Home /News /movies /

KARTHIKA DEEPAM SERIAL UPDATE DEEPA REVEALS TRUTH TO SOUNDARYA REFUSES TO CONVEY IT WITH KARTHIK MNJ

Karthika Deepam: డాక్ట‌ర్ బాబుకు నిజం చెప్ప‌ను అత్త‌య్య‌.. సౌంద‌ర్య ద‌గ్గ‌ర బాంబ్ పేల్చిన దీప‌

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. (Karthika Deepam)

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. (Karthika Deepam)

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో నాన్న ఎందుకు మ‌న‌స్ఫూర్తిగా మాట్లాడ‌టం లేదంటూ సౌర్య‌.. సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌ను అడుగుతుంది. దాంతో సౌంద‌ర్య ఆలోచ‌న‌లో ఉండ‌గా.. ఏంటి నాన‌మ్మ మాట్లాడ‌వు, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దానికి మీ నాన్న న‌వ్వు గురించి, నేను, మీ అమ్మ మీ నాన్న‌ను న‌వ్వించ‌లేము. నువ్వు ఉన్నావు క‌దా రౌడీ రాణివి నువ్వు న‌వ్వించు చూద్దాం అని సౌంద‌ర్య అంటుంది.

ఇంకా చదవండి ...
  తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో నాన్న ఎందుకు మ‌న‌స్ఫూర్తిగా మాట్లాడ‌టం లేదంటూ సౌర్య‌.. సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌ను అడుగుతుంది. దాంతో సౌంద‌ర్య ఆలోచ‌న‌లో ఉండ‌గా.. ఏంటి నాన‌మ్మ మాట్లాడ‌వు, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దానికి మీ నాన్న న‌వ్వు గురించి, నేను, మీ అమ్మ మీ నాన్న‌ను న‌వ్వించ‌లేము. నువ్వు ఉన్నావు క‌దా రౌడీ రాణివి నువ్వు న‌వ్వించు చూద్దాం అని సౌంద‌ర్య అంటుంది. దానికి ఎందుకు న‌వ్వించ‌ను, న‌వ్విస్తాను. డాడీ గ‌ట్టిగా న‌వ్వ‌డం మీకు చూపిస్తాను అని సౌర్య అన‌గా.. ఆనంద‌రావు ఛాలెంజ్ అంటాడు. దానికి సౌర్య ఛాలెంజ్ అన‌గా వెంట‌నే సౌంద‌ర్య‌.. ఆ ప‌ని చెయ్య‌వే నీకు కాస్ట్‌లీ ఫ్రాక్ కొనిస్తాను అని అంటుంది. దాంతో సౌర్య అదోలా ఉండ‌గా.. ఏంటే అలా చూస్తున్నావు. ఇంకా ఏదైనా కావాలా కాస్ట్‌లీది అని సౌంద‌ర్య అడుగుతుంది.

  దానికి సౌర్య‌.. ప్ర‌తి దాన్ని ఎందుకు డ‌బ్బుతో చూస్తారు. నాన్న కూడా అంతే, హిమ‌ను బాగా రెడీ చేసినందుకు 500 చేతిలో పెట్టారు. ప్ర‌తిదానికి వెల క‌ట్ట‌డ‌మేనా.. ఇంకేం లేదా అని అడుగుతుంది. దాంతో సౌర్య‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్న సౌంద‌ర్య ముద్దుపెట్టి, ఇదెలా ఉంది అని అడుగుతుంది. దానికి సౌర్య‌.. సూప‌ర్. నాకు కావాల్సింది ఇదే. ఇలా ఉండాలి కానీ ప్ర‌తిదానికి గిఫ్ట్‌తో లింక్ పెట్ట‌కూడ‌దు అని అంటుంది. ఇక సౌంద‌ర్య‌, సౌర్య‌ను ముద్దు చేస్తూ.. నీతో క‌ష్ట‌మే బాబు, నేనేదో ఫ్లోలో అన్నానే. వ‌దిలేయ్ అని అన‌గా.. నేను జోక్‌గా అన్నానులే అని సౌర్య అంటుంది. ఇక ఆ త‌రువాత అవును.. ఇందాక ఏదో కాస్ట్‌లీ ఫ్రాక్ అన్నావు క‌దా, రెడీ చేసుకో అని సౌంద‌ర్య‌కు చెబుతూ సౌర్య అక్క‌డి నుంచి వెళుతుంది. ఇక సౌంద‌ర్య‌.. ఇది మామూలుది కాదండి అన‌గా.. నీ పోలిక‌లే క‌దా. అందుకే పేరు కూడా నీదే పెట్టాము అని ఆనంద‌రావు అంటాడు.

  మ‌రోవైపు దీప గుడికి వెళ్లి, సౌంద‌ర్య కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక చోట కూర్చొని తుల‌సి చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ..తుల‌సి చెప్పిన విష‌యం అత్త‌య్య‌తో చెప్పాలి. కానీ ఇంత సున్నిత‌మైన విష‌యం డాక్ట‌ర్ బాబుతో ఎలా చెప్పాలి.. అస‌లు చెప్పాలా.. వ‌ద్దా.. కానీ నాకు ఇంత‌కంటే వేరే దారి లేదే. డాక్ట‌ర్ బాబులోని అనుమానం పోగొట్టుకోవ‌డానికి ఇంత‌కంటే గ‌ట్టి సాక్ష్య‌మే లేదే.. ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలి. చెప్పాలా.. వ‌ద్దా.. చెప్పేస్తే ఒక్క మోనిత‌నే కాదు, వంద‌మంది మోనిత‌లు వ‌చ్చినా నా కాపురంలో చిచ్చు పెట్ట‌లేరు అని మ‌న‌సులో అనుకుంటూ ఉంటుంది.

  ఇక గుడికి మోనిత కూడా రాగా ఏదో బీభ‌త్సంలా అనిపిస్తుంది. దాంతో మోనిత‌ ఏంటి ఇది లైవా, డ్రీమా.. బ్ర‌తికుండగానే.. ఛీ స్పృహ‌లో ఉండ‌గానే ఇంత బీభ‌త్సం కనిపించింది ఏంటి.. భ్రమా, నిజ‌మా, క‌లా, దేవుడి మాయా అని అనుకుంటుంది. ఇక దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. గుడ్‌మార్నింగ్ స‌ర్. మీకు ముక్కితే అడిగింది ఇస్తార‌న్న న‌మ్మ‌కం ఉంది కాబ‌ట్టే.. గుళ్లోకి ఇంత‌మంది జ‌నాలు వ‌స్తున్నారు. అంటే ఆ న‌మ్మ‌కం నిజ‌మ‌న్న‌ట్లే క‌దా. వాళ్ల కోరిక‌లు తీరిపోతున్న‌ట్లే క‌దా. ఆ న‌మ్మ‌కంతోనే నీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాను. నా కోరిక కూడా నెర‌వేరుతుంద‌ని క‌చ్చితంగా న‌మ్ముతున్నాను. నాకు స్తోత్రం తెలీదు, దీపం వెలిగించాల‌నుకుంటే వేలు కాలిన త‌రువాత ఒత్తి వెలుగుతుంది. అదేం చిత్ర‌మో. అగ‌రొత్తులు వెలిగించి పువ్వులు పెడుతుంటే అగ‌రొత్తులు గుచ్చుకొని చుర్రుమంటుంది. నాకు పూజ‌లు అల‌వాటు లేక‌నో, నా పూజ‌లు నీకు అల‌వాటు లేక‌నో.. మన మ‌ధ్య కాస్త డిస్టెన్స్ పెరిగిన మాట నిజ‌మే అయినా నాకు మాత్రం నీ హెల్ప్ కావాలి. నీ బ్రెస్సింగ్స్ కూడా కావాలనుకో. కాబ‌ట్టి మోనిత కోరిక ఏంటో ప్ర‌పంచ‌మంతా తెలుసు. నీకు తెలీకుండా ఉంటుందా.. కార్తీక్‌కి, నాకు పెళ్లి జ‌రిగేలా చేయ్ స్వామి. నా వెన‌కాల ఆ సౌంద‌ర్య ఆంటీ ఏవో కుట్ర‌లు జ‌ర‌ప‌కుండా నువ్వే చూసుకోవాలి మ‌రి అని మొక్కుకుంటుంది.

  ఇక సౌంద‌ర్య కూడా కారులో గుడి ద‌గ్గ‌ర‌ దిగుతుంది. దీప కోసం వెతుకుతూ ఉంటుంది. అదే స‌మ‌యంలో మోనిత‌, సౌంద‌ర్య‌ను చూసి.. ఈ సౌంద‌ర్య‌త్త‌ను సైక‌లాజిక‌ల్‌గా దెబ్బ‌కొట్టాలి అని మ‌న‌సులో అనుకొని ఆమె ద‌గ్గ‌ర‌కు వెళుతుంది. గుడ్ మార్నింగ్ ఆంటీ, వాట్ ఎ స‌ర్‌ప్రైజ్ అని మోనిత అన‌గా.. పిశాచాలు గుడికి రావ‌డం స‌ర్‌ప్రైజ్. నేను గుడికి వ‌స్తే స‌ర్‌ప్రైజ్ ఏంటి.. అని సౌంద‌ర్య అంటుంది. దానికి మోనిత న‌వ్వుతూ.. అవును ఆ దేవుడు కూడా కొంచెం ఆశ్చ‌ర్య‌పోయే ఉంటాడు. కానీ నేను అనుకున్న‌ది జ‌ర‌గాలంటే మాన‌వ ప్ర‌య‌త్నంతో పాటు భ‌గ‌వంతుడి కృప కూడా ఉండాలి క‌దా అందుకే వ‌చ్చాన‌న్న‌మాట అని చెబుతుంది. దానికి సౌంద‌ర్య‌.. గుడ్, గుడికి వ‌చ్చావు. బుద్ది బాగుప‌డుతుంది. రోజూ రా ప్ర‌పంచం బావుంటుంది. శీఘ్ర‌మేవా స‌ద్భుద్ది ప్రాప్తిర‌స్తు. ఇంకో విష‌యం నువ్వు అనుకున్న‌ది జ‌ర‌గాలంటే భ‌క్తురాలి అవ‌తారం ఎత్తితే స‌రిపోదు. ఇంకో జ‌న్మ ఎత్తాలి. ఇప్పుడు పోయి ఇంకో జ‌న్మ ఎత్తి అప్పుడు ట్రై చేయి. ఆల్ ది బెస్ట్ అని అంటుంది.

  వెంట‌నే మోనిత.. మీకు మీ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉన్న‌ట్లు ఉంది అన‌గా.. మోనిత నాకు చాలా ఇంపార్టెంట్ ప‌నులు ఉన్నాయి. తీరిగ్గా నీతో యోగ క్షేమాల గురించి, నా శ‌క్తి సామ‌ర్థ్యాల గురించి, నా ఆయుధాల గురించి డిస్క‌స్ చేసే టైమ్ లేదు. పైగా నేను పిశాచాల‌తో పెద్ద‌గా మాట్లాడ‌ను. బై అని చెప్పి అక్క‌డి నుంచి వెళుతుంది. ఇక మోనిత‌.. ఈవిడేంటి రివ‌ర్స్‌గా న‌న్ను సైక‌లాజిక‌ల్‌గా దెబ్బ తీసిందా.. దేవుడా ఈ అత్తా కోడ‌ళ్ల‌ను దెబ్బ‌తీసే ఒకే ఒక్క దారి చూపించు స్వామి అనుకుంటుంది.

  మ‌రోవైపు ఇంట్లో సౌర్య డ‌ల్‌గా ఉంటుంది. అది గ‌మ‌నించిన ఆనంద‌రావు.. ఏంటే రౌడీ డ‌ల్‌గా ఉన్నావు అని అడుగుతాడు. బోర్‌గా ఉంది తాత‌య్య అన‌గా.. వెళ్లి ఆడుకో అని ఆనంద‌రావు అంటాడు. ఎవ‌రితో ఆడుకోవాలి అని చెప్పిన సౌర్య‌.. తాతయ్య హిమ ద‌గ్గ‌ర‌కు వెళ‌తాను. కాసేపు ఆడుకొని సాయంత్రం వ‌చ్చేస్తా అని అంటుంది. వెంట‌నే ఆనంద‌రావు ఇంటికి వెళ‌తావా.. ఎలా వెళ‌తావు అని అడ‌గ్గా.. నాన్న‌కు చెప్పి వెళ‌దామ‌ని కాల్ చేశాను. లిఫ్ట్ చేయ‌లేదు అని అంటుంది. అదే స‌మ‌యానికి కార్తీక్ ఇంట్లోకి వ‌స్తాడు. ఇక ఆనంద‌రావు.. కార్తీక్, దీనికి బోర్ కొడుతుందంట‌. హిమ ద‌గ్గ‌ర‌కు వెళ్లి సాయంత్రం వ‌స్తానంటోంది అని అంటాడు. దాంతో కార్తీక్ మ‌న‌సులో.. నాకు హిమ‌ను చూడాల‌నిపిస్తోంది. దీన్ని డ్రాప్ చేసే సాకుతో దాన్ని చూసి రావొచ్చు అనుకుంటాడు. ఇక సౌర్య‌.. మీకు ఏమైనా ప‌నుందా.. పోనిలే వార‌ణాసికి ఫోన్ చేసి ఆటోలో వెళ్లి వ‌స్తాను అని అంటుంది. ఇక కార్తీక్.. నేను ఫ్రీనే. నేను డ్రాప్ చేసి వ‌స్తాను. వెళ్లి రెడీ అయ్యి రా అంటాడు. ఇక కార్తీక్‌ని హ‌త్తుకొని థ్యాంక్యు డాక్ట‌ర్ బాబు అని సౌర్య‌.. పైకి వెళుతుంటుంది.

  వెంట‌నే కార్తీక్.. ఏయ్ రౌడీ.. ఎప్ప‌టి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. మెడ‌లో ఏంటే ఆ తాయ‌త్తు అన‌గా.. బ‌ల‌భ‌ద్ర‌పురంలో అమ్మ‌వారి జాత‌ర జ‌రుగుతుంది కదా..అక్క‌డ అమ్మవారికి చాలా మ‌హిమ‌లు ఉన్నాయంట‌. భ‌క్తిగా మొక్కి మ‌నం ఏది కోరుకుంటే అది జ‌రుతుంద‌ని చెప్పారు. అప్పుడు క‌ట్టించుకున్నాను ఈ తాయ‌త్తు అని సౌర్య అన‌గా.. అయితే చాలా మ‌హిమ గ‌ల తాయ‌త్తు అన్న‌మాట. ఏం కోరుకున్నావేంటి.. క‌లెక్ట‌ర్ అవ్వాల‌నా.. క‌మిష‌న‌ర్ అవ్వాల‌నా అని ఆనంద‌రావు అడుగుతాడు. దానికి అవేం కాదు.. మా అమ్మ‌, నాన్న‌, నేను క‌లిసి ఉండాల‌ని కోర‌కున్నాను. హిమ నా చెల్లి అని అప్ప‌ట్లో తెలీదు క‌దా. ఇప్పుడు అది కూడా క‌లిసి ఉండాల‌ని అమ్మ వారిని వేడుకుంటాను అని సౌర్య చెబుతుంది. ఇక ఆనంద‌రావు.. ఇంత చిన్న వ‌య‌సులో ఎంత భ‌క్తి.. అమ్మ అన్నా, నాన్న అన్నా, చెల్లి అన్నా ఎంత ప్రేమే నీకు. బాల‌వాక్కు బ్రహ్మ‌వాక్కు అంటారు. అమ్మ‌వారు నీ కోరిక తీర్చే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంద‌నిపిస్తోంది అని అంటాడు.

  ఇక సౌర్య‌.. అప్పుడు మీరంతా కూడా మాతో క‌లిసి ఉండాల‌ని కోర‌కుంటాను అని అంటుంది. అంత‌క‌న్నా కావాల్సింది ఏముందే అని ఆనంద‌రావు అన‌గా.. ఏయ్ రౌడీ హిమ ద‌గ్గ‌ర‌కి వెళ్లాల‌ని ఉందా.. లేదా అని కార్తీక్ అడుగుతాడు. వెళ్లాల‌ని ఉంద‌ని సౌర్య చెప్ప‌గా.. అయితే త్వ‌ర‌గా రెడీ అయ్యి రా. వేస్ట్ మీటింగ్‌లు పెట్ట‌కు, వెళ్లు అని అంటాడు. ఇక ఆనంద‌రావు.. దీన్ని రౌడీ పిల్ల అంటాము కానీ.. నాకైతే పిచ్చి పిల్ల అనిపిస్తోంది. పిచ్చిది కాక‌పోతే.. ఎంత పిచ్చి న‌మ్మ‌కంతో అమ్మ‌నాన్న క‌ల‌వాల‌ని తాయిత్తు క‌ట్టించుకుంది. అమ్మ వారు చాలా మ‌హిమ గ‌ల‌ద‌ని చెప్పింది క‌దా. ఈ పిచ్చి పిల్ల కోరిక‌ను పిచ్చ ఇష్టంతో త్వ‌ర‌లోనే తీరుస్తుంది అనిపిస్తుంది అని అంటాడు. ఇక కార్తీక్.. టాబ్లెట్లు వేసుకున్నారా.. ముందు వేసుకోండి. ఎమోష‌న‌ల్ అయిపోతున్నారు అని అన‌గా.. నువ్వు ఇంతేరా. నువ్వు మార‌వు నువ్వు మార‌వు అని ఆనంద‌రావు అంటాడు. దానికి కార్తీక్.. థ్యాంక్స్. నా గురించి ఇప్ప‌టికీ మీకు ఒక క్లారిటీ వ‌చ్చింది అని చెప్పి.. ఏయ్ రౌడీ ఎంత‌సేపు అని అరుస్తాడు. ఇక సౌర్య‌.. వ‌స్తున్నా, వ‌స్తున్నా అని చెబుతుంది.

  ఇక గుళ్లో తుల‌సి, విహారి విష‌యాన్ని సౌంద‌ర్య‌కు చెబుతుంది దీప‌. దాంతో సౌంద‌ర్య సంతోషంలో తేలిపోతుంది. దీప‌ను ప‌ట్టుకొని నువ్వు నిప్పు అని నిరూపించ‌డానికి ఒక నిప్పు లాంటి నిజం దొరికింది దీప‌. నాకు చాలా సంతోషంగా ఉంది. అస‌లు మాట‌లే రానంత‌గా గొంతుకు ఏదో అడ్డుప‌డుతోంది. ఆనందంతో క‌న్నీళ్లు కూడా ఆగ‌డం లేదు. ఇది క‌దా నీకు సాక్ష్యం. ఇదే క‌దా నీ కాపురాన్ని నిల‌బెట్టే ఆధారం. ఈ నిజం నువ్వు కార్తీక్‌తో చెప్పేస్తే.. వాడి మ‌న‌సును క‌ప్పేసిన అనుమాన‌పు పొర‌ల‌న్నీ వీడిపోతాయి.మ‌ళ్లీ నా కొడుకు మచ్చ‌లేని చంద‌మామ‌లా స్వ‌చ్ఛంగా, నిర్మ‌లంగా మారిపోతాడు అని భావోద్వేగానికి గురి అవుతుంది. అయితే దీప‌.. చెప్ప‌ను అత్త‌య్య అని అంటుంది.

  దాంతో సౌంద‌ర్య షాక్‌కి గురి అయ్యి.. ఏమ‌న్నావు అని అడుగుతుంది. దానికి దీప‌.. విహారి వ‌ల్ల తుల‌సికి పిల్ల‌లు పుట్ట‌ర‌ని తెలిస్తే డాక్ట‌ర్ బాబులో ప్ర‌శ్చాత్తాపం మొద‌లై న‌న్ను క్ష‌మించి నా ప‌విత్ర‌త‌ను గుర్తించి.. న‌న్ను, నా బిడ్డ‌ను అక్కున చేర్చుకుంటారు. కానీ నేను ఆ ప‌ని చేయ‌లేను అని అంటుంది. దానికి సౌంద‌ర్య‌.. చెప్ప‌లేవా.. ఆ ప‌ని చేయ‌లేవా.. ఎందుకు,, మ‌తి భ్ర‌మించిందా.. ద‌రిద్రం ఇంకా నీ నెత్తిన తాండ‌విస్తుందా..ఏమైందే నీకు అని ఆవేశ‌ప‌డుతుంది. దానికి దీప‌.. సాటి ఆడ‌దాని కాపురాన్ని బ‌య‌ట‌పెట్టి నా కాపురాన్ని నేను నిల‌బెట్టుకోలేను అని అంటుంది. ఇక సౌంద‌ర్య‌.. పిచ్చిదానా.. పిచ్చిదానా.. అది మ‌గ‌వాడిలోని లోపం కాదే. త‌ల‌రాత‌లో ఉన్న లోపం. దాని వ‌ల‌న విహారి ప‌రువు ఏం పోతుంది. తుల‌సి సంసారం ఏం న‌వ్వుల పాల‌వుతుంది. ఇది అర్థం లేని ఆలోచ‌న దీప అని అన‌గా.. లేదు అత్త‌య్య. నేను ఇందాక‌టి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. న‌న్ను నేను నిరూపించుకోవ‌డానికి ఇంత‌కు దిగ‌జారాలా అనిపించింది అని అంటుంది.

  ఇక సౌందర్య‌.. నీ మీద నాకు మొద‌టిసారి నిజ‌మైన కోపం వ‌స్తుంది దీప‌.. నా కొడుకుని ఇంత‌కాలం మూర్ఖుడు అన్నాను. కానీ నీ అంత మూర్ఖురాలు ఎక్క‌డా లేదు. వాడు ఎప్ప‌టికీ డీఎన్ఏ చేయించుకోడు. ఆ రూపంగా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేదు. పోని వాడికి వాడు పిల్ల‌లు పుట్టే అవ‌కాశం ఉందో లేదో్ చేయించుకోమంటే అదీ చేయించుకోడు. ఇక నీకు ఏది దారి.. ఇదే దారి.. ఒసేయ్ పిచ్చిదానా.. తెలివిత‌క్కువ దానా.. ఇందులో తుల‌సికి జ‌రిగే అన్యాయం అంటూ ఏదీ లేదే.. నీకు న్యాయం జ‌ర‌గుతుంది. అంతేనే అని అంటుంది. ఇక దీప‌.. అది నా వ్య‌క్తిత్వం కాదు అత్త‌య్యా.తుల‌సి గుండెరాయిని చేసుకొని త‌న బ్ర‌తుకులోని లోపం చెప్పింది. అది ఆమె మంచిత‌నం. అది ఆమె ఔన్న‌త్యం. కానీ ఆమె శాపాన్ని నేను వ‌రంగా మార్చుకోలేను. ఎందుకో.. అది నన్ను నేను చంపుకున్న‌ట్లు అనిపిస్తుంది అని అన‌గా.. ఒసేయ్ నేను నిన్ను కొట్టేస్తానే. నాకు బీపీ పెంచుతున్నావు నువ్వు. కొంచెం ఆలోచించ‌వే. తుల‌సి చెప్ప‌కుండా, విహారి చెప్ప‌కుండా ఈ నిజం నువ్వు తెలుసుకొని ఉంటే.. వాళ్ల అనుమ‌తి లేకుండా బ‌య‌ట పెట్టాల్సి వ‌స్తే అది క‌రెక్ట్ కాదు. తుల‌సినే పిలిచింది, త‌నే చెప్పింది. ఇది ఎవ్వ‌రూ చెప్ప‌లేని విష‌యం కానే కాదు. చాలా మంది పిల్ల‌లు లేని వాళ్లు ఎవ‌రిలో లోపం ఉంద‌ని బ‌య‌ట పెట్ట‌క‌పోవ‌చ్చు. తుల‌సే బ‌య‌ట‌పెట్ట‌మ‌ని ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఇంకెందుకు ఆలోచిస్తావే స్టుపిడ్ ఫెలో. వెళ్ల‌వే.. ధైర్యంగా వెళ్లు.. నిజాయితీగా నిజం బ‌య‌ట‌పెట్టు. నా కొడుకులోని ఆ ఒక్క అనుమానాన్ని స‌మూలంగా తుడిచేయ్.. నీకు శుభం జ‌రుగుతుంది. నీ ప‌దేళ్ల త‌ప‌స్సు ఫలిస్తుంది. నీ పేద‌రికం పోతుంది. నా ఇంటి కోడ‌లిగా నీకు స‌ర్వాధికారాలు వ‌స్తాయి. నీ బిడ్డ‌ల భవిష్య‌త్ స్వ‌ర్గ‌తుల్యం అవుతుంది. అన్నింటికన్నా మించి నువ్వు ప్రేమించే డాక్ట‌ర్ బాబు.. నిన్ను రెట్టింపు ప్రేమ‌తో ఆద‌రిస్తాడే.
  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  తదుపరి వార్తలు