హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: టెస్ట్ చేయించుకోవ‌డంపై కార్తీక్ యూట‌ర్న్.. దీప ఆచూకీ తెలుసుకున్న ముర‌ళీకృష్ణ‌, మోనిత‌

Karthika Deepam: టెస్ట్ చేయించుకోవ‌డంపై కార్తీక్ యూట‌ర్న్.. దీప ఆచూకీ తెలుసుకున్న ముర‌ళీకృష్ణ‌, మోనిత‌

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. సోమ‌వారం నాటి ఎపిసోడ్‌లో మోనిత ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో కొడుతూ ఉంది. అన్నీ నేను అనుకున్న‌ట్లే జ‌రుగుతున్నాయి ఏంటి. విచిత్రంగా ఉందే. ప్ర‌తిదీ నాకు ఎదురుతిర‌గాలి క‌దా అనుకూలంగా జరిగిపోతున్నాయి ఏంటి. ఏళ్ల నుంచి ఏదైనా నేను ఊహించ‌దానికి రివర్స్‌లోనే క‌దా జ‌రిగేది. నో.. నో అది భ‌రించ‌డం నా వ‌ల్ల కాదు

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. సోమ‌వారం నాటి ఎపిసోడ్‌లో మోనిత ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో కొడుతూ ఉంది. అన్నీ నేను అనుకున్న‌ట్లే జ‌రుగుతున్నాయి ఏంటి. విచిత్రంగా ఉందే. ప్ర‌తిదీ నాకు ఎదురుతిర‌గాలి క‌దా అనుకూలంగా జరిగిపోతున్నాయి ఏంటి. ఏళ్ల నుంచి ఏదైనా నేను ఊహించ‌దానికి రివర్స్‌లోనే క‌దా జ‌రిగేది. నో.. నో అది భ‌రించ‌డం నా వ‌ల్ల కాదు. ఏదో జ‌ర‌గాలి. ఏం జ‌ర‌గాలి అని అనుకుంటూ,. కార్తీక్ మాట‌ను గుర్తు చేసుకుంటుంది. వెంట‌నే ఓ మై గాడ్. హిమ‌ను వెత‌క‌డంతో ప‌డి అస‌లు సంగ‌తి ప‌క్క‌న‌పెట్టానేంటి. ఇదే క‌దా నాకు రివ‌ర్స్‌లో జ‌రిగేది. దీన్నే ఇగ్నోర్ చేస్తే ఎలా. ఏదో ఒక‌టి చేయాలి అని ఫోన్ తీసుకుంటుంది. ఆ త‌రువాత దేవుడా న‌న్ను క్ష‌మించు. ఈ ప్ర‌పంచంలో నేను ప్రేమించేది ఒక్క కార్తీక్‌నే. అందుకే నా కార్తీక్‌ని ద‌క్కించుకోవ‌డం కోసం ఎంత‌కైనా తెగిస్తాను అని అంటుంది.

  మ‌రోవైపు సౌంద‌ర్య, ఆనంద‌రావులు బ‌య‌టి నుంచి వ‌స్తుండ‌గా.. కార్తీక్ మ‌మ్మీ. నీతో మాట్లాడాలి. ఒక‌సారి పైకి రా మ‌మ్మీ అని పిలుస్తాడు. అప్పుడే పైనుంచి కింద‌కు వ‌స్తాడు ఆదిత్య‌. నేను వ‌స్తాను సౌంద‌ర్య అని ఆనంద‌రావు అన‌గా.. ఎందుకండి అన్ని మెట్లు ఎక్కడం అని సౌంద‌ర్య అంటుంది. దానికి వాడేదే నిర్ణ‌యం తీసుకోబోతున్నాడు అని ఆనంద‌రావు అన‌గా.. ఇంత‌కంటే ఏం జ‌రుగుతుంది డాడీ. నువ్వు అన‌వ‌స‌రంగా అన్నీ అతిగా ఆలోచించి హార్ట్ ప్రాబ్ల‌మ్ తెచ్చుకున్నావు అని ఆదిత్య అంటాడు. వెంట‌నే ఆనంద‌రావు.. ఏదీరా అన‌వ‌స‌రం. కొడుకుల గురించి, కోడ‌ళ్ల గురించి, కుటుంబం గురించి ఆలోచించ‌డం అన‌వ‌స‌ర‌మా.. రేపు మాట‌లు వ‌చ్చాక నీ కొడుకు ఒక్క‌పూట మొహం మార్చుకొని కూర్చుంటే ఇలానే అన‌వ‌సరం అంటావేమో చూస్తా. పిల్ల‌ల కంటేఈ ప్ర‌పంచంలో ఏది ఎక్కువ‌, ఏది ఎక్కువ అనుకుంటూ ఎంత‌మంది త‌ల్లిదండ్రులు గొట్టు చాకిరి చేస్తున్నారో, ఎంత‌మంది త‌ల్లిదండ్రులు సుఖం, సంతోషం త్యాగం చేస్తున్నారో తెలుసా. అతిగా ఆలోచిస్తున్నాన‌ట అని అంటాడు. వెంట‌నే ఆదిత్య‌.. పోనీ అతిగా ఆవేశ‌ప‌డుతున్నావు స‌రేనా. ఆవేశ‌ప‌డ‌కు డాడీ అనగా.. మీరు ఆపుతారా. నా గుండెల్లో ద‌డ‌గా ఉంది వాడు ఏం చెప్తాడోన‌ని అని సౌంద‌ర్య అంటుంది. పోనీ నీ బ‌దులు నేను వెళ్తాను మ‌మ్మీ అని ఆదిత్య అన‌గా.. పై నుంచి తోసినా తోస్తాడురా నీ త‌ల‌తిక్క వాగుడుకి. నువ్వే వెళ్లు సౌంద‌ర్య అని ఆనంద‌రావు పంపుతాడు.

  ఇక ముర‌ళీకృష్ణ వారిని వెతుక్కుంటూ ఒక‌చోట కూర్చుంటాడు. క‌నిపించ‌వా అమ్మా. అంత‌గా మ‌న‌సు విరిగిపోయిందా.. అనుమానాలు, అవ‌మానాలు త‌ట్టుకోలేక ఈ మ‌నిషి మార‌డు అని విసిగిపోయి వెళ్లిపోయావా అమ్మా. ఇంక ఎప్ప‌టికీ ఎవ్వ‌రికీ క‌నిపించ‌కుండా గ‌ట్టి నిర్ణ‌యం తీసుకొని వెళ్లిపోయావా.. మ‌రి ఎలా బ‌తుకుతావమ్మా. పిల్ల‌ల‌ను ఎలా పోషిస్తావు. అస‌లు ఏమైపోయావ‌మ్మా. ఎలా నాకు దొరికేది అని ఏడుస్తూ ఉంటాడు.

  ఇక ఇంట్లో దీప సామాన్లు క‌డుగుతూ ఉంటుంది. ప‌క్క‌నే వార‌ణాసి ఇవాళ ఇంకా గిరాకీ పెరిగింది అక్కా. నువ్వు పిండి ఎక్కువ క‌ల‌ప‌డం మంచిదైంది అని అన‌గా.. అది కూడా స‌రిపోదేమో, క‌స్ట‌మ‌ర్లు తిరిగి వెళ్లిపోతారేమో అనుకున్నాను అని దీప అంటుంది. ఇలా జ‌రిగితే బండి తీసేసి షెడ్ వేయాల్సి వ‌స్తుంది అక్కా. ఇదంతా సౌర్య‌మ్మ ఐడియానే క‌దా అక్కా అని వార‌ణాసి అన‌గా.. అన్నీ వాళ్ల నాన‌మ్మ తెలివితేట‌లే మా అత్త‌మ్మకు అని దీప అంటుంది. వెంట‌నే వార‌ణాసి.. అస‌లు, నువ్వు డాక్ట‌ర్ బాబు క‌లిసి ఉంటే సౌర్య‌, హిమ వాళ్ల‌కు ఉన్న తెలివితేట‌ల‌కు ఏ క‌లెక్ట‌ర్లో, డాక్ట‌ర్లో పెద్ద ఆఫీస‌ర్లో అయ్యే వాళ్లు. పాపం వాళ్ల‌కు నాన్న మీద దిగులు బాగా ఉంది. నిన్ను వ‌దిలి వెళ్ల‌లేక న‌లిగిపోతున్నారు అక్క‌ అని అంటాడు. అదే సమయానికి సౌర్య‌, హిమ అక్క‌డ‌కు వ‌స్తారు.

