Home /News /movies /

KARTHIKA DEEPAM SERIAL UPDATE DEEPA IS IN HAPPY KARTHIK TAKES KEY DECISION MNJ

Karthika Deepam: మోనిత చెప్పిందే క‌రెక్ట్ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చిన కార్తీక్.. దీప ఎలా న‌మ్మిస్తుంది

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. (Karthika Deepam)

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. (Karthika Deepam)

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో కార్తీక్‌కు అత్త‌య్య నిజాన్ని చెప్పిందా.. చెప్తే డాక్ట‌ర్ బాబు ఎలా రియాక్ట్ అయ్యారు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది దీప‌. అదే స‌మ‌యానికి ముర‌ళీకృష్ణ రాగా.. ఏదో ఆందోళ‌న‌గా క‌నిపిస్తుంది.

ఇంకా చదవండి ...
  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో కార్తీక్‌కు అత్త‌య్య నిజాన్ని చెప్పిందా.. చెప్తే డాక్ట‌ర్ బాబు ఎలా రియాక్ట్ అయ్యారు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది దీప‌. అదే స‌మ‌యానికి ముర‌ళీకృష్ణ రాగా.. ఏదో ఆందోళ‌న‌గా క‌నిపిస్తుంది. కూతురి ఆందోళ‌న‌ను ప‌సిగ‌ట్టిన ముర‌ళీకృష్ణ‌.. ఏమైంద‌మ్మా అని అడుగుతాడు. దాంతో త‌న బాధ‌ను బ‌య‌ట‌కు చెబుతుంది దీప‌. ఇవాళ్టి ఎపిసోడ్‌లో వారిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ కొన‌సాగుతుంది. ముర‌ళీకృష్ణతో దీప మాట్లాడుతూ.. ఇది నా జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య నాన్న‌. భ‌గ‌వంతుడు ఒక అవ‌కాశం ఇచ్చింది. ఆ అవ‌కాశాన్ని మా అత్త గారు వ‌దులుకోవ‌ద్ద‌ని చెప్పారు. నా త‌ర‌ఫున నిల‌బ‌డి నా కాపురాన్ని నిలబెట్టే ప్ర‌తినిధిలాగా మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయ‌డానికి వెళ్లారు. పాసో, ఫెయిలో అర్థం కాక నలిగిపోతున్నాను అని ఏడుస్తూ ఉంటుంది. దానికి ముర‌ళీకృష్ణ‌.. అవునా, నిజ‌మా. అంత మంచి అవ‌కాశం నీకు ఏ రూపంలో వ‌చ్చింద‌మ్మా అని అడుగుతాడు.

  వెంట‌నే దీప‌.. తుల‌సి రూపంలో అని చెబుతూ విహారికి పిల్ల‌లు పుట్ట‌ర‌ని త‌న‌కు తుల‌సి చెప్పిన విష‌యాన్ని, కార్తీక్‌కి సౌంద‌ర్య చెప్తాన‌న్న విష‌యాన్ని చెబుతుంది. ఆ త‌రువాత ఎక్క‌డ మూలం ప‌డిందో అక్క‌డే ప‌రిష్కారం దొరికింది. అక్క‌డ నాకొక దారి దొరికింది. ఇది నా ప‌విత్ర‌త‌ను నిరూపించుకోవ‌డానికి ఆ దేవుడు ఇచ్చిన అవ‌కాశ‌మ‌ని అత్త‌య్య చెప్పింది. నా మ‌న‌సు ఒప్పుకోలేదు. సాటి స్త్రీ కాపురాన్ని బ‌య‌ట పెట్టి నా కాపురం నిల‌బెట్టుకోవాలా అని వెన‌కాడాను. కానీ అత్త‌య్య నాకు అర్థ‌మ‌య్యేలా చేసి ఆయ‌న‌తో మాట్లాడ‌తా అని వెళ్లారు. ఆవిడ నాతో వ‌చ్చినంత‌వ‌ర‌కు చాలా ధైర్యంగా, న‌మ్మ‌కంగా ఉన్నాను. ఆవిడ వెళ్లాకే ఒంటరిని అయిపోయిన‌ట్లు అనిపించింది. స‌మ‌యానికి నువ్వు రాక‌పోతే ఏమైపోయేదాన్నో అని చెబుతుంది.

  ఇక ముర‌ళీకృష్ణ‌.. తుల‌సిని నీ ద‌గ్గ‌ర‌కు పంపించిన‌ట్లు న‌న్ను కూడా ఆ దేవుడు పంపించి ఉంటాడ‌మ్మా. నువ్వేం భ‌య‌ప‌డ‌కు. డాక్ట‌ర్ బాబు మంచివాడు, సంస్కారం తెలిసిన‌వాడు. ఏదో మాయ క‌మ్మేసి ఇలా మారిపోయాడు కానీ ఆయ‌న‌లో మిగిలిన‌వ‌న్నీ సుగుణాలే. మీ అత్త‌య్య గారు అర్థ‌మ‌య్యేలా చెబితే అర్థం చేసుకుంటార‌మ్మా అని అంటాడు. వెంట‌నే దీప ఒక‌వేళ న‌మ్మ‌క‌పోతే, ఇది కూడా మేం క‌ల్పించిన క‌ట్టుక‌థే అనుకుంటే నా గ‌తి ఏంటి నాన్న‌. పిల్ల‌లు ఎంతో ఆశ‌గా, ఆతృత‌గా చూస్తున్నారు. వాళ్ల‌కు నేను ఏం స‌మాధానం చెప్పాలి. ఇంకెన్నేళ్లు క‌లుస్తామ‌ని మ‌భ్య‌పెట్టాలి. ఏం అర్థం కావడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది.

  వెంట‌నే ముర‌ళీకృష్ణ భార్య అంటే అబ‌ద్ధం చెబుతుంది అనుకోవ‌చ్చు. కానీ క‌న్న‌త‌ల్లి కూడా అబ‌ద్దం చెబుతుందని, అది ఇలాంటి విష‌యంలో.. ఏ కొడుకు అనుకోడ‌మ్మా. చూద్దాం. ఏమీ కాద‌మ్మా. అంతా మంచి జ‌రుగుతుంది. అల్లుడు గారిలో అంత‌ర్మ‌థ‌నం మొద‌ల‌య్యే ఉంటుంది అని అంటాడు.

  ఇక కార్తీక్.. సౌంద‌ర్య మోనిత‌, తుల‌సి మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక పిల్ల‌లిద్ద‌రు అక్క‌డ‌కు రాగా.. ఏంటి ఇద్ద‌రికీ ఆక‌లి వేయ‌డం లేదా అని కార్తీక్ అడ‌గ్గా.. అందుకే వ‌చ్చాము అని సౌర్య అంటుంది. హిమ కూడా.. నీతో క‌లిసి భోజ‌నం చేసి చాలా రోజులు అయ్యింది. ఇవాళ నాతో తినాలి అని అంటుంది. వెంట‌నే సౌర్య‌.. స‌ర‌దాగా ఓ ప‌ని చేద్దామా. పైన చాప వేసుకొని వెన్నెల్లో కూర్చొని ముగ్గురం భోజనం చేద్దామా అని అన‌గా.. ఓకే అను డాడీ ప్లీజ్ డాడీ అని హిమ అంటుంది. దానికి ఒప్పుకున్న కార్తీక్.. కానీ ఒక కండిష‌న్ నిన్న డ్యాన్స్ చేశావు చూడు. మ‌ళ్లీ అలాగే డ్యాన్స్ చేయాలి అని హిమ‌ను అడుగుతాడు. దానికి హిమ ఒప్పుకోగా.. ఏర్పాట్లు చేసేందుకు హిమ‌, సౌర్య వెళ‌తారు.

  మ‌రోవైపు మోనిత‌.. ఇంట్లో ప్రియ‌మ‌ణిని పిలుస్తుంది. ఏం చేస్తున్నావు అని అడ‌గ్గా.. ముద్ద‌ప‌ప్పును వేడి చేసుకొని వ‌స్తున్నాను అని చెబుతుంది. ఇక మోనిత‌.. ముద్ద‌ప‌ప్పు తిన‌కుండా ఇంకో కూర వేసుకుంటూ ఉండ‌గా.. ఏంట‌మ్మా ముద్ద‌ప‌ప్పు అడిగారు క‌దా అని ప్రియ‌మ‌ణి అంటుంది. దానికి మోనిత‌.. నేతి బీర‌కాయ‌లో నెయ్యి ఉంటుందా అన‌గా.. ఉండ‌ద‌ని ప్రియ‌మ‌ణి చెబుతుంది. ఇక పాల‌కూర‌లో పాలు ఉంటాయా అని మోనిత అడ‌గ్గా.. ఉండ‌ద‌ని ప్రియ‌మ‌ణి అంటుంది. ఇక మోనిత‌.. నేను మాట్లాడే మాట‌ల్లో కూడా ఒక‌సారి అర్థం ప‌ర్థం ఉండ‌దు అని చెప్ప‌గా.. ఎంత క‌రెక్ట్‌గా చెప్పార‌మ్మా అని ప్రియ‌మ‌ణి చెబుతుంది. ఆ త‌రువాత నేతి బీర‌కాయ‌లో నెయ్యి ఉండ‌దేమో గానీ.. ఈ గిన్నెలో ఉంది వేయ‌గా అని అడిగి.. ఈ ముద్ద‌ప‌ప్పును ఏం చేయాల‌ని అడుగుతుంది. ఫ్రిజ్‌లో పెట్టి రేపు ఆ ముద్ద‌పప్పును పిలిచి పెట్టు అని మోనిత అన‌గా.. కార్తీక్ అయ్య‌నా అని ప్రియ‌మ‌ణి అంటుంది. దానికి మోనిత‌.. నేనేదో ముద్దుగా పిలుచుకున్నా. నువ్వు ఫిక్స్ అవుతావా అని మోనిత అన‌గా.. అయ్యో నేను అలా ఎందుకనుకుంటాను. ముద్ద‌పప్పు ఆవ‌కాయ‌లా మీ జోడీ బావుంటుంద‌మ్మా అని ప్రియ‌మ‌ణి అంటుంది. క‌రెక్ట్‌గా చెప్పావ‌ని మోనిత అన‌గా.. అవును కార్తీక్ అయ్య వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న ఉన్నార‌ని తెలీక నేను ఏదో వాగేశాను అని ప్రియ‌మ‌ణి చెబుతుండ‌గా.. ఏం వాగావు అని మోనిత అడ‌గ్గా.. మీరు విన్నారు క‌ద‌మ్మా. అనుమానం వ‌స్తే చ‌చ్చే దాక పోదు అని. ఆ దీప‌మ్మ ఏం చెప్పినా కార్తీక్ అయ్య న‌మ్మ‌ను గాక న‌మ్మ‌డు అని. నా మాట‌లు విని కార్తీక్ అయ్య కోపం తెచ్చుకొని ఉంటారా అని ప్రియ‌మ‌ణి అంటుంది. దానికి మోనిత‌.. ఎందుకు తెచ్చుకుంటారు. జ‌రుగుతున్న‌ది అదే క‌దా. కాకుంటే ఆ అనుమానం చ‌చ్చిపోకుండా నేను కాప‌లా కాస్తున్నాను అని చెబుతుంది. అర్థం కాలేద‌ని ప్రియ‌మ‌ణి అడ‌గ్గా.. ఇప్పుడు క‌ట్టె కాలాలంటే ఏం చేయాలి అని మోనిత అడ‌గ్గా నిప్పు రాయాలని ప్రియ‌మ‌ణి చెబుతుంది. దానికి అది నేనే అని చెప్పిన మోనిత‌.. ఆ నిప్పు భ‌గ్గుమ‌నాలంటే అని మ‌ళ్లీ అడుగుతుంది.

  దానికి ప్రియ‌మ‌ణి పెట్రోల్ పోయాల‌ని చెప్ప‌గా.. అదీ నేనే. చిన్న అగ్గి క‌ణం పెద్ద గ‌డ్డి వాము మీద ప‌డితే అది మెల్ల‌మెల్ల‌గా రాజుకోవాలంటే అని మోనిత అడ‌గ్గా.. పెద్ద గాలి రావాల‌ని ప్రిమ‌య‌ణి చెబుతుంది. దానికి న‌వ్వుతూ ఆ సుడి గాలి నేనే. నేను ర‌గిలించిన కార్చిచ్చు ఆర‌కుండా పుల్ల ఎగ‌దోస్తూ చ‌లి కాచుకుంటున్నా అని మోనిత అంటుంది. వెంట‌నే ప్రియ‌మ‌ణి.. ఒక్కోసారి అగ్గిర‌వ్వ మ‌న‌మీద ప‌డి కూడా మ‌న‌ల్ని త‌గ‌ల‌బెట్టేస్తుంద‌మ్మా అని అన‌గా.. ఈ మోనిత అంత‌వ‌ర‌కు రానివ్వ‌దే. నా జాగ్ర‌త్త‌లు నేను తీసుకుంటా అని మోనిత చెబుతుంది. ఇక అర్థ‌మైంద‌మ్మా అన్న ప్రియ‌మ‌ణి.. ఇంత‌కు గుళ్లో ఏం జ‌రిగింద‌ని అడుగుతుంది. అప్పుడు గుళ్లో జ‌రిగిన దాన్ని గుర్తు చేసుకొని ప్రియ‌మ‌ణిని చెంప చెల్లుమ‌నిపించి, వెళ్లి నీ ప‌ని చూసుకో అని అంటుంది.

  మ‌రోవైపు కార్తీక్..సౌంద‌ర్య, దీప‌ మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నిజ‌మా.. అబ‌ద్ద‌మా.. నిజ‌మై ఉంటే దీప ముందు నేను నిల‌బ‌డ‌గ‌ల‌నా..పిల్ల‌ల ముందు త‌లెత్తుకోగ‌ల‌నా.. నా అంత మూర్ఖుడు ఎవ‌డైనా ఉంటాడా.. ఇంత చ‌దువు, సంస్కారం ఉన్న నేను ఇన్నాళ్లు ఒక భ్ర‌మ‌లో ఉన్నానా..ఈ నిజం తెలుసుకునేదాకా నిద్ర‌పట్ట‌దు. మ‌న‌శ్శాంతి దొర‌క‌దు అనుకుంటూ అక్క‌డి నుంచి వెళ‌తాడు. ఇక సౌర్య‌, హిమ నాన్న ఏరీ అనుకుంటూ వెళతారు.

  మ‌రోవైపు ఇంట్లో సామ‌న్లు అన్నీ స‌ర్దుతూ ఉండే దీప‌.. ఏం కాదు. డాక్ట‌ర్ బాబు న‌మ్ముతాడు. అత్త‌య్య న‌మ్మేలా చెబుతుంది. తుల‌సి చెప్పిన విష‌యం క‌న్నా సాక్ష్యం ఇంకేముంటుంది. అది నా కాపురాన్ని త‌ప్ప‌కుండా నిల‌బెడుతుంది. పాపం తుల‌సి అంత బాధ‌లో కూడా నా మంచి గురించే ఆలోచించింది. మీ నాన్న మ‌న అంద‌రినీ తీసుకెళ‌తాడు. ఈ సామాన్తు అనాథ ఆశ్ర‌మానికి ఇస్తాడు. పేద సామ‌న్ల‌తో ప‌నేముంది అని హిమ‌, సౌర్య ఫొటోల‌కు ముద్దు పెడుతుంది. ఇక ఈ ఫొటోల‌ను ద‌ర్జాగా ఆ పెద్ద ఇంట్లో గోడ‌కు త‌గిలిస్తాను. చాలా ప‌నులున్నాయి. పాల ప్యాకెట్లు వ‌ద్ద‌ని చెప్పాలి. స‌రోజ‌క్క వాళ్ల భ‌ర్త‌కు అత్త‌య్య ఫ్యాక్ట‌రీలో ఉద్యోగం ఇప్పించాలి. వార‌ణాసికి మా కారులోనే హీరో కారుకు డ్రైవ‌ర్‌గా ఉద్యోగం ఇప్పించాలి. ఇంకా.. నేను ఏమిటేమిటో ఊహించుకుంటున్నాను. ఇవ‌న్నీ జ‌రుగుతాయా.. అత్త‌య్య చెప్తే ఆయ‌న న‌మ్ముతారా.. లేదు. ఆయ‌న‌కు మంచి, చెడు అన్నీ తెలుసు. న‌మ్మి తీరుతాడు. నా బ‌తుకు బాగుప‌డుతుంది. నా బిడ్డ‌లు కోటీశ్వ‌రుల మ‌న‌వ‌రాళ్ల‌లా గొప్ప బ‌తుకు, గొప్ప చ‌దువు, గొప్ప గొప్ప సంబంధాలు.. భ‌గ‌వంతుడా సంక‌ల్ప బ‌లానికి మించిని బ‌లం లేదంటారు. నా సంక‌ల్ప బ‌లం నెర‌వేరాలి. ఇక నీదే భారం . ఆయ‌న‌లో మార్పు రావాలి. ఆలోచ‌న మొద‌ల‌వ్వాలి. మేము క‌లిసిపోయే క్ష‌ణం తొంద‌ర‌గా రావాలి అని సంతోష‌ప‌డుతూ ఉంటుంది.

  ఇక కార్తీక్ కారులో వెళుతూ.. మోనిత‌, సౌంద‌ర్య మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అదే స‌మ‌యానికి మోనిత కాల్ చేసి డ్రైవింగ్‌లో ఉన్న‌ట్లు ఉన్నావు అని అడ‌గ్గా.. తుల‌సి ఇంటికి వెళుతున్నాను అని కార్తీక్ అంటాడు. దాంతో షాక్‌కి గురైన మోనిత దేనికి అన‌గా.. మ‌మ్మీ తుల‌సి విష‌యం చెప్పింది. ఎప్పుడూ వ‌న్ సైడ్ ఎందుకు ఆలోచించాలి. వాళ్లు ఏదో చెప్పాల‌నుకుంటున్నారు క‌దా అది కూడా తెలుసుకుందామ‌ని అని కార్తీక్ అంటాడు. వెంటనే మోనిత చెప్పాను క‌దా కార్తీక్.. వాళ్లేదో కొత్త డ్రామాకు తెర దించారని అన‌గా.. అదేదో తుల‌సి నోటి నుంచి వింటేనే ఒక క్లారిటీ వస్తుంది క‌దా. ఏం చెబుతుందో వింటాను. మాట్లాడాక నీకు ఫోన్ చేస్తాను.. బై అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక మోనిత‌.. తుల‌సి ఇంకా ఊరెళ్ల‌లేదా.. ఇక్క‌డే ఉందా.. తుల‌సి మాట‌ల‌కు కార్తీక్ క‌న్విన్స్ అయితే ఆలోచించ‌డం మొద‌లుపెడితే.. దీప నిర్దోషి అని తేలితే నా గ‌తి ఏంటి.. మై గాడ్ అంటూ మోనిత టెన్ష‌న్ ప‌డుతూ ఉంటుంది.

  ఇక పైనుంచి వ‌చ్చే హిమ‌, సౌర్య‌లు.. డాడీ క‌నిపించారా అని అడుగుతారు. పైకి ర‌మ్మ‌న్నారు, తీరా వెళితే లేరు అని ఇద్ద‌రు చెబుతారు. అంతా వెత‌క‌మ‌ని ఆనంద‌రావు అన‌గా.. అంతా వెతికిన‌ట్లు ఇద్ద‌రు చెబుతారు. ఇక సౌంద‌ర్య, కార్తీక్‌కి ఫోన్ చేస్తుంది. అత‌డు కాల్ లిఫ్ట్ చేయ‌క‌పోగా.. ఏదో అర్జెంట్ అయితేగానీ వెళ్ల‌డు. మీతో చెప్పాడంటే వెంట‌నే వ‌స్తాడు అని సౌంద‌ర్య చెబుతుంది. దానికి ఆ ఇద్ద‌రు డాడీ వ‌చ్చే దాకా ఎదురుచూస్తాం. ఎంత రాత్రి అయినా ప‌ర్వాలేదు. నాన్నను రానివ్వండి అని సౌర్య‌, హిమ‌లు చెబుతారు. ఇక ఎక్క‌డికి వెళ్లాడ‌ని.. ఆనంద‌రావు, సౌంద‌ర్య ఆలోచిస్తుంటారు. తులసి విషయం దాన్ని చెప్పమంటే అది వినలేదు. నేను చెప్తుంటే వీడు వినలేదు. ఆ విష‌యం మీద వెళ్లి ఉంటాడా అని సౌంద‌ర్య అన‌గా.. ఏంటో ఏ క్షణాన ఏం జ‌రుగుతుందో తెలీడం లేదు ఈ ఇంట్లో అని ఆనంద‌రావు అంటాడు. ఇక సౌంద‌ర్య మ‌న‌సులో.. లేదు ఇలా వ‌దిలేయ‌డం క‌రెక్ట్ కాదు. ఏదో ఒక‌టి చేయాలి. చేస్తాను అని అనుకుంటుంది.

  మ‌రోవైపు కార్తీక్, తుల‌సి ఇంటికి వెళ్ల‌గా.. అక్క‌డ టూలెట్ బోర్డ్ ఉంటుంది. దాంతో కార్తీక్.. మోనిత చెప్పింది క‌రెక్ట్. వీళ్లు ఏదో కొత్త నాట‌కం మొద‌లుపెట్టారు. తుల‌సి కూడా దీప సానుభూతురాలే కాబ‌ట్టి నేనేదో ఎంక్వైరీ చేస్తాన‌ని జాగ్ర‌త్త ప‌డి తుల‌సిని ఇల్లు ఖాళీ చేయించార‌న్న మాట అని అనుకుంటాడు. ఇక అదే స‌మ‌యానికి ఇంటి ఓన‌ర్లు వ‌చ్చి తుల‌సి ఊరేళ్లిన‌ట్లు చెబుతారు. ఎక్క‌డికి వెళ్లింద‌ని కార్తీక్ అడ‌గ్గా.. ఎక్క‌డికో చెప్ప‌లేద‌ని వారంటారు. కార్తీక దీపం కొన‌సాగుతోంది.
  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు