• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • KARTHIKA DEEPAM SERIAL UPDATE DEEPA RECEIVES COURT NOTICES ELSEWHERE SOUNDARY SHOCK WITH COURT NOTICE MNJ

Karthika Deepam: కోర్టు నోటీసులు అందుకున్న దీప‌.. హిమ‌తో పాటు సౌర్య‌ను తెచ్చుకుంటానన్న కార్తీక్

Karthika Deepam: కోర్టు నోటీసులు అందుకున్న దీప‌.. హిమ‌తో పాటు సౌర్య‌ను తెచ్చుకుంటానన్న కార్తీక్

కార్తీక దీపం సీరియల్ (Karthika Deepam)

Karthika deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్‌కి సౌర్య భోజ‌నం పెడుతుంటుంది. చాలు రౌడీ అని కార్తీక్ అంటుండ‌గా.. మీరు తినండి నాన్న. ఇంకొంచెం వేసుకోండి నాన్న‌. ఇలాగేనా తిన‌డం అని కొస‌రి కొస‌రి పెడుతుంటుంది. ఆ మాట‌లు విని సౌంద‌ర్య‌, ఆనంద‌రావు, ఆదిత్య‌, శ్రావ్య అక్క‌డ‌కు వ‌చ్చి చూస్తుంటారు.

 • Share this:
  Karthika deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్‌కి సౌర్య భోజ‌నం పెడుతుంటుంది. చాలు రౌడీ అని కార్తీక్ అంటుండ‌గా.. మీరు తినండి నాన్న. ఇంకొంచెం వేసుకోండి నాన్న‌. ఇలాగేనా తిన‌డం అని కొస‌రి కొస‌రి పెడుతుంటుంది. ఆ మాట‌లు విని సౌంద‌ర్య‌, ఆనంద‌రావు, ఆదిత్య‌, శ్రావ్య అక్క‌డ‌కు వ‌చ్చి చూస్తుంటారు. ఇక సౌర్య‌, కార్తీక్‌తో మీరు డాక్ట‌ర్. మీకు తెలీదా కూర ఎక్కువ వేసుకోవాల‌ని, ఆయిల్ త‌క్కువ వెయ్య‌మన్నానులెండి. స‌రిగ్గా క‌లుపుకోండి అని చెబుతూ వింటుంది. ఇక కార్తీక్.. కూర‌ల‌న్నీ స‌రేనే.. కాళ్లే ప‌ట్టేస్తున్నాయి. ఇలా కూర్చొని తిన‌డం నాకు అల‌వాటే లేదు అని అంటాడు.

  వెంట‌నే సౌర్య‌.. నాకు మాత్రం డైనింగ్ టేబుల్ అల‌వాటు ఉందా..? మేము తిన‌డం లేదా..? అని అడ‌గ్గా.. దానికి, దీనికి పోలిక ఉందా..? అది ప్ర‌మోష‌న్‌లా ఉంటుంది, ఇది పనిష్మెంట్‌లా ఉంది అని కార్తీక్ అంటాడు. ఇక సౌర్య‌.. మీరు తాత‌య్య అంత పెద్ద అయ్యాక. కింద కూర్చోలేను అంటే బావుంటుంది. ఇప్పుడే అంటారు ఏంటి..? మీ ఏజ్ ఎంత‌..? నా కంటే కొంచెం పెద్ద అని అంటుంది. దాంతో షాక్‌కి గురైన కార్తీక్.. ఏంటే అని అంటాడు. వెంట‌నే సౌర్య‌.. అంటే బాబాయ్ కంటే కొంచెం పెద్ద అని అంటాడు. వెంట‌నే కార్తీక్.. వాడిని కూర్చోమ‌ను. బ‌న్ను రొట్టె గాడు. వాడిని లేపాలంటే న‌లుగురు మ‌నుషులు మాట్లాడాలి అని అంటాడు. దానికి న‌వ్వే సౌర్య‌.. మ‌రి తాత‌య్య అయితే అని అడుగుతుంది. ఓ క్రేన్ మాట్లాడాలి అని కార్తీక్ అంటాడు. బ‌య‌ట నుంచి వింటున్న ఆదిత్య‌, ఆనంద‌రావులు ఆవేశంతో ఉండ‌గా.. సౌంద‌ర్య‌, శ్రావ్య వారిని ఆపుతారు.

  ఇక కార్తీక్.. ఏంటే ఈ కొత్త కొత్త అల‌వాట్లు. నన్ను మ‌రీ ఇబ్బంది పెడుతున్నావు అని అన‌గా.. దీన్నే థ్రిల్ అంటారు అని సౌర్య చెబుతుంది. థ్రిల్‌లా లేదు డ్రిల్‌లా ఉంద‌ని కార్తీక్ అన‌గా.. మీకు టైమ్ దొరికితే మా అమ్మ క‌నుబొమ్మ ఎత్త‌డం గురించో, నాన‌మ్మ మ‌న‌కెవ్వ‌రికి అర్థం కాని భాష‌లో తిట్టిందాని గురించో ఆలోచిస్తారు క‌దా. సుద్ద వేస్ట్ నాన్న‌. కొన్ని జీవితాలు అంతే. వాళ్లు మార‌రు. ఇంక మీ అమ్మ అయితే నాక‌న్నా పెద్ద రౌడీ తెలుసా. పైకి అస్స‌లు క‌న‌ప‌డ‌దు అని చెబుతుంటుంది. దానికి బ‌య‌ట ఉన్న ఆ న‌లుగురు. ఇంకేం వినాల్సి వ‌స్తుందో. లోపలికి వెళ‌దాం అని అక్క‌డి నుంచి వెళ‌తారు.

  మ‌రోవైపు మౌనిత‌.. కార్తీక్‌తో చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఛ.. కార్తీక్ గురించి తెలిసి నేను ఎలా అలా మాట్లాడాను. త‌ను నా ద‌గ్గ‌ర‌కు రావాలి. నాతోనే ఉండాలి అనుకునే నేనే త‌న‌ను అలా పాయింట్ అవుట్ చేసి మాట్లాడా. హ‌ర్ట్ అయ్యాడేమో. ఆ దీప మీద కోపం త‌న‌పై చూపించిన‌ట్లు ఉంది. ఛ‌. అయినా కార్తీక్ కూడా నేను చెప్పింది విని మౌనంగా వెళ్లాడంటే నేను చెప్పేది ఆలోచిస్తున్నాడ‌నే క‌దా అర్థం. సో.. త‌ను న‌న్ను అపార్థం చేసుకునే అవ‌కాశం లేన‌ట్లే. కాక‌పోతే కార్తీక్ ద‌గ్గ‌ర సౌర్య ఉంద‌ని చెప్పాడు. దానివ‌న్నీ ఆ దీప బుద్దులే. సందు చూసుకొని కార్తీక్ మ‌న‌సును మార్చి ఆ దీప ద‌గ్గ‌రికి తీసుకెళ్లినా తీసుకెళుతుంది. అంత చావు తెలివి తేట‌లు దానికి. అలా జ‌ర‌గ‌కూడ‌దు అనుకుంటే ముందు ఆ సౌర్య‌ను ఆ కార్తీక్ నుంచి పంపించాలి. అప్పుడే మ‌న‌శ్శాంతిగా ఉంటుంది. అవును వీలైనంత త్వ‌ర‌గా ఆ సౌర్య‌ను పంపించేయాలి అని అనుకుంటుంది.

  ఇక సౌంద‌ర్య సోఫాలో కూర్చొని సౌర్య మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉండ‌గా.. ఆదిత్య వ‌స్తాడు. ఏదో చెప్పాల‌ని వ‌చ్చిన‌ట్లు ఉన్నావు అని సౌంద‌ర్య అడ‌గ్గా.. చెప్తాను కానీ నువ్వు తెలుగులో తెలివిగా జ‌వాబు చెప్పి దులిపేసి పంపిస్తావ‌ని ఊరుకున్నాను అని ఆదిత్య అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. నేను ఎంత దులిపేసినా నువ్వు దులిపేసుకుంటావ‌ని అంద‌రికీ తెలుసు కానీ ఏంటో చెప్పు అని అంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది మమ్మీ అని ఆదిత్య అన‌గా.. అది మంచి ఆరోగ్య‌క‌ర‌మైన ల‌క్ష‌ణ‌మే క‌దా. ఆనందాన్ని ఉత్ప‌త్తి చేసే ర‌సాయ‌నాలు నీ మెద‌డులో సక్ర‌మంగా ప‌నిచేస్తున్నాయ‌ని అర్థం అని సౌంద‌ర్య అంటుంది. తెలుగు వ‌ద్దు మ‌మ్మీ అని ఆదిత్య అన‌గా.. ఇంకో భాష‌లో మాట్లాడుకుందామా అని సౌంద‌ర్య అడుగుతుంది. వెంట‌నే ఆదిత్య మామూలు భాషలో మాట్లాడుకుందాం అని చెప్పిన ఆదిత్య‌.. ఆనందంతో పాటు కొంచెం సిగ్గుగా కూడా ఉంది అని అంటాడు. ఎందుకంత సిగ్గు, అంత పని ఏం చేశావు అని సౌంద‌ర్య అడ‌గ్గా.. పూర్తిగా విను మ‌మ్మీ అని ఆదిత్య అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. నువ్వు కూడా ముక్క‌లు ముక్క‌లుగా చెప్ప‌కుండా ఒక్క ముక్క‌లో చెప్పురా అని అంటుంది.

  మ‌నం అన్న‌య్య‌ను ఎలాగూ దూరంగా పెట్టామ‌ని ఆదిత్య అన‌గా.. దుబాయ్‌లో పెట్టామా..? ముంబ‌యిలో పెట్టామా అని సౌంద‌ర్య అంటుంది. ఇంట్లోనే క‌లిసి ఉంటున్నా. మ‌న‌తో క‌లుపుకోకుండా వేరుగా చూస్తున్నాము అని ఆదిత్య అంటాడు. వాడు మ‌న‌ల్ని అలా దూరంలో పెడుతున్నాడు అని సౌంద‌ర్య అన‌గా.. పోనీ అలానే అనుకుంటే తృప్తిగా ఉంటుంది అనుకుంటే అలానే అనుకో అని ఆదిత్య అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. వారానికో అజెండాతో వ‌స్తావు క‌దా. ఈ వారం ఈ ఎజెండా తెచ్చావా అని సౌంద‌ర్య అడుగుతుంది.

  దానికి ఆదిత్య‌.. రోజు రోజుకు ఇంట్లో ఏవేవో జ‌రుగుతుంటే వారానికో రియాక్ట్ అవుతుండ‌గా.. మామూలుగా నువ్వు ఒక అద్భుత‌మైన భాష‌తో అంద‌రి నోళ్లు మూయిస్తావు క‌దా అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. రోజు నీ కొడుకు ప‌క్క త‌డిపి, పాల కోసం ఏడ్చి తెల్లార్లు నీకు నిద్ర లేకుండా చేస్తున్న‌ట్లు ఉన్నాడు. పైత్యం బాగా పెరిగింది. దానికి మందు మంచి నిద్ర‌నే అని అంటుంది. వెంట‌నే ఆదిత్య‌.. నేను సీరియ‌స్‌గా మాట్లాడుతున్నాను అని ఆదిత్య అన‌గా.. ఇక్క‌డ వ‌ణుకుతూ ఎవ్వ‌రూ విన‌రు కానీ చెప్పేదేదో క్లియ‌ర్‌గా చెప్పు. లేదంటే వెళ్లి నిద్ర‌పో అని సౌంద‌ర్య అంటుంది.

  దానికి ఆదిత్య‌.. మ‌నం చేయ‌లేని ప‌ని సౌర్య చేస్తుంది. ఇన్ని రోజులు అన్న‌య్య మ‌న‌సు, మ‌న‌సులో లేదు. అంద‌రం అన్నీ ర‌కాలుగా డిస్ట‌ర్బ్ చేస్తున్నావు. ఆ సౌర్య కేవ‌లం నాన్న అని పిల‌వ‌నిచ్చినందుకే పొంగిపోయి అన్న‌య్య‌ను ప్రేమ‌గా చూసుకుంటోంది. బ‌య‌ట‌కు తీసుకెళ్లి కొత్త ప్ర‌పంచాన్ని చూపిస్తోంది. ఇన్ని రోజులు పోగొట్టుకున్న అప్యాయ‌త‌ను, ప్రేమ‌ను అన్న‌య్య‌కు చూపిస్తోంది. అదేదీ మ‌నం చేయ‌లేదు. నువ్వు చాట భార‌తం అంత వివ‌ర‌ణ ఇచ్చినా నేను చెప్పిందే నిజం. నీకు నిజంగా నిజం అనిపిస్తే అన్న‌య్య‌తో ప్రేమ‌గా ఉండ‌టం నేర్చుకో. లేదంటే అంద‌రం దూర‌మైపోతాము అని ఆదిత్య చెబుతాడు. దానికి సౌంద‌ర్య‌.. చాలా మంచి స‌ల‌హా ఇచ్చావు. వెళ్లి ప‌డుకో నాన్న గుడ్‌నైట్ అని చెబుతుంది. ఆదిత్య వెళ్లిన త‌రువాత సౌంద‌ర్య‌.. అన్న‌య్య‌ను ప్రేమ‌గా చూసుకోవ‌డం నేర్చుకోవాల‌ట‌. వాడిని, వాడి భార్య‌, పిల్ల‌ల‌ను క‌ల‌వ‌డం కోసం క‌ఠినంగా ఉండ‌ట‌మే నేరం అయితే వాళ్లు క‌లిసిపోయేదాకా నేను ఆ నేరం చేస్తాను అని అనుకుంటుంది.

  ఇక దీప‌.. రోడ్డు మీద ఉండి స‌రోజ‌క్క‌కు కాల్ చేస్తుంది. ఆ త‌రువాత స‌రోజ వ‌చ్చి.. ఏంటి దీపా.. ఇంక మీ నాన్న ద‌గ్గ‌రే ఉంటావా ఏంటి.. నువ్వు లేక‌పోతే మీ ఇల్లే కాదు శ్రీరామ్ న‌గ‌ర్ బ‌స్తీ కూడా బోసిపోయింది. ఇవాళే మీ ఇల్లు అంతా ఊడ్చాను. మా అరుణ వ‌చ్చి ముగ్గు పెట్టింది అని అంటుంది. దాంతో దీప‌.. ఇక మా ఇల్లు ఎలా బోసిపోతుంది స‌రోజ‌క్కా. ఇంటా, బ‌య‌ట మీరు శుభ్ర‌ప‌రిచారు. నాన్న ద‌గ్గ‌ర నా కోసం ఉండ‌టం లేదు. సౌర్య‌ను వాళ్ల నాన్న తీసుకెళ్లాడు. నేను ఈ ప‌నుల మీద బ‌య‌ట తిరుగుతున్నాను. హిమ‌కు ఒంటరిగా ఉండ‌టం అల‌వాటు లేక భ‌య‌ప‌డుతుంద‌ని, నాన్న ద‌గ్గ‌ర ఉంచి నా ప‌ని చూసుకుంటున్నాను అని అంటుంది. వెంట‌నే స‌రోజ.. అదీ నిజ‌మేలే అని చెబుతుంది. ఆ త‌రువాత దీప‌కు వ‌చ్చి కోర్టు నోటీసును స‌రోజ, దీప‌కు ఇస్తుంది. ఆ బంట్రోతు ఎలా ఇచ్చాడు అని దీప అడ‌గ్గా.. నువ్వు చెప్పిన‌ట్లే నేనే దీప‌ను అని చెప్పి సంత‌కం చేశాను. అందుకే ఇచ్చాడు అని చెప్పి.. అయినా ఎవ‌రైనా కోర్టు నోటీసు అంటే భ‌య‌ప‌డుతారు. నువ్వేమో అది తిరిగి వెళ్ల‌కూడ‌ద‌ని నన్ను నీ ఇంట్లో కూర్చోబెట్టావు. ఏంటి ఇదంతా. అస‌లు ఆ నోటీసు ఏంటి..? కొంప‌దీసి డాక్ట‌ర్ బాబు నీకు విడాకుల నోటీసు పంపించాడా..? అని అడుగుతుంది.

  దానికి దీప‌.. అది కాదులే అక్క‌. ఇది జీవితంలో విడాకులు అడ‌గ‌కుండా చేయ‌డానికి నాకు దొరికిన అవ‌కాశం అని చెబుతుంది. అంటే అని స‌రోజ అడ‌గ్గా.. చెప్తాన‌క్కా.. నా మంచి కోరే నీ కోసం కాక ఎవ‌రికి చెబుతాను. ఇప్పుడు నాకు టైమ్ లేదు. ప‌ని అయ్యాక మ‌ళ్లీ వ‌చ్చి చెబుతాను అని అక్క‌డి నుంచి వెళుతుంది.

  ఇక కార్తీక్ మౌనిత ఇంట్లో ఉంటాడు. నోటీసులు రిసీవ్ చేసుకోవ‌డానికి దీప ఇంటి ద‌గ్గ‌ర లేదంట‌. వాళ్ల నాన్న ద‌గ్గ‌ర ఉందంట అని కార్తీక్ అన‌గా.. కోర్టుకు ఎప్పుడు వెళ‌దాం అని త‌నే ఉత్సాహంగా అడుగుతోంది. నోటీసు రిసీవ్ చేసుకోకుండా ఎలా ఉంటుంది అని మౌనిత అంటుంది. నోటీసు అందుకున్నా కోర్టుకు రాక‌పోతే ఏం అవుతుంది అని కార్తీక్ అడ‌గ్గా.. నోటీసు అందుకున్నా రాకుండా ఎవ‌రూ ఉండ‌రు కానీ నువ్వు ఎందుకు ఇంత టెన్ష‌న్ ప‌డుతున్నావు అని మౌనిత అడుగుతుంది. దానికి కార్తీక్.. దీప మ‌నం అనుకున్నంత తెలివిత‌క్కువ‌ది కాదు కాబట్టి అని కార్తీక్ అంటాడు. అయితే అని మౌనిత ప్ర‌శ్నించ‌గా.. హిమ‌ను నిజంగా నాకు అప్ప‌జెబుతుందా.. లేదా అని టెన్ష‌న్‌గా ఉంది. హిమ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా. నేను తీసుకొచ్చుకోకుండా దాని ద‌గ్గ‌ర వ‌దిలేసింది నేను ఓడిపోతాను అని కాదు. శాశ్వ‌తంగా త‌న‌ను నేనే పెంచుకోవాల‌ని. అందుకు కోర్టు ద్వారా మాత్ర‌మే వీలు అవుతుంది కాబట్టి. హిమ తాత్కాలికంగా దూర‌మైనా ప‌ర్మినెంట్‌గా నా ద‌గ్గ‌ర‌కే వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఉన్నాను అని కార్తీక్ అంటాడు.

  ఇక మౌనిత‌.. ఇప్పుడు ఏమైంద‌ని తీర్పు మ‌న‌వైపే వ‌స్తుంద‌ని లాయ‌ర్ సుజాత చెబుతోంది క‌దా అని అంటుంది. మేము కూడా పేషెంట్ చ‌నిపోతాడ‌ని తెలిసి కూడా ఆఖ‌రి నిమిషం దాకా ఫైట్ చేస్తూనే ఉంటాము. చివ‌రి నిమిషం దాకా పోరాడుతూనే ఉంటాము. చివ‌రి నిమిషంలో లాయ‌ర్ చేతులు ఎత్తేస్తే.. హిమ దీప‌తోనే ఉండాల్సి వ‌స్తే, దీప నాకు ఎలాంటి హ‌క్కులు లేవంటే. హిమ చూడ‌టానికి కూడా రానంటే. న‌న్ను కూడా రావొద్దంటే అని అంటుండ‌గా.. స్టాప్ నువ్వు చాలా నెగిటివ్‌గా ఆలోచిస్తున్నావు కార్తీక్. ఒక‌దానితో ఒక‌టి ముడిపెట్టుకుంటూ పోయి జ‌ర‌గ‌ని వాటి గురించి భ‌య‌ప‌డుతున్నావు. ఇదుగో హిమ మీద ఉన్న ఈ పిచ్చి ప్రేమ చూసి నేను కోర్టుకు వెళ‌దామ‌న్న ఐడియా ఇచ్చాను అని అంటుంది.

  మ‌రి దీప అంత ధీమాగా ఎలా ఉంది అని కార్తీక్ అడగ్గా.. అదంతా మేక‌పోతు గాంభీర్యం అనుకుంటున్నాను. దీప ప్లాన్ ఏంటో మీ అమ్మ గారికి తెలుస‌ని నా అభిప్రాయం. ఆవిడ‌ను క‌దిలించి చూడ‌క‌పోయావా.. అని మౌనిత అంటుంది. దానికి కార్తీక్.. లేదు. మా అమ్మ‌కు తెలిసే అవ‌కాశం లేదు అని అంటాడు. అందుకు న‌వ్విన మౌనిత‌.. ఆవిడ మీద నీకు అంత న‌మ్మ‌కం అని అంటుంది. దానికి కార్తీక్.. ఆవిడేమీ కోర్టుకు వెళ్లొద్ద‌ని న‌న్ను ఆప‌లేదే అని అంటాడు. వెంట‌నే మౌనిత‌.. అక్క‌డే ఉంది కిటుకు. మీ అమ్మ కూడా సైలెంట్‌గా ఉంది. దీప కూడా ఉత్సాహంగా ఉంది అంటే సంథింగ్ ఉంది అని అంటుంది.

  దానికి కార్తీక్.. వాళ్ల ధైర్యం గురించి ప‌క్క‌న పెడ‌దాం. ఈ విష‌యం గురించే పాజిటివ్‌గా ఆలోచిద్దాం. కోర్టు వాళ్లు హిమ‌నే కాదు సౌర్య‌ను ఇస్తామ‌న్నా తీసుకుందాం అని అంటాడు. అదేంటి. అంత విశాల హృద‌యం అని మౌనిత అడ‌గ్గా.. దానికి కూడా నన్ను నాన్న అని పిల‌వాల‌ని, నాతోనే ఉండాల‌ని చాలా కోరిక. అది రౌడీయే కానీ మంచిది. వాళ్ల అమ్మ‌లా కాదు. మంచి, చెడు ఈ వ‌య‌స్సులోనే ఆలోచిస్తుంది. కోర్టు ఇద్ద‌రినీ ఇస్తానంటే ఇద్ద‌రినీ తీసుకుందాం అని అంటాడు. మౌనిత న‌వ్వుతూ.. నువ్వు వాళ్లిద్ద‌రిని తీసుకుంటే నేనెందుకు అని అంటుంది.

  ఇక మ‌రోవైపు కోర్టు పంపిన నోటీసుల‌కు సౌంద‌ర్య చ‌దువుతూ.. ఏంటే. నువ్వ‌స‌లు ఇది చ‌దివావా..? అని అడ‌గ్గా.. నేను చ‌దువుకున్నాను అత్త‌య్యా అని దీప చెబుతుంది. దానికి సౌంద‌ర్య‌.. మ‌రి. ఇంత నిబ్బ‌రంగా ఎలా ఉన్నావే అని అడ‌గ్గా.. నిబ్బ‌రంగా ఎప్పుడు లేను. సుబ్బ‌రంగా కోర్టుకు వెళ‌దాము అని దీప చెబుతుంది. వెంట‌నే సౌంద‌ర్య‌.. నువ్వు ఈ జ‌రిగేవ‌న్నీ చూస్తూ పిచ్చి ప‌ట్టి మాట్లాడుతున్నావే. వాడికి హిమ అంటే ఇష్టం, హిమ‌కు వాడంటే ఇష్టం. ఈ ఇష్టం చాలు కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డానికి. ఆర్థికంగా కూడా వాడి ద‌గ్గ‌ర ఉంటేనే పిల్ల బావుంటుంద‌ని.. వాడి ఆస్తి వివ‌రాలు కోర్టు ముందు పెడితే అని చెప్ప‌గా.. కోర్టు మాతృత్వానికి ఉన్న హ‌క్కులు ర‌ద్దు చేసి, త‌ల్లీ బిడ్డ‌ల‌కు ఉన్న అనుబంధాన్ని తోసిపుచ్చి ఆస్తి అనుభవించ‌మంటూ పిల్ల‌ను పెంచిన తండ్రికి అప్ప‌గిస్తుందా..? అని దీప అంటుంది. వెంట‌నే సౌంద‌ర్య‌.,. ఒక్కొక్క వాద‌న ఒక్కోలా ఉంటుంది దీప‌. ఇక్క‌డ హిమ ఇష్టం, ఇన్నేళ్లు పెంచిన క‌ష్టం, ఇవ‌న్నీ గాలికి వ‌దిలేయ‌రు క‌దా. అస‌లు అదంతా ప‌క్క‌న పెట్టు దీప‌. నువ్వు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నావు అని అడ‌గ్గా.. ధైర్యంగా ఉండ‌టం అన్న‌ది బ‌ల‌హీన‌త కాదు అత్త‌య్యా బ‌లం ఎవ‌రైనా అధైర్య‌ప‌డ‌కు, ధైర్యంగా ఉండు అని చెబుతారు. ఎందుకంటే ప‌రిస్థితులు బల‌హీన‌ప‌డి అధైర్యంగా ఉన్న‌ప్పుడు వెన్ను త‌ట్టి ధైర్యం చెప్పాల్సి వ‌స్తుంది. అలాంటి అవ‌స‌రం నాకు ఇప్పుడు లేదు అత్త‌య్యా. ధైర్యం దండిగా ఉంది. బ‌లం పుష్క‌లంగా ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. కొండంత అండ‌గా ఉండాల్సిన మీరే ఇలాంటి వాటికి బెదిరిపోతే ఎలా.. ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు వ‌చ్చినా స్థిరంగా ఉండ‌గ‌లిగే మీరే ఇంత ఢీలా ప‌డిపోతే ఎలా అని అంటుంది.

  వెంట‌నే సౌంద‌ర్య‌.. నేను ఎందుకు వ‌చ్చాను. అస‌లు ఏం జ‌రుగుతుంది. అస‌లు నేను ఎంత కంగారు ప‌డుతూ వచ్చానో తెలుసా అని అడ‌గ్గా.. నాకేమైనా అవుతుంద‌నా అత్త‌య్యా అని దీప అంటుంది. దానికి సౌంద‌ర్య‌.. ఈ నోటీసు వ‌చ్చిందంటే ఒంట‌రిగా నువ్వు ఎలా పోరాడాలా.. అని భ‌య‌ప‌డిపోతావు అనుకున్నాను అని అంటుంది. ఇక దీప‌.. భ‌య‌మెందుకు అత్త‌య్యా. కోర్టు ఉన్న‌ది ఎందుకు న్యాయం నిల‌బెట్ట‌డానికే క‌దా. అక్క‌డ ఉండేది న్యాయ‌మూర్తే, న్యాయ‌దేవ‌తే, ధ‌ర్మ దేవ‌తే. త‌ల్లి అనేది నిజం. హిమ త‌ల్లి నేనే అనేది నిజం. మాతృత్వానికి మ‌హా శ‌క్తి ఉంది అత్త‌య్యా. ఆ శ‌క్తిని కాద‌నే శ‌క్తి ఎవ్వ‌రికీ లేదు అని చెబుతుంది. వెంట‌నే సౌంద‌ర్య‌.. నువ్వు ధైర్యంగా ఉన్నావు అదే నాకు న‌చ్చింది. చాలా ఆత్మ‌విశ్వాసం నీలో క‌నిపిస్తుంది. అది నాకు సంతృప్తి ఇచ్చింది. ఈ గుణం ప్ర‌తి స్త్రీలో ఉండాల‌ని కోరుకునే వారిలో నేను ఒక‌దాన్ని. ఈ న‌మ్మ‌కం గొప్ప‌ది, నీ ఆశ‌యం గొప్ప‌ది. అదే నీకు శ్రీరామ ర‌క్ష అని చెబుతుంది.

  ఇక హాస్పిట‌ల్‌లో ఆదిత్య ఉండ‌గా.. తుల‌సి అక్క‌డ‌కు వ‌స్తుంది. దీప మీద అనుమానం లేకుండా చేస్తాను అని మ‌న‌సులో అనుకుంటుంది. అయితే తుల‌సిని చూసిన కార్తీక్ అక్క‌డి నుంచి వెళతాడు. ఆ త‌రువాత అక్క‌డ ఉన్న ఒక స్టాఫ్ తుల‌సికి ఏవో రిపోర్టులు ఇచ్చి.. సారీ తుల‌సి గారు అని అంటాడు.ఆ రిపోర్ట్‌ల‌ను తీసుకుని తుల‌సి వెళుతుంది. మ‌రోవైపు కార్తీక్ ఇంటికి రాగా.. వీడి మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాల‌ని సౌంద‌ర్య మ‌న‌సులో అనుకుంటుంది. అయితే ఆ వంట‌ల‌క్క మన‌సులో ఏం ఉందో తెలుసుకోవాల‌ని కార్తీక్ అనుకోగా.. హిమ విష‌యంలో వీడు ఏమ‌నుకుంటున్నాడో తెలుసుకోవాలి అని సౌంద‌ర్య‌.. హిమ విష‌యంలో ఆ వంట‌ల‌క్క ఎందుకు అంత ధీమాగా ఉందో తెలుసుకోవాలి అని కార్తీక్.. ఈ సుపుత్రుడు చెబుతాడా అని సౌంద‌ర్య‌.. కోడ‌ల్ని మెచ్చిన అత్త చెబుతుందా అని మ‌న‌సులో అనుకుంటారు. కార్తీక దీపం కొన‌సాగుతోంది.
  Published by:Manjula S
  First published: