హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: దీపకు నిజాన్ని చెప్పిన అంజి.. కార్తీక్‌ని పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్న మౌనిత‌

Karthika Deepam: దీపకు నిజాన్ని చెప్పిన అంజి.. కార్తీక్‌ని పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్న మౌనిత‌

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam)తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. సోమ‌వారం నాటి ఎపిసోడ్‌లో హిమ ప‌డుతున్న బాధ‌ను క‌ళ్లారా చూసిన కార్తీక్.. దీపను కొట్ట‌డం, హిమ‌ను వ‌చ్చేయ‌మ‌నడం.. అమ్మ‌, సౌర్య వ‌స్తేనే తాను వ‌స్తాన‌ని హిమ ఖ‌రాఖండిగా చెప్పేయ‌డం జ‌రుగుతుంది సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. సోమ‌వారం నాటి ఎపిసోడ్‌లో హిమ ప‌డుతున్న బాధ‌ను క‌ళ్లారా చూసిన కార్తీక్.. దీపను కొట్ట‌డం, హిమ‌ను వ‌చ్చేయ‌మ‌నడం.. అమ్మ‌, సౌర్య వ‌స్తేనే తాను వ‌స్తాన‌ని హిమ ఖ‌రాఖండిగా చెప్పేయ‌డం జ‌రుగుతుంది

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. సోమ‌వారం నాటి ఎపిసోడ్‌లో హిమ ప‌డుతున్న బాధ‌ను క‌ళ్లారా చూసిన కార్తీక్.. దీపను కొట్ట‌డం, హిమ‌ను వ‌చ్చేయ‌మ‌నడం.. అమ్మ‌, సౌర్య వ‌స్తేనే తాను వ‌స్తాన‌ని హిమ ఖ‌రాఖండిగా చెప్పేయ‌డం జ‌రుగుతుంది. ఇక హిమ మాట‌ల‌ను త‌లుచుకునే కార్తీక్.. ఎవ‌రూ లేని ప్ర‌దేశానికి వెళ్లి అరుస్తుంటాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో హిమా.. ఎలా పెంచాను రా నేను, ఎలా చూసుకున్నాను, నువ్వు డాడీ అని పిల‌వ‌లేద‌ని ఎంత‌గా ఏడ్చాను, ఇవాళ ఈ డాడీ క‌న్నా నీకు వాళ్లే ముఖ్యం అయ్యారా..? నువ్వు వాళ్ల ర‌క్తం క‌దా అందుకే నీకు నా క‌న్నా వాళ్లే ఇష్ట‌మైపోయారు. అన్ని క‌ష్టాలు ప‌డుతూ అక్క‌డే ఉండాలా..? నిన్ను అల్లారుముద్దుగా చూసుకున్న నా ద‌గ్గ‌ర‌కు రావాల‌నిపించ‌లేదా..? నా బాధ‌, నా ప్రేమ నీకు అర్థం కావ‌డం లేదు... నిన్ను ఇలాంటి స్థితిలో చూసి ఎలా భ‌రించ‌గ‌ల‌ను రా... కంటికి రెప్ప‌లా చూసుకున్నాను క‌దమ్మా, నువ్వు అడిగింది ఏదీ కాద‌నుకుండా చేశాను క‌ద‌మ్మా.. ఇప్పుడు మీ అమ్మ వ‌చ్చింది. కానీ ఇన్నేళ్లు నిన్ను ఎవ‌రు చూసుకున్నారు, నువ్వు అక్క‌డ క‌ష్టాలు ప‌డుతుంటే నేను చూడ‌లేనురా. నీ మ‌న‌సు నేను మారుస్తాను. క‌న్న ప్రేమ క‌న్నా పెంచిన ప్రేమ‌నే గొప్ప‌ద‌ని నేను నిరూపిస్తాను అని అనుకుంటాడు.

  ఇక ఇంట్లో సౌంద‌ర్య వాళ్లు టిఫెన్‌ చేస్తుండ‌గా.. సౌర్య ఏడ్చుకుంటూ నాన్న‌మ్మ అని వ‌స్తుంది. వెంట‌నే అంద‌రూ లేచి ఏమైంది అని అడుగుతారు. ఆ త‌రువాత సౌర్యను సోఫాలో కూర్చొబెట్టి.. ఏడ‌వకే అని సౌంద‌ర్య, సౌర్య‌కు నీళ్లు తాగిస్తుంది. ఆ త‌రువాత ఏమైంద‌మ్మా అని సౌంద‌ర్య‌ అడ‌గ్గా.. సౌర్య జ‌రిగింది చెబుతుంది. అంత‌గా చూసి భ‌రించ‌లేని వాడు అయితే అంద‌రినీ తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇలా పిల్ల‌లు బెదిరిపోయేలా గొడ‌వ‌పెట్టుకునే ఎలా..? అని సౌంద‌ర్య అంటుంది. అయినా ఈ పిచ్చి కోపం ఏంటి వాడికి అని ఆనంద‌రావు అంటాడు. నువ్వు ఒక్క‌దానివే వ‌చ్చావా..? అని శ్రావ్య అడ‌గ్గా. అవును అని సౌర్య అంటుంది. మ‌రి హిమ ఏది అని సౌంద‌ర్య అడ‌గ్గా.. రానంది, నేను ర‌మ్మ‌న్నా రానంది. డాక్ట‌ర్ బాబుతో కూడా చెప్పింది. అప్ప‌టివ‌ర‌కు ఈ ఇంటికి రాన‌ని చెప్పింది అని అంటుంది. దానికి ఆనంద‌రావు బాగా చెప్పింది. వాడి తిక్క వ‌దులుతుంది. మొండిప‌ట్టు ప‌ట్టి అంద‌రినీ బాధ‌పెడుతున్నాడు అని అంటాడు.

  ఇక డాక్ట‌ర్ బాబుకు అమ్మ మీద అంత కోపం ఎందుకు వ‌స్తుంది నాన‌మ్మా.. కొట్టేంత కోపం ఎందుకు వ‌స్తుంది అని సౌర్య అడుగుతుంది. నువ్వు ఇక్క‌డ‌కు వ‌స్తున్న‌ట్లు మీ అమ్మ‌కు తెలుసా..? అని సౌంద‌ర్య అడ‌గ్గా.. లేదు తెలీదు. అమ్మ ఇంటి ద‌గ్గ‌ర లేదు. అమ్మ‌కు ఏదో ఫోన్ వ‌స్తే హ‌డావిడిగా వెళ్లింది అని చెబుతుంది. ఎక్క‌డికో చెప్ప‌లేదా అని అడ‌గ్గా.. లేదు అని సౌర్య అంటుంది. ఆ త‌రువాత సౌర్య‌ను, శ్రావ్య టిఫెన్‌కి పిల‌వ‌గా.. నాకు వ‌ద్ద‌ని చెబుతుంది. ఇక సౌర్య మాట‌ల‌తో అంత స‌డ‌న్‌గా అది ఎక్క‌డికి వెళ్లి ఉంటుంది అని సౌంద‌ర్య ఆలోచ‌న‌లో ప‌డుతుంది.

  మ‌రోవైపు అంజి ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ దీప.. చెప్పు నిజం చెప్పు, నీకు తెలిసిన నిజం, మాకు ఎవ్వ‌రికీ తెలీయ‌ని నిజం, ఇంత‌కుముందు నేను అడిగినా చెప్ప‌ని నిజం.. ఏంటా నిజం. అది చెప్పాల‌నే న‌న్ను ర‌మ్మాన్నావ‌ని నాకు అర్థ‌మైంది. మ‌రి చెప్ప‌డానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అని దీప అంటుంది. దేవుడి ముందు నిల‌బ‌డి పాపాన్ని చెప్పుకుంటే, ఆ పాపం పోద‌మ్మా.. కానీ మీ ముందు నిల‌బ‌డి ఈ నిజం చెప్ప‌క‌పోతే మాత్రం ఇంకో పాపం చేసిన వాడిని అవుతాను. అందుకే చెప్పాల‌ని వ‌చ్చాను. ఇది విని మీరు ఆవేశ‌ప‌డ‌కుండా శాంతంగా వినండ‌మ్మా అని అంజి అన‌గా.. ముందు విష‌యం చెప్ప‌మ‌ని దీప అంటుంది.

  కార్తీక్ బాబు త‌న పాప‌కు హిమ అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా అమ్మా అని అంజి అడుగుతాడు. దానికి ఒక‌ప్పుడు హిమ పేరు మీద త‌న‌కు, కార్తీక్‌కి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ను గుర్తు చేసుకొని తెలుసిన చెబుతుంది. ఆ త‌రువాత మీకు ఎంత‌వ‌ర‌కు తెలుస‌మ్మా అని అంజి అడ‌గ్గా.. డాక్ట‌ర్ బాబు ప్రేమించిన హిమ యాక్సిడెంట్‌లో చ‌నిపోతే.. ఆమె ఙ్ఞాప‌కంగా ఆ పేరు పెట్టారు అని చెబుతుంది. ఇక ఆ హిమ చ‌నిపోయింది యాక్సిడెంట్ వ‌ల్ల కాద‌మ్మా.. నేనే చంపేశాను. ఆ పాపాత్ముడిని నేనే అని అంజి అంటాడు. వెంట‌నే ఆవేశ‌ప‌డ్డ దీప.. నువ్వు, నువ్వా.. నువ్వు హిమ‌ను చంపేశావా..? ఎందుకు, ఎందుకు ఇంత ఘోరం చేశావు..? నాకు ఆ హిమ ఎవ‌రో తెలీదు, డాక్ట‌ర్ బాబు అంత క‌న్నా తెలీదు, నాకు ఆమె మీద ఏ ప‌గ లేదు అని చెబుతాడు. మ‌రి ఎందుకు చంపావ‌న‌గా.. అది త‌న వృత్తి అని అంజి అంటాడు. ప‌దేళ్ల క్రితం నేను డబ్బు కోసం ఏదైనా చేసేవాడిని, డ‌బ్బు కోసం ప్రాణాలు తీయ‌డం త‌ప్పు కాద‌ని అనుకునేవాడిని, ఆ రోజుల్లో నాకు అది త‌ప్ప‌నిపించ‌లేదు. ఆ త‌రువాత మారిపోయి, మనిషిగా బ‌తుకుతున్నాను, నా గ‌తాన్ని పూర్తిగా మ‌ర్చిపోయాను. దేవుడిలాంటి డాక్ట‌ర్ బాబు ప్రేమించిన అమ్మాయిని చంపింది నేనేన‌ని ఇక్క‌డ‌కు చేరాకే తెలిసింది. అప్ప‌టి నుంచి చేసిన పాపం క‌డిగేసుకోలేక‌, ఎవ్వ‌రికి చెప్పుకోవాలో తెలీయ‌క నాలో నేనే కుమిలిపోతున్నాను అని అంటాడు. ఇన్నాళ్ల‌కు మీతో చెప్పాల్సిన టైమ్ వ‌చ్చింది.

  వెంట‌నే దీప ఎందుకు ఇంత ప‌ని చేశావు. హిమ ప్రాణాల‌ను ఎందుకు తీశావు అని అడ‌గ్గా.. నా అంతట నేను తీయాల‌నుకోలేద‌మ్మా. అందుకు నాకు ఒక‌రు డబ్బు ఇచ్చారు అని అంజి అంటాడు. దానికి దీప.. ఎవ‌రు, ఎవరు డ‌బ్బు ఇచ్చింది మౌనితేనా..? చెప్పు.. చెప్పు ఆ మౌనితేనా.? అని అడగ్గా.. హిమ‌ను చంప‌మ‌ని డ‌బ్బు ఇచ్చింది ఆ మౌనితేన‌మ్మా అని అంజి అంటాడు. వెంట‌నే దీప, అంజిని కొడుతుంది. డ‌బ్బు కోసం ఒక మ‌నిషి ప్రాణం తీస్తావా..? ఇవాళ హిమ వాళ్ల‌మ్మా.. జీవ‌శ్చ‌వంలా బ‌తుకుతుంది క‌దరా రాక్ష‌సుడా, ఎలా చేయ‌గ‌లిగావురా అని బాధ‌ప‌డుతూ దీప ప్ర‌శ్నిస్తుంది. అప్ప‌ట్లో నేను రాక్ష‌సుడినే అమ్మా.. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను గ‌తాన్ని మ‌రిచిపోయి బ‌తుకుతున్నాను. డాక్ట‌ర్ బాబు మీద మోజుతో ఆ మౌనిత ఎన్ని దుర్మార్గాలు చేసి ఉంటుందో అర్థం అయ్యింది. దాన్ని, నేను డాక్ట‌ర్ బాబు ఇంట్లో చూశాక బ‌యప‌డుతుంద‌నుకున్నా.. కానీ న‌న్ను అస‌లు లెక్కేచేయ‌లేదు, ఆ మౌనిత ఎంత‌కైనా తెగిస్తుంద‌మ్మా.. అందుకే మీ జోలికి రాకుండా ఉండాల‌ని ఫోన్ చేసి బెదిరించాను అని అంజి అంటాడు.

  వెంట‌నే దీప‌.. నువ్వు ఇప్పుడు ఏంటి అనేది కాదురా, నువ్వు ఒక‌ప్పుడు చేసింది ఏంటి..? డాక్ట‌ర్ బాబును ప్రేమించిన పాపానికి ఒక అమాయ‌కురాలి నిండు ప్రాణం తీశావు. ఇది నిజంగా క్ష‌మించ‌రాని నేరం, హిమ‌ను అంత దారుణంగా చంపేస్తావా..? ప‌్రాణం తీశాక నువ్వు మారిపోతే ఏంటిరా.. పోయిన ప్రాణం తిరిగి వ‌స్తుందా..? అని ఆవేశ‌ప‌డుతుంది. వెంట‌నే అంజి దీప కాళ్ల ద‌గ్గ‌ర ప‌డి.. నేను నిజంగా నేర‌మే చేశాన‌మ్మా.. చాలా పెద్ద నేరం చేశాను. కానీ పోయే లోపు ఒక్క మంచి ప‌నైనా చేసే పోతాను అని ఏడుస్తాడు.

  ఇక ఇంట్లో ప్రియ‌మ‌ణికి స్వీట్ తినిపిస్తుంది మౌనిత‌. దేనిక‌మ్మా అని ప్రియ‌మ‌ణి అడ‌గ్గా.. దేనికి అని అడుగుతావేంటే పిచ్చి మొహ‌మా..? దేవ‌త వ‌ర‌మిచ్చింది అని మౌనిత అంటుంది. దానికి ప్రియ‌మ‌ణి సీరియ‌ల్ వ‌ర‌మియ్య‌డ‌మేంటి..? అని అడుగుతుంది. సీరియ‌ల్ ఏంటి అని మౌనిత అడ‌గ్గా.. దేవ‌త సీరియ‌లే క‌దా అని ప్రియ‌మ‌ణి అంటుంది. సీరియ‌ల్ కాదు.. దేవ‌త అంటే సుజాత‌, లాయ‌ర్ సుజాత అని మౌనిత చెప్ప‌గా.. ఓ లాయ‌ర‌మ్మా అని ప్రియ‌మ‌ణి అంటుంది. కార్తీక్, ఆ గ‌రిటె తిప్పుకునే దానికి విడాకులు ఇవ్వ‌క‌పోయినా.. రెండో పెళ్లి చేసుకోవ‌చ్చునని చెప్పింది. అది ఎలా అమ్మా అని ప్రియ‌మ‌ణి అడ‌గ్గా.. వాళ్లిద్ద‌ర‌దు ప‌దేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు క‌దా, ఆ పాయింట్‌తో ఫైల్ చేయొచ్చ‌ని చెప్పింది అని మౌనిత చెబుతుంది. ఇక దానికి ప్రియ‌మ‌ణి.. థ్యాంక్స్ అమ్మా అని చెప్ప‌గా.. థ్యాంక్స్ కాదు కంగ్రాట్స్ అని చెప్పాలి అని మౌనిత అంటుంది. హా అదే అని మౌనిత‌కు ప్రియ‌మ‌ణి కంగ్రాట్స్ చెబుతుంది.

  ఇక ఇంట్లో సౌర్య‌కు టిఫెన్ తినిపిస్తూ ఉంటుంది సౌంద‌ర్య‌. ఇంట్లో హిమ ఒక్క‌టే ఉందా..? అని సౌంద‌ర్య అడ‌గ్గా.. స‌రోజ‌క్క ఇంట్లో టీవీ చూస్తోంది అని చెబుతుంది. ఇక టిఫెన్ అయిన త‌రువాత రా నేనే నిన్ను డ్రాప్ చేసి వ‌స్తాను అని సౌంద‌ర్య చెప్ప‌గా.. ఎందుకులే నాన‌మ్మా.. వార‌ణాసి వ‌చ్చాడు. ఆటోలో వెళ్తాలే అని చెప్తుంది. దానికి సౌంద‌ర్య.. ఇక నుంచి నువ్వు ఇక్క‌డ‌కు రావాల‌న్నా, ఇక్క‌డి నుంచి వెళ్లాల‌న్నా.. అంజి గానీ, బాబాయ్ గానీ, నేను గానీ, తాత‌య్య గానీ ఎవ‌రో ఒక‌రు వ‌స్తాము. నా మ‌న‌వ‌రాళ్లు ఆటోలో తిర‌గ‌డం నాకు ఇష్టం లేదు అని చెప్ప‌గా సౌర్య న‌వ్వుతుంది. ఏమైందే అని సౌంద‌ర్య అడ‌గ్గా.. ఇక్క‌డి నుంచి కారు మాత్ర‌మే వ‌స్తుంది, మా నాన్న రాడు, మా అమ్మ ఇక్క‌డ‌కు రాదు, మీరంద‌రూ కారు తెస్తే ఏం లాభం, కారులో తీసుకొస్తే ఏం లాభం..? మా అమ్మ‌కు, మాకు మా నాన్న కావాలి, నాకేదో భ‌యంగా ఉంది. అమ్మ ఎక్క‌డికి వెళుతుందో, ఎప్పుడు వ‌స్తుందో తెలీదు అని సౌర్య చెబుతుంది. మీ అమ్మ ఎక్క‌డికి వెళ్లినా., ఎప్పుడు వెళ్లినా.. ఎప్పుడు వ‌చ్చినా.. ఇందాక నువ్వు అన్నావే నాన్న కావాలి అని అందుకే వెళుతుంది. వెళ్ల‌నివ్వండి. ఇంట్లో ఉండ‌టానికి భ‌యం వేస్తే ఇక్క‌డ ఉండండి, లేదంటే మేము వ‌చ్చి అక్క‌డ ఉంటాము. అంతేకానీ మీ అమ్మ‌ను ఆప‌కండి అని చెబుతుంది.

  అదే స‌మ‌యానికి అంజి లోప‌లికి రాగా.. అదుగో అంజి వ‌చ్చాడ‌ని సౌర్య‌కు చెప్పిన సౌంద‌ర్య‌.. ఎక్క‌డికి వెళ్లావ‌ని అంజిని అడుగుతుంది. కారు కాస్త రిపేర్ ఉంటే చేయించుకొని వ‌స్తున్నాన‌మ్మా అని అంజి చెబుతాడు. ఇక సౌంద‌ర్య నా మ‌న‌వ‌రాలిని కాస్త ఇంటి ద‌గ్గ‌ర దించిరా అని సౌంద‌ర్య చెప్ప‌గా.. రామ్మా అని అంజి తీసుకెళ‌తాడు. ఇక ఆటోలో ఇంటికి వెళుతూ అంజి చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది దీప‌. అలాగే హిమ గురించి పెళ్లైన కొత్త‌లో మౌనిత చెప్పిన మాట‌లు, హిమ వాళ్ల అమ్మ కార్తీక్ ఇంటికి రావ‌డం, మౌనిత కార్తీక్‌ని నా వాడిని చేసుకుంటాన‌ని చెప్పిన మాట‌లు అన్నింటిని గుర్తు చేసుకుంటుంది దీప‌.

  ఇక సౌర్య ఇంటికి వెళ్ల‌గా.. నువ్వు వార‌ణాసి ఆటోలో రాలేదా సౌర్య అని హిమ అడుగుతుంది. లేదు నానమ్మ కారులో పంపించింది అని సౌర్య చెబుతుంది. ఆహా కారులో పంపించిందా..? డాడీని తిట్ట‌డం చేత‌కాదు కానీ అని.. ఇదుగో అంజి ఒక‌వేళ నాన‌మ్మ వెళ్ల‌మ‌న్నా.. వ‌ద్దు మాకు ఆటో ఉంద‌ని చెప్పు అని అంటుంది. ఏంటి మాట్లాడ‌వు, చెప్తావా..? లేదా..? అని హిమ అడ‌గ్గా.. చెబుతాన‌మ్మా అని అంజి అంటాడు. ఇక వ‌ద్దులే హిమ నాన‌మ్మ బాధ‌ప‌డుతుంది అని సౌర్య చెప్ప‌గా.. నాన‌మ్మ అమ్మ పార్టీనే క‌దా ఏం బాధ‌ప‌డ‌దు. నువ్వు సౌర్య మాట‌లు ప‌ట్టించుకోకు అంజి. నువ్వు నాన‌మ్మ‌కు చెప్ప‌డానికి భ‌య‌మైతే చెప్పు అంజి నేను చెబుతాను అని అంటుంది. వ‌ద్ద‌మ్మా నేను చెబుతాను అన్నానుగా అని అంజి అంటాడు. ఆ త‌రువాత మ‌న‌సులో ఇంత మంచి పిల్ల‌లు, ఇంత‌మంచి ఇల్లాలు, ఇంత మంచి కుటుంబాన్ని పెట్టుకొని.. కార్తీక్ స‌ర్ ఏంటి ఆ మౌనిత‌ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. లేదు ఎలాగైనా ఆ పెళ్లి ఆపి, దీప‌మ్మ‌కు న్యాయం చేయాలి అని అనుకుంటుంటాడు. ఏంటి ఆలోచిస్తావు అంజి అని హిమ అడ‌గ్గా.. ఏం లేద‌మ్మా వెళ్తాను అని అక్క‌డి నుంచి వెళ‌తాడు. ఆ త‌రువాత ఏంటి అంత కోపంగా ఉన్నావు అని సౌర్య అడుగుతుంది. దానికి హిమ‌.. నువ్వేంటి ఇంత కూల్‌గా ఉన్నావు. నీకు నా కంటే కోపం ఎక్కువ క‌దా.. నాన్న‌, అమ్మ‌ను కొట్టినందుకు నీకు కోపం రాలేదా..? అని అడుగుతుంది. వ‌చ్చింది కానీ నాన్న‌కు కోపం వచ్చింది అనుకున్నాను అని సౌర్య అంటుంది.

  కోపం వ‌స్తే తిట్టాలి కానీ కొట్ట‌కూడ‌దు క‌దా అని హిమ అన‌గా.. అవును కొట్ట‌కూడ‌దు. అంటే ఇంక అమ్మ, నాన్న క‌ల‌వ‌రేమో క‌దా.! అని అంటుంది. ఆ మాట‌కు హిమ ఏడుపు మొహం పెట్టగా.. ఇదుగో అందుకే నేను నీ ముందు ఏం మాట్లాడ‌ను. ఊరికే ఏడ‌వ‌కు. వాళ్లు క‌ల‌వ‌క‌పోతే మ‌న‌మిద్ద‌రం క‌లుపుదాం అని సౌర్య అంటుంది. అవును హిమ‌.. మ‌న‌మిద్ద‌రం క‌లుపుదాం. ఏం చేస్తే క‌లుస్తారో ప్లాన్ చేద్దాం. ప‌ద ముందు మ‌నం ఏదైనా తిందాం అని ఇద్ద‌రు లోప‌లికి వెళ‌తారు. ఇక సౌందర్య ఇంట్లోకి అంజి రాగా.. అంజి మా వ‌దిన వాళ్ల ఇంటి నుంచేనా అని ఆదిత్య అడుగుతాడు. అవును బాబు అని అంజి అన‌గా.. ఏం జ‌రిగింది అక్క‌డ అని ఆదిత్య అడుగుతాడు. ఏం జ‌ర‌గ‌లేదు బాబు అని అంజి చెప్ప‌గా.. ఏమైంది అంజి అని సౌంద‌ర్య అడుగుతుంది. దానికి అంజి.. అంటే అంటూ హిమ చెప్పిన మాటల‌ను చెబుతాడు. వెంట‌నే ఆదిత్య‌.. ఏంటో ఏం జ‌రుగుతుందో నాకైతే ఏం అర్థం కావ‌డం లేదు. అన్న‌య్య మాత్రం పిచ్చి వాడు అవుతాడేమో అనిపిస్తుంది అని అంటాడు. ఎందుకు అనిపిస్తుంది అని సౌంద‌ర్య అన‌గా.. హిమ ఎవ‌రో చెప్పి మీరు త‌ప్పు చేశారు అని ఆదిత్య అంటాడు. వాడు చెప్పు చెప్పు అన్న‌ప్పుడు.. చెప్ప‌మ‌న్న వెధ‌వ ఎవ‌రు నువ్వే క‌దా అని సౌంద‌ర్య అంటుంది. అయితే హిమ‌ను అన్న‌య్య‌కు దూరం చేసి, వ‌దిన చేతిలో పెట్ట‌మ‌న్నానా... అని అడిగింది.

  ఎవ‌డురా వ‌దిన‌ చేతిలో పెట్టింది. మీ అన్న‌య్య.. మీ వ‌దిన, పిల్ల‌ల‌ను ఇక్క‌డ‌కు తీసుకొచ్చి.. వాళ్లు ఉండ‌మ‌ని, వాడు వెళ్లిపోతాను అన్నాడు. వాడిని దూరం చేయడం ఇష్టం లేక మీ వ‌దినే, పిల్ల‌ల‌ను తీసుకెళ్లింది అని సౌంద‌ర్య అంటుంది. వెంట‌నే ఆదిత్య అన్న‌య్య ప్ర‌శాంతంగా లేడు మ‌మ్మీ.. దానికి ఎవ‌రు కార‌ణం అని అన‌గా.. వాడే.. వాడు చేసిన పాపాలే వాడిని వెంటాడుతున్నాయి. అవే వెంటాడుతున్నాయి. డీఎన్ఏ చేయించుకోమంటే చేయించుకోడు. వాడిని ప‌రీక్ష చేయించుకోమంటే చేయించుకోడు. వాడిని ఎవ్వ‌డూ పిచ్చి వాడు చేయ‌డం లేదురా.. వాడే పిచ్చి వాడు అవుతున్నాడు. వీధుల వెంట ప‌డి మీ వ‌దిన‌ను కొట్ట‌డ‌మేంటి..? వీధులో వారు చూస్తే ఎంత చెంఢాలంగా ఉంటుంది. ఏది వాడి సంస్కారం అని సౌంద‌ర్య అంటుంది. ఏమో మ‌మ్మీ మీరే ఏదైనా చేసుకోండి అని అక్క‌డి నుంచి లేస్తాడు ఆదిత్య‌. ఐదు, ప‌ది నిమిషాలు న‌వ్వుతూ మాట్లాడే మౌనిత మీద లేనిపోనివి చెప్ప‌డం.. ఇంటికి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. అత్తా కోడ‌ళ్లు కొట్టడం చేస్తే.. ఏ మొగాడైనా పెళ్లి చేసుకుంటాన‌నే అంటాడు అని అంటాడు.

  వెంట‌నే కోపానికి గురయ్యే సౌంద‌ర్య.. ఎవ‌డురా అనేది.. ఏరా నీకు అమావాస్య‌కు, పున్నానికి పిచ్చిగాని ప‌డుతుందారా.. ఇవాళ మాట్లాడిన మాట రేపు ఉండ‌దేంటిరా.. ఒక‌సారి అటెళ్లి మా వ‌దిన దేవ‌త అంటాడు. ఇంకోసారి ఇటు వ‌చ్చి మా అన్న‌య్య దేవుడు అంటాడు. అస‌లు సంబంధం లేకుండా మౌనిత మీద మేము నింద‌లు వేస్తున్న‌ట్లు మాట్లాడ‌తావు. అది నాలుక తాటిమ‌ట్ట. ఓ ఇంత నోరు వేసుకొని బుగ్గ‌లు, జుత్తు ఊగేలా మాట్లాడితే నీకు కూడా స‌మాధానం చెప్పే స్థితిలో లేము ఇక్క‌డ. పోరా,. ఫ‌స్ట్ నీకు నువ్వు ఒక క్లారిటీ తెచ్చుకో అప్పుడు వ‌చ్చి మాట్లాడు.. పో అంటూ గ‌ట్టిగా అరుస్తుంది. దాంతో ఆదిత్య అక్క‌డి నుంచి వెళ్ల‌గా.. ఏ మొగాడైనా మౌనిత‌నే పెళ్లి చేసుకుంటాను అనే అంటాడు. కానీ పెళ్లైన వాడు అంటే ప‌ళ్లు రాల‌గొట్టి చేతిలో పెడ‌తారు. అంత ఎథిక్స్ లేకుండా బ‌తుకుతున్నారా..? అని ఆవేశ‌ప‌డుతూ బాధ‌ప‌డుతుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Televison News

  ఉత్తమ కథలు