హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: అప్పుడు నేనే మీకు, మౌనిత‌కు పెళ్లి చేస్తా.. కార్తీక్‌కి దీప స‌వాల్

Karthika Deepam: అప్పుడు నేనే మీకు, మౌనిత‌కు పెళ్లి చేస్తా.. కార్తీక్‌కి దీప స‌వాల్

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకొని మౌనిత బాగోతాన్ని బ‌య‌ట పెట్టాల‌నుకుంటోన్న దీప‌.. అందుకోసం ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్ కారులో వెళుతుండ‌గా.. అత‌డిని ఫాలో అవుతుంటుంది దీప‌.

ఇంకా చదవండి ...

    Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకొని మౌనిత బాగోతాన్ని బ‌య‌ట పెట్టాల‌నుకుంటోన్న దీప‌.. అందుకోసం ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్ కారులో వెళుతుండ‌గా.. అత‌డిని ఫాలో అవుతుంటుంది దీప‌. ఆమె ఫాలో అవ్వ‌డాన్ని గ‌మ‌నించిన కార్తీక్.. మౌనిత ఇంటికి వెళ్ల‌కుండా ఆసుప‌త్రికి వెళ్లాల‌నుకుంటాడు. అయితే ఈ లోపే కార్తీక్‌ని ఓవ‌ర్ టేక్ చేసిన దీప.. ముందుకు వెళుతుంది. త‌రువాత కార్తీక్ మ‌ళ్లీ రూట్ మారుస్తాడు. మ‌రోవైపు కార్తీక్ కోసం చేసిన వంట‌ల‌ను మౌనిత డైనింగ్ టేబుల్ మీద పెడుతుండ‌గా.. ప్రియ‌మ‌ణి వ‌స్తుంది. అదేంట‌మ్మా వంటంతా మీరే చేశారు. నేను ఉన్నాను క‌దా. చెప్తే చేసే దాన్ని క‌దా అని ప్రియ‌మ‌ణి అంటుంది.

    దానికి మౌనిత.. నాకోసం అయితే నిన్నే చేయ‌మ‌ని చెప్పేదాన్నే. ఇంటికి కార్తీక్ వ‌స్తున్నాడు. అందుకే త‌న‌కు ఇష్ట‌మైన‌వ‌న్నీ స్వ‌యంగా నేనే వండాను అని అంటుంది. ఇక ప్రియ‌మ‌ణి షాక్‌గా కార్తీక్ అయ్య వ‌స్తున్నాడా అని అడుగుతుంది. వెంట‌నే మౌనిత‌.. ఏంటే ఆ చెత్త ప్ర‌శ్న‌. త‌ను ఎప్ప‌టికైనా ఇక్క‌డ‌కు రావాల్సిందే క‌దా అని అంటుంది. ఇక ప్రియ‌మ‌ణి.. అది కాద‌మ్మా. కార్తీక్ అయ్య‌ను నువ్వు ప్రేమిస్తున్నావు. కార్తీక్ అయ్య కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకో. కానీ కార్తీక్ అయ్య ఇక్క‌డ‌కు రాకుండా ఉండ‌టానికి ఏదో అడ్డుప‌డుతుంది. మ‌రి దాన్ని దాటుకొని ఇక్క‌డ‌కు వ‌స్తాడంటావా.? అని అడుగుతుంది.

    ఇక మౌనిత.. వ‌స్తాడు. కాదు కాదు వ‌చ్చేలా నేను చేస్తాను అని అంటుంది. దానికి ప్రియ‌మ‌ణి.. మీరు ఎన్నైనా చెప్పండి. నాకు న‌మ్మ‌కం లేదు. కార్తీక్ అయ్య వ‌స్తాన‌న్నా ఆ ఇంట్లో వాళ్లు చ‌చ్చినా రానివ్వ‌రు అంటుంది. ఇక మౌనిత‌.. ఎవ‌రు ఎంత అడ్డు ప‌డినా, అడ్డంకులు సృష్టించినా.. అవ‌న్నీ దాటుకొని వీళైతే అన్ని బంధాలను తెచ్చుకోనైనా స‌రే నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు. ఇదే ఫిక్స్ అని కుండ‌బ‌ద్ద‌లు కొడుతుంది. ఇక ప్రియ‌మ‌ణి.. ఏంటోన‌మ్మా. మీ నమ్మ‌కం మీద నాకు న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదు అని అంటుంది. దానికి ప్రియ‌మ‌ణి.. అయితే వెయిట్ చేయ్. ఇంకాసేప‌ట్లో కార్తీక్ ఇక్క‌డికే వ‌స్తాడు. అప్పుడు నీ కళ్ల‌తో నువ్వు చూసి న‌మ్ముదువు గానీ అని అంటుంది.

    ఇక ఆసుప‌త్రికి వెళ్లే కార్తీక్ కారు దిగి.. ఈ రాక్ష‌సి స్పైలా త‌యార‌య్యిందేంటి. అయినా న‌న్ను ఫాలో అవ్వాల్సిన అవ‌స‌రం ఏంటి..? అనుకుంటూ లోప‌లికి వెళ‌తాడు. లోప‌ల స్టాఫ్ అంతా ఒక చోట ఉండ‌గా.. ఏం జ‌రుగుతుంద‌ని తొంగి చూస్తాడు. అక్క‌డ దీప.. స్టాప్‌తో మాట్లాడుతూ ఉండ‌టం షాక్‌కి గుర‌వుతాడు. ఇక దీప చెప్పింది వింటోన్న స్టాఫ్.. ఇంట్ర‌స్టింగ్ ఇంట్ర‌స్టింగ్ అప్పుడు ఏం జ‌రిగింది అని అడ‌గ్గా.. డాక్ట‌ర్ కార్తీక్‌తో నా పెళ్లి జ‌రిగింది అని దీప అంటుంది. అంత‌టితో ఆగ‌కుండా ఏమాట‌కు ఆ మాట చెప్పుకోవాలి. మా వారు మ‌హా అంద‌గాడు సుమా అని దీప చెబుతుంది. ఇక అక్క‌డి స్టాఫ్.. మేమంతా ఆయ‌న స్కిన్ టోన్ చూసి జ‌ల‌సీ ఫీల్ అవుతుంటాము. మీరు చాలా అదృష్ట‌వంతులు మేడ‌మ్ అంటాడు. దానికి దీప‌.. ఐ నో. ఇప్పుడే ఇలా ఉంటే. కాలేజీ చ‌దివే రోజుల్లో స‌ర్ ఇంకెంత క్యూట్‌గా ఉండేవారు క‌దా. ఎంతైనా మా ఆయ‌న బంగారం. పిల్ల‌ల‌ను అయితే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. వాళ్ల‌ను చూడ‌కుండా ఒక్క రోజు కూడా ఉండ‌లేరు పాపం. మొన్న సంక్రాంతి పండుగ‌కు స్టాఫ్ అంద‌రినీ పిలిచి గెట్ టు గెద‌ర్ అరేంజ్ చేద్దాం అన్నాను. కానీ ఎమెర్జెన్సీ కేసులు వ‌స్తే పాపం క‌దా అన్నారు. నిజ‌మే క‌దా. ఇది మామూలు హాస్పిట‌లా..? గుండెకు సంబంధించిన‌ది. మీరంద‌రూ అందుబాటులో ఉంటేనే పేషెంట్స్‌కి సేఫ్టీ అనిపించింది. నో ప్రాబ్ల‌మ్ సంక్రాంతికి మిస్ అయినా నా చేత్తో నేను చేసిన అరిసెలు, పూత‌రేకులు మీ కోసం అట్టే పెట్టాను. రేపు మా డ్రైవ‌ర్ అంజితో పంపిస్తాను లెండి. అవి టేస్ట్ చేసి మీ డాక్ట‌ర్ గారు ఏమ‌న్నారో తెలుసా.? అని చెబుతుండ‌గా.. ఏమ‌న్నారు మేడ‌మ్ అని వారంతా ఆత్రుత‌గా అడుగుతారు. నీ చేతుల్లో అమృతం గానీ ఉందా ఏంటోయ్ అన్నారు అని న‌వ్వుతూ ఉంటుంది. ఇక దీప మాటల‌ను కార్తీక్ వింటూ ఉంటాడు. దీప కొన‌సాగిస్తూ.. అలాగ‌ని మీ పేషెంట్ల‌కు మెడిసిన్ బ‌దులు నేను చేసిన అరిసెలు పెడ‌తారా ఏంటి అని అడిగాను అని చెబుతూ ఉంటుంది.

    ఇక కార్తీక్‌ని చూసిన స్టాఫ్ అంతా అక్క‌డి నుంచి వెళ్లిపోతారు. ఆ త‌రువాత దీప మాట్లాడుతూ.. వ‌చ్చారా. మీ గురించే చెబుతున్నాను. ఆ అరిసెల గురించి కూడా చెప్పాను అని అంటుంది. వెంట‌నే కార్తీక్ ఏంటిది అని అడుగుతాడు. దానికి మిల్క్ షేక్ తాగుతున్న దీప‌ మిల్క్ షేక్. కావాలా..? బాగుంది. తెప్పించ‌నా..? అని అడుగుతుంది. ఆ త‌రువాత ఆమెను తీసుకొని లోప‌లికి వెళ‌తాడు కార్తీక్. ఏంటి ఇదంతా అని అడ‌గ్గా.. నేను మీ భార్య‌ను అని మీ స్టాఫ్ అంద‌రికీ మ‌రోసారి క‌న్ఫ‌ర్మ్ చేస్తున్నాను డాక్ట‌ర్ బాబు. మీరు ఈ మ‌ధ్య కొత్త ఎజెండా ఒక‌టి మొద‌లుపెట్టారు క‌దా. మీరు మౌనిత‌ను చేసుకుంటార‌ని స్టాఫ్‌లో అప్పుడే గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి మ‌రి. అందుకే ఆ కాకి మెడ దాన్ని మీరే చేసుకోలేద‌ని, నేను ఇంకా లైవ్‌లోనే ఉన్నాన‌ని.. మీ స్టాఫ్‌కి క్లియ‌ర్ అయ్యేలా చేసి.. మీ ఇద్ద‌రి గురించి వాళ్లు అనుకుంటున్న‌ది త‌ప్ప‌ని చెప్పి, మీ కోపాన్ని అమాంతం పెంచేశాను డాక్ట‌ర్ బాబు అని అంటుంది.

    ఇక కార్తీక్ కోపంగా.. న‌న్ను నా హాస్పిటల్‌లో కూడా గౌర‌వంగా బ‌త‌క‌నివ్వ‌వా..? అని అడుగుతాడు. దానికి దీప‌.. అయ్యో. అదేం అభాండం స్వామి. మిమ్మ‌ల్ని మీ హాస్పిట‌ల్‌లో ఇంత‌కుముందు క‌న్నా ఇప్పుడే గౌర‌వంగా బ్ర‌తికేలా చేశానంటే న‌మ్మ‌రేంటి. రేపు మౌనిత మీ హాస్పిట‌ల్ వ‌చ్చినా దాని కారెక్ట‌ర్‌ని త‌ప్పు ప‌డ‌తారే త‌ప్ప మిమ్మ‌ల్ని మాత్రం శ్రీరామ చంద్రుడు అనే అనుకుంటారు. అలా అనుకునేలా నేను చేశాను అని అంటుంది. ఇక కార్తీక్.. నీ ప‌ట్ల చాలా అమానుషంగా ప్ర‌వ‌ర్తించాలి. కానీ నా వివేకం నన్ను ఆపుతోంది. పిల్ల‌ల మొమం చూసి నిన్ను క్షమించి వ‌దిలేస్తున్నాను. అయినా నువ్వు నా స‌హ‌నాన్ని పరీక్షిస్తూనే ఉన్నావు. మ‌న భార్య భ‌ర్తల స‌మ‌స్య‌ను నువ్వు జాతికి అంకితం చేస్తున్నావా..? జాతీయ స‌మ‌స్య‌గా చిత్రీక‌రిస్తున్నావా..? ప‌్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న ఒక మ‌హ‌మ్మారిగా మారుస్తున్నావా..? అస‌లు ఏం చేస్తున్నావే నువ్వు. ఏమైందే నీకు..? ముదిరిపోయిన డిటెక్టివ్‌లాగా ఆ బండి మీద న‌న్ను ఫాలో అవ్వ‌డం ఏంటి..? నేను ఎక్క‌డికి వెళితే అక్క‌డ‌కు వెంటాడుతూ రావ‌డం ఏంటి..? నీకు పిచ్చి ఏమైనా ప‌ట్టిందా..? లేక‌పోతే నాకు ఏమైనా పిచ్చి ప‌ట్టేలా చేద్దామ‌ని కంక‌ణం క‌ట్టుకున్నావా..? అని మండిప‌డ‌తాడు.

    దానికి దీప‌.. అయ్యో.. ఛీ..ఛీ.. మీకు పిచ్చి ప‌డితే నాకేం ఒరుగుతుంది. నా మొహం. కావాలంటే మీ స్టాఫ్‌ని అడ‌గండి. మీరు ఎంట‌ర్ కాక‌ముందు మీలో ఆత్మ‌స్థైర్యాన్ని వీక్షించే ఒక ఆద‌ర్శ‌మూర్తి ఉన్నాడ‌ని మీ ఘ‌న కీర్తిని పుంకాలు పుంకాలుగా వివ‌రించాను తెలుసా అని అంటుంది. ఇక కార్తీక్.. ఇదేమైనా శ‌రీరం మొత్తం చెక‌ప్ అనుకున్నావా..? మొత్తం అంతా చెక్ చేశాను. ఎవ్రీ థింగ్ విల్ బి ఆల్ రైట్ అని స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డానికి. నా కారెక్ట‌ర్ నువ్వు స్కాన్ చేసి, నా వ్య‌క్తిత్వాన్ని నువ్వు మైక్రోస్కోప్‌లో చూసి, నాకు ఒక స‌ర్టిఫికేట్ ఇచ్చి పోదాం అనుకుంటున్నావా..? పోవే. ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో అని కోపంగా అంటాడు.

    దాంతో దీప పోతానులెండి. అంత చిరాకు దేనికి, చూడండి. నా మీద ప‌డ్డ నింద నిజం అని మీరు సాక్ష్యాల‌తో నిరూపించండి. అప్పుడు నేనే మౌనిత‌కు, మీకు పెళ్లి జ‌రిపించి.. అస్త‌మిస్తోన్న సూర్యుడికేసి అలా న‌డుచుకుంటూ వెళ‌తాను. కానీ మీ పెళ్లి జ‌రిగే ఛాన్స్ లేదు క‌దా. ఎందుకంటే ఆ మౌనిత బ‌య‌ట ఉంటే క‌దా. క‌చ్చితంగా జైలుకి వెళుతుంది. ప్రామిస్. జ‌రిగేద‌దే వ‌స్తాను. ఆ అన్న‌ట్టు మీ స్టాఫ్‌కి అరిసెలు పంపిస్తాన‌ని కమిట్ అయ్యాను. రేపు మీరు వ‌చ్చేట‌ప్పుడు ఏ స్వ‌గృహ ఫుడ్స్‌లోనూ తెచ్చి వాళ్ల‌కు పంచండే. వ‌స్తాను అని వెళ్లిపోతూ.. కార్తీక్ సైడ్ రొమాంటిక్‌గా చూస్తుంది. దీప చ‌ర్య‌ల‌కు కార్తీక్ కోపంతో అక్క‌డున్న ఒక వ‌స్తువును విసిరేస్తాడు. ఆ త‌రువాత మ‌ళ్లీ వ‌చ్చిన దీప‌.. త‌న గ్లాసెస్‌, మిల్క్ షేక్‌ని తీసుకెళుతుండ‌గా.. కార్తీక్ స్టెత‌స్కోప్‌తో వెంట‌ప‌డ‌తాడు. ఇక అక్క‌డి నుంచి దీప త‌ప్పించుకొని వెళుతుంది.

    మ‌రోవైపు సౌంద‌ర్య ఇంట్లో ఆనంద‌రావు.. ఏంటి సుపుత్రుడు అంత చిరాక్కా వెళ్లాడు అని అడుగుతాడు. సౌర్య‌తో క‌లిసి టిఫెన్ చేస్తాను అని చెప్పి ఫోన్ రాగానే వెళ్లిపోయాడు క‌దా అని ఆనంద‌రావు చెప్ప‌గా.. దీప గానీ కాల్ చేసింది అంటారా..? అని అంటుంది. నువ్వే ఫోన్ చేసి దీప‌ను క‌నుక్కోలేక‌పోయావా అని ఆనంద‌రావు అడ‌గ్గా.. ఒక్క నిమిషం అని సౌంద‌ర్య, దీప‌కు ఫోన్ చేస్తుంది. అయితే దీప ఆ ఫోన్‌ని క‌ట్ చేస్తుంది. దానికి సౌంద‌ర్య‌.. ఏంటి ఇది. సాధార‌ణంగా నా ఫోన్ లిఫ్ట్ చేయ‌కుండా ఉండ‌దే. ఎక్క‌డుందో..? అని అంటూ ఉంటుంది. ఇద్ద‌రు ఏమైనా గొడ‌వ ప‌డుతున్నారేమో అని ఆనంద‌రావు చెప్ప‌గా.. అంత దూరం ఆలోచించే ధైర్యం లేదు అని సౌంద‌ర్య అంటుంది. సరే అని ఆనంద‌రావు అన‌గా.. త‌రువాత దీప చేస్తుంది క‌దా అడిగి తెలుసుకుంటాను అని సౌంద‌ర్య చెబుతుంది. ఈ రౌడీ ఎక్క‌డ అని ఆనంద‌రావు అడ‌గ్గా.. వాడు అలా చిరాకుగా వెళ్లేస‌రికి కాస్త డిజ‌ప్పాయింట్ అయిన‌ట్లు ఉంది. నేనే ఆ మాట‌, ఈ మాట చెప్పి, న‌వ్వించి తినిపించాను. త‌రువాత అంజితో కారులో హిమ‌ను క‌ల‌వ‌డానికి వెళ‌తాను అని చెప్పింది. అందుకే పంపించాను అని సౌందర్య చెబుతుంది. ఇక ఆనంద‌రావు.. వీడు నిజంగానే సౌర్య‌ను, హిమ‌ను చూసుకున్న‌ట్లే చూసుకుంటున్నాడు. ఆ విష‌యంలో నిజంగా గ్రేట్ అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. ఆ మౌనిత నిజ స్వ‌రూపం తెలిసిన రోజు. వాడిలోని అస‌లు సిస‌లైన ఆద‌ర్శ‌వాది, సంస్కారవంతుడు బ‌య‌ట‌కు రాడు అని చెబుతుంది.

    ఇక మౌనిత ఇంటికి వెళ్లిన కార్తీక్ సోఫా మీద కూర్చొని ఉంటాడు. అత‌డిని చూసిన మౌనిత‌.. వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చూస్తున్నాను. ఏదో సీరియ‌స్‌గా ఉన్నాడు. ఏమై ఉంటుంది. నా గురించి ఏమైనా తెలుసుకొని వ‌చ్చాడా.? లేదంటే హిమ కోసం దీప‌, సౌర్య‌ల‌ను తెచ్చేసుకుంటా అని చెప్తాడా..? ఈ కార్తీక్ ఎప్పుడు ఏ బాంబ్ నెత్తిన వేస్తాడో ఎవ్వ‌రికీ తెలీదు అనుకుంటుంది. ఆ త‌రువాత ఏంటి అలా ఉన్నావు అని కార్తీక్‌ని అడుగుతుంది. దానికి కార్తీక్..నిన్ను ఒక‌టి అడుగుతాను. సూటిగా జ‌వాబు చెప్తావా..? అని అడుగుతాడు. వెంట‌నే మౌనిత‌.. ఈ ప్రపంచంలో సూటిగా స‌మాధానం చెప్పే వారిలో మొద‌టి స్థానంలో ఉండేది మౌనితే. అడుగు. సూటిగానే చెప్తాను అని అంటుంది.

    ఇక కార్తీక్.. దీప‌కు, నీకు మ‌ధ్య నాకు తెలీకుండా ఏదో గొడ‌వ జ‌రుగుతోంది. ఏంటి అది అని ప్ర‌శ్నిస్తాడు. దానికి మౌనిత నీళ్లు న‌ములుతూ నీకు ఎందుకు అలా అనిపించింది..? అని ప్ర‌శ్నిస్తుంది. నాకు ఎందుకు అలా అనిపించింది అనేది ప‌క్క‌న పెట్టు. నేను నిన్ను సూటిగా చెప్ప‌మ‌న్నాను. నువ్వు చెప్తాన‌న్నావు. తెలివిగా ఎదురుప్ర‌శ్న‌లు వేయ‌కు అని అంటాడు. ఇక మౌనిత‌.. నువ్వు న‌న్ను సూటిగా జ‌వాబు చెప్ప‌మ‌న్నావు అంటే నీకు అంత న‌మ్మ‌కంగా ఏదో ఒక సాక్ష్య‌మో, ఏదో ఒక ఆధార‌మో దొరికి ఉండాలి క‌దా. ఏంటా సాక్ష్యం, ఏంటా ఆధారం అని అడుగుతుంది. వెంట‌నే కార్తీక్.. దీప అని చెప్ప‌గా.. మౌనిత షాక్‌కి గురి అవుతుంది. దీప హాస్పిట‌ల్‌కి వ‌చ్చి, నువ్వు గ్యారెంటీగా జైలుకు వెళ్తావు అని చెప్పింది. అస‌లు దీప‌, త‌న ప‌విత్ర‌త‌ను రుజువు చేసుకొని నాలో అనుమానాల‌న్నీ పోగొట్టే ప్ర‌య‌త్నాలు అన్నీ ప‌క్క‌న‌పెట్టి నీ మీద ప‌డిందేంటి..? అంటే దీప మీద ఉన్న అనుమానం నాలో నుంచి పోవాలంటే దానికి, నీకు ఏంటి సంబంధం అని అడుగుతాడు. దానికి మౌనిత‌.. ఓ మై గాడ్. కార్తీక్‌కి ప‌దేళ్ల క్రితం రావాల్సిన ఆలోచ‌న.. ప‌దేళ్ల త‌రువాత దీప ద్వారా వ‌చ్చింది. అంటే దీప సైక‌లాజిక‌ల్‌గా కార్తీక్‌ని బాగా ట్యూన్ చేస్తోంది. దీప మీద ప‌డ్డ నింద‌కు, నాకు సంబంధం ఉన్న‌ట్లు కార్తీక్‌లో ఆలోచ‌న రేకెత్తేలా చేసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి..? ఎలా కార్తీక్‌ని ఈ డౌట్ నుంచి త‌ప్పించాలి అని మ‌న‌సులో అనుకుంటుంది.

    ఇక కార్తీక్.. మాట్లాడు మౌనిత‌. మీ ఇద్ద‌రి మ‌ధ్య ఇంకేదైనా ర‌హ‌స్యం దాగుందా..? దానికి తోడు అంజిగాడు కూడా నీ గురించి నెగిటివ్‌గా చెప్ప‌డానికి ట్రై చేస్తున్నాడు. ఇదంతా ఏంటి..? ఏం జ‌రుగుతుంది...? నా వెనుక ఏం జ‌రుగుతోంది..? నిన్ను నీ ఇంట్లోనే బంధించింది అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నందుకేనా..? లేక‌పోతే ఇంకేమైనా ఉందా..? ఉంటే ఏంటి అది అడుగుతాడు. ఇక దానికి మౌనిత.. అనుకున్నాను. నీ భార్య చాలా తెలివిగా సైన్యాన్ని కూడ‌గ‌ట్టుకొని.. నిన్ను, న‌న్ను విడ‌దీయాల‌న్న కుట్ర‌లో విజ‌యం సాధించేలా ఉంద‌ని. దీప తెలివైంది అనుకున్నాను. కానీ మరీ ఇంత తెలివైంది అనుకోలేదు. సాక్ష్యాలు సంపాదించ‌లేక సైక‌లాజిక‌ల్‌గా నిన్ను ట్యూన్ చేస్తోంది. నా మీదే నీకు అనుమానం వ‌చ్చేలా చేస్తోంది. కానీ ఒక్క‌టి నిజం. నేనేంటి అనేది నాకు తెలుసు. ఏ త‌ప్పు చేయ‌లేదు నేను. కాబ‌ట్టి నీకు సూటిగా స‌మాధానం చెబుతున్నాను. దీప నా మీద చేసే ఆరోప‌ణ‌ల‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవ‌లం అవ‌న్నీ అభూత క‌ల్ప‌న‌లే. న‌మ్మితే సంతోషం. న‌మ్మ‌క‌పోతే నా ఖ‌ర్మ అనుకుంటాను. నీ ఖ‌ర్మ అని కూడా అనుకుంటాను. ఎందుకంటే నీ క‌ళ్ల ముందే త‌ప్పు చేసినా ఇంకా నీ భార్య క‌ల్ల‌బొల్లి మాట‌లు న‌మ్ముతున్నావే అందుకు అని లోప‌లికి వెళుతుంది. ఆ త‌రువాత కార్తీక్.. దీప చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేసుకంటూ ఉంటాడు.

    ఇక లోప‌లి నుంచి మౌనిత కొన్ని పేప‌ర్లు తీసుకొచ్చి.. ఇది నేను సిటీ ఔట్‌స్క‌ర్ట్‌లో కొన్న విల్లా తాలూకు డాక్యుమెంట్స్. కొని మూడేళ్లు అవుతుంది. మ‌నం పెళ్లి చేసుకుంటే మీ అమ్మ మ‌న‌ల‌ను ఇంట్లోకి అడుగుపెట్ట‌నివ్వ‌దు కాబ‌ట్టి. నీతో క‌లిసి అక్క‌డ ఉండ‌టానికి నేను కొన్న విల్లా ఇది. ఇంకొక‌టి సిటీ ఔట్‌స్క‌ర్ట్‌లో నేను కొన్న ఫామ్ హౌజ్ ఇది. మ‌న బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ కోసం ఫామ్ హౌజ్ వెళ్లొచ్చ‌ని ఈ ఫామ్ హౌజ్ కొన్నాను. నాకు నీ ఆస్తి మీద వ్యామోహం లేదు. నీ త‌ర‌పు నుంచి నాకు ఒక్క రూపాయి కూడా అవ‌స‌రం లేదు. నాకే బోలెడు ఆస్తులు ఉన్నాయి అన‌డానికి ఇవే ఉదాహ‌ర‌ణ‌. కేవ‌లం నాకు నువ్వే కావాలి. నువ్వు నువ్వుగా కావాలి. అని చెబుతుంది. కార్తీక దీపం కొన‌సాగుతోంది.

    Published by:Manjula S
    First published:

    Tags: Karthika deepam, Karthika Deepam serial, Televison News

    ఉత్తమ కథలు