హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: అంజి ఫోన్ కాల్ విన్న దీప‌.. మ‌రింత ఉత్కంఠ‌గా మారిన 'కార్తీక దీపం'

Karthika Deepam: అంజి ఫోన్ కాల్ విన్న దీప‌.. మ‌రింత ఉత్కంఠ‌గా మారిన 'కార్తీక దీపం'

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deeam) సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఎక్క‌డికి వెళ్లావో ఎందుకు చెప్ప‌లేదంటూ సౌర్య‌, దీప‌ను ప్ర‌శ్నిస్తూ ఉంటుంది. నాన్న‌కు అమ్మంటే ఎందుకు కోపం ఎవ్వ‌రూ చెప్ప‌రంటూ త‌న అస‌హ‌నాన్ని వెల్లగ‌గ్గుతూ ఉంటుంది

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఎక్క‌డికి వెళ్లావో ఎందుకు చెప్ప‌లేదంటూ సౌర్య‌, దీప‌ను ప్ర‌శ్నిస్తూ ఉంటుంది. నాన్న‌కు అమ్మంటే ఎందుకు కోపం ఎవ్వ‌రూ చెప్ప‌రంటూ త‌న అస‌హ‌నాన్ని వెల్లగ‌గ్గుతూ ఉంటుంది. ఈ లోపు దీప స‌హ‌నాన్ని కోల్పోయి చెప్ప‌రు అంటూ కోప్ప‌డుతుంది. ఎవ్వ‌రూ చెప్ప‌రు, ఎందుకు చెప్పాలి, అస‌లు మీ వ‌య‌సెంత‌ని, మీకేం అనుభవం ఉందని, ప్ర‌తీది మీకే కావాలంటే నా ఏడుపు ఏదో నేను ఏడుస్తున్నాను క‌దా మళ్లీ మీరు ఏడుస్తూ బ‌త‌క‌డం అవ‌స‌ర‌మా..? చెప్పినా అర్థం కాని వ‌య‌స్సు మీది.. అర్థం అయ్యినా కాక‌పోయినా సున్నిత‌మైన మ‌న‌సు మీది.. ఆ మ‌న‌సును గాయం చేయ‌డం నాకు చేత కాదు, నాకే కాదు ఫోన్ క‌ట్ చేసిన మీ నాన్న‌కు చేత కాదు. మీ నాన్న‌మ్మ‌కు అస‌లు చేత‌కాదు అంటుంది. దానికి సౌర్య‌.. అంటే ఎవ్వ‌రూ చెప్ప‌రా అని అడ‌గ్గా... చెప్ప‌ము, చెప్ప‌లేము అని దీప‌ అంటుంది.

  ఆ త‌రువాత ఏంటి నిల‌దీస్తున్నావు న‌న్ను.. నీకేం తెలుసు నేను ఎంత గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తున్నానో.. నా కోసమే కాదు మీకు మీ నాన్న‌కు ఇవ్వ‌డం కోసం కూడా నేను ఎంత క‌ష్ట‌ప‌డుతున్నానో, తిండి మాని, నిద్ర మాని పిచ్చి దానిలా తిరుగుతున్నాను.తొంద‌ర‌లోనే అన్నీ చ‌క్క‌బడుతాయి, అంద‌రం క‌లిసి ఉంటాము. అప్పుడు ఈ ప్ర‌శ్న‌లు ఉండ‌వు, ఈ కోపాలు ఉండ‌వు, అంద‌రం సంతోషంగా ఉంటాము, మీ అమ్మ‌ను మీరు న‌మ్మండి, మీ అమ్మ మీకు ఇచ్చే గొప్ప బ‌హుమ‌తి మీ నాన్న అని చెప్పి లోప‌లికి వెళుతుంది.

  ఇక ఇంట్లో కార్తీక్, సౌంద‌ర్య మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ దీప‌కు మౌనిత మీద కేసు పెట్టాల్సిన అవ‌సరం ఏమొచ్చింది. ఏదైనా జ‌రిగితే మౌనిత నాకు చెప్ప‌కుండా ఉండ‌దు. ఫోన్ ఆఫ్ చేయ‌డం, రాంగ్ నంబ‌ర్ అని చెప్ప‌డం, ఏంటి ఇవన్నీ ఏం జ‌రుగుతుంది అస‌లు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపు ఆదిత్య కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి.. ఏంటి అన్న‌య్య రాత్రి స‌రిగా నిద్ర‌పోలేదా..? మొహం డ‌ల్‌గా ఉంది అని అడుగుతాడు. ఇక కార్తీక్ దీపుగాడు లేచాడా అని ప్ర‌శ్నించ‌గా.. హా లేచాడు.. వాకింగ్‌కి కూడా వెళ్లాడు.. లేక‌పోతే ఏంటి అన్న‌య్య‌... నేను అడిగిన దానికి స‌మాధానం చెప్ప‌కుండా ఇప్పుడు వాడి గురించి ఎందుకు అని అంటాడు. వెంట‌నే కార్తీక్.. నాకు నిద్ర ప‌ట్టిందా లేదా..? నా మొహ‌మేంటి అలా ఉంది..? ఇవ‌న్నీ ఎందుకురా..? ఏదో అడ‌గాలని వ‌చ్చావు అడుగు అని అంటాడు.

  దానికి ఆదిత్య నువ్వు చాలా మారిపోయావు అన్న‌య్య అన‌గా.. మారాలిరా.. నా చుట్టూ ఉన్న వారిని ఎటూ మార్చ‌లేను, కనీసం నేను మారితేనైనా క‌ష్టం అనిపించింది అని కార్తీక్ అంటాడు. వెంట‌నే ఆదిత్య‌.. లోకం త‌న‌కు న‌చ్చిన‌ట్లు సాగిపోతుంటే.. అన్ని మార్చాల‌న్న త‌ప‌న‌తో నీ త‌ల ఎందుకు ప‌గ‌ల‌గొట్టుకుంటావు అన్న‌య్య. హ్యాపీగా నీ కూతురును తెచ్చుకో. కావాలంటే హిమ‌కు అక్క‌డ సౌర్య అల‌వాటు అయ్యింది కాబ‌ట్టి.. సౌర్య‌ను కూడా తెచ్చుకుందాం. ఎటూ స్కూల్స్ లేవు, ఇక్క‌డే చ‌దువుకుంటారు. మొగుడూ పెళ్లాల మ‌ధ్య గెలుపోట‌ములు ఏంటి..? ఆవిడ క‌న్న‌ప్రేమ గొప్ప‌దో, పెంచిన ప్రేమ గొప్ప‌దో చూపిస్తాను అంది. నువ్వు దాన్ని సీరియ‌స్‌గా తీసుకోకు. మీ ఇద్ద‌రి మ‌ధ్య ఆ పిల్లలు న‌లిగిపోతున్నారు అన్న‌య్య‌.. అది ఆలోచించు అన్న‌య్య‌ అని అంటాడు.

  వెంట‌నే కార్తీక్‌.. ఏంటిరా ఆలోచించేది.. లక్క‌పిడ‌త మ‌నుషుల గురించా, చింత‌పిక్క మెద‌డు ఉన్న వాళ్ల గురించా..చెద పురుగుల‌కు సెంటిమెంట్లు ఏం తెలుసు..? సొంత ఆలోచ‌న‌లు లేవు, ఒక‌రిది అతివాదం, మ‌రొక‌రిది వితండవాదం. అది ప‌చ్చి అవ‌కాశంవాదం. అవ‌కాశ‌వాది కాబ‌ట్టే ఇన్ని వ్యూహాలు, ఇన్ని ఎత్తుగ‌డ‌లు, ఇన్ని కుప్పిగంతులు.. ఛీ.. ఛీ.. అని అంటాడు. దానికి ఆదిత్య‌.. అలాగ‌ని నువ్వు ఇక్క‌డ‌, వాళ్లు అక్క‌డా అని ఏదో చెప్ప‌బోతుండ‌గా.. ఆప‌రా.. ప్ర‌తిసారి అక్క‌డ అక్క‌డ అని అక్క‌డి వారి గురించి ఎందుకు..? చూడు నేనొక‌టి అడుగుతాను క‌రెక్ట్‌గా స‌మాధానం చెప్పు నేనేదో సింప‌థీ పొందాల‌ని ఆశించ‌డం లేదు అని అంటాడు. వెంట‌నే ఆదిత్య.. అడుగు అన్న‌య్య అని చెబుతాడు.

  అస‌లు ఎవ‌రైనా స‌రే.. నా త‌ర‌ఫున ఆలోచిస్తున్నారారా.. ఒక్క‌డినే ఎందుకు ఉంటున్నానో, భార్య బిడ్డ‌ల‌ను ఎందుకు కాద‌నుకుంటున్నానో..? ఒక్క‌సారి.. ఒక్క‌సారంటే ఒక్క‌సారైనా ఆలోచించారా రా..? ఎవ్వ‌రూ చూడు దాని త‌ర‌ఫునే మాట్లాడుతారు. అదేమో ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతుంది. ఇష్టానుసారం బిహేవ్ చేస్తుంది. దీని గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌రు. చెప్పు దీనికి స‌మాధానం చెప్ప‌రా అని కార్తీక్ అడ‌గ్గా.. నువ్వు అనుకుంటున్న‌ది అనుమాన‌మే త‌ప్ప నిజం కాద‌న్న‌ది మా న‌మ్మ‌కం అని ఆదిత్య అన‌గా.. అది అని కార్తీక్ ఏదో చెప్ప‌బోతాడు. వెంట‌నే ఆదిత్య వ‌ద్దు అన్న‌య్య ద‌య‌చేసి ఈ టాపిక్ ఇంత‌టితో వ‌దిలేసేయ్. నేను భార్య భ‌ర్త‌ల విష‌యం గురించి మాట్లాడ‌టానికి రాలేదు. నీ కూతురు గురించి అడ‌గ‌టానికి, దాని గురించి బాధ‌ప‌డుతున్న నీ గురించి బాధ‌ప‌డుతూ అని చెప్ప‌బోతుండ‌గా అడ్డుప‌డే కార్తీక్.. నా గురించి ఎవ్వ‌రూ బాధ‌ప‌డొద్దు బ్ర‌ద‌ర్, నేనేమీ చ‌చ్చిపోను, కొంప వ‌దిలి పోను అంటాడు. దానికి ఆదిత్య‌.. కూతురిని మాత్రం తెచ్చుకోవు, అంతేనా అని చెప్పి.. చూడు అన్న‌య్య‌.. ఏమీ ఆలోచించ‌కుండా హిమ‌ను తెచ్చుకో లేదంటే అని ఆగుతాడు. లేదంటే అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. హిమ‌ను మ‌ర్చిపో అని ఆదిత్య చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాట‌ల‌కు కార్తీక్ ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు.

  ఇక మౌనిత.. ఛ గొప్ప ఛాన్స్ మిస్ అయ్యింది. వెధ‌వ నిద్ర ప‌ట్టేసింది. పాల‌వాడు వెళ్లిపోయాడు, పేప‌ర్ వాడు వెళ్లిపోయాడు, ఉన్న‌ట్లైతే వాళ్ల చేత తాళం తీయించేదాన్ని..ఛ అని అనుకుంటూ ఉండ‌గా.. ఏదో ప‌డుతుంది. వెంట‌నే అరుస్తూ ప్రియ‌మ‌ణి ప్రియ‌మ‌ణి అంటుంది. దాంతో లోప‌లికి వ‌చ్చిన ప్రియ‌మ‌ణి ఏమైందమ్మా అని అడ‌గ్గా.. ఏదో ప‌డ్డ‌ట్లు అనిపించిందే అంటుంది. ఇక అక్క‌డ ప్యాకెట్లు ఉండ‌గా.. వాటిని చూసి అమ్మా దీప ప్యాకెట్లు విసిరేసింద‌మ్మా అని అంటుంది. దీంతో మౌనిత కిటికీ వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. అక్క‌డ ఓ ఆటో వెళుతుంది. దీంతో మౌనిత‌.. ఎంత పొగ‌రే నీకు చెప్తా.. ఇవాళ రాత్రి అంతా మేలుకోని అయినా స‌రే, ఉద‌యం పేప‌ర్ వాడితో తాళం ప‌గ‌ల‌గొట్టించి, నీ మొహం ప‌గ‌ల‌గొట్ట‌క‌పోతే నా పేరు మౌనిత‌నే కాదు ఆవేశంతో ఊగిపోతూ ఉండ‌గా.. అటుగా వ‌చ్చిన ప్రియ‌మ‌ణి అమ్మా ఇడ్లీ పంపించింది అని న‌వ్వుతూ చెప్తుంది. ఇక మౌనిత కోపాన్ని చూసి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.

  ఇక సౌర్య‌, హిమ‌ల‌కు దీప టిఫెన్ తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు హిమ‌.. అమ్మా నీకు కోపం వ‌చ్చిందా అమ్మా అని అడ‌గ్గా.. నేను కోప‌గించుకున్నానా..? అని దీప అంటుంది. వెంటనే హిమ‌.. ఇందాక సౌర్య మీద అరిచావు క‌దా అని అంటుంది. అరిచిన‌ట్లు అనిపించిందా..? అని దీప అడ‌గ్గా.. చాలా భ‌యం వేసింది అని హిమ చెబుతుంది. అమ్మ‌ను చూస్తే భ‌యం వేయడం ఏంట‌మ్మా.. అని దీప చెబుతుంది. ఎందుక‌మ్మా.. అలా మాట్లాడావు అని హిమ అంటుండ‌గా.. నేనే విసిగించాను, అమ్మ‌కు కోపం తెప్పించాను అని సౌర్య అంటుంది. వెంట‌నే దీప‌.. అదేంట లేదు అత్త‌మ్మ అని చెప్పి.. ఇద్ద‌రు ఓ మాట గుర్తుపెట్టుకోండి. నేనేం చేసినా నాన్న‌తో మ‌న‌మంద‌రం క‌లిసి ఉండ‌టానికే అని మ‌ర్చిపోకండి. ప్ర‌తిసారి ప్ర‌తి విష‌యాన్ని అడ‌గ‌కండి, చెప్పేదైతే నేనే చెప్తాను అని దీప‌ అంటుంది. వెంట‌నే సౌర్య‌.. కానీ నువ్వు ఎక్క‌డ‌కు వెళ్లినా చెప్పి వెళ్ల‌మ్మా. ఆల‌స్య‌మైతే హిమ భ‌య‌ప‌డి ఏడుస్తుంది అని చెబుతుంది. దానికి దీప‌.. భ‌య‌మెందుకు హిమ‌.. ఇదేం కోటీశ్వ‌రుల ఇళ్లు కాదు, ఏ దొంగ రాడు అని చెబుతుంది. ఇక హిమ‌.. నాకు నీ మీద బెంగ‌గా అనిపిస్తుంది అమ్మా అందుకే అని చెబుతుంది. వెంట‌నే దీప‌.. ఓ నాలుగు రోజులు ఓపిక ప‌డ్డండి అమ్మా.. నా కోసం, నాన్న కోసం, మ‌న‌మంద‌రం క‌లిసి ఉండ‌టం కోసం. ఇక నుంచి మీకు తోడుగా వార‌ణాసిని ఉంచి, నేను వేరే ఆటోలో వెళ‌తాను స‌రేనా అని చెప్ప‌గా.. వారు స‌రే అంటారు.

  అదే స‌మ‌యంలో మౌనిత ఫోన్‌కి ఫోన్ రావ‌డంతో.. మాట్లాడేందుకు దీప బ‌య‌ట‌కు వెళుతుంది. ఇక ఫోన్‌లో వెధ‌వ అని రాగా.. దాన్ని చూసి ఈ సిల్లీ ఫెలో ఎవ‌రి పేరును వెధ‌వ అని పెట్టుకుంది అని ఆలోచిస్తూ దీప ఫోన్ ఎత్తుతుంది. ఫోన్ చేసిన అంజి.. హ‌లో నువ్వు వింటున్నావని నాకు తెలుసు, నేను ఎవ‌రు అనేది నీకు తెలుస‌ని కూడా నాకు తెలుసు, ఏంటి..? నీ ఫోన్ నంబ‌ర్ నాకు ఎలా వ‌చ్చింది అనుకుంటున్నావా..? శ‌్రావ్య‌మ్మ‌ను అడిగి తీసుకున్నాను. ఏంటి..? జ‌వాబు లేదు అని అడుగుతూ ఉంటాడు. దానికి దీప‌.. ఎవ‌రు ఇత‌ను అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఫోన్‌లో అంజి.. నీ చ‌రిత్ర మొత్తం తెలిసింది నాకే క‌దా. ఆ మాత్రం భ‌యం ఉండాలి. ఏంటి..? కార్తీక్ బాబు నిన్ను పెళ్లి చేసుకుంటాన‌ని వాళ్ల అమ్మగారితో అన్నాడ‌ట‌. నీకు కార్తీక్ బాబు ఇంట్లో అడుగుపెట్టే అర్హ‌తే లేదు. అలాంటిది కార్తీక్ బాబుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా..? అని మాట్లాడుతుండ‌గా.. ఈ గొంతు అని దీప ఆలోచ‌న‌లో ప‌డుతుంది. ఇక అంజి.. చూడు నా గురించి త‌క్కువ అంచ‌నా వేయ‌కు, నేను అంజిని అన‌గా.. దీప షాక్‌కి గురి అవుతుంది.

  మ‌రోవైపు ఫోన్‌లో మాట్లాడుతున్న అంజి.. ఇప్పుడు నేను డ్రైవ‌ర్‌గానే ఉండొచ్చు, కానీ ప‌దేళ్ల క్రితం నేనో పెద్ద హంత‌కుడ‌ని మ‌ర్చిపోకు. కార్తీక్ బాబు కాపురంలో చిచ్చు పెట్టింది కూడా నువ్వేన‌ని నాకు తెలుసు. వాళ్ల జోలికి వ‌చ్చావంటే న‌రికిపారేస్తాను జాగ్ర‌త్త అని ఫోన్ పెట్టేస్తాడు. ఆ త‌రువాత దీప‌.. అంజి హంత‌కుడా అస్స‌లు అనిపించ‌డే, ప‌దేళ్ల క్రిత‌మే మౌనిత‌తో ప‌రిచ‌యం ఉందా..? అస‌లు డాక్ట‌ర్ బాబు మౌనిత‌ను చేసుకుంటాన‌ని అత్త‌య్య‌తో చెప్ప‌డం ఏంటి..? అత్త‌య్య నాతో చెప్ప‌క‌పోవ‌డం ఏంటి..? ఇంత‌కాలం మౌనిత వెంట ప‌డ్డా ప‌ట్టించుకోని డాక్ట‌ర్ బాబు.. ఇప్పుడెందుకు ఇంత స‌డ‌న్‌గా ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు..? అని ఆలోచిస్తూ ఉంటుంది.

  ఇక సౌంద‌ర్య ఇంట్లో అంద‌రూ ఒక‌చోట కూర్చొని ఉంటారు. వారంద‌రినీ చూసిన కార్తీక్.. ఏంటి అంద‌రూ సామూహికంగా దాడి చేయాల‌ని వెయిట్ చేస్తున్నారా..? అని అంటాడు. ఇక ఆనంద‌రావు, కార్తీక్ భుజం త‌ట్టి.. కుటుంబంలో స‌మ‌స్య వ‌స్తే ప‌రిష్కారం కోసం ప్రాకులాడుతామేమో కానీ.. అంతా క‌లిసి కొట్లాడుకోవ‌డానికి ఇదేమీ రాజ్యం కోసం చేసే పోరాటం కాదు అని అంటాడు. ఇక సౌంద‌ర్య టిఫెన్ చేద్దువు రా అని అన‌గా.. అంద‌రం క‌లిసి టిఫెన్ చేద్దామ‌ని ఎదురుచూస్తున్నాము అని ఆనంద‌రావు అంటాడు. ఇక రా అన్నయ్య అని ఆదిత్య‌, రండి బావ‌గారు వ‌డ్డిస్తాను అని అంటారు. వెంట‌నే కార్తీక్.. యుద్ద‌వాతావ‌ర‌ణం స‌మిసిపోయి శాంతి ఒప్పందాలు క‌నిపిస్తున్నాయి అని అంటాడు. అశాంతిగా మ‌సులుకోవ‌డం మాకు చేత‌గాని విద్య‌.. రారా అని సౌంద‌ర్య పిలుస్తుంది. అయితే వ‌ద్దు మ‌మ్మీ అని కార్తీక్ అంటాడు. ఎందుకు వ‌ద్దు అని సౌంద‌ర్య అంటుంది. బ‌య‌ట చేయాల‌నుకుంటున్నాను, బ‌య‌ట ఇడ్లీ బండి ఉంది క‌దా, వాడి ద‌గ్గ‌ర, చ‌వ‌క కూడా అని కార్తీక్ చెబుతాడు. ఇక సౌంద‌ర్య‌.. అక్క‌డే ఎందుకు తినాల‌నుకుంటున్నావో అని అడ‌గ్గా.. అక్క‌డైతే వాడికి నా ఫీలింగ్స్‌తో అవ‌స‌రం లేదు, నాకు వాడి క‌ష్టాల‌తో అవ‌స‌రం లేదు. పెట్టిన దానికి డ‌బ్బులు తీసుకుంటాడు, క‌ళ్ల‌కు అద్దుకొని పెట్టెలో దాచుకుంటాడు అని అంటాడు. ఇక ఇల్లు ఉండ‌గా.. రోడ్డున ప‌డ‌తాను అంటావేంటిరా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. ఇక్క‌డ తిన‌డం నాకు ఇష్టం లేదు. ఇడ్లీ బండి ద‌గ్గ‌ర ఎవ్వ‌రితోనూ నాకు ప‌రిచయం ఉండ‌దు, కాబ‌ట్టి ఎవ్వ‌రూ నాకు ఏ ఉచిత స‌ల‌హాలు ఇవ్వ‌రు అని కార్తీక్ చెబుతాడు. ఇక ఆనంద‌రావు అక్క‌డ అంత సౌక‌ర్యంగా ఉంటుంది అంటే ఇక్క‌డ అందరూ ఇళ్లు వ‌దిలేసి ఇడ్లీ వాడి ద‌గ్గ‌రే తింటారు. ఈ లాజిక్‌తో నేను ఏకీభ‌వించ‌ను అంటాడు. వెంట‌నే కార్తీక్.. వ‌ద్దు డాడీ.. నేను ఈ ఇంట్లో భోజ‌నం చేస్తున్నా..? టిఫెన్ చేస్తున్నా హిమే గుర్తుకు వ‌స్తుంది. త‌రువాత పైకెత్తిన క‌నుబొమ్మ క‌నిపిస్తుంది. ఆ త‌రువాత పంతం, పొగ‌రు, సెల్ఫ్ రెస్పెక్ట్, వ‌గైరా వ‌గైరాల‌న్నీ వినిపిస్తాయి అందుకే తిన‌ట్లేదు అంటాడు.

  దానికి సౌంద‌ర్య‌.. ఇవ‌న్నీ నీకు బ‌య‌ట గుర్తురావ‌ని ఆశించి వెళ్లు అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. గుర్తొచ్చినా గుండెల్లో పొడ‌వ‌డానికి అక్క‌డ మీరు ఉండ‌రు క‌దా అని అక్క‌డి నుంచి వెళ‌తుంటాడు. ఈ క్ర‌మంలో ఆదిత్య ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ఏంటిరా నేను హిమ‌ను మ‌ర్చిపోవాలా..? మ‌ంచి స‌ల‌హా ఇచ్చావురా.. బాగా డెవ‌ల‌ప్ చేశారు నిన్ను. కీప్ ఇట్ అప్. ఇవ‌న్నీ మీ అర్థ‌పావు అత్త భాగ్యంకు చెప్పు. స్వీట్ ఇచ్చి మంచి ఐడియా ఇచ్చావు అల్లుడు అంటుంది అని బయ‌ట‌కు వెళతాడు.

  ఇక కిటికీ ద‌గ్గ‌రే నిల‌బ‌డ్డ మౌనిత‌.. ఎవ‌రైనా అంటుగా వ‌స్తారేమోన‌ని చూస్తూ ఉంటుంది. ఆ స‌మ‌యంలో ప్రియ‌మ‌ణి వచ్చి అమ్మా ఊరికే కిటికీ ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌కండి అమ్మా.. ప‌రువు పోతుంది అని అంటుంది. అర్థం లేకుండా మాట్లాడ‌కు ప్రియ‌మ‌ణి.. నా ఇంటి కిటికీలో నుంచి చూస్తే ప‌రువు ఎందుకు పోతుంది అని మౌనిత అన‌గా.. హా మీ ఇల్లే. కానీ మీ ఇంటి బ‌య‌ట తాళం వేసి ఉంది అని అంటుంది. అయితే అని మౌనిత అడ‌గ్గా.. అమాయ‌కంగా మాట్లాడ‌కండి అమ్మా ఎవ‌రో మిమ‌ల్ని లోప‌ల పెట్టేసి తాళం వేశారు అనుకోరా..? అప్పుల పాల‌య్యారేమో అని ఇంకొంద‌రు అనుకోరా..? ఇంకొంత‌మంది ఆప‌రేష‌న్ చేస్తే ఎవ‌రైనా చ‌నిపోయారేమో.. ఆ కోపంతోనే ఎవ‌రైనా ఇలా చేశారేమో అని అనుకోరా.. ఇంకొంద‌రు అని చెబుతూ ఉండ‌గా.. వెంట‌నే మౌనిత నువ్వు నోర్ముయ్ అని అంటుంది. నా కార్తీక్ వ‌స్తాడేమోన‌ని ఆశ‌గా చూస్తున్నానే అని మౌనిత చెప్ప‌గా.. హా వ‌స్తాడు.. బ‌య‌ట తాళం చూసి అట్నుంచి అటే వెళ‌తాడు అంటుంది. అందుకే క‌దా నేను కిటికీ ద‌గ్గ‌ర నిల‌బ‌డింది అని మౌనిత చెప్ప‌గా.. అక్క‌డ నిల‌బ‌డితే ఏమ‌నుకుంటారోన‌ని ఇందాకే క‌దా చెప్పింది. ఇక ఆ దీప వ‌చ్చి తాళం తీసే వ‌ర‌కు మ‌న‌కు ఈ శిక్ష త‌ప్ప‌ద‌మ్మా అని ప్రియ‌మ‌ణి అంటుంది. చూస్తుండ‌వే.. కార్తీక్ చేత‌నే దీప మెడ ప‌ట్టి బ‌య‌ట‌కు గెంటేలా చేయిస్తా అని అంటుంది. ఆ త‌రువాత కార్తీక్ చెప్పిన మాట‌ల‌ను గుర్తుచేసుకొన్న మౌనిత‌.. దీప‌కు, విహారికి మ‌ధ్య ఉన్న సంబంధం ఉంద‌ని ప్రూవ్ చేయ‌మ‌న్నాడు కార్తీక్. అదే కానీ చేస్తే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికి ప‌రిష్కారం దొరుకుతుంది. ఆ సౌంద‌ర్య నోరు కూడా మూత‌ప‌డుతుంది. ఎంత క‌ష్ట‌ప‌డైనా స‌రే వాళ్లిద్ద‌రికి సంబంధం ఉంద‌ని త‌ప్పుడు ఆధారాలు సృష్టిస్తా అని మ‌న‌సులో అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రియ‌మ‌ణిని కాఫీ తీసుకుర‌మ్మ‌ని చెప్పి పంప‌తుంది.

  మ‌రోవైపు మౌనిత ఫోన్‌కి కార్తీక్ ఫోన్ చేయ‌గా.. దాన్ని చూసిన దీప‌.. కాల్ క‌ట్ చేస్తుంది. తరువాత అదేమో నా కార్తీక్ అంటుందా..? ఈయ‌నేమో దాన్ని పెళ్లి చేసుకుంటా అంటాడా..? అన్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టేస్తాను డాక్ట‌ర్ బాబు అని అనుకుంటుంది. ఇక వెంక‌టేష్‌కి త‌న‌ను డ్రాప్ చేసిన త‌రువాత గంట‌కు ర‌మ్మ‌ని చెబుతుంది. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో దీప, మౌనిత ఇంటికి వెళ్లిన‌ప్పుడు కార్తీక్ కూడా వెళతాడు. దీంతో క‌థ మ‌రో కీల‌క మ‌లుపుకు చేరుకుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial

  ఉత్తమ కథలు