• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KARTHIKA DEEPAM SERIAL UPDATE HIMA FEELS BAD ABOUT COURT NOTICE ELSEWHERE SOURYA STRAIGHT QUESTIONS TO DEEPA MNJ

Karthika Deepam: ఈ నిజ‌మే దీప కాపురాన్ని నిల‌బెడుతుంది.. కార్తీక దీపంలో మ‌రో ట్విస్ట్

Karthika Deepam: ఈ నిజ‌మే దీప కాపురాన్ని నిల‌బెడుతుంది.. కార్తీక దీపంలో మ‌రో ట్విస్ట్

కార్తీక దీపం సీరియల్ (Karthika Deepam)

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్ బ‌య‌ట నుంచి రావ‌డాన్ని చూసిన సౌంద‌ర్య వీడి మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాలి అని మ‌న‌సులో అనుకుంటోంది.

  • Share this:
    Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్ బ‌య‌ట నుంచి రావ‌డాన్ని చూసిన సౌంద‌ర్య వీడి మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాలి అని మ‌న‌సులో అనుకుంటోంది. మ‌రోవైపు కార్తీక్ వంట‌ల‌క్క మ‌న‌సులో ఏముందో క‌నుక్కోవాల‌ని.. ఆ త‌రువాత సౌంద‌ర్య, హిమ విష‌యంలో వీటి ఉద్దేశ్యం ఏంటో తెలుసుకోవాల‌ని.. హిమ విష‌యంలో ఆ వంట‌ల‌క్క ఎందుకు అంత ధీమాగా ఉందో తెలుసుకోవాలి అని కార్తీక్.. ఈ సుపుత్రుడు చెప్తాడా అని సౌంద‌ర్య‌.. కోడ‌లు మెచ్చిన అత్త చెప్తుందా అని కార్తీక్ మ‌న‌సులో అనుకుంటారు. ఆ త‌రువాత ఇద్ద‌రు సోఫా మీద కూర్చుంటారు.

    కాఫీ తాగుతావా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. ఇప్పుడు ఏం వ‌ద్దు మ‌మ్మీ థ్యాంక్స్ అంటాడు. ఇక కార్తీక్ వాల‌కం చూసిన సౌంద‌ర్య‌.. వీడు ఏదో కాక ప‌డుతున్న‌ట్లు ఉన్నాడు అని మ‌న‌సులో అనుకుంటుంది. మ‌రోవైపు కార్తీక్ ఈవిడ ఏదో బిస్కెట్ వేస్తున్న‌ట్లు ఉంది అని మ‌న‌సులో అనుకుంటాడు. ఇక ఏదైనా అడ‌గాలా అని సౌంద‌ర్య అన‌గా.. ఏదైనా చెప్పాల‌నుకుంటున్నావా అని కార్తీక్ అడుగుతాడు. దానికి సౌంద‌ర్య‌.. నువ్వే ఏదో అడ‌గాల‌నుకుంటున్న‌ట్లు ఉన్నావు అని అన‌గా.. అవును మ‌మ్మీ. ఒక‌టి అడ‌గాల‌నుకుంటున్నాను అని అంటాడు. ఏంట‌ది అనే లోపు సౌర్య వ‌చ్చి.. డాక్ట‌ర్ బాబు వ‌చ్చేశారా.. మీ కోస‌మే చూస్తున్నాను అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. నా కోసం చూస్తున్నావా.. నీకు దండం పెడ‌తానే. ఇవాళ ఏ ప్రోగ్రామ్‌లు పెట్ట‌కే రౌడీ. నాకు మూడ్ లేదు, ఓపిక లేదు అంటాడు.

    దాంతో సౌర్య కాస్త చిన్న‌బుచ్చుకోగా.. వెళ్లి దీపు గాడితో ఆడుకోపోవే వెళ్లు అని కార్తీక్ అంటాడు. దానికి సౌర్య‌.. మీకు కాఫీ అని అడ‌గ్గా.. ఇక్క‌డ మా అమ్మ ఉందే ఆవిడ చూసుకుంటుంది. పెద్ద ఆరింద దిగి వ‌చ్చింది. మా అమ్మ‌తో మాట్లాడే ప‌ని ఉందే వెళ్లు అని అంటాడు. ఇక సౌర్య‌.. మాట్లాడుకోండి. మాట్లాడుకోండి. ఇవాళ నాతో చెస్ ఆడేదాకా నిద్ర‌పోనివ్వ‌ను అని అంటుంది. ఇక కార్తీక్.. అదొక‌టి ఉందా. స‌రేలే వెళ్లు చూద్దాం అని అంటాడు. దాంతో సౌర్య అక్క‌డి నుంచి వెళుతుంది.

    ఇక సౌంద‌ర్య మ‌న‌సులో ఏ మాత్రం కల్మ‌షం లేని స్వ‌చ్ఛ‌మైన వ్య‌క్తిత్వం నా కొడుకుది. క‌డివెడు పాల‌ల్లో ఉప్పు రాయి ప‌డ్డ‌ట్లు వీడి మ‌న‌సులో ఆ అనుమాన భీజం ఎలా ప‌డిందో అని అనుకుంటుంది. ఇక కార్తీక్.. ఏంటి మ‌మ్మీ..అలా చూస్తున్నావు అని అన‌గా.. ఓ మంచి స్టుపిడ్ సుపుత్రుడిని క‌న్నానేంటా అని సౌంద‌ర్య అంటుంది. దానికి కార్తీక్.. ఇన్నేళ్ల త‌రువాత ఙ్ఞానోద‌యం అయ్యిందా..? నాకు ఎప్పుడో తెలుసు. నేను స్టుపిడ్ అని అంటాడు. ఎప్పుడో అని సౌంద‌ర్య అడ‌గ్గా.. నువ్వు మొద‌టిసారి న‌న్ను స్టుపిడ్ అని పిలిచిన‌ప్పుడే కామోష్ అనుకున్నాను అని కార్తీక్ అంటాడు. దాంతో ఇద్ద‌రు న‌వ్వుతారు. ఇక సౌంద‌ర్య‌.. స‌రేలే ఏదో ఒక‌టి అడుగుతాను అన్నావు ఏంట‌ది అని ప్ర‌శ్నిస్తుంది.

    హిమ నాకు కావాల‌ని కోర్టుకు వెళుతున్నాను. అది నేను నీకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు అనుకుంటాను. నీ డియ‌రెస్ట్ వంట‌ల‌క్క ఈపాటికే ఊదేసి ఉంటుందిగా అని కార్తీక్ అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. య‌స్ మై డియ‌రెస్ట్ స్టుపిడ్ స‌న్. సో.. అని అనగా.. వెంట‌నే కార్తీక్.. అదేంటి నీ రియాక్ష‌న్ ఇంత సింపుల్‌గా ఉంది అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. నిజానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలీడం లేదురా అని చెబుతుంది. ఎందుకు అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. ముందు నువ్వు అడేగేదేదో అడిగేసెయ్ అని సౌంద‌ర్య అంటుంది.

    వెంట‌నే కార్తీక్.. అది చాలా కాన్ఫిడెంట్‌గా ఉందేంటి మ‌మ్మీ. వెళ్లండి, వెళ్లండి నీకు ఉందిపో అన్న‌ట్లు మాట్లాడుతుందేంటి..? అని ప్ర‌శ్నిస్తాడు. దానికి సౌంద‌ర్య‌.. నీతో కూడా అలానే మాట్లాడుతోందా అని ప్ర‌శ్నిస్తుంది. కార్తీక్ అవును అని.. అస‌లు దాని స్ట్రాటెజీ ఏంటి మ‌మ్మీ అని అడుగుతాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. సేమ్ వ‌ర్డ‌, సేమ్ క్వ‌శ్చ‌న్ నేను వేశాను. నో ఆన్స‌ర్. ఓన్లీ స్మైల్. ద‌ట్సాల్ అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. నువ్వు అద్భుతంగా యాక్ట్ చేస్తున్నావు మ‌మ్మీ అని అంటాడు. యాక్టా అని సౌంద‌ర్య ప్ర‌శ్నించ‌గా.. మ‌రి రియాక్టా అని కార్తీక్ అన‌గా.. రియ‌ల్ ఫాక్ట్‌రా అని సౌంద‌ర్య చెబుతుంది.

    దాంతో కార్తీక్.. ఇంకో మాట చెప్పు మ‌మ్మీ అంటాడు. ఇంకో మాట‌లో కూడా నాకు తెలీద‌నే చెబుతాను అని సౌంద‌ర్య అంటుంది. ఇక కార్తీక్.. అది నీకు చెప్ప‌కుండా దాచ‌డ‌మేంటి బొడ్డోడు కూడా న‌మ్మ‌డు. వంట‌ల‌క్క ఏంటి.. సౌంద‌ర్య అత్త ద‌గ్గ‌ర నిజం దాచ‌డ‌మేంటి. ప్ర‌పంచంలో ఏ మూల‌కు వెళ్లినా ఎవ్వ‌రూ న‌మ్మ‌రు. మీ ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్ అలా ఉంటుంది మ‌రి. చెప్పు మ‌మ్మీ. అది ఎందుకు అంత ధీమాగా ఉంది అని అడుగుతాడు. ఇక సౌంద‌ర్య‌.. రేయ్ ప్రామిస్‌రా. అది అంత ధీమాగా ఉంది. కోర్టుకు వెళ్లండి. మ‌న‌సు మార్చుకోకండి అని లాయ‌ర్‌తో కూడా ఇలానే మాట్లాడుతుందిరా అని అంటుంది. ఇక కార్తీక్.. అది నీకు చెప్ప‌కుండా ఉండ‌ట‌మేంటి.. నువ్వు నాకు చెప్ప‌వ‌ని తెలుసు క‌దా అని అడగ్గా.. ఆ మాట కూడా అన్నాను. నేను వాడికి చెప్ప‌నులేవే అన్నాను. అబ్బే భ‌లే స్ట్రాంగ్‌గా చెప్ప‌ను అనింది అని సౌంద‌ర్య అంటుంది.

    నిజ‌మా మ‌మ్మీ అని కార్తీక్ అన‌గా.. నిజం రా. కావాలంటే నీ ముందే ఫోన్ చేసి లౌడ్ స్పీక‌ర్ పెట్టి మాట్లాడుతా విను అని ఫోన్ తీసుకుంటుండ‌గా.. వ‌ద్దులే ఈసారి నిజంగానే నీకు చెప్పి ఉండ‌దు. అదేదో పెద్ద ప్లాన్‌లో ఉంది మ‌మ్మీ. అదేంటో ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు. నావైపు న్యాయం ఉంది అని కార్తీక్ అన‌గా.. దానివైపు కూడా న్యాయం ఉంది క‌దారా అని సౌంద‌ర్య అంటుంది. దానికి ఏంటి అని కార్తీక్ అడ‌గ్గా.. నిజ‌మే క‌దా అన్నాను అని సౌంద‌ర్య అంటుంది. వెంట‌నే కార్తీక్.. హిమ నా కూతురు అన‌గా.. సౌర్య కూడా నీ కూతురేరా అని సౌంద‌ర్య అంటుంది. దానికి కార్తీక్.. సౌర్య అంటే గుర్తు వ‌చ్చింది. వెళ్లి పొమ్మంటే ఫీల్ అయ్యి ఉంటుంది. పిల్ల రౌడీ అని సౌర్య ద‌గ్గ‌ర‌కు వెళ‌తాడు. ఇక సౌంద‌ర్య వీడిని ఎలా అర్థం చేసుకోవాలి దేవుడా అనుకుంటుంది.

    మ‌రోవైపు లాయ‌ర్ పంపిన నోటీసుల‌ను చూస్తూ ఉంటుంది దీప‌. అటుగా హిమ వస్తుంది. ఏంట‌మ్మా అది హిమ అడ‌గ్గా.. ఏం లేద‌ని దీప చెబుతుంది. వెంట‌నే హిమ‌.. నాకు తెలుసు. అది కోర్టు నోటీసే క‌దా అంటుంది. నువ్వెప్పుడు చూశావు అని దీప అడ‌గ్గా.. చ‌దివాను. నన్ను డాడీ ద‌గ్గ‌ర‌కు పంపించాల‌నే క‌దా కోర్టు నోటీసు పంపాడు అని చెబుతుంది. ఆ త‌రువాత అక్క‌డి నుంచి హిమ వెళుతుండ‌గా.. దీప ఆపుతుంది. నాన్న అలా కోర్టు నోటీసు పంపినందుకు బాధ‌గా ఉందా అని ప్ర‌శ్నించ‌గా.. నేను కాద‌మ్మా. డాడీనే చాలా బాధ‌ప‌డుతున్నారు. అందుకే కోర్టుకు వెళ‌తాను అంటున్నాను. డాడీ నా కోసం బాధ‌ప‌డుతున్నాడ‌ని అంద‌రికీ తెలుసు. కానీ ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదు. డాడీ చెప్పినా ఎవ‌రు విన‌డం లేదు. నాన‌మ్మ‌, తాత‌య్య న‌న్ను పంపించిమ‌ని నిన్ను అడొగొచ్చు క‌దా. పోనీ పిన్ని, బాబాయ్ అడ‌గొచ్చు క‌దా. ఎవ్వ‌రూ డాడీ ద‌గ్గ‌ర‌కు పంపమ‌ని అడ‌గ‌ట్లేదు అని అంటుంది.

    దానికి దీప నేను తీసుకొచ్చాను క‌దమ్మా అందుకే వాళ్లు ఎవ్వ‌రూ అడ‌గ‌ట్లేదు. పెంచిన ప్రేమ గొప్ప‌ది అన్నారు క‌దా. అంత ప్రేమ పెంచుకున్న‌వాడు అయితే వ‌చ్చి హిమ‌ను పంపించ‌మ‌ని న‌న్నే అడ‌గొచ్చు క‌దా. నా ద‌గ్గ‌ర ఎందుకు ఆ ప‌ట్టుద‌ల అని అంటుంది. ఇక హిమ‌.. మ‌రి నువ్వే ఎందుకు పంపించ‌కూడ‌ద‌మ్మా అని అడుగుతుంది. నిన్ను అడిగితే నువ్వు పంపించ‌వు. నాన్న ద‌గ్గ‌ర నీకు మాత్రం ఎందుక‌మ్మా ప‌ట్టుద‌ల‌. నేను రాను అన్నాన‌నే క‌దా. అందుకే క‌దా కోర్టుకు వెళ్లాడు. అంద‌రినీ తీసుకెళ్తేనే వ‌స్తాను అన్నాను క‌దా. పాపం. అందుకే నా కోసం కోర్టుకు వెళుతున్నారు. నాన్న చాలా మంచి వాడ‌మ్మా. నేనే అనాథ‌ను అనుకొని కూడా చాలా ప్రేమ‌గా పెంచుకున్నాడు. ఏది అడిగినా చేశాడు. ఎన్నో కొనిచ్చాడు. బ‌ట్ట‌లు. గోల్డ్, బొమ్మ‌లు ఏం అడ‌క్క‌పోయినా తెచ్చాడు. అనాథ అని తెలిసిన‌ప్పుడే బావుంద‌మ్మా. అప్పుడే ఎంతో ప్రేమ‌గా ఉన్నాం. నేను నీ కూతురిని అని తెలిశాక అస్స‌లు బాలేదు. నేను ఇక్క‌డ‌, నాన్న అక్క‌డ ఉండాల్సి వ‌చ్చింది. ఉండ‌లేడు క‌ద‌మ్మా. నన్ను చూడ‌కుండా ఉండ‌లేక‌నే క‌దా నా క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌క‌పోయినా ఐడ్రాప్స్ తీసుకొని వ‌చ్చాడు. నేను నీళ్లు మోయడం ఇష్టం లేక‌నే క‌దా ఎప్పుడూ లేనిది నిన్ను కొట్టాడు. ఎందుక‌మ్మా ఇలా అయ్యింది.

    పాపం నాన్న అని హిమ అనగా.. పాపం అమ్మ అని అనాలనిపించ‌డం లేదా హిమ అని దీప ప్ర‌శ్నిస్తుంది. నేను మీ నాన్న‌కు భార్య‌న‌మ్మా. కానీ మీ నాన్న‌తో లేను. సౌర్య కూడా నీలాగే క‌దా. త‌ను అయితే పుట్టిన‌ప్ప‌టి నుంచి నాన్న‌తో లేదు. నువ్వు ఒక్క‌దానివే నాన్న ద‌గ్గ‌ర ఉన్నావు. నిన్ను మాత్ర‌మే ప్రేమ‌గా చూసుకుంటున్నాడు. మ‌రి సౌర్య ఏం పాపం చేసింది..నేను ఏం పాపం చేశాను. ఎక్క‌డో చిన్న గ‌దిలో అద్దె క‌ట్టెలేక బియ్యానికి డ‌బ్బులు లేక, పండుగ‌లు వ‌చ్చినా పాత బ‌ట్ట‌లే సౌర్య‌కు వేస్తూ అనాథం అయిపోయాం క‌ద‌మ్మా. ఇవాళ మీ నాన్న నిన్ను మాత్ర‌మే ర‌మ్మ‌నేస‌రికి పాపం నాన్న అంటున్నావే.. మ‌రి పాపం సౌర్య అని అనాల‌నిపించ‌డం లేదా..పాపం అమ్మ అని జాలి క‌ల‌గ‌డం లేదా అని ఏడుస్తుంది.

    దాంతో హిమ‌.. అమ్మ నేను అలా అన‌లేదమ్మా. డాడీ న‌న్ను పెంచుకున్నారు క‌దా. అందుకే ఎక్కువ బాధ‌ప‌డుతున్నాడు అన్నాను అని అంటుంది. దానికి దీప‌.. నిన్ను పెంచుకున్నాడు. న‌న్ను పెళ్లి చేసుకున్నాడు. నీతో పాటు సౌర్య‌ను క‌న్నాడు. కానీ మేమెవ‌రం వ‌ద్దు. కానీ నువ్వే కావాలి అంటే.. నా సంగ‌తి ప‌క్క‌న‌పెట్టు సౌర్య రోజూ ఎంత బాధ‌ప‌డాలి చెప్పు అని అంటుంది. వెంట‌నే హిమ‌.. అవున‌మ్మా నేను ఇదంతా ఆలోచించ‌లేదు. చిన్న పిల్ల‌ను క‌ద‌మ్మా. నాకు పూర్తిగా ఆలోచించ‌డం తెలీదు. ఏదో అనిపించింది అన్నాను. త‌ప్పేన‌మ్మా. నేను ఒక్క‌దాన్నే వెళ్ల‌ను. అంద‌రం క‌లిసే వెళ‌దాం. లేక‌పోతే ఆ బ‌స్తీలోనే ఉందాం అని అంటుంది. దానికి దీప‌.. అవ‌స‌రం లేద‌మ్మా. మీ నాన్న త‌న‌కు తెలీకుండానే చాలా మంచి ప‌ని చేస్తున్నారు. ఈ కోర్టు నోటీసు వ‌ల్ల మ‌నమందరం క‌లుస్తాం. అంద‌రం క‌లిసి ఆ ఇంటికి వెళ‌తాం. మీ నాన్న‌తో ఉంటాం స‌రేనా అని అంటుంది. వెంట‌నే హిమ‌.. స‌రేన‌మ్మా. నువ్వు ఎలా చెప్తే అలానే అంటాను. అంద‌రం క‌లిసి వెళ్దామ‌నే అంటాను అంటుంది. ఇక ఆ ఇద్ద‌రు ప‌డుకోవ‌డానికి వెళ‌తారు.

    మ‌రోవైపు విహారికి ఫోన్ చేసిన తుల‌సి.. విహారి ద‌త్త‌త కోసం ప్ర‌య‌త్నించ‌కు. నువ్వే నా బిడ్డ‌వు అనుకుంటాను. నీకు పిల్ల‌లు క‌ల‌గ‌రు అన్న బాధ నాకు లేదు విహారి. నాకు నువ్వు, నీకు నేను. జీవితాంతం ఇలాగే క‌లిసి ఉంటే చాలు. నాకు అన్యాయం జ‌రిగిన‌ట్లు నువ్వేమీ ఫీల్ అవ్వ‌కు. నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు. నేను జీవితాంతం ప్రేమ‌ను ఇవ్వ‌లేనా..రా విహారి. వ‌చ్చెయ్ అని చెబుతుంది. ఏ నిజం, ఏ నిజం నా గుండెని కారు చిచ్చులా ద‌హించి వేస్తున్నా. ఇదే నిజం విహారి వ‌ల్ల నాకు పిల్ల‌లు క‌ల‌గ‌రు అన్న నిజం నూటికి నూరుపాళ్లు దీప కాపురాన్ని నిల‌బెడుతుంది. ఇది నిజం అని అంటుంది.

    ఇక ముర‌ళీకృష్ణ‌కు దీప కాఫీ తీసుకురాగా.. హిమ లేచిందా అని అడుగుతాడు. దానికి దీప లేటుగా లేచింది నాన్న. బ్ర‌ష్ చేసుకోడానికి వెళ్లింది అని అంటుంది. ఇక వార‌ణాసి రాగా..ముర‌ళీకృష్ణ లోప‌లికి పిలుస్తాడు. ఎలా ఉన్నావు వార‌ణాసి అన‌గా.. నేను బావున్నా అని చెబుతాడు. ఏదో చెప్పాల‌ని వ‌చ్చిన‌ట్లు ఉన్నావు అని దీప అన‌గా.. నిన్న ఆసుప‌త్రి ద‌గ్గ‌ర ఒక ప్యాసింజ‌ర్‌ని డ్రాప్ చేయ‌డానికి వెళ్లాన‌క్కా. అప్పుడే తుల‌సి సిస్ట‌ర్ లోప‌లి నుంచి వ‌చ్చి ఏడుస్తూ వ‌చ్చి కారు ఎక్కి వెళ్లిపోయింది. డాక్ట‌ర్ బాబు కూడా ఇంకో కారులో వెళ్లిపోయాడు. సిస్ట‌ర్ తుల‌సిని డాక్ట‌ర్ బాబు ఏమైనా అన్నాడేమోన‌ని డౌట్ వ‌చ్చింది అక్క అని వారణాసి అంటాడు.

    వెంట‌నే దీప‌.. అవునా ఇంకా తుల‌సిని అవ‌మానిస్తూనే ఉన్నారా..? అని అన‌గా.. చూస్తుంటే ఏదో గొడ‌వ జ‌రిగిన‌ట్లు అనిపించింది అక్కా. నీకేం తెలీదా అని అడుగుతాడు. లేదు. నాకు తుల‌సి కూడా ఏం చెప్ప‌లేదే. ఎంత బాధ‌ప‌డ‌క‌పోతే తుల‌సి ఏడుస్తుంది. నా మంచి కోరుకునే వాళ్లంద‌రూ ఈయ‌న‌కు శ‌త్రువులాగే క‌నిపిస్తారా అని అంటుంది. ఇక తుల‌సి ద‌గ్గ‌ర‌కు వెళ‌దాం ప‌ద అని వార‌ణాసిని తీసుకొని బ‌య‌ట‌కు వెళుతుంది. ఇక ఆటోలో వారికి సౌర్య‌, కార్తీక్ క‌నిపిస్తారు. వెంట‌నే సౌర్య కిందికి దిగి.. ఎక్క‌డిక‌మ్మా అని అడుగుతుంది. మార్కెట్‌కి అని దీప చెప్ప‌గా.. మార్కెట్‌కి వెళ్ల‌డానికి వార‌ణాసిని అక్క‌డి నుంచి ఆటోలో ర‌మ్మ‌న్నావా..? మార్కెట్ ప‌క్క‌నే ఉంది క‌దా. ఇప్పుడే కారులో వ‌చ్చి చూశాము. నీ ద‌గ్గ‌ర‌కు వార‌ణాసి వ‌చ్చి ఏం చెప్పాడో అదంతా విన్నాము.

    హిమ‌ను బ‌య‌ట‌కు తీసుకెళ్లడానికని వ‌చ్చాము. నువ్వు హిమ‌ను తాత‌య్య ద‌గ్గ‌ర వ‌దిలేసి తుల‌సి ఆంటీ ద‌గ్గ‌ర‌కు వెళుతున్నావ‌ని మా ఇద్ద‌రికి తెలిసిపోయింది అంటుంది. ఇక వార‌ణాసిని ప‌క్క‌కు పంపి.. నాన్న అంటూనే ఉన్నారు. హిమ ఒక్క‌త్తే ఉంటుంది. మ‌నం వెళ్లి బ‌య‌ట‌కు తీసుకెళ్లి టిఫెన్ చేద్దాం అన్నారు. నువ్వు ఉంటావ‌ని నేను గ‌ట్టిగా చెప్పావు. రాగానే తుల‌సి ఆంటీ ద‌గ్గ‌ర‌కు బ‌య‌లుదేరావు. మ‌రి నాన్న‌కు కోపం వ‌స్తుందంటే రాదా.. ఎందుక‌మ్మా.. మాటిమాటికి నాన్న‌కు కోపం తెప్పించే ప‌నులు చేస్తున్నావు. నాన్న‌కు న‌చ్చ‌ని ప‌నులు చేయ‌క‌మ్మా. నాకు కూడా న‌చ్చ‌దు అని సౌర్య చెబుతుంది. ఇక కార్తీక్ కిందికి దిగి.. వార‌ణాసిని పిలుస్తాడు. తీసుకెళ్లు. ఎక్క‌డికెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తుందో అక్క‌డికి తీసుకెళ్లు అని కార్తీక్ అంటాడు. ఎక్క‌డికి వెళ్ల‌దులే నాన్న సౌర్య అన‌గా.. వెళ్ల‌నీ రౌడీ అని కార్తీక్ అంటాడు. నువ్వు వెళ్తావా అని కార్తీక్, సౌర్య‌ను అడగ్గా.. నేను ఎక్క‌డికి వెళ్ల‌ను. మ‌నం హిమ‌ను తీసుకొని బ‌య‌ట‌కు వెళ‌దాం అని అంటుంది. ఇక సౌర్య‌.. మార్కెట్‌కి అని అబ‌ద్దం చెప్తావు క‌దా. న‌డిచి వెళ్లేంత దూరంలోనే ఉంది. అదైనా నిజం చేయ్ అని అంటుంది. ఆ త‌రువాత వార‌ణాసిని అక్క‌డి నుంచి పంపుతుంది. కార్తీక దీపం కొన‌సాగుతుంది.
    Published by:Manjula S
    First published: