బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. సౌర్య, హిమలను తీసుకొని దీప(Deepa Vantalakka).. సౌందర్య ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో నెక్ట్స్ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి పెరిగింది.
Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. సౌర్య, హిమలను తీసుకొని దీప.. సౌందర్య ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో నెక్ట్స్ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి పెరిగింది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్లో సౌందర్య ఇంటి బయట కూర్చొని, దీప గురించి ఆలోచిస్తూ ఉండగా.. కార్తీక్ వస్తాడు. నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని ప్రశ్నించగా.. ఒకప్పుడు నేను అసలు ఇష్టపడని ఓ మనిషిని నువ్వు నా దగ్గరకు తీసుకొచ్చావు. అప్పుడు నేను దాన్ని ఇక్కడే ఉంచా. దానికి ఉన్నది ఆత్మ గౌరవం అని అది ఇల్లు దాచి వెళ్లినప్పుడే తెలిసింది. అది తప్పు చేసిందని నేను అనుకున్నా. అప్పుడు అది ఆత్మ గౌరవం అని నువ్వు నమ్మావు. ఇప్పుడు అది తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావు. కానీ నేను ఆత్మ గౌరవం అని అంటున్నా అని ఏడుస్తుంది. నువ్వు ముందు అక్కడి నుంచి లోపలికి రా అని వెళ్లిపోతాడు.
మరోవైపు నువ్వంటే ఎందుకు అమ్మా.. నాన్నకు అంత కోపం అంటూ హిమ, దీపను ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పేందుకు దీప ఆలోచిస్తుండగా.. సౌర్య నవ్వుతూ నువ్వు, నేను పెద్ద అయినా ఈ ప్రశ్నకు మాత్రం వీరు సమాధానం చెప్పరంటూ మాట్లాడుతుంది. దానికి కోప్పడ్డ దీప, సౌర్యపై కోప్పడింది. దీంతో హిమ బయపడుతుంది. ఇక కార్తీక్ అసలు ఏం చేస్తున్నాడు. హిమను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేడు. అలా అని ఉండలేక దీప దగ్గరికి వెళ్తే.. నేనేం కావాలి. హిమ, విహారి కూతురు అని చెప్పి చెప్పి కార్తీక్ మనసులో అలజడిని సృష్టించినా.. హిమ కోసం కార్తీక్ మారుతాడా..? దీపకు దగ్గరవుతాడా..? అంటూ ఆలోచిస్తూ.. అలా జరగడానికి వీలు లేదు. కార్తీక్‌ని దక్కించుకునేందుకు నేను ఏదో ఒకటి చేయాలి. 48 గంటల్లోనే అది చేయాలి అంటూ కొత్త ప్లాన్‌ని ఆలోచిస్తుంటుంది.
ఇదిలా ఉంటే రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ.. హిమను కలవరిస్తూ కార్తీక్ ఏడుస్తుంటే ఇంట్లో అందరూ లేస్తారు. సౌందర్య, కార్తీక్ దగ్గరకు వెళ్లేందుకు సిద్ధపడుతుంటే.. ఆదిత్య ఆపుతాడు. వద్దు మమ్మీ.. ఆ ఫ్రస్టేషన్ అంతా అన్నయ్య నీ మీద చూపిస్తాడు. నేను వెళతా అని కార్తీక్ దగ్గరకు వెళ్తాడు ఆదిత్య. కార్తీక్ దగ్గరకు వెళ్లి.. చేయి వేయగా.. ఈ సమయంలో మీరెందుకు వచ్చారు అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. నీ బాధ విని వచ్చాము అని చెప్పగా.. నా బాధ కిందికి వినిపించిందా.. క్షమించండి మిమ్మల్నినేను ఇబ్బంది పెట్టా అని కార్తీక్ అంటాడు. వెంటనే అన్నయ్య నేను రేపు వెళ్లి హిమను తీసుకొస్తాను అంటూ చెప్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమోలో మౌనిత దగ్గరకు వెళ్లిన కార్తీక్.. దీప, విహారి మధ్య ఉన్న సంబంధం ఏంటో నువ్వే నిరూపించాలి. హిమ, సౌర్య ఇద్దరు దీప, విహారి పిల్లలు అని నువ్వే నిరూపించాలి అని చెప్తాడు. మరోవైపు తన భర్త, తనపై పెట్టుకున్న అనుమానం తొలిగేలా ఒక్క మార్గం చూపు అంటూ దీప దేవుడిని ప్రార్థిస్తుంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.