హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: ఆచూకీ చెప్పొద్దంటూ మాట తీసుకున్న దీప‌.. ముర‌ళీకృష్ణ కీల‌క నిర్ణ‌యం.. సౌంద‌ర్య‌కు భాగ్యం సూటి ప్ర‌శ్న‌లు

Karthika Deepam: ఆచూకీ చెప్పొద్దంటూ మాట తీసుకున్న దీప‌.. ముర‌ళీకృష్ణ కీల‌క నిర్ణ‌యం.. సౌంద‌ర్య‌కు భాగ్యం సూటి ప్ర‌శ్న‌లు

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునే కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతుంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో మురళీకృష్ణ‌కు దీప దొరుకుతుంది. మ‌రోవైపు వారిద్ద‌రిని చూసిన మోనిత వెనుదిరిగి వెళ్లిపోతుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ముర‌ళీకృష్ణ ఏంట‌మ్మా ఇది అడ‌గ్గా.. బ‌త‌క‌డానికో బండి అని దీప అంటుంది.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునే కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతుంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో మురళీకృష్ణ‌కు దీప దొరుకుతుంది. మ‌రోవైపు వారిద్ద‌రిని చూసిన మోనిత వెనుదిరిగి వెళ్లిపోతుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ముర‌ళీకృష్ణ ఏంట‌మ్మా ఇది అడ‌గ్గా.. బ‌త‌క‌డానికో బండి అని దీప అంటుంది.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునే కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతుంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో మురళీకృష్ణ‌కు దీప దొరుకుతుంది. మ‌రోవైపు వారిద్ద‌రిని చూసిన మోనిత వెనుదిరిగి వెళ్లిపోతుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ముర‌ళీకృష్ణ ఏంట‌మ్మా ఇది అడ‌గ్గా.. బ‌త‌క‌డానికో బండి అని దీప అంటుంది.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునే కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతుంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో మురళీకృష్ణ‌కు దీప దొరుకుతుంది. మ‌రోవైపు వారిద్ద‌రిని చూసిన మోనిత వెనుదిరిగి వెళ్లిపోతుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ముర‌ళీకృష్ణ ఏంట‌మ్మా ఇది అడ‌గ్గా.. బ‌త‌క‌డానికో బండి అని దీప అంటుంది. నువ్వు అని ముర‌ళీకృష్ణ అన‌గా.. వంట‌ల‌క్క‌ను క‌దా అని దీప స‌మాధానం చెబుతుంది. వెంట‌నే ముర‌ళీకృష్ణ‌.. ఎవ‌రి భార్య‌వి, ఎవ‌రి కోడ‌లివి అని అడ‌గ్గా.. టీ తాగు నాన్న చ‌ల్లారిపోతుంది అని దీప అంటుంది. అస‌లు అని ముర‌ళీకృష్ణ ఏదో చెప్ప‌బోతుండ‌గా.. నేను ఇక్క‌డ ఉన్నాన‌ని నీకు ఎలా తెలుసు అని దీప అడుగుతుంది. మీ అత్త గారు నాకు డ‌బ్బులిచ్చి అన్ని ఊర్లు వెత‌క‌మ‌న్నారు. అలా వెతుకుతూ వెతుకుతూ ఈ ఊరు వ‌చ్చాను అని ముర‌ళీకృష్ణ అన‌గా.. ఆవిడ ఎలా ఉన్నారు అని దీప అడుగుతుంది. ఎలా ఉంటారు అని ముర‌ళీకృష్ణ అన‌గా.. అవును నాలాగా గుండెను రాయి చేసుకోవ‌డం ఆవిడ‌కు తెలీదు క‌దా అని దీప చెబుతుంది. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాన‌మ్మా అని ముర‌ళీకృష్ణ అన‌గా.. ఎవ‌రికి అని దీప అడుగుతుంది. మీ అత్త‌గారికి అని ముర‌ళీకృష్ణ స‌మాధానం చెబుతాడు. దానికి దీప‌.. ఇలా కూడా ఇక్క‌డ కూడా బ్రత‌క‌నివ్వ‌వా అని అంటుంది. అదేంట‌మ్మా, ఆవిడ న‌న్ను పంపించిందే నీకోసం అని ముర‌ళీకృష్ణ అన‌గా.. నాన్న క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. మ‌నం త‌రువాత ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని దీప ప‌నిలో ప‌డుతుంది.

  ఆ త‌రువాత కాసేప‌టికి ఎక్క‌డికి నాన్న అని దీప అడ‌గ్గా.. మీ ఇంటికి అని ముర‌ళీకృష్ణ చెబుతాడు. ఎక్క‌డ నాన్న ఖాళీ చేసి వ‌చ్చాను క‌దా అని దీప అన‌గా.. ఆ ఇంటికి కాద‌మ్మా అని ముర‌ళీకృష్ణ అంటాడు. ఇంకే ఇల్లు ఉంది అని దీప అడ‌గ్గా.. పుట్టినిల్లు ఉంది, మెట్టినిల్లు ఉంది. నీ ఇష్టం ఏ ఇంటికి వ‌చ్చినా నువ్వు రావ‌డం అన్న‌దే ముఖ్యం అని ముర‌ళీకృష్ణ అంటాడు. ఎవ‌రికి ముఖ్యం అని దీప అడ‌గ్గా.. మా అందరికీ అని ముర‌ళీకృష్ణ చెబుతాడు. దానికి దీప‌.. మీ అంద‌రి లిస్ట్‌లో నా భ‌ర్త ఉన్నాడా. చెప్పు నాన్న‌, మీ అంద‌రిలో మా ఆయ‌న ఉన్నారా. లేరు. అందుకే క‌దా. లేక‌నే క‌దా నేను వ‌చ్చింది. మాకు ఆయ‌న లేర‌నే, ఆయ‌న‌కు మేము అక్క‌ర్లేద‌నే ఇలా వ‌చ్చింది అని అంటుంది. వెంట‌నే ముర‌ళీకృష్ణ‌.. నువ్విలా ఒంట‌రిగా ఉంటు క‌ష్టాలు ప‌డుతుంటే ఎలాగ‌మ్మా అని ముర‌ళీకృష్ణ అడ‌గ్గా.. నేను ఎప్పుడో ఒంట‌రిని అయిపోయాను. ఇప్పుడు కొత్త‌గా అయ్యానా.. ఎప్పుడు అయితే ఆ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చానో అప్ప‌టినుంచి ఒంట‌రి జీవిత‌మేగా నేను గ‌డిపేది. నాకు పుట్టిల్లు లేదు, ఉన్న రాను, అది నాకు గౌర‌వం కాదు., మీకు గౌర‌వం కాదు., నా భ‌ర్త‌కు గౌర‌వం కాదు., నా అత్త గారికి గౌర‌వం కాదు. ఫ‌లానా వారి భార్య‌, ఫ‌లానా వారి కోడ‌లు భ‌ర్త‌ను వ‌దిలేసి పుట్టింట్లో ఉంద‌నో, భ‌ర్త వ‌దిలేస్తే పుట్టింట్లో ఉంద‌నో ప‌ది మంది మాట్లాడుకుంటుంటే నా వ‌ల్ల మీ గౌర‌వం పోతుంది. నా వాళ్ల గౌర‌వం పోతుంది. అందుకే రాను నాన్న అని దీప చెబుతుంది. దానికి ముర‌ళీకృష్ణ‌.. నువ్వు ఒంట‌రిగా ఉన్నా కూడా నీ భ‌ర్త నిన్ను వ‌దిలేశాడ‌నో, నీ భ‌ర్త‌ను నువ్వు వ‌దిలేశావ‌నో అనుకుంటారు అని అన‌గా.. అప్పుడు అది కేవ‌లం నాకే ప‌రిమితం అవుతుంది నాన్న. నేను ఫ‌లానా వాళ్ల కోడ‌ల్ని అని, ఫ‌లానా వాళ్ల కూతురును అని చెప్పుకోరు క‌దా. కాబ‌ట్టి ఏ నింద ప‌డ్డా నా మింద‌నే ప‌డుతుంది. క‌నీసం నా క‌ష్టాలు చూసి నా మీద సానుభూతి అయినా ఉంటుంది అని దీప చెబుతుంది. మ‌రి అల్లుడు ఏమైపోయినా ఫ‌ర్వాలేదా అని ముర‌ళీకృష్ణ అడ‌గ్గా.. ఏం ప్ర‌శ్న నాన్న అది. ఆయ‌న ఏమైపోతారు. ఆయ‌న కోరుకున్న‌దే క‌దా జ‌రిగింది. నేను ఆయ‌న మ‌న‌సులో లేను. ఇంట్లో ఉన్నా, ఊర్లో ఉన్నా అన‌వ‌స‌రం క‌దా. ఊరు వ‌దిలేసి వ‌స్తే మాత్రం ఆయ‌న‌కు ఏంటి బాధ అని దీప అంటుంది.

  పిల్ల‌ల కోసం త‌ల్లడిల్లిపోతున్నాడ‌మ్మా అని ముర‌ళీకృష్ణ అన‌గా.. నీ మ‌న‌సు క‌రిగిపోయిందా నాన్న అని దీప అడుగుతుంది. నిజంగా ఆయ‌న బాధ‌ను చూసి నాకు బాధ వేసింద‌మ్మా అని ముర‌ళీకృష్ణ అన‌గా.. పిల్ల‌ల కోసం త‌ల్ల‌డిల్లిపోయే తండ్రి, ఆ పిల్ల‌లు త‌న పిల్ల‌లో కాదో తేల్చుకోవ‌డానికి టెస్ట్‌లు చేయించుకోమంటే చేయించుకున్నాడా.. లేదే.. ఇప్ప‌టికీ వాళ్ల‌ను ఆయ‌న త‌న పిల్ల‌లు కాద‌నే అనుకుంటున్నాడు. వాళ్ల‌ను ఇస్తే అనాథ‌ల‌ను పెంచుకున్ట్న‌ట్లు పెంచుకుంటాడు. దేశోద్ధార‌కుడు క‌దా క‌న్న‌బిడ్డ‌ల్లా ఎందుకు పెంచుతాడు నాన్న అని దీప అంటుంది. పోనీ ఆయ‌న కోసం కాదు మీ అత్త గారి కోసం రా. ఆవిడ ఏమైపోతారో ఆలోచించ‌మ్మా. క‌నీసం నీ బిడ్డ‌ల భ‌విష్య‌త్ కోస‌మైనా నీకు నీ అత్త‌గారి అండ కావాల‌మ్మా అని ముర‌ళీకృష్ణ అన‌గా.. నేను నా బిడ్డ‌ల‌ను క‌ష్ట‌ప‌డి పెంచుకోగ‌ల‌ను నాన్న‌. ద‌య‌చేసి న‌న్ను వెన‌క్కి ర‌మ్మ‌ని అడ‌గొద్దు. నేను ఎక్క‌డికి రాద‌లుచుకోలేదు అని దీప అంటుంది. అదే స‌మ‌యానికి సౌంద‌ర్య ఫోన్ చేస్తుంది.

  మీ అత్త గారి ఫోన్ అని ముర‌ళీకృష్ణ అన‌గా.. దీప ముర‌ళీకృష్ణ చేతిని త‌న త‌ల మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పండి నాన్న . ఆవిడ‌కు ఏం చెబుతారో చెప్పండి. నేను క‌నిపించాను అని చెప్పారంటే ఇంకెప్ప‌టికీ ఎవ్వ‌రికీ క‌నిపించ‌ను. చెప్పండి నాన్న‌ అని అంటుంది. ఇక కాస్త ప‌క్క‌కు వెళ్లి సౌంద‌ర్య ఫోన్‌ను లిఫ్ట్ చేస్తాడు ముర‌ళీకృష్ణ‌. ఫోన్‌లో సౌంద‌ర్య‌.. ముర‌ళీకృష్ణ గారు దీప అని అడ‌గ్గా.. దొర‌క‌లేద‌మ్మా అని ముర‌ళీకృష్ణ అంటాడు. ఆ త‌రువాత దొరుకుతుందో లేదో. మీరేం టెన్ష‌న్ ప‌డ‌కండ‌మ్మా అని ముర‌ళీకృష్ణ అన‌గా.. మీరు దొరుకుతుందో లేదో అని ఎందుకు అన్నారు. మీ మీద న‌మ్మ‌కంతోనే పంపించాను. క‌న్న‌తండ్రి కాబ‌ట్టి క‌చ్చితంగా వెతుకుతార‌నే ధైర్యంతో ఉన్నాను. మీరు అలా నిరాశ‌గా మాట్లాడ‌కండి ప్లీజ్. ఇక్క‌డ నేను స్థిమితంగా ఉండ‌లేను. క‌చ్చితంగా తీసుకువ‌స్తాన‌ని నాకు హామీ ఇవ్వండి అని అంటుంది. ముర‌ళీకృష్ణ సైలెంట్‌గా ఉండ‌గా.. ముర‌ళీకృష్ణ గారు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు హామీ ఇవ్వ‌డం లేదు. అది క‌నిపించిందా.. రానందా.. చెప్పొద్దు అందా.. మీతో అబ‌ద్ధం చెప్పిస్తోందా.. వెత‌క‌డం పూర్తి కాకుండానే దొర‌క‌దు దొర‌క‌దు అని ఎందుకు అంటున్నారు అని సౌందర్య ప్ర‌శ్నిస్తుంది.

  దానికి ముర‌ళీకృష్ణ త‌త్త‌ర‌పడుతూ.. అమ్మా. నేను అబ‌ద్ధం చెప్ప‌డం లేద‌మ్మా అని అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. ఎందుకు మీ గొంతులో త‌డ‌బాటు ధ్వ‌నిస్తోంది అని అడుగుతుంది. దీప ప‌రిస్థితి గుర్తు వ‌చ్చి, దాని బిడ్డ‌ల గ‌తి ఏమైపోతుందేన‌ని భ‌యం వేసి గొంతుకు దుఃఖం అడ్డం ప‌డుతుందమ్మా. అందుకే తండ్రి గొంతు మూగ‌బోయింది అని ముర‌ళీకృష్ణ అన‌గా.. మీరు నిరాశ ప‌డ‌కండి. న‌న్ను నిరాశ ప‌ర్చ‌కండి. ద‌య‌చేసి దాన్ని వెతికి తీసుకురండి. కనీసం ఆచూకీ చెప్పినా చాలు నేను వ‌చ్చి తీసుకొస్తాను. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ రాను అంటే ఈసారి నేను రెండు చెంప‌లు వాయించి తీసుకొస్తాను అని సౌంద‌ర్య అంటుంది. దానికి ముర‌ళీకృష్ణ‌.. నా కంటే ముందుగా మీకు క‌నిపిస్తే నా మాట కంటే మీకే విలువ ఇస్తుందేమో అని అంటాడు. ఇక్క‌డ నా ప్ర‌య‌త్నాలు నేను చేస్తున్నాను ముర‌ళీకృష్ణ గారు అని సౌంద‌ర్య అన‌గా.. మీక‌న్నా క‌నిపించాల‌ని ఆ దేవుడిని కోరుకుంటాన‌మ్మా. ఉంటాను అని ముర‌ళీకృష్ణ అంటాడు. ఆ త‌రువాత త‌న ఫోన్ లిఫ్ట్ చేయ‌డం లేద‌ని భాగ్యం అన‌గా.. మీరు భాగ్యంకు ఫోన్ చేయండి. భాగ్యంను కూడా ప‌ట్టించుకోండి. ఖాళీగా ఉన్న‌ప్పుడు ఆమెకు ఫోన్ చేయండి అని సౌంద‌ర్య‌, ముర‌ళీకృష్ణ‌తో అంటుంది. దానికి ముర‌ళీకృష్ణ స‌రేన‌మ్మా. త‌న‌కు ఒక గంట ఆగి ఫోన్ చేస్తాను అని చెబుతాడు.

  ఆ త‌రువాత భాగ్యం.. వ‌దినా ఆయ‌న క్షేమంగా ఉన్నారు క‌దా అడ‌గ్గా.. ఉన్నార‌ని సౌంద‌ర్య అంటుంది. దాంతో భాగ్యం.. నేను చేసే చిత్ర‌ప‌ట మాంగ‌ళ్య వ్ర‌తం వ‌ల‌నే ఆయ‌న క్షేమంగా ఉన్నారు అని అంటుంది. అదేం వ్ర‌తం అని సౌంద‌ర్య అడ‌గ్గా.. చిత్ర‌ప‌ట మాంగ‌ళ్యవ్ర‌తం అని భాగ్యం చెబుతుంది. ఇక సౌంద‌ర్య, భాగ్యంను చిత్రంగా చూసి టీ తాగాల‌ని తాగుతుంది.

  మ‌రోవైపు ముర‌ళీకృష్ణ‌, దీప‌తో.. విన్నావా అమ్మా. మీ అత్త గారు ఎంత టెన్ష‌న్ ప‌డుతున్నారో తెలుసా అని అన‌గా.. తెలుసు. మొక్కే దేవుడు వ‌రాలు ఇవ్వ‌నప్పుడు ఇంకో దేవుడి గుడిలోకి వెళ్లి ఆ దేవుడికి చెప్పి వ‌రాలు ఇప్పించ‌మ‌ని చెప్తే.. ఏ దేవుడు, దేవుడి మాట విన‌డు. అయినా నేను. సిఫార్సు మీద కాపురం నిల‌బెట్టుకోవాల‌నుకోవ‌డం లేదు. నా భ‌ర్త‌లో మార్పు వ‌స్తే నన్ను ఎవ్వ‌రూ ర‌మ్మ‌న‌క్క‌ర్లేదు. నా భ‌ర్త ర‌మ్మంటే చాలు. త‌ల వంచుకొని వ‌స్తాను. అప్ప‌టిదాకా నా నిర్ణ‌యంలో మార్పు ఉండ‌దు అని దీప చెబుతుంది. దానికి ముర‌ళీకృష్ణ‌.,. అయితే నేను ఒక నిర్ణ‌యం తీసుకున్నాన‌మ్మా. అల్లుడు మ‌న‌సు మారి, నిన్ను వెతుక్కుంటూ వ‌చ్చే వ‌ర‌కు నిన్ను ర‌మ్మ‌నే వ‌ర‌కు నేను నీకు తోడుగా ఇక్క‌డే ఉంటాను. నువ్వు కాద‌న‌కూడ‌దు అని అంటాడు. నువ్వా, మ‌రి పిన్ని ప‌రిస్థితి అని దీప అన‌గా.. దాన్ని నేనేం దిక్కుమొక్కు లేకుండా వ‌దిలేయ‌న‌మ్మా. కావాలంటే మ‌ధ్య మ‌ధ్య‌లో వెళ్లి చూసి వ‌స్తాను. నిన్ను వెతుకుతున్నాన‌నే చెబుతాను. నువ్వు మాత్రం కాద‌న‌కు. న‌న్ను వెళ్ల‌మ‌న‌కు. న‌న్ను వెళ్లిపోమంటే మాత్రం ఇక్క‌డే ఉండి మీ అత్త‌గారికి ఫోన్ చేస్తాను. ఆ త‌రువాత మీరు మీరు చూసుకోండి. ఇంకేం మాట్లాడ‌కు. నేను బండి ద‌గ్గ‌ర క‌స్ట‌మ‌ర్ల‌ను చూసుకుంటాను అని ముర‌ళీకృష్ణ అంటాడు.

  ఇక సౌంద‌ర్య ఏదో ఆలోచిస్తూ టీ క‌ప్పు కింద ప‌డేయ‌బోతుంది. దాన్ని ప‌ట్టుకున్న భాగ్యం.. అయ్యో వ‌దిన మీ మ‌న‌సు ఇక్క‌డ లేదు. అస‌లు మీరు ఏదో చెప్పాల‌ని వ‌చ్చారు. ఏమీ చెప్ప‌నేలేదు అని అడుగుతుంది. దానికి సౌంద‌ర్య‌.. ఏమీ లేదు భాగ్యం, ముర‌ళీకృష్ణ గారు ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోయే స‌రికి నీతో ఏమైనా చెప్పాడా అని క‌నుక్కుందామ‌ని వ‌చ్చాను. రాగానే నీకు ఫోన్ చేయ‌డం లేద‌ని తెలుస్తుంది. అయినా మాట్లాడేశాం కదా అని అంటుంది. మ‌రి దేని గురించి ఆలోచిస్తున్నారు అని భాగ్యం అడ‌గ్గా.. ఇంకేం ఆలోచిస్తా. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే. పిల్ల‌ల‌ను తీసుకొని ఊరు వ‌దిలి వెళ్లిపోవాలా.. దూరంగా వెళ్లిపోయినంత మాత్రానా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుందా అని సౌంద‌ర్య అంటుంది. అది ఇక్క‌డ ఉండి మాత్రం ప‌రిష్కారం ఉందా వ‌దినా. నేను స‌వ‌తి త‌ల్లిని అయినా దీప మా ఇంటి పిల్ల క‌దూ వ‌దిన. దాని త‌ర‌ఫున ఒక రెండు నిమిషాలు మాట్లాడొచ్చా వ‌దినా. దీప ప‌దేళ్లు ఉందా. మారిందా. ప‌దేళ్లు ఎదురుచూసింది, మారాడా.. దాని ప‌రిస్థితి మారిందా.. ఆయ‌న మార‌డ‌ని తెలిసి అదే మారింది, ఊరు మారింది, దాని మ‌న‌సు మారింది. మార‌ని మ‌నిషి కోసం ఇంకా ఎన్నేళ్లు ఎదురుచూస్తుంటే బావుంటుంది అంటారు. ఈ యేడు దాటితే డాక్ట‌ర్ బాబు క్ష‌మిస్తాడు అంటారా.. ఇంకే యేడు దాటితే పూర్తిగా క్ష‌మిస్తారా.. అస‌లు ఇంకా ఎన్నేళ్లు గ‌డిచినా దాన్ని న‌మ్ముతారా.. అస‌లు ఏ నింద అయితే దాని నెత్తిమీద వేసి ఇన్నేళ్లుగా దాన్ని వ‌దిలిపెట్టాడో.. ఆ నింద నిందేన‌ని, నిజం కాద‌ని ఆ విహారి భార్య తుల‌సే స్వ‌యంగా చెప్పింది. విహారికి పిల్ల‌లు పుట్టే అవ‌కాశ‌మే లేద‌ని, ఆ నిజం ఒక్క‌టే దీప‌కు ఉన్న ఆఖ‌రి ఆధారం. ఆ మాట కూడా న‌మ్మ‌క‌పోగా దీప ఎందుకు ఉండాలి వ‌దినా.. ఒక్క కార‌ణం చెప్పండి. అది చేసింది త‌ప్పే అంటారా.. పిల్ల‌ల‌ను తీసుకొని వెళ్లిపోవ‌డం త‌ప్పే అంటారా.. స‌రే త‌ప్పే. అలిగి చిన్న‌పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన‌ట్లు ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకొని వెళ్లిపోవ‌డం మీ కుటుంబానికి మ‌చ్చనే. కాద‌న‌డం లేదు. ఇటు క‌న్న‌తండ్రికి కూడా బాధే. వెళ్లిపోకుండా ఉండి ఉంటే దాని కాపురాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా.. ఏవైనా అవ‌కాశాలు ఉన్నాయా.. ఉండే ఏం ఒరిగేది చెప్పండి వ‌దినా.. లేవు. లేనివి ఏమ‌ని తీసుకొస్తారు. దీప వెళ్లిపోయిన‌ప్ప‌టి నుంచి దాని కోసం మీరు బాధ‌ప‌డుతున్నారు. పిల్ల‌ల కోసం డాక్ట‌ర్ బాబు బాధ ప‌డుతున్నాడు. కుటుంబం ఇలా అయిపో్యింద‌ని అన్న‌య్య గారు హార్ట్ ఎటాక్ తెచ్చుకున్నారు. ఈ బాధ అంతా అది వెళ్లిపోయాక ప‌డితే ఏం లాభం అంటున్నాను. ఉన్నప్పుడే మ‌న‌వరాళ్ల కోస‌మైనా దాని కాపురం నిల‌బెట్టారా.. ఎంతో పెద్ద కంపెనీ న‌డుపుతున్న మీరు క‌న్న‌కొడుకు మ‌న‌సు మార్చ‌లేక‌పోయారు. ఇక వంట‌ల‌క్క ఏం మారుస్తుంది వ‌దిన అని భాగ్యం అడుగుతుంది.

  దాంతో సౌంద‌ర్య‌, భాగ్యం అని అన‌గా.. నేను భాగ్యాన్నే వ‌దినా. మీ ముందు నిల‌బ‌డానికి కూడా భ‌య‌ప‌డే భాగ్యాన్ని. కానీ నేను కూడా మాట్లాడే ప‌రిస్థితి వ‌చ్చింది. స‌వ‌తి త‌ల్లిని కాబట్టి నేను ప‌ట్టించుకోలేదు. మా ఆయ‌న పేద తండ్రి కాబ‌ట్టి మీ అబ్బాయి ఆయ‌న నోరును మూయించారు. దీప నిప్పు అని మీకు తెలీదా.. అడిగితే మీరు కోట్లు రాసివ్వ‌లేరా..కానీ అది ఐశ్వ‌ర్యం క‌న్నా సౌభాగ్య‌మే ముఖ్య‌మ‌నుకుంది. ఆస్తుల క‌న్నా ఆత్మాభిమాన‌మే గొప్ప‌ద‌నుకుంది. అందులో నాకు త‌ప్పు ఏంటో క‌నిపించ‌డం లేదు వ‌దినా. ఒంట‌రి దాన్ని చేశారు క‌దా. అది ఇక్క‌డ ఉంటే ఏంటి. ఎక్క‌డ ఉంటే ఏంటి. ఇప్పుడు కూడా మా ఆయ‌న వెత‌క‌డానికి వెళ్తాను అంటే స‌రేన‌న్నాను. ఎందుకంటే క‌న్న కూతురు ఎక్క‌డో ఒక చోట క్షేమంగా ఉంది అని తెలిస్తేన‌న్నా ఆ తండ్రి మ‌న‌సు శాంత‌ప‌డుతుంద‌ని పంపాను. ఆయ‌న దాన్ని వెతికి తీసుకొస్తార‌న్న న‌మ్మ‌కం లేదు. అంతగా మ‌న‌సు విరిగిపోయాక ఆ దీప తిరిగి వ‌స్తుంద‌న్న ఆశ లేదు. మీ అబ్బాయి మాత్రం పెంచుకున్న బిడ్డ ఎక్క‌డుంది అంటూ మా ఆయ‌న మీద ఎగ‌రడానికి వ‌చ్చాడు వ‌దినా ఎందుకు. ఎవ‌రో చెప్తేనే క‌దా ఇక్క‌డ దాకా వ‌చ్చింది. ఎవ‌రో చెప్తేనే క‌దా దాన్ని వ‌దిలేసింది. ఎవ‌రో చెప్తేనే కదా దాన్ని న‌మ్మ‌నిది. ఎవ‌రో చెప్తేనే క‌దా మీ న‌మ్మ‌కాన్ని కూడా కొట్టిపడేసింది. ఆ ఎవ‌రో చెప్పే చెప్పుడు మాట‌లు విన్నంత కాలం మీ అబ్బాయిని ఆ దేవుడు కూడా మార్చ‌లేడు వ‌దినా అని భాగ్యం అంటుంది. వెంట‌నే సౌంద‌ర్య సోఫా నుంచి లేయ‌గా.. నేను ఏదైనా ఎక్కువ‌గా మాట్లాడి ఉంటే క్ష‌మించు వ‌దినా. ఏదో అర్థ‌పావంత ఉడ‌కేసుకొని ఉన్న దాంట్లో అది పొదుపో, పిసినారిత‌న‌మో తెలీక పిచ్చిలో కొట్టుకుపోతున్న‌దాన్ని. అలాంటి నాకే దీప బ్ర‌తుకు చూస్తే గుండె త‌రుక్కుపోయి అది వెళ్లిపోవ‌డంలోనే న్యాయం ఉంది అనిపించింది అని భాగ్యం చెబుతుంది. ఆ మాట‌ల‌తో సౌంద‌ర్య ఏదో ఆలోచిస్తూ అక్క‌డి నుంచి వెళుతుంది. ఇక దీప ద‌గ్గ‌ర ముర‌ళీకృష్ణ పిండి రుబ్బుతూ ఉంటాడు. వంశీ(వార‌ణాసి త‌మ్ముడు) వ‌చ్చి ఏంటి స‌ర్ ఇది అడుగుతాడు. ఇక దీప కూడా వ‌చ్చి నేను రుబ్బుతాను అని అంటుంది. కార్తీక దీపం కొన‌సాగుతుంది.

  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు