• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KARTHIKA DEEPAM SERIAL UPDATE ANJI WARNS MOUNITHA SOURYA CAME TO SOUNDARYA HOUSE MNJ

Karthika Deepam: మౌనిత‌కు అంజి హెచ్చ‌రిక‌.. సౌర్య రాక‌తో సౌంద‌ర్య ఇంట సంతోషాలు

Karthika Deepam: మౌనిత‌కు అంజి హెచ్చ‌రిక‌.. సౌర్య రాక‌తో సౌంద‌ర్య ఇంట సంతోషాలు

కార్తీక దీపం సీరియల్ (Hot Star)

Karthika Deepam: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న‌ ‘కార్తీకదీపం’ సీరియల్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో.. సౌంద‌ర్యతో మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య‌. వ‌దిన ఏమైనా అంటుంద‌నే.. అన్నయ్య శ్రావ్య‌ను వెంట‌బెట్టుకొని వెళ్లాడు మమ్మీ అని చెబుతాడు ఆదిత్య‌.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న‌ ‘కార్తీకదీపం’ సీరియల్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో.. సౌంద‌ర్యతో మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య‌. వ‌దిన ఏమైనా అంటుంద‌నే.. అన్నయ్య శ్రావ్య‌ను వెంట‌బెట్టుకొని వెళ్లాడు మమ్మీ అని చెబుతాడు ఆదిత్య‌. ఎందుకు అని సౌంద‌ర్య అడ‌గ్గా.. హిమ క‌ళ్లు ఎర్ర‌బ‌డ్డాయ‌ట‌, అందుకు ఐడ్రాప్స్ తీసుకెళ్లాడు అని చెబుతాడు. నిన్న దీప, హిమ‌ను మ‌ధ్య‌లో తీసుకెళ్లింది కదా.. ఇప్పుడు ఆ వంక పెట్టుకొని త‌న బిడ్డ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్స‌న ఖ‌ర్మ ఆ తండ్రికి ప‌ట్టింది అని అంటాడు. ఇలాగే నాలుగైదు సాకులు వెతికి త‌రువాత అంద‌రినీ ఇంటికి తీసుకొస్తాడులే అని సౌంద‌ర్య చెబుతుంది. ర‌క్త‌పాశ‌మే అక్క‌డి వ‌ర‌కు తీసుకెళ్లింది వాడిని అని చెబుతుంది. మ‌రి ర‌క్త‌పాశం అయితే హిమ‌పై చూపించే ప్రేమ సౌర్య‌పై ఎందుకు చూపించడు మ‌మ్మీ అని ఆదిత్య అంటాడు.

    దానికి సౌందర్య.. పిచ్చి సన్నాసి. వెర్రి స‌న్నాని. నువ్వు తండ్రివైనా కూడా నీకు తెలీయ‌ట్లేదు. నువ్వు ఇప్పుడు పుత్రోత్సాహంలో ఉన్నావు. నీ కొడుకు పెద్దై నాన్న అని పిలిస్తే నీకు పుత్ర‌వాత్స‌ల్యం తెలుస్తుంది. హిమ‌ను చిన్న‌ప్పటి నుంచి అన్న‌య్య పెంచాడు. అయినా సౌర్య‌ను వేరుగా ఎప్పుడూ చూడ‌లేదు. సౌర్య‌, దీప కూతురు అని తెలిసి చ‌దివిస్తున్నాడు. రెండు సార్లు బ‌ర్త్‌డే కూడా చేశాడు.. సౌర్య దాని కూతురని వాడితెలుసు కానీ సౌర్య కూడా వాడి కూతురేనని మనకు తెలుసు. ఏమో వాడు సౌర్య‌ను కూడా ఇంటికి కూడా తీసుకొస్తాడేమో అని చెబుతుంది.

    ఇక ఇంట్లో మౌనిత‌.. అంజి, దీప‌ల‌కు చేసిన ఛాలెంజ్‌ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వారిద్ద‌రిని నేను రెచ్చ‌గొట్టానా.. వారు రెచ్చిపోతే నా క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తుంది. అస‌లు ఈ టైమ్‌లో ప్రిమ‌య‌ణి కూడా లేదు అని అనుకుంటూ టెన్ష‌న్ ప‌డుతుంది. అదే స‌మ‌యానికి అంజి టార్చ్ లైట్‌తో మౌనిత ఇంట్లోకి వ‌స్తాడు. చీక‌టిలో అంజిని, ప్రియ‌మ‌ణి అనుకునే మౌనిత‌.. కాఫీ తీసుకురా అని చెబుతుంది. దానికి అంజి.. కాఫీ ఎందుకు విషం తీసుకురానా అని చెప్పి.. మౌనిత ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు.

    ఇంకా ఏం ఆలోచిస్తున్నావు. మిగిలిన ఉన్న ప‌నులు ఎలా చేయాల‌నా.. ఇప్ప‌టికైనా త‌ప్పులు మాని డాక్ట‌ర్ బాబుకు దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. అయితే ఆ వార్నింగ్‌తో టెన్ష‌న్ ప‌డిన‌ప్ప‌టికీ.. వీడికి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు కనిపిస్తే ఇంకా రెచ్చిపోతాడు అని మౌనిత మ‌న‌సులో అఅనుకుంటుంది. బ‌య‌పెట్టో, ట‌న్ష‌న్ పెట్టో వాడిని ఇక్క‌డి నుంచి పంపేయాల‌ని అనుకుంటుంది. ఇక అంజితో..‘చూడు ఆంజనేయులు. నువ్వు రామాయ‌ణంలో ఆంజ‌నేయుడిలా.. ఇక్క‌డ దీప‌, కార్తీక్‌ల‌ను కలపడానికి ప్రయత్నిస్తున్నావని అర్థమైంది.. కానీ నువ్వు నేను క్రిమినల్స్. క్రిమినల్స్ క్రిమినల్స్‌గా ఉంటేనే మంచింది. ఎంతకావాలో అడుగు ఇస్తా’ అంటంది. వెంట‌నే అంజి కోపంతో.. ‘నోర్మూయ్.. నేను మారాను. సుఫారీ..’ అని అన‌బోతుండ‌గా. మౌనిత అడ్డుప‌డుతూ ‘అంజీ.. చూడు.. మారడం, మారిపోవడం అంతా ట్రాష్ అని చెబుతుంది.

    ఇక అంజి కోపంతో.. ఇప్పుడు నేను రెండు ఉద్యోగాలు చేస్తున్నా. ఒకటి డ్రైవర్.. రెండు స్క్రూడ్రైవర్.. అర్థం కాలేదా.. నీ స్క్రూలన్నీ లూజ్ అయ్యి తెగ రెచ్చిపోతున్నావు కదా. టైట్ చేసి, కార్తీక్ సార్ దగ్గరకు రాకుండా చెయ్యడం నా రెండో ఉద్యోగం.. ఇప్పుడు అర్థమైందా?’అంటాడు అంజి. ఇక మౌనిత‌.. అయినా హిమ‌ను నేను చంపిన‌ట్లు ఆధారం ఏమైనా ఉందా..? అది నువ్వే చేశావ‌ని ఆధారాలు ఉన్నాయి.. ఆ లారీ నంబ‌ర్ ప్లేట్‌తో స‌హా.. ఓన‌ర్ కూడా నాకు బాగా తెలుసు. కేసు తిర‌గ‌దోడితే నువ్వే ముందు ఇరుక్కుంటావు. ఇది గుర్తుపెట్టుకో.. అయినా ప్ర‌తి వాడు బెదిరించేవాడే. ఇప్పుడు టైమ్ ప‌ది అవుతుంది. ఒంట‌రిగా ఉన్న ఆడ‌దాని మీద‌కు అఘాయిత్యం చేసేందుకు వ‌చ్చావ‌ని నేను చెబితే అని అంజిని మౌనిత బెదిరించాల‌ని చూస్తుంది. దీంతో అంజి షాక్‌కి గురి అవుతాడు. ఇక నువ్వు ఆడ‌దానివి అయితే క‌దా అని అంజి అన‌గా.. నువ్వు మగాడివైతే.. హిమ‌ను నేనే చంపించానని సాక్ష్యాలతో నిరూపించు.. పోరా’ అంటుంది. ఇక వెళ్తూ వెళ్తూ అంజి.. ఒక హత్య చేసినా రెండు హత్యలు చేసినా ఒకటే శిక్ష.. ఇప్పటికైనా నీ తప్పులు తెలుసుకుని డాక్టర్ బాబుకి దూరంగా ఉండకపోతే.. నేను చేసే రెండో హ‌త్య నీదే అవుతుంది అని హెచ్చ‌రిస్తాడు.

    ఇక దీప ఇంట్లో సౌర్య బ్యాగ్ స‌ర్దుకుంటుండ‌గా.. దీప‌, ముర‌ళీకృష్ణ, హిమ‌, శ్రావ్య అంద‌రూ షాక్‌కి గుర‌వుతారు. ఎక్క‌డికి అత్త‌మ్మా అని దీప అడ‌గ్గా. నాన్న‌తో వెళుతున్నా అని అంటుంది. వ‌ద్దులే అత్త‌మ్మా.. మ‌ళ్లీ అక్క‌డ ఏదైనా అంటే నువ్వు బాధ‌ప‌డ‌తావు అని దీప చెప్ప‌గా.. నాన్న‌నే ర‌మ్మ‌న్నారు బ‌ట్ట‌లు స‌ర్దుకొని. రెండంటే రెండు రోజులే అక్క‌డ ఉండి వ‌స్తాను అని చెబుతుంది. దాంతో అంద‌రూ సంతోష‌ప‌డ‌తారు. ఇక వెళ్తున్నావా అని హిమ అడ‌గ్గా.. నువ్వు రావా అని సౌర్య అడుగుతుంది. నేను అంద‌రినీ తీసుకెళ్లిన‌ప్పుడే వ‌స్తాను అని హిమ చెబుతుంది. ఇక సౌర్య, శ్రావ్య‌ను తీసుకొని బ‌య‌ట‌కు వెళ్తే.. దీప జాగ్ర‌త్త‌లు చెబుతుంటుంది. దానికి సౌర్య‌.. అమ్మా నేను హాస్ట‌ల్‌కి వెళ్ల‌డం లేదు. నాన్న ద‌గ్గ‌ర‌కి వెళుతున్నా అని చెబుతుంది.

    ఇక అంద‌రూ బ‌య‌ట ఉండ‌గా.. హిమ‌ను చూసిన కార్తీక్.. పెంచిన‌ది రాన‌ని చెప్పింది. పెంచ‌నిది వ‌స్తానంది. హిమ‌ను నేను పెంచినా బుద్దుల‌న్నీ దీప‌వే వ‌చ్చాయి. అంద‌రినీ తీసుకెళ్తేగానీ రాన‌ని మొండిప‌ట్టు ప‌ట్టింది. ఎంతైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అని మ‌న‌సులో అనుకుంటాడు.

    మ‌రోవైపు ప్రియ‌మ‌ణి ఇంటికి వ‌చ్చి.. తిన్నారా అమ్మా అని మౌనిత‌ను అడుగుతుంది. లేదు ప్రియ‌మ‌ణి.. మ‌న‌సేం బాలేదు. తినాల‌ని పించ‌డం లేదు అని చెప్ప‌గా.. అయితే పాలు తీసుకొస్తాను. తాగి ప‌డుకోండి అని ప్రియ‌మ‌ణి చెబుతుంది. ఇక అంజి వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేసుకునే మౌనిత‌.. ఆ స‌మ‌యంలో ప్రియ‌మ‌ణి ఇంట్లో లేదు కాబ‌ట్టి స‌రిపోయింది. లేక‌పోతే దీనికి నా నేరాల‌న్నీ తెలిసేవి అని అనుకుంటుంది.

    ఇక సౌంద‌ర్య ఇంట్లో ఆదిత్య‌.. ఏ క‌న్ను అదిరితే మంచిదంటూ సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల ద‌గ్గ‌రికి వ‌స్తాడు. ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లేంటరా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. చెప్పండి మమ్మీ అని అంటాడు. ఇక ఆనంద‌రావు.. ముందు నీకు ఏ క‌న్ను అదురుతుందో చెప్పు అని అన‌గా.. రెండు క‌ళ్లు అదురుతున్నాయి అని అంటాడు. దానికి ఆనంద‌రావు.. దానికి స‌మాధానం ఏ శాసనంలో లేదు అని చెబుతాడు. దీంతో సౌంద‌ర్య‌, ఆనంద‌రావు న‌వ్వుతారు. ఇక ఇంటికి రాగానే.. శ్రావ్య‌ను ద‌గ్గ‌ర‌గా తీసుకున్న సౌర్య‌.. నీకు తెలుసా.. ఫ‌స్ట్‌టైమ్ నాన్న‌తో నాన్న కూతురిగా ఈ ఇంటికి రావ‌డం అని చెబుతుంది. దానికి శ్రావ్య అవునా అంటూ న‌వ్వుతుంది. ఇక లోప‌లికి వెళ్లే స‌మ‌యంలోనూ కార్తీక్ చెయ్యిని ప‌ట్టుకుంది సౌర్య‌. ఇక కార్తీక్ ఏం మాట్లాడ‌కుండా అలానే లోప‌లికి వెళ‌తాడు. వారు అలా రాగానే.. సౌంద‌ర్య‌, ఆనంద‌రావు, ఆదిత్య షాక్‌కి గుర‌వుతారు. ఎందుకు అంద‌రూ అంత బిగిసుకొని ఉన్నారు. సౌర్య రెండు రోజులు మ‌నతోపాటే ఉంటుంది అని కార్తీక్ చెప్ప‌గా.. సౌంద‌ర్య‌, ఆనందరావు, ఆదిత్యలు సంతోష‌ప‌డ‌తారు. ఇక ‘నా రూమ్‌లో బ్యాగ్ పెట్టుకో రౌడీ మ‌న‌వ‌రాలా..’ అని సౌందర్య సౌర్యతో అన‌గా.. లేదు నేను ఈ రెండు రోజులు డాక్ట‌ర్ బాబు గ‌దిలోనే ఉంటా. అక్క‌డే ప‌డుకుంటా అని చెబుతుంది.

    ఇక సౌర్య‌ను గ‌దిలోకి వెళ్లి ప్రెష్ అవ్వ‌మ‌ని చెప్తాడు కార్తీక్. అలాగే సౌర్య‌కు ఇష్ట‌మైనవి చేయ‌మ‌ని శ్రావ్యకు చెబుతాడు. ఇక‌ సౌందర్య కార్తీక్‌తో ‘హిమని తీసుకొస్తావనుకుంటే.. సౌర్యని తీసుకొచ్చావేంట్రా?’ అని సౌంద‌ర్య అడుగుతుంది. దానికి నేను నీతో రెండంటే రెండు రోజులు ఉంటాను నాన్న అని సౌర్య అడిగిన విష‌యాన్ని గుర్తు చేసుకునే కార్తీక్..హిమైనా, సౌర్య అయినా లోకం తెలియ‌ని పసివాళ్లే కదా మమ్మీ.. అందులోనూ ఆడపిల్లలు.. పాపానికి, పసితనానికి ముడిపెట్టేంత మూర్ఖుడు కాదమ్మా నీ కొడుకు.. అందులోనూ అది నోరు తెరిచి ఆశ‌గా అడిగింది. నాన్నా రెండంటే రెండు రోజులు నీతో ఉంటాను అని. నేను నీకు నాన్న‌నే కాదు అని ఎందుకు చెప్పాలి మ‌మ్మీ. పాపం కదా అని అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌, కార్తీక్ నుదిటిపై ముద్దు పెడుతుంది. ఆ త‌రువాత ఆనందరావు దగ్గరకు వెళ్లి.. ఎంత గొప్ప‌టి కొడుకును ఇచ్చావయ్యా ఆనందరావు అంటుంది.

    ఇక కార్తీక్ పైకి వెళుతూ.. సౌర్య అడిగితే కాద‌న‌లేక తీసుకొచ్చాను మ‌మ్మీ. నా కూతురిని అది తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంది. ఇప్పుడు నేను దాని కూతురిని తీసుకొచ్చా. నా బాధ ఏంటో ఇప్సుడైనా దానికి తెలుస్తుంది అని అంటాడు. వెంట‌నే సౌందర్య ‘పంతం పంతమే.. స్టూపిడ్‌కి..’ అంటుంది. దాంతో కార్తీక్ కాస్త కోపంగా చూస్తూ పైకి వెళ్లిపోతా. కార్తీక దీపం కొన‌సాగ‌నుంది.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు