‌స్తూ పోతుంటాడు అని చెబుతాడు. దానికి దీప అవును నాన్న నేను హిమ‌ను ఇక్క‌డ ఉంచితే ఆయ‌న చూడ‌కూడ‌ద‌ని ఇక్క‌డ ఉంచాన‌నుకుంటాడు. ఆ అపార్థాలు మ‌న‌కెందుకు అంటుంది. ఇక ముర‌ళీకృష్ణ‌.. స‌రేన‌మ్మా. హిమ‌ను కూడా ఒక మాట అడిగి వ‌స్తానంటే బ‌య‌లుదేరు అని చెప్తాడు.

    ఇక మౌనిత‌, ప్రియ‌మ‌ణిని పిలిచి.. నీకు జీత‌మిచ్చి చంపాలా.. ఇంత విషం ఇచ్చి చంపాలా.. కాఫీ తెచ్చి చ‌స్తావా అని అడుగుతుంది. దానికి ప్రియ‌మ‌ణి మామూలుగా కాఫీ అడ‌గొచ్చు క‌ద‌మ్మా అని అంటుంది. దానికి మౌనిత‌.. కాఫీ ప‌డ‌టం లేటు అయితే మౌనిత ఇలాగే అడుగుతుంది. నా ఒరిజ‌న‌ల్ టాలెంట్ బ‌య‌ట ప‌డుతుంద‌న్న మాట‌. వెళ్లి చావు అని అంటుంది. ఇక లాయ‌ర్‌కి ఫోన్ చేసి.. దీప‌ను క‌లుస్తాను అన్నారు. క‌లిశారా.. అని అడుగుతుంది. దానికి లాయ‌ర్.. లేదు క‌ల‌వ‌లేదు అన‌గా.. నాకు కొంచెం టెన్ష‌న్‌గా ఉంది. ఆ దీప మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది అని మౌనిత అంటుంది. దానికి లాయ‌ర్.. నాకు తెలిసిన ఒక ఆంటీ.. దీప మిమ్మ‌ల్ని కావాల‌నే టెన్ష‌న్ పెడుతుందేమో, అందుకే అంత కాన్ఫిడెంట్‌గా ఉన్న‌ట్లు క‌నిపించి క‌న్ఫ్యూజ్ చేస్తుందేమో అంటోంది అని చెబుతుంది. దానికి మౌనిత‌.. ఏ ధైర్యం, ఏ స‌పోర్ట్ లేకుండా దీప అంత ధీమాగా ఉండ‌దు. అందుకని అంత రిలాక్స్‌గా ఉంటే రివ‌ర్స్ అయిపోతుంది. కొంచెం గ‌ట్టిగా క‌నుక్కోండి అని చెబుతుంది. ఆ త‌రువాత కార్తీక్ రాగా. ఫోన్ పెట్టేస్తుంది.

    ఎవ‌రు అని కార్తీక్ అడ‌గ్గా.. సుజాత అని చెబుతుంది. దీప ఏదో మ‌న‌ల్ని బెదిరించ‌డానికి అలా కాన్ఫిడెంట్‌గా ఉంద‌ని అంటున్నారు అని మౌనిత అంటుంది. దానికి కార్తీక్.. దీప గురించి ఆవిడ చాలా త‌క్కువ అంచ‌నా వేస్తున్న‌ట్లు ఉంది. ఎంత ఇచ్చావు ఫీజు అని అడుగుతాడు. రెండు ల‌క్ష‌లు అని మౌనిత చెప్ప‌గా.. నీకేమైనా పిచ్చా అంత ఎందుకు ఇచ్చావు అని కార్తీక్ అంటాడు. దానికి మౌనిత‌.. నువ్వు సంతోషంగా ఉండ‌టానికి ఏమైనా చేస్తా.. ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తా అని అంటుంది. ఇక కార్తీక్.. ఆ రెండు ల‌క్ష‌లు వెన‌క్కి తీసుకో అంటాడు. ఎందుకు అని మౌనిత అన‌గా.. వేరే లాయ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ‌దాం అని చెబుతాడు. దానికి మౌనిత‌.. అవ‌స‌రం లేదు. రేపు కోర్టులో ఏం జ‌రుగుతుందో చూద్దాం. అయినా నువ్వు గ‌ట్టిగా ఉంటే ఇవ‌న్నీ ఎందుకు అని అంటుంది. గ‌ట్టిగా అంటే అని కార్తీక్ అడ‌గ్గా.. ఏముంది సుపుత్రుడు అనిపించుకోవాల‌ని మీ అమ్మ‌కు ఎదురు చెప్ప‌లేవు. వంశోద్దార‌కుడు అనిపించుకోవాల‌ని ఒక కూతురు అక్క‌డుంటే ఇంకో కూతురిని ఇక్క‌డ‌కు పిలిపించుకున్నావు. మంచి భ‌ర్త‌వి, మంచి మ‌నిషిని అనిపించుకోవ‌డానికి మీ మాజీ భార్య‌ను ప‌ల్లెత్తు మాట కూడా అన‌కుండా చూసుకుంటావు అని మౌనిత అంటుంది.

    వెంట‌నే కార్తీక్.. ఏంటి నువ్వ‌నేది అంటాడు. దానికి మౌనిత‌.. ఆ వంట‌ల‌క్క వ‌చ్చి నీ జేబులో నుంచి ఫోన్ లాక్కుంటుంటే నీకు చ‌క్కిలిగింత‌లు పెట్టిన‌ట్లు ఉంటుంది క‌దా. లాగి పెట్టి రెండు కొడితే ఇంకోసారి అంత చ‌నువు తీసుకుంటుందా అని అంటుంది. దానికి కార్తీక్.. నువ్వు కూడా నా ద‌గ్గ‌ర చాలా సార్లు అతి చ‌నువు చూపించావు. లాగి పెట్టి రెండు పీకి ఉంటే బావుండేదా అంటాడు. దానికి మౌనిత షాక్‌కి గురై.. అదుగో మీ వాళ్ల‌ను అంటే నీకు బాగా మండుతుంది క‌దూ. వాళ్లు నీ వెన‌కాలా తిడుతున్నా, వెట‌కారంగా మాట్లాడుతున్నా, గోతులు తీస్తున్నా నీకు వాళ్లే ముఖ్యం. నేను ఏం చెప్పినా అతి చ‌నువులాగే ఉంటుంది. నీకు వారందరంటే ప్రేమ అని చెప్పు. ఈ కేసు ఎందుకు కోర్టులు ఎందుకు. నా ప్రాక్టిస్ నాకు ఉంది. హ్యాపీగా వెళ్లి నాలుగు డెలివ‌రీలు, నాలుగు సిజేరియ‌న్లు చేసుకుంటా అని చెబుతుంది. దానికి కార్తీక్.. నువ్వు న‌న్ను ఇరిటేట్ చేస్తున్నావు మౌనిత అన‌గా.. ఇరిటేట్ చేసేది నేను కాదు నువ్వు. చ‌క్కిలిగింత‌ల సంగ‌తి ప‌క్క‌న‌పెట్టి స‌రిగ్గా ఆలోచించు. దీప మ‌న‌సులో ఏముందో తెలుసుకో.దీప ఏదైనా మీ అమ్మ‌తో చెబుతుంది. మీ అమ్మ చెప్ప‌లేద‌ని నీతో అంటే అది అబ‌ద్దం అని అంటుంది. దానికి కార్తీక్ నేను వేరేలా క‌నుక్కుంటాలే అని అక్క‌డి నుంచి వెళుతూ.. అది నాకు చ‌క్కిలిగింత‌లు పెట్టిన విష‌యం దీనికి ఎవ‌రు చెప్పి ఉంటారు. అదే చెప్పి ఉంటుంది. కుల్లుకోవాల‌ని అని మ‌న‌సులో అనుకుంటాడు. ఆ త‌రువాత మౌనిత‌.. బాగా రెచ్చగొట్టి పంపించాను. ఇక నుంచి దీప‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డు. త‌ల్లిని గుడ్డిగా న‌మ్మ‌డు అని అనుకొని న‌వ్వుతుంది.

    ఇక సౌంద‌ర్య‌, ఆనంద‌రావుతో.. రేపు కోర్టుకు వెళ్లాలి క‌దా. దీప చూస్తే చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఎందుకే అంత ధైర్యంగా ఉన్నావంటే చెప్ప‌దు అని అంటుండ‌గా.. హిమ‌ను తీసుకొని దీప అక్క‌డ‌కు వ‌స్తుంది. ఇక హిమ.. నాన‌మ్మ‌, తాత‌య్య అని వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గా.. ఈ ఇంట్లో నువ్వు లేక బోసిపోయింది అని సౌంద‌ర్య చెబుతుంది. దానికి దీప‌.. అంద‌రం క‌లిసి వ‌చ్చే రోజు త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని దీప చెబుతుంది. ఇక హిమ‌.. సౌర్య ఎక్కడుంది అన‌గా.. కిచెన్‌లో ఉంద‌ని వెళ్ల‌మ‌ని చెబుతుంది. ఆ తరువాత దీప ఆయ‌న లేరా అని అడ‌గ్గా.. పొద్దున్నే ఎక్క‌డికో వెళ్లాడ‌ని ఆనంద‌రావు అంటాడు. హాస్పిట‌ల్‌కా అని అడ‌గ్గా.. తెలీదు చాలా త్వ‌రగా వెళ్లిపోయాడు అని సౌంద‌ర్య చెబుతుంది. అదే స‌మ‌యానికి ఆదిత్య‌, శ్రావ్య లోప‌లి నుంచి వ‌స్తారు. ఇక సౌంద‌ర్య‌.. ఇప్పుడే మీ మామ‌య్య‌, నేను రేప‌టి కోర్టు విష‌యం గురించి మాట్లాడుకుంటున్నాము అని చెబుతుంది.

    దానికి దీప‌.. మీరు టెన్ష‌న్ ప‌డుతున్నారా అని అడ‌గ్గా.. నువ్వు టెన్ష‌న్ ప‌డ‌లేదా అని ఆనంద‌రావు అంటాడు. వెంట‌నే దీప‌.. లేదు మామ‌య్య‌, కోర్టులో న్యాయ‌మే జ‌రుగుతుంది అని చెబుతుంది. దానికి ఆనంద‌రావు.. అరే వాడి త‌ర‌ఫున లాయ‌ర్ ఎంత గ‌ట్టిగా వాదిస్తారో అని అన‌గా.. ఇది వాద‌న‌తో గెలిచేది కాదు మామ‌య్య అని అంటుంది. వెంట‌నే సౌందర్య‌., నువ్వు న్యాయ‌శాస్త్రాన్నే అవ‌పోసిన ప‌ట్టిన దానిలాగా అంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు ఉన్నావే అస‌లు. మాకు కూడా చెప్ప‌వా.. మాకు అస‌లు కాలు, చేయి ఆడ‌టం లేదు. హిమ ఏం అయిపోతుందో, నువ్వు ఏం అయిపోతున్నావో.. అటు చూస్తే వాడు హిమ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇటు చూస్తే నువ్వు ఓడిపోయే ప్ర‌సక్తే లేన‌ట్లు ధీమాగా ఉన్నావు. ఏం జ‌రుగుతుంది అస‌లు.. చెప్తావా.. చెప్ప‌వా అని అంటుంది.

    దానికి దీప‌.. చెప్తాను అత్త‌య్యా. ఇంత‌గా అడిగించుకోవ‌డం నాకే న‌చ్చ‌డం లేదు. మామ‌య్య గారు.. మీరు లాయ‌ర్ అనుకోండి. అత్త‌య్యా మీరేమో జ‌డ్జి గారు అని చెబుతుంది. ఇక శ్రావ్య‌, ఆదిత్య‌ల‌ను ఆడియెన్స్ అని చెబుతుంది. త‌రువాత కోర్టు సీన్‌ని వివ‌రిస్తూ.. ఆ బోనులో ఆయ‌న‌, ఈ బోనులో నేను అని చెబుతుంది. వెంట‌నే సౌంద‌ర్య ముందు నువ్వు చెప్ప‌వే అన‌గా.. దీప‌.. నా కూతురు నాకు కావాలి అంటారు డాక్ట‌ర్ బాబు అని చెబ‌తుంది. దానికి ఆనంద‌రావు నీ కూతురు ఎక్క‌డుంది అని అడుగుతాడు. వాళ్ల అమ్మ ద‌గ్గ‌రుంది అంటాడు కార్తీక్ బాబు అని దీప చెబుతుంది. వాళ్ల అమ్మ ఎక్క‌డుంది అని ఆనంద‌రావు అడ‌గ్గా.. నేను అని అంటాను అని చెబుతుంది. ఇక నువ్వెవ‌రు అని ఆనంద‌రావు అన‌గా.. ఆయ‌న భార్య‌ను అని దీప చెబుతుంది. వెంటనే సౌంద‌ర్య‌.. కాస్త అర్థం అయ్యేలా చెప్పండి అంటాను నేను అని అంటుంది.

