Karthika Deepam: సౌందర్య ఇంట్లో టెన్షన్ టెన్షన్.. అలా జ‌ర‌గ‌కూడ‌దంటూ ఏడుస్తూ కూర్చున్న మౌనిత

కార్తీక దీపం

బుల్లితెరపై నెంబ‌ర్ 1 సీరియ‌ల్‌గా దూసుకుపోతున్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్‌లో అస‌లైన ట్విస్ట్‌లు ఈ మ‌ధ్యకాలంలోనే మొద‌ల‌య్యాయి. ఇన్ని రోజులు సౌంద‌ర్య‌(Soundarya), దీప(Deepa) దాచుకున్న నిజాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయి.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరపై నెంబ‌ర్ 1 సీరియ‌ల్‌గా దూసుకుపోతున్న కార్తీక దీపం సీరియ‌ల్‌లో అస‌లైన ట్విస్ట్‌లు ఈ మ‌ధ్యకాలంలోనే మొద‌ల‌య్యాయి. ఇన్ని రోజులు సౌంద‌ర్య‌, దీప దాచుకున్న నిజాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో సౌర్య‌, హిమ ఇద్ద‌రు దీప పిల్ల‌లే అని తెలుసుకున్నాడు డాక్ట‌ర్ బాబు కార్తీక్. ఇక తాజా ఎపిసోడ్‌లో దీపు 100 రోజుల ఫంక్ష‌న్ కోసం(ఆదిత్య‌, శ్రావ్య కుమారుడు) పిల్ల‌ల‌తో స‌హా దీప‌ను త‌న ఇంటికి తీసుకొస్తాడు కార్తీక్. ఈ సంద‌ర్భంగా అస‌లు ఏం జ‌రుగుతుంది అన్న టెన్ష‌న్ అంద‌రిలో మొద‌లవుతుంది. దీప‌ను ప‌క్క‌ను పిలిచిన సౌంద‌ర్య అక్క‌డ ఏం జ‌రిగింది..? అంటూ ప్ర‌శ్నించ‌గా.. సామాన్ల‌తో స‌హా మా అంద‌రినీ ఇక్క‌డ‌కు తీసుకొచ్చాడు అత్త‌మ్మ అని చెబుతుంది. మ‌రోవైపు కార్తీక్ ఇంట్లో ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు వాళ్లింటికి వెళ్లిన మౌనిత ప‌నిమనిషి ప్రియ‌మ‌ణిని మిగిలిన వారికి ప‌రిచ‌యం చేస్తాడు కార్తీక్.

    ఇక్కడ ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు మౌనిత పంపిందా..? ఏం జ‌ర‌గ‌లేద‌ని మౌనిత‌తో చెప్పు. దీప వ‌చ్చారు. పిల్ల‌లు వ‌చ్చారు. శ్రావ్య త‌ల్లిదండ్రులు వ‌చ్చారు. ఇక మీద‌ట అంతా మంచే జ‌రుగుతుంది. ఎలాంటి ప్ర‌తీకారాలు ఉండ‌వ‌ని చెప్పు అని ప్రియ‌మ‌ణితో మాట్లాడిన కార్తీక్.. ప్రియ‌మ‌ణిని ఇంటి ద‌గ్గ‌ర దింప‌మ‌ని అంజీతో చెప్పిరా అని మాల‌తీతో అంటాడు కార్తీక్. దీంతో ప్రియ‌మ‌ణి ఏం చేయాలో తెలీక‌.. న‌మ‌స్కారం పెట్టి అక్కడి నుంచి వెళుతుంది. ఇక దీపుగాడి బ‌ర్త్‌డే వేడుల‌కను చేద్దామ‌న్న కార్తీక్.. దీపుగాడికి 100 రోజుల ఫంక్ష‌న్ చేశాన‌ని వాడికి తెలిసే వ‌య‌సు కాదు ఇది. కానీ పెద్ద‌య్యాక ఈ వీడియో వాడికి చూపించు. వాడి పెద్ద‌మ్మ వ‌చ్చింద‌ని కూడా చెప్పు అంటూ కేక్ క‌ట్ చేద్దాం అని చెప్తాడు.

    మ‌రోవైపు సౌంద‌ర్య ఇంట్లో అంద‌రూ క‌లిసి ఉన్నార‌ని తెలుసుకున్న మౌనిత‌.. ఇంట్లో వ‌స్తువుల‌న్నీ చిందర వంద‌ర చేసి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఈ లోకంలో త‌న‌ది స్వ‌చ్ఛ‌మైన ప్రేమ అని.. కార్తీక్, దీప కలిస్తే స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కు అర్థం ఉండ‌ద‌ని ప్రియ‌మ‌ణితో చెబుతూ ఉంటుంది. వారిద్ద‌రు క‌ల‌వ‌కూడ‌దు అంటూ త‌న‌లోని విషాన్ని బ‌యట‌పెడుతుంది. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో హిమ, సౌర్య ఇద్ద‌రు దీప పిల్ల‌లే క‌దా అమ్మా అని కార్తీక్‌.. సౌంద‌ర్య‌ను అడుగుతాడు. వారిద్ద‌రు మ‌న బిడ్డ‌లే అని దీప చెప్ప‌గా.. ఆమె చెంప చెల్లుమ‌నిపించిన కార్తీక్.. మ‌న కాదు. నీ అంటూ మాట్లాడుతాడు. మొత్తానికి ఇవాళ్టి కార్తీక దీపం ఎపిసోడ్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగింది.
    Published by:Manjula S
    First published: