హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: మీరు క‌ట్టుకున్న పెళ్లాన్ని అనుమానించే అనుమాన‌పు మొగుడు.. కార్తీక్‌ని ఏకిపారేసిన దీప‌

Karthika Deepam: మీరు క‌ట్టుకున్న పెళ్లాన్ని అనుమానించే అనుమాన‌పు మొగుడు.. కార్తీక్‌ని ఏకిపారేసిన దీప‌

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam serial) సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది.త త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకుందుకు దీప కంక‌ణం క‌ట్టుకోవ‌డం, మూలాల‌ను వెతికే ప‌నిలో ప‌డ‌టంతో క‌థ మరింత ఆస‌క్తిగా మారింది

ఇంకా చదవండి ...

  Karthika Deepam : తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది.త త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకుందుకు దీప కంక‌ణం క‌ట్టుకోవ‌డం, మూలాల‌ను వెతికే ప‌నిలో ప‌డ‌టంతో క‌థ మరింత ఆస‌క్తిగా మారింది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఆదిత్య‌. అటుగా శ్రావ్య రావ‌డంతో.. అన్న‌య్య ఇంకా ఇంటికి రాలేదా.. అని అడుగుతాడు. లేదు అని చెప్పిన శ్రావ్య‌.. ఫోన్ చేయ‌క‌పోయావా అని అడుగుతుంది. అప్పుడే చేశాను లిఫ్ట్ చేయ‌లేదు ఫంక్ష‌న్‌లో బాగా అప్‌సెట్ అయిన‌ట్లు ఉన్నాడు అని ఆదిత్య అంటాడు. దానికి శ్రావ్య‌.. ఎవ‌రు మీ అన్నయ్యా.. అని ప్ర‌శ్నిస్తుంది. వెంట‌నే ఆదిత్య ఇంకెవ‌రు అవుతారు అంటూ ప్ర‌శ్నిస్తాడు. దానికి శ్రావ్య‌.. ఇంకెవ‌రు అవుతారా..? అంటే మా అక్క‌కు మ‌న‌సు లేదు అది మ‌నిషి కాదు అంటావా..? అదెంత ఫీల్ అయ్యిందో నీకు అన‌వ‌స‌ర‌మా..? అని అంటుంది. దానికి ఆదిత్య అదంతా హిమ వ‌ల్ల‌నే జ‌రిగింది. అన‌వ‌స‌రంగా తెలిసీ తెలియ‌క వ‌దిన‌ను డ‌యాస్ మీదికి పిలిచింది అని అంటాడు.

  వెంట‌నే అక్క‌డ‌కు వ‌చ్చిన సౌంద‌ర్య నువ్వు కొంచెం నోరు మూస్తావా..? తెలిసీ తెలియ‌క నువ్వు మాట్లాడుతున్నావు. అన‌వ‌స‌రంగా హిమ‌, దీప‌ను పిలిచిందా..? మ‌రి ఎవ‌రినీ పిలిచి ఉండాలి..? ఎప్ప‌టికీ మీ వ‌దిన ప్రేక్ష‌కుల్లో ఆఖ‌రును అప‌రిచితురాల్లా ఉండాలి. మీ అన్న‌య్య స్టేజ్ మీద స‌న్మానాలు, బిరుదులు పొందుతూ ఉండాలి. మ‌ధ్య‌లో వార‌ధిలా హిమ త‌ల్లి ద‌గ్గ‌రుండి తండ్రి కోసం.. తండ్రి ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు త‌ల్లి కోసం అల‌మ‌టిస్తూ ఉండాలి అంతేనా అని ప్ర‌శ్నిస్తుంది. శ్రావ్య నిన్ను ఒక ప్ర‌శ్న అడిగింది. స‌రిగ్గా విన్నావా..? మా అక్క‌కు మ‌నసు లేదా..? అది మ‌నిషి కాదా..? అని అడిగింది. దానికి నువ్వు, మీ అన్న‌య్య ఏం స‌మాధానం చెప్తారు..? ‌పెద్ద‌రికం మీదేసుకొని మీ వ‌దిన ద‌గ్గ‌ర‌కు వెళ్లి అన్న‌య్య‌ను న‌మ్మించే ప్ర‌యత్నం చేయ‌మ‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చావే.. అదే మీ అన్న‌య్య‌తో చెప్పొచ్చుగా. నీలో కూడా పురుషాకంహారం పురుడు పోసుకుంటుందా..? హిమ చిన్న‌పిల్ల. దాని ప‌రిధిలో, దాని మ‌న‌సులో వేల ప్ర‌శ్నలు మెదులుతూ ఉంటాయి. వాటికి ఎవ‌రు స‌మాధానం చెప్తారు‌.

  అమ్మానాన్న‌లు క‌లిసి ఉండాల‌న్న తాపత్ర‌యంలో దానికి అనిపించింది ఏదో చేసింది. స్టేజ్ మీద‌కు త‌ల్లిని, సౌర్య‌ను పిలిచింది అది అన‌వ‌స‌రం అంటావా..? నీ కొడుకు క‌న్నా ముందు పుట్టిన ఆడ‌పిల్ల‌లు వాళ్లు అలాగే బీద‌రికంలో బ‌తుకుతుండాలా..? ఇంత ఆస్తి ఉండి, వాళ్లు మ‌న ఇంటి వార‌సుల్లా కాకుండా పేద‌రికంలో మ‌గ్గిపోవాల్సిందేనా..? హిమ‌లో కాస్త అయినా తెగింపు ఉంది. ఆ తెగింపు నీకు, నాకు లేనందుకు సిగ్గుప‌డాలి అని చెబుతూ ఉంటుంది.

  ఆ లోపు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే కార్తీక్.. చాలు ఆపండి అని అంటాడు. నేను ఇప్ప‌టి దాకా హిమ చిన్న‌పిల్ల, తెలీక పిలిచింది అనుకున్నాను. కానీ అది మీ పెంపుడు చిల‌క‌లా మారిపోయింద‌ని, మీరు నేర్పిన ప‌లుకులే ప‌లుకుతుంద‌ని ఇప్పుడు తెలుసుకున్నాను. నాకు బుద్దిలేక నీతో చెప్పించాను హిమ‌ను మాత్ర‌మే పిలిపించ‌మ‌ని, నువ్వు అతి తెలివితో త‌ల్లిని, పిల్ల‌ను కూడా అక్క‌డ‌కు ర‌ప్పించావు. నువ్వు ర‌మ్మ‌న్నావో, హిమ ర‌మ్మందో ఆ గొడ‌వ వ‌దిలేద్దాం. కానీ త‌ల్లికి బుద్ది ఉండాలిగా.. త‌వుతునమ్మా అంటూ త‌యారై వచ్చేస్తుందా..? నాకు స‌న్మానం జ‌రుగుతుంటే అక్క‌డకు వ‌చ్చి ఇంత సీన్ క్రియేట్ చేయాలా..? వ‌స్తే ఏం జ‌రుగుతుందో తెలీకుండానే పిల్ల‌లు ఇద్ద‌రినీ తీసుకొచ్చిందా..?ప‌ంతం. నేను ప్ర‌శ్నాతంగా ఉండ‌కూడ‌దు, ప‌రువుగా బ‌త‌క‌కూడ‌దు. నాతోటి డాక్ట‌ర్లంద‌రి ముందు నా ప‌రువు పోయింది తెలుసా..? అని అంటాడు.

  వెంట‌నే శ్రావ్య‌.. మీరు ఏమీ అన‌లేదా బావ‌గారు..? అని అడుగుతుంది. దానికి ఆదిత్య నువ్వు నోర్ముయ్.. ఎవ‌రినీ ఏం అడుగుతున్నావు..? అని ప్ర‌శ్నించ‌గా.. వెంట‌నే శ్రావ్య ఇలాగే అంద‌రూ అంద‌రి నోళ్ల‌ను మూయించండి అని కోప్ప‌డుతుంది. ఇక సౌంద‌ర్య‌.. నువ్వు శ్రావ్య మీద ఎగిరిప‌డ‌తావేంటిరా మ‌ధ్య‌లో అని ఆదిత్య‌పై మండిప‌డుతుంది. మీ అన్న‌య్య ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పాడో నువ్వు విన‌లేదా..? అని అంటుంది. దానికి కార్తీక్.. అవును ఉన్న‌దే చెప్పా, త‌ప్పేంటి అని అంటాడు. అప్పుడు ఎవ‌రి ప‌రువు ఎవ‌రు తీశారురా స్టుపిడ్.. దీప స్టేజ్ మీద‌కు వ‌చ్చింద‌న్న క‌సితో మౌనిత అనే పంచ‌వ‌న్నెల చిల‌క ప‌లికించిన ప‌లుకులే ప‌లికావు. దానికి ఏమంటావు..? హిమ చిన్న‌పిల్ల ఓకే, నీ చ‌దువు, తెలివి, సంస్కారం ఏమైపోయాయి అని మండిప‌డుతుంది. దానికి కార్తీక్.. ప్రెస్‌వాళ్లంద‌రూ అక్క‌డ అని ఏదో చెప్ప‌బోతుండ‌గా.. నువ్వు మాట్లాడ‌కు కార్తీక్, అని సౌంద‌ర్య ఆపుతుంది. భ‌గ‌భ‌గ మండిపోతుంది మాకు. ఇంటి గుట్టు తీసుకెళ్లి ప్రెస్‌మీట్‌లో పెట్టి, ఇంటికొచ్చి మా మీద అరుస్తావేంటిరా.. కాస్తైనా ఙ్ఞానం ఉందా..? ఆత్మ గౌర‌వం కోసం ఆస్తిని, అయిన వాళ్ల‌ను వ‌దులుకుంటున్న ఆడ‌దాన్ని, నీ సాటి డాక్ట‌ర్ల ముందు అవ‌మానించి పంప‌డానికి బుద్దిలేదా..? పేరుకు పెద్ద డాక్ట‌ర్‌వి. అప్ప‌టికే సన్మానం కూడా జ‌రిగింది. అయినా నీ చ‌దువు, సంస్కారం చ‌ట్టుబండ‌లైంది. ఇప్పుడొచ్చి హిమ‌కు మేమోదో నూరిపోశామంటున్నావు. ఊహ తెలిసిన పిల్ల‌కు ఆ మాత్రం అర్థం కాదా..? దానికి అర్థ‌మైంది. ఇన్నేళ్లు వ‌చ్చాయి నీకు, ఏట్లో పెట్ట‌డానికా..? ‌గూట్లో పెట్ట‌డానికా..? ఏదీ అర్థం కావ‌డం లేదు. పోరా అంటూ కోప్ప‌డుతుంది.

  వెంట‌నే కార్తీక్.. నీలాంటి త‌ల్లిని నేను ఎక్క‌డా చూడ‌లేద‌మ్మా అని దండం పెట్ట‌గా.. నా లాంటి త‌ల్లి, నా లాంటి అత్తా నీకు ఎక్క‌డా క‌న‌ప‌డ‌దులే, వెళ్లు అని సీరియ‌స్ అవుతుంది. ఆ త‌రువాత ఆదిత్య‌తో ఏంటి..? నువ్వేంటిరా శ్రావ్య మీద విరుచుకుప‌డుతున్నావు. దీప, శ్రావ్య‌కు తోడికోడ‌లే కాదు, సొంత అక్క‌. ర‌క్తం పంచుకొని పుట్టిన‌దానికి అంత అవ‌మానం జ‌రిగితే క‌డుపు మండిపోదా..? అందుకే అడిగింది. అన్న త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకొని అంద‌రినీ అంటే చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా..? శ‌్రావ్య సాటి ఆడ‌దానిగా స్పందించి మాట్లాడింది. త‌ప్పు చేయ‌ని ఆడదాన్ని నిందించి పంపిస్తే బావ అయితే ఏంటి..? భ‌గ‌వంతుడు అయితే ఏంటి..? ‌నిల‌దీసే హ‌క్కు ఎవ్వ‌రికైనా ఉంటుంది. వాడు వాడి పెళ్లాం మీద ఎగిరిన‌ట్లు నువ్వు నీ పెళ్లాం మీద ఎగిరావో చీరేస్తా, వెళ్లు అని గ‌ట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇక త‌న త‌ల ప‌గిలిపోతుంద‌ని, కొంచెం కాఫీ తీసుకుర‌మ్మ‌ని శ్రావ్య‌కు చెప్ప‌గా.. ఆమె లోప‌లికి వెళుతుంది.

  మ‌రోవైపు మౌనిత.. దీప మాట‌ల‌ను గుర్తుచేసుకుంటూ ఉంటుంది. వెంట‌నే ప్రియ‌మ‌ణి.. అమ్మా నీళ్లు తేనా..? తాగుతారా అని అడ‌గ్గా.. ఊ అంటుంది. దీంతో ప్రియ‌మ‌ణి లోప‌లికి వెళుతుంది. ఆ త‌రువాత త‌న మ‌న‌సులో ఏ రోజు దీప‌లో ఇంత ధైర్యం చూడ‌లేదు. ఇంత‌కాలం తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో న‌న్ను భ‌య‌పెట్టాలని బెదిరించేది కానీ.. ఇవాళ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఏదైనా నా గురించి తెలిసిందా..? ఏ విష‌యం తెలీడానికి లేదే.. మ‌రి ఎందుకు అంత రెచ్చిపోయింది అని అనుకుంటుంది. వెంట‌నే ప్రియ‌మ‌ణి లోప‌లి నుంచి నీళ్ల‌ను తీసుకొని వచ్చి ఇస్తుంది.

  ఆ త‌రువాత ప్రియ‌మ‌ణి.. అమ్మా నేను మిమ్మ‌ల్ని ఏ ప్ర‌శ్న అడుగుతాను. నిజం చెప్పండి, అబ‌ద్ధం మాత్రం చెప్ప‌కండి. ఎందుకంటే ఈ భూమి మీద మీ క్షేమం కోరే మ‌నుషులు ఇద్ద‌రే ఉన్నారు. ఒక‌రు నేను, మ‌రొక‌రు కార్తీక్ అయ్య‌. ఇప్పుడు గొడ‌వ అంతా కార్తీక్ అయ్య పెళ్లాంది కాబ‌ట్టి ఆయ‌న‌తో చెప్ప‌లేరు. నేనున్నా, నాకైనా చెప్తే అని నీళ్లు న‌ములుతుండ‌గా.. సోది లేకుండా సూటిగా అడిగేదేదో అడుగు అని మౌనిత అంటుంది. వెంట‌నే ప్రియ‌మ‌ణి నాకెందుకో చాలా భ‌యంగా ఉంద‌మ్మా.. ఆ దీప వాల‌కం చూశాక ఎంత తెగించి మాట్లాడింది అమ్మా. మ‌న‌లో మ‌న‌మాట కార్తీక్ అయ్య‌ను ద‌క్కించుకోవ‌డానికి నువ్వు ఏమైనా దుర్మార్గానికి పాల్ప‌డ్డావా..? అని అడుగుతుంది. దానికి మౌనిత‌.. నీకు అన‌వస‌రం అని అన‌గా.. అన‌వ‌స‌రం అన్నారంటే క‌చ్చితంగా ఏదో ఒక‌టి చేసి ఉంటారు. అస‌లు నీ ప్రేమ ఏంటి అమ్మా.. దెయ్యం ప్రేమలాగా.. అంటే చ‌దువుకునేట‌ప్పుడు ప్రేమించారు. అప్పుడు ఆయ‌న ఇంకొక‌రిని ప్రేమించిన‌ప్పుడు వ‌ద‌ల్లేదు. పెళ్లికి ఇంకో అమ్మాయిని చేసుకున్నారు అయినా వ‌ద‌ల్లేదు. ఎవ‌రైనా అయితే వ‌దిలేసి సుబ్బ‌రంగా పెళ్లి చేసుకుంటారు. నువ్వేంటో.. నిజాయితీ ప్రేమ‌ను మెచ్చుకోవాలో.. పిచ్చి ప్రేమ అనుకోవాలో నాకైతే అర్థం కావ‌డం లేదు అని అక్క‌డి నుంచి నిదానంగా జారుకుంటుంది.

  ఇక దీప ఇంట్లో హిమ‌, కార్తీక్‌ని గుర్తుచేసుకుంటూ ఉంటుంది. డాడీకి అమ్మ అంటే ఎందుకు ఇష్టం లేదు. అంద‌రూ అమ్మ‌ను ఇష్ట‌ప‌డ‌తారు. కానీ నాన్న‌కు ఎందుకు న‌చ్చ‌దు. అంద‌రిలా మేము అంద‌రం క‌లిసి ఉండ‌లేమా..? అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బ‌య‌ట సౌర్య‌.. అమ్మ ఎందుకు ఇంకా రావ‌డం లేదు. ఎక్క‌డికి వెళ్లింది..? హిమ ఏడిస్తే ఏం చెప్పాలి..? అని ఆలోచిస్తూ ఉంటుంది. మ‌రోవైపు ప్రెష్ అయి వ‌చ్చిన కార్తీక్.. త‌న గ‌దిలో హిమ ఫొటో, గుర్తులు ఏం లేక‌పోవ‌డంతో అవ‌న్నీ వెతుకుతూ ఉంటాడు. వీటిని ఎవ‌రు తీస్తారు..? అని ఆలోచించుకుంటూ మౌనిత చేసిందా..? మాట్లాడితే హిమ, విహారి కూతురు అని గుర్తు రాకుండా ఇదంతా చేసిందా..? అంటూ మౌనిత‌కు కాల్ చేస్తాడు.

  ఇక మౌనిత సెల్ దీప ద‌గ్గ‌ర ఉండ‌గా.. కార్తీక్ ఫోన్ నంబ‌ర్‌ని చూసి దీప క‌ట్ చేస్తుంది. అస‌లు మౌనిత నా ఫోన్‌ని క‌ట్ చేయ‌డ‌మేంటి..? అనుకుంటూ కింద‌కు వెళ్లి మ‌మ్మీ.. మ‌మ్మీ ఎవ‌రైనా ఉన్నారా..? అని అరుస్తుంటాడు. అక్క‌డకు వ‌చ్చిన సౌంద‌ర్య‌.. ఏంటో అడ‌గండి అనగా.. ఏం నాకు స‌మాధానం చెప్ప‌వా..? ఏంటి అని అడుగుతాడు. నీకు కాలం త‌ప్పా.. ఎవ్వ‌రూ స‌మాధానం చెప్ప‌రు అని సౌంద‌ర్య అన‌గా.. నాకు స‌మాధానం తెలిసిన‌ప్పుడు కాలం మీద ఆధార‌ప‌డ‌ను అని అంటాడు. దానికి సౌంద‌ర్య.. ఆ భ్ర‌మ‌లో బ్ర‌తికే వాళ్ల‌కు ఎవ్వ‌రి స‌మాధానం రుచించ‌దు అని సౌంద‌ర్య చెప్ప‌గా.. నేనేమీ చ‌రిత్ర‌లో లేనివి, ఇతిహాసాల్లో ఉన్న‌వి, ధ‌ర్మ‌సందేహాలేవీ అడ‌గ‌ట్లేదు. ఇంటికి మౌనిత వ‌చ్చిందా..? అని కార్తీక్ అడ‌గుతాడు. దానికి సౌంద‌ర్య.. ఆ చ‌రిత్ర‌లో లేని దాన్ని నేను చూడ‌లేదు అంటుంది. వెంట‌నే కార్తీక్.. వ‌చ్చి వెళ్లిందా..? అని అడుగుతున్నాను అన‌గా.. వ‌స్తే కాళ్లు, చేతులు, క‌ళ్లు, ముక్కు లేకుండా వెళుతుంద‌ని దానికి తెలుసు, అందుకే రాదు అని సౌంద‌ర్య స‌మాధానం చెబుతుంది.

  ఇక కార్తీక్.. పై రూమ్‌లో ఉన్న హిమ ఫొటోల‌ను, పోస్ట‌ర్‌ల‌ను ఎవ‌రు తీసేశారు అని అడ‌గ్గా.. ఎవరు తీసేస్తే నీకెందుకు అని సౌంద‌ర్య అంటుంది. దానికి కార్తీక్.. నాకెందుకా.. ఏం మాట్లాడుతున్నావు మ‌మ్మీ.. హిమ‌ ఫొటోల‌ను, పోస్ట‌ర్‌ల‌ను తీసింది ఎవ‌రు అని అడుగుతున్నాను నువ్వు స‌రిగ్గా విన్నావా..? అని కార్తీక్ అన‌గా.. సౌంద‌ర్య విన్నాను. నా కోడ‌లు దీప వ‌చ్చి తీసుకెళ్లింది అని చెప్తుంది. ఏంటి.. అదెవ‌రు నా కూతురు ఫొటోలు తీసుకెళ్ల‌డానికి అని కార్తీక్ అన‌గా.. ఎంట్రీ ఇచ్చిన దీప‌.. ఎవ‌రి కూతురు అని ప్ర‌శ్నిస్తుంది. మీ కూతురా..? హిమ మీ కూతురా..?అ‌యితే ఒప్పుకోండి. హిమ మీ కూతురేన‌ని ప్ర‌పంచం ముందు ఒప్పుకోండి అని చెబుతుంది. దానికి కార్తీక్ నేను పెంచాను అన‌గా.. నేను క‌న్నాను అని దీప అంటుంది. అయితే నాకేం హ‌క్కు లేదా..? అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. ఎవ‌రిచ్చారు నీకు ఆ హక్కు అని దీప తిరిగి ప్ర‌శ్నిస్తుంది.

  పెంచిన ప్రేమ ఇచ్చింది అని కార్తీక్ అన‌గా.. మ‌రి క‌న్న ప్రేమ‌కు ఎలాంటి అధికారాలు లేవా..? అని అడ‌గ్గా.. నాకు తెలీకుండా నా ఇంట్లో నుంచి హిమ ఫొటోను, ఙ్ఞాప‌కాలు తీసుకునే హ‌క్కు నీకు లేదు అని కార్తీక్ అంటాడు. నాకు తెలీకుండా నా బిడ్డ‌ను తెచ్చుకొని, పెంచుకునే హ‌క్కు మాత్రం నీకు ఉందా అని దీప అంటుంది. మాట్లాడండి. దేశోద్దార‌కులు క‌దా. ఎవ‌రిని ఉద్ద‌రించ‌డానికి పెంచుకున్నారు..? ‌నా కూతురి ఫొటోలు నేను తీసుకెళ్లాను. ఆ గోడ‌ల మీద అర్థం లేని రాత‌లు, తెలీక రాసిన రాత‌లు మీకెందుక‌ని తీసుకెళ్లాను. అవి మీకెందుని నేను తీసుకు వెళ్లాను.

  దాని ‌పుట్టుక‌నే ప్ర‌శ్నించే మీకు, దాని ఙ్ఞాప‌కాల మీద ఏం హ‌క్కు ఉంద‌ని నిల‌దీస్తున్నారు. నా కూతురి ఫొటోలు నేను తీసుకెళ్లా. మీ కూతురు మీ కూతురు అంటున్నారు క‌దా అయితే ఒప్పుకోండి మీ కూతురు అని.. ఫొటోలు, ఙ్ఞాప‌కాలు కాదు ఏకంగా మీ కూతురిని తీసుకొచ్చి అప్ప‌జెబుతాను. ఒక్క కూతురిని మాత్ర‌మే కాదు ఇద్ద‌రు కూతుళ్ల‌ను. ఇద్ద‌రు కూతుళ్లు మాత్ర‌మే కాదు వాళ్ల‌ది క‌న్న‌ది కూడా వ‌స్తుంది. పెంచారులే మ‌హా.. కుక్క పిల్ల‌ను కూడా పెంచుకుంటారు. వాటికి పేర్లు పెట్టుకుంటారు. వాటికి పుట్టిన‌రోజు వేడుక‌లు చేస్తారు. దానికి, దీనికి తేడా ఏముంది..? కూతురు కూతురు అంటున్నారే మ‌రి నేను తీసుకెళ్లే రోజు ఎందుకు ఆప‌లేదు. ఎందుకు లాక్కోలేదు, ఏది మీ ప్రేమ అని దీప ప్ర‌శ్నిస్తూ ఉంటుంది. అప్పుడు సౌంద‌ర్య‌.. వాడికి దాని మీద ప్రేమ లేదంటావా..? అని అడగ్గా.. ఉంటే ఒప్పుకోమ‌నండి. క‌న్న కూతురు అని దీప‌ అంటుంది. ప్రేమ ఉంటే స‌రిపోదు. న‌మ్మ‌కం ఉండాలి. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. ఉందా మీ కొడుకులో ఆ ధైర్యం. ఆ ధైర్య‌మే ఉంటే.. నేను త‌ప్పు చేశాను అనే ఆ నోటితోనే నువ్వు ఏ త‌ప్పు చేయ‌లేదు దీప అని అన‌మ‌నండి. అన‌రు, ఎందుకంటే అనుమానమ‌నే పెనుభూతం ఆ న‌మ్మ‌కాన్ని మింగేసింది అని దీప అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ ఎవ్వ‌రినీ ఏం అడుగుతున్నావు నువ్వు అని అన‌గా.. డాక్ట‌ర్ బాబును వ్య‌క్తిత్వం గురించి అడుగుతున్నా. ఏది మీ వ్య‌క్తితం, ఏది మీ ఆద‌ర్శం, పురుషాధిక్య‌త మింగేసిందా..? పురుషాహంకారం అణ‌గ‌దొక్కేసిందా..? స‌మాజంలో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంటే స‌రిపోదు. ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలి.. ఇక్క‌డ మీరేంటి..? ప‌చ్చిగా చెప్పాలంటే.. క‌ట్టుకున్న పెళ్లాన్ని అనుమానించే అనుమాన‌పు మొగుడు అని త‌న‌లోని ఆవేశాన్ని బయటపెడుతుంది దీప. ఇక రేపటి ఎపిసోడ్ లోనూ ఇదే కంటిన్యూ అవ్వనుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Vantalakka

  ఉత్తమ కథలు