  సౌర్య కోపంగా.. వారణాసి మా నాన్న కోసం మేము బాధపడుతున్నాము అని నీతో చెప్పామా అని అనగా.. అమ్మను వదిలి వెళ్ల‌లేక బాధ‌ప‌డుతున్నాము అని నీతో అన్నామా అని హిమ అంటుంది. మ‌రి మేము చెప్ప‌కుండా నీకు ఎలా తెలిసిందిరా. మొహం ప‌చ్చ‌డి అయిపోతుంది ఏమ‌నుకున్నావో అని సౌర్య అన‌గా.. మా అమ్మ నిజం అనుకొని నీతో మ‌మ్మ‌ల్ని మా నాన్న ద‌గ్గ‌ర‌కు పంపిస్తే అని హిమ అన‌గా.. మేము అక్క‌డ‌కు వెళ్ల‌మ‌ని చెప్పాక నువ్వెందుకురా మ‌ళ్లీ ఆ టాపిక్ తెస్తావు. నీకు ఏది అనిపిస్తే అది అనేస్తావా అని సౌర్య అన‌గా.. మా అమ్మ ఎంత బాధ‌ప‌డుతుంది అని హిమ అంటుంది. ఆ త‌రువాత ఆ ఇద్ద‌రిని దీప ద‌గ్గ‌ర‌కు పిలుచుకుంటుంది. అమ్మ ఎక్క‌డ బాధ ప‌డుతుందోన‌ని మీ మ‌న‌సులో మీ నాన్న మీద ఉన్న ప్రేమ‌ను దాచుకుంటున్నారు క‌దూ అని దీప అన‌గా.. మాకు నాన్న కావాల‌నిపిస్తుంది అమ్మా అని సౌర్య‌, కానీ నిన్ను వదిలేసిపోయేంత కాదు అని హిమ అంటారు. అవున‌మ్మా నువ్వు కావాలి, నాన్న కావాలి. నాన్న రాక‌పోయినా స‌రే నువ్వే కావాలి అని సౌర్య అన‌గా.. నువ్వు మా కోస‌మే క‌ద‌మ్మా ఇంత క‌ష్ట‌ప‌డుతున్నావు అని హిమ అన‌గా.. మ‌రి నిన్ను వ‌దిలి నాన్న ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోవాల‌ని ఎందుకు అనుకుంటామ‌మ్మా. ఈ వార‌ణాసి అన్నీ అబ‌ద్దాలు చెబుతున్నాడు అని సౌర్య అంటుంది. దాంతో వార‌ణాసి.. సారీ సౌర్య‌మ్మా. అబద్దాలు చెప్పినందుకు నిజంగా సారీ అని అన‌గా.. ఇంకెప్పుడు చెప్పొద్దు అని సౌర్య అంటుంది. ఆ త‌రువాత హిమ‌.. నాన్న తిరిగి వ‌చ్చి అంద‌రినీ ర‌మ్మంటేనే వెళదాం. ఒక్క మ‌మ్మ‌ల్ని ర‌మ్మ‌ని అమ్మ‌ను వ‌ద్దంటే అస్స‌లు వెళ్లం అని అంటుంది. ఇక దీప‌.. స‌రే స‌రే మీరు ఏడ‌వ‌కండి. మీ ప్రేమ మీ నాన్న‌ను ర‌ప్పిస్తుంది. అందులో అనుమాన‌మే లేదు అని అంటుంది. వెంట‌నే సౌర్య‌.. నాన్న కూడా మ‌న గురించే ఆలోచిస్తూ ఉంటాడు క‌ద‌మ్మా అని అన‌గా.. హు అని దీప అంటుంది.

  మ‌రోవైపు కార్తీక్.. దీప పిల్ల‌ల‌ను తీసుకెళ్లిన సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ త‌రువాత మ‌నసులో.. రిపోర్ట్ ఎప్ప‌టిలాగే వ‌స్తే. నాకు పిల్ల‌లు పుట్ట‌ర‌ని వ‌స్తే. నేను పెంచుకున్న కాబ‌ట్టి హిమ‌ను సొంత తండ్రిలా ఆద‌రిస్తాను. కానీ నా వాళ్లు ఇంత‌కాలం నా కూతురే అనే న‌మ్మేవాళ్లు దీప‌తో పాటు హిమ‌ను దూరం పెట్టేస్తే. అస‌లు హిమ‌ను, దీప ఎక్క‌డికి తీసుకెళ్లింది అన్న‌ది ప‌క్క‌న‌పెట్టేస్తే వెతికి తీసుకువ‌చ్చాక హిమ‌ను ఎప్ప‌టిలా ప్రేమిస్తానా, రానిస్తానా అని అనుకుంటూ ఉంటాడు. అదే స‌మ‌యానికి సౌంద‌ర్య లోప‌లికి వ‌స్తుంది.

  నువ్వ కోరుకున్న‌ట్లే దీప పిల్ల‌ల‌ను తీసుకొని వెళ్లిపోయింది. ఇంకా నువ్వు ఏ పిచ్చుక‌ల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్ర‌యోగించాల‌నుకుంటున్నావు అని సౌంద‌ర్య అన‌గా.. నేను తల్లిని వెళ్లిపోమ‌న్నాను. పిల్ల‌ల‌ను తీసుకొని వెళ్లిపోమ‌న‌లేదు అని కార్తీక్ అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. త‌ల్లి లేకుండా పిల్లలు ఎక్క‌డి నుంచి వ‌చ్చారురా అని అన‌గా.. తండ్రి లేకుండా పిల్ల‌లు పుట్ట‌లేదా అని కార్తీక్ అంటాడు. దాంతో సౌంద‌ర్య కోపంగా.. పుట్ట‌గ‌తులు ఉండ‌వు. ఆ మాట అంటే. సంస్కార హీనుడిని క‌న్నానేంటా అని జీవితాంతం కుమిలిపోయేలా మ‌ళ్లీ మ‌ళ్లీ నోరు జార‌కు కార్తీక్. ఎందుకు పిలిచావో చెప్పు అని అంటుంది. ఇక కార్తీక్.. నాకు ఆదిత్య బాగా బ్రెయిన్ వాష్ చేశాడ‌ని చెప్పే ఉంటాడు అని అన‌గా.. ఎలుక తోక తెచ్చి ఎన్నిసార్లు ఉతికితే ఏమ‌వుతుంది అని సౌంద‌ర్య అంటుంది. వెంట‌నే కార్తీక్.. కానీ నేను వాడి మాట‌ల్లో నిజం ఉంద‌ని గ్ర‌హించాను. నిజ‌మే. మీ అంద‌రి ప్ర‌య‌త్నాలు పూర్తి అయిపోయాయి. ఇక మిగిలింది నా వైపు నుంచి మాత్ర‌మే. నా వంతు ప్ర‌య‌త్నంగా పిల్ల‌లు పుట్టే అవ‌కాశం ఉందో లేదో టెస్ట్‌లు చేయించుకొని తెలుసుకోవాల‌నుకుంటున్నాను అని అంటాడు. దాంతో సౌంద‌ర్య సంతోషంగా.. నిజ‌మా.. నిజ‌మా కార్తీక్.. నువ్వేనా ఈ మాట అంటున్న‌ది అనగా.. నేను అంటున్నాను. కానీ నేనే మళ్లీ వెనుక‌డుగు వేశాను అని కార్తీక్ అంటాడు.

