హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: నిన్ను చంపి, నీ శ‌వం నుంచైనా నిజం రాబ‌డ‌తా.. మౌనిత‌కు చుక్క‌లు చూపిస్తోన్న దీప‌

Karthika Deepam: నిన్ను చంపి, నీ శ‌వం నుంచైనా నిజం రాబ‌డ‌తా.. మౌనిత‌కు చుక్క‌లు చూపిస్తోన్న దీప‌

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు ప్రేక్షకుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ మ‌రింత ఆసక్తిక‌రంగా మారింది. కార్తీక్ స‌న్మాన స‌భ‌లో త‌న త‌ల్లి దీప అని, సౌర్య త‌న‌కు అక్క అని హిమ స్టేజ్‌పై చెప్పేసింది. అంతేకాకుండా డాడీ, తాను జూబ్లీ హిల్స్‌లో.. దీప‌, సౌర్య శ్రీరామ్ న‌గ‌ర్ బ‌స్తీలో ఉంటార‌ని చెబుతుంది

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు ప్రేక్షకుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ఆసక్తిక‌రంగా మారింది. కార్తీక్ స‌న్మాన స‌భ‌లో త‌న త‌ల్లి దీప అని, సౌర్య త‌న‌కు అక్క అని హిమ స్టేజ్‌పై చెప్పేసింది. అంతేకాకుండా డాడీ, తాను జూబ్లీ హిల్స్‌లో.. దీప‌, సౌర్య శ్రీరామ్ న‌గ‌ర్ బ‌స్తీలో ఉంటార‌ని చెబుతుంది. దీంతో కార్తీక్ అస‌హ‌నానికి గురై స్టేజ్ మీద నుంచి కిందికి దిగుతాడు. ఆ త‌రువాత అక్క‌డి మీడియా ప్ర‌తినిథులు మీరిద్ద‌రు వేరువేరుగా ఉంటున్నారా..? ఎప్ప‌టి నుంచి వేరుగా ఉంటున్నారు..? అని ప్ర‌శ్న‌లు సంధిస్తారు. ఇక కిందికు దిగిన దీప‌.. హిమ‌, సౌర్య‌ల‌ను బ‌య‌ట ఉండ‌మ‌ని పంపుతుంది. ఆదిత్య వ‌దినా అన‌గా.. ప్ర‌పంచానికి ఏం స‌మాధానం చెప్తారో విని వెళ్తాను అని దీప చెబుతుంది.

  మీ పాప చెప్పిన‌ట్లు మీరు, మీ మిసెస్ ఎందుకు వేరుగా ఉంటున్నారు..? ఒక పాప మీ ద‌గ్గ‌ర‌, ఇంకోపాప ఎందుకు ఉంటున్నారు..? చెప్పండి డాక్ట‌ర్ మీరు విడిపోయారా..? అని ప్ర‌శ్నిస్తారు. దానికి కార్తీక్.. ఆవిడ ఆ బిడ్డ‌ల‌కు మాత్ర‌మే త‌ల్లి అని అంటాడు. అంటే మీరు విడిపోయారా..? ఎప్పుడు విడిపోయారు..? పిల్ల‌లు పుట్టాక విడిపోయారా..? ఎందుకు వేరుగా ఉంటున్నారో కార‌ణం చెప్పండి..? అని మ‌ళ్లీ ప్ర‌శ్న‌లు వేయ‌గా.. బిడ్డ‌ల‌ను ఆవిడ క‌డుపులో మోస్తున్న‌ప్పుడే విడిపోయారు. క‌డుపుతో ఉన్న‌ప్పుడే అని మౌనిత స‌మాధానం చెబుతుంది. డాక్ట‌ర్ మౌనిత చెప్పింది నిజ‌మేనా డాక్ట‌ర్ అని మ‌ళ్లీ ప్ర‌శ్న వేయ‌గా.. నా ఎదురుగా ఉండి ఎందుకు అబ‌ద్ధం చెబుతుంది. నిజ‌మే అని కార్తీక్ స‌మాధానం ఇస్తాడు. త‌రువాత అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. ఆ త‌రువాత అక్క‌డి వారు ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా మాట్లాడుతుండ‌గా.. దీప బాధ ప‌డుతుంది.

  ఇక ఇంట్లో సౌంద‌ర్య న‌గ‌లన్నీ చూస్తుంటుంది. అదే స‌మ‌యానికి వ‌చ్చిన ఆనంద‌రావు దీప‌కా..? అని అడిగితే అవును ఆ పాప‌కే అని చెబుతుంది. స‌డ‌న్‌గా ఎందుకు అని అడ‌గ్గా.. స‌న్మానంలో ఫొటోల‌ను చూపిస్తుంది. ఈ ఫొటోకు అర్థ‌మేంటి అని ఆనంద‌రావు అడ‌గ్గా.. హిమ అంద‌రినీ క‌లిపేసింద‌ని అర్థం.. హిమ మీద ప్రేమ‌తో వాడు భార్య‌, పిల్ల‌ల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాడ‌ని అర్థం అని చెబుతుంది. వెంట‌నే ఆనంద‌రావు ఇది నీ ఊహ ఏమో, నిజం కాదేమో అని అడ‌గ్గా.. అని కూడా అనుకున్నాను. కానీ స‌రిగా చూడండి. వెన‌కాల ఆ కాకి మెడ‌ది కొత్తెం క‌ళ్లు వేసుకొని ఎంత షాకింగ్‌గా చూస్తుందో. అంటే దాని మొహంలో ఇంత బీభ‌త్సం క‌నిపిస్తుంది అంటే నా కొడుకు, కోడ‌లు, మ‌న‌వ‌రాళ్లు అంతా క‌లిసిపోయార‌నే క‌దా. అందుకే నా కోడ‌లు కోసం కొన్న న‌గ‌లు అన్నీ తెచ్చి బ‌య‌ట పెట్టాను అని అంటుంది. ఆ త‌రువాత ఆనంద‌రావు ఏదో టెన్ష‌న్‌తో నీళ్లు తాగుతుండ‌గా.. ఏంటి మీరు న‌మ్మ‌ట్లేదా..? అని సౌంద‌ర్య అడుగుతుంది. న‌మ్మ‌డం లేద‌ని ఆనందరావు స‌మాధానం చెప్తాడు.

  మ‌రి వాడి స‌న్మాన‌స‌భ‌లో స్టేజ్ మీద‌కు వీళ్ల‌ను ఎందుకు పిలుస్తారు చెప్పండి. వీళ్లు ప్రేక్ష‌కుల‌ను న‌మ‌స్కారం చేస్తున్నారంటే ప‌రిచ‌యం చేసి అని సౌంద‌ర్య అంటూ ఉంటుంది. ఈ లోపు దీప కోపంతో సౌంద‌ర్య ఇంట్లోకి వ‌స్తుంది. వెంట‌నే సౌంద‌ర్య, దీప అని అనగా.. ఆ అంటుంది.. ఏమైందే అని మ‌ళ్లీ అడ‌గ్గా.. మంచిత‌నం మునిగిపోయింది. భూదేవి స‌హ‌నం బ‌ద్ద‌లైంది. భూకంపం మొద‌లైంది అంటూ పైకి వెళ్తూ ఉంటుంది. వెన‌కాల ఆనంద‌రావు, సౌంద‌ర్య వెళుతుండ‌గా.. ఆగండి అని ఆపుతుంది.

  భ‌గ‌భ‌గ మండే గుండెల‌తో పైన ఏం త‌గ‌ల‌బెట్టి రానులెండి. మీరు అక్క‌డే ఉండండి అని దీప చెబుతుంది. దీంతో సౌంద‌ర్య కాస్త భ‌య‌ప‌డుతూ.. అయితే అక్క‌డ అని అడుగుతుంది. వెంట‌నే ఆనంద‌రావు ఈ భూదేవి స‌హ‌నానికి హ‌ద్దులు ఉంటాయ‌ని మీ సుపుత్రుడు మ‌రిచిపోయి ఉంటాడు అని చెబుతుంది. ఇక కార్తీక్ రూమ్‌లోకి వెళ్లిన దీప‌.. అక్కడ హిమ వేసిన డ్రాయింగ్‌ల‌ను.. హిమ ఫొటోను తీసుకొని కిందికి వెళుతుంది. కింద ఉన్న సౌంద‌ర్య ఏం జ‌రిగింద‌ని అడ‌గొచ్చా అని అన‌గా.. మీ కొడుక్కి స‌న్మానం, మీ కోడ‌లికి అవ‌మానం.. మీ కొడుక్కి స‌త్కారం, మీ కోడ‌లికి ఛీత్కారం.. అహంకారం, పురుషాహంకారం. ఇది నేను స్త్రీత్వాన్ని, శ‌క్తి స్వ‌రూపాన్ని, ఇది నా స్వ‌భావం, నా అహంభావం, నా ఆత్మ‌గౌర‌వం అని అంటుంది.

  దానికి ఆనందరావు ఇప్పుడు నువ్వు అని అడ‌గ్గా.. త‌ల్లిగానే కాదండి, స్త్రీగా స్పందిస్తున్నాను. స్త్రీ స‌హ‌జ‌మైన‌, సున్నిత‌మైన హృద‌యానికి గాయ‌మైతే, దాని ఉనికిని నిల‌బెట్టుకోవ‌డానికి, వ్య‌క్తిత్వాన్ని కాపాడుకోవ‌డానికి ఏం చేయ‌గ‌ల‌దో అదే చేసి నిరూపించుకుంటాను. మీ సుపుత్రుడికి చెప్పండి. అత‌డు వంశోద్ధార‌కుడు అని నిరూపించేది ఏ వైద్య‌మో కాదు, ఈ స్త్రీత్వ‌మే, ఈ స్త్రీ గ‌ర్భ‌కోశ‌మే అందుకు సాక్ష్య‌మ‌ని చెప్పండి. నా కూతురు నా కూతురు అంటారు ఎక్క‌డికి ఆ కూతురు. ఈ గ‌ర్భ‌గుడిలో ఆయ‌నే వెలిగించిన చిరు దివ్వె, అది తెలుసుకోలేక క‌ళ్ల‌కు గంతులు క‌ట్టుకొని ప్రపంచాన్ని చూస్తున్నారు. మన‌సుకు గంతులు క‌ట్టుకొని మాన‌వ‌త శీలాన్నిశంఖిస్తున్నాడు. ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌ను, మీ కొడుకుకి గంత‌లు క‌ట్టిందెవ‌రు దాని అంతు కూడా చూస్తాను, నా స‌హ‌నం హ‌ద్దులు దాటితే ఎలాంటి ప్ర‌ల‌యం వ‌స్తుందో చ‌విచూపిస్తాను. ఒక్క మాట చెప్పండి మీ అబ్బాయికి క్షేతం లేనిదే బీజం లేదు బీజం లేనిదే క్షేత్రం లేదు. స్త్రీ గ‌ర్భ‌కోశం ఒక పుణ్య‌క్షేత్రం లాంటిద‌ని చెప్పండి. అది నిరూపించ‌డానికే వెళ్తున్నాను అని చెప్పి అక్క‌డి నుంచి వెళుతుంది.

  ఇక సౌర్య‌, హిమ‌ల‌ను దీప ఇంటి ద‌గ్గ‌ర వ‌దిలేసిన వార‌ణాసి.. ఇదుగోండి తాళం అని ఇస్తాడు. దానికి సౌర్య ఏమైందిరా అని అడ‌గ్గా.. ఏం లేద‌మ్మా అని అంటాడు. ఆ త‌రువాత సౌర్య‌, హిమ వార‌ణాసిని ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తారు. నాకేం తెలుస‌మ్మా అని వార‌ణాసి అన‌గా.. అబ‌ద్దాలు ఆడ‌కు ఆటో అద్దం ప‌గిలిపోద్ది. నీతో ఏదో చెప్పే వెళ్లింది. ఏం చెప్పి వెళ్లింది..? అని సౌర్య ప్ర‌శ్నిస్తుంది. దానికి వార‌ణాసి.. అదా మీ ఇద్ద‌రిని ఇంటి ద‌గ్గ‌ర దిగ‌బెట్టి, అమ్మ వ‌చ్చేదాక మీకు న‌న్ను తోడుగా ఉండ‌మ‌ని చెబుతుంది అంటాడు. మాకు నువ్వు తోడు ఏంటి రా, నీకే నేను తోడుగా ఉంటాను, భ‌య‌ప‌డ‌కుండా ఉండు అని సౌర్య అంటుంది. అలానే అనుకోమ్మా అమ్మ వ‌చ్చే దాకా మీ ఇద్ద‌రు నాకు తోడుగా ఉండండి అని వార‌ణాసి చెప్తాడు. వెంట‌నే హిమ‌.. అస‌లు అమ్మ ఎక్క‌డికి వెళ్లింది సౌర్య ఏం చెప్ప‌కుండా అని హిమ అడుగుతుంది. స‌రే నేను మా ఇంటికి వెళ్లి అన్నం, కూర‌లు తీసుకొస్తాను అని వార‌ణాసి అన‌గా.. స‌రే జాగ్ర‌త్త‌గా వెళ్లు అని సౌర్య అంటుంది.

  దానికి హిమ ఆగు.. అన్నం, కూర‌లు నువ్వు తీసుకొస్తా అంటున్నావు, మ‌రి అమ్మ రాదా..? అని అడ‌గ్గా.. ఆల‌స్యంగా వ‌స్తుందేమోన‌మ్మా.. మిమ్మ‌ల్ని వ‌దిలి అమ్మ ఎక్కడికి వెళుతుంది. వ‌చ్చేస్తుందిలే, వెళ్లొస్తాను అని వార‌ణాసి చెప్పి అక్క‌డి నుంచి వెళ్తాడు. ఏంటి హిమ‌, ఇంకా అమ్మ గురించి భ‌య‌ప‌డుతున్నావా..? ఏదో పెద్ద ప‌ని ఉంటే త‌ప్ప అమ్మ మ‌న‌ల్ని వ‌దిలి వెళ్ల‌దు క‌దా అని సౌర్య చెప్ప‌గా.. మ‌న‌క‌న్నా పెద్ద ప‌ని ఏంటి అని హిమ అడుగుతుంది. నువ్వేం భ‌యప‌డ‌కు, వెళ్లి ఫ్రెష్ అవ్వు, ఇదుగో తాళం అని హిమ‌ను సౌర్య లోప‌లికి పంపుతుంది. హిమ‌ను బ‌య‌ట‌కు పంపించాను కానీ.. మా ఇద్ద‌రినీ ఇంటికి పంపి, అమ్మ ఎక్క‌డికి వెళ్లి ఉంటుందబ్బా అని సౌర్య ఆలోచిస్తుంటుంది.

  మ‌రోవైపు కార్తీక్ చెప్ప‌లేని మాట‌ల‌న్నీ మీరు అనేసి చాలా మంచి ప‌ని చేశార‌మ్మా. లేదంటే ఆయ‌న ఎప్ప‌టికీ లోకానికి తెలీకూడ‌ద‌నే అనుకుంటూ ఉంటాడు క‌దా అని ప్రియ‌మ‌ణి, మౌనిత‌తో చెబుతూ ఉంటుంది. వెంట‌నే మౌనిత‌.. లోకానికి ఠాం ఠాం చేయ‌డానికి నేను ఉన్నా క‌దా. అంత‌మంది ముందు జ‌రిగిన అవ‌మానంతో ఆ దీప‌కు జీవితం మీద విరక్తి పుట్టి పెళ్లి, పిల్ల‌లు, సంసారం మీద వ్యామోహం న‌శించి క‌చ్చితంగా ఏ గుయ్యో నుయ్యో చూసుకోవ‌డానికి వెళ్లి ఉంటుంది అని మౌనిత న‌వ్వుతూ ఉంటుంది. దానికి ప్రియ‌మ‌ణి కూడా న‌వ్వుతుంది. ఇక సూప్‌ని మౌనిత‌కు ఇచ్చిన ప్రియ‌మ‌ణి.. ఈ ఫంక్ష‌న్ మీకు అలా క‌లిసి వ‌చ్చింద‌న్న మాట అని అంటుంది. ఇక మౌనిత ఇంటికి, స‌రోజ‌క్క‌ను తీసుకొని వెళ్తుంది దీప. చెప్పింది మ‌రిచిపోకు అని చెప్ప‌గా.. అంత గుర్తు ఉంది దీప అంటుంది. ఆ త‌రువాత జాగ్ర‌త్త దీప అని అన‌గా.. నాకేం భ‌యం అంటూ లోప‌లికి వెళుతుంది. వెంట‌నే స‌రోజ బ‌య‌ట తాళం పెట్టి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.

  ఇక మౌనిత ఇంట్లో క‌త్తి ప‌ట్టుకొని కుర్చీలో కూర్చొని ఆవేశంతో.. మౌనిత చెప్పే మాట‌లను వింటుంటుంది. మౌనిత, ప్రియ‌మ‌ణితో రాత్రి పార్టీ చేసుకుందాం. దీప‌కు అవ‌మానం జరిగినందుకు, కార్తీక్ నోటితోనే దీప గురించి చెడుగా చెప్పినందుకు, దీప పీడ విర‌గ‌డ అయినందుకు అని అంటుంది. వెంట‌నే ప్రియ‌మ‌ణి.. మీరు ఏం చేసిపెట్ట‌మంటే అది చేసి పెడ‌తాను అని ప్రియ‌మ‌ణి అడుగుతుంది. మొత్తానికి ఫంక్ష‌న్‌కి పిల‌వ‌క‌పోయినా దీప రావ‌డం, దీప రావ‌డం వ‌ల్ల నాకు ఇలా క‌లిసిరావ‌డం, నేను అన్న మాట‌లు నిజ‌మేన‌ని ప్రెస్ వాళ్ల‌తో కార్తీక్ చెప్ప‌డం, అన్నీ నాకు అలా క‌లిసి వ‌చ్చాయి. ఈ అవ‌మానం త‌ట్టుకోలేక ఆ దీప ఏ చెరువు గట్టు మీద‌కు వెళ్లి కూర్చుందో అని మౌనిత‌, ప్రియ‌మ‌ణి న‌వ్వుతూ ఉంటుంది. ఆ మాట‌ల‌న్నీ ఆవేశంతో దీప వింటూ ఉంటుంది. ఇక సూప్ తీసుకొని హాల్‌లోకి వ‌చ్చి మౌనిత కూర్చొని తింటూ ఉండ‌గా.. దీప యాపిల్ ముక్క‌ను మౌనిత ప్లేట్‌లో వేస్తుంది. ఇది ఎక్క‌డిది అని అడ‌గ్గా. ఇక్క‌డిది అని దీప చెబుతుంది. దీంతో దీప‌ను చూసి ఒక్క‌సారిగా షాక్‌కి గురి అవుతుంది మౌనిత.

  ఇక దీప వ‌చ్చిన విష‌యం తెలియని ప్రియ‌మ‌ణి లోప‌లి నుంచి జాగ్ర‌త్త అమ్మా.. చ‌చ్చేముందు ఏ అఘాయిత్యమో చేసుకొని మీ పేరు రాసిందంటే కార్తీక్ అయ్య‌కు మీ మీద అనుమానం వ‌స్తుంది. ఆ పిచ్చి మారాజు ఏమో పెళ్లాన్ని ఒక్క మాట అన‌డు. అన్నీ మీరే నేర్పించాలి అని అంటూ ఉంటుంది. ఇక దీప ద‌గ్గ‌ర‌కు వెళ్లిన మౌనిత‌.. నువ్వేంటి ఇక్క‌డ‌కు వ‌చ్చావు..? అని అడుగుతుంది. ఆ మాట‌కు ప్రియ‌మ‌ణి కూడా హాలులోకి వ‌స్తుంది. ఎక్క‌డి నుంచి స‌మ‌స్య మొద‌లైందో ఆ మూలం వెతుక్కుంటూ వ‌చ్చాను అని దీప చెబుతుంది. దానికి ప్రియ‌మ‌ణి అమ్మా క‌త్తి. మీరు కూడా దూరంగా ఉండండమ్మా అని దూరంగా వెళుతుంది. నేను త‌లుచుకుంటూ ఏమైనా చేయ‌గ‌ల‌న‌ని నీ చెంచాకు కూడా బాగా అర్థం అయ్యింది అని దీప అంటుంది. వెంట‌నే మౌనిత‌..ఇదుగో దీప మ‌ర్యాద‌గా చెబుతున్నాను. నా ఇంటికి వ‌చ్చి నువ్వు గొడ‌వ చేయ‌డం క‌రెక్ట్ కాదు అని మౌనిత అన‌గా.. నా కాపురంలో మాత్రం నువ్వు చిచ్చు పెట్ట‌డం క‌రెక్ట్ అంటావా.? అని దీప తిరిగి ప్ర‌శ్నిస్తుంది.

  అస‌లు నా ఇంటికి వ‌చ్చి నీ డామినేష‌న్ ఏంటి..? అని మౌనిత అన‌గా.. మ‌రి నా మొగుడి ద‌గ్గ‌ర నీ డామినేష‌న్ ఏంటే..? అని దీప అడుగుతుంది. ఆ త‌రువాత ఇప్పుడు పూర్తిగా అర్థం అయ్యింది. నా మొగుడి మ‌న‌సు నువ్వే మార్చేస్తున్నావ‌ని, లేనిపోనివి చెప్పి మ‌న‌సు విరిచేస్తున్నావ‌ని అని దీప అంటుండ‌గా.. సో వాట్. ఇప్పుడు ఏం చేస్తావు అంటూ మౌనిత సింపుల్‌గా అనేస్తుంది. దాంతో దీప‌, మౌనిత మెడ‌ను ప‌ట్టుకుంటుంది. వెంట‌నే ప్రియ‌మ‌ణి అర‌వ‌గా.. చుప్ అని అంటుంది దీప‌. ఇక మౌనిత కార్తీక్‌కి ఫోన్ చేయ్ ప్రియ‌మ‌ణి అని అన‌గా.. ఆమె వెళుతూ ఉంటుంది. వెంట‌నే దీప‌.. ఏయ్ చెంచా నువ్వు దీని ఫోన్‌ని ముట్టుకున్నావో, నా మొగుడు వ‌చ్చే లోగా మీరు ఇద్ద‌రు ఉండ‌రు జాగ్ర‌త్త అని అంటుంది.

  అమ్మా వ‌దిలేయ‌ని కాళ్లు ప‌ట్టుకోండ‌మ్మా అని ప్రియ‌మ‌ణి, మౌనిత‌కు చెప్ప‌గా.. నేను చ‌చ్చినా ప‌ర్లేదు, మౌనిత ఎప్పుడూ దీప కాళ్ల మీద ప‌డదు అని అంటుంది. వెంట‌నే మౌనిత‌ను కొట్టిన దీప‌, ఆమె త‌న కాళ్లు మీద ప‌డేలా చేస్తుంది. వెంట‌నే ప‌డ్డావుగా లేయ్ అని లేపి.. ఏమే ఇన్ని రోజులు నా మొగుడికి నా మీద ఏదో అనుమానం ఉండేది, కానీ నా ప్ర‌వ‌ర్త‌న చూసి, నా ప‌విత్ర‌త చూసి, నా పిల్ల‌ల మొహం చూసి ఆయ‌న క‌రిగిపోయిన‌ప్పుడుల్లా.. నువ్వే ఆయ‌న మ‌న‌సు చెడ‌గొడుతున్నావ‌ని ఇవాళే పూర్తిగా అర్థ‌మైంది. ఇవాళ అంత మంది ముందు నువ్వు నా గురించి త‌ప్పుగా మాట్లాడి ఇంకా పెద్ద త‌ప్పు చేశావు. ఇన్ని రోజులు నిన్ను ఒక మ‌నిషిగానే చూడ‌లేదు. అందుకే నా కాపురం గురించి ఎక్కువ‌గా ఆలోచిస్తూ నీ గురించి త‌క్కువ‌గా ఆలోచిస్తూ వ‌చ్చాను. ఇవాళే, ఇవాళే నువ్వు నాటిన విష‌బీజంతో పెరిగిన వృక్షాన్ని మూలాల‌తో స‌హా నరికేయాల‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చాను అర్థ‌మైందా..? దీప‌, మౌనిత అంతు చూడ‌టానికే కంక‌ణం క‌ట్టుకుందే అని అంటుంది. ఉండండి అమ్మా మీరేం భ‌య‌ప‌డ‌కండి, నేను చుట్టుప‌క్క‌ల వారిని పిలుస్తాను అని ప్రియ‌మ‌ణి తలుపు ద‌గ్గ‌ర‌కు వెళుతుంది. ఎంత తీసినా త‌లుపు రాక‌పోవ‌డంతో త‌లుపు రావ‌ట్లేద‌మ్మా అని ప్రియ‌మ‌ణి అన‌గా.. వెంట‌నే దీప‌.. అది రాదే.. నేను లోప‌ల ఉండి బ‌య‌టి నుంచి తాళం పెట్టా. ఇక నుంచి మీరు ఈ ఇంట్లోనే బంధీలుగా బ‌త‌కాలి అని మాట్లాడుతుంది.

  మ‌రోవైపు ఫంక్ష‌న్ హాలులోనే ఉన్న కార్తీక్.. హిమ స‌న్మాన స‌భ‌లో చెప్పిన మాట‌ల‌ను.. అలాగే మీడియా వేసిన ప్ర‌శ్న‌ల‌ను గుర్తుచేసుకుంటూ ఉంటాడు. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో దీప‌, మౌనిత‌పై మ‌రింత ఆవేశ‌ప‌డుతుంటుంది. మొత్తానికి కార్తీక దీపం సీరియ‌ల్ ఇప్పుడు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial

  ఉత్తమ కథలు