హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: మౌనిత‌ను గుర్తుప‌ట్టిన అంజి.. 'కార్తీకదీపం'లో అసలైన ట్విస్ట్ అదిరిపోయిందిగా

Karthika Deepam: మౌనిత‌ను గుర్తుప‌ట్టిన అంజి.. 'కార్తీకదీపం'లో అసలైన ట్విస్ట్ అదిరిపోయిందిగా

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక‌దీపం(Karthika Deepam) సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. హిమ‌(Hima)ను క‌ల‌వ‌రిస్తూ కార్తీక్(Karthik) బాధ‌ప‌డుతూ ఉండ‌టం చూసిన సౌంద‌ర్య‌(Soundarya).. అత‌డికి గ‌ట్టి క్లాస్ తీసుకుంటుంది

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక‌దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. హిమ‌ను క‌ల‌వ‌రిస్తూ కార్తీక్ బాధ‌ప‌డుతూ ఉండ‌టం చూసిన సౌంద‌ర్య‌.. అత‌డికి గ‌ట్టి క్లాస్ తీసుకుంటుంది. నీ మూర్ఖ‌త్వంతో దీప‌, ఆ పిల్ల‌ల‌కు శిక్ష వేస్తున్నావు అంటూ గ‌ట్టిగా మాట్లాడుతుంది. నీ పురుషాహంకారాన్ని త‌రిమికొట్టు. తండ్రిగా మారిపోయి నీ బిడ్డ‌ను నువ్వు తీసుకురా. నీలో ఈ అస్థిమిత‌మైన ఆలోచ‌న‌లు అన్నీ పోతాయి. క్ష‌మించు. దీప‌ను క్ష‌మించు. ఆ మ‌హా ఇల్లాలిని క్ష‌మించు అని సౌంద‌ర్య చెబుతుంది. వెంట‌నే కార్తీక్.. క్ష‌మిస్తాను, దీప‌ను క్ష‌మిస్తాను, త‌ప్ప‌కుండా క్ష‌మిస్తాను. కానీ అది త‌ప్పు చేసింద‌ని నా ముందు ఒప్పుకోమ‌ను. క్ష‌మిస్తాను. నా ఒక్క‌డి ముందే ఒప్పుకోమ‌ను. ప్ర‌పంచానికి అంతా పతివ్ర‌త‌లాగే ఉండ‌నివ్వు. నా ముందు మాత్ర‌మే ఒప్పుకోమ‌ను. త‌ప్ప‌కుండా క్ష‌మిస్తాను అని అంటాడు. దాంతో సౌంద‌ర్య షాక్‌కి గుర‌వుతుంది. నిప్పుల్లోకి దూకితే శీల ప‌రీక్ష‌, నిప్పుల్లోకి తోస్తే అది శిక్ష‌. వీట‌న్నింటికి అతీతంగా ఆలోచించ‌గ‌ల మ‌న‌స్త‌త్వం ఎప్పుడు వ‌స్తుందిరా నీకు. ఉన్న‌తంగా ఆలోచించ‌రా.. అంతెత్తున ఉంటావు అని అంటుంది.

  నాకు శిఖ‌రాగ్రాన సింహాస‌నం వేయ‌క్క‌ర్లేదు. నన్ను న‌న్నుగానే ఉండ‌నివ్వు అమ్మా. ఉన్న‌తంగా ఉన్నంత‌మాత్రాన నాకు ద‌క్కిందేంటి..? పాతాళంలోకి ప‌డిపోయింది నా వ్య‌క్తిత్వం. అంత‌గా దిగ‌జార్చింది ఎవ‌రు. అదే క‌దా. ఉన్న‌తంగా ఆలోచించ‌డం అంటే ఏంటి మ‌మ్మీ. నా క‌ళ్ల‌ముందే త‌ప్పుచేసినా. క్షమించి స‌ర్దుకుపోయేంత ఔన్న‌త్యం చూపించ‌డ‌మా..? నేనేమీ మ‌హాపురుషుడిని కాదు. కార‌ణ‌జ‌న్ముడిని కాదు మ‌మ్మీ. మామూలు మ‌నిషిని. నాకు అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. త‌ప్పుకు అర్థం తెలుసు, ఒప్పుకు అర్థం తెలుసు. ఏది నైతిక‌మో.. ఏది అనైతిక‌మో. అన్నీ తెలుసు. అందుకే నేను ఇలా ఉన్నాను. నీ క‌ళ్ల‌కు రాయిలా ఉన్నాను. ఎలా పెంచాను హిమ‌ను, ఈ చేతుల‌తోనే క‌దా ఎత్తుకున్న‌ది. ఎలా ఆడించాను, ఈ గుండెల మీద‌నే క‌దా. ఎంత పొంగిపోయాను. నాలో ఊపిరి ఉన్నంత‌వ‌ర‌కు డాడీ అని పిలుస్తుంద‌నే క‌దా. మోసం మ‌మ్మీ, అన్యాయం, గుండెలో మంట‌, తల్లో న‌రాలు చిట్లిపోతాయోన‌న్న బాధ‌, మ‌న‌సంతా ఊగిస‌లాట‌, ప్రేమ అంతా ఏమైపోయింది. ఉంది. అలానే ఉంది. చూడాల‌నే ఉంది. హిమ‌ను బిడ్డ‌లా చూసుకోవాల‌నే ఉంది. కానీ.. కానీ. హిమ దాని కూతురు అయిపోయింది మ‌మ్మీ. ఇప్పుడు హిమ‌ను ర‌మ్మంటే దాన్ని కూడా ర‌మ్మ‌న‌ట్లే లెక్క‌. అన‌లేను. నేను అన‌లేను. నా వ‌ల్ల కాదు అని కార్తీక్ బాధ‌పడుతూ వెళ‌తాడు.

  మ‌రోవైపు కార్తీక్ ఇంటికి వెళ్లేందుకు మౌనిత రెడీ అవుతుండ‌గా.. ఎక్క‌డికి వెళుతున్నార‌మ్మా అని ప్రియ‌మ‌ణి అడుగుతుంది. కార్తీక్ ఇంటికి అని మౌనిత చెప్ప‌గా.. ఎందుకు కార్తీక్ అయ్య ర‌మ్మ‌న్నాడా అని ప్రియ‌మ‌ణి ప్ర‌శ్నిస్తుంది. లేదు కార్తీక్ వాళ్ల అమ్మ ఫోన్ చేసి ర‌మ్మంది అని చెబుతుంది. అవునా.. ఎందుకు మీరు అక్క‌డి వెళ్ల‌డం ప్ర‌మాద‌కరం అనిపిస్తుంది అని ప్రియ‌మ‌ణి చెప్ప‌గా.. తొక్క‌లే ప్రియమ‌ణి.. ఎవ‌రు ప్ర‌మాదంలో లేరు. ప్ర‌పంచం మొత్తం ప్ర‌మాదంలో ఉంది వేదాంతం చెబుతుంది. నేను మీ గురించి చెబుతున్నా అని ప్రియ‌మ‌ణి చెప్ప‌గా.. నేనేతో ఆ ఇంటిని భ్ర‌ష్టుప‌ట్టిస్తున్న‌ట్లు మాట్లాడ‌తావేంటి..? డాక్ట‌ర్ బాబు నా మాయ‌లో ప‌డ్డాడ‌ని ఊరంతా కోడై కూస్తోంది. కానీ నిజంగా కార్తీక్ నా మాయ‌లో ప‌డి ఉంటే.. నాకు ఏదైనా చెప్పి చేసేవాడు.. నా జీవితం ఇలా త‌గ‌ల‌బ‌డేది కాదంటూ ఫ్ర‌స్టేష‌న్‌లో మాట్లాడి అక్క‌డి నుంచి వెళుతుంది. ప్రియ‌మ‌ణి.. దేవుగా మా మౌనిత‌మ్మ కోరిక నెర‌వేరేలా చూడు స్వామి. మౌనిత‌, కార్తీక్ బాబు క‌లిసేలా చూడు అని కోరుకుంటుంది.

  ఇక త‌న బ‌ట్ట‌ల‌ను స‌ర్దుకున్న హిమ‌.. సౌంద‌ర్య ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతుంది. న‌న్ను ఆ ఇంట్లో వ‌దిలేయ‌మ‌ని వార‌ణాసికి చెప్పు, నేను ఇక్క‌డ ఉండ‌లేక‌పోతున్నాను అని హిమ ఏడుస్తుంది. త‌రువాత దీప ద‌గ్గ‌ర‌కు వెళ్లి హ‌త్తుకొని నాకు డాడీ కావాలి అని ఏడుస్తుంది. నేను వెళ్తాన‌మ్మా. డాడీని చూస్తాను. నాకు బాగా గుర్తు వ‌స్తున్నాడు. అస‌లు డాడీకి నా మీద కోపం ఏంట‌మ్మా. నాకే అప్పుడప్పుడు డాడీ మీద కోపం వ‌స్తుంది. కానీ వెంట‌నే పోతుంది. మాట్లాడ‌కుండా ఇద్ద‌రం ఉండ‌లేము క‌దా అమ్మా. న‌న్ను పంపించేయ‌మ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. హిమ‌తో పాటు సౌర్య కూడా ఏడుస్తుండ‌గా.. ఆపండి

  న‌న్ను ఇలా చిత్ర‌వ‌ధ చేయ‌కండి. ఇలాగైనా బ్ర‌త‌క‌నివ్వండి. నా బ‌తుకునిండా స‌ముద్ర‌మంత‌ ఏడుపు నిండి పోయింది. పిల్ల‌కాలువ‌ల్లా మీ ఏడుపు ఏంటి. నాలోకి వ‌చ్చి క‌లుస్తుంది. ఎంత దుఃఖాన్ని ఈ గుండెల్లో మోయాలి..? ఎంత బాధ‌ను ఇంకా నేను మోస్తూనే ఉండాలి..? నేను మ‌నిషినే. నా వ‌ల్ల కావ‌డం లేదు. న‌న్ను ఇంకా ఇంకా ఏడిపించ‌కండి. మీకు దండం పెడ‌తాను. అయినా నేను అక్క‌డికి వెళ్ల‌లేను. నేను వ‌స్తే మీ నాన్న ఇల్లు వ‌దిలి వెళ‌తాడు. నువ్వేమో డాడీ కావాలంటాడు..? నేనేమో భ‌ర్త కావాలంటాను..? ఆయ‌నేమో నిజం కావాలంటాడు..? నా బ‌తుకేమో ఇలా త‌గ‌ల‌బ‌డింది. ఏం చేయాలి..? ఎందులో దూకాలి..? ఏ దారి క‌నిపించ‌డం లేదు. ఏ సాక్ష్యం దొర‌క‌డం లేదు. మీ నాన్న‌కు కోపం పోగొట్టే మార్గం కోసం నేను ఎదురుచూస్తున్నా. ఎప్ప‌టిదాకా నేను ఈ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతూఉండాలో తెలీదు. నేను ఏ త‌ప్పు చేయ‌లేదు కానీ చెబితే విన‌రు. నేనే పాపం చేయ‌లేదు. కానీ శిక్ష అనుభ‌వించాలి. ఈ పేద‌రికంతో పోట్లాడాలి. నా గుండెల్లో ర‌గిలే మంట‌ను మోయాలి. మీ అమాయ‌క‌మైన క‌ళ్ల‌లో కనిపించే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు చెప్పాలి. ఎన్ని మాట‌లు, ఎన్ని గొడ‌వ‌లు, ఎన్ని అనుమానాలు, ఎన్ని ప్ర‌శ్న‌లు న‌న్ను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో తెలీదు. ఎలా మిమ్మ‌ల్ని స‌ముదాయించ‌ను. నాకు నా భ‌ర్త కావాలి. నా బిడ్డ‌ల‌కు తండ్రి కావాలి. నేను అంద‌రిలా భ‌ర్త పిల్ల‌ల‌తో క‌లిసి నా ఇంట్లో నేను ఉండాలి. ఈ ఆశ‌ల‌న్నీ తీరేది ఎలా..? ఈ కోరిక‌ల‌న్నీ నెర‌వేరేది ఎలా..? అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. వెంట‌నే సౌర్య‌.. నువ్వు ఏడ‌వ‌క‌మ్మా.. నాకు భ‌య‌మేస్తుంది. హిమ చిన్న‌పిల్ల క‌దా తెలీక నాన్న గురించి అడిగి ఉంటుంది నువ్వు ఏడ్చ‌క‌మ్మా. నేను అడ‌గ‌ను. హిమ‌ను కూడా అడ‌గ‌ద్ద‌ని చెబుతా. బాధ‌ప‌డ‌క‌మ్మా అని ఏడుస్తుంది. హిమ కూడా నేను నిన్ను ఏడిపించ‌ను అమ్మా. వెళ్తా అని అడ‌గ‌న‌మ్మా. నువ్వు ఏడ్చ‌క‌మ్మా అని చెబుతుంది. ఒక్క‌టి న‌మ్మండి. మ‌న‌మంద‌రం క‌లిసే ఉంటాము. మీ డాడీతో క‌లిసే ఉంటాము. అది ద‌గ్గ‌ర్లోనే ఉంది. అప్ప‌టిదాకా నన్ను మీ ప్ర‌శ్న‌ల‌తో బాధ‌పెట్ట‌కండి అని చెబుతుంది.

  ఇక కార్తీక్ ఇంటికి వచ్చిన డాక్టర్లు.. డాక్ట‌ర్ల అసోషియేష‌న్‌కి కార్తీక్‌ని ఏక‌గ్రీవంగా ఎంచుకున్న‌ట్లు చెబుతారు. నాకు ఒక్క మాట కూడా చెప్ప‌లేదు అని కార్తీక్ అడ‌గ్గా.. మేము అంద‌రం మీ పేరే అనుకున్నాము. ఇక ఎందుకులే అని చెప్ప‌లేదు అని వారు అంటారు. కానీ నేను అంత యాక్టివ్‌గా ఉండ‌లేను. నాకు ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్ ఉన్నాయి. రేపు అభినంద‌న స‌భ కూడా ఉంది అని చెబుతారు. ఇక ఎపిసోడ్‌లో అస‌లైన ట్విస్ట్ ఇప్పుడు వ‌స్తుంది. మౌనిత‌, అంజి ఇద్ద‌రు ఒక‌రినొక‌రు ఢీకొంటారు. మౌనిత‌ను గుర్తుప‌ట్టిన అంజి.. నువ్వా.. నీ కోస‌మే వెతుకుతున్నా. న‌న్ను క‌న్‌ఫ్యూజ్ చేస్తూ త‌ప్పించుకొని తిరుగుతుంది నువ్వేన‌ని ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వ‌చ్చింది. అని చెబుతాడు. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో డాక్ట‌ర్లు హిమ‌ను కూడా ఈ ఫంక్ష‌న్‌కి తీసుకుర‌మ్మ‌ని కోరడం, సౌంద‌ర్య కాల్ చేస్తే హిమ నేను రాన‌ని చెప్ప‌డం చూపించారు.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

  ఉత్తమ కథలు