  ఎందుకు. మ‌ళ్లీ ఏమైందిరా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. నా భ‌యాలు నాకు ఉన్నాయి అని కార్తీక్ అంటాడు. ఆ మోనిత వ‌ద్ద‌ని చెప్పిందా అని సౌంద‌ర్య అన‌గా..మోనిత అలాంటివి చెప్ప‌దు అని కార్తీక్ అంటాడు. అలాంటివే చెబుతుంది అని సౌంద‌ర్య అన‌గా.. నేను చెప్పుడు మాట‌లు విన‌న‌ని మోనిత‌కు తెలుసు అని కార్తీక్ అన‌గా.. చెప్పుడు మాట‌లే నిన్ను, దీప‌ను విడ‌దీశాయ‌ని నేను ఇప్ప‌టికీ న‌మ్ముతున్నాను అని సౌంద‌ర్య అన‌గా.. ఇప్పుడు టాపిక్ మోనిత కాదు అని కార్తీక్ అంటాడు. ఆ త‌రువాత కార్తీక్‌ని కూర్చోమ‌ని చెప్పు. ఏంటి నీ భ‌యాలు. ఆ భ‌యాలు అన్నీ అన‌వ‌స‌రాలు. అర్థం లేని సంగ్ధిగ్ధాలు. అవ‌న్నీ నేను పోగొడుతాను. నీ నిర్ణ‌యం గొప్ప‌ది, ప్ర‌పంచం మెచ్చుకోద‌గిన‌ది. నీ సంస్కారాన్ని మ‌ళ్లీ పున‌రుత్ప‌త్తి చేస్తుంది. చెప్ప‌రా. ఏమైంది నీకు. ఎందుకు వెన‌కంజ వేశావు అని సౌంద‌ర్య అడుగుతుంది.

  దానికి కార్తీక్.. నేను టెస్ట్ చేయించుకుంటే పిల్ల‌లు పుట్ట‌ర‌ను అనేది గ్యారెంటీగా వ‌స్తుంది. అప్పుడు హిమ ఎవ‌రి బిడ్డ‌.. అప్పుడు మీరు హిమ‌ను దూరం పెట్ట‌రుగా అని అడుగుతాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. కార్తీక్. ఇదా నిన్ను భ‌య‌పెట్టేది. ఒరేయ్ స్టుపిడ్. నువ్వు టెస్ట్‌లు చేయించుకుంటే నువ్వే దీప‌ను, పిల్ల‌ల‌ను దూరం పెట్ట‌వురా. ఇంత‌కాలం ఆ టెస్ట్‌లు చేయించుకోక‌నే వాళ్ల‌ను దూరం చేసుకున్నావ‌నే క‌దారా మేమంతా బాధ‌ప‌డేది అని అంటుంది. దానికి కార్తీక్.. మ‌న న‌మ్మ‌కాల క‌న్నా. నిజాలే మ‌న బ‌తుకుల‌ను శాసిస్తున్నాయి మ‌మ్మీ. . మీరు న‌మ్మింది వేరు, నేను చూసింది వేరు, నా జీవితంలో జ‌రిగింది వేరు. దేనికి పొంత‌న లేక‌నే ఇంట్లో క‌ల‌హాలు మొద‌ల‌య్యాయి అని అంటాడు. ఇక సౌంద‌ర్య‌.. వీట‌న్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టేదే నీ నిర్ణ‌యం. నీ నిర్ణ‌యం వ‌ల‌న ఎన్ని జీవితాలు బాగుప‌డ‌తాయో నీకు తెలీదు. . ఎన్ని స‌మ‌స్య‌లు దూరం అయిపోతాయో నీకు తెలీదు. నీ క‌ళ్లు తెరుచుకుంటాయి. మూసుకుపోయిన నీ కాపుర ద్వారాలు తెరుచుకుంటాయి. దీప ప‌విత్ర‌త తెలుస్తుంది, దీప ప‌తివ్ర‌త అని తెలుస్తుంది. ఆ బిడ్డ‌లు నీ ర‌క్తం అని తెలుస్తుంది. మ‌ళ్లీ నువ్వు నా సుపుత్రుడివి అయిపోతావు. వంశోద్ధార‌కుడు అయిపోతావు. నన్ను న‌మ్ము. ఇక నీ సంశ‌యాల‌న్నీ ప‌క్క‌న‌పెట్టు. నీలో మొద‌లైన ఈ సంక‌ల్పాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టు అని అంటుంది.

  వెంట‌నే కార్తీక్.. లేదు మ‌మ్మీ. నువ్వు చెబుతుంటే విన‌డానికి బావుంది. నిజంగా అలాంటి క్ష‌ణాల కోసం నా మ‌న‌సు కొట్టుకులాడుతుంది. అన్ని విష‌యాల్లోనూ మంచిది అయిన దీప‌.. ఆ ఒక్క విష‌యంలోనూ నిర‌ప‌రాధి అని తెలిస్తే.. దాని కాళ్లు ప‌ట్టుకొని క్ష‌మాప‌ణ అడ‌గ‌టానికి అయినా నేను వెన‌కాడ‌ను మమ్మీ. పిల్ల‌ల‌ను కూడా పరాయివాళ్ల‌ను పెంచుకుంటున్నాన‌నే భావ‌న పోయి నా ర‌క్తం పంచుకుపుట్టిన పిల్ల‌లు అని తెలుసుకుంటాను. కానీ ఈ నిజమే న‌న్ను ముంచేస్తుంది మ‌మ్మీ. ఈ టెస్ట్‌ల‌లో క‌చ్చితంగా దీప త‌ప్పు చేసింద‌నే రుజువు అవుతుంది. అప్పుడు మ‌ళ్లీ నేను క‌ఠినంగా మారిపోతాను. మీరంతా దీప‌నే కాదు పిల్ల‌ల‌ను ప‌రాయి వాళ్ల‌ను చేస్తారు. హిమ‌ను నాకు దూరం చేస్తారు అని అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. రేయ్ కార్తీక్ వ‌ద్దురా. అమృతం పుడుతుందంటే విషం పుడుతుందేమోన‌ని భ‌య‌ప‌డ‌తావేంటిరా. నీ బ్ర‌తుకు బాగుప‌డుతుంద‌ని, నీ కాపురం చ‌క్క‌బ‌డుతుంద‌ని, నీ భార్య బిడ్డ‌లు నీతో క‌లిసి ఉంటార‌ని ఎంతో న‌మ్మ‌కంగా ఉందిరా. పోనీ ఈ సంశ‌యాల‌న్నీ వదిలేసి ఈ టెస్ట్‌లు చేయించుకో. రిజ‌ల్ట్ ఏది వ‌చ్చినా నువ్వు కోరుకున్న‌ట్లు హిమ నీతోనే ఉంటుంది. నా వంశాంకురంలానే పెరుగుతుంది స‌రేనా అని అంటుంది. నా వ‌ల్ల కావ‌డం లేదు మ‌మ్మీ అని కార్తీక్ అన‌గా.. నువ్వు దేవుడివి అవుతావురా. అంద‌రికీ వ‌రాలిచ్చే దేవుడివి అవుతావు. న‌మ్మ‌రా. అమ్మ‌నురా. నీ మంచి కోస‌మే చెబుతున్నాను. నా మాట విన‌రా. ప్లీజ్ రా అని సౌంద‌ర్య‌ అంటుంది.

