హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: మౌనితలో మొద‌లైన భ‌యం.. కొత్త డ్రామా మొద‌లు.. పెద్ద‌గా ప‌ట్టించుకోని కార్తీక్

Karthika Deepam: మౌనితలో మొద‌లైన భ‌యం.. కొత్త డ్రామా మొద‌లు.. పెద్ద‌గా ప‌ట్టించుకోని కార్తీక్

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

సౌంద‌ర్య, దీప ఇంటికి వెళ్ల‌గా.. అక్క‌డ హిమ‌, సౌర్య ఇద్ద‌రు కారంతో అన్నం తింటూ క‌నిపిస్తారు. అది చూసి సౌంద‌ర్య బాధ‌ప‌డుతుంటుంది. వీళ్లిద్ద‌రు వాళ్లిద్ద‌రి మ‌ధ్య బ‌లైపోతున్నారు. హిమ‌ను తీసుకెళ్తే సౌర్య బాధ‌ప‌డుతుంది, ఇద్ద‌రినీ తీసుకెళ్తే వాడు ఇంట్లోని వెళ్లిపోతాడు, భ‌గ‌వంతుడా.. అక్క‌డ అంత ఉన్నా ఇక్క‌డ వీళ్లు ఇలా పేద‌రికంలో మ‌గ్గిపోవాల్సిందేనా అని మ‌న‌సులో అనుకుంటుంది.

ఇంకా చదవండి ...

  Karthika Deepam Serial: తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. గురువారం నాటి ఎపిసోడ్‌లో మౌనిత నుంచి నిజాలు రాబాట్టాల‌నుకొని దీప ఆ ఇంటికి వెళ్ల‌గా.. కార్తీక్ వ‌స్తాడు. దీంతో కార్తీక్‌పై అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసిన దీప‌.. నిజాల‌ను తేలుస్తానంటూ వెళుతుంది. మరోవైపు సౌంద‌ర్య, దీప ఇంటికి వెళ్ల‌గా.. అక్క‌డ హిమ‌, సౌర్య ఇద్ద‌రు కారంతో అన్నం తింటూ క‌నిపిస్తారు. అది చూసి సౌంద‌ర్య బాధ‌ప‌డుతుంటుంది. వీళ్లిద్ద‌రు వాళ్లిద్ద‌రి మ‌ధ్య బ‌లైపోతున్నారు. హిమ‌ను తీసుకెళ్తే సౌర్య బాధ‌ప‌డుతుంది, ఇద్ద‌రినీ తీసుకెళ్తే వాడు ఇంట్లోని వెళ్లిపోతాడు, భ‌గ‌వంతుడా.. అక్క‌డ అంత ఉన్నా ఇక్క‌డ వీళ్లు ఇలా పేద‌రికంలో మ‌గ్గిపోవాల్సిందేనా అని మ‌న‌సులో అనుకుంటుంది. ఆ త‌రువాత‌ సౌంద‌ర్య గారి మ‌న‌వ‌రాళ్లు ఏం చేస్తున్నారంటూ వారిని ప‌ల‌క‌రిస్తుంది. డాక్ట‌ర్ బాబు కూతుళ్లు అన్నం తింటున్నారు అని హిమ అన‌గా.. కూర్చోండి నాన‌మ్మ అని సౌర్య అంటుంది. కూర్చుంటాను మీరు కానివ్వండి అని చెప్పి.. అమ్మ లేదా అని సౌంద‌ర్య అడుగుతుంది.

  దానికి సౌర్య‌.. ఎక్క‌డికో వెళ్లింది, అన్నం చేసిపెట్టి వెళ్లింది. మాకు ఆక‌లి వేస్తే తినడానికి ఉండేది అన్న‌మే కదా.. అక్క‌డ‌లాగా ఏది అంటే అది చేసిపెట్టే వాళ్లు ఉండ‌రు, అక్క‌డంటే మాల‌తి ఉంది, ఇక్క‌డ అమ్మ ఉన్నా.. అమ్మ ద‌గ్గ‌ర ఈ మ‌ధ్య అస్స‌లు డ‌బ్బులు ఉండ‌ట్లేదు పాపం, అందుకే మేమిద్ద‌రం ఏమీ అడ‌గ‌డం లేదు అని చెబుతుంది. వీళ్లిద్ద‌రిలో ఆ ఇంటికి, ఈ ఇంటికి మ‌ధ్య ఉన్న తేడాను పోగొట్టాలి, ఆ ఫీలింగ్ రానివ్వ‌కూడ‌దు అని మ‌న‌సులో అనుకునే సౌంద‌ర్య‌.. వారి ప‌క్క‌నే కింద కూర్చుంటుంది. అయ్యయ్యో మీరు కింద కూర్చున్నారేంటి..? అని సౌర్య అన‌గా.. ఏం మీరేంటి, నేనేంటి.. మీరు కింద కూర్చుంటే నేను కూర్చోకూడ‌దా, అంద‌రూ స‌మాన‌మే అని సౌంద‌ర్య అంటుంది. నేను మీ నాన్న‌మ్మ‌ను, మీరు నా మ‌న‌వరాళ్లు, నేను ఒక ముద్ద తిన‌చ్చా అని ప్లేట్ తీసుకుంటుంది. వెంట‌నే హిమ‌.. నువ్వా.. ఇది ఫైన్ రైస్ కాదమ్మా, నువ్వు తిన‌గ‌ల‌వా, అవును మీరు తిన‌లేరేమో అని అన‌గా.. సౌర్య కూడా అవునంటుంది.

  వెంట‌నే సౌంద‌ర్య న‌న్ను వేరే చేయ‌కండే, మీరు ఎంతో నేను అంతే అనుకోండి అని చెప్పి అన్నం తింటూ ఉంటుంది. వెంట‌వెంట‌నే తింటూ ఉండ‌గా.. బాగా ఆక‌లివేసిందా నాన‌మ్మా అని సౌర్య అడుగుతుంది. ఆక‌లి కాదు గొంతు పూడుకుపోయింది అందుకే తింటున్నాను అని సౌంద‌ర్య‌ చెప్ప‌గా.. ప్లేట్ తెస్తాను నాన‌మ్మా అని హిమ అంటుంది. వ‌ద్దు మీరు తినండి అంటూ వారిద్ద‌రికి సౌంద‌ర్య తినిపిస్తుంది. మీకు ఏమైనా కారంగా అనిపించిందా నాన‌మ్మ అని హిమ అన‌గా.. లేదు మీ ఇద్ద‌రితో ఇలా కూర్చొని తింటుంటే సంతోషంగా అనిపించింది అని సౌంద‌ర్య చెబుతుంది. ఇద్ద‌రే ఉన్నారు క‌దా బోర్ కొట్ట‌లేదా..? ఫోన్ చేస్తే కారు పంపే దాన్ని క‌దా అని సౌంద‌ర్య అన‌గా.. నేను వెళ్దామ‌నే చెప్పాను నాన‌మ్మ కానీ హిమే నాన్న వ‌చ్చి అంద‌రినీ తీసుకెళ్తేనే వ‌స్తానంటోంది అని సౌర్య అంటుంది. దానికి వ‌స్తాడే, వ‌చ్చి తీసుకెళ్లే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది అని సౌంద‌ర్య అన‌గా.. అమ్మ కూడా ఇదే మాట అనింది అని సౌర్య సంతోషంగా చెబుతుంది. అమ్మా నాన్న‌ను తీసుకొస్తుంద‌ట నాన‌మ్మ‌, అంద‌రం క‌లిసే ఉంటామంటా.. కొంచెం ఓపిక ప‌ట్టండి అంత‌వ‌ర‌కు న‌న్ను ఏం అడ‌క్కండి అని చెబుతుంది.

  దానికి సౌంద‌ర్య వాడి మ‌న‌సు మార్చ‌డానికి అది ఏ ప్ర‌య‌త్నాలు చేస్తుందో ఏమో, ఎక్క‌డుందో అని మ‌న‌సులో అనుకుంటుంది. ఇక అంజికి దీప ఫోన్ చేయ‌గా.. అంజి వ‌స్తాడు. ర‌మ్మ‌న్నారు ఎందుక‌మ్మా అని అంజి అడ‌గ్గా.. మీది ఏ ఊరు అంజి, చెప్పు ప‌ర్లేదు, నాకు తెలిసిన నిజాల‌కు, నువ్వు చెప్పే అబ‌ద్దాల‌కు పొంత‌న కుద‌ర‌క‌పోతే నిన్ను అంచ‌నా వేయ‌డంలో నేను ఫెయిల్ అవుతాను అని దీప అడుగుతుంది. వైజాగ్‌లో అమ్మ‌గారి స్నేహితురాలు ద‌గ్గ‌ర ప‌దేళ్లుగా డ్రైవ‌ర్‌గా చేశాను అమ్మా అని అంజి అన‌గా.. ఆ ప‌దేళ్ల‌కు ముందు నువ్వు ఎవ‌రు అని దీప అడుగుతుంది. మీ ప్ర‌శ్న నాకు అర్థం కాలేద‌మ్మా అని అంజి అన‌గా.. ప‌దేళ్ల‌కు ముందు నీ వృత్తి ఏంటి అని అడుగుతున్నాను అని దీప అంటుంది. చెప్ప‌లేనిదా..? చెప్ప‌కూడ‌ద‌నా..? జ‌వాబు లేదు అని దీప అంటుండ‌గా.. మీ ప్ర‌శ్న‌లు వింటుంటే మీకు నా గురించి అని అంజి చెప్ప‌బోతుంటాడు.

  వెంట‌నే దీప‌.. డౌట్ కాదు, ఎంతోకొంత తెలుసుకోవాల‌నుకునే కుతూహ‌లం అనుకో, చూడు అంజి ఓ వేట‌గాడు వేట మానేసి ప్ర‌శాంతంగా బ‌త‌క‌డంలో మాన‌వ‌త్వమే ఉంటుంది, అది అర్థం చేసుకోకుండా గ‌తాన్ని త‌వ్వి దోషిగా నిలబెట్టేంత అవ‌స‌రం, స‌హ‌నం కాదు ఇప్పుడు లేదు, కానీ నీకు తెలిసిందేదో కొంచెం నాకు తెలిసింది అదేదో విందామ‌నిపించింది. ఇది నీ అఙ్ఞాత‌వాస‌మా..? ఈ ఉద్యోగం నీకు అవ‌స‌రమా..? ఈ మార్పు మంచికా..? చెడుకా..? అని అడుగుతుంది. దానికి అంజి నేను మీ మంచి కోరి వ‌చ్చాన‌మ్మా, నా దృష్టిలో డాక్ట‌ర్ బాబు దేవుడు, ఆ దేవుడి పాదాల మీద ప్ర‌మాణం చేసి చెబుతాను, ఆ రోజు అమ్మ గారు మిమ్మ‌ల్ని ప‌రిచ‌యం చేస్తూ మీరు అర‌ణ్య‌వాసంలో ఉన్నార‌ని చెప్పారు. అప్ప‌టి నుంచి నేను అంజిలా కాదు, ఆంజ‌నేయుడిలా మారాను. భ‌క్తిగానే ఉంటాను, భుక్తి కోసం కాదు అని అంటాడు. వెంట‌నే దీప‌.. ఇంత చ‌క్క‌గా మాట్లాడుతున్నావు, ఏం చ‌దువుకున్నావు అని అడుగుతుంది. ప‌దేళ్ల నుంచి ప‌విత్ర‌మైన గ్రంధాలే చ‌దువుతున్నాన‌మ్మా అని అంటాడు.

  నాకేం చెప్పాల‌ని, నా దారి సుగుమం చేయాల‌ని, అడ్డుగా ఉన్న మౌనిత‌ను ఏరిపారేయాల‌ని, కావాల్సిన శ‌క్తిని ఇవ్వాల‌ని నీకు అనిపించ‌డం లేదా..? అని దీప అడ‌గా.. మౌనిత గురించి నాకు తెలుసని దీప‌మ్మ‌కు తెలిసిపోయిందా ఏమిటి..? ఆవేశంలో దీపమ్మ‌, మౌనిత ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. ఆ రాక్ష‌సి దీప‌మ్మ కాపురాన్ని కూల్చేసిన పిశాచి, ఈ అమ్మ‌ను ప్రాణాల‌తో ఉండ‌నిస్తుందా..? అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంట‌నే దీప‌..నిన్నేదో ప‌ట్టి పీడిస్తోంది. ఏ శ‌క్తో, నిన్ను అశ‌క్తిని చేస్తుంది.. ఏ వివేక‌మో నిన్ను వెన‌క్కి లాగుతోంది. ఎందుకో..? ఏమిటో.. ? నువ్వే తెలుసుకో.. లంక లాంటి వార‌ధి నుంచి నిజ‌మేదైనా నీకు తెలిసి ఉంటే, అదేదో నువ్వే చెప్పు, తొంద‌ర‌గా చెప్పు నాకు స‌మ‌యం లేదు అని అడుగుతుంది. దానికి అంజి నాకు కొంచెం స‌మ‌యం కావాలమ్మా అంటాడు. అందుకు దీప స‌రే, నీ ఇష్టం వెళ్లు అంటుంది.

  ఇక కార్తీక్‌, మౌనిత ఇద్ద‌రు దీప మాట‌ల‌ను త‌లుచుకుంటూ ఉంటారు. ఏమైంది దీప‌కు, ఎందుకిలా విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తోంది..? మాట‌ల్లో ఉన్మాదం ఏర్ప‌డుతుంది, చూపుల్లో ఉగ్ర‌రూపం క‌న‌బ‌డుతోంది, న‌డుస్తున్న అగ్నిప‌ర్వ‌తంలా తిరుగుతుంది, ఎందుకింత ఫ్ర‌స్టేటెడ్‌గా ఉంది. అది ఏమైపోతుంది..? దానికి ఏదైనా అయితే పిల్ల‌లు ఏమైపోతారు.? అని కార్తీక్ అంటుంటాడు. దానికి మౌనిత.. ఎంతైనా తాళి క‌ట్టిన భార్య‌, ర‌క్తం పంచుకుపుట్టిన కూతుళ్లే క‌దా అటే లాగుతుంది అని మౌనిత మ‌న‌సులో అనుకుంటుంది. ఇక ఒక‌టి అడుగుతా చెప్తావా..? అని కార్తీక్ అడ‌గ్గా.. ఏంటి అని మౌనిత అంటుంది. మీ ఇద్ద‌రి మ‌ధ్య నాకు తెలిసి దాని క‌న్నా తెలియ‌ని గొడ‌వ ఏదో జ‌రుగుతోంది.? ఏంట‌ది అని అడుగుతాడు. వెంట‌నే మౌనిత‌.. నీకు తెలియ‌ని గొడ‌వ ఏముంది..? మొద‌టి నుంచి అత్తాకోడ‌ళ్ల‌కి నేనంటే చుల‌క‌నే క‌దా..? అంటుంది. దానికి కార్తీక్.. మా అమ్మ‌ను ఎందుకు క‌లుపుతావు, ఈ మ‌ధ్య‌న మా అమ్మ నీ జోలికే రావ‌ట్లేదు క‌దా, దీప గురించి అడుగుతున్నాను, అస‌లు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది, ఏమ‌ని ఇచ్చింది అని అడుగుతాడు. నువ్వు న‌న్ను పెళ్లి చేసుకుంటా అన్నావు క‌దా అందుకు ఇచ్చింటుంది, డివ‌ర్స్ తీసుకోకుండా నా మొగుడు ఇంకొక‌రిని మెడ‌లో తాళి క‌డ‌తాను అంటున్నాడ‌ని ఇద్ద‌రినీ అరెస్ట్ చేయండి అని ఇచ్చి ఉంటుంది అని మౌనిత అంటుంది.

  అది న‌న్ను నిల‌దీసింది, ఈ కేసులో నన్ను క‌ల‌ప‌లేదు, నీ మీదే కేసు పెట్టింది. నువ్వు అన్న‌ట్లు నేను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్న సంగ‌తి అమ్మ దాంతో చెప్ప‌లేదు అని అంటాడు. చెప్ప‌లేద‌ని నీకెలా తెలుసు అని మౌనిత అన‌గా.. నేను దీప వెళ్ల‌గానే వెన‌కే బ‌య‌టికి వెళ్లి ఫోన్ చేసి క‌నుక్కున్నాను, దీపకు చెప్ప‌లేద‌ని మా అమ్మ ప్రామిస్ చేసింది అని కార్తీక్ అంటాడు. అయితే నీకు నా మీద అనుమానంగా ఉందా..? మా ఇద్ద‌రి మ‌ధ్య ఇంకేదో వార్ జ‌రుగుతుంద‌ని డౌట్ వ‌చ్చిందా..? ఒక‌వేళ ఆ ఇంకేదో గొడ‌వ అయ్యి ఉంటే.. ఇన్ని మాట్లాడి వెళ్లిన నీ భార్య అది మాత్రం ఎందుకు దాచేస్తుంది, ఆమెకు కావాల్సింది నా మీద నీకు అస‌హ్యం పుట్టాల‌నే క‌దా.. అందుకే క‌దా ఇన్ని ఆరోప‌ణ‌లు నా మీద ఎక్కు పెట్టేది అని మౌనిత అన‌గా.. ఈ సారి ఎందుకింత స్ట్ర‌గుల్ అవుతుంది, దాని మాట‌ల్లో ఆత్మ‌స్థైర్యం క‌నిపిస్తుంది, నీ మీద ఇలాంటి ప్ర‌య‌త్నం చేసింది, ఇదంతా ఏంటి..? ఎందుకు..? మా ఇంటి ద‌గ్గ‌ర కూడా అస‌లు ఏ మాత్రం బెద‌ర‌కుండా, మాట‌లు చెక్కు చెద‌ర‌కుండా మాట్లాడి వెళ్లింది అని కార్తీక్ అంటాడు. దానికి మౌనిత.. త‌న మీద ప‌డ్డ మ‌చ్చ చెరిపేసుకోవాల‌ని ధృడ నిశ్చ‌యంతో ఉంది అని మౌనిత మ‌న‌సులో అనుకుంటుంది. ఇక కొత్త డ్రామాకు తెర‌తీస్తుంది.

  ఆ త‌రువాత ఏడుపు న‌టిస్తుండ‌గా.. ఏమైంది అని కార్తీక్ అడుగుతాడు. అయిపోంది కార్తీక్, అంతా అయిపోయింది, నీ క‌ళ్ల ముందే ఇంత జ‌రిగింది. నీ భార్య నువ్వు ఉన్నావ‌ని ప్రియ‌మ‌ణిని కొట్టింది, నువ్వు లేన‌ప్పుడు న‌న్ను కొట్టింది. త‌లుపు వేసి తాళం పెట్టింది. కుక్క బోన్‌లో ప‌డేసిన‌ట్లు ఇంత అన్నం ప‌డేసింది, వంట చేసుకోకుండా గ్యాస్ పైప్ క‌ట్ చేసింది, మ‌మ్మ‌ల్ని విప‌రీత‌మైన టార్చ‌ర్ పెట్టింది. ఒక ఉన్మాదిలాగా మ‌మ్మ‌ల్ని న‌ర‌క‌యాత‌న‌కు గురి చేసింది, అయినా నువ్వు వ‌దిలేశావు, అస‌లు నీకు చీమ కుట్టిన‌ట్లు కూడా అనిపించ‌లేదు. ఇంత జ‌రిగినా, న‌న్ను హౌజ్ అరెస్ట్ చేసినా, నా ఫోన్ తీసుకెళ్లిపోయినా ఎవిడెన్స్‌తో స‌హా రుజువు చేసి పోలీస్ కేసు పెట్టొచ్చు, కానీ పెట్ట‌లేదు ఎందుకంటే నీ ఫ్యామిలీ ప‌రువు పోతుంద‌ని నోరు మూసుకున్నాను. నీ ఫ్యామిలీలో గొడ‌వలు మొద‌లై నువ్వు బాధ‌ప‌డుతావ‌నే కంట్రోల్ చేసుకున్నాను, నేను ఏం త‌ప్పు చేశాను కార్తీక్. ఒక్క‌టి మాత్రం నిజం నేను నిన్ను మ‌న‌స్ఫూర్తిగా  ప్రేమించాను, అది నిజం, అది నిజం, అది నిజం. నీ కోస‌మే ఇంత కాలం పెళ్లి చేసుకోకుండా ఎదురుచూస్తున్నాను, ఇది నిజం. నువ్వు న‌న్ను న‌మ్మ‌క‌పోయినా వాళ్ల చెప్పుడు మాట‌లు విని న‌న్ను చంపేసినా.. సంతోషంగా చ‌చ్చిపోతాను కానీ నీ మీద ప్రేమ మాత్రం ఎప్ప‌టికీ చావ‌దు, ఐ ల‌వ్యూ కార్తీక్ అని ఏడుస్తూ కార్తీక్ కాళ్ల ద‌గ్గ‌ర ఉంటుంది.

  ఇక మౌనిత‌ను లేపిన కార్తీక్.. సోఫా మీద కూర్చోబెట్టి ఓదారుస్తాడు. నా వైపు నుంచి ఆలోచించి, ఏ కేసు పెట్ట‌నందుకు థ్యాంక్స్ మౌనిత‌, కంట్రోల్ అని కార్తీక్ అన‌గా.. మౌనిత లేస్తుంది. దాని మీద కేసు పెట్ట‌నందుకు థ్యాంక్యు చెబుతున్నాడు. దుర్మార్గుడా.. ఇంత ఏడ్చినా పెళ్లి గురించి మాత్రం ఎత్త‌డం లేదు అని మౌనిత మ‌న‌సులో అనుకుంటుంది. ఇక నువ్వేమీ టెన్ష‌న్ ప‌డ‌కు, వ‌స్తాను అని అక్క‌డి నుంచి కార్తీక్ వెళ‌తాడు. ఆ త‌రువాత నేను ఇప్పుడు బ‌య‌ప‌డాలా..? ఏడ‌వాలా..? హౌజ్ అరెస్ట్ త‌ప్పినందుకు నిశ్చితంగా ఉండాలా..? పోలీసులు అరెస్ట్ చేస్తార‌ని భ‌య‌ప‌డాలా.? కార్తీక్ ఇదంతా క‌ళ్లారా చూసి దీప‌ను ఏం అన‌కుండా ఉన్నందుకు త‌ల బాదుకోవాలా..? ఇంకా దీప గురించి ఆలోచిస్తూ ఉన్నందుకు కంటికి, మింటికి ఏక‌ధాటిగా ఏడ‌వాలా..? అస‌లు ఇంత‌కు వాళ్ల అమ్మ ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు కార్తీక్ న‌న్ను పెళ్లి చేసుకుంటాడా..? అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.

  ఇక సౌందర్య ఇంట్లో ఆనంద‌రావుతో మ‌నం మ‌న ఇంట్లో అన్నీ సౌక‌ర్యాలు అనుభ‌విస్తున్నాము. కానీ మ‌న‌శ్శాంతిగా ఉండలేక‌పోతున్నాము. దానికి కార‌ణం నాకు ఇవాళ పూర్తిగా అర్థ‌మైంది. మ‌న వంశాకురాలిని ఆ పేదింట్లో వ‌దిలేసి మ‌నం ఇక్క‌డ ఉంటున్నాము. ఆ బిడ్డ‌ల‌ను క‌న్న త‌ల్లి రెక్క‌లు తెగినా ఎలాగోలా క‌ష్ట‌ప‌డి ఆ బిడ్డ‌ల‌ను పోషిస్తుంది. ఆ ధీన స్థితిని ఇవాళ నేను క‌ళ్లారా చూసి వ‌స్తున్నానండి. ఇదేమో కొత్త‌గా క‌నిపించిన దృశ్యం కాదు, కానీ ఈ స్థితికి అంద‌మే క‌నిపించ‌డం లేదు అని చెబుతుంది. అందుకని ఏం చేద్దాం సౌంద‌ర్య అని ఆనంద‌రావు అడ‌గ్గా.. ఇక్క‌డ ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిల‌బ‌డ్డారు. అక్క‌డ ఇద్ద‌రు మ‌న‌వ‌రాళ్లు ఉన్నారు, వాళ్ల‌కు ఇంకా లోక‌మే స‌రిగా తెలీదు, వాళ్ల‌కు మ‌న అవ‌స‌రం చాలా ఉందండి, అందుకే మ‌న ఇద్ద‌రం వెళ్లి అక్క‌డ ఉందామండి అని అంటుంది. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో అంజి, దీప‌కు అస‌లు నిజం చెప్ప‌నున్నాడు.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial

  ఉత్తమ కథలు