హోమ్ /వార్తలు /సినిమా /

Kartika Deepam: అలాగైతేనే వ‌స్తాన‌ని ఖ‌రాఖండిగా చెప్పేసిన హిమ‌.. శోకంలో కార్తీక్.. మౌనిత మ‌రో కుట్ర‌

Kartika Deepam: అలాగైతేనే వ‌స్తాన‌ని ఖ‌రాఖండిగా చెప్పేసిన హిమ‌.. శోకంలో కార్తీక్.. మౌనిత మ‌రో కుట్ర‌

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకున్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకున‌నే ప‌నిలో దీప‌.. దీప, కార్తీక్‌ల‌ను విడ‌దీయాల‌ని మౌనిత ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఇదే క‌రెక్ట్ స‌మ‌యం మౌనిత గురించి డాక్ట‌ర్ బాబుకు చెబితే, దాన్ని పెళ్లి చేసుకోడు అనుకుంటాడు

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకున్న కార్తీక దీపం సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకున‌నే ప‌నిలో దీప‌.. దీప, కార్తీక్‌ల‌ను విడ‌దీయాల‌ని మౌనిత ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఇదే క‌రెక్ట్ స‌మ‌యం మౌనిత గురించి డాక్ట‌ర్ బాబుకు చెబితే, దాన్ని పెళ్లి చేసుకోడు అనుకుంటాడు. వెంట‌నే లేదు కార్తీక్ బాబు మౌనిత మ‌త్తులో ఉన్నాడు, చెబితే నా మాట న‌మ్మ‌డు. మౌనిత ఏదో క‌థ చెబుతుంది. ఆవిడ మాటే న‌మ్ముతాడు. మ‌రి ఎలా అనుకుంటూ ఉంటాడు. అస‌లు వాళ్ల‌కు, వీళ్ల‌కు చెప్ప‌డం ఎందుకు ధైర్యంగా దీప‌మ్మ‌కు చెప్పేస్తా. కార్తీక్ చ‌దువుకొనే రోజుల్లో ప్రేమించిన హిమ అనే అమ్మాయిని, మౌనిత‌నే చంపించింద‌ని చెప్పేస్తా. ఆ హిమ మీద ప్రేమతోనే కూతురికి కూడా హిమ అని పేరు పెట్టుకున్నాడు అని చెప్పేస్తా. య‌స్ దీప‌మ్మ‌కే చెప్పేస్తా అని అనుకుంటాడు.

  ఇక దీప ఇంట్లోకి వెళుతుండ‌గా.. టీపాయ్ త‌గులుతుంది. ఆ నొప్పితో దీప బాధ‌ప‌డుతుండ‌గా, తన మెడ‌లో ఉన్న తాళిని చూసి కార్తీక్‌ని గుర్తు చేసుకుంది. ఆద‌ర్శ‌మూర్తి, పురుషోత్త‌మా, పుణ్య పురుషా ఎక్క‌డ‌య్యా నీ ఆద‌ర్శం.. ఏద‌య్యా వంశోద్ధార‌క నీ సున్నిత‌మైన హృద‌యం, ఏమైంద‌య్యా దేశోద్ధార‌కా.. నా ఆత్మ‌స్థైర్యాన్ని చూడ‌గ‌ల ఆ ఔన్న‌త్యం. అంతా బున‌కే. ఆరు నెల‌ల కాపురం, ఆట‌లో అర‌టిపండు. అది ఆట అయినా బావుండు, బొమ్మ‌లాట అయినా బావుండు, బొమ్మ‌ల పెళ్లి అయ్యిందే. పెళ్లి కూతురు బొమ్మ అమ్మ అయ్యిందే, పెళ్లి కొడుకు బొమ్మ మౌనిత అనే ఇంకో పెళ్లి కూతురు కోసం వెతుకుతోందే.. ఆటలుగా ఉందా..? అగ్నిహోత్రంతో ఆట‌లా..? అగ్నిపునీత‌తో ఆట‌లా..? అగ్నిప‌ర్వ‌తంపై ఆట‌లా..? చావ‌లా.. ఆశ చావ‌లా.. ప్రేమ చావ‌లా.. కాపురం మీద న‌మ్మ‌కం చావాలా.. బిడ్డ‌ల మీద మ‌మ‌కారం చావ‌లా.. ఉంది. ఇంకా ఉంది, నాలో న‌మ్మ‌కం మిగిలే ఉంది. ఈ శ‌త‌మానం సాక్షిగా మీ మీద అభిమానం అలాగే ఉంది అని ఏడుస్తూ తాళిని క‌ళ్ల‌కు అద్దుకుంటుంది.

  ఇక ఉద‌యం నీళ్లు రాక‌పోవ‌డంతో దీప.. ఏంటి ఇవాళ కూడా నీళ్లు రావా..? ఏ ప‌ని అవ్వ‌లేదు, పిల్లలు ఇంకా మొహాలు క‌డుక్కోవాలి, స్నానాలు చేయాలి..? అయ్యో ఇప్పుడు ఎలా..? అని స‌రోజక్క‌కు ఫోన్ చేస్తుంది. స‌రోజక్క నీళ్లు రావ‌డం లేదంటే.. నీళ్లు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు రావని ఆమె చెబుతుంది. అందుకే నేను వీధి చివర ఉన్న ప‌బ్లిక్ కొళాయి ద‌గ్గ‌ర ఉన్నా నువ్వు రా అంటుంది. అయితే అక్క‌డ ర‌వ‌ణ‌మ్మ పార్టీ ఉందా..? అని అడుగుతుంది. అవున‌ని స‌రోజ చెప్ప‌గా.. అయితే నేను రాను, ఒక వంద బిందెల వ‌ర‌కు వాళ్లే ప‌డ‌తారు, నేను పొద్దున్నే గొడ‌వ‌ప‌డ‌లేను అంటుంది. నేనున్నాను రా అని స‌రోజ‌క్క అంటే వ‌ద్దులే అని చెబుతుంది. మ‌రి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఏం చేస్తావు..? వ‌ంట లేకుండా జపం చేస్తావా.? అని స‌రోజ‌క్క అడుగుతుంది. అదే ఆలోచిస్తున్నాన‌ని దీప చెబుతుంది. దానికి స‌రోజ‌క్క‌.. నీతో పాటు సౌర్య‌ను తీసుకురా, ర‌వ‌ణ‌మ్మ‌కు అదే క‌రెక్ట్‌గా స‌మాధానం చెబుతుంది అని స‌రోజ‌క్క అంటే స‌రేన‌ని దీప అంటుంది.

  ఇక ఉద‌యం లేచిన కార్తీక్‌ని.. గుడ్‌మార్నింగ్‌రా పెద్దోడా, కాఫీ తాగుతావా అని సౌంద‌ర్య అడుగుతుంది. ఏంటి ఉద‌యాన్నే లేచావు, ఎవ‌రి మీద అయిన అటాక్ ప్లాన్ చేశావా..? అని కార్తీక్ అడుగుతాడు. అటాక్ మూడ్‌లో ఉంది నువ్వు అని సౌంద‌ర్య చెబుతుంది. వెంట‌నే కార్తీక్.. డాడీ లేవ‌లేదా..? నువ్వైనా ఇంత పొద్దున్నే లేయ‌డం ఎందుకు మ‌మ్మీ, లేచిన ద‌గ్గ‌ర నుంచి ఆ శ్రీరామ్ న‌గ‌ర్ బ‌స్తీ గురించే క‌దా ఆలోచ‌న‌లు.. అవి ఎప్పుడూ ఉండేవే క‌దా అని కార్తీక్ అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. నా ఆలోచ‌న‌లు ఏంటో నీకేం తెలుసు కానీ నువ్వేంటి ఇంత ఉద‌యాన్నే అని సౌంద‌ర్య అడుగుతుంది. మెలుకువ వ‌చ్చేసింది మ‌మ్మీ, ఏంటో మెలుకువ రాగానే ఇంట్లో ఉండ బుద్ది కావడం లేదు. అందుకే ఓ గంట జాగింగో, వాకింగ్‌కో వెళదామ‌ని అని కార్తీక్ అంటాడు.

  దానికి సౌంద‌ర్య‌.. పెద్దోడా నిన్ను చూస్తే జాలి వేస్తుంది. హిమ‌ను మ‌ర్చిపోవ‌డానికి నువ్వు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నావు, దాని మీద ప్రేమ త‌గ్గించుకోవ‌డానికి మా మీద ఎందుకు రా కోపం, ద్వేషం పెంచుకుంటున్నావు అని అడుగుతుంది. వెంట‌నే కార్తీక్.. నాకు ఎవ‌రి మీద కోపం, ద్వేషం లేవు. ఉంటే గింటే అది నా మీద నాకే. కోపంతో పాటు నా మీద నాకే అస‌హ్యం వేస్తోంది అని అంటాడు. వెంటనే సౌంద‌ర్య‌.. ఏ బాద‌రబందీ లేకుండా, అంద‌రితో అటాచ్‌డ్‌గా ఉంటూ, జీవితం సుఖ‌మ‌యం చేసుకుంటున్నావేమో.. అది సుఖ‌మ‌యం కాదు, న‌ర‌కప్రాయ‌మ‌ని తెలుసుకో అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. స్వ‌ర్గంతో నాకు ప‌రిచ‌యం లేక‌పోవ‌చ్చేమో కానీ న‌ర‌కంతో కాదు. దాంతో స‌హ‌జీవ‌నం చేస్తున్నాను మ‌మ్మీ. నాకు న‌ర‌కం తెలీక‌పోవ‌డ‌మేం అని అంటాడు. నీ జీవితాన్ని స్వ‌ర్గ‌మ‌యం చేద్దామ‌ని దీప ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్పుడేమైనా అది స్వ‌ర్గంలో ఉందా.? నాకు ప‌రిచ‌యం చేయ‌డానికి, అయినా అది ఎవ‌ర్తీ అని కార్తీక్ అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. అలా అన‌కురా పెద్దోడా, దాని ప్ర‌య‌త్నాల‌కు వీలైతే స‌హ‌క‌రించు, అప్పుడు నీ జీవితం ప‌ట్ల నీకు క్లారిటీ వ‌స్తుంది అని అంటుంది. దానికి కార్తీక్.. నేను చాలా క్లారిటీగా ఉన్నాను మ‌మ్మీ అంటాడు. ఉండు, అది చేసే ప్ర‌య‌త్నాల‌కు అడ్డు రాకు అని సౌంద‌ర్య అంటుంది.

  వెంట‌నే కార్తీక్.. ఊరుకో మ‌మ్మీ, నేనేం భ్ర‌మ‌లో బ‌త‌క్క‌ట్లేదు, ప‌దేళ్ల త‌రువాత నిజాలు బయ‌ట‌పెట్ట‌డానికి బ‌య‌లుదేరిందా..? మ‌ర్డ‌ర్ చేసిన వాడికి కూడా ఒక వర్ష‌న్ ఉంటుంది మ‌మ్మీ. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది క‌రెక్ట్ అనిపిస్తుంది అని అక్క‌డ నుంచి వెళ్లిపోతాడు.

  మ‌రోవైపు మౌనిత బ‌య‌ట‌కు వెళుతుండ‌గా.. ప్రియ‌మ‌ణి వ‌చ్చి ఎక్క‌డికి వెళుతున్నార‌మ్మా, ఆ సౌంద‌ర్య ఇంటికా అని అడ‌గ్గా.. ఛీ.. మ‌ళ్లీ ఆ ఇంట్లోకి వెళితే అది నా కార్తీక్ భార్య‌గానే అని అంటుంది. మ‌రి ఇప్పుడు ఎక్క‌డికి అని ప్రియ‌మ‌ణి అడ‌గ్గా.. లాయ‌ర్ సుజాత అని, పెళ్లాం మొగుడుల‌ను విడ‌దీయ‌డంలో పెద్ద తోపు అంట, ఫీజు ఎంతైనా ప‌ర్లేదు, అవ‌స‌రం అయితే ఆస్తులు అమ్మేస్తా, కానీ నా కార్తీక్ నాకే ద‌క్కాలి. నా వాడు కావాలి. అది వీధులపాలు అవ్వాలి అని మౌనిత అంటుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే, నువ్వు ఏం చేయ‌క‌పోయినా జ‌రిగేది అనే క‌ద‌మ్మా అని ప్రియ‌మ‌ణి అంటుంది. నో.. నో.. నా సౌంద‌ర్య ఉంది క‌దా, నా కార్తీక్ వ‌దిలేసినా, దాన్ని నెత్తి మీద పెట్టుకుంటుంది అని అంటుంది. మ‌రి ఆవిడ ఉన్న‌న్ని రోజులు మీరేం చేస్తారు అన‌గా.. చేస్తా విడాకులు ప్రియ‌మ‌ణి. దీప నా మీద కేసు పెట్టింది క‌దా, ఆ మ్యాట‌ర్ కూడా మాట్లాడ‌టానికి వెళుతున్నా. ఇన్ని రోజులు కాస్తో కూస్తో న‌మ్మ‌కం ఉండేది. నా కార్తీక్ క‌దా అని, ఈ చెత్తంతా ఎందుకులే అనుకున్నా, కానీ నా మీద కంప్లైంట్ ఇచ్చాక కూడా ఊరుకున్నానంటే నేను చేత‌కానిదాన్ని కాదు, అరె నన్ను డాక్ట‌ర్‌లా చూడ‌టం కూడా మానేశారు, అస‌లు మ‌నిషిగా కూడా గుర్తించ‌డం లేదు అని మౌనిత చెబుతుండ‌గా.. ఇది మాత్రం నిజ‌మ‌మ్మా అని ప్రియ‌మ‌ణి అంటుంది. వెంట‌నే మౌనిత‌..య‌హ‌.. నువ్వొక‌దానికి, ఇదొక్క‌టే నిజం కాదు. ఇప్ప‌టిదాకా నేను చెప్పిన‌వ‌న్నీ నిజాలు అని చెబుతుంది.

  ఆ త‌రువాత మ‌న‌సులో దీప‌, విహారికి ఉన్న రిలేష‌న్ గురించే క‌దా కార్తీక్ నువ్వు అడిగావు, కావాలంటే లాయ‌ర్ సుజాత‌తో ఈ విష‌యం కూడా చెప్పి, నిజ‌మ‌ని చెప్పిస్తా అనుకుంటుంది. ఇక దీప‌, సౌర్య‌, హిమ ముగ్గురు నీళ్లు మోసుకుంటూ వ‌స్తుంటారు. కార్తీక్ కారులో వెళుతూ.. పిల్ల‌లిద్ద‌రు నీళ్లు మోయడం చూస్తాడు. ఇక దీప‌.. హిమ నిన్ను తీసుకురావ‌ద్ద‌ని చెప్పాను క‌దా.. నీకు ఇవ‌న్నీ అలవాటు లేదు, దింపేసెయ్, నేను మ‌ళ్లీ వ‌చ్చి తీసుకొస్తాను క‌దా అని అంటుంది. వెంట‌నే హిమ‌.. నువ్వొక‌దానివే ఎన్ని సార్లు అని తిరుగుతావు అమ్మా, పెద్ద‌గా బ‌రువేం లేవు అని అంటుంది. దానికి సౌర్య‌.. పోనిలే అమ్మా.. స‌ర‌దాగా ఉందేమో త‌న‌కి అని అన‌గా.. కావాలంటే స్పీడ్‌గా కూడా న‌డ‌వ‌గ‌ల‌ను అని న‌డుస్తూ కింద ప‌డుతుంది. వెంట‌నే కార్తీక్ కారులో నుంచి దిగి ప‌రుగెత్తుకుంటూ వ‌స్తాడు. ఏంట‌మ్మా ఇది, ఏం ఖ‌ర్మ‌రా ఇది. ఎలా పెరిగావురా, ఎలా బ‌తుకుతున్నావురా, ఎందుకురా న‌న్ను ఇలా చిత్ర‌వ‌ధ చేస్తున్నావు, ఏంట‌మ్మా ఇది అని బాధ‌ప‌డుతాడు. దీప ద‌గ్గ‌ర‌కు వెళ్లి చెంప చెల్లుమ‌నిపిస్తాడు.ద వెంట‌నే పిల్ల‌లిద్ద‌రు దీప‌ను హ‌త్తుకుంటారు.

  త‌రువాత కార్తీక్.. ఏంటే ఇది, ఇలాగేనా హిమ‌ను నేను పెంచింది, ఇంత దారుణంగా క‌ష్ట‌పెడ‌తావా..? నా కూతురిని, నీ బ‌తుకు ఎలాగూ త‌గ‌లెట్టుకున్నావు, నీతో పాటు దీని బ‌తుకు అర్థం లేకుండా చేశావు..? ఆత్మ‌గౌర‌వం అంటూ రూపాయి తీసుకోకుండా ఈ పేద‌రికంలో ఉంటూ.. ఆఖ‌రికి నా బిడ్డ‌ను తీసుకొచ్చి దానికి ఈ గ‌తి ప‌ట్టిస్తావా..? ఎవ‌రు ఇచ్చారే నీకు ఈ అధికారం..? క‌ంటే స‌రిపోతుందా..? క‌న్న‌ప్రేమ అంటే ఇలానే ఉంటుందా..? ప‌క్షులు, జంతువులు ఏ జీవి కూడా ఇలా పెంచ‌వే.. నా బిడ్డ‌ను హింసిస్తావా..? నా కూతురితో నీళ్లు మోయిస్తావా..? నిన్ను అని చెయ్యి ఎత్త‌బోతుండగా.. డాడీ అని హిమ, నాన్న అని సౌర్య‌ ఆపుతారు.

  ఎందుకు డాడీ మా అమ్మ‌ను కొట్టావు, మా అమ్మ ఏమీ న‌న్ను నీళ్లు తెమ్మ‌ని చెప్ప‌లేదు, వ‌ద్దన్నా నేనే తెచ్చాను అది నీకు తెలుసా.. నీళ్లు రాన‌ప్పుడ‌ల్లా అమ్మ ఇలానే నీళ్లు మోస్తూ ఉంటుంది. సౌర్య కూడా తెచ్చిపోస్తుంటుంది. అది నువ్వు ఎప్పుడైనా చూశావా..? నేను ఇవాళ నీళ్లు తెచ్చాను. కానీ వీళ్లు రోజు క‌ష్ట‌ప‌డుతుంటారు. నేను ఇలా క‌ష్ట‌ప‌డకూడ‌దు అనుకుంటే మ‌మ్మ‌ల్ని అంద‌రినీ మ‌న ఇంటికి తీసుకెళ్లి పోవ‌చ్చు క‌దా అని అంటుంది. వెంట‌నే సౌర్య‌.. అమ్మా వ‌ద్దమ్మా.. హిమ‌ను పంపించేయ్ అమ్మా. నువ్వు ఎంత ప్రేమ‌గా చూసినా, డాక్ట‌ర్ బాబు నిన్ను న‌మ్మ‌డ‌మ్మా.. ఈ తిట్లు, త‌న్నులు నీకు ఎందుక‌మ్మా.. హిమ‌ను పంపించేద్దాం అని ఏడుస్తుంది. ఇక వెంట‌నే హిమ‌.. నేను ఎక్క‌డికి వెళ్ల‌ను సౌర్య.. నేను ఇక్క‌డే మీతోనే ఉంటాను అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. హిమ అన‌గా.. అవును డాడీ.. నేను ఒక్కదాన్నే రాను, మ‌న ఇంటికి అమ్మ‌ను తీసుకొస్తేనే నేను వ‌స్తాను డాడీ.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ అంద‌రం క‌లిసే ఉందాం డాడీ. అమ్మ‌ను, సౌర్య‌ను తీసుకొస్తేనే నేను వ‌స్తాను డాడీ. లేక‌పోతే రాను అని ఖ‌రాఖండిగా చెబుతుంది. దాంతో కార్తీక్ బాధ‌ప‌డుతూ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

  ఇక సుజాత ద‌గ్గ‌ర‌కు వెళ్లి మాట్లాడిన మౌనిత‌.. థ్యాంక్స్ సుజాత గారు. ఫీజు గురించి ఆలోచించ‌కండి. ఎంత‌కావాల‌న్నా ఇస్తా. నా కార్తీక్ నా వాడు కావాలి అని అంటుంది. నా లా చ‌దువుని, లా ప్రాక్టిస్‌ని ప‌ణంగా పెట్టి, కార్తీక్‌ని నీ వాడిని చేస్తా అని సుజాత అన‌గా.. మౌనిత ఆనందంలో పొంగిపోతూ ఉంటుంది. మ‌రోవైపు హిమ మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ కార్తీక్ బాధ‌పడుతూ ఉంటాడు. ఎలా పెంచాను రా నిన్ను, ఎలా చూసుకున్నాను, నువ్వు డాడీ అని పిల‌వ‌లేద‌ని ఎంత‌గా ఏడ్చాను. ఇవాళ ఈ డాడీ క‌న్నా నీకు వాళ్లే ఎక్కువయ్యారా.. నువ్వు వాళ్ల ర‌క్తం క‌దా అందుకే నీకు వాళ్లే ఎక్కువ ఇష్ట‌మైపోయారు అని అనుకుంటాడు. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో హిమ‌ను చంపింది నేనేన‌ని, మౌనిత ఈ ప‌ని చేయించింద‌ని.. అంజి, దీప‌కు చెబుతుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

  ఉత్తమ కథలు