  ఇక కార్తీక్.. స్టాపిట్ మ‌మ్మీ. నాలో ఆలోచించే శ‌క్తి పోయింది. నేను ఏ నిర్ణ‌యం తీసుకోవాలో నాకే తెలియ‌ట్లేదు అని అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. దాంతో సౌంద‌ర్య క‌న్నీళ్లు పెట్టుకొని.. అయ్యో భ‌గ‌వంతుడా. వీడిలో ఈ ఆలోచ‌న రావ‌డ‌మే శుభ‌ప‌రిణామం అనుకుంటే.. ఈ సంగ్దిగ్దాలు ఎందుకు ఆపుతున్నాయో అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు వాడు టెస్ట్‌లు చేయించుకుంటాడా.. చేయించుకోడా అని అనుకుంటుంది.

  మ‌రోవైపు మోనిత‌, ప్రియ‌మ‌ణి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఊరికి వెళుతున్నా అని చెబుతుంది. అదేంట‌మ్మా స‌డ‌న్‌గా. మీకు చుట్టాలెవ‌రు లేరు క‌దా. మిమ్మ‌ల్ని పిలిచే వాళ్లు గానీ మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వాళ్లు గానీ ఎవ‌రూ లేరు క‌దా అని ప్రియ‌మ‌ణి అంటుంది. దానికి మోనిత‌.. నాకు ఎవ‌రు లేక‌పోతేనేంటే. ఈ లోకంలో నాకు కార్తీక్ ఒక్క‌డు చాలు అనగా.. మ‌రి ప్ర‌యాణం ఎందాకా అని ప్రియ‌మ‌ణి అంటుంది. వెంట‌నే మోనిత‌.. నువ్వు నాకు ప‌నిమ‌నిషివా.. నేను నీకు ప‌నిమ‌నిషినా.. నువ్వు నాకు ప్ర‌శ్న‌లు వేయ‌డం ఏంటే.. కార్తీక్ ఇంటికి వ‌స్తే చెప్పు. నేను హిమ‌తోనే ఇంటికి వ‌స్తాన‌ని చెప్పు అని అంటుంది. దాంతో ప్రియ‌మ‌ణి.. అవునా, నిజ‌మా, హిమ ఎక్క‌డ ఉందో తెలిసిందా అమ్మా అని అంటుంది. దానికి మోనిత‌.. చెప్పింది చేయ్. చ‌రిత్ర గెల‌క‌క అని అక్క‌డి నుంచి వెళుతుంది. ఆ త‌రువాత ప్రియ‌మ‌ణి.. ఈ మెంట‌ల్‌ది ఆ ముక్క ఏదో కార్తీక్ అయ్య‌కు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఏదైతేనేం వెళ్లిపోయింది అని పాట‌లు పెట్టుకొని శాడిస్ట్ వెళ్లిపోయింది. ద‌రిద్రం వెళ్లిపోయింది అని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. వెంట‌నే మోనిత లోప‌లికి వ‌చ్చి ఫోన్ తీసుకొని తిరిగి వ‌చ్చాక అపెండిక్స్ ఆప‌రేష‌న్ నీ మొహం మీద చేస్తాను అని వెళ్లిపోతుంది.

  మ‌రోవైపు దీప‌కు ద‌గ్గు ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతో ట్యాబ్లెట్లు వేసుకొని.. భ‌గ‌వంతుడా నాకు ఏదైనా అయితే, నేను మంచం ప‌డితే, అస‌లు లేకుండా పోతే.. నా బిడ్డ‌లు అనాథ‌లు అయిపోతారు. నా పిల్లల కోస‌మైనా నా ఆరోగ్యం బావుండాలి. ఈ మాయ‌దారి రోగం నన్ను పీల్చి పిప్పి చేస్తోంది. నాకు ఏమీ కాకుండా చూడు స్వామి అని సోఫాలో వెళ్లి కూర్చొని ద‌గ్గుతూ ఉంటుంది. దాంతో సౌర్య‌, హిమ బ‌య‌ట‌కు వ‌స్తారు. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో దీప‌ను ముర‌ళీకృష్ణ‌, మోనిత ఇద్ద‌రు చూస్తారు.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు