హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: నిన్ను డాక్టర్ బాబు ముందు దోషిగా ఎలా నిలబెట్టాలో నాకు బాగా తెలుసు.. మౌనితకు దీప కౌంటర్

Karthika Deepam: నిన్ను డాక్టర్ బాబు ముందు దోషిగా ఎలా నిలబెట్టాలో నాకు బాగా తెలుసు.. మౌనితకు దీప కౌంటర్

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. నిన్న‌టి ఎపిసోడ్‌లో కార్తీక్‌కి మౌనిత గురించి చెప్పాల‌ని అంజి ప్ర‌య‌త్నించ‌గా.. కార్తీక్ అడ్డుకుంటాడు. అంతేకాదు ఇంకోసారి ఇలా చెప్పాలని చూస్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తాన‌ని వార్నింగ్ ఇస్తాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో అంజి కోసం దీప ఎదురుచూస్తూ ఉంటుంది

ఇంకా చదవండి ...

  Karthika Deepam: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. నిన్న‌టి ఎపిసోడ్‌లో కార్తీక్‌కి మౌనిత గురించి చెప్పాల‌ని అంజి ప్ర‌య‌త్నించ‌గా.. కార్తీక్ అడ్డుకుంటాడు. అంతేకాదు ఇంకోసారి ఇలా చెప్పాలని చూస్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తాన‌ని వార్నింగ్ ఇస్తాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో అంజి కోసం దీప ఎదురుచూస్తూ ఉంటుంది. ‘ఏంటి అంజి వ‌స్తాన‌న్నాడు. ఇంకా రాలేదెందుకు..? అస‌లు అంజి ఏం చెప్పాల‌నుకున్నాడు అని అనుకుంటూ ఉండ‌గా.. అంజి వ‌స్తాడు. కారు దిగిన అంజి.. కార్తీక్ మాట‌ల‌ను తలుచుకుంటూ దీప వ‌ద్ద‌కు వ‌స్తాడు. ఏమైంది అంజి ఇంత లేట్ అయ్యింది?’ అని దీప అడ‌గ్గా.. దారిలో ఇద్దరు దేవుళ్లని కలిశానమ్మా. మొదటి దేవత వరాలు ఇస్తే, రెండో దేవుడు గాయం చేశాడు అని అంజి అంటాడు. డాక్ట‌ర్ బాబుకు చెప్పే ప్ర‌య‌త్నం చేశావా..? అని దీప అడ‌గ్గా.. అవున‌మ్మా.. కానీ మౌనిత గురించి చెప్ప‌మ‌ని నిన్ను ఎవ‌రు పంపారు..? ఎంత ఇస్తామ‌న్నారు..? అని అన్నాడ‌మ్మా. మీరు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అంజి అంటాడు.

  ఆ త‌రువాత మాట్లాడుతూ ఇవాళ మౌనితని ఫాలో అయ్యానమ్మా. లాయర్‌ని కలిసింది. లీగల్‌గా హిమని డాక్టర్ బాబు దగ్గరకు రప్పిస్తుందటమ్మా’ అని చెబుతాడు. దానికి దీప.. అంటే క‌న్న‌త‌ల్లి గాలికి కొట్టుకుపోయినా ఫ‌ర్వాలేదా..? ఆయ‌నే క‌న్న‌తండ్రి అని ఒప్పుకుంటే కోర్టు కూడా అవ‌స‌రం లేదు. నా అంత‌ట నేను హిమ‌ను అప్ప‌గిస్తాను అని దీప అంటుంది. దానికి అంజి మీరు జాగ్ర‌త‌గా ఉండాల‌మ్మా అంటాడు. మీరు మౌనిత విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌మ్మా. అస‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. డాక్ట‌ర్ బాబును పూర్తిగా న‌మ్మించేస్తుంది అని చెబుతూ ఉంటాడు. ఇక వారిద్ద‌రు మాట్లాడుతుండ‌గా.. ఆ దారిలో వస్తున్న మౌనిత.. దీప, అంజిని చూసి షాక్ అవుతుంది. దీప‌కు అంతా చెప్పేస్తున్నాడా..? అందుకేనా చంపింది, చంపించింది అని చెప్పింది. వీడు దీప‌కు దొరికిన తిరుగులేని అస్త్రం.. కార్తీక్ ద‌గ్గ‌ర దోషిగా నిల‌బెట్ట‌డానికి వీడు ఒక్క‌డు చాలు. కానీ ఏం చేసి వీరిద్ద‌రి నోళ్లు మూయించాలి. ఏం చేస్తే వీళ్లిద్ద‌రి నుంచి న‌న్ను నేను కాపాడుకుంటాను..? అని మ‌న‌సులో అనుకుంటూ.. దీప, అంజిల ద‌గ్గ‌ర‌కు వెళుతుంది. ఇక మౌనిత విష‌యంలో ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండమ్మా అని అంజి, దీపకు చెబుతుండగా మౌనిత క్లాప్స్ కొడుతూ వ‌స్తుంది.. ముందుంటావా..? ఎవ‌రి ముందుంటావు..? ఇప్పుడు నీ ముందు నేను ఉన్నాను. ఏమంటావు..? అగ్ని ప‌ర్వ‌తంలా ఈవిడ తిరుగుతుంది..? నేతి డ‌బ్బాలా నువ్వు తిరుగుతున్నావా..? అగ్నికి ఆజ్యం తోడైన‌ట్లు.. మౌనిత ఆశ‌లు బూడిద చేయ‌డానికి మీరిద్ద‌రు ఒక‌రికి ఒక‌రు తోడ‌వుదామ‌నుకుంటున్నారా. మీకు మౌనిత గురించి తెలుసు. ఈ ప్రపంచంలో మౌనిత‌ గురించి పూర్తిగా తెలిసింది మీ ఇద్ద‌రికే. మ‌రి నా గురించి చాలా త‌క్కువ అంచ‌నా వేస్తారెందుకు.? దీప‌.. నీ వాయిస్ పెరిగింది. ఆవేశంలో వ‌చ్చిన వాయిస్ అనుకున్నాను. కానీ ఈ అంజి అండ చూసుకొని ఇంకా పెరిగింద‌ని ఇప్పుడు పూర్తిగా అర్థ‌మైంది. నీలోని ఆవేశంగానీ, ఈ అంజిలోని ప్ర‌తీకారంగానీ మౌనిత‌ను ఎప్ప‌టికీ ఏం చేయ‌లేవు. నేను మీకు ఆ ఛాన్స్ చ‌స్తే ఇవ్వ‌ను. అస‌లు ఏమ‌నుకుంటున్నారు మీరు నా గురించి. నేను అనుకున్న‌ది సాధించేదాకా ఏమైనా చేస్తాను. ఎంత‌దూర‌మైనా వెళ‌తాను అని అంటుంది.

  దానికి అంజి ఈ సెల్‌లో మొత్తం రికార్డు చేసి ఉంటే అన‌గానే.. వారిద్ద‌రి ఫోన్లు లాక్కొని మౌనిత‌ విసిరేస్తుంది. ఆ త‌రువాత నాకు తెలుసు. టెక్నాల‌జీ పెర‌గ‌ని కాలం నుంచి, ఇంత టెక్నాల‌జీ పెరిగిన కాలం వ‌ర‌కు మౌనిత దిగ్విజ‌యంగా త‌ప్పులు చేస్తూ దొర‌క్కుండా త‌ప్పించుకుంటూనే ఉంది. ఇప్పుడు మీ రికార్డింగ్‌లు, మీ ఆయుధాలు నేల‌పాల‌య్యాయి. ఇప్పుడేం చేస్తారు మీరు. కార్తీక్.. నా కార్తీక్.. అత‌డిని దక్కించుకోవడానికి నా దగ్గర ప్రేమ అనే ఆయుధం ఉంది. కానీ దీప నీ దగ్గర తాళి మాత్రమే ఉంది. ఆ తాళిని చూపించి నువ్వు నిర్దోషివ‌ని ఎప్ప‌టికీ నిరూపించుకోలేవు. ఈ అంజిలాంటి వాళ్ల వల‌న ఏ మాత్రం నీకు లాభం ఉండ‌దు. అర్థ‌మైందా..? అన‌వ‌స‌రంగా టైమ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటావు.. ఇందాక నేను పైకి ఎందుకు చూశానా..? అని ఎప్ప‌టికీ మీకు అర్థం కాదు. అందుకే నేను అవి కూడా క్లియ‌ర్ చేసి పోతా. నేను పైకి చూసింది సీసీ కెమెరాలు ఉన్నాయేమోన‌ని.. మీ ఫోన్లు నేను ప‌గ‌ల‌గొట్టాన‌ని మీరు సీసీ కెమెరాలు చూపించి, ఓ పిటీ కేసు పెట్టి నా టైమ్ వేస్ట్ చేయ‌కూడ‌దు క‌దా అని న‌వ్వుతూ ఉంటుంది. ఆ త‌రువాత పాపం.. అగ్నిప‌ర్వ‌తం, ఆజ్యం షాక్‌లో ఉన్న‌ట్లు ఉన్నారు. తేరుకోవడానికి చాలా టైమ్ పట్టేలాగా ఉంది అని న‌వ్వుతూ.. అక్క‌డి నుంచి వెళ్ల‌బోతుంది.

  వెంట‌నే దీప చీటిక వేసి.. చాలా మాట్లాడావు.. ఫోన్లు నేలకేసి కొట్టి నీ సత్తా చూపించావు. సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో చూసుకొని జాగ్రత్తలు తీసుకున్నావు. ఏ సాక్ష్యం లేకుండా చేసినా నువ్వు తప్పులు మీద తప్పులు., నేరాలు మీద నేరాలు చేశావన్నది నిజం. ఆ నిజాన్ని నిరూపించడానికి ఈ సెల్ ఫోన్లు, సీసీ కెమేరాలు ఇవన్నీ ఈ దీపకు అవసరం లేదు. నా లెక్కలు నాకున్నాయి.. ఎలా నిన్ను డాక్టర్ బాబు ముందు నిలబెట్టాలో నాకు బాగా తెలుసు.. మరిచిపోయాను ఇంకో విషయం.. ఏదో కేసు, కస్టడీ, హిమ ఎవరి దగ్గర ఉండాలి అనే విషయం గురించి లాయర్ చుట్టూ తిరుగుతున్నావంట కదా..?.. ప్లీజ్ ఆ విషయంలో ఇంకాస్త‌ గట్టి ప్రయత్నం చెయ్యవా..? హిమ డాక్టర్ బాబు కస్టడీలోనే ఉండాలన్న వాద‌న‌ గట్టిగా వినిపించవా.. ఈ విషయంలో ఎవరు వెనక్కి లాగినా, డాక్టర్ బాబే వెనక్కి తగ్గిపా.. నువ్వు మాత్రం ప‌ట్టువ‌ద‌ల‌కుండా ఈ కేసు వేయించి పురోగ‌తి సాధించ‌వా..?. సాధిస్తావు.. మౌనిత మజాకా..? మేము ఏమరపాటుగా ఉన్నప్పుడు మా చేతుల్లోని సెల్ ఫోన్స్ లాక్కుని నేలకేసి కొట్టడంలో ఉన్న గొప్పద‌నం.. నీకు దమ్ముంటే.. హిమ, డాక్టర్ బాబు కస్టడీలోనే ఉండాలి అనే కేసు పగడ్బందీగా పెట్టించు. వెళ్లు.. మళ్లీ వెనక్కి వెళ్లి లాయర్‌కి ఇంకాస్త ఎక్కువ ఫీజ్ ఇచ్చి..గ‌ట్టిగా చెప్పు.. బిత్తరపోయి చూసింది చాల్లే కానీ.. పోవే.. మేము కొన్ని పనికొచ్చే విషయాలు మాట్లాడుకోవాల్లే. నీలాంటి పనికిమాలిన వాళ్లతో ఇప్పటికే చాలా టైమ్ వేస్ట్ అయ్యింది. పోవే..’ అని అంటుంది. ఇక అంజి కూడా ఓ న‌వ్వు న‌వ్వ‌గా.. మౌనిత ఆవేశంతో అక్క‌డి నుంచి వెళుతుంది.

  మ‌రోవైపు సౌర్య ఇంటికి వచ్చేసరికి హిమ ఉండటం చూసి సంతోష‌ప‌డుతుంది నువ్వు వచ్చావా.. నిజంగానే వ‌చ్చేశావా.?? అని అంటుంది. దానికి హిమ అవును ఎందుక‌లా అడిగావు అన‌గా.. నువ్వు ఈ ఇంటికి రావేమో అనుకున్నాను అని సౌర్య చెబుతుంది. చీచీ ఎందుక‌లా రాన‌నుకున్నావు అని హిమ అడ‌గ్గా.. అక్క‌డికి నాన్న వ‌చ్చాడంట క‌దా.. నిన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడేమో అనుకున్నాను. వెంక‌టేష్‌ని ఇంటికి వెళ్లిపోమ‌ని చెప్పారంట క‌దా.. అంటే నువ్వు ఇటు రావేమో అనుకొని అమ్మా నేను చాలా సేపు బాధ‌ప‌డ్డాం. మా ఇద్ద‌రికి బాగా ఏడుపొచ్చింది. అమ్మ అయితే చాలా టెన్ష‌న్ ప‌డింది. నిన్ను నాన్న తీసుకెళ్లి పోయి ఉంటాన‌ని నేను అనుకున్నాను. మ‌ళ్లీ నువ్వు అక్క‌డికి వెళ్తే.. మేమిద్ద‌ర‌మే ఇక్క‌డ ఉండాల‌ని భ‌య‌మేసింది తెలుసా అని సౌర్య చెబుతుంది.

  ఇక హిమ‌.. నాన్న‌తో ఉండ‌ట‌మంటే నాకు ఇష్టం. కానీ మ‌న‌మంద‌రం ఉండ‌ట‌మంటే ఇంకా ఇష్టం. ఇప్పుడు అక్క‌డ‌కు నేను వెళ్లిపోతే నాన్న మిమ్మ‌ల్ని తీసుకురాడు క‌దా. అది నాకు తెలుసు క‌దా అందుకే వెళ్ల‌లేదు అని హిమ చెప్ప‌గా.. నాన్న అక్క‌డ‌కు ర‌మ్మని నిన్ను అడ‌గ‌లేదా..? అని సౌర్య ప్ర‌శ్నిస్తుంది. అడిగాడు. ర‌మ్మ‌ని బ్ర‌తిమాలాడు అని హిమ చెబుతుంది. ఇక సౌర్య ఏడుస్తుండ‌గా.. ఏమైంది సౌర్య అని హిమ అంటుంది. ఏం లేదులే అని సౌర్య చెప్ప‌గా.. మ‌రి నాన్న ర‌మ్మ‌ని అడిగాడు అనగానే ఎందుక‌లా అయిపోయావు అని హిమ అడుగుతుంది. ఏదోలే అని సౌర్య చెప్ప‌గా.. చెప్ప‌వా.. ప్లీజ్ చెప్ప‌వా అని హిమ అంటుంది. దానికి సౌర్య.. నువ్వు నాన్న కూతురివే.. నేను నాన్న కూతుర్నే.. కానీ నాన్న నిన్ను మాత్ర‌మే ర‌మ్మంటున్నాడు. న‌న్ను వ‌ద్దంటున్నాడు అందుకే ఏడుపు వ‌చ్చింది అని ఏడుస్తుంది. దాంతో హిమ.. ఏడ‌వ‌కు సౌర్య. నాన్న న‌న్ను మాత్ర‌మే ర‌మ్మ‌న్నాడు అంటే నన్ను చిన్న‌ప్ప‌టి నుంచి పెంచుకున్నాడు క‌దా అందుకు ర‌మ్మ‌న్నాడు అంతే. నువ్వంటే కూడా నాన్న‌కు ఇష్ట‌మే సౌర్య అని చెబుతుంది. ఇష్ట‌మే కానీ ఇంటికి ర‌మ్మ‌నేంత ఇష్టం కాదు అని సౌర్య అంటుంది. దానికి హిమ‌.. ర‌మ్మంటే అమ్మ‌ను ఒక్క‌దాన్ని వ‌దిలేసి వెళ్తావా నువ్వు. నేను నాన్న‌తో చెబుతాను. చెప్పు వెళ‌తావా..? అని అడ‌గ్గా.. అమ్మ‌ను వ‌దిలేశా.. అమ్మో అమ్మ ఏడ‌వ‌దు అని సౌర్య చెబుతుంది. నేను కూడా అందుకే వెళ్ల‌లేదు. అమ్మ ఏడ‌వ‌దు అని హిమ చెబుతుంది. అవును ఇంత‌కు అమ్మ ఏది అని సౌర్య అడ‌గ్గా.. నన్ను ఇంటికి తీసుకురాగానే ఏదో ఫోన్ వ‌చ్చింది. వెంట‌నే అదే వార‌ణాసి ఆటో ఎక్కి వెళ్లిపోయింది అని హిమ చెబుతుంది. ఎక్క‌డికో చెప్ప‌లేదా అని సౌర్య అడ‌గ్గా.. లేదు హ‌డావిడిగా వెళ్లిపోయింది అని హిమ చెబుతుంది. అస‌లు ఏం జ‌రుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అన్న సౌర్య‌.. నేను పాలు తీసుకొస్తాను అంటూ అక్క‌డి నుంచి వెళుతుంది.

  ఇక ఇంట్లో ఆదిత్య కోపంగా బాధగా కూర్చుని ఉంటే.. సౌందర్య వచ్చి ‘ఏరా ఏమైనా తిన్నావా?’ అని అడ‌గ్గా.. హా చెంప‌దెబ్బ అని ఆదిత్య అంటాడు. ఎలా ఉంది అని సౌంద‌ర్య అడ‌గ్గా.. కారం ఎక్కువైంది అని ఆదిత్య అంటాడు. కాప‌డం పెట్టుకున్నావా మ‌రి అని సౌంద‌ర్య చెప్ప‌గా.. నేను ఒక బిడ్డకు తండ్రిని మ‌మ్మీ అని ఆదిత్య అన‌గా.. కానీ ఈ అమ్మ‌కు బిడ్డ‌వే అని సౌంద‌ర్య అంటుంది. ఓ అన్న‌కు త‌మ్ముడిని కూడా అని ఆదిత్య అన‌గా. కాద‌ని ఎవ‌రు అంటారురా. మీ అనుబంధం గురించి నేను మాట్లాడ‌లేదు. మీ వ‌దిన గురించి మాట్లాడే అర్హ‌త నీకు లేద‌ని నేను తిట్టాను అని చెబుతుంది. అదే స‌మ‌యంలో కార్తీక్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. నీ కోస‌మే ఎదురుచూస్తున్నాను అని సౌంద‌ర్య అన‌గా.. దేనికి అని కార్తీక్ అంటాడు. అంత పొద్దున్నే ఎక్క‌డికి వెళ్లావు అని ప్ర‌శ్నించ‌గా.. నీకు ఈ పాటికే వ‌ర్త‌మానం అంది ఉంటుంది క‌దా కార్తీక్ అంటాడు. దానికి సౌంద‌ర్య నువ్వు చెబితే విందామ‌ని అని అంటుంది. దానికి కార్తీక్.. నేనేమి మార్చి చెప్ప‌ను వంట‌ల‌క్కలాగా అని అంటాడు. మార్చేసి చెబుతావా మౌనితలాగా అని

  సౌంద‌ర్య అంటుంది.

  దానికి కార్తీక్.. మ‌ధ్య‌లో మౌనితను లాగ‌కు మ‌మ్మీ అంటాడు. నువ్వు మ‌ధ్య‌లో వంట‌ల‌క్క‌ను ఎందుకు లాగావు అని అడుగుతుంది. అది విష‌యాన్ని మార్చి చెప్పి ఉంటుంది కాబ‌ట్టి అని కార్తీక్ అన‌గా.. అది మార్చి చెప్ప‌దు. ఏప్రిల్ చెప్ప‌దు. ఉన్న‌ది చెబుతుంది అని అంటుంది. అయితే ఏం చెప్పింది అని కార్తీక్ అడ‌గ్గా.. హిమను వంట‌ల‌క్క నుంచి దూరం చేయ‌డానికి నువ్వు తెలివిగా మౌనిత‌కు ద‌గ్గ‌ర చేయాల‌నుకున్నావు. ఇప్పుడు హిమ దానికి చెప్ప‌కుండా.. నీకు చెప్ప‌కుండా దాని ఇంటికి వెళ్లిందంటే కార‌ణం ఎవ‌రు..? వెళ్లిన కార‌ణం ఏంటి..? అని అడుగుతుంది. అంత చెప్పింది మిగిలిన స‌గం చెప్ప‌లేదా..? స‌డ‌న్‌గా మీ ఇద్ద‌రి ఫోన్ల‌లో టాక్ టైమ్ బ్యాలెన్స్ అయిపోయిందా.?? అని కార్తీక్ అంటాడు. హిమ మ‌న‌సులో ఎంత సంఘ‌ర్ష‌ణ జ‌రుగుతుందో నువ్వు తెలుసుకోలేక‌పోతున్నావు కార్తీక్.. ఇప్పుడు నువ్వు మౌనిత ఇంటికి ఎందుకు వెళ్లావు అని నేను అడ‌గ‌ట్లేదు. హిమ ఎందుకు వెళ్లింది..? ఎందుకు వెళ్లాల‌నిపించింది..? అస‌లు ఎవ‌రికి చెప్ప‌కుండా ఎందుకు వెళ్లింది అని సౌంద‌ర్య అడ‌గ్గా.. తెలీదు అని కార్తీక్ అంటాడు. నీకు తెలుసు అని సౌంద‌ర్య అంటుంది. దానికి కార్తీక్.. అస‌లు నా మీద ఈ నిఘా ఏంటి..? ఎక్క‌డికి వెళ్లాను..? ఎప్పుడు వెళ్లాను..? ఎంత‌సేపు ఉన్నాను..? ఏం మాట్లాడాను..? అసలు ఏంటి ఇవ‌న్నీ.. ఇది తెలిస్తే ప్ర‌తి ఒక్క‌రికి ఎంత అలుసుగా మారుతుందో తెలుసా.. ఇలా డ్రైవర్ల మీదా.. నౌక‌ర్ల మీదా ఆధార‌ప‌డి.. ఇంట్లో వాళ్ల మీద నిఘా పెడితే వాళ్లు దాన్ని ఎంత అడ్వాంటేజ్గా తీసుకుంటారో తెలుసా..? ఆఖరికి అంజి కూడా నాకు చెప్పేటంత‌టి వాడు అయ్యాడా..? అని ప్ర‌శ్నిస్తాడు. ఏ అంజి అని సౌంద‌ర్య అడ‌గ్గా.. డ్రైవ‌ర్ అంజి అని కార్తీక్ అంటాడు. వాడు ఏం చెప్పాడు అని సౌంద‌ర్య ప్ర‌శ్నించ‌గా.. నువ్వు ఏమ‌ని చెప్ప‌మ‌ని చెప్పావో అదే చెప్పాల‌ని చూశాడు అని అంటాడు. నేను వాడితో ఏం చెప్ప‌మంటానురా అని అడ‌గ్గా.. ఇంకేం చెప్ప‌మంటావు..? ఆ మౌనిత గురించి చెడుగా చెప్ప‌మంటావు..? లలేదంటే దీప గురించి మంచిగా చెప్ప‌మ‌ని ఉంటావు అని అంటాడు. ఏంటి అన్న‌య్యా నువ్వు అనేది అంజిగాడు ఏం చెప్పాడు అని ఆదిత్య అడ‌గ్గా.. ఏదో మౌనిత మీద చెడుగా చెప్ప‌బోయాడు అని అంటాడు. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి దీప అత‌డి సెల్‌ని తీసుకుంటుంది. కార్తీక్ దీపం కొన‌సాగ‌నుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

  ఉత్తమ కథలు