హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: గుర్తు పెట్టుకో నేను అంజిని.. నీకు కౌంట్‌డౌన్ మొద‌లైంది.. మౌనిత‌కు అంజి ఛాలెంజ్

Karthika Deepam: గుర్తు పెట్టుకో నేను అంజిని.. నీకు కౌంట్‌డౌన్ మొద‌లైంది.. మౌనిత‌కు అంజి ఛాలెంజ్

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఒక్కొక్క ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డ‌టం, త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకునేలా దీప నిర్ణ‌యం తీసుకోవ‌డంతో కార్తీక దీపం ఆస‌క్తిక‌రంగా మారింది

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఒక్కొక్క ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డ‌టం, త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకునేలా దీప నిర్ణ‌యం తీసుకోవ‌డంతో కార్తీక దీపం ఆస‌క్తిక‌రంగా మారింది. మోనిత‌, అంజి ఇద్ద‌రు ఒకరికొక‌రు ఎదురుప‌డ‌తారు. మౌనిత‌ను గుర్తుప‌ట్టిన అంజి.. నువ్వా.. నీ కోస‌మే వెతుకుతున్నాను. ఇక్క‌డికి వ‌స్తూ న‌న్ను కన్య్ఫూజ్ చేస్తూ త‌ప్పించుకునేది నువ్వేన‌ని ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వ‌చ్చింది అంటాడు. వెంట‌నే మౌనిత‌.. ఏయ్ నువ్వు ఈ ఇంటి డ్రైవ‌ర్‌వి క‌దా. ఏంటేంటో మాట్లాడుతున్నావేంటి. ఎవర్ని చూసి ఎవ‌రనుకుంటున్నావు అని అంటుంది. రాక్షసిని చూసి రాక్ష‌సి అనుకుంటున్నా. మౌనిత‌ను చూసి మౌనిత అనే అనుకుంటున్నా. ఇంకా న‌టిస్తావేంటే.. నేనెవ‌రో నీకు తెలీదా. స‌రిగ్గా చూడు. డాక్ట‌ర్ బాబు ప్రేమించిన హిమ‌ను నాతో చంపించావు గుర్తులేదా..? నిన్ను ఎక్కువ‌గా డ‌బ్బులు డిమాండ్ చేశాన‌ని.. న‌న్ను కూడా చంపించాల‌ని చూశావు గుర్తులేదా..? నీ కోస‌మే వెతుకుతున్నా. నువ్వు చేసిన మోసం నుంచి బ‌య‌ట‌ప‌డి మ‌నిషిగా మారినా.. నా ప‌గ అలానే ఉంది. నీ మీద ప‌గ తీర్చుకోవాల‌న్న క‌సి ఇంకా అలానే ఉంది. హిమ‌ను చంపి వాళ్ల అమ్మ‌ను అనాథ చేశావు. ఆమె ప్రేమించిన డాక్ట‌ర్ బాబును మోసం చేశావు. ఇంకా ఈ ఇంటి చుట్టే తిరుగుతున్నావేంటే..? డాక్ట‌ర్ బాబు మీద ఇంకా మోజు పోలేదా.. నిన్ను అంటూ మౌనిత మెడ‌ను ప‌ట్టుకోబోతాడు.

  వెంటనే మౌనిత‌.. అవును నేనే ఇవ‌న్నీ చేశాను. సో వాట్ వెళ్లి చెప్తావా..? కార్తీక్‌తో చెప్తావా..? చెప్పు. హిమ‌ను చంపినందుకు కార్తీక్ నిన్ను షూట్ చేసి ప‌డేస్తాడు. నువ్వు నిజం చెప్పిన మ‌రుక్ష‌ణం నువ్వే ప్రాణాల‌తో ఉండ‌వు. పోనీ పోలీసుల‌కు చెప్తావా.. నేను వాళ్ల‌కు పై ఆఫీస‌ర్ల‌తో చెప్తా.. హిమ‌ను చంపిన హంత‌కుడివి నువ్వేన‌ని. అప్పుడు నేను కాదు. నా క‌న్నా ముందు నువ్వే లోప‌ల ఉంటావు. నేను బ‌య‌ట‌నే ఉంటా. ఏరా మాట్లాడ‌వేంటి..? 10-12 ఏళ్ల క్రిత‌మే నేను కిరాత‌కంగా స్నేహితురాలిని చంపించిన‌దాన్ని. ఇన్నేళ్ల‌లో ఇంకా ఎంత ముదిరిపోయి రాటుదేలి ఉంటానో ఆలోచించు అని అంటుంది. వెంట‌నే అంజి.. ఎంత ధైర్య‌మే నీకు. అంత పెద్ద నేరం నాతో చేయించి కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటే నువ్వ‌స‌లు ఆడ‌దానివేనా..? నేను మ‌నిషిలా మారిపోయా. కానీ నువ్వు ఇంకా మార‌లేదు. మ‌రింత రాక్ష‌స‌త్వం నీలో నిండిపోయింది. ఇప్పుడు నీ గురించి నేను బ‌య‌ట‌పెడితే న‌న్ను డాక్ట‌ర్ బాబు చంపేస్తాడ‌నో.. పోలీసులు జైలుకు పంపిస్తార‌నో నిన్ను వ‌దిలేయ‌ట్లేదు.

  నా దృష్టిలో డాక్ట‌ర్ బాబు దేవుడు. ఆ దేవుడి దృష్టిలో నేను హంత‌కుడిగా కనిపించ‌డం నాకు ఇష్టం లేదు. ఆయ‌న ఇష్ట‌ప‌డ్డ అమ్మాయిని చంపేసి ఆయ‌న దృష్టిలో హంత‌కుడిగా ఉండ‌టం నా వ‌ల్ల కాదు. అందుకే ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. కానీ తీసుకుంటాను. దీన్ని తేలిగ్గా తీసుకోను. నేను ఇన్ని సంవ‌త్స‌రాలు నిన్ను వెతికి, తీరా నువ్వు క‌న‌ప‌డ‌గానే నిస్స‌హాయంగా నిన్ను వ‌దిలేస్తాన‌ని ఎలా అనుకున్నావే. గుర్తు పెట్టుకో. నేను అంజిని. ఒక‌ప్పుడు డ‌బ్బు కోసం ఎవ్వ‌ర్ని చంప‌మంటే వారిని చంపి కిరాయి హంత‌కుడిని. ఇప్పుడు అదే నేను. కేవ‌లం నీకోసం మ‌ళ్లీ పాత అంజిలా ఆలోచిస్తాను. బాగా ప‌క‌డ్బందిగా ప్లాన్ చేస్తాను. ఈ ప్ర‌పంచంలో మౌనిత చ‌రిత్ర‌ను బ‌య‌ట‌పెట్టే ఏకైక మ‌గాడు. మౌనిత‌ను చంప‌గ‌లిగే ఏకైక మొన‌గాడు ఈ అంజిగాడే అని అంటాడు. ఖ‌బ‌డ్దార్ నువ్వు ఇంకా ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. వీళ్ల‌లో ఎవ‌రికీ ఎలాంటి అప‌కారం త‌ల‌పెట్టినా నేను ఊరుకోను. చంపేస్తా. ఇక నుంచి నీ నీడ‌ను చూసి నువ్వే బ‌య‌ప‌డాలి. త‌ప్పు చేయాలంటే వ‌ణికిపోవాలి. ఏ వైపు నుంచి నీకు చావు త‌రుముకువ‌స్తుందో తెలీక ప్ర‌తీరోజు చ‌స్తూ బ‌త‌కాలి. నీకు కౌంట్‌డౌన్ మొద‌లైంది.పోవే పో అని ఛాలెంజ్ విసురుతాడు.

  మ‌రోవైపు ఆదిత్య‌కు కాఫీ తీసుకొచ్చిన భాగ్యం.. చెప్తే చెప్పారంటారు. అంటే అన్నానంటారు.. భాగ్యం చెప్పేది ఏంటి అనుకుంటారు. దాని స‌ల‌హా పాటించేది ఏంటి అనుకుంటారు. నన్ను అస‌లు లెక్క‌లోకి తీసుకోరు. అయినా సాహ‌సం చేసి ఓ మాట చెబుతాను. ఏమి అనుకోకుండా వింటారా అల్లుడు అని అంటుంది. మామ‌య్య గారు ఉన్నార‌నుకొని వ‌చ్చాను. కాఫీ పూర్త‌య్యే దాకా ఖాళీగా కూర్చోవ‌డ‌మే క‌దా. ఈ లోపు ఫినిష్ చేయండి అత్త‌య్య‌గారు అని ఆదిత్య‌ అంటాడు. ఇది నా గురించో, మీ మామ‌య్య గారి గురించో కాదు.. మీ అన్న‌య్య గురించే. ఇప్ప‌టివ‌ర‌కు మీ అమ్మ గారు, మా దీప క‌లిసి మీ అన్న‌య్య‌ను టార్చ‌ర్ పెట్టింది చాలు. ఆ టార్చ‌ర్ త‌ట్టుకోలేక ఆయ‌న ఊరు విడిచి వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డ్డాడు. మీరు ఇలానే వ‌దిలేస్తే.. దీప‌, పిల్ల‌లు ఎదురుప‌డుతూనే ఉంటారు. ఏదో ఒకటి జ‌రుగుతూనే ఉంటుంది. మ‌ళ్లీ దీపుగాడిని అడ్డం పెట్టుకొని వాడి 200వ రోజు బ‌ర్త్ డే వేడుక‌లు అంటూ అంద‌రినీ క‌డిగి పారేస్తాడు అని అంటుంది.

  వెంట‌నే ఆదిత్య మీరు చెప్పేది అచ్చ‌మైన‌ ఆస్ట్రాలిజ‌ర్ చెప్పిన‌ట్లు ఉంది. మ‌రి దీనికి ఏం చేయాలో క‌న్స‌ల్టేష‌న్ ఇచ్చిన కౌన్సిల‌ర్‌గా చెప్పండి అని ఆదిత్య అంటాడు. అయ్యో ఏముంది బాబు. మైసూరు బజ్జీలో మైసూరు ఉండ‌న‌ట్లే. బెంగ‌ళూరు మిర్చిలో బెంగ‌ళూరు ఉండ‌న‌ట్లే. జ‌రిగిన దాంట్లో మా దీప త‌ప్పు కూడా లేద‌ని మ‌నందరికి తెలిసిందేగా. అది అనుమాన‌మ‌ని తేలితే త‌ప్ప వాళ్ల కాపురం బాగుప‌డ‌దు. అదేదో టెస్ట్‌లో తేలుతుందట క‌దా.. దాన్ని కాస్త ప‌ట్టించుకుంటే త‌ప్ప‌, ఈ గొడ‌వ ముగిసిపోయేలా లేదు. ఏమంటారు అల్లుడు అని భాగ్యం అంటుంది. నేను అదే ఆలోచిస్తున్నాను అత్త‌య్య గారు. ఎప్పుడూ ఏదో ఒక‌టి లొడ‌లొడా వాగుతుంటారు. ఏదో చెప్తారులే అని లైట్‌గా తీసుకున్నా. మీరు చెప్పిందే మేము అనుకుంటున్నాము. అన్న‌య్య నిర్ణ‌యం తీసుకోవాలి చూద్దాం ఏం జ‌రుగుతుందో. వ‌స్తాను అత్త‌య్య అని అక్క‌డి నుంచి బ‌య‌లుదేరుతాడు ఆదిత్య.

  మ‌రోవైపు దీప ఇంట్లో హిమ‌.. అమ్మా నిన్ను ఒక‌టి అడుగుతాను ఏడ‌వ‌వు క‌దా అని అంటుంది. దానికి సౌర్య న‌వ్వుతుంది. నా వంతు అయిపోయింది. ఇప్పుడు నువ్వు అడుతున్నావా..? నేనెప్పుడు ఒక‌టి అడుగుతా అని వంద అడిగేదాన్ని. ఒక్క‌దానికి జ‌వాబు చెప్ప‌లేక అమ్మ ఫీల్ అయ్యేది. ఆ త‌రువాత నేను నోరు మూసుకునేదాన్ని. అది అలా అల‌వాటు అయ్యింది. అది గుర్తొచ్చి న‌వ్వొచ్చింది అని అంటుంది. మ‌రి ఇప్పుడు నేను అడిగితే మ‌ళ్లీ ఫీల్ అవుతుందా.? అని హిమ అంటుంది. నువ్వు ఇప్పుడు అడిగేవ‌న్నీ నేనెప్పుడో అడిగిన‌వే క‌దా. విని విని అమ్మ‌కు చిరాకు వేయ‌దా మ‌రి అని సౌర్య అంటే.. నేను అడ‌గ‌నులే అని హిమ అంటుంది. ఇప్ప‌టి నుంచి మ‌న‌మిద్ద‌రం ఒక అండ‌ర్‌స్టాండ్‌కి వ‌ద్దాం. అమ్మా నాన్న‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న‌లు అడ‌గ‌కూడ‌దు స‌రేనా అని సౌర్య అంటుంది. స‌రే పొద్దున్న అమ్మ‌ను చూసి నాకు చాలా భ‌య‌మేసింది. ఇలా ఎప్పుడూ చూడ‌లేద‌ని హిమ అనగా.. ఇదేం చూశావు. నేను ఇంత‌కంటే ఎక్కువ చూశాను అని సౌర్య అంటుంది. ఊరుకో అత్త‌మా అంత‌గా నేను ఏమ‌న్నాను. ఏదో బాధ ఎక్కువై చిరాకులో అని ఉంటాను అంటుంది. మ‌రి ఇలా నాన్న మీద ఎప్పుడైనా అరిచావా..? అమ్మా అని హిమ అడిగితే ఒకే ఒక్క‌సారి అరిచాను. అదే ఆఖ‌రి సారి అని దీప గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ను గుర్తుచేసుకుంటుంది. మ‌రి నాన్న నిన్ను ఎక్క‌డైనా ఊరికి తీసుకెళ్లారా..? అంటే ఒకే ఒక్క‌సారి తీసుకెళ్లారు. అదే మొద‌టిసారి, అదే చివ‌రిసారి అని త‌న మ‌ధుర స్మృతుల‌ను గుర్తుచేసుకుంటుంది.

  వెంట‌నే హిమ‌.. మంచివాళ్లు కొద్దిరోజులే మంచి వాళ్లుగా ఉంటారా..? అమ్మా ఎప్పుడూ ఉండ‌రా..? అని ప్ర‌శ్నించ‌గా.. ఎందుకు ఉండ‌రు. కానీ పరిస్థితులు మంచిత‌నాన్ని దాచేస్తాయి. చంద్రుడు ఎప్పుడూ పున్న‌మి చంద్రుడిలా ఉంటాడా..? 15 రోజులు త‌గ్గుతాడు, 15 రోజులు పెరుగుతూ పోతాడు. నిండు చంద‌మామ ఉంటే పున్న‌మి. లేదంటే అమావాస్య‌, చీక‌టి దీప చెబుతుంది. అప్పుడు హిమ‌.. నేను ఒక మంచి మాట చెప్ప‌నా అమ్మా.. నాన్న మంచివాడే, నువ్వు మంచిదానివే. కాబ‌ట్టి మీరు ఇద్ద‌రు క‌చ్చితంగా క‌లుస్తారు. అప్పుడు మ‌న‌మంద‌రం క‌లిసే ఉంటాము అని అంటుంది. వెంట‌నే దీప‌.. బాల‌వాక్కు బ్ర‌హ్మ‌వాక్కు అంటారు. అదే నిజ‌మ‌వుతుంది. నేనే నిజం చేస్తా అని దీప అంటుంది.

  మ‌రోవైపు మౌనిత‌ను గుర్తుచేసుకుంటూ అంజి ఆవేశ‌ప‌డుతుంటాడు. నీ ఆరాచ‌కాల‌న్నీ బ‌య‌ట‌పెట్టే స‌మ‌యం వ‌చ్చింది. దీప‌మ్మ కాపురం నిల‌బెడ‌తాను. ఆ సీత‌మ్మ కోసం ఆంజ‌నేయుడిలా దీప‌మ్మ కోసం నేను ఉంటా. అందుకోసం పాత అంజీలా మారి అయినా స‌రే దీప‌మ్మ కాపురాన్ని నిల‌బెడ‌తాను. డాక్ట‌ర్ బాబు క‌ళ్లు తెరిపిస్తాను అని అనుకుంటాడు. మ‌రోవైపు అంజి ఛాలెంజ్‌ని గుర్తు చేసుకుంటూ భ‌య‌ప‌డుతూ ఉంటుంది మౌనిత‌. ఇక డాక్ట‌ర్ల అసోషియేష‌న్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు తీసుకునేందుకు కార్తీక్‌ని ఒప్పిస్తారు ఇంట్లో వాళ్లు. దానికి కార్తీక్ ఒప్పుకుంటాడు. ఇక ఆ ఫంక్ష‌న్‌ని మీ అమ్మాయి హిమను కూడా తీసుకొని రండి అని డాక్ట‌ర్లు, కార్తీక్‌ని కోరుతారు. ఇక ఈ బాధ్య‌త అంతా మీ చేతుల మీద జ‌ర‌గాలి అంటూ మౌనిత‌కు చెప్తారు డాక్ట‌ర్లు. దానికి సౌంద‌ర్య లోలోప‌ల కోప్ప‌డుతూ ఉంటుంది. ఇక ఇది జ‌రిగిన త‌రువాత మౌనిత, సౌంద‌ర్య మాట్లాడుకుంటారు. ఏదో మాట్లాడాల‌న్నారు అని మౌనిత అడ‌గ్గా.. ఏదో కాదు అదే. మా కార్తీక్ నీకేదో అసైన్‌మెంట్ ఇచ్చాడంటా క‌దా అదే అని సౌంద‌ర్య చెబుతుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

  ఉత్తమ కథలు