    దానికి దీప.. నేను ఆయ‌న భార్యను. హిమ నా కూతురు అని చెబుతుంది. నీ కూతురిని డాక్ట‌ర్ బాబు పెంచుకోవ‌డం ఏంటి అని ఆనంద‌రావు అన‌గా.. అదే నాకు అర్థం కావ‌డం లేదు అంటాను నేను అని సౌంద‌ర్య అంటుంది. ఇక దీప‌.. అంతా మా అత్త‌గారే చేశారు అంటాను నేను అని దీప అంటుంది. వెంట‌నే సౌంద‌ర్య‌.. మ‌ధ్య‌లో మీ అత్త‌ను ఆడిపోసుకోవ‌డం మానేసి విష‌యానికిరా అంటాను నేను అని అంటుంది. దానికి దీప‌.. నా భ‌ర్త‌, నేను విడిగా ఉన్నాము అంటాను నేను అని అంటుంది. ఇక ఆనంద‌రావు విడాకులు ఇచ్చాడా అని అడ‌గ్గా.. దీప లేద‌ని అంటుంది. వెంట‌నే ఆనందరావు.. విడాకులు ఇవ్వ‌కుండా నీ కూతురిని ఎందుకు పెంచుకుంటున్నాడు. మ‌రి నువ్వెక్క‌డ ఉంటున్నావు అని అడుగుతాడు. దానికి దీప‌.. నేను మా అత్త గారింటో ఉండ‌టం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. వంట‌లు చేసుకొని బ‌తుకుతున్నాను. నాకు క‌వ‌ల పిల్లలు. ఒక కూతురిని మాత్ర‌మే ఆయ‌న కావాలంటున్నారు అని చెబుతుంది.

    ఇక సౌంద‌ర్య‌.. డాక్ట‌ర్ బాబు ఏం మాట్లాడ‌రా అని అన‌గా.. ఆ ఇద్ద‌రు పిల్ల‌లు నా పిల్ల‌లు కారు అని కార్తీక్‌ని ఉద్దేశించి దీప గ‌ట్టిగా అరుస్తుంది. ఆ త‌రువాత దీప అప్పుడు జ‌డ్జిగారు ఏమంటారు అని సౌంద‌ర్య వైపు చూడ‌గా.. అర్థ‌మైంది. అర్థ‌మైందే అని సౌంద‌ర్య అంటుంది. దానికి దీప న‌వ్వుతూ.. అత్త‌గా కాదు జ‌డ్జిగా చెప్పండి అని అడ‌గ్గా.. ఆ పిల్ల‌లు నీ పిల్లలు కాద‌ని కోర్టుకు రుజువు కావాలి డాక్ట‌ర్ బాబు అని సౌంద‌ర్య అంటుంది. ఈ మాట‌ల‌ను బ‌య‌టి నుంచి కార్తీక్ వింటాడు.

    ఇక లోప‌ల సౌంద‌ర్య‌.. లేదంటే బుద్దిగా బుద్ది తెచ్చుకొని నీ భార్య‌ను, పిల్ల‌ల‌ను తెచ్చుకొని హాయిగా కాపురం చేసుకో అని జ‌డ్జిగారు అంటారు అని చెబుతుంది. ఇక దీప‌.. ఇదే అత్త‌య్యా జ‌రిగేది. ఇదే జ‌రుగుతుంది. జ‌రిగేలా నేను చేస్తాను. అందుకే నేను ధీమాగా ఉన్నాను అని అంటుంది. దీప ఐడియాను లోప‌లి వాళ్లు మెచ్చుకుంటారు. ఇదంతా విన్న కార్తీక్.. ఇదా దీని కాన్ఫిడెన్స్‌కి కార‌ణం. ఈ మాత్రం కూడా ఆ సుజాత ఆలోచించ‌లేక‌పోయిందా.. మీరు పండుగ చేసుకోండి. ఆ ప్లాన్ అంతా దండ‌గ చేస్తా అని కార్తీక్ అటు నుంచి అటే వెళ‌తాడు. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో విహారికి పిల్ల‌లు పుట్ట‌ర‌న్న విష‌యాన్ని తుల‌సి, మౌనిత ముంద‌రే దీప‌కు చెబుతుంది.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు