హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: అవును హిమ‌ను చంపించింది నేను.. కార్తీక్‌కి చెప్పేసిన మౌనిత

Karthika Deepam: అవును హిమ‌ను చంపించింది నేను.. కార్తీక్‌కి చెప్పేసిన మౌనిత

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక్ దీపం(Karthika Deepam) సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో అమ్మ‌, సౌర్య వ‌స్తేనే కాని తాను ఆ ఇంటికి రాన‌ని హిమ చెప్పిన మాట‌ల‌ను ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అదే స‌మ‌యానికి దీప రాగా.. నిన్ను అని కార్తీక్ ఫైర్ అవుతాడు.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక్ దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో అమ్మ‌, సౌర్య వ‌స్తేనే కాని తాను ఆ ఇంటికి రాన‌ని హిమ చెప్పిన మాట‌ల‌ను ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అదే స‌మ‌యానికి దీప రాగా.. నిన్ను అని కార్తీక్ ఫైర్ అవుతాడు. వెంట‌నే దీప.. కూల్ డౌన్. అస‌లే మీ త‌ల ప‌గిలిపోతుంది. ఆవేశ‌ప‌డితే కోపం, కోపం నుంచి చిరాకు, చిరాకు నుంచి మళ్లీ త‌ల‌నొప్పి ఇలాంటి అవ‌స‌రం లేనివ‌న్నీ ఉత్ప‌న్న‌మ‌వుతాయి. నేనేం గొడ‌వ‌ప‌డ‌టానికి రాలేదు, క‌నుబొమ్మ‌లు పైకెత్తి ప్ర‌గల్బాలు ప‌ల‌క‌డానికి రాలేదు. నేను శాంతంగానే ఉన్నాను, మీరు శాంతంగా ఉండండి. అప్పుడు మ‌న‌స్సు నిర్మ‌ల‌మవుతుంది. నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది. కాఫీ తాగండి, అది మీకు అవ‌స‌రం కూడా. కంగారు ప‌డ‌కండి. ఎవ‌రూ రారు. ఎమ‌ర్జెన్సీ కేసులు వ‌స్తే డాక్ట‌ర్ విశ్వ‌నాథ్ ద‌గ్గ‌ర‌కి పంప‌మ‌ని చెప్పే వ‌చ్చాను. అంచేత మీతో మాట్లాడుకోవ‌డానికి కావాల్సిన ఏకాంతం దొరికింది అని అంటుంది. అయితే నీతో మాట్లాడాల్సిన అవ‌స‌రం నాకు లేద‌ని కార్తీక్ అంటాడు.

  మిమ్మ‌ల్ని మాట్లాడ‌మ‌ని ఇప్పుడు ఎవ‌రు అన్నారు..? వినండి చాలు అని దీప అన‌గా.. నా ప‌ని చెడ‌గొట్టుకొని మ‌రీ నువ్వు చెప్పే సోది అని కార్తీక్ అంటుండ‌గా.. సోది కాదు నాది అని దీప అంటుంది. మీరు త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన నిజాలు కొన్ని ఉన్నాయి. మౌనిత ఇంట్లో నేను మిమ్మ‌ల్ని గుండెల‌కు హ‌త్తుకొని మ‌రీ ఓ మాట చెప్పాను గుర్తుందా అని దీప అడుగుతుంది. కొన్ని నిజాలు చెప్తాను డాక్ట‌ర్ బాబు అన్నాను. ఇప్పుడు ఆ నిజాల‌తోనే వ‌చ్చాను. మీలో మంచి స్నేహితుడు ఉన్నాడు డాక్ట‌ర్ బాబు. మెడిసిన్ చేసే రోజుల్లో మీరు హిమ‌ను ప్రేమించారు. కానీ మీ ప్రేమ ఫ‌లించ‌లేదు. హిమ అన్యాయంగా చ‌నిపోయింది. ఆ త‌రువాత న‌న్ను చూశాను. నాలో ఆత్మ‌సౌంద‌ర్యం చూసి పెళ్లి చేసుకున్నారు. కానీ మీ ఆద‌ర్శం ఎంతోకాలం నిల‌వ‌లేదు. నాలోని ఆత్మ సౌంద‌ర్యం మీ దృష్టిలో చ‌చ్చిపోయింది. మీ గ‌తానికి, వ‌ర్త‌మానానికి మ‌ధ్య ఒక వార‌ధి ఉంది. దాని పేరు మౌనిత‌. మౌనిత కూడా మీతో పాటే మెడిసిన్ చేసింది. మౌనిత‌కు హిమ కూడా తెలుసు. హిమ‌ను మీరు ప్రేమిస్తున్నార‌ని కూడా తెలుసు. మిమ్మ‌ల్ని మౌనిత ప్రేమిస్తుంద‌న్న సంగ‌తి మాత్రం అప్పుడు తెలీదు మీకు. ఆ త‌రువాత ఎప్పుడో తెలిసింది అని దీప చెబుతుండ‌గా.. దీనికి మా కాలేజీ సంగ‌తుల‌న్నీ ఎలా తెలుసు, ఎవ‌రు చెప్పి ఉంటారు. మ‌మ్మీకి కూడా ఇంత డీటైల్డ్‌గా తెలీదే. దీనికి ఎవ‌రు చెప్పారు అని కార్తీక్ ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు.

  వెంట‌నే దీప.. నాకెలా తెలుస‌నే సంగ‌తి అప్ర‌స్తుతం. తెలుసు నాకు, మీకు తెలియ‌ని మీ గ‌తం కూడా నాకు తెలుసు. ఆ గ‌తంలో మీ జీవితంలో జ‌రిగిన విషాదం కూడా తెలుసు. అందుకు మీ మీద సానుభూతి కూడా ఉంది అని దీప అన‌గా.. నాకు తెలియ‌ని నా గ‌త‌మా అని కార్తీక్ అడుగుతాడు. దానికి దీప అవున‌ని అంటుంది. మీరు, హిమ ప్ర‌యాణిస్తోన్న కారు యాక్సిడెంట్‌కి గురైంది అని దీప చెబుతుంది. అవును అని కార్తీక్ అన‌గా.. అది యాక్సిడెంట్ కాదు. హిమ‌ను చంపేశారు. కేవ‌లం మిమ్మ‌ల్ని ప్రేమించిన పాపానికి అన్యాయంగా హిమ బ‌లి అయిపోయింది అని దీప అన‌గా.. ఏంటి నువ్వ‌నేది అని కార్తీక్ అడుగుతాడు. నేను మీకు చెబుతాన‌న్న నిజాల్లో మొద‌టిది, మీకు తెలియ‌నిది, మీకు మింగుడుప‌డ‌నిది ఇదే. హిమ యాక్సిడెంట్‌లో చ‌నిపోలేదు. హిమ‌ను యాక్సిడెంట్ చేయించి చంపేశారు అని దీప అంటుంది. నేను ఇదంతా ఎలా న‌మ్మాలి అని కార్తీక్ అన‌గా.. నిజ‌మే ఇన్నాళ్లుగా మీరు నమ్మిన నిజం అబ‌ద్ధ‌మ‌ని చెబితే ఒక్క‌సారిగా మీరు జీర్ణం చేసుకోలేరు. అందుకే నేను మిమ్మ‌ల్ని న‌మ్మ‌మ‌ని కోర‌లేదు, నేను చెప్పింది వినండి మాత్ర‌మే అన్నాను అని అంటుంది.

  హిమ‌ను ఒక‌రు చంపారు, ఆ ఒక‌రికి డ‌బ్బులిచ్చి ఇంకొక‌రు చంపించారు అని దీప చెప్ప‌గా.. నో.. అదంతా నా క‌ళ్ల ముందే జ‌రిగింది. నా క‌ళ్ల ముందే హిమ ప్రాణాలు వ‌దిలింది. అందుకే నేనే సాక్ష్యం. మీ క‌ళ్ల ముందే జ‌రిగింది. కానీ మీ క‌ళ్లు క‌ప్పి మ‌రీ చంపేశారు. మిమ్మ‌ల్ని ఒక భ్ర‌మ‌లో ఉంచారు. వాళ్లు ఎవ‌ర‌నేది నాకు తెలుసు అని దీప అన‌గా.. ఎవ‌రు అని కార్తీక్ అడుగుతాడు. చెప్ప‌ను అని దీప అన‌గా.. ఎందుకు అని కార్తీక్ అడుగుతాడు. నేను చెప్పినా మీరు న‌మ్మ‌రు. నాకు నేనుగా చెబితే మీరు క‌ల్పితం అంటారు అని దీప అన‌గా.. మ‌రి నేను ఎలా న‌మ్మేది అని కార్తీక్ అడుగుతాడు. దానికి దీప మీ అంత‌ట మీరే తెలుసుకోవాలి. అప్పుడే మీరు న‌మ్ముతారు. నా ప‌విత్ర‌త గురించి నేను చెబితే న‌మ్మ‌డం లేదు. అందుకే మీ అంతట మీరు తెలుసుకునేలా చేయాల‌నుకున్నాను. మ‌న స‌మ‌స్య ప‌క్క‌న‌పెడ‌దాం కాసేపు. ఈ నిజం గురించి మాట్లాడుకుందాం. ద‌య‌చేసి మీరు బాగా గ‌మ‌నించండి. మీరు న‌న్ను క్ష‌మిస్తార‌ని ఈ నిజం చెప్ప‌డం లేదు నేను. అందుకే మ‌న స‌మ‌స్య‌తో దీన్ని ముడిపెట్ట‌డం లేదు. కాబ‌ట్టి మ‌న‌సు పెట్టి వినండి. మీరు ప్రేమించిన హిమ చ‌నిపోలేదు. దారుణంగా హ‌త్య చేశారు డాక్ట‌ర్ బాబు. చంపింది ఎవ‌రో, చంపించిది ఎవ‌రో నాకే కాదు.. వాళ్లు మీకూ బాగా తెలుసు. ఇద్ద‌రూ తెలుసు. నేను కాబ‌ట్టి మీరు కొట్టి పారేస్తారు. కాబట్టి మీ అంతట మీరే వారెవ‌రో క‌నిపెట్టండి. నా కోసం కాదు మీరు ప్రేమించిన హిమ ఆత్మ శాంతి కోసం. వ‌స్తాను డాక్ట‌ర్ బాబు. ఇంటి ద‌గ్గ‌ర‌ద మ‌న పిల్ల‌లు ఒంట‌రిగా ఉన్నారు. ఎదురుచూస్తూ ఉంటారు అని చెప్పి అక్క‌డి నుంచి వెళుతుంది. ఆ త‌రువాత దీప మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ కార్తీక్ కారులో వెళుతుంటాడు.

  హిమ యాక్సిడెంట్‌లో చ‌నిపోలేదా..? యాక్సిడెంట్ చేశారా..? దారుణంగా యాక్సిడెంట్ చేసి చంపించారా..? చ‌ంపింది ఎవ‌రు..? చ‌ంపించింది ఎవ‌రు..? నాకు తెలిసిన వాళ్ల‌లో ఎవ‌రు అయ్యి ఉంటారు..? అని ఆలోచిస్తూ వెళుతుంటాడు. ఇక మ‌రోవైపు మౌనిత ఇంట్లో.. ప్రియ‌మ‌ణితో మాట్లాడుతుంటుంది. ఒక స‌ల‌హా కావాల‌ని మౌనిత అడ‌గ్గా.. అడ‌గండి అమ్మా దానికేం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు క‌దా అని ప్రియ‌మ‌ణి అంటుంది. లాయ‌ర్ చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తే కార్తీక్‌, దీప‌కు విడాకులు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్లేదు నేను కార్తీక్‌ని పెళ్లి చేసుకోవ‌చ్చున‌ట‌. నేను రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకుంటే బావుంటుందా..? గుళ్లో మ్యారేజ్ చేసుకుంటే బావుంటుందా..? ఫ‌ంక్ష‌న్ హాల్‌లో మ్యారేజ్ చేసుకుంటే బావుంటుందా..? అని అడ‌గా.. మీరు ముస‌ల‌మ్మ కాకుండా చేసుకుంటే బావుంటుంది. దీప‌మ్మ ఉండ‌గా.. కార్తీక్ అయ్య మీకు తాళి క‌ట్టాలంటే మీ మెడ‌కాయ ఉండాలి క‌దా అమ్మా అని అంటుంది. అదేంటి అంటే.. త‌ల‌కాయ లేకుండా మెడ‌కాయ ఎలా ఉంటుంద‌మ్మా.. ఆ దీప‌మ్మా మీ త‌ల‌కాయ‌ని గుమ్మానికి క‌ట్టిపోతా అనింది క‌దా అంటుంది. దానికి మౌనిత ఏడ్చిందిలే అని అంటుంది. ఇక అదే స‌మ‌యానికి కార్తీక్ రాగా.. అదుగో అమ్మా కార్తీక్ అయ్య వ‌చ్చాడు. మీరేదో అడ‌గాల‌నుకున్నారు క‌దా అడిగేయండి అని ప్రియ‌మ‌ణి అంటుంది. దానికి కార్తీక్ ఏంటి అని అడ‌గ్గా.. ఏం లేద‌ని మౌనిత చెబుతుంది. వెంట‌నే ప్రియ‌మ‌ణి అదేంట‌మ్మా.. ఏదో అడిగారు మీ ఇద్ద‌రు పెళ్లి ఎక్క‌డ చేసుకుంటే బావుంటుంద‌ని క‌దా ప్రియ‌మ‌ణి చెప్ప‌గా.. కార్తీక్ క‌ల‌గ‌జేసుకుంటాడు.

  ప్రియ‌మ‌ణి నీ అస‌లు పేరేంటి..? నిజం చెప్పు ఏ పేర‌మ్మో అయి ఉంటుంది క‌దా. నీ మొహానికి ప్రియ‌మ‌ణి అని ఒక హీరోయిన్ పేరు. నీ ఉద్యోగానికి రంగు రంగు చీర‌లు, అన్ని మ్యాచింగ్‌లు. నీ బ‌తుక్కి మా ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్స్‌లో జోక్యం చేసుకోవ‌డం. నీకు దీపే క‌రెక్ట్. ఇంకోసారి చెలిక‌త్తెలాగా మ‌ధ్య‌లో దూరి మాట్లాడితే నీ ఉద్యోగ‌మే తీసేస్తాను. వెళ్లు అని కోప్ప‌డ‌తాడు. ఆ త‌రువాత కాఫీ తీసుకొని ర‌మ్మంటాడు. ఇక మౌనిత.. ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు కార్తీక్ అని అడ‌గ్గా.. నేను వ‌చ్చిందే మెంట‌ల్ ఎక్కి, మ‌ధ్య‌లో ఈ వంట‌మ‌నిషి వాగుడు ఒక‌టి. దాన్ని కంట్రోల్‌లో పెట్ట‌క‌పోతే నేను మీ ఇంటికి రాను. నీకు, నాకు మ‌ధ్య‌లో ఏదో ఉంద‌నుకుంటోంది ఛెండాలంగా అని అంటాడు. దానికి మౌనిత షాక్‌కి గురి అవుతుంది. ఇక కార్తీక్.. నీకు ఇది విన‌డానికి అస‌హ్యంగా అనిపించ‌లేదా అని మౌనిత‌ను అడ‌గ్గా.. అస‌హ్యం ఏముంది. నువ్వు న‌న్ను పెళ్లి చేసుకుంటాన‌ని మీ అమ్మ ముందు చెప్పావుగా. ఇందులో అంత చెండాలం ఏముంది అని అంటుంది. ఇక వీట‌న్నింటి గురించి నేను మాట్లాడ‌టానికి ఇక్క‌డ‌కు రాలేద‌న్న కార్తీక్.. ఇందాక దీప ఆసుప‌త్రికి వ‌చ్చింది, ఒక విష‌యం చెప్పింది అంటాడు. ఏమ‌ని అని మౌనిత అడ‌గ్గా.. హిమ‌కు జ‌రిగింది యాక్సిడెంట్ కాద‌ని చెప్పింది అంటాడు. దానికి మౌనిత టెన్ష‌న్‌కి గురి అవుతుంది. హిమ‌ను చంపింది, చంపించింది ఎవ‌రో దీప‌కే కాదు నాకు కూడా బాగా తెలుస‌ని చెప్పింది అని కార్తీక్ అంటాడు.

  ఇక పైకి లేచిన మౌనిత‌.. ఏంటి అస‌లు దీప‌కు ఎలా తెలిసింది. అంజిగాడే చెప్పి ఉంటాడా అని మ‌న‌సులో అనుకుంటుంది. ఇక ఏం మాట్లాడ‌వేంటి అని కార్తీక్ అడ‌గ్గా.. నువ్వు ఎవ‌ర‌నుకుంటున్నావు అని మౌనిత అంటుంది. అదే ఆలోచిస్తున్నాను అని కార్తీక్ అంటాడు. ఓ ఆలోచిస్తున్నావా వెరీ గుడ్ అని మౌనిత అన‌గా.. నాకు బాగా తెలిసిన వాళ్లు ఎవ‌రా అని కార్తీక్ అంటాడు. వెంట‌నే మౌనిత.. నేనే అంటుంది. ఇంకెవ‌రు కార్తీక్ నేనే. చంపింది ఎవరో అంతుప‌ట్ట‌డం లేదు గానీ చంపించింది మాత్రం నేనే. ఎప్ప‌టినుంచో నేను నిన్ను ప్రేమిస్తుంటే. నువ్వేమో ఆ పూర్ హిమ‌ను ప్రేమిస్తున్నావు. నాకు ఒళ్లు మండి ఒక కిరాయి హంత‌కుడిని మాట్లాడి హిమ‌ను చంపించాను. మ‌రి వాడు ఇక్క‌డ హైదరాబాద్‌లో ఎందుకు ఉంటాడో క‌నబ‌డిన‌ప్పుడు అడిగి చెబుతా అని అంటుంది. దానికి కార్తీక్.. ఏం వెట‌కారంగా ఉందా..? అన‌గా.. వెట‌కారంగా ఉంది నాకు కాదు వంట‌ల‌క్క‌కు. ఇందాక నువ్వు ప్రియ‌మ‌ణిని ఏదో తిట్టావు. వంట చేసుకునే నీకు నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో ప‌నేంటి అని.. నీ భార్య మాత్రం వంట‌లు చేసుకునే వంట‌ల‌క్క కాదా..? ఆమె ఇవ‌న్నీ క‌ల్పితాలు తీసుకొచ్చి నీ ముందు పెట్టి.. నా మీద డౌట్ వ‌చ్చేలా క్రియేట్ చేసి న‌న్ను బ్యాడ్ చేయాల‌ని చూడ‌ట్లేదా..? ఆ విహారితో మ‌ళ్లీ క‌లిసి సాహిత్య గోష్టి మొదలుపెట్టిన‌ట్లు ఉంది. మంచి ర‌స‌వ‌త్త‌ర క‌థ‌లు అల్లుతోంది అని మౌనిత అంటుంది. వెంట‌నే కార్తీక్.. స్టాపిట్ చెప్పేది అయితే దీప నీ పేరే చెప్పేది. నా తెలివి తేట‌ల‌కే వ‌దిలేసి వెళ్లింది. నాకు అన్ని తెలివి తేట‌లు ఉంటే ఇక్క‌డ‌కు ఎందుకు వ‌స్తాను అని అంటాడు.

  దానికి మౌనిత‌.. చిన్న కామ‌న్‌సెన్స్ కార్తీక్.. ఆ కారులో నువ్వు ఉన్నావుగా. ఆ కారులో నువ్వు ఉన్నావుగా.. అంత క‌సి ఉంటే హిమ‌ను ఒక్క‌దాన్నే మ‌ర్డ‌ర్ చేయిస్తారు. నీకు శ‌త్రువులు ఎవ‌రో ఉన్నారు.. ఇలా వ‌న్ ప్ల‌స్ వ‌న్ ఆఫ‌ర్లలాగా ప్లాన్ చేయరు అని మౌనిత అంటుంది. అదే నేను అనుకున్నాను. కారులో నేను ఉన్నాను కాబ‌ట్టే యాక్సిడెంట్ అనుకున్నాను. కానీ అంత క‌చ్చితంగా చెప్పింది ఏంటి..? అని అంటాడు. ఇక కార్తీక్ ఈ విష‌యాన్ని ఇంత‌టితో మ‌ర్చిపోక‌పోతే నా గ‌తి ఏంటి..? అని మౌనిత మ‌న‌సులో అనుకుంటుంది.

  ఇక కార్తీక్ ఇంటికి వెళ్ల‌గా.. సౌంద‌ర్య ఎదురుగా వ‌స్తుంది. అలా ఉన్నావేంటిరా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. ఎలా ఉన్నాను అని కార్తీక్ అంటాడు. డ‌ల్‌గా ఉన్నావ‌ని సౌంద‌ర్య చెప్ప‌గా.. నీకు నేనే క‌నిపిస్తున్నాను అంటాడు. మ‌రి అని సౌంద‌ర్య అన‌గా.. నాకు నా మ‌న‌సు క‌నిపిస్తోంది అని అంటాడు. ఏమైంది అని సౌంద‌ర్య అడ‌గ్గా.. ఏముంది శ‌రామామూలే. బ‌య‌ట‌కు వెళ్లాను, వెళ్లాను.. ఇంటికి వ‌చ్చాను, వ‌చ్చాను. ఆవుల మంద‌లాగా, గొర్రెల మంద‌లాగా సాయంత్రం అయ్యే స‌రికి వాటంత‌ట అవే ఇంటికి వ‌స్తాయి. ప‌క్షులు వ‌ల‌స వెళ్తాయి. చీకటి వేళ గూళ్ల‌కు చేరుకుంటాయి. నేను అలాగే త‌యార‌య్యాను. చీక‌టి ప‌డ‌గానే కారు ఇంటివైపు దారి తీస్తుంది. కారు దిగితే కాళ్లు లోప‌లికి దారి తీస్తాయి. రాన‌నుకుంటాను, ఎటైనా వెళ్దామ‌నుకుంటాను, ఎక్క‌డైనా ఉందామ‌నుకుంటాను. కానీ నాకు తెలీకుండానే వ‌చ్చేస్తుంటాను అని అంటాడు. ఏమైంది రా అని సౌంద‌ర్య అన‌గా.. ఇంకా అఙ్ఞానంలోనే కొట్టుకుపోతున్నాను మమ్మీ అని అంటాడు. ఙ్ఞానుల‌తో, విఙ్ఞుల‌తో ఇంత‌క‌న్నా ఏం మాట్లాడ‌గ‌ల‌ను మ‌మ్మీ అని అంటాడు. ఇదంతా ఏంటి..? ఇప్పుడు ఎవ‌రిని దోషిగా నిల‌బెట్టి మాట్లాడాల‌నుకున్నావు అని ఆనంద‌రావు అడ‌గ్గా.. దోషులు ఎవ‌రు ఉన్నారు ఇక్క‌డ అంద‌రూ దొర‌లే అని కార్తీక్ అంటాడు. అయినా ఎవ‌రు ఏంట‌నిది తెలిస్తే ఎవ‌రో వ‌చ్చి ఏదో ఎందుకు చెప్తారు. నేను ఎందుకు విని న‌మ్మేస్తాను అని అన‌గా.. ఎవ‌రు చెప్పారు, ఏం చెప్పారు..? అని ఆనంద‌రావు అడుగుతాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగియ‌నుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial

  ఉత్తమ కథలు