హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: విహారికి ఈ జ‌న్మ‌లో పిల్ల‌లు పుట్ట‌రు.. దీప‌కు నిజం చెప్పేసిన తుల‌సి.. మ‌రింత ఆస‌క్తిక‌రంగా కార్తీక దీపం

Karthika Deepam: విహారికి ఈ జ‌న్మ‌లో పిల్ల‌లు పుట్ట‌రు.. దీప‌కు నిజం చెప్పేసిన తుల‌సి.. మ‌రింత ఆస‌క్తిక‌రంగా కార్తీక దీపం

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో లాయ‌ర్ సుజాత‌తో మౌనిత మాట్లాడుతూ ఉంటుంది. సుజాత గారు ఏం చేస్తారో నాకు తెలీదు. మ‌నం మాత్రం కేసు గెల‌వాలి. కావాలంటే దొంగ సాక్ష్యుల‌ని, చైల్డ్ సైకియాల‌జిస్ట్‌ల‌ను ఎవ్వ‌రినైనా కోర్టుకు పిలిపించి హిమ‌ను మాన‌సికంగా దీప ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది అని నిరూపించ‌క‌గ‌లిగితే అని అంటుండ‌గా

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో లాయ‌ర్ సుజాత‌తో మౌనిత మాట్లాడుతూ ఉంటుంది. సుజాత గారు ఏం చేస్తారో నాకు తెలీదు. మ‌నం మాత్రం కేసు గెల‌వాలి. కావాలంటే దొంగ సాక్ష్యుల‌ని, చైల్డ్ సైకియాల‌జిస్ట్‌ల‌ను ఎవ్వ‌రినైనా కోర్టుకు పిలిపించి హిమ‌ను మాన‌సికంగా దీప ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది అని నిరూపించ‌క‌గ‌లిగితే అని అంటుండ‌గా

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో లాయ‌ర్ సుజాత‌తో మౌనిత మాట్లాడుతూ ఉంటుంది. సుజాత గారు ఏం చేస్తారో నాకు తెలీదు. మ‌నం మాత్రం కేసు గెల‌వాలి. కావాలంటే దొంగ సాక్ష్యుల‌ని, చైల్డ్ సైకియాల‌జిస్ట్‌ల‌ను ఎవ్వ‌రినైనా కోర్టుకు పిలిపించి హిమ‌ను మాన‌సికంగా దీప ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది అని నిరూపించ‌క‌గ‌లిగితే అని అంటుండ‌గా

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో లాయ‌ర్ సుజాత‌తో మౌనిత మాట్లాడుతూ ఉంటుంది. సుజాత గారు ఏం చేస్తారో నాకు తెలీదు. మ‌నం మాత్రం కేసు గెల‌వాలి. కావాలంటే దొంగ సాక్ష్యుల‌ని, చైల్డ్ సైకియాల‌జిస్ట్‌ల‌ను ఎవ్వ‌రినైనా కోర్టుకు పిలిపించి హిమ‌ను మాన‌సికంగా దీప ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది అని నిరూపించ‌క‌గ‌లిగితే అని అంటుండ‌గా.. కార్తీక్ ఫోన్ తీసుకుంటాడు. దాంతో లాయ‌ర్ సుజాత‌.. మీరు టెన్ష‌న్ ప‌డ‌కండి. ఆ దీప మ‌న ద‌గ్గ‌ర కేసు గెలిచే ఛాన్స్ లేదు అని అంటుంది. దానికి కార్తీక్.. ఆల్‌రెడీ గెలిచింది అని అంటాడు. ఇక మీరు వాదించ‌డానికి ఇక్క‌డ ఏం లేదు. మీ క‌న్నా నాలుగు ఆకులు ఎక్కువే చ‌దివింది నా పెళ్లాం అని అంటాడు. ఏమైంద‌ని లాయ‌ర్ అడ‌గ్గా.. కోర్టుకు వెళ్ల‌కుండానే కేసు క్లోజ్ అయ్యింది. బోనులో నిల‌బ‌డ‌కుండానే దీప గెలిచింది. అక్క‌డికి వెళ్లి మ‌రీ ప‌రువు తీయించుకోవ‌డం క‌న్నా నోరు మూసుకొని ఆగిపోవ‌డ‌మే మంచిద‌ని డ్రాప్ అయిపోతున్నాను. మీకు మౌనిత రెండు ల‌క్ష‌లు ఇచ్చిందట క‌దా. అందులో నుంచి ఆ డాక్యుమెంటేష‌న్ కోసం ఎంతో కొంత తీసుకొని మిగ‌తాది మౌనిత‌కు ట్రాన్స‌ఫ‌ర్ చేయండి. ఉంటాను అని అంటాడు.

  ఇక మ‌రోవైపు సౌంద‌ర్య ఇంట్లో.. దీపతో సౌర్య మాట్లాడుతూ.. రేపు వ‌స్తాన‌మ్మా అంటుంది. దానికి సౌంద‌ర్య‌.. ఏంటే అప్పుడే నీ ఇల్లు నీకు బోర్ కొట్టిందా.. ఇక్క‌డ ఏం త‌క్కువైంది నీకు అని ప్ర‌శ్నిస్తుంది. ఆనంద‌రావు కూడా.. ఏంట‌మ్మా. ఎందుకు వెళ్తానంటున్నావు అని అడుగుతాడు. దీప కూడా.. ఏమైంది అత్త‌మ్మా అని ప్ర‌శ్నిస్తుంది. దానికి సౌర్య‌.. డాక్ట‌ర్ బాబు ఇక వెళ్ల‌వే రౌడీ అన‌క‌ముందే వెళ్లిపోదామ‌ని అని అంటుంది. దాంతో అంద‌రూ షాక్‌కి గురి అవుతారు. ఇవాళ , రేపో అనొచ్చు క‌దా అని సౌర్య అన‌గా.. నీకెందుకు అత్త‌మ్మా అలా అనిపించింది అని దీప అడుగుతుంది.

  దానికి సౌర్య‌.. రాత్రి నాన్న‌ను ఒక ప్ర‌శ్న అడిగాను అని అంటుంది. ఏమ‌ని అడిగావు అని దీప అడ‌గ్గా.. హిమ నిన్ను డాడీ అని పిలిచిన‌ప్పుడు నేనెందుకు డాడీ అన‌కూడ‌దు అని అడిగాను. ఇద్ద‌రం అమ్మ కూతుర్ల‌మే క‌దా. అమ్మ మీ భార్య క‌దా. మ‌రి హిమలాగే నేనెందుకు పిల‌వ‌కూడదు అని అడిగానని అంటుంది. ఏమ‌న్నాడ‌ని దీప అడ‌గ్గా.. స‌మాధానం చెప్పి ఉండ‌దు అని సౌంద‌ర్య అంటుంది. ఇక ఏమ‌న్నాడ‌మ్మా అని ఆనంద‌రావు అడ‌గ్గా.. నాన్న స‌మాధానం చెప్ప‌లేదు. క‌నీసం నువ్వైనా చెప్ప‌మ్మా అని సౌర్య అంటుంది. దాంతో సౌర్య‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుంటుంది దీప‌. ఆ త‌రువాత నాకుఎవ‌రూ జ‌వాబు చెప్ప‌రా.. నాకు ఒకటి అనిపిస్తుంది. అస‌లు హిమ‌ను అనాథ అన్నారు. కానీ నేను అనాథ‌ను అయ్యి ఉంటాను అని సౌర్య అన‌గా.. అత్త‌మ్మా అని దీప అంటుంది. ఆ వెంట‌నే సౌర్య‌.. అందుకే నాన్న న‌న్ను నాన్న అని పిల‌వొద్దంటున్నాడు. నేను మీకు పుట్ట‌లేదా అమ్మా. మ‌రి నాన్న ఎందుకు నన్ను అనాథ‌లాగా చూడాలి అని ఏడుస్తుంది. దీంతో అక్క‌డున్న అంద‌రూ బాధ‌ప‌డ‌తారు. ఆ త‌రువాత సౌర్య‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకొనే సౌంద‌ర్య‌.. హ‌త్తుకుంటుంది.

  ఇక భాగ్యానికి ఫోన్ చేసిన ముర‌ళీకృష్ణ‌.. ఒసేయ్ భాగ్యం. నేను ఎన్ని బియ్యం పెట్టుకోవాలో నాకు బాగా తెలుసే. అర్ధ పావు బియ్య‌మ‌ని అక్క‌డి నుంచి చెప్పావో.. నువ్వు ఇంటికి వ‌చ్చాక పావు కిలో పిండాకుడు పెడ‌తాను. పింజారి పిసినారి మొహందానా అంటాడు. ఇక ఇల్లు ఎలా ఉంద‌య్యా అని అడ‌గ్గా.. నువ్వు లేవు క‌దా ప్ర‌శాంతంగా ఉంది అని ముర‌ళీకృష్ణ అంటాడు. ఇక రేపు నేను వ‌స్తాను అంటూ భాగ్యం చెప్ప‌గా.. అంత తొంద‌రెందుకు ఇంకా నాలుగు రోజులు అక్క‌డే ఉండు అని అంటాడు. ఇంటి మీద బెంగ‌గా ఉంది అని భాగ్యం అన‌గా.. ఇంటిని ఎవ‌డైనా సంక‌లో పెట్టుకొని పోతాడా అని అంటాడు. ఇక ఎప్ప‌టికైనా ఇక్క‌డ‌కు రావాల్సిందే క‌దా వ‌చ్చి చావు అని అంటాడు.

  మ‌రోవైపు విహారితో ఫోన్‌లో మాట్లాడే తుల‌సి.. ఇంకేం చెప్ప‌కండి విహారి గారు. ఇంత‌కాలం అప్పుడే పిల్ల‌లు వ‌ద్దు అనుకున్నాము. ఇప్పుడు వ‌ద్దు అనుకున్నాడు ఆ దేవుడు. ఇంకేం చెప్పొద్దు. మీరు డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయారు. ఈ మ‌ధ్య రాయ‌డం కూడా మానేశారు. ఇలా అయితే మీరు ఏం అయిపోతారేమోన‌ని భ‌యంగా ఉంది. అందుకే వ‌చ్చేస్తున్నాను. మీ ద‌గ్గ‌రికే వ‌చ్చేస్తున్నాను అని బ‌య‌లుదేరుతుంటుంది. అదే స‌మ‌యానికి మౌనిత బ‌య‌ట ఉంటుంది. దారి త‌ప్పి వ‌చ్చావా అని తుల‌సి అడ‌గ్గా.. దారి త‌ప్పిన వాళ్లు మాత్ర‌మే వ‌స్తారా అని మౌనిత అడుగుతుంది. నువ్వు వ‌చ్చావు క‌దా అని తుల‌సి అన‌గా.. నువ్వు అంటున్నావు మేడ‌మ్ ఎగిరిపోయిందా అని మౌనిత అంటుంది. గౌర‌వం ఎగిరిపోయింద‌ని తుల‌సి అన‌గా.. నువ్వు నా ద‌గ్గ‌ర ప‌నిచేశావ‌ని మ‌ర్చిపోతున్నావు అని మౌనిత అంటుంది. దానికి తుల‌సి నేను నీ ద‌గ్గ‌ర ప‌ని ఎప్పుడో మానేశాన‌ని నువ్వు మ‌ర్చిపోతున్నావు అని అంటుంది.

  ఇక మౌనిత.. గ‌తం ఎందుకులే, నీ భ‌విష్య‌త్ శూన్యం అయిపోయిందట క‌దా అని అంటుంది. దాంతో తుల‌సి షాక్‌కి గురై.. నాకు క‌నీసం నా భ‌ర్త ఉన్నాడు. నీకు ఎవరు ఉన్నారు, ఇంకొక‌రి భ‌ర్త‌నా. నీ భ‌విష్య‌త్ నీకు తెలీదు. నా భ‌విష్య‌త్ శూన్యం అయిపోయిందో, విహారి లాంటి భ‌ర్త దొరికినందుకు నా జ‌న్మ ధ‌న్యం అయ్యిందో నీకేం అర్థ‌మ‌వుతుంది అని అంటుంది. దాంతో మౌనిత‌.. నేను నీకు సాయం చేయ‌డానికి వ‌చ్చాను తుల‌సి అంటుంది. దానికి తులసి.. తోడేలు సాయం చేస్తానంటే లేడి పిల్ల‌లా వెంట రావ‌డానికి నేనేం దీపలాంటి ఆడ‌పిల్ల‌ను కాదు. ఏదైనా స‌హాయం చేయాల‌నుకుంటే నా త‌ల‌రాత ఎలాగూ మార్చ‌లేవు. దీప జోలికి వెళ్ల‌కుండా ఉంటే చాలు. డాక్ట‌ర్ బాబును బుద్దిగా కాపురం చేసుకోనిస్తే చాలు అని అంటుంది. దాంతో మౌనిత‌, తుల‌సిని కొట్టేందుకు వెళ్లి ఆగిపోతుంది. నా వ్య‌క్తిగ‌త విష‌యాలు నీకెందుకే అయినా నేను అడ్డుప‌డుతున్నానా అని మౌనిత అంటుండ‌గా.. అవును అని దీప ఎంట్రీ ఇస్తుంది.

  దాంతో మౌనిత మ‌న‌సులో.. అబ్బా ఈ దీప ఇప్పుడే రావాలా..తుల‌సి ప‌ర్మినెంట్‌గా మొగుడు ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతుంద‌ని నేను సంతోష‌ప‌డుతుంటే లాస్ట్ మినిట్‌లో దీప అడుగు పెట్టిందే . తుల‌సి వెళ్లిపోయాక వ‌చ్చి ఉంటే ఏ నిజం తెలిసేది కాదే అని అనుకుంటుంది. ఇక దీప‌.. ఏంటి నేను వ‌స్తాన‌నుకోలేదా అని అన‌గా.. నేను వ‌స్తాన‌ని నువ్వు అనుకున్నావా అని మౌనిత అంటుంది. దానికి దీప న‌వ్వుతూ.. ద‌రిద్రం నా క‌న్నా ఒక అడుగు ముందే ఉంటుంది క‌దా అని అన‌గా.. ఎప్పుడూ నేనే ముందంజలో ఉంటాన‌ని ఒప్పుకున్నావు క‌దా అని మౌనిత అంటుంది. దానికి దీప‌.. నీకు అలా అర్థ‌మైందా అని అంటుంది. ఇక మౌనిత‌.. నేను కూర్చుంటాను మీరు మాట్లాడుకోండి అని సోఫాలో కూర్చుంటుంది. దాంతో దీప‌.. ద‌రిద్రం గుమ్మంలో దిష్ట వేస్తానంటోంది తుల‌సి అన‌గా.. నువ్వు త‌రిమికొట్టే రోజు త్వ‌ర‌లోనే వ‌స్తుందిలే దీప అని తుల‌సి అంటుంది. ఇక రెండు అమాయ‌క జీవాలు ఎదురెదురుగా మాట్లాడుకుంటున్న‌ట్లు ఉంద‌ని మౌనిత అనగా.. మాయ తెలియ‌ని వాళ్లు అమాయ‌కులు కాదు. ఏ మ‌ర్మం ఎరుగ‌ని వాళ్లు. నీ క‌ళ్ల‌కు అన్ని రివ‌ర్స్‌లో క‌నిపిస్తూ ఉన్నాయి. క‌ళ్ల డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి కుళ్లు త‌గ్గ‌డానికి మందు రాయించుకో. ఇగో త‌గ్గించుకొని ఇంటికెళ్లు అని దీప అంటుంది.

  ఇక మీరంతా మేధావులన్న భ్ర‌మ‌లో ఉంటారా.. ప‌క్క వాళ్లు ఇలా ఉండాలి, అలా బ్ర‌త‌కాలి, ఇగో చంపుకోవాలి, అహంకారం వ‌దులుకోవాలి అంటూ నీతులు చెబుతుంటారు అని మౌనిత అంటుంది. దానికి దీప.. లేదు లేదు.. నీకే ప్ర‌తి ఒక్క‌రి మీద చిన్న చూపు. నా భ‌ర్త నీ మాట వింటాడ‌ని, నా మాట విన‌డు అని.. మా అత్త‌య్య కొడుకు కోసం గొడ‌వ‌లు ప‌డటం మానేసింద‌ని అందువ‌ల్ల నీకు కొత్త‌గా కొమ్ములు వ‌చ్చాయ‌ని నువ్వేదో భ్ర‌మ‌లో బ్ర‌తికేస్తున్నావు. కానీ ఒక్క‌టి గుర్తు పెట్టుకో. సొంత భ‌ర్త‌ను త‌ప్ప‌, ప‌రాయి ఆడ‌దాని భ‌ర్త‌ను కోరుకున్న ఏ ఆడ‌ది అయినా ఎప్ప‌టికీ ఇల్లాలు అనిపించుకోదు, వెలయాలితో స‌మానం అనిపించుకుంటుంది. అందువ‌ల్ల నువ్వు ఎవ్వ‌రినీ చిన్న చూపు చూడ‌కు. అస్స‌లు చూపే ఉండదు. పాపం త‌గిలి క‌ళ్లు పోతాయి క‌దా. ఎన్ని చూడ‌లేదు. పైదాక వెళ్లేదాక ఏ దేవుడు ఆగ‌డం లేదు. ఇక్క‌డే వెయ్యాల్సిన శిక్ష వేస్తూనే ఉంటారు. నీకు ఆ శిక్ష ప‌డాల్సిన టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది అని అంటుంది.

  దానికి మౌనిత‌.. టైమ్ డిసైడ్ చేయాల్సింది నువ్వు నేను కాదు అని అన‌గా.. అవును అది డిసైడ్ చేయ‌డానికి దేవుడు ఉన్నాడు అని తుల‌సి అంటుంది. దాంతో మౌనిత ఆవేశంగా లేచి.. ఏంటే నువ్వు కూడా నాకు నీతులు చెబుతున్నావు. క‌విని పెళ్లి చేసుకున్నంత మాత్రానా నువ్వు క‌వ‌యిత్రివి అయిపోతావా.. డాక్ట‌ర్‌ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన దీప డాక్టర్ అయిపోతుందా.. నా ద‌గ్గ‌ర ప‌ని చేసిన న‌ర్సువు నువ్వు. నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి.. నేనొక డాక్ట‌ర్‌ని అని అంటుడ‌గా.. అయితే ఏంటే నీ గొప్ప అని దీప అంటుంది. దాంతో మౌనిత‌.. ఆగు. నువ్వు మాట‌ల వ‌ర‌కే. న‌న్ను ఏం చేయ‌లేవు. మీ అత్త అండ చూసుకొని రెచ్చిపోతున్నావు జాగ్ర‌త్త‌. జ‌రిగిందంతా వీడియో రికార్డు చేశాను. అది ఇప్పుడు మీ అత్త‌కు ఫార్వ‌ర్డ్ చేస్తాను. ఏం చేస్తారో చూస్తా అని అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. ఆ త‌రువాత దీప‌.. దీన్నే ఇంగ్లీష్‌లో ఫ్ర‌స్టేష‌న్ అంటారేమో.. దాని సంగ‌తి వ‌దిలేయ్ తుల‌సి. నువ్వు నా కోసం వ‌చ్చావ‌ని నాన్న చెప్పాడు. ఏదైనా ప‌ని మీద వ‌చ్చావా అని అడుగుతుంది.

  దానికి తుల‌సి.. అవును. కొన్ని జ‌న్మ‌లు వాళ్ల‌కు వాళ్లు ఉప‌యోగ‌ప‌డ‌క‌పోయినా ఇంకొక‌రికైనా ఉప‌యోగ‌ప‌డతాయి అని అంటుంది. ఏమైంది అలా మాట్లాడుతున్నావేంటి.. అని దీప అడ‌గ్గా.. నా నావ దాటిపోయింది. అయినా న‌దిని దాటాలి. అందుకోసం ఇది చివ‌రి ప్ర‌యాణం అని తుల‌సి అంటుంది. ఈ ప్రయాణం ఎక్క‌డికీ అని దీప అడగ్గా.. అగ్ని సాక్షిగా ప్ర‌మాణం చేసిన నా భ‌ర్త దగ్గ‌ర‌కు అంటుంది. ఇక నాకేం అర్థం కావ‌డం లేద‌ని దీప అన‌గా.. నా ప‌రిస్థితి ఏంటో నాకు అర్థం కావ‌డం లేదు. నేను చీక‌ట్లో ఉన్నాను. కానీ నా చేతిలో కాగ‌డా ఉంది. ఆ వెలుగు నాకు ప‌నికి రాదు. కానీ మ‌రొక్క‌రికి ప‌నికి వస్తుంది. నాకేం గ‌మ్యం తెలీదు. కానీ మ‌రొక‌రి క‌థ‌కు నేనే గ‌మ్యం చూపించ‌బోతున్నాను. చాలా చిత్ర‌మైన ప‌రిస్థితి నాది. అయినా ఒక మూల చిన్న ఆనందం. ఈ జ‌న్మ సార్థ‌కం అయ్యే అవ‌కాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడు అని తుల‌సి అంటుంది.

  ఇక దీప.. ఆ ఒక్కరు ఎవ‌రు అని అడ‌గ్గా.. నువ్వే అని తుల‌సి చెబుతుంది. ఏమంటున్నావు తుల‌సి అని దీప ప్ర‌శ్నించ‌గా.. నీకు నా జ‌న్మ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో చెప్పే ముందు నా జ‌న్మ ఎందుకు ఇలా నిస్సారంగా అయ్యిందో చెప్పాలి. నాకు ఈ జ‌న్మ‌లో పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేదు దీప అని తుల‌సి అంటుంది. దాంతో తుల‌సి అన్ని పరీక్ష‌లు చేయించుకున్నావా.. అన్ని మందులు వాడావా.. వేరే డాక్ట‌ర్‌ని క‌ల‌వ‌క‌పోయావా.. ఎందుకు అప్పుడే ఇంత నిరాశ‌కు గురి అయ్యావు. వైద్య విఙ్ఞానం ఇంత అభివృద్ధి సాధించిందే అది కూడా నువ్వు ఒక న‌ర్సువు అయ్యి తెలుసుకోలేక‌పోయావా అని దీప అడుగుతుంది. దానికి స‌మ‌స్య నాలో లేదు దీప‌. విహారికి. ఆయ‌న‌కు ఈ జీవితంలో పిల్ల‌లు పుట్టరు అని తుల‌సి చెబుతుంది.

  ఆ త‌ర‌వాత ఇన్నాళ్లు పిల్ల‌లు వ‌ద్ద‌ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాము. ఇక కావాల‌నుకున్నా ఆల‌స్య‌మవుతుంద‌ని పరీక్ష‌లు చేయించుకున్నాము అందులో తేలింది. గుండె రాయి చేసుకున్నాను. నా భ‌ర్త‌నే నాకు ముఖ్యం అనుకున్నాను. దేవుడు నాకు పిల్ల‌ల‌ను క‌నే రాత రాయ‌లేదు. కానీ దేవుడినే భ‌ర్త‌గా ఇచ్చాడు. ఈ జ‌న్మ‌కు అది చాలానుకున్నా. అందుకే విహారి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతున్నాను అని తుల‌సి అంటుంది. దానికి దీప‌.. మాతృత్వం అనేది గొప్ప వ‌రం. ఆ వ‌రం నీకు ఆ దేవుడు ఇవ్వ‌క‌పోయినా దేవుడిని నిందించ‌డం లేదు. భ‌ర్త‌నే దేవుడిగా చూసుకునే గొప్ప మ‌న‌సును ఇచ్చాడు. నువ్వు గుండె రాయి చేసుకోలేదు. హృద‌యాన్ని విశాలం చేసుకున్నావు. నీ క‌న్నా గొప్ప వాళ్లు ఎవ‌రుంటారు అని అంటుంది.

  వెంట‌నే తుల‌సి.. ఇది నాకు దుర‌దృష్టంగా మారిందేమో కానీ నీకు అదృష్టంగా మార‌బోతుంది దీప‌. ఎందుకంటే డాక్ట‌ర్ బాబు మ‌న‌సులో ఏ విష‌యంలో అయితే అనుమానం మొద‌లైందో ఆ అనుమానానికి అంకుర‌మే జ‌ర‌గ‌లేదు అని నిరూపించుకోవ‌డానికి ఇదో అవ‌కాశం.విశాల‌మైన మ‌న‌సు నాది కాదు నీది. ఎందుకంటే నేను చెప్పే వ‌ర‌కు నువ్వు ఈ విష‌యం గుర్తించ‌నే లేదు. నా మీద సానుభూతి చూపించావు కానీ. ఈ నిజం నీకు ఉప‌యోగ‌ప‌డుతుందని స్వార్థంగా ఆలోచించ‌లేదు. నీకు దేవుడే దొరికాడు. ఆ దేవుడికి, నీకు మ‌ధ్య ఓ ప‌దేళ్ల పాటు ఎడ‌బాటు ఎందుకు క‌లిగిందో ఆ కార‌ణం నిజం కాదు. ఇది నీకు వ‌రం. నాకు శాపం అయితే ఏంటి దీప అని అంటుంది.

  దానికి దీప‌.. తుల‌సి ఏంటి ఛిత్ర‌మైన ప‌రిస్థితి. ఎదుటివారి దుర‌దృష్టంలో నా అదృష్టం వెతుక్కునే ప‌రిస్థితుల్లో ఎందుకు ప‌డేశాడు దేవుడు. నా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఇంకో మార్గంలో చూపించి ఉంటే ఎంత బావుండేది. ఇప్పుడు నేను విహారి విష‌యం బ‌య‌ట‌పెడితే త‌ప్ప డాక్ట‌ర్ బాబు న‌మ్మ‌డ‌ని స్వార్థంగా ఆలోచించాలా అని అంటుంది. దాంతో తుల‌సి.. అవును దీప‌. నువ్వు ఇప్పుడు కూడా నీ బ్ర‌తుకుని, నీ కాపురాన్ని చ‌క్క‌దిద్దుకోలేక‌పోతే ఆ దేవుడు నీకు ఇచ్చిన ఈ అద్భుత అవ‌కాశం వృధా అవుతుంది. ఈ నిజం నీ కాపురానికి ఉప‌యోగ‌ప‌డితే నాకు అంత‌క‌న్నా కావాల్సింది ఏం లేదు అని అంటుంది. కార్తీక దీపం కొన‌సాగుతోంది.

  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు