హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: మా అమ్మ పేరు దీప‌.. మా అమ్మా, నాన్న వేరుగా ఉంటారు.. అన్నీ విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన‌ హిమ‌

Karthika Deepam: మా అమ్మ పేరు దీప‌.. మా అమ్మా, నాన్న వేరుగా ఉంటారు.. అన్నీ విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన‌ హిమ‌

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో కార్తీక్ త‌న‌కు స‌న్మానం జ‌రిగే ప్ర‌దేశానికి వెళ్లి హిమ కోసం చూస్తుంటాడు

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో కార్తీక్ త‌న‌కు స‌న్మానం జ‌రిగే ప్ర‌దేశానికి వెళ్లి హిమ కోసం చూస్తుంటాడు. నేను పిలిస్తే హిమ రావాలి క‌దా. ఇంకా రాలేదేంటి.. మ‌మ్మీతో కారులో వ‌స్తుందా..? వార‌ణాసితో ఆటోలో వ‌స్తుందా..? అస‌లు వ‌స్తుందా..? రాదా..? అని ఆలోచిస్తూ ఉంటాడు. హిమ‌ను ఒక్క‌దాన్నే పంప‌న‌న్న కోపంతో ఆ దీప పంప‌నందా..? పెంచిన ప్రేమ గొప్ప‌ది అయితే మీరే హిమ కోసం వ‌స్తారు అంది. అంటే నేను వ‌స్తేనే పంపిస్తాను అందా..? హిమ‌ను చూడ‌టానికి నాకు వంక దొరికిన‌ట్లే.. నాకు ప‌రీక్ష పెట్ట‌డానికి దీప‌కు ఓ అవ‌కాశం దొరికిందా..? అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపు హిమ అక్క‌డ‌కు వ‌స్తుంది. ఏంటి డాడీ.. నువ్వు నాకోసం రాక‌పోయినా.. నేను నీకోసం వ‌చ్చాను. మ‌రి ఎందుకు మాట్లాడ‌టం లేదు అని అంటుంది. దానికి కార్తీక్ హిమ నువ్వు నిజంగా వ‌చ్చావా..? నేను న‌మ్మ‌లేక‌పోయానురా అందుకే ఏం మాట్లాడాలో తోచ‌లేదు అంటూ హిమ‌ను ఎత్తుకొని తిప్పుతాడు. అది చూసి దీప సంతోష‌ప‌డుతుంది. కానీ సౌర్య అది చూసి కాస్త బాధ ప‌డుతుంది.

  ఇక ఎలా వ‌చ్చావురా..? ‌నాన‌మ్మ రాలేదా..? అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. లేదు అమ్మ‌, నేను, సౌర్య క‌లిసి వార‌ణాసి ఆటోలో వ‌చ్చాము అని చెబుతుంది. ఆలోపు మౌనిత అక్క‌డ‌కు దిగుతుంది. కార్తీక్, దీప అంద‌రినీ చూసి.. ఇవాళ ఒక అద్భుతం జ‌ర‌గ‌బోతోంది. కార్తీక్, దీప‌ల‌ను పూర్తిగా విడ‌దీయ‌డానికి ఒక అవ‌కాశం దీప‌నే రావ‌డం వ‌ల‌న నాకు ద‌క్కింది అని మ‌న‌సులో అనుకుంటూ ఉంటుంది. ఆ త‌రువాత అక్క‌డే ఆగిపోయావేంటి దీప‌..?లోప‌లికి రా.. ఏయ్ రౌడీ రావే, రేయ్ వార‌ణాసి నువ్వు ఇలా రా అని పిలుస్తుంది. దాంతో వార‌ణాసి అక్క‌డ‌కు వెళ‌తాడు. ఈ బొకేలు తీసుకెళ్లి లోప‌ల పెట్టు అని చెబుతుంది. ఇక కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ఏంటి హీరో నువ్వు ఇంకా ఇక్క‌డే నిల‌బ‌డ్డావు.. స‌న్మానం నీకే రా. నాకు చాలా ప‌నులు ఉన్నాయి అంటూ లోప‌లికి తీసుకెళుతుంది. దీంతో హిమ‌ను బ‌ల‌వంతంగా కార్తీక్ లోప‌లికి తీసుకువెళుతుండ‌గా.. అత‌డి చెయ్యిని వ‌దిలించుకునేందుకు హిమ ప్ర‌య‌త్నిస్తుంది. కాక‌పోవ‌డంతో రండి అంటూ దీప‌కు సైగ‌లు చేస్తుంది. ఆ త‌రువాత దీప, సౌర్య‌లు లోప‌లికి వ‌స్తారు. ఆ త‌రువాత శ్రావ్య‌, ఆదిత్య లోప‌లికి రాగా.. దీప‌, సౌర్య‌ల‌ను చూస్తారు. ఆ త‌రువాత ఆదిత్య వ‌దినా ఇక్క‌డ కూర్చున్నావేంటి..? జ‌రిగేది అన్న‌య్య ఫంక్ష‌న్ అని అంటాడు. ముందు నువ్వు లేయ్ అక్కా. సౌర్య‌, ముందు వ‌రుస‌లో కూర్చుందాం అని శ్రావ్య చెబుతుంది. వ‌ద్దులే అని దీప అంటే అదేం కుద‌ర‌దు అంటూ ఇద్ద‌రు దీప‌, సౌర్య‌ల‌ను తీసుకెళ‌తారు.

  ఆ త‌రువాత ఫంక్ష‌న్ స్టార్ట్ అవ్వ‌గా.. మౌనిత మాట్లాడుతుంది. ఇవాళ మ‌నం ఒక ముఖ్య‌మైన వ్య‌క్తిని స‌న్మానించుకోబోతున్నాము. అత‌డు ఫ‌ల్స్ చూసి హార్ట్ ఫంక్ష‌నింగ్ చెప్ప‌గ‌ల‌డు. స్టెత‌స్కోప్‌తోనే హార్ట్ డిసీజెస్‌ని క‌నిపెట్ట‌గ‌ల‌డు. అలాంటి వ్య‌క్తిని డాక్ట‌ర్స్ వెల్ఫేర్ అసోషియేష‌న్‌కి ప్రెసిడెంట్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న సంద‌ర్భంలో ఈ చిరు స‌త్కారం. ఆయ‌న ఎవరో కాదు డాక్ట‌ర్ కార్తీక్, కార్డియాల‌జిస్ట్ అని చెబుతుంది. మీ క‌ల‌కాల ధ్వనుల మ‌ధ్య కార్తీక్‌ని స్టేజ్ మీద‌కు ఆహ్వానిస్తున్నామ‌ని చెబుతుంది. ఆ త‌రువాత హిమ కంగ్రాట్స్ చెప్ప‌గా.. థ్యాంక్స్ చెప్పి స్టేజ్‌పైకి వెళ‌తాడు. స్టేజ్‌పైన ఉన్న మౌనిత, కార్తీక్‌కి కాస్త ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. దాంతో దీప‌కు కోపం వ‌స్తుంది. ఇక డాక్ట‌ర్లు వ‌చ్చి కార్తీక్‌ని స‌న్మానిస్తూ ఉంటారు.

  ఇక హిమ‌ను మాట్లాడ‌మ‌ని స్టేజ్‌పైకి పిల‌వ‌గా.. హిమ వెళుతుంది. న‌మ‌స్తే అని స్టార్ట్ చేసిన హిమ‌.. మా డాడీతో పాటు మీరంద‌రూ పెద్ద పెద్ద డాక్ట‌ర్లు. మీ ముందర నేను మాట్లాడ‌మేంటి..? అనుకున్నాను. కానీ డాడీ గురించి మాట్లాడ‌మ‌న్నారు. మా డాడీ గురించి అయితే చాలా మాట్లాడ‌తాను. మా డాడీని మా నాన‌మ్మ ముద్దుగా పెద్దోడా పెద్దోడా అని పిలుస్తుంది. అప్పుడ‌ప్పుడు సుపుత్రుడు, వంశోద్దార‌కుడు, దేశోద్దార‌కుడు అని పిలుస్తుంది. దానికి అర్థ‌మేంటి నాన‌మ్మ అంటే.. మా నాన‌మ్మ చెప్పింది. ఓహో మా నాన్న అంత గొప్ప‌వాడా అనుకున్నాను. నాకు మాత్రం మా నాన్న చాలా మంచోడు.ఒక్క మాట కూడా అన‌డు. నేను ఏది అడ‌గ‌కుండానే తెస్తాడు. న‌న్ను చూడ‌కుండా అస్స‌లు ఉండ‌లేడు అని చెబుతూ ఉండ‌గా.. ఈ పిల్ల సెంటిమెంట్‌తో కొట్టి కార్తీక్‌ని ఇరికించేయ‌దు క‌దా. మ‌ళ్లీ ఇంటికి తెచ్చుకుంటే హిమ దీప కూడా రావాలి అంటే అని మౌనిత మ‌న‌సులో అనుకుంటుంది.

  ఆ త‌రువాత హిమ కంటిన్యూ చేస్తూ.. మా డాడీకి మీరు స‌న్మానం చేశారు. పూల‌దండ‌లు, బొకేలు ఇచ్చారు. నేనేమీ తేలేదు. అందుక‌ని మా నాన్న‌కు నేను ఒక ముద్దు ఇస్తాను అని చెప్పి వెళ్లి ముద్దు ఇస్తుంది. కార్తీక్ బాబు మంచి డాక్ట‌రే కాదు మంచి మ‌నిషి కూడా. మా అమ్మ‌కు ఫ్రీగా ఆప‌రేష‌న్ కూడా చేశాడు అని అక్క‌డున్న ఒక వ్య‌క్తి అన‌గా.. మీ నాన్న గురించి ఇంత గొప్ప‌గా చెప్పావు. మీ అమ్మ గురించి కూడా చెప్ప‌మ్మా..? అని మ‌రో వ్య‌క్తి అడుగుతాడు. ఎంత బాగా చెప్తావో వినాల‌నుంది అని అత‌డు అన‌గా.. ఆదిత్య సూప‌ర్ అంటూ విజిల్ వేస్తాడు. ఇక కార్తీక్ కాస్త కోపానికి గురౌవుతాడు. ఆ త‌రువాత హిమ మా అమ్మ పేరు దీప. అంతా వంట‌ల‌క్క అంటారు. మా నాన్న‌ను మా అమ్మ డాక్ట‌ర్ బాబు అని పిలుస్తుంది. నాకు అక్క కూడా ఉంది. మేము క‌వ‌ల పిల్ల‌లం. కానీ మా అమ్మ‌, మా అక్క శ్రీరామ్ న‌గ‌ర్ బ‌స్తీలో ఉంటారు. మా నాన్న, నేను జూబ్లీహిల్స్‌లో పెద్ద ఇంట్లో ఉంటాము. మా అమ్మ ఇక్క‌డే ఉంది. అమ్మా ఒక్క‌సారి స్టేజ్ మీద‌కు రా అమ్మా. సౌర్య నువ్వు కూడా రా. రా అమ్మా డాడీ ఫంక్ష‌నే క‌దా అని పిలుస్తుంది. ఆదిత్య వెళ్లు వ‌దినా అంటే జ‌రిగింది చాలు నేను వెళ్లిపోతాను అని దీప అంటుంది. ఇక్క‌డి దాకా వ‌చ్చాక పిరికిదానిలా వెళ్లిపోతావా..? వెళ్లు అక్క అని శ్రావ్య చెబుతుంది. దానికి దీప‌, సౌర్య ఇద్ద‌రు స్టేజ్ మీద‌కు వెళ‌తారు. ఇక హిమ మాట‌ల‌తో అక్క‌డ అంద‌రూ డిస్క‌ష‌న్ చేస్తుండ‌గా.. కార్తీక్ కాస్త అసౌక‌ర్యానికి ఫీల్ అవుతాడు.

  ఈమే మా అమ్మ దీప‌, మా అక్క సౌర్య అని హిమ చెప్ప‌గా.. మౌనిత షాక్‌కి గురి అవుతుంది. ఇక కార్తీక్ అక్క‌డి నుంచి కింద‌కు దిగి వెళతాడు. అక్క‌డున్న మీడియా వాళ్లు.. స‌ర్ ఆగండి స‌ర్ ఒక్క డౌట్ స‌ర్ అంటూ ఆపుతారు. ఆ త‌రువాత దీప‌.. హిమ‌, సౌర్య‌ల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. ప్ర‌పంచానికి ఏం స‌మాధానం చెబుతారో నేను వినేసి వెళ‌తాను అని దీప చెబుతుంది. డాక్ట‌ర్ కార్తీక్ మీరు, మీ మిసెస్ ఎందుకు వేరువేరుగా ఉంటున్నారో స‌మాధానం చెప్పండి అని అడుగుతారు. రేప‌టి ఎపిసోడ్‌లో కార్తీక్ ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌నున్నాడు.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

  ఉత్తమ కథలు