హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: పిల్ల‌లిద్ద‌రినీ కార్తీక్ ద‌గ్గ‌ర‌కు పంపేందుకు దీప నిర్ణ‌యం.. మోనితను పెళ్లి చేసుకుంటాన‌ని ఇంట్లో చెప్పిన కార్తీక్

Karthika Deepam: పిల్ల‌లిద్ద‌రినీ కార్తీక్ ద‌గ్గ‌ర‌కు పంపేందుకు దీప నిర్ణ‌యం.. మోనితను పెళ్లి చేసుకుంటాన‌ని ఇంట్లో చెప్పిన కార్తీక్

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. పిల్ల‌లిద్ద‌రినీ తీసుకొని దీప వేరే ఊరికి వెళ్లిపోగా.. హిమ‌ను తీసుకొస్తే పెళ్లి చేసుకుంటాన‌ని కార్తీక్, మోనిత‌కు మాటిస్తాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో ముర‌ళీకృష్ణ‌.. దీప‌, కార్తీక్‌ల ఫొటోను చూసుకుంటూ

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. పిల్ల‌లిద్ద‌రినీ తీసుకొని దీప వేరే ఊరికి వెళ్లిపోగా.. హిమ‌ను తీసుకొస్తే పెళ్లి చేసుకుంటాన‌ని కార్తీక్, మోనిత‌కు మాటిస్తాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో ముర‌ళీకృష్ణ‌.. దీప‌, కార్తీక్‌ల ఫొటోను చూసుకుంటూ

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. పిల్ల‌లిద్ద‌రినీ తీసుకొని దీప వేరే ఊరికి వెళ్లిపోగా.. హిమ‌ను తీసుకొస్తే పెళ్లి చేసుకుంటాన‌ని కార్తీక్, మోనిత‌కు మాటిస్తాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో ముర‌ళీకృష్ణ‌.. దీప‌, కార్తీక్‌ల ఫొటోను చూసుకుంటూ

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. పిల్ల‌లిద్ద‌రినీ తీసుకొని దీప వేరే ఊరికి వెళ్లిపోగా.. హిమ‌ను తీసుకొస్తే పెళ్లి చేసుకుంటాన‌ని కార్తీక్, మోనిత‌కు మాటిస్తాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో ముర‌ళీకృష్ణ‌.. దీప‌, కార్తీక్‌ల ఫొటోను చూసుకుంటూ.. ఈ ఫొటోనే కాదు నిన్ను అఙ్ఞాతంలోకి పంపించాడు ఆ మ‌హానుభావుడు. ఎక్క‌డ ఉన్నావో, ఎలా ఉన్నావో అని అనుకుంటాడు. అదే స‌మ‌యానికి అటుగా వ‌చ్చిన కార్తీక్ ఆ ఫొటోను తీసుకొని నేల‌కేసి కొడ‌తాడు. ఆ శ‌బ్దానికి భాగ్యం లోప‌లి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇక ముర‌ళీకృష్ణ కోపంతో డాక్ట‌ర్ బాబు అని అరుస్తాడు. ఏమిటీ ఈ దౌర్జ‌న్యం, మీరు ఎప్పుడూ ఏం అంటున్నా ప‌డుతున్నా క‌దా అని మా స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారా.. ఆడ‌పిల్ల‌ల తండ్రి స‌హ‌నానికి కూడా ఒక హ‌ద్దు ఉంటుంది. కొంచెం సంస్కారం నేర్చుకోండి అని ముర‌ళీకృష్ణ అంటాడు.

  వెంట‌నే కార్తీక్.. ఏంటి నేను సంస్కారం నేర్చుకోవాలా. అది మీ ద‌గ్గ‌ర నుంచి, మీ సంస్కారం అంత గొప్ప‌దా.. మీ స‌హ‌నం హ‌ద్దులు దాటిపోయిందా..ఎందుకు.. ఏం ఘ‌న‌కార్యం సాధించార‌ని, ఒక ఆడ‌పిల్ల త‌ల్లిగా మీరు ఏం వెల‌గ‌బెట్టారు. ఇద్ద‌ర్ని క‌న్నారు. రూపాయి ఖ‌ర్చు లేకుండా మా ఇంటికి పంపారు. సంస్కారం మాదా.. మీదా.. మీ ద‌గ్గ‌ర సంస్కారం నేర్చుకోవాలా.. సంస్కారం స‌ర్వ‌నాశ‌నం చేసిన ఘ‌న‌త సాధించినందుకా.. నేను నిజం చెప్తే ఆ నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నారు. అటువంటి సంస్కారం మీ నుంచి నేను నేర్చుకోవాలా.. సంసారం ముక్క‌లై నీ కూతురు రోడ్డున ప‌డితే ఆశ్ర‌యం ఇవ్వ‌డం మానేసి నీ రెండో భార్య‌కు భ‌య‌ప‌డి కూతురిని వీధుల పాలు చేశావు. ఆ పెద్ద‌రికం నుంచి సంస్కారం నేర్చుకోవాలా.. ఎంతో ప్రేమ‌గా నా కూతురిని నేను పెంచుకున్నానండి. నీ కూతురు దాన్ని కూడా తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయింది. నా బిడ్డ‌ను నా నుంచి దూరం చేసిన నీ బిడ్డ‌ను ఇంకా నేను క్ష‌మిస్తూ పోవాలా.. ఎక్క‌డుంది నా కూతురు. ఎక్క‌డ దాచిపెట్టింది నీ కూతురు నా కూతురిని అని ఫైర్ అవుతాడు.

  ఇక ముర‌ళీకృష్ణ అంతే కోపంతో.. ఆగండి ఏమ‌న్నారు మీ కూతురా.. ఎక్క‌డి నుంచి వ‌చ్చింది మీ కూతురు. ఏ భార్య‌కు క‌న్నారు మీ కూతురిని. నా కూతురు నా కూతురు అంటున్నారే. నా కూతురు లేకుండా మీ కూతురు ఎక్క‌డి నుంచి పుట్టుకొచ్చింద‌య్యా అని అంటాడు. ఇక కార్తీక్.. ఎలా పుట్టిందో అని అన‌బోయి ఆగిపోయి తెలిశాకనే నీ కూతురిని నేను దూరం పెట్టాను అని అంటాడు. వెంట‌నే ముర‌ళీకృష్ణ‌.. డాక్ట‌ర్ బాబు. మ‌ర్యాద‌. మ‌ర్యాద‌గా మాట్లాడండి. ప‌దేళ్ల నుంచి ఇదే మాట‌. ఏళ్లు గ‌డిచినా ఇదే మాట‌. ఎన్నేళ్ల‌ని ప‌డుతుంది నా కూతురు. అదీ మ‌నిషే. దానికి మ‌న‌సుంది. మీకు దాన్ని మాట‌ల‌తో చిత్ర‌వ‌ధ చేసే హ‌క్కు ఎవ‌రు ఇచ్చారు. దాన్ని దారుణంగా అవ‌మానించే హ‌క్కు ఎవ‌రిచ్చారు అని అడుగుతాడు. దానికి కార్తీక్.. హ‌క్కు, అధికారం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏ హ‌క్కు, అధికారంతో నా కూతురును అది తీసుకెళ్లింది మ‌రి అని అడుగుతాడు. దానికి ముర‌ళీకృష్ణ‌.. అది న‌వ‌మోసాలు మోసి క‌నింది. ఆ హ‌క్కుతో తీసుకెళ్లింది అన‌గా.. నేను ప‌దేళ్లు పెంచి, పెద్ద చేశాను. నాకేం అధికారం లేదా అని కార్తీక్ అడుగుతాడు.

  దానికి ముర‌ళీకృష్ణ న‌వ్వుతూ.. ఏంటి. ఆ రోజు దీప తీసుకెళ్లిపోతుంటే ఎందుకు ఆప‌లేక‌పోయారు. ఆ ప‌సిదాని పుట్టుక మీద అనుమానంతోనే క‌దా. ఇప్పుడు ఇప్పుడు పెంచిన మ‌మ‌కారం గుర్తు వ‌చ్చింది. అప్పుడు ఏమైంది ఆ మ‌మ‌కారం మంట‌గ‌లిసిందా అని అడుగుతాడు. వెంట‌నే కార్తీక్.. నీ కూతురే. నీ కూతురే నాలో మ‌నిషిని చంపేసింది. నీ కూతురే నాతో తండ్రి మ‌న‌సును చిధిమేసింది. నేను మోస‌పోయాను అని అర్థ‌మ‌య్యేస‌రికి ఆల‌స్యమైంది. పెంచిన ప్రేమ చంపుకోలేక నా కూతురిని అడిగితే ఇవ్వ‌ను అనేసింది. అయినా ఇక్క‌డే ఎక్క‌డో ఉంటుందిలే. దూరం నుంచైనా చూడ‌చ్చులే అనుకుంటే.. కావాల‌నే నీ కూతురు, నా బిడ్డ‌ను దూరంగా తీసుకెళ్లింది అని అంటాడు. ఇక ముర‌ళీకృష్ణ ఏడుస్తూ.. నా కూతురు, దాని బిడ్డ‌ను కావాల‌నే తీసుకెళ్లిందా. గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి ఆ మాట‌. మీరు అనుమానిస్తే వెళ్లింది. అవ‌మానిస్తే వెళ్లింది. తిన్నా, తిన‌క‌పోయినా క‌ష్ట‌ప‌డి సౌర్య‌ను పెంచుకుంది. అక్క‌డా ఇక్క‌డా బాక్సులు వేసి అన్నం అమ్ముకొని బ‌తికింది. బ‌ట్ట‌లు కుట్టుకుని బ‌తికింది. ఏనాడు క‌న్న‌తండ్రి నుంచి గానీ, క‌ట్టుకున్న భ‌ర్త నుంచి గానీ, అత్త గారి నుంచి గానీ, తోడ‌బుట్టిన చెళ్లి నుంచి గానీ న‌యా పైసా ఆశించ‌కుండా ఆత్మాభిమానంతో బ‌తికింది. అయినా దాన్ని కుదురుగా ఉండ‌నివ్వ‌లేదు. ఎదురుప‌డిన‌ప్పుడ‌ల్లా మాట‌ల‌తో చిత్ర‌వ‌ధ చేశారు. ప్ర‌తిసారి చెడిపోయింద‌నే నింద‌తోనే దాన్ని తూల‌నాడారు. దాని ప‌సిబిడ్డ‌ల పుట్టుక‌మీదే క‌లంకాన్ని రుద్దారు. ఏ ఆడ‌దైనా ఎంత‌కాలం భ‌రిస్తుంద‌య్యా. ఏడ్చి ఏడ్చి అలిసిపోయి ఇక మ‌నిషిలా మార‌డు అని మ‌న‌సును క‌ట్టేసుకొని దూరంగా వెళ్లిపోయింది. వెళ్లిపోయిన దాని మీద సానుభూతి చూపించాల‌న్న సంస్కారం ఎలాగో లేదు. క‌నీసం దాన్ని విమ‌ర్శించ‌డం మానేయండి. మీరు చ‌దువుకున్న చ‌దువు, విఙ్ఞానం వ‌డ్డించ‌కండి అని అంటాడు.

  వెంట‌నే కార్తీక్.. ఏయ్. పోవ‌య్యా. నా వంశాన్నే భ్ర‌ష్టుప‌ట్టించి పోయింది నీ కూతురు. మా కుటుంబ గౌర‌వాన్నే కాల‌రాసి పోయింది నీ కూతురు. దాని గురించి నేను మ‌ర్యాద‌గా మాట్లాడేది ఏంటి.. నేను పెంచుకున్న కూతురు నాకు కావాలి. చెప్పు ఎక్క‌డ ఉంది నా కూతురు అని అడుగుతాడు. దానికి ముర‌ళీకృష్ణ ఏడుస్తూ.. ఎక్క‌డుందో. చీక‌ట్లో ఉందో, అడ‌విలో ఉందో , అడుక్కుతింటూ ఉంటుందో, ప‌స్తుల‌తో మాడిపోతూ ఉంటుందో, అనాథ‌గా ఏ పంచ‌న ప‌డి ఉంటుందో, ఇల్లు వాకిలి లేక ఏ గుడి వాకిటి ముందు త‌ల‌దాచుకొని ఉంటుందో, అత్తింటికి పుట్టింటికి దూర‌మైన ఆడ‌ది ముక్క‌లైపోయిన మ‌న‌సుతో ఏ నుయ్యో, గొయ్యో చూసుకుంటుందో ఎవ‌రికి తెలుసయ్యా. ఎక్క‌డుంద‌ని న‌న్ను అడుగుతావేంటి.. మీ ఇంటి గ‌డ‌ప దాటిన నాటే నా ఇంటి గ‌డ‌ప తొక్క‌లేదు. ఇప్పుడు ఇక్క‌డికి ఎందుకు వ‌స్తుంది. మీ నీడ కూడా ప‌డ‌ని చోటుకు వెళ్లి ఉంటుంది. ఎవ్వ‌రూ చూడ‌ని ఒంటరి జీవితాన్ని గ‌డుపుతూ ఉంటుంది అని అంటాడు.

  ఇక కార్తీక్.. నాట‌కాలు ఆపండి. నీ కూతురు ధైర్యంగా బ‌త‌క‌డానికి కార‌ణం నేను కాదు. దాని బ‌తుకును అదే మ‌ట్టిపాలు చేసుకుంది. అందుకే నాకు ఓ సానుభూతి ఉంది. కానీ నా బిడ్డ ఎన్ని క‌ష్టాలు ప‌డుతుందో, ఏమైందో అని అన‌గా.. నిజంగా నాకు తెలీదు డాక్ట‌ర్ బాబు. మీరు నిజం తెలీకుండా పెంచుకున్న కూతురి కోసం బాధ‌ప‌డుతున్నార‌నుకున్నా. నేను నా క‌న్న‌కూతురు కోసం ఏడుస్తున్నాను. తండ్రి గుండె ఎవ‌రికైనా ఒక‌టే. నిజంగా నాకు తెలీదు అని దండం పెడ‌తాడు. ఇక భాగ్యం కూడా.. అవును బాబు. నిజంగా అది మాకు ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా వెళ్లిపోయింది. మా ఆయ‌న మీదొట్టు అని అంటుంది. ఇక కార్తీక్.. ఆల్ రైట్‌. ఎక్క‌డున్నా. ప్ర‌పంచంలో ఎక్క‌డున్నా నేను నా కూతురిని వెతికి తెచ్చుకుంటాను. తెచ్చుకుంటాను అని అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

  మ‌రోవైపు ఆనంద‌రావును పైనుంచి సౌంద‌ర్య తీసుకొని వ‌స్తుంటుంది. మ‌ధ్య‌లో ఆనంద‌రావు, ఆదిత్య‌తో చెప్పావా అని అడ‌గ్గా.. చెప్ప‌లేదండి ఇప్పుడు చెబుతాను అని శ్రావ్య‌ను పిలుస్తుంది. వెంటనే ఆదిత్య‌, శ్రావ్య బ‌య‌ట‌కు వ‌స్తారు. ఏంటి మ‌మ్మీ ఈ టైమ్‌లో అని ఆదిత్య అడ‌గ్గా.. శంక‌ర‌మ‌ఠంలో శివ‌రాత్రి జాగారం చేయ‌డానికి వెళుతున్నామురా. మీ డాడీ త్వ‌ర‌గా కోలుకుంటే జాగారం చేయిస్తాన‌ని మొక్కుకున్నాను అని సౌంద‌ర్య అంటుంది. ఇక శ్రావ్య భోజ‌నం చేయ‌లేదా అత్త‌య్యా అని అడ‌గ్గా.. ఈ పూట ఫ్రూట్స్ తింటామ‌ని సౌంద‌ర్య చెబుతుంది. ఇక ఆనంద‌రావు పెద్దోడు రాన‌ట్లు ఉన్నాడు అని అడ‌గ్గా.. వాడొస్తే నువ్వేమీ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవ‌ద్దురా అని సౌంద‌ర్య అంటుంది. ఎంత ఆర్గ్యూ చేస్తే ఏం లాభం మ‌మ్మీ అని ఆదిత్య అంటాడు. ఇక కార్తీక్ వ‌చ్చాక ముగ్గురం క‌లిసి భోజ‌నం చేస్తామ‌ని శ్రావ్య అన‌గా.. సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు బ‌య‌లుదేరుతుంటారు. అదే సమ‌యానికి కార్తీక్ రాగా.. అదుగో వ‌చ్చాడు అని సౌంద‌ర్య అంటుంది. వెంట‌నే ఆనంద‌రావు కార్తీక్‌ని ఉద్ద‌శించి రేయ్ భో్జ‌నం తిన‌కుండా ప‌డుకోడు. తినేసేయ్ అంటాడు. దానికి కార్తీక్.. మీరు ఎక్క‌డికి అని ప్ర‌శ్నిస్తాడు. శంక‌ర‌మ‌ఠంలో జాగారానికి వెళుతున్నాము అని సౌంద‌ర్య అన‌గా.. డాడీ ఆరోగ్యం బాలేదు. నిద్ర లేక‌పోతే ఎలా అని కార్తీక్ అంటాడు. దానికి ఆనంద‌రావు.. మీ అమ్మ మొక్కుకుందిలేరా. ఏం కాదులే. నాలుగింటిదాకా ఉండి వ‌స్తాము అని అంటాడు. వెంట‌నే కార్తీక్.. మొక్కా, మొక్కుబ‌డిలా ఏదో చెప్పాల‌ని చెప్తున్నారా అని అడ‌గ్గా.. అదేంటిరా అని ఆనంద‌రావు అడుగుతాడు. ఏమో మీకు ఏదైనా సందేశం వ‌చ్చిందేమో. నిజం చెప్పు మ‌మ్మీ. నీకు వాళ్లు ఎక్క‌డున్నారో తెలుసు క‌దా అని కార్తీక్ అడ‌గ్గా.. నీకు ఎందుకు అలా అనిపించింది అని సౌంద‌ర్య అడుగుతుంది. ఎన్న‌డూ లేనిది జాగారం అని చెబుతుంటేనూ అని కార్తీక్ అన‌గా.. ఎన్న‌డూ లేనిదేమీ కాదు. ప్ర‌తి ఏడాది శివ‌రాత్రికి జాగారం చేయ‌డం అల‌వాటే. ఇవాళ కొత్త‌గా నువ్వేమీ విన‌డం లేదు. అయినా వాళ్లు ఎక్క‌డున్నారో తెలిస్తే మీ డాడీ ఏకంగా ఇంటికి తీసుకొస్తా అంటున్నారు. ఇలా దొంగ‌చాటుగా వెళ్లి క‌లుసుకోవాల్సిన ఖ‌ర్మ మాకేంటి అని సౌంద‌ర్య అంటుంది. ఇక ఆనంద‌రావు.. నీలో మ‌నుషుల మీద పూర్తిగా న‌మ్మ‌కం పోతుందిరా. అది అంత ఆరోగ్య‌క‌ర‌మైన విష‌యం కాదు. రాను రాను నీ నీడ‌ను నువ్వే న‌మ్మ‌లేని ప‌రిస్థితికి వ‌స్తావు అని అంటాడు. వెంట‌నే కార్తీక్.. అంద‌రూ క‌లిసే ఆ పుణ్యం క‌ట్టుకున్నారు. నేను అప్ప‌టి కార్తీక్‌లా ఉండ‌కుండా మీరే న‌న్ను ఇలా త‌యారు చేశారు అన‌గా.. మ‌రి నువ్వేం చేయ‌లేదా అన్న‌య్య. నువ్వు క‌రెక్ట్‌గానే ఉన్నావా.. నీ వ‌ల్ల క‌దా వ‌దిన వెళ్లిపోయింది అని ఆదిత్య అడుగుతాడు. ఇక శ్రావ్య‌.. ఆదిత్య‌, నీ ఆర్గ్యుమెంట్ వ‌ల్లే మామ‌య్య గారికి చెస్ట్ పెయిన్ వ‌చ్చింది. మ‌ళ్లీ నువ్వు మొద‌లుపెట్ట‌కు అని అంటుంది. ఇక కార్తీక్.. స‌రే వెళ్లి రండి. ఆరోగ్యం బాలేని మ‌నిషితో ఉప‌వాసాలు, జాగారాలు ఏంటో నాకు అర్థం కావ‌డం లేదు అని అన‌గా.. కావాలంటే అక్క‌డి నుంచి వీడియో కాల్ చేస్తాము లేరా అని సౌంద‌ర్య అంటుంది. వెంట‌నే కార్తీక్.. మంచిది. హిమ‌ను అడిగాన‌ని చెప్పండి. వాళ్ల‌ని డ‌బ్బుల‌కు ఇబ్బంది ప‌డొద్ద‌ని చెప్పండి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి గ‌డ్డి పెట్టి ఎంతో కొంత చేతిలో పెట్టండి అని అంటాడు. ఇక ఆనంద‌రావు.. పోనీ మానేస్తాం లేరా అని అన‌గా.. అవ‌స‌రం లేదు. మీరు వెళ్లి రండి డాడీ అని ఆదిత్య అంటాడు. ఇక కార్తీక్‌ని ఫ్రెష్ అయ్యి ర‌మ్మ‌ని శ్రావ్య చెబుతుంది.

  మ‌రోవైపు దీప ఇంట్లో చీర‌ల‌ను మ‌డ‌త‌పెడుతూ ఉండ‌గా.. దీప అన్న కార్తీక్ పిలుపు వినిపిస్తుంది. దాంతో సంతోష‌ప‌డి వెంట‌నే భ్ర‌మ అని తెలుసుకుంటుంది. దాంతో కోపంతో మ‌డ‌త‌పెట్టిన చీర‌ల‌ను కింద పడేసి సోఫాలో కూర్చుంటుంది. కార్తీక్ మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ బాధ‌పడుతూ ఉంటుంది. ఇక అక్క‌డ‌కు వ‌చ్చిన సౌర్య‌.. ఇవేంటమ్మా ఇలా ప‌డ్డాయి అని అడుగుతుంది. చిర‌గ‌లేదుగా సంతోషించు అని దీప కోపంతో అన‌గా.. ఏమైంద‌మ్మా అని సౌర్య అడుగుతుంది. మ‌డ‌త కుద‌ర‌లేదు చాలా. ఇంకా వివ‌రంగా చెప్పాలా. ఆరిందెలాగా అన్నీ అడుగుతావు అని దీప కోపంతో అంటుంది. సౌర్య అలానే చూస్తుండ‌గా.. ఏంటి చూస్తున్నావు. వెళ్లి ప‌డుకో. చీక‌టితోనే లేయాలి అని దీప అంటుంది. చీక‌టితోనే ఎందుకు అని సౌర్య అన‌గా.. టిఫిన్ సెంట‌ర్ రేప‌టి నుంచే ఓపెన్ చేయాలని తెలుసు క‌దా. అన్నీ రుబ్బిపెడుతుంటే చూశావు క‌దా అని అంటుంది. వెంట‌నే సౌర్య‌.. నువ్వు ఎందుకు ఇలా అరుస్తున్నావ‌మ్మా అని అంటుంది. దాంతో దీప శాంత‌ప‌డుతుంది. అరిచిన‌ట్లుగా అనిపించిందా అని దీప అడ‌గ్గా.. అనిపించింది కాదు క‌నిపించింది. వినిపించింది అని అంటుంది. దానికి దీప ఎవ‌రి మీద కోప‌మో అని అంటుండ‌గా.. నాకు తెలుసు. ఇది ఎవ‌రి మీద కోప‌మో అని సౌర్య అంటుంది. వెంట‌నే దీప‌.. నాకు నీ మీద ఎందుకు ఉంటుంద‌మ్మా కోపం అని అడుగుతుంది. అవును కానీ టిఫిన్ సెంట‌ర్ అంటే రాత్రే అన్నీ రుబ్బుకోవాలి. చీక‌టితోనే లేవాలి. మ‌ళ్లీ మ‌ధ్యాహ్నం దాకా టిఫిన్లు అమ్ముతూ, చేస్తూనే ఉండాలి. మ‌ధ్యాహ్నం త‌రువాత అన్నీ తోముకోవాలి క‌దా. మ‌ళ్లీ నువ్వు క‌ష్ట‌ప‌డుతుంటే నాకు చాలా బాధ‌గా ఉంద‌మ్మా అని సౌర్య అంటుంది.

  క‌ష్ట‌ప‌డ‌క‌పోతే మ‌న‌ల్ని ఎవ్వ‌రు పోషిస్తార‌మ్మా. మిమ్మ‌ల్ని ఎవ‌రు చ‌దివిస్తారు. మ‌న‌కు ఏవైనా ఆస్తులు ఉన్నాయా అని దీప అంటుంది. వెంట‌నే సౌర్య‌.. ఉన్నాయి క‌ద‌మ్మా. నాన్న‌కు, నాన‌మ్మ‌కు చాలా ఆస్తులు ఉన్నాయి క‌దా అని అంటుంది. దానికి దీప‌.. నేను కోరుకునే ఆస్తి అది కాదు అని దీప అంటుంది. ఇక దీప‌కు ద‌గ్గ‌ర‌గా సౌర్య కూర్చొని నువ్వు ఏదైనా ఉద్యోగం చేయొచ్చు క‌ద‌మ్మా అని అడుగుతుంది. ఏదైనా కంపెనీలో కూలీగా వెళ్లాలి. ఎంత జీతం వ‌స్తుందో తెలీదు. మిమ్మ‌ల్ని చ‌దివించ‌డానికి అది స‌రిపోదు అని దీప అంటుంది. వెంట‌నే సౌర్య‌.. మేము ఇప్పుడు చ‌దువుతామ‌ని ఎవ‌రు అన్నారు అని అడ‌గ్గా.. మ‌రి ఏం చేస్తారు అని దీప అంటుంది. దానికి నీకు హెల్ప్ చేస్తాము అని సౌర్య అంటుంది. మీరా అని దీప అడ్డ‌గ్గా.. అవున‌మ్మా అని సౌర్య అంటుంది. వెంట‌నే దీప‌.. ఏమ్మా. మీ అమ్మ మిమ్మ‌ల్ని చ‌దివించ‌లేద‌ని మీరు ముందే అనుకుంటున్నారా అని అంటుంది. వెంట‌నే సౌర్య‌.. అది కాద‌మ్మా. చ‌ద‌వాలంటే చాలా డ‌బ్బులు కావాలి క‌ద‌మ్మా. మా కోసం నువ్వు ఎంతో క‌ష్ట‌ప‌డాలి అని అంటుంది. దానికి దీప‌.. నాకు క‌ష్టాలు కొత్తేం కాదు. క‌ష్ట‌ప‌డ‌టం కొత్త కాదు. క‌ష్టాన్ని పూడ్చ‌లేమో గానీ క‌ష్టాన్ని భ‌రించ‌గ‌ల‌ను అని అంటుంది.

  ఇక సౌర్య‌.. ఒక్క మాట అడుగుతాను చెప్తావా అమ్మ అని అంటుంది. దానికి దీప‌.. ఇక్క‌డ కూడా ప్ర‌శ్న‌లా అన‌గా.. ఒక్క‌టే, ఒక్క‌టంటే ఒక్క‌టే అని సౌర్య చెబుతుంది. చెప్పేదైతే చెబుతాను అని దీప అన‌గా.. నాకు గుర్తు వ‌చ్చిన‌ట్లే నీకు నాన్న గుర్తు వ‌స్తారా అమ్మా. అంటే అని ఏదో అడుగుతుండ‌గా.. తొంద‌ర‌గా ప‌డుకో, పొద్దున్నే త‌ల‌స్నానం చేయాలి అంద‌రూ అని దీప ఆ టాపిక్‌ని మారుస్తుంది. ఇక సౌర్య‌.. నాన్న అని అంటుండ‌గా.. ఇప్పుడు మ‌న టిఫిన్ సెంట‌ర్ పేరు అదే. అవును హిమ ఏది అని దీప అడుగుతుంది. ఇక సౌంద‌ర్య ఇంట్లో హిమ‌.. ఆదిత్య‌, శ్రావ్య‌ల మ‌ధ్య కూర్చొని ఉంటుంది. అవును బాబాయ్. డాడీ కోస‌మే వ‌చ్చాను. నేను లేక‌పోతే డాడీ ఉండ‌లేడు క‌దా అందుకే వ‌చ్చాను. ఇంకెప్పుడు డాడీని వ‌దిలి వెళ్ల‌ను. అంద‌రినీ తీసుకొస్తేనే వ‌స్తాన‌ని కూడా చెప్ప‌ను అని చెబుతూ ఉంటుంది. ఇక పైనుంచి వ‌స్తోన్న కార్తీక్, హిమ‌ను చూస్తాడు. ఇక హిమ‌.. నాకు డాడీని చూడాల‌ని చాలా అనిపించింది. అమ్మ‌కు చెబితే పంప‌ద‌ని చెప్ప‌కుండా వ‌చ్చాను అని చెబుతూ ఉంటుంది. ఇక హిమ‌ను చూసిన కార్తీక్ సంతోషంగా నాకు తెలుస‌మ్మా నువ్వు వ‌స్తావ‌ని. ఈ డాడీ కూడా నిన్ను చూడ‌కుండా ఉండ‌లేడ‌ని నీకు తెలుసు. అందుకే నాకు తెలుసు. నువ్వు వ‌స్తావ‌ని. నాన్న‌, బంగారం, హిమ అని ఆమెను ముద్దాడుతాడు. అయితే వెంట‌నే ఆదిత్య‌.. అన్న‌య్యా అనగా.. చూశావా ఆదిత్య. నా కోసం హిమ వ‌చ్చింది అని చెబుతాడు. వెంట‌నే ఆదిత్య‌.. హిమ‌నా. హిమ ఎక్క‌డ వ‌చ్చింది అన్న‌య్య అని అడుగుతాడు. ఆ త‌రువాత అది భ్ర‌మ అని కార్తీక్‌కి తెలుస్తుంది. ఆ బాధ‌లో రాలేదా, నిజంగా రాలేదా.. మ‌రి నాకు అని అంటాడు. వెంట‌నే శ్రావ్య, హిమ రాలేదు బావగారు అని చెబుతుంది. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో పిల్ల‌లిద్ద‌రిని వారి నాన్న ద‌గ్గ‌రికి పంప‌మ‌ని వార‌ణాసికి చెబుతుంది. మ‌రోవైపు మోనిత‌ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటోన్న విష‌యాన్ని కార్తీక్ ఇంట్లో చెబుతాడు.

  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు