Karthika Deepam: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ మరింత రసవత్తరంగా మారింది. నిన్నటి ఎపిసోడ్లో ఎవరికీ చెప్పకుండా మౌనిత ఇంటికి హిమ వెళుతుంది. మరోవైపు హిమ కనిపించక దీప, సౌర్య టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక కార్తీక్‌కి ఫోన్ చేసిన మౌనిత.. హిమ తన దగ్గర ఉందని చెబుతోంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్లో.. బిస్కెట్లు హిమ ముందు ఉంచిన మౌనిత, తినమని చెబుతుంది. దానికి హిమ.. నాకేం వద్దు, అమ్మ నా కోసం కంగారు పడుతోంది. నేను వెళ్లాలి అని చెబుతుంది. వెళ్తువు గానీ నువ్వు ఇక్కడ ఉన్నావని చెబితే డాడీ వస్తున్నాడు అని మౌనిత అంటుంది. డాడీకి ఎందుకు చెప్పారు అని హిమ అనగా.. మీ డాడీనే కదా నా దగ్గర ఉన్నావంటే ఏమీ అనరు అంటుంది. మీరు అమ్మ, నాన్నను త్వరగా కలపండి ప్లీజ్. నాన్న దగ్గర ఉంటే అమ్మ ఉండదు, అమ్మ దగ్గరుంటే నాన్న ఉండడు. నాకు ఇద్దరు కావాలి అని హిమ అనగా.. అసలు మౌనిత పుట్టిందే ఇలాంటి గొప్ప పని చేయడం కోసం.. ఈ ప్రపంచంలో డాక్టర్ బాబును, వంటలక్కకు కలపగలిగింది ఒక్క మౌనిత మాత్రమే తెలుసా అని మౌనిత అంటుంది. మీ మొహం ఏం కాదు. నిజమేనే నీ బండారం బయటపెడితే ఆ వంటలక్క, డాక్టర్ బాబు కలుస్తారని.. నిన్ను తన్ని పోయిన రోజే దీపమ్మ చెప్పింది కదా. వాళ్లు కలవాలంటే నీ చేతిల్లోనే ఉంది సుమా అని ప్రియమణి మనసులో అనుకుంటుంది.

కార్తీక దీపం(Hot Star)
ఇక హిమ.. ఫోన్ చేస్తే సౌర్యకు తెలుస్తుంది. అమ్మకు చెప్పి వద్దామంటే వద్దంటుంది. వారణాసి ఆటోలో వద్దామంటే అందరికీ చెప్పేస్తాడు. అందుకే వెంకటేష్ ఆటోలో వచ్చాను అని హిమ అనగా.. ఎలా బ్రతికిన దానివి ఎలా బ్రతుకుతున్నావమ్మా.. ముందు వెళ్లి ఆ ఆటో వాడిని పంపించిరా అని మౌనిత అంటుంది. మరి నేను ఎలా వెళ్లాలి అని హిమ అడగ్గా.. మీ డాడీ వస్తున్నాడుగా డ్రాప్ చేసి వస్తారులే. వెంకటేష్‌ని ఇంటి ముందు చూస్తే మీ డాడీకి కోపం వస్తుంది. వెళ్లు అని మౌనిత చెప్పగా.. బయటకు వెళ్లిన హిమ.. నేను ఆటోలో రావడం లేదు అని చెబుతుంది. ఎందుకమ్మా అమ్మ ఎదురుచూస్తుంటుంది అని
వెంకటేష్ చెప్పగా.. అదే సమయానికి కారులో కార్తీక్ దిగుతాడు. హిమను దగ్గరకు తీసుకొని హత్తుకుంటాడు. ఏంటమ్మా ఇది కాసేపు గుండె ఆగినంత పని అయ్యింది. ఎందుకు ఇక్కడకు వచ్చావు అని అడుగుతాడు.
ఏరా నువ్వేనా తీసుకువచ్చింది అని వెంకటేష్‌ని అడగ్గా.. అవును డాక్టర్ బాబు అని అంటాడు. నీకు బుద్ది ఉందా..? వాళ్ల అమ్మకు చెప్పి తీసుకురావాలని తెలీదు అని కార్తీక్ అడగ్గా.. అదేంటి నువ్వు అమ్మకు చెప్పి వచ్చానని చెప్పావు కదా హిమ అని వెంకటేష్ అడుగుతాడు. దానికి హిమ.. అలా చెప్పకపోతే నువ్వు రావని అని అంటుంది. వెంటనే వెంకటేష్.. దీపకు చెప్పి రాలేదని నాకు తెలీదు డాక్టర్ బాబు అంటాడు. ఏడ్చావులే.. ఇంకోసారి పిల్లలను ఎక్కడికైనా తీసుకొని వెళ్లేముందు మీ దీపక్క పర్మిషన్ తీసుకొని వెళ్లు.. ఇప్పుడు వెళ్లు అంటాడు. మరి హిమ అని వెంకటేష్ అడగ్గా.. తంతాను రోయ్ వెళ్లు అని కార్తీక్ అంటాడు. ఇక హిమను లోపలికి తీసుకువెళ్లిన కార్తీక్.. నువ్వు ఫోన్ చేయకపోయి ఉంటే ఇంకా కంగారు పడేవాడిని అని అంటాడు. ఎవరికీ చెప్పకుండా వచ్చిందంటే నాకు భయం వేసింది. అసలే ఆ వంటలక్క రెబల్‌గా తిరుగుతోంది. నా మీద ఎక్కడ కిడ్నాప్ కేసు పెడుతుందో తెలీదు కదా. అందుకే వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేశాను అని మౌనిత అంటుంది.
ఇక కార్తీక్.. ఏంటి నాన్న ఇది. ఇంట్లో చెప్పి రాకపోతే ఎంత కంగారు పడతారు. ఆ రౌడీ ఏకంగా ఏడ్చేస్తోంది. ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చేయకు. నీకు ఎక్కడికైనా వెళ్లాలని ఉంటే నాకు ఫోన్ చేసి నేను వచ్చి తీసుకెళతాను. ఇంతమంది డ్రైవర్లు, ఇన్ని కార్లు ఉండగా.. నువ్వు ఆటోలో తిరగడం ఏంటిరా.. సరే అయ్యిందేదో అయ్యింది అని కార్తీక్, ప్రియమణిని పిలుస్తాడు. గీజర్ ఆన్ చేసి పెట్టు అని వెళ్లి ప్రెష్ అయ్యిరా అని హిమను పంపిస్తాడు. పాప వెళ్లి వచ్చే సరికి దోసెలు, దోసకాయ పచ్చడి చేసి పెట్టు అని అని ప్రియమణికి చెబుతాడు. ఇక హిమను ప్రియమణి తీసుకొని వెళుతుంది.
మరోవైపు హిమ ఫొటోలను చూసుకుంటూ కార్తీక్ చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ బాదపడుతూ ఉంటుంది దీప. ఎక్కడికి వెళ్లావు హిమ, ఎందుకు వెళ్లావు. నువ్వు నావైపు అడుగులు వేస్తే నీ తల్లి కాపురం నిలబెట్టడానికి.. నువ్వు ఒక అడుగు ముందుకు వేశావు అనుకున్నాను. నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అనుకొని సంతోషపడ్డాను. నీ మీద మీ నాన్న పెంచుకున్న ప్రేమ మీద మాత్రమే నా కాపురం నిలబడాలన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే.. ఇది ఇల్లు, ఇల్లాలు, పిల్లలు వీటి చుట్టూ తిరిగే సమస్య కాదు. ఇది మా భార్యభర్తల సమస్య. నా పవిత్రత నిరూపించుకుంటే తప్ప మీ నాన్న ముందు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో నిలబడలేను. ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడలేను. జీవితాంతం ఆయన ఎదురుగా తలెత్తుకొని తిరగాలంటే నా మీద పడ్డ నింద చెరిపేసుకోవాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అప్పటిదాకా నన్ను పక్కకు మళ్లించొద్దమ్మా.. త్వరగా రా అని ఏడుస్తూ ఉంటుంది.
ఇక అప్పుడే లోపలికి వచ్చిన సౌర్య.. ఏమైందమ్మా హిమ ఫోన్ చేసిందా.. నాన్నకు కూడా ఫోన్ చేయలేదా అని అడుగుతుంది. ఆయనకు ఆయన కూతురు ఎక్కడుందో తెలిసిపోయింది. అందుకే ఆయన ప్రశాంతంగా ఉన్నారు. కన్నతల్లిని నేను ఎంత ఆందోళన పడుతున్నానో ఆయనకేం తెలుసు. పిల్లలను నేను బాధ్యతగా కనిపెట్టుకోనందుకు ఎంత అరిచారో చూశావు కదా అని అంటుంది. నాన్న బాగా కోప్పడ్డారమ్మా. భయమేసింది అని సౌర్య అనగా.. ఆయనకు హిమ మీద అంత ప్రేమ ఉన్నందుకు సంతోషపడాలో, అదే ప్రేమ నీ మీద, నా మీద లేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఎన్ని విధాలుగా నా మీద కో్పం తెచ్చుకోవాలో అన్ని విధాలుగా కోపం తెచ్చుకుంటున్నారు. కానీ మనకు తప్పదు అని దీప అనగా..హిమ ఎందుకిలా చేసింది. నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావు. నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను. అయినా చెప్పకుండా వెళ్లింది. తను కనపడకపోతే నాన్నకు నీ మీద కోపం వస్తుందని తెలిసి కూడా వెళ్లిపోయింది అని సౌర్య అంటుంది. పర్వాలేదమ్మా.. హిమ ఎక్కడో క్షేమంగా ఉంది. మీ నాన్న అక్కడికే వెళ్లారు. అందుకు ధైర్యంగా ఉంది. ఇక ఈ గొడవలు అంటావా..? వీటన్నింటికి సమాధానం చెప్పే రోజు దగ్గరికి వచ్చింది. ఈ కోపాలు, తాపాలు అంటావా.. వీటన్నింటికి ఆయన కూడా జవాబు చెబుతారు. చెప్పి తీరుతారు అని దీప అంటుంది. ఇక హిమ ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటుంది అని సౌర్య ఆలోచనలో పడుతుంది.

కార్తీక దీపం(Hot Star)
ఇక మౌనిత ఇంట్లో.. హిమ, కార్తీక్, మౌనిత డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు. తినమని హిమకు చెప్పగా.. డాడీ నేను ఇక్కడ ఉన్నానని అమ్మకు తెలీదు కదా. కంగారు పడుతూ ఉంటుంది. ఒకసారి ఫోన్ చేయవా అని అడుగుతుంది. వెంటనే కార్తీక్ ఫోన్ ఇచ్చి.. చేయమ్మా అంటాడు. నువ్వే చేసి చెప్పు డాడీ అని హిమ చెప్పగా.. అసలు ఫోన్ ఎందుకులే అమ్మా అని కార్తీక్ అంటాడు. దానికి మౌనిత మనసులో.. ఒక్క మాట కూడా చెప్పకుండా హిమ నా దగ్గరకు వచ్చిందని ఆ దీపకు తెలిస్తేనే కదా నాకు మజా. హిమ ఇక్కడ ఉందని తెలియగానే అది కార్తీక్‌తో పాటు తల గిర్రున తిరగాలా ఆ వంటలక్కకు అని అనుకుంటుంది. అబ్బా ఫోన్ చేయ్ డాడీ అని హిమ అనగా.. చేయ్ కార్తీక్, హిమ ఎక్కడుందో తెలీక దీప ఎంత కంగారు పడుతుందో.. పైగా ఆ సౌర్య కూడా ఏడుస్తుంది అన్నావు కదా అని అంటుంది.
ఇక దీపకు ఫోన్ చేసిన కార్తీక్.. మాట్లాడేందుకు సంశయిస్తూ ఉంటాడు. మాట్లాడు డాడీ అని హిమ చెప్పగా.. హిమ ఎక్కడుంది డాక్టర్ బాబు అని దీప అడగ్గా.. మౌనిత ఇంట్లో ఉందని కార్తీక్ అంటాడు. అక్కడ ఎందుకుంది అని దీప అడుగుతుండగానే కార్తీక్ పెట్టేస్తాడు. ఇక కార్తీక్ చర్యకు మౌనిత మనసులో నవ్వుకుంటుంది. ఇక నా బిడ్డ నాతో చెప్పకుండా ఆ మౌనిత ఇంటికి వెళ్లిందా.. ఎందుకు అని దీప అనుకుంటుంది. ఇక హిమ తింటుండగా.. తిన్నాక మన ఇంటికి వెళదామమ్మా అని కార్తీక్ అంటాడు. ఏ ఇంటికి డాడీ అని హిమ అడగ్గా.. మన.. నా.. అదే మన ఇంటికి వెళదామమ్మా అని అంటాడు. దానికి హిమ శ్రీరామ్ నగర్ బస్తీకి కాదా అని అంటుంది. అది మన ఇల్లు కాదమ్మా అని కార్తీక్ అనగా.. అమ్మ అక్కడే ఉంది కదా డాడీ అని హిమ అంటుంది. దానికి కార్తీక్.. అమ్మ అక్కడే ఉంటుందమ్మా అని అంటాడు. అయితే నేను అక్కడే ఉంటాను డాడీ అని హిమ చెప్పగా.. నాతో రావా అని కార్తీక్ అడుగుతాడు. అంటే అందరం కలిసి వెళదాం డాడీ. అమ్మ, సౌర్యను కూడా తీసుకెళదాము అని హిమ అంటుంది. అది సాధ్యం కాదని నేను చాలా సార్లు చెప్పానమ్మా అని.. అసలు ఆ ఆలోచనే మనసులో నుంచి తీసేయ్ అని కార్తీక్ అంటాడు.

కార్తీక దీపం(Hot Star)
అమ్మ ఎవరో తెలీయనప్పుడే నేను ఏడ్చాను. ఎవరో తెలుసాక అమ్మను వదిలి ఎలా ఉంటాను డాడీ అని హిమ అంటుంది. మరి నన్ను వదిలి ఉంటావా అని కార్తీక్ అడగ్గా.. నువ్వొచ్చి అందరినీ తీసుకెళతావని ఎదురుచూస్తున్నాను డాడీ అని హిమ చెబుతుంది. వెంటనే నేను రాకపోతే నువ్వు రావా అని కార్తీక్ అడగ్గా.. హిమ ఇబ్బంది పడుతూ ఉంటుంది. వెంటనే కార్తీక్.. హిమ నిన్నే అడిగేది అనగా.. నాకు తెలీడం లేదు డాడీ అంటుంది. ఒకటి గుర్తు పెట్టుకో హిమ.. నీకు, అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు.. నాకేమో ఈ లోకంలో ఉన్నది హిమ ఒక్కటే అని నేను అనుకుంటున్నాను. నువ్వే తేల్చుకో.. అమ్మను వదిలి నా దగ్గరకు వస్తావా..? రావా.?? అని అడుగుతాడు.
ఇక బయట నుంచి వచ్చిన సౌందర్య, ఆనందరావు.. మాలతిని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెబుతుంది. ఇంకా వాడు మౌనిత దగ్గరే ఉన్నాడన్నమాట అని ఆనందరావు అనగా.. హిమ దాని ఇంటికి వెళ్లడం ఏంటండి..? ఆ మౌనిత చిన్నపిల్లను అడ్డం పెట్టుకొని ఏం సాధించాలనుకుంటుంది. ఈ హిమ దీపతో కూడా చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్లింది అని చెబుతూ ఉంటుంది. ఇంత చదువుకున్న మన సుపుత్రుడే మౌనిత ట్రాప్‌లో పడ్డాడు. ఇక చిన్న పిల్ల హిమ నమ్మడంలో వింతేముంది అని ఆనందరావు అంటాడు. ఏం అవసరం వచ్చిందని పొద్దున్నే మౌనిత దగ్గరకు వెళ్లింది. అసలు దీప ఎంత బాధపడుతుందో తెలుసా..? అని సౌందర్య అంటుండగా.. నిజమే కదా.. ఆ హిమ చేసిన దానికి మనకే ఇంత షాకింగ్‌గా ఉంది అని ఆనందరావు అంటాడు. ఆ మౌనిత చిన్నపిల్లకు ఏం నేర్పుతుందో..? మనవాడు ఆ మౌనితను నమ్మి దీపకు వ్యతిరేకంగా ఏం చేస్తాడో అని సౌందర్య అంటుండగా.. నువ్వు ఇంత పిరికిదానిలా ఎలా మారిపోయావు సౌందర్య అని ఆనందరావు ప్రశ్నిస్తాడు. అదేంటండి అని సౌందర్య అడగ్గా.. ఇదే సంఘటన ఇంతకు ముందు జరిగితే ఇలానే నింపాదిగా కూర్చొనేదానివా..? నేరుగా వెళ్లి ఆ మౌనితను కడిగిపారేసేదానివి. ఆ లైసెన్స్డ్ గన్ తీసుకెళ్లి షూట్ చేసేంత పని చేసేదానివి. లేకపోతే దీప దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పడమో.. ఓదార్చడమో చేసేదానివి. ఇలా నిస్సహాయంగా ఉండేదానివి కాదు అని ఆనందరావు అంటాడు.
సమస్య ఇంతకు ముందు మౌనిత వైపు నుంచే వచ్చేది.. ఇప్పుడు విచిత్రంగా కార్తీక్ నుంచే కాదు, హిమ నుంచి కూడా మొదలైంది. హిమ దీపకు కూడా చెప్పుకుండా పొద్దున్నే వెళ్లి మౌనిత ఇంట్లో కూర్చుందంటే.. దీప కన్నా మౌనితనే ఎక్కువగా నమ్ముతుందనా..? ఎలా అర్థం చేసుకోవాలండి అని అంటుంది. దానికి ఆనందరావు... మౌనిత రాక్షస నీడ కార్తీక్ మీద వాడి కాపురం మీదనే కాదు వాడి సంతానం మీద కూడా పడుతుందన్న మాట అని అంటాడు. దానికి సౌందర్య.. మనిషి ఉంటేనే నీడ, నా సహనం హద్దులు దాటిన రోజు నా కోడలిలా శాంతియుతంగా పోరాటం చేయను. నరికి పారేస్తాను అని అంటుంది. మౌనితకు కార్తీక్ ముందు దోషిగా నిలబెట్టేందుకు నాకు ఒకే ఒక సాక్ష్యం గానీ.. ఒకే ఒక సాక్షి గానీ దొరికిన రోజున ప్రళయ తాండవమే మొదలవుతుంది అని సౌందర్య అంటుంది.
ఇక ఇంట్లో దీప.. హిమ., అమ్మ కన్నా నాన్న కన్నా నానమ్మ కన్నా.. మా అందరి కన్నా మౌనితనే నమ్ముతుందా..? ఇందరికి చెప్పకుండా ఆ మౌనిత ఇంటికి వెళ్లిందంటే ఆ మౌనిత ఏం మాయమాటలు చెబుతుందో..? ఏం నేర్పిస్తుందో..? ఏం ఆశించి ఇదంతా చేస్తుందో..? దాని దగ్గరకు వెళ్లి నా కూతురు కూర్చుందంటే ఆ మౌనితకు నేనంటే ఎంత అలుసుగా ఉంటుంది. దీన్ని ఎంత అవకాశంగా తీసుకుంటుంది. అసలు ఎందుకు వెళ్లింది హిమ.. మౌనిత రమ్మందా..? హిమే వెళ్లిందా..? అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లోపలికి వచ్చిన సౌర్య.. అమ్మా వారణాసి వచ్చాడు అని చెబుతుంది. ఏంటి వారణాసి అని అడగ్గా.. హిమ వెంకటేష్ ఆటోలో వెళ్లిందంటా అక్కా అంటాడు. అయినా వెంకటేష్ నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా అని దీప అనగా.. నీతో చెప్పే వచ్చాను అని అబద్దం చెప్పిందంటా అక్కా అని వారణాసి అంటాడు. ఇంకా అక్కడే ఉన్నాడంటనా..? అని దీప అడగ్గా.. కాదక్కా వాడిని వెళ్లిపోమని పంపిచారట అని వారణాసి అంటాడు. పంపించేశారా..? ఎవరు..? ఎందుకు..? అని దీప అడగ్గా.. ఏమో అక్క డాక్టర్ బాబు కోప్పడి వాడిని పంపించేశారట అని వారణాసి చెబుతాడు. మరి హిమను ఎవరు తీసుకొస్తారురా అని సౌర్య అడగ్గా..ఏమో తెలీదు సౌర్యమ్మా అని వారణాసి అంటాడు. దానికి సౌర్య.. అసలు హిమను ఎందుకు తీసుకెళ్లాలి వాడు.. కనపడని వాడి సంగతి చెబుతాను అని ఆవేశపడుతుంది.
దానికి దీప.. నీ ఆవేశంలో అర్ధం ఉంది అత్తమ్మా..కానీ కోప్పడాల్సింది వాడి మీద కాదు.. వెంకటేష్‌ని వెళ్లిపోమన్నారంటే.. అది డాక్టర్ బాబే అన్నారంటే.. ఇక ఇక్కడ ఉంచదలుచుకోలేదా..? అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా అని సౌర్య అడగ్గా.. ఇక్కడ ఉంటే హిమను నేను సరిగా పట్టించుకోవడం లేదని, బయటకు వెళుతుంటానని అట్నుంటి అటే తీసుకువెళ్లాలనుకుంటున్నారా..? లేదంటే హిమను చూడకుండా ఉండలేక ఈ వంకను పెట్టి హిమను తీసుకెళ్లాలనుకుంటున్నారా..? ఆయన మనసులో ఏముంది..? అని అంటూ ఉంటుంది. వెంటనే సౌర్య.. హిమ వెళుతుందా
అమ్మా.. నాన్న రమ్మంటే ఇక్కడకు రాకుండా ఆ ఇంటికి వెళ్లిపోతుందా..? అని అడుగుతుంది. దాంతో దీప టెన్షన్ పడుతుండగా.. నువ్వు టెన్షన్ పడకు అక్కా.. అలాంటిది ఏం జరగదులే అని వారణాసి చెబుతాడు.
నీకు తెలీదు వారణాసి.. నేను ఆయన ఊరు వదిలి వెళ్లిపోతారని హిమను తీసుకొచ్చాను తప్ప, పంతంతో కాదు అని దీప అంటుంది. ఇక సోమవారం నాటి ఎపిసోడ్ ప్రోమోలో మౌనిత ఇంటికి వెళ్లిన దీప.. హిమను ఇంటికి తీసుకురావాలనుకోవడం..దానికి కార్తీక్ నా పర్మిషన్ అవసరం లేదా..? అనగా లేదని దీప చెప్పడంతో సీరియల్ మరింత రసవత్తరంగా మారనుంది.