Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ మరో మైలు రాయిని దాటింది. ఈ సీరియల్ మంగళవారంతో వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇక నిన్నటి ఎపిసోడ్లో కార్తీక్, దీప వాళ్లు ఉండే ప్రదేశానికి వస్తాడు. అతడిని చూసిన హిమ, మురళీకృష్ణకు చూపిస్తుంది. దీంతో వారణాసి సహా అందరూ షాక్‌కి గురి అవుతారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్లో హిమ ఏడుస్తూ డాడీ అంటూ కార్తీక్‌ను హత్తుకుంటుంది. దీంతో హిమను దగ్గరకు తీసుకొని భావోద్వేగానికి గురి అవుతాడు కార్తీక్. మరోవైపు సౌందర్య ఇంట్లో ఆనందరావు దగ్గరకు వచ్చి.. రైల్వే స్టేషన్ సీసీ టీవీ ఫుటేజ్‌లో వాళ్లు కనిపించారట అండి అని చెప్పగా.. అవునా అని ఆనందరావు అంటాడు. నాంపల్లి రైల్వే స్టేషన్లో దిగజం, టికెట్లు తీసుకోవడం ఇవి మాత్రమే ట్రేస్ చేశారట అని సౌందర్య అనగా.. ఏ ట్రైన్‌కు వెళ్లారో అని ఆనందరావు అనగా.. అది కూడా అడిగాడు. ఆ టైమ్‌కు నాలుగు ట్రైన్లు ఉంటాయట, ఒకటి డిల్లీకి, ఒకటి వైజాగ్‌కు, ఒకటి తిరుపతి, ఒకటి బెంగళూరు అని సౌందర్య అనగా.. ఫ్లాట్‌ఫామ్ మీద విజువల్స్ ఏమీ దొరకలేదా అని ఆనందరావు అడగ్గా.. అంతమంది జనాల్లో వెతికి పట్టుకోవడానికి మనవాళ్లు ఏమైనా క్రిమినల్సా, అయినా ట్రై చేస్తాం అన్నారు అని సౌందర్య అనగా..రాత్రి పూట నా కోడలు, ఆ పసిపిల్లలు జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్లో వెళ్లారా కనీసం సీటు అయినా దొరికి ఉంటుందా.. మనుషులు తోసుకుంటూ ఎక్కుతారు. రకరకాల వాళ్లు ఉంటారు. తాగి ఉంటారు, గుట్కా వేసుకొనే వాళ్లు ఉంటారు, శుభ్రంగా లేని వాళ్లు ఉంటారు. వాళ్లందరి మధ్య ప్రయాణం అని ఆనందరావు అంటుండగా.. వాళ్లకు ఆ గతి పట్టించింది మన వాడే కదా అని సౌందర్య అనగా.. వాడేం వెళ్లమనలేదు కదా అని ఆనందరావు అనగా.. అలాగని ఉండమనలేదు అని సౌందర్య చెబుతుంది.
దాంతో ఆనందరావు.. ఆ మాటకు వస్తే వాడు అన్నట్లు మనం ఉండమని అన్నామా అని అడుగుతాడు. ఇప్పుడు ఎన్ని అనుకున్నా, ఎవరిని అనుకున్నా లాభం లేదు, వారణాసి ఆటోలో వెళ్లారంటే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పల్లెటూర్లకు వెళ్లారనుకున్నా, ట్రైన్లో వెళ్లింటే ఏ దూర తీరాలకో, ఏ ఇతర రాష్ట్రాలకో అని సౌందర్య అంటుండగా.. సహనం హద్దులు దాటింది. అందుకే కోడలు సరిహద్దులు దాటింది అని ఆనందరావు అనగా.. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎవ్వరినీ సాయం అడగదు. పుస్తెలతో పస్తులు ఉండటం నేర్చుకుంటూ తాళి కట్టిన భర్తే కాదు పొమ్మనప్పుడు తాళిబొట్టునే కాదనుకొని పసుపు కొమ్మ కట్టుకుందో. తండ్రి ఏడని, ఏం చేస్తాడని ఎవ్వరినైనా పిల్లలను అడిగితే పిల్లలు సమాధానం చెప్పలేక తల్లికేసి చూస్తున్నారో. ఏ చెట్టు నీడన తలదాచుకుందో అని సౌందర్య అంటుండగా.. ఆపు సౌందర్య ప్లీజ్ వినలేకపోతున్నాను అని ఆనందరావు ఆవేశంతో లేస్తాడు. టెన్షన్ పడకండి అని సౌందర్య అనగా.. అదే సమయానికి ఆదిత్య అక్కడికి వస్తాడు. అన్నయ్య వచ్చాడా మమ్మీ అని ఆదిత్య అడగ్గా.. లేదు అని సౌందర్య చెబుతుంది.
కాల్ చేశాడా అని ఆదిత్య అనగా.. లేదు. నేనే చేశాను. ఏదో పని మీద వెళ్లాడంట అని సౌందర్య అనగా.. వదిన వాళ్ల కోసం పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను అని ఆదిత్య అనగా.. వద్దురా. విషయం బయటకు రాకుండా ఎంక్వైరీ చేయించమని నేను ఆల్రెడీ కమిషనర్ గారితో చెప్పానురా అని సౌందర్య అనగా.. దొరకాలి. మురళీకృష్ణకు, పోలీసులకు ఎవరికో ఒకరికి దొరకాలి అని ఆనందరావు అంటాడు.
ఇక దీప బండి దగ్గర వాళ్లకు ఎంత కష్టం అవుతుందో అని పైకి లేస్తుండగా.. అమ్మ ఎక్కడికి అని సౌర్య అడుగుతుంది. నువ్వు అరవకు అత్తమ్మా. బండి దగ్గర వాళ్లకు ఇబ్బంది అవుతూ ఉంటుంది అని దగ్గుతూబయటకు వెళుతూ ఉంటుంది. బయటి నుంచి కార్తీక్, హిమను తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. దీప అవస్థను కార్తీక్ చూస్తాడు. ఇక సౌర్య వచ్చి ఏమైందమ్మా అని నీళ్ల కోసం మళ్లీ లోపలికి వెళుతుంది. హిమ కూడా దీప దగ్గరకు పరుగెత్తి అమ్మా నాన్న వచ్చాడమ్మా అని చెబుతుంది. కళ్లు నలుముకొని కార్తీక్‌ను చూస్తుంది దీప. అతడి దగ్గరకు వెళ్లి హత్తుకొని గుండెపై వాలిపోతుంది. కార్తీక్ కూడా హత్తుకుంటాడు. అయితే అది కల అని దీపకు తెలుస్తుంది. ఇక సౌర్య నాన్న అంటూ కార్తీక్ దగ్గరకు పరుగెత్తుతుంది. ఇక దీప కార్తీక్‌కు కష్టపడి కుర్చీ వేసి కూర్చోండి అని అంటుంది. కార్తీక్ పిల్లలను ఇద్దరిని దగ్గరకు తీసుకుంటాడు. కాఫీ తెస్తాను అని దీప లోపలికి వెళుతుండగా.. ఆమె చేయిని పట్టుకుంటాడు. అదే సమయానికి అటుగా మురళీకృష్ణ వస్తాడు. ఇక దీప మణికట్టును పరిశీలించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి కళ్లు చూస్తాడు. టెస్ట్‌లు ఏమైనా చేయించారా అని కార్తీక్ అడగ్గా.. బ్లడ్ టెస్ట్ చేయించాము అని మురళీకృష్ణ అంటాడు. మీరు లోపలికి పదండి బాబు అని మురళీకృష్ణ అనగా.. పిల్లలిద్దరు కార్తీక్‌కు లోపలికి తీసుకెళతారు. ఇక మురళీకృష్ణను పట్టుకొని దీప ఏడుస్తుంటుంది. ఆమెను లోపలికి తీసుకెళతాడు మురళీకృష్ణ.
ఇక ప్రియమణి, మోనితకు దోసె తీసుకొని రాగా.. ఆమె తినదు. ఏమైందమ్మా తినకుండా ఉన్నారు అని ప్రియమణి అడగ్గా.. ఏదో అయ్యింది. ప్రపంచం మారిపోతుంది. మనుషులు మారిపోతున్నారు. మంచి తనానికి మంచి రోజులు రాబోతున్నాయి. నాలాంటి దానికి చివరకు ఏ గతి పడుతుందో అని మోనిత అనగా.. అదేంటమ్మా మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు అని ప్రియమణి అంటుంది. నన్ను ఎవ్వరూ తిట్టకముందే నన్ను నేను తిట్టుకుంటున్నాను అని మోనిత అనగా.. అసలు ఇప్పుడు ఏమైందని అని ప్రియమణి అడుగుతుంది. దానికి మోనిత.. నా కార్తీక్ మారిపోయాడు. నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నాకు తిరిగి ఫోన్ చేయడం లేదు. మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వడం లేదు. నన్ను అవాయిడ్ చేస్తున్నాడా.. ఎందుకు, ఏమైంది, ఏం జరిగింది అని అంటుంది. డాక్టర్ కదా అమ్మా బిజీగాఉన్నారేమో అని ప్రియమణి అనగా.. నిన్నటిదాకా డాక్టర్ కాదా. తల్లి మీద కోపంతో వచ్చేవాడు, భార్య మీద ఫ్రస్టేషన్‌తో వచ్చేవాడు, పిల్లల మీద బెంగతో వచ్చేవాడు, అత్తాకోడళ్లు ఒక్కటయ్యారని చెప్పుకోవడానికి వచ్చేవాడు. నా చెప్పుడు మాటలు వినడానికి వచ్చేవాడు. ఇప్పుడు ఏమైంది, ఎందుకు రావడం లేదు, ఎందుకు ఫోన్ చేయడం లేదు అని మోనిత అనగా.. మీరేమైనా నోరు జారి ఏమైనా అన్నారేమో అని ప్రియమణి అడగ్గా.. అయినా నేను నోరు జారితో అప్పుడే తిట్టేవాడు, తరువాత మర్చిపోయేవాడు, కోపం వచ్చినా సాయంత్రానికి కూల్ అయ్యేవాడు అని మోనిత అనగా.. బాధపడకండి అమ్మా. కార్తీక్ అయ్య ఈ దగ్గరకు రాకుండా ఉండటం అన్నది కుదరని పని అని ప్రియమణి అనగా.. ఏంటో ప్రియమణి, నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. ఊరెళ్లే ముందు బాగానే మాట్లాడుకున్నాము. ఊరెళ్లి వచ్చాక కలిసిందే లేదు. ఏదోకారణం ఉండే ఉంటుంది. మంచి వాళ్లు దేవుడిని ఏదైనా కోరుకుంటే వెంటనే తీరిపోయే కాలం వచ్చేసింది. నాకు వ్యతిరేకంగానో, దీపకు మంచి జరగాలనో ఎవరో కోరుకుంటున్నారేమో అని మోనిత అనగా.. ఏం కాదేలే అమ్మా. ముందు మీరు టిఫిన్ చేయండి అని ప్రియమణి అంటుంది.
ఇక సౌందర్య ఇంట్లో దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకో ఎడమ కన్ను అదురుతోంది. ఇటువంటివి నమ్మకపోయినా మాటిమాటికి మనసు చెదిరిపోతుంది. గుండె బరువు ఎక్కి పోతుంది. కడుపు నిండా భయం, కంటి నిండా కన్నీటి మయం. ఎందుకు స్వామి, ఏం జరుగుతోంది. ఏం జరగబోతోంది. అంతా అశుభం జరగబోతుందన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ఇంటికి ఏ అనర్థం రాబోతుంది. ఇప్పటికే ఈ ఇల్లు కొంతమంది వ్యక్తులు కలిసి ఉన్నట్లుగా ఉంది తప్ప సంపూర్ణమైన కుటుంబంలా లేదు. కాపురం విచ్ఛిన్నమై పెద్ద కోడలు, మనసు వికలమై నా పెద్ద కొడుకు, తల్లి దగ్గరుండి తండ్రి కోసం తపించే పిల్లలు. ఒక్క సాయం, ఒకే ఒక్క సాయం చేయి స్వామి. ఒక్కసారి అందరినీ కలుపు, ఆ తరువాత తల్లి పక్షి తన రెక్కల కింద పిల్లలను రక్షించుకున్నట్లు నేను నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. నా వంశాన్ని నిలబెట్టుకుంటాను అని ఏడుస్తుంది. ఇక హాల్లోకి రాగా.. అక్కడ శ్రావ్య ఉంటుంది. శ్రావ్య ఏదో ఆలోచిస్తూ ఉండగా.. ఏంటి ఆలోచిస్తున్నావు అని సౌందర్య అడుగుతుంది. అన్నీ బావుంటే ఈ శుక్రవారం మా అమ్మ వ్రతం చేసుకునేది, మనల్ని పిలిచేది, అక్కను కూడా నాన్న తీసుకొచ్చేవారు. ఇలా ఎవరికి వాళ్లం అయిపోయాము కదా. ఎందుకులే అని వదిలేసింది. పైగా నాన్న కూడా లేడు కదా అని శ్రావ్య అంటుంది. దానికి సౌందర్య.. ఏమో భగవంతుడు కరుణిస్తే అందరినీ పిలిచి మీ అమ్మ వ్రతం చేయిస్తుంది. దీప, పిల్లలు మన ఇంటికి వస్తారేమో అని అనగా.. ఏమో, బావగారు మారేదాకా ఏమో, ఆయన మారరని తెలిసి వస్తారేమో, అందరం కలుస్తామేమో అని శ్రావ్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళుతుంది.
మరోవైపు మురళీకృష్ణ బండి దగ్గర పని చేస్తుండగా.. కార్తీక్ వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. మీ ఉద్యోగం ఏంటి, మీరు చేసే పని ఏంటి, ఏంటి ఇది అని కార్తీక్ అడగ్గా.. కన్న రుణం అని మురళీకృష్ణ అంటాడు. అయితే అని కార్తీక్ అనగా.. మీరు వదిలేసినట్లు నేను వదిలేయలేను కదా బాబు. కన్న తండ్రిని కదా నా కూతురు కష్టపడుతుంటే చూడలేకపోయాను. హిమ కష్టపడుతుంటే మీ మనసు చువుక్కుమనదా. నేను అంతే. తండ్రే అంత అని మురళీకృష్ణ అంటాడు. మీకు వీళ్లు ఎక్కడున్నది తెలీదన్నారు అని కార్తీక్ అడగ్గా.. మీరు అడినప్పుడు నిజంగా తెలీదు బాబు అని మురళీకృష్ణ అనగా.. మరి ఎప్పుడు తెలిసింది అని కార్తీక్ అడగ్గా.. ఒకరోజు మీ అమ్మ గారు నా దగ్గరకు వచ్చారు అని డబ్బులిచ్చి దీపను వెతకమని చెప్పిన విషయం చెబుతాడు. అలా ప్రతి ఊరు వెతుకుతూ, ఫొటోలు చూపిస్తూ ప్రయాణాలు చేస్తూ ఉంటే ఎవరో ఒక ఆవిడ ఫొటోలు చూపిస్తే, విజయనగరంలో దిగితే నేనే సామాను అందించానని చెప్పింది. ఈ ఊర్లో దిగి వెతికి పట్టుకోవడానికి ఒక రోజు పట్టింది అని మురళీకృష్ణ చెబుతాడు. దాంతో కార్తీక్ మనసులో.. అయితే వీళ్లు ఎక్కడున్నది మమ్మీకి తెలీదా. నేను ఇన్ని రోజులుగా అనుమానించి మమ్మీని బాధపెట్టాను. నేను ఎంత మూర్ఖుడిలా కనిపించి ఉంటాను మమ్మీ కళ్లకు అనుకుంటాడు. ఆ తరువాత మరి వెతికి పట్టుకున్న వారు మమ్మీకి ఫోన్ చేసి చెప్పారా అని కార్తీక్ అడగ్గా.. లేదు బాబు అని మురళీకృష్ణ అంటాడు. ఎందుకు, మిమ్మల్ని నమ్మి వెతకమని పంపిస్తే మీరు వచ్చి మిర్చి బజ్జీలు వేసుకుంటూ, దోసెలు పోసుకుంటూ ఏంటండి ఇది అని కార్తీక్ అడుగుతాడు. చెప్పాలనే అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను బాబు మురళీకృష్ణ అడగ్గా.. ఎందుకు అని కార్తీక్ అడుగుతాడు. ఎందుకంటే ఏం చెప్పను బాబు. మీ అమ్మ గారికి కోడలు కావాలి, మనవరాళ్లు కావాలి. మీకు మాత్రం మీ కూతుళ్లు కావాలి. నా కూతుళ్లు అక్కర్లేదు. మీరేమో మీ అమ్మ గారి మాట వినరు. దీప ఇంత దూరం వచ్చి ఈ కష్టాన్ని తలకెత్తుకొని అర్ధరాత్రి పడుకొని చీకటితోనే లేచి రోజు రోజంతా గొడ్డుచాకిరి చేసి ఎండలో కష్టపడి ఆరోగ్యాన్ని బలి చేసుకుంది. ఇదంతా ఎవరి కోసం తన బిడ్డల భవిష్యత్ కోసమే కదా. వారిని ఆ ఛాయలకు కూడా రాకుండా డాక్టర్ బాబు బిడ్డలలాగానే పెంచాలనుకుంది. వాళ్ల మీదే అన్ని ఆశలు పెట్టుకున్న దీప.. మీరు వచ్చి మీకు మీ కూతుళ్లే కావాలి అంటే ఏమైపోతుంది బాబు. ఒంటరిది అయిపోతుంది. అప్పుడు ఎవరి కోసం బతుకుంది అని మురళీకృష్ణ అంటాడు. కార్తీక దీపం కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News