కార్తీక దీపం: బిర్యానీ పార్టీ చేసుకున్న వంటలక్క, కార్తీక్..మెంటలెక్కిన మోనిత ఏం చేసిందంటే...?

కార్తీక్, దీపలను కలిపేందుకు కవల పిల్లలు సౌర్య, హిమ తీవ్రంగా ప్రయత్నం చేయడం, ఆ దిశగానే కథ ముందుకు కదలడం, దీప, కార్తీక్ ల మధ్య అపోహలు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి.

news18-telugu
Updated: December 6, 2019, 7:15 PM IST
కార్తీక దీపం: బిర్యానీ పార్టీ చేసుకున్న వంటలక్క, కార్తీక్..మెంటలెక్కిన మోనిత ఏం చేసిందంటే...?
కార్తీక దీపం (Image: Hotstar)
  • Share this:
కార్తీక దీపం సీరియల్ తెలుగులో అత్యంత ప్రజాదరణతో దూసుకుళ్తోంది. మొత్తం 650 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుంది. అయితే ఈ దశలోనే సీరియల్‌లో మొదటి సీజన్ ముగింపునకు వచ్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కథలో ఇఫ్పటికే కార్తీక్, దీపలను కలిపేందుకు కవల పిల్లలు సౌర్య, హిమ తీవ్రంగా ప్రయత్నం చేయడం, ఆ దిశగానే కథ ముందుకు కదలడం, దీప, కార్తీక్ ల మధ్య అపోహలు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి. తాజా ఎపిసోడ్ లో వంటలక్క, డాక్టర్ బాబు , పిల్లలు అంతా కలిసి బిర్యానీ పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం మోనితకు తెలుస్తుందని, దీంతో మోనితకు మెంటలెక్కిపోయి, డాక్టర్ బాబుకు కాల్ చేసి చెడామడా తిడుతుందనే టాక్ వినిపిస్తోది. అయితే మరోవైపు పిల్లలు ఇద్దరు తమ తల్లితండ్రులను కలిపేందుకు  చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న నేపథ్యంలో వంటలక్క ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారట.

ఇప్పటికే తెలుగు టెలివిజన్ రేటింగ్స్ లో అత్యధిక పాయింట్లు సాధించి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోను సైతం తోసి రాజని టాప్ పొజిషన్ లో నిలిచిన కార్తీక దీపం బుల్లితెరపై ఓ సంచలనం అనే చెప్పవచ్చు. ఈ సీరియల్ ప్రస్తుతం మొదటి సీజన్ పూర్తి అవ్వనుందనే టాక్ వినిపిస్తోంది.First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>