హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: వాట్ ఏ సీన్‌.. కార్తీక్‌ని హ‌త్తుకున్న దీప.. న‌న్ను న‌మ్మండి డాక్ట‌ర్ బాబు అంటూ.. !

Karthika Deepam: వాట్ ఏ సీన్‌.. కార్తీక్‌ని హ‌త్తుకున్న దీప.. న‌న్ను న‌మ్మండి డాక్ట‌ర్ బాబు అంటూ.. !

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారింది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో మౌనిత ఇంటికి వెళ్ల‌మ‌ని వెంక‌టేష్‌కి చెబుతుంది దీప. మ‌రోవైపు మౌనిత ఫోన్(దీప ద‌గ్గ‌ర ఉంది) క‌ట్ చేయ‌డంతో.. ఇదేంటి ఇప్పుడు ఫోన్ క‌ట్ చేసింది, అంత‌కుముందేమో ఇంక చేయ‌కండి అంది. ఏమైంది మౌనిత‌కు..? బ‌్రేక్‌ఫాస్ట్, హాస్పిటల్ త‌రువాత ముందు మౌనిత ద‌గ్గ‌ర‌కు వెళ్లి విష‌య‌మేంటో క‌నుక్కోవాలి అని కార్తీక్ కూడా ఆమె ఇంటికి బ‌య‌దేరుతాడు

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారింది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో మౌనిత ఇంటికి వెళ్ల‌మ‌ని వెంక‌టేష్‌కి చెబుతుంది దీప. మ‌రోవైపు మౌనిత ఫోన్(దీప ద‌గ్గ‌ర ఉంది) క‌ట్ చేయ‌డంతో.. ఇదేంటి ఇప్పుడు ఫోన్ క‌ట్ చేసింది, అంత‌కుముందేమో ఇంక చేయ‌కండి అంది. ఏమైంది మౌనిత‌కు..? బ‌్రేక్‌ఫాస్ట్, హాస్పిటల్ త‌రువాత ముందు మౌనిత ద‌గ్గ‌ర‌కు వెళ్లి విష‌య‌మేంటో క‌నుక్కోవాలి అని కార్తీక్ కూడా ఆమె ఇంటికి బ‌య‌దేరుతాడు. ఇక కార్తీక్ మాట‌ల‌ను త‌లుచుకుంటూ సౌంద‌ర్య బాధ‌ప‌డుతూ ఉంటుంది. ఇక ఆనంద‌రావు.. రండి మ‌న‌మైనా వెళ్లి టిఫెన్ చేద్దామ‌ని అన‌గా.. మీరు వెళ్లి తినండి అని సౌంద‌ర్య అంటుంది. ఏమైంది అని ఆనంద‌రావు అన‌గా.. వాడు రోజు రోజుకు మ‌నకు దూర‌మైపోతున్నాడు. అది నేను భ‌రించ‌లేక‌పోతున్నాను. మంచి చెప్పినా చెడుగా అర్థ‌మ‌వుతోంది. వాడి గురించి ఆలోచించినా త‌ప్పుగానే అనిపిస్తోంది. మ‌న‌లో ఒక‌డ‌ని మ‌నం అనుకుంటుంటే మ‌న‌మంతా ఒక‌టి, వాడు ఒక్క‌డు ఒక‌టి అనుకుంటున్నాడు అని అంటుంది.

  అందులో మ‌న త‌ప్పు ఏముంది సౌంద‌ర్య, అపార్థం చేసుకునే వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు, వాడు అదే దృష్టి కోణం నుంచి చూస్తూ ఉంటాడు అని ఆనంద‌రావు అన‌గా.. ఇలా దూరం పెంచుకుంటూ పోతే వాడు మ‌న‌ల్ని మ‌రీ శ‌త్రువులా చూసే స్టేజ్‌కి వెళ‌తాడేమోన‌ని భ‌యంగా ఉంది అని సౌంద‌ర్య అంటుంది. దానికి ఆనంద‌రావు.. ఇప్పుడు ఆ స్టేజ్‌లోనే ఉన్నాడు. అందుకే ఇంటి క‌న్నా బ‌య‌టేన‌య‌మ‌ని వెళ్లిపోయాడు, ఇందులో దోషం మ‌న‌ది కాన‌ప్పుడు మ‌న‌మెందుకు బాధ‌ప‌డాలి అంటాడు. అలాగ‌ని వ‌దిలేయ‌లేము క‌దండి అని సౌంద‌ర్య అన‌గా.. ఏంటిరా నువ్వేంటి మాట్లాడ‌లేదు అని ఆనంద‌రావు, ఆదిత్య‌ను అడుగుతాడు. దానికి ఆదిత్య వింటున్నాను అని అంటాడు. వెంట‌నే వాడు ఏదో అంటున్నాడు, ఏమన్నావు నువ్వు అని ఆనంద‌రావు, ఆదిత్య‌ను అడ‌గ్గా.. హిమ‌ను తెచ్చుకుంటే తెచ్చుకో లేదంటే మ‌ర్చిపో అన్నాను అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. అంత క‌ఠినంగా ఎలా అన్నావురా అని సౌంద‌ర్య అన‌గా.. నేనింతే మ‌మ్మీ నీలాగా తెలివిగా తెలుగులో మాట్లాడ‌టం నాకు చేత‌కాదు అని అక్క‌డి నంచి వెళ్లిపోతాడు.

  ఇక దీప ఇంట్లో హిమ‌.. కార్తీక్ స‌న్మానం ఫంక్ష‌న్‌ని త‌లుచుకుంటూ ఉంటుంది. ఆ త‌రువాత సౌర్యా.. డాడీకి అమ్మంటే ఎందుకు అంత కోపం, ఎప్పుడైనా నీకు చెప్పిందా..? అని అడుగుతుంది. లేదు హిమ‌, నేను ఎన్నో సార్లు అడిగాను, అంతెందుకు నీకో సంగ‌తి చెప్ప‌నా.. ముంద‌ట్లో అంటే మేము బ‌ల‌భ‌ద్ర‌పురం అనే ఊర్లో ఉండేవాళ్లం. అప్పుడు నాన్న ఏడి అంటే దుబాయ్‌లో ఉన్నాడ‌ని చెప్పేది కానీ, నిజం చెప్ప‌లేదు అమ్మ అని అంటుంది. దానికి హిమ అవునా అని అంటుంది. ఇక సౌర్య‌.. బ‌ల‌భ‌ద్ర‌పురం అంటే గుర్తు వ‌చ్చింది. నాన్న‌కు ఫ‌స్ట్ ఎక్క‌డ చూశానో తెలుసా..? చిన్న‌ప్పుడు నేను.. అని కార్తీక్‌, హిమ‌ల‌ను మొద‌ట చూసిన విష‌యాన్ని చెబుతుంది. దానికి హిమ ఏడుస్తుండ‌గా.. హేయ్ ఏడుస్తున్నావా అని సౌర్య అంటుంది. వెంట‌నే హిమ‌.. ఎన్ని క‌ష్టాలు ప‌డ్డారో అమ్మా, నువ్వు అందుకే డాడీ ఇక్క‌డ‌కు వ‌చ్చే వ‌ర‌కు నేను అక్క‌డికి వెళ్ల‌ను అని చెబుతుంది. ఇలా అమ్మా కూడా పంతానికి పోయే మ‌నం ఇంత పెద్ద‌వాళ్లం అయినా కానీ క‌ల‌వ‌లేక‌పోయారు అని సౌర్య అంటుంది. వెంటనే హిమ‌.. అమ్మ‌తో డాడీకి పంత‌మేంటి..? అన‌గా.. పంతం కాదు.. అమ్మ మామ నాన్న విన‌డు, నాన్న‌కేమో అమ్మ అంటే ఇష్టం లేదు, అందుకే రాడు అని చెబుతుంది. ఎందుకిష్టం లేద‌ని హిమ అడ‌గ్గా.. సౌర్య తెలీద‌ని అంటుంది. మ‌రి అమ్మ ఏం త‌ప్పు చేసింద‌ని డాడీకి అంత కోపం.. ఈ సారి వ‌స్తాడు క‌దా అప్పుడు అడుగుతా అని హిమ అన‌గా.. పోనీ మ‌నం వెళ్దామా అని సౌర్య చెబుతుంది. వ‌ద్దు డాడీ వ‌చ్చేవ‌ర‌కు మ‌నం వెళ్ల‌కూడ‌దు అని హిమ చెబుతుంది. ఇక అప్పుడే వార‌ణాసి వ‌చ్చి.. సౌర్య‌మ్మా నేను మార్కెట్‌కి వెళ్లి కూర‌గాయ‌లు తెస్తాను సంచి ఇవ్వ‌మ్మా అని అడుగుతాడు. ఇక కూర‌గాయ‌ల‌కు డ‌బ్బులు ఉన్నాయా వార‌ణాసి అని హిమ అడ‌గ్గా.. అమ్మ ఇచ్చి వెళ్లింద‌ని వార‌ణాసి అంటాడు. ఇక సంచి తీసుకొని వార‌ణాసి అక్క‌డి నుంచి వెళ‌తాడు. అప్పుడు సౌర్య‌.. అంటే అమ్మ అర్జెంట్ ప‌ని మీద కాదు, ముందే అనుకోని వెళ్లింద‌న్న‌మాట‌, లేక‌పోతే కూర‌గాయాల‌కు ముందే డ‌బ్బులు ఎందుకు ఇస్తుంది అన‌గా.. హిమ కూడా అవును క‌దా మ‌రి ఎక్క‌డికి వెళ్లిన‌ట్లు అని ఆలోచిస్తుంది.

  ఇక మౌనిత ఇంటికి దీప వెళ్లగా.. దీపను లోప‌లికి పంపి బ‌య‌ట తాళం వేయ‌బోతాడు వెంక‌టేష్‌. ఆ లోపు కార్తీక్ వ‌స్తాడు. ఎవ‌డురా నువ్వు, ఇంటి తాళం ఎందుకు వేస్తున్నావు, చెప్తావా లేదా అని అడుగుతాడు. దానికి వెంక‌టేష్.. దీపక్క లోప‌ల ఉంది డాక్ట‌ర్ బాబు అని అంటాడు. వెంట‌నే కార్తీక్.. ఎందుకు, ఎప్ప‌టి నుంచి, దానికి తాళం ఎందుకు వేయ‌డం అని అడ‌గ్గా.. జ‌రిగింది చెబుతాడు వెంక‌టేష్. ఇక తాళం ఇటు ఇచ్చి వెళ్లు అని వెంక‌టేష్‌ని అక్క‌డి నుంచి పంపుతాడు కార్తీక్‌.

  ఇక లోప‌ల దీప‌.. చెప్ప‌వే మా ఆయ‌న‌కు ఏ మందు పెట్టావే నువ్వు, మా అత్త గారి ముందు గ‌ట్టిగా మాట్లాడానికి జంకే ఆయ‌న.. అంత ధైర్యంగా నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడంటే, నువ్వే ఏదో మాయ చేసి ఉంటావు. ఏం చేశావు అని అడుగుతుండ‌గా.. ఆ లోపు కార్తీక్ వ‌స్తాడు. నేను చెబుతాను అని అంటాడు. ఇక కార్తీక్‌ని చూసి మౌనిత హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు రా అని దీప‌ను హాల్‌లోకి తీసుకెళ‌తాడు. ఆమెతో పాటు మౌనిత‌, ప్రియ‌మ‌ణి కూడా వ‌స్తారు. ఇక ప్రియ‌మ‌ణి.. అయ్యా కార్తీక్ అయ్యా మీకో దండం. మాకు ఈ న‌ర‌కం వ‌ద్దు స్వామి, మీరు మీ పెళ్లాన్ని తీసుకుపోండ‌య్యా.. మ‌మ్మ‌ల్ని మామూలుగా ఆడుకోవ‌ట్లేద‌య్యా. మ‌ధ్య‌లో నేనేం పాపం చేశాన‌య్యా. కారం వేసిన అన్నం పొట్లం ప‌డేసింద‌య్యా.. మా మానాన మేము ఉంటే తాళం వేసి జైలు అంటే ఇది అని చూపించింద‌య్యా అని చెబుతుండ‌గా.. దీప, ప్రియ‌మ‌ణిని కొడుతుంది. తొక్కి నార తీస్తాను ఏమ‌నుకున్నావో.. కారం వేసిన‌ అన్నం పొట్లాలేంటే..? క‌డుపుకు అన్నం తింటున్నారా..? ఇంకేమైనా తింటున్నారా..? అని ప్రియ‌మ‌ణిని జుట్టుప‌ట్టుకొని కొడుతుంటుంది దీప‌. ఇక కార్తీక్.. స్టాపిట్ వ‌దులు అన‌గా.. ప్రియ‌మ‌ణిని వ‌దిలేస్తుంది దీప‌. ఇక ఓయ్ నువ్వు బ‌య‌ట‌కు వెళ్లు అని దీప‌కు, కార్తీక్ చెబుతుంటాడు.

  ఇక ప్రియ‌మ‌ణి.. నా బ‌తుకే ఇలా ఉంటే మీకే ఇబ్బంది క‌లిగించిందో చెప్పుకోండి అమ్మా అని మౌనిత‌ను చూసి అంటుంది. వెంట‌నే దీప‌.. ఏయ్ అనగా.. కార్తీక్.. ఏంటే ఇదంతా అంటాడు. దానికి దీప‌.. ఒక్క‌రోజు ఒక్క‌రోజు గ‌డిచి ఉంటే నా బ‌తుకు, మ‌న కాపురం బాగుప‌డేది అంటుంది. వెంట‌నే కార్తీక్.. ఏంటే బాగుప‌డేది, అస‌లు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా.. ఏంటి ఇదంతా అని అడుగుతుంటాడు. దీప‌... నా ఖ‌ర్మ‌, నా ఖ‌ర్మ‌, నా ఖ‌ర్మ‌య్యా.. చివ‌రి నిమిషంలో అంతా త‌ల‌కిందులు చేశావు. ఇంకా ఎంత‌కాలం నాకు ఈ ఆటంకాలు అని అంటుంది. దానికి కార్తీక్.. అస‌లు ఏంటే నీ బాధ, నిన్ను వ‌దిలేసింది నేను అయితే మౌనిత ఇంటికి వ‌చ్చి ఇంత ర‌చ్చ న‌డిపిస్తున్నావు, పిచ్చి ప‌ట్టిందా నీకు, ఏమైందే, ఏమైపోతున్నావు, అస‌లు మౌనిత మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావంటా..? ఏమ‌ని కంప్లైంట్ ఇచ్చావే.. ఇచ్చావా..? అని అడ‌గ్గా.. ఇచ్చా అని దీప చెబుతుంది. అది విని మౌనిత షాక్‌కి గురి అవుతుంది. దీనికి తెలుసు, దీన్నే అడ‌గండి అని దీప చెబుతుంది. చెప్ప‌వే.. ఏమ‌ని కంప్లైంట్ ఇచ్చుంటానో చెప్ప‌వే అని అడుగుతుంది. ఇక మౌనిత నాకేం తెలుసు అన‌గా.. కార్తీక్.. ఏయ్ ఏంటి ఇది, ఈ తాళాలు వేయ‌డ‌మేంటి..? గ‌దిలో బంధించ‌డం ఏంటి..? తిండి కోసం మార్చ‌డ‌మేంటి..? చెప్పుకొని ఏడిస్తే చెంప ప‌గ‌ల‌గొట్ట‌ట‌మేంటి..? రౌడీలా త‌యారు అవుతున్నావేంటి అని అన‌గా.. రౌడీనే కాద‌య్యా, రాక్ష‌సిని అవుతా.. మీకు, నాకు మ‌ధ్య చిచ్చు పెట్టిందే ఈ రాక్ష‌సి దీని మూలంగానే అని చెబుతూ ఉండ‌గా.. కార్తీక్ ఆపు అంటాడు.

  నాకేం క‌ళ్లు లేవా..? మెద‌డు లేదా..? సొంత తెలివితేట‌లు లేవా..? మౌనిత చెబితే నిన్ను వ‌దిలేస్తానా..? అన‌వ‌స‌రంగా మౌనిత‌ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు అని కార్తీక్ అంటాడు. వెంట‌నే దీప‌.. దీనికేం తెలీదా అని అడ‌గ్గా.. తెలీదు అని కార్తీక్ అంటాడు. అయితే దీని గురించే మీకేం తెలీదు అని దీప అంటుంది. అటు చూడండి, ఆ కాకి మెడ చూడండి, ఆ రొట్టె మొహం చూడండి, ఆ కొట్టెం క‌ళ్లు చూడండి. ప్ర‌పంచంలో దీన్ని న‌మ్మే ఏకైక జీవి మీరొక్క‌రే. మా అత్త గారికి తెలుసు, దీని స‌త్తా ఏంటో..? మీకే దీని గురించి ఏం తెలీదు. అది ప‌క్క‌న‌పెట్టండి అస‌లు, మీరు దీన్ని పెళ్లి చేసుకుంటా అని అత్త‌య్య‌తో చెప్పార‌ట అని అడుగుతుంది. చెప్పాన‌ని కార్తీక్ అంటాడు. దానికి దీప ఎందుకు చెప్పారు అన‌గా.. కార్తీక్ నా ఇష్టం అంటాడు. అప్పుడు మౌనిత సంతోష‌ప‌డుతూ ఉంటుంది మీ ఇష్టం అంటే కుద‌రదు ఇక్క‌డ‌.. మీరు దీన్ని చేసుకోవ‌డ‌మేంటి..? అని దీప అన‌గా.. అది నా వ్య‌క్తిగ‌త‌మ‌ని కార్తీక్ అంటాడు. వ్య‌క్తిగ‌తం, గ‌డిచిన గ‌తం అంటూ ఏమీ ఉంటావు ఇక్క‌డ‌. మీరు ఒక వ్య‌క్తి అది గ‌తం కాదు వాస్త‌వం, మీరు నాకు విడాకులు ఇచ్చి ఉంటే అప్పుడు ఇది వ్య‌క్తిగ‌త‌మ‌వుతుంది. మీరేమైనా నాకు విడాకులు ఇచ్చారా..? అని దీప అన‌గా.. ప‌ద ఇప్పుడే ఇస్తాను అని కార్తీక్ అంటాడు. ఆ మాట‌కు ప‌దండి దీన్ని తీసుకెళ్లి జ‌డ్జి ముందుర ప‌డేస్తాను అని మౌనిత‌ను ప‌ట్టుకుంటుంది. వెంట‌నే కార్తీక్.. ఏయ్ వ‌దులు ఏంటి ఆట‌లుగా ఉందా..? అని అంటాడు. నా బ‌తుకంటే మీకు ఆట‌లుగా ఉందా..? అని దీప అన‌గా.. ఏంటి ఈ దౌర్జ‌న్యం, ఏంటి ఈ ప‌నికిమాలిన పంచాయితీ అని కార్తీక్ అంటాడు. వెంట‌నే దీప‌.. ఇది నా వ్య‌క్తిగ‌తం అని అంటుంది. ఇక మౌనిత నా ఫ్రెండ్ అని కార్తీక్ అన‌గా.. మీరు నా మొగుడు అని దీప అంటుంది. అప్పుడు ఇది ఎవ‌ర్తి.. మొగుడు, పెళ్లాల మ‌ధ్య మొగ‌లిపువ్వా.. అని అంటుండ‌గా.. వెంట‌నే కార్తీక్.. నా ఫేష‌న్స్‌ని టెస్ట్ చేయ‌కుండా వెళ్లు అంటాడు. నేను వెళితే మీరు దీని ఇంట్లో ఉంటారా..? అని దీప అడుగుతుంది. అప్పుడు మీ ఇద్ద‌రిని లోప‌లే ఉంచి తాళం వేస్తాను అని చెబుతుంది. వెంట‌నే కార్తీక్.. దీప న‌న్ను మ‌రింత దిగ‌జార్చ‌కు అన‌గా.. మీరు చేసింది ఏంటి మ‌గానుభావా..? మీకో న్యాయం..? నాకో న్యాయ‌మా..? మీరు మాత్రం ఆ ఫంక్ష‌న్‌లో ఏం మాట్లాడారు..? న‌న్ను దిగ‌జార్చి మాట్లాడ‌లేదా..? ఇదిగో ఇది.. ఇది.. పెళ్లైన మొగ‌వాడి వాది మోజు ప‌డ్డ ఆడ‌ది కూడా నా గురించి త‌ప్పుగా మాట్లాడ‌లేదా.? మీరు చేస్తే న్యాయం.. నేనే చేస్తే అన్యాయ‌మా..? మిస్ట‌ర్ కార్తీక్ అని ఫైర్ అవుతుంది.

  అయ్యా డిసైడ్ అయ్యా.. ఏదైతే అది అయ్యింద‌ని అమీ తుమీ తేల్చుకోవ‌డానికే రంగంలోకి దిగా. ఆ ప‌నిలో భాగంగానే దీని మీద కంప్లైంట్ ఇచ్చా. దీనికి ఉంటుంది. బాగా ఉంటుంది అని దీప అంటూ ఉంటుంది. దానికి మౌనిత‌.. కొంప‌దీసి నేను త‌ప్పుడు డీఎన్ఏ రిపోర్టులు సృష్టించాన‌ని దీప‌కు తెలిసిపోయిందా..? అని అనుకుంటూ ఉంటుంది. ఇక దీప‌.. ఇది ఏమేం త‌ప్పుడు ప‌నులు చేసిందో అవ‌న్నీ బ‌య‌ట‌పెడ‌తా, వ‌స్తా అని దీప చెబుతుంది. వెళుతూ కార్తీక్‌కి ద‌గ్గ‌ర‌గా వెళ్లి హ‌గ్ చేసుకుంటుంది. న‌న్ను న‌మ్మండి డాక్ట‌ర్ బాబు, కొన్ని నిజాలు తేల్చుకోని వ‌స్తా, దీని అంతు మీరే చూసేలా చేస్తా, మ‌న‌కు మంచి రోజులు వ‌స్తాయి అని చెప్పి వెళుతుంది.

  ఇక దీప ఇంట్లోకి సౌంద‌ర్య వెళ్ల‌గా.. అక్క‌డ సౌర్య‌, హిమ‌లు అన్నం తింటూ క‌నిపిస్తారు. హిమ కారంతో తిన‌డాన్ని చూసిన సౌంద‌ర్య‌.. హిమ గురించి కార్తీక్ చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేసుకుంటుంది. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో అంజిని క‌లిసి ప‌దేళ్ల క్రితం జ‌రిగిన విష‌యాన్ని అడుగుతుంది దీప, మ‌రోవైపు మౌనిత కార్తీక్ కోసం మ‌రో నాట‌కం ఆడుతుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial

  ఉత్తమ కథలు