Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతుంది. నిన్నటి ఎపిసోడ్లో సౌర్య, హిమలను తీసుకొని దీప ఇంటికి వస్తుంది. అయితే ఇంటికి వచ్చాక నాన్న దగ్గరికి వెళతానని సౌర్య అంటుంది. అంత మంచి నాన్నను ఎలా వదిలి రావాలమ్మా. ఎలా దూరంగా ఉండాలమ్మా. ఇన్ని రోజులు నువ్వు ఏం చెప్పావమ్మా, నానమ్మ ఏం చెప్పింది. అందరూ కలిసిపోయే రోజు వస్తుందనే కదా చెప్పారు.
Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతుంది. నిన్నటి ఎపిసోడ్లో సౌర్య, హిమలను తీసుకొని దీప ఇంటికి వస్తుంది. అయితే ఇంటికి వచ్చాక నాన్న దగ్గరికి వెళతానని సౌర్య అంటుంది. అంత మంచి నాన్నను ఎలా వదిలి రావాలమ్మా. ఎలా దూరంగా ఉండాలమ్మా. ఇన్ని రోజులు నువ్వు ఏం చెప్పావమ్మా, నానమ్మ ఏం చెప్పింది. అందరూ కలిసిపోయే రోజు వస్తుందనే కదా చెప్పారు. ఏది, రాలేదే. పదేళ్ల నుంచి ఆ రోజు కోసమే కదమ్మా ఎదురుచూశాను. మరి రాలేదేం. ఇక రాదమ్మా నాకు అర్థమైపోయింది. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మిగిలారని నువ్వు అన్నప్పుడు నాకు అర్థం అయ్యింది. ఇక నాన్న రాడని, మనల్ని తీసుకెళ్లడని తెలిసిపోయింది. కానీ నాన్నకు దూరంగా ఎలా ఉండాలో మాత్రం తెలీడం లేదమ్మా. చిన్నప్పుడు నాన్న ఏడి అంటే దుబాయ్‌లో ఉన్నాడని చెప్పావు. అప్పుడు నువ్వు అబద్దం చెప్పావు. హిమ అమ్మ ఏది అని అడిగితే చచ్చిపోయిందని నాన్న అబద్ధం చెప్పాడు. ఇద్దరు అబద్ధాలు చెప్పారు. కానీ అందరూ నాన్నను ఎందుకు అంటారమ్మా. నాన్న మంచివాడే కదమ్మా. మా కోసం నువ్వు అక్కడికి రావు. నాన్న అందుకే మమ్మల్ని రమ్మనడం లేదు. మరి మేము ఎలా ఉండాలి. నాన్న లేకుండా ఎలా ఉండాలి అని సౌర్య అంటుంది.
నాన్న అందరినీ తీసుకెళ్లినప్పుడే వెళదామని హిమ అనగా.. ఇంకా నీకు నమ్మకం ఉందా హిమ అని సౌర్య ప్రశ్నిస్తుంది. దానికి హిమ నాన్న నన్ను చూడకుండా ఉండలేడు అని అనగా.. కానీ మనం వస్తుంటే ఆపలేదు అని సౌర్య అంటుంది. అందుకే అమ్మతోనే ఉందాం అని హిమ అనగా.. అయితే ఎప్పటికీ నాన్న రాడని సౌర్య చెబుతుంది. వస్తాడేమో అని హిమ అనగా.. రాకపోతే అని సౌర్య అనగా.. వస్తాడు అని హిమ అనగా.. రాడు అని సౌర్య అనగా.. నాకు నాన్న కావాలి అని హిమ అంటుంది. ఇక దీప. వెళ్లండమ్మా. వారణాసి వీళ్లిద్దరిని వాళ్ల నాన్న దగ్గర వదిలేసిరా. వెళ్లండమ్మా. నేనేమీ ఆపను. అందుకే అక్కడే అడిగాను. నాన్న కావాలా.. అమ్మ కావాలా అని. మీరు అక్కడ నేను కావాలని వచ్చారు. మీ నాన్న ఆపలేదు. ఇక్కడ మీ నాన్న కావాలన్నారు. వెళ్లండి అని అంటుంది.
ఇక సౌర్య, హిమ.. మాకు ఇద్దరు కావాలని అంటారు. వెంటనే దీప.. మీ నాన్నకు నేను అక్కర్లేదు. మీరు వెళితే వద్దనరు. మిమ్మల్ని ఇద్దరినీ ప్రేమగానే పెంచుకుంటారు అని అంటుంది. దానికి సౌర్య.. మరి నువ్వు అని అడుగుతుంది. ఏమవుతానమ్మా. పదేళ్ల క్రితం మీ ఇద్దరినీ కడుపున మోస్తున్నప్పుడు, ఆ ఇంటి గడప దాటుతున్నప్పుడు ఏమయ్యాను. ఒంటరిని అయ్యాను. అనాథను అయ్యాను. దిక్కులేని పక్షిని అయ్యాను. తలదాచుకోవడానికి గూడు లేక ఎక్కడో ఒకచోట జీవచ్చవంలా పడి ఉన్నాను. పదేళ్లు బ్రతకలేదా.. మిమ్మల్ని బ్రతికించుకోలేదా.. చచ్చిపోలేదు కదమ్మా. ఇప్పుడు కూడా బ్రతికే ఉంటాను. ఇలాగే మళ్లీ ఈ మొక్కల మధ్య బ్రతికేస్తూ ఉంటాను. ఈ పిచ్చి మొక్కలే బతుకుతున్నాయి. నేను బతకలేనా.. మీకు మీ నాన్న కావాలి. నాకు మీ నాన్న కావాలి. కానీ మీ నాన్నకు మీరు వస్తే అభ్యంతరం లేదు. నాకు మీరు లేకపోతే బతుకేలేదు. నా బతుకుకు అర్థమే లేదు. కానీ నా కోసం మీ బంగారు భవిష్యత్‌ని నాశనం చేసే శక్తి లేదు. మీరు అక్కడ ఉంటేనే మీకు మంచి తిండి, మంచి బట్టలు, గొప్ప చదువు, గొప్ప బతుకు. నాతో ఉంటే ఏముంటుంది. వంటలక్క ఇంట్లో బియ్యం నిండుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి.ఎలాగో బ్రతికేస్తాను. చావకుండా, బ్రతకకుండా.. ఇంతకాలం కలుస్తామన్న నమ్మకం బ్రతికించింది. ఇప్పుడు ఆ నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది అని అంటుంది.
ఇక వారణాసి.. సౌర్యమ్మా. నువ్వు తిట్టినా సరే ఇవాళ నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు అమ్మ నిన్ను ఎలా పెంచిందో మర్చిపోయావా..ఇవాళ మీ నాన్న కారులో తిప్పి, ఖరీదైన భోజనం పెట్టినంత మాత్రాన ఆయనే కావాలని పరిగెడతావా.. రండమ్మా. తీసుకెళతాను. ఆటో ఎక్కండి. అమ్మ ఏమైపోతే మీకెందుకు. మీకు మీ నాన్ననే ముఖ్యం. ఆ దొరకు మీ అమ్మ అక్కర్లేదు. మీరంతా కలిసే ఉండడమ్మా రండి వదిలేసి వస్తాను అంటాడు. వెంటనే హిమ, సౌర్య ఏడుస్తూ.. దీపను హత్తుకొంటారు. వెంటనే సౌర్య.. అమ్మా సారీ అమ్మా. మాకు మీ ఇద్దరు కావాలి. ఇద్దరిలో ఒకరే అంటే నువ్వే కావాలి. నువ్వే కావాలి అని ఏడుస్తుంది. హిమ కూడా నువ్వే కావాలని చెబుతుంది.
మరోవైపు ఇంట్లో సౌందర్య, ఆనందరావు, ఆదిత్య, శ్రావ్యలు దీప, కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటూ బాధలో ఉంటారు. అదే సమయానికి కార్తీక్ పైనుంచి కిందికి వస్తాడు. వారందరినీ చూసి.. చూడండి. దీర్ఘంగా ఆలోచించాల్సింది. నిట్టూర్పు వదలాల్సింది. ఏదో పోగొట్టుకకున్నట్లు బాధపడాల్సింది, భారంగా బతుకు వెళ్లదీయాల్సింది. ఈ జీవితం నాకేం ఇచ్చింది. జీవితంలో నేను ఎన్ని ఆశలను పెంచుకున్నాను. ఎలా బతుకుతున్నాను. చివరకు ఏం మిగిలింది. ఏమీ సాధించాను అని ఏడవాల్సింది నేను మీరెవరూ కాదు. మీకేం మీరంతా బాగానే ఉన్నారు. మీకేం కష్టం వచ్చింది. నా బిడ్డను నాకు కాకుండా చేసి దూరం చేసి తీసుకెళ్లిపోయిందే పుణ్యాత్మురాలు జీవశ్చవంలా, మరబొమ్మలా గుండెలేని మనిషిగా నిలబడింది నేను. ఆగిపోయిన ఎన్నో గుండెలను బాగుచేశాను. గుండెల నిండా స్వేచ్ఛావాయువును పీల్చుకోలేని నా గుండెకు ఏ వైద్యం చేయించుకోవాలో అర్థం కావడం లేదు. ఏ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్లినా నా గుండెకు ఏమైందో చూడండి అని చెప్పుకోలేను. నువ్వే పెద్ద గుండె డాక్టర్వి కదా అంటారు. నీకేం రోగం అంటారు. నా గుండెకు వచ్చిన జబ్బు ఏంటో చెప్పుకోలేను. కానీ జాలి పడాల్సిన విషయం ఏంటంటే. నా మీద మీ ఎవ్వరికీ జాలి లేదు. పాపం నేను. తిలా పాపం తలా పిడికెడు అంటారు. ఆ పాపంలో మీ అందరికీ భాగం ఉంది అంటాడు,
వెంటనే ఆదిత్య ఆవేశంతో లేదు అని లేస్తాడు. లేదు. మాకేంటి సంబంధం. ఆ పాపంలో మాకెందుకు వాటాలు ఇస్తున్నావు. మేమేం నేరం చేశావు. మమ్మల్ని ఎందుకు భాగస్వామ్యుల్ని చేస్తున్నావు. వీళ్లు ఏం చేశారు. పిల్లలు ఏం చేశారు.. చేసిందంతా నువ్వు, చేసుకున్నదంతా నువ్వు అని ఆదిత్య అంటాడు. ఇక కార్తీక్.. ఏం మాట్లాడుతున్నావు. నేనేం చేశాను. అనాథ బిడ్డ అని చెబితే అపురూపంగా పెంచుకున్నాను. కాదని తెలిసినా పెంచిన ప్రేమ అనువంత కూడా తగ్గలేదు. ఆ రౌడీని నేను పెంచలేదు. రెండు రోజులు నీతో ఉంటాను నాన్న అంటే మనసు కరిగిపోయి కళ్లలో నీళ్లు తిరిగిపోయి, గుండె ధ్రవించుకుపోయి ఇంటికి తీసుకొచ్చాను. ప్రేమగా చూసుకున్నాను. దాని ప్రేమకు మురిసిపోయాను. దాని దారిలోనే ప్రయాణించాను. అందుకు వాళ్లేం చేశారు. ఇంత చేసిన నన్ను కాదని నిర్ధాక్షణ్యంగా దాని వెంట నడుచుకోయారు అని అంటాడు.
ఇక ఆదిత్య.. దానికి కారణం నువ్వు కాదా అని అడుగుతాడు. అంటే. నా బిడ్డను నేను కాకుండా చేసుకుంటానా అని కార్తీక్ అనగా.. నేను బిడ్డ గురించి మాట్లాడటం లేదు.తల్లి గురించి అని ఆదిత్య అంటాడు. నోర్మూయ్ అని కార్తీక్ అనగా.. ఎందుకు మూయాలి. ఎందుకు మూయాలి చెప్పు అని ఆదిత్య ఆవేశంతో అంటాడు. వెంటనే ఆనందరావు.. రేయ్ ఆదిత్య ఊరుకోరా. వాడు వినడురా. వినడు అని అంటాడు. దానికి ఆదిత్య.. అంటే అన్నయ్య దృష్టిలో మనమంతా వెర్రివెంగలప్పలమా. అతనే ఏదో ఊహించుకున్నాడు. ఆ ఊహను పదే పదే నిజమని తన మనసుకు తనే చెప్పుకొని చివరకు అదే నిజమని బలమైన ముద్ర వేసుకొని ఆ పాపానికి అందరినీ బలి చేసి తనుకు ఏదో అన్యాయం జరిగిందని బాధపడుతున్నాడు. తన మీద తనే జాలిపడుతున్నాడు. అసలు ఈ సెల్ఫ్ పిటీ చూపించుకునే వాళ్లంటే నాకు అసహ్యం అంటాడు. వెంటనే కార్తీక్.. ఆదిత్య నువ్వు నాన్సెన్స్ మాట్లాడుతున్నావనగా.. నేనేం నాన్సెన్స్ మాట్లాడటం లేదు. నీ ఊహలే నాన్సెన్స్, నీ కోపం నాన్సెన్స్ అని ఆదిత్య అంటాడు.
ఇక కార్తీక్ కోపంగా ఆదిత్య అనగా.. ఏంటి అని అంతే ఆవేశంగా ఆదిత్య అంటాడు. వెంటనే సౌందర్య.. రేయ్ ఆదిత్య ఆగరా. నువ్వెందుకు అంత ఆవేశపడుతున్నావు. ఇన్నేళ్లు ఇన్నేళ్లు నీకన్నా ఎక్కువ ఆవేశపడ్డాము. వాడికి అర్థం అయ్యేలా చెప్పాలనుకున్నాము. అది నిప్పురా అని చెప్పాము. వాడికి కనువిప్పు కలగలేదు అని అంటుంది. ఇక కార్తీక్.. అది. అదే దాని తెలివితేటలు. అది దాని మేధస్సు. అది దాని ఇంటిలిజెన్స్. అందరినీ మాయ చేసింది. ఆ దీప మీద మీరు పెంచుకున్న పిచ్చి ప్రేమ మిమ్మల్ని వెర్రి వెంగళప్పలను చేసింది. నేను కాదు. దాని మీద ప్రేమతో మీ కనులు మూసుకుపోయాయి అని అంటాడు. వెంటనే ఆదిత్య.. మా కళ్లు కాదు. అనుమానమనే తెరతో నీ కళ్లు మూసుకుపోయాయి. నీ గుండె ఇరుకు అయిపోయింది. నీ ఆలోచన సంకుచితమైపోయింది. జాలి పడాల్సిన వదినను నానా మాటలు అంటూ నీ మీద సానుభూతి చూపించమంటున్నావు సిగ్గుగా లేదా నీకు అని అంటాడు. ఇక కార్తీక్.. ఆదిత్య చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అనగా.. ఏంటి కొడతావా కొట్టు కొట్టు అంటూ ఆదిత్య ముందుకు వెళతాడు. అదే సమయంలో ఆనందరావుకు గుండెలో నొప్పి వస్తుంది. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేయమని కార్తీక్, ఆదిత్యకు చెబుతాడు.
మరోపైపు దీపకు సౌందర్య ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్‌ని కట్ చేసి ఫోన్‌ని దీప స్విచ్ఛాఫ్ చేస్తుంది. ఎవరమ్మా అని హిమ, సౌర్యలు అడగ్గా.. ఎవరో అని ఫోన్ పక్కన పెట్టేస్తుంది. మరి మాట్లాడొచ్చు కదమ్మా అని హిమ అడగ్గా.. నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడే ఓపిక లేదమ్మా అని దీప అంటుంది.వెంటనే సౌర్య.. నానమ్మనేమో అనుకున్నాను అని అంటుంది. ఇక హిమ.. నాన్న అనుకున్నాను అని అంటుంది. ఆ తరువాత ఇద్దరు దీప ఒళ్లో పడుకుంటారు. ఆ తరువాత దీప.. కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటూ అలా పడుకుంటుంది. వెంటనే వారణాసి వచ్చి.. అక్క వంట ఏం చేయలేదా.. నేను ఇంటికి వెళ్లి వంట చేయించుకొని వస్తాను అంటాడు. అక్కా నిన్నే వినపడిందా అని వారణాసి అనగా.. ఏమన్నావురా అని దీప అడుగుతుంది. నేను ఇంటికి వెళ్లి భోజనం తీసుకొస్తానని వారణాసి అనగా.. మాకా అని దీప అడుగుతుంది. నేనే చేస్తాను అని దీప అనగా.. నువ్వు ఉన్న పరిస్థితుల్లో అని వారణాసి అంటాడు. ఈ పరిస్థితి ఇలానే ఉండొచ్చు. అప్పటిదాకా నువ్వే భోజనం తెస్తావా చెప్పు. నా బిడ్డలకు వండి పెట్టడానికి అయినా నేను బ్రతికి ఉండాలి కదా అని దీప అంటుంది. కార్తీక దీపం కొనసాగుతుంది.