KARTHIKA DEEPAM SERIAL TODAY EPISODE REVIEW DEEPA FANS IN CELEBRATIONS MK
కార్తీక దీపం వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్...మోనితకు డాక్టర్ బాబు దిమ్మతిరిగే షాక్...
(Image: Hotstar)
ఇప్పటికే కూతురు సౌర్యకు డాక్టర్ బాబు తన తండ్రి అనే విషయం తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో డాక్టర్ బాబు, మోనిత మధ్య జరిగిన సీన్ వంటలక్క ఫ్యాన్స్ కు ఆనందాన్ని పంచే వీలుంది.
తెలుగునాట మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని విశేష ఆదరణ పొందుతున్న టీవీ సీరియల్ కార్తీక దీపం. రోజుకో కొత్త మలుపుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ సీరియల్ మొదటి సీజన్ పూర్తి కావొస్తున్న నేపథ్యంలో వంటలక్క అలియాస్ దీపకు కష్టాలు తొలిగిపోనున్నాయి. డిసెంబర్ 2న ప్రసారం కానున్న ఎపిిసోడ్ లో డాక్టర్ బాబు మోనితకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూతురు సౌర్యకు డాక్టర్ బాబు తన తండ్రి అనే విషయం తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో డాక్టర్ బాబు, మోనిత మధ్య జరిగిన సీన్ వంటలక్క ఫ్యాన్స్ కు ఆనందాన్ని పంచే వీలుంది. ఈ ఎపిసోడ్ లో మోనితతో డాక్టర్ బాబు తనకు వంటలక్కపై ఎలాంటి కోపం ఉన్నప్పటికీ ఆమె కూతురు సౌర్యపై మాత్రం ప్రేమ ఉందని తెలిపాడు. అలాగే వంటలక్క దీపను చీదరించుకోవడం తన స్వభావం కాదన్నాడు.
అంతేకాదు దీప కూతురు సౌర్యపై తనకు జాలి ఉందని చెప్పడంతో అటు వంటలక్క ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ కూడా ఉందని అదేంటో బుల్లితెరపైనే చూడాలని సోషల్ మీడియా వేదికగా వంటలక్క ఫ్యాన్స్ లీకులు ఇస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.