కార్తీక దీపంలో ