హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: ఇస్తాను మీ కూతురినే కాదు నిజాన్ని కూడా ఇస్తాను.. కార్తీక్‌కి దీప శ‌ప‌థం

Karthika Deepam: ఇస్తాను మీ కూతురినే కాదు నిజాన్ని కూడా ఇస్తాను.. కార్తీక్‌కి దీప శ‌ప‌థం

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. త‌న మీద ప‌డ్డ నింద‌ను నిజ‌మ‌ని న‌మ్ముతున్న కార్తీక్‌ని దీప క‌డిగిపారేస్తోంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ బాబును వ్య‌క్తిత్వం గురించి అడుగుతున్నా.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. త‌న మీద ప‌డ్డ నింద‌ను నిజ‌మ‌ని న‌మ్ముతున్న కార్తీక్‌ని దీప క‌డిగిపారేస్తోంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ బాబును వ్య‌క్తిత్వం గురించి అడుగుతున్నా. ఏది మీ వ్య‌క్తితం, ఏది మీ ఆద‌ర్శం, పురుషాధిక్య‌త మింగేసిందా..? పురుషాహంకారం అణ‌గ‌దొక్కేసిందా..? స‌మాజంలో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంటే స‌రిపోదు. ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలి.. ఇక్క‌డ మీరేంటి..? ప‌చ్చిగా చెప్పాలంటే.. క‌ట్టుకున్న పెళ్లాన్ని అనుమానించే అనుమాన‌పు మొగుడు. ఇక మీరు బ‌య‌ట దేశోద్దార‌కులు అయితే ఆ పెళ్లానికి ఏం మిగుల్తుంది నా పిండాకూడు అని త‌న‌లోని ఆవేశాన్ని బయటపెడుతుంది దీప. ఇక ఏమైందే నీకు, ఎందుకే ఇంత వెర్రి ఆవేశం అని సౌంద‌ర్య అడ‌గ్గా.. ఏం చేయాలి మీ అబ్బాయి నా వ్య‌క్తిత్వాన్ని, నా ప‌విత్ర‌త‌ను, నా శీలాన్ని అవ‌మానించి కించ‌ప‌రుస్తూ మాట్లాడుతుంటే త‌ల‌దించుకొని క‌న్నీళ్ల‌తో గ‌డ‌ప దాటుతూ కుమిలిపోతూ వెళ్లిపోవాలంటారా..? అలాగే వెళ్లిపోతే ఆ అవ‌మానం నాకే కాదు.. లోకంలోని స్త్రీలంద‌రిదీ అవుతుంది.

  ఇక ఆనంద‌రావు మాట్లాడుతూ.. ఇప్ప‌టికే మీ ఇద్ద‌రి మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. ఇంక మాట‌ల‌తో ఎందుకమ్మా తెగేదాక లాగ‌డం అని అంటాడు. నేనేమీ సంబంధం తెంచుకోవాల‌ని మాట్లాడ‌లేదు మామ‌య్య, ఆడదానిగా మాట్లాడుతున్నాను, ఆడ‌దాని హ‌క్కుల త‌ర‌ఫున మాట్లాడుతున్నాను. భార్య‌గా, భ‌ర్త‌తోనే మాట్లాడుతున్నాను. ఆ భ‌ర్త‌లో మార్పు కోస‌మే పోరాడుతున్నాను. ఇది ఆడ‌దాని ఆర్థనాదం కాదు, స్త్రీ ఔన్న‌త్యాన్ని చాటే నినాదం. స్త్రీ జోలికే వెళితే క‌ర్ణ‌భేరిని వ‌ణికించేలా వినిపించే ఢంకానాదం. ఇది నా స‌మాధానం అని చెబుతుంది. ఆ త‌రువాత కూతురు కావాలా వ‌ద్దు, కూతురు ఫొటో కావాలి. కూతురు ఎమోష‌న్స్ కావాలా..? వ‌ద్దు, దాని ఙ్ఞాపకాలు కావాలి. కూతురికి తండ్రిగా స్థానం కావాలి. కానీ దాని క‌న్న‌తండ్రిగా చెప్పుకోవ‌డం, ఒప్పుకోవ‌డం వ‌ద్దు. ఇస్తాను మీ కూతురినే కాదు నిజాన్ని ఇస్తాను. నీతిని, నిజాయితీని, నైతిక విలువ‌ల‌ను అన్నింటిని మీ క‌ళ్ల ముందు ఆవిష్క‌రిస్తాను. అనుమాన‌మే లేదు మీ అనుమానాన్ని ప‌టాపంచ‌లు చేసి తీరుతాను అని ఛాలెంజ్ చేస్తుంది.

  వెంట‌నే సౌంద‌ర్య.. ఇదంతా ఎలా అర్థం చేసుకోవాలో నాకేం అర్థం కావ‌డం లేదే అన‌గా.. తెగింపు ఇది, తెగించ‌డంలో రెండు ర‌కాలున్నాయి. బ‌రితెగించ‌డం.. దానికి ఉదాహ‌ర‌ణ మౌనిత‌. ప్రాణాల‌ను తెగించ‌డం రెండో ర‌కం.. దానికి ఉదాహ‌ర‌ణ దీప. డాక్ట‌ర్ బాబుకు నిజం ఏంటో నిరూపించే క్ర‌మంలో నేను ప్రాణాలకు తెగించి పోరాటం చేయాల‌ని బ‌యలుదేరాను. అందులో ఇదొక మ‌జిలీ అనిమాట్లాడుతుంది. ఆ త‌రువాత మాల‌తిని పిలిచి గీజ‌ర్‌ని ఆన్ చేసి వంట ప్రారంభించమ‌ని చెబుతుంది. త‌రువాత ఆక‌లేస్తుంది అంద‌రం తిన్నాము, రెడీగా ఉండండి అని చెప్పి వెళుతుంది.

  ఇదిలా ఉంటే దీప ఇంట్లో దీప కోసం హిమ ఎదురుచూస్తూ ఉంటుంది. వార‌ణాసి ఆటో రాగానే అమ్మేనా అని సౌర్య రాగా.. కాదు వార‌ణాసిది అని చెబుతుంది. లోప‌లికి వ‌చ్చిన వార‌ణాసి భోజనం తీసుకొచ్చాన‌ని చెబుతాడు. అప్పుడు సౌర్య‌.. రేయ్ నిజం చెప్పు అమ్మ ఎక్క‌డికి వెళ్లిందో నీకు తెలీదా అని ప్ర‌శ్నించ‌గా.. తెలీద‌ని చెబుతాడు. అబద్దం చెప్ప‌కురా నాకు టెన్ష‌న్‌గా ఉంది అని సౌర్య అన‌గా.. నిజంగా నాకు తెలీదు సౌర్య‌మ్మా.. అమ్మ వేరే ఆటోలో వెళ్లింది అని అంటాడు. వేరే ఆటో అంటే వెంక‌టేష్‌దా అని అడిగిన సౌర్య‌.. అత‌డికి కాల్ చేయ‌మ‌ని చెబుతుంది. అయితే వెంక‌టేష్ ఫోన్ ప‌నిచేయ‌లేద‌ని వార‌ణాసి అంటాడు. దానికి సౌర్య బాధ‌ప‌డుతుంది. ఇక హిమ.. అమ్మ ఎక్క‌డికి వెళ్లిందోన‌ని భ‌యం వేస్తుంద‌ని చెప్ప‌గా.. ఏం కాద‌మ్మా అని వార‌ణాసి ధైర్యం చెబుతాడు. అప్పుడు నాన్న‌కు కాల్ చేయాల‌ని హిమ అనుకుంటుంది.

  ఇక సౌంద‌ర్య ఇంట్లో రెడీ అయిన దీప‌.. అంద‌రినీ భోజ‌నాల‌కు పిలుస్తుంది. కార్తీక్ అటువైపుగా ఉండ‌గా.. అక్క‌డేం చూస్తున్నారు. క‌డుపు నిండే మాట‌లు ఉండ‌వు, క‌డుపు మండే మాట‌లే ఉంటాయి అని అంటుంది. ఆ త‌రువాత సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌ను తిన‌డానికి పిలుస్తుంది. మ‌రి పిల్ల‌ల ఆక‌లి సంగ‌తి ఏంటే అని సౌంద‌ర్య అడ‌గ్గా.. పిల్ల‌ల గురించి ప‌ట్టించుకోకుండా ఉండేందుకు నేనేం డాక్ట‌ర్ బాబును కాదు అత్త‌య్యా. వంట‌ల‌క్క‌ను వాళ్ల భోజ‌నం కోసం అన్ని ఏర్పాట్లు చేసే వ‌చ్చాను అని చెబుతుంది. ఇక ఆనంద‌రావు ముందు నువ్వు క‌డుపు నిండా భోజ‌నం చేయ్ అమ్మా అనగా.. ఏం మామ‌య్య గారు ఆక‌లి ఎక్కువైతే అగ్గికి ఆజ్యం తోడైన‌ట్లు ఆగ్ర‌హం కూడా పెరిగిపోతుంద‌నా..? అని ప్ర‌శ్నిస్తుంది. నువ్వు ముందు కూర్చోవే, నీ మాట‌లు వింటే భ‌యం వేస్తుంది అని సౌంద‌ర్య అంటుంది. దానికి నేను మౌనంగా ఉంటాను, నిశ్శ‌బ్దంగానే భోజ‌నం చేస్తాను. మీరు నిశ్చితంగా భోజ‌నం చేయండి అని దీప చెబుతుంది. కార్తీక్ ఇంకా రాకుండా అక్క‌డే ఉంటే.. ఏ బాణాలు ఎక్క‌డ గుచ్చుకుంటాయో అని ఆలోచించ‌కండి.. ఇప్పుడు వీళ్ల‌ను నా చేతులోకి తీసుకున్నాను అని దీప మాట్లాడుతుంది.

  ఇక డాక్ట‌ర్ బాబుకు ఫోన్ చేసిన సౌర్య‌.. ఫంక్ష‌న్ నుంచి అమ్మ ఎక్క‌డికి వెళ్లిందో తెలీదు, ఇప్ప‌టికీ ఇంకా ఇంటికి రాలేదు. మాకు భ‌యం వేస్తుంది. హిమ కూడా ఏడుస్తుంది. అమ్మ అక్క‌డ‌కు వ‌చ్చిందా డాక్ట‌ర్ బాబు అని అడుగుతుంది. దానికి కార్తీక్ ఏం చెప్ప‌కపోయేస‌రికి ఫోన్ పెట్టేసి.. దీప ఫొటోను చూస్తూ ఏడుస్తుంటుంది సౌర్య. హిమ వ‌చ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతుంది. డాడీ ఏమైనా అన్నాడా..? అని అడ‌గ్గా.. ఏం అన‌లేదు అని అంటుంది. మ‌రి ఎందుకు ఏడుస్తున్నావు అని హిమ ప్ర‌శ్నించ‌గా.. అందుకే ఏం అన‌లేదు, ఏం చెప్ప‌లేదు, అమ్మ ఉంద‌ని, లేద‌ని, భ‌య‌ప‌డొద్ద‌ని, కంగారు ప‌డొద్ద‌ని ఏదో ఒక‌టి చెప్పాలి క‌దా.. ఏదీ చెప్ప‌లేదు.. ఏమీ మాట్లాడ‌లేదు. అంత‌కుముందు ఫోన్ చేస్తే ఏమే రౌడీ అనేవాడు, ఇప్పుడు అది కూడా లేదు. నీలాగే నేను కూడా అమ్మ కూతురిని అని తెలుసు క‌దదా.. మ‌రి నీ మీద ప్రేమ అలానే ఉంది, అస‌లు నా మీద ప్రేమే లేదు, ఎందుకు..? నేనేం చేశాను..? నువ్వు ప‌ట్టించుకోక‌పోతే ఏడుస్తాను. నేను ఏడ్చినా పట్టించుకోడు అని ఏడుస్తూ ఉంటుంది. ఆ త‌రువాత హిమ కూడా ఏడుస్తుండ‌గా.. చూడు హిమ నాకేం నీ మీద జ‌ల‌సీ లేదు. నువ్వేం త‌ప్పుగా అనుకోకు అని అంటుంది. త‌రువాత హిమ‌,, డాడీ ఎందుకిలా చేస్తున్నాడు, జ‌వాబు చెప్పొచ్చు, ఇటు ఇవ్వు నేను మాట్లాడ‌తాను అంటుంది. దానికి సౌర్య‌.. వ‌ద్దు హిమ, ముందులా లేడు మారిపోయాడు. అమ్మ కోసం నువ్వు ఏడుస్తున్నావ‌ని చెప్పినా ప‌ట్టించుకోలేదు అని చెబుతుంది. దానికి హిమ‌.. అవునా, నిన్ను ఏడవొద్ద‌ని కూడా చెప్ప‌లేదా..? అని అడుగుతుంది. దీంతో హిమ‌.. డాడీ మంచివాడే క‌దా.. ఎందుకిలా చేస్తున్నాడు. డాడీ వ‌ల‌నే మ‌న‌మంద‌రం ఏడుస్తున్నాము క‌దా. ఎందుకు పాపం అని కూడా అన‌ట్లేదు. నాకేం అర్థం కావ‌డం లేదు అని ఏడుస్తూ ఉంటుంది.

  మ‌రోవైపు దీప వ‌స్తుండ‌గా సౌంద‌ర్య‌.. ఎక్క‌డికి వెళ్లావే అని అడుగుతుంది. దానికి దీప చీక‌ట్లోకి అని స‌మాధానం చెబుతుంది. అంటే అని సౌంద‌ర్య అడ‌గ్గా.. నేను నా బ‌తుకును ఎక్క‌డ పోగొట్టుకున్నానో అక్క‌డికే వెతుక్కుంటూ బ‌య‌లుదేరాను, ఈ అన్వేష‌ణ‌కు త్వ‌ర‌లోనే ముగింపు ఉంటుంది అని చెబుతుంది. మ‌రి ఈ ఆత్మ‌విశ్వాసం ఇంత‌కు ముందు ఎక్క‌డికి వెళ్లిందే అని సౌంద‌ర్య ప్ర‌శ్నించ‌గా.. స‌హ‌నం మింగేసింది. మీ ఇంటి ప‌రువు ప్ర‌తిష్ట‌లు తొక్కేశాయి. ఇప్పుడు నాలో స‌హ‌నం లేదు, నాలో పిరికిత‌నం లేదు. నేను ఇప్పుడు భార్య‌గా, అమ్మ‌గా కాదు.. స్త్రీగా నా ఉనికిని వెతుక్కుంటున్నాను అని చెబుతుంది. వెంట‌నే సౌంద‌ర్య‌.. ఏమైందే నీకు, ఎందుకిలా మాట్లాడుతున్నావు అని ప్ర‌శ్నిస్తుంది. దానికి దీప స్త్రీ, స్త్రీలా మాట్లాడితే ఇంకో స్త్రీకి ఎందుకు భ‌యం, మ‌గాడు క‌దా బ‌య‌ప‌డాలి. మీరు స్త్రీ జాతి స‌భ్యురాలే క‌దా.. ఈ స‌భ్య‌స‌మాజంలో మ‌న ఆత్మ‌గౌర‌వాన్నే కాదు.. మ‌న శ‌క్తిని కూడా నిరూపించుకోవాల‌ని అంటుంది. వెంటనే సౌంద‌ర్య‌.. నువ్వు మా దీప‌లా లేవే అని అడ‌గ్గా..లేదు నేను ఇప్పుడే దీప‌లా ఉన్నాను. ఇంత‌కుముందు నేను నేను కాదు. నా దేవుడి గుడిలో గ‌డ్డి పువ్వులా ఉండేదాన్ని. ఇప్పుడు ఆ పిచ్చిత‌నం లేదు. మీరు చూసింది న‌న్ను కాదు, వంట‌ల‌క్క‌ను. వంట‌ల‌క్క‌కు ఏం తెలుసు.. వండ‌టం, అమ్మ‌డం, ఏడ‌వ‌డం, తుడ‌వ‌డం.. అంతే.. ఈ దీప‌కు అన్నీ తెలుసు. గ‌రిటే తిప్పే చేయి చ‌క్రం తిప్ప‌గ‌ల‌ద‌ని నిరూపించ‌డానికే వంట‌ల‌క్క దీప అయ్యింది.

  దానికి సౌంద‌ర్య ఏ ధైర్యంతో అలా మాట్లాడుతున్నావే అని అన‌గా.. అదేంటి మీరే అలా అడుగుతున్నారు..? ధైర్యం ఏమైనా అంగ‌ట్లో దొరికే వ‌స్తువా..? మెడిక‌ల్ షాపులో దొరికే బలం సిర‌ప్‌నా.. ధైర్యం మ‌న‌లోనే ఉంటుంది. కాక‌పోతే ఈ మ‌గ‌వాళ్లు మ‌న ధైర్యం చూసి త‌ట్టుకోలేర‌నే.. సృష్టి మొద‌ట్లోనే స్త్రీ శ‌క్తిని అవ‌స‌రం అయిన‌ప్పుడే బ‌య‌ట‌పడేలా చేశారు. ఇప్పుడు ఆ అవ‌స‌రం వ‌చ్చింది. నాకు అది అత్యంత అవ‌స‌రం కూడా అని చెబుతుంది. ఇక దీప బ‌య‌ట‌కు వెళుతుండ‌గా.. ఎక్క‌డికి చెప్ప‌వే కారు ఉంది అని సౌంద‌ర్య‌ అంటుంది. దానికి దీప నాకు కాళ్లు ఉన్నాయి అని చెబుతుంది. దీంతో సౌంద‌ర్య కూడా కాస్త భ‌య‌ప‌డుతుంది. ఇప్పుడు నేను ఎందుకు వ‌చ్చాన‌ని మీ వంశోద్దార‌కుడు చెబుతాడు, మౌనిత మీద పోలిస్ కంప్లైంట్ ఇచ్చాన‌ని మాత్రం చెప్పండి అని దీప అంటుంది. ఆ త‌రువాత మీ బ్రెస్సింగ్స్ కావాలి అత్త‌య్యా.. మ‌న‌సులోనే దీవిస్తూ ఉండండి. వ‌స్తాను అని చెప్పి బ‌య‌ట‌కు వెళుతుంది.

  ఇక ఇంట్లో కార్తీక్.. ఈ రాక్ష‌సి పిల్ల‌ల‌ను వ‌దిలేసి ఎక్క‌డికెక్కడికో తిరుగుతుంది..? ఏంటేంటో మాట్లాడుతోంది..? వింత వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తోంది. పిచ్చి ప‌ట్ట‌డానికి ముందు స్టేజ్‌లా ఉంది దీని ప్ర‌వ‌ర్త‌న అని అంటూ ఉంటాడు. హిమ సౌర్య‌లా ధైర్యంగా ఉండ‌లేదు, ఇప్పుడు దీని కోసం ఏడుస్తుంది. నా కూతురు అంటేనే ఇంత‌లా మండిప‌డిపోయింది. మ‌రి దానికి కూతురిలా చూసుకుంటుందా.? బోడి పెత్త‌నాలు ఒక‌టి దీనికి.. ఆ జ‌ర్న‌లిస్ట్‌ల‌తో మౌనిత మాట్లాడ‌టం చూసి దీని ఇగో హ‌ర్ట్ అయిన‌ట్లు ఉంది. దాని త‌రువాత ఏమై ఉంటుంది..? మౌనిత‌కు ఏమైనా తెలుసేమో అడిగితే అని ఫోన్ చేస్తాడు. ఇక మౌనిత ఫోన్ దీప ద‌గ్గ‌ర ఉండ‌గా.. కార్తీక్ నంబ‌ర్‌ని చూసి వేళాపాళా లేకుండా దానికి చేస్తారా..? చెప్తానుండండి అని కాల్ లిఫ్ట్ చేస్తుంది.

  ఇక కార్తీక్.. హ‌లో మౌనిత అని అంటాడు. వెంట‌నే దీప‌.. మౌనితా.. అది ఎవ‌రు..? రాంగ్ నంబ‌ర్ మ‌ళ్లీ మ‌ళ్లీ కాల్ చేయ‌కండి. మా ఆయ‌న‌కు అస‌లే అనుమానం అని అంటుంది. ఇక కార్తీక్.. ఈ గొంతు మౌనిత‌ది కాదే, ప్రియ‌మ‌ణిది కూడా కాదు దీప‌దిలా ఉందే అనుకుంటూ ఉండగా.. అటుగా దీప వ‌స్తుంది. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో అంజి, మౌనిత ఫోన్ చేసి నీ చ‌రిత్ర నాకు తెలుసంటూ చెప్తాడు. దాంతో దీప‌కు ఆధారం దొరికిన‌ట్లు అవుతుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

  ఉత్తమ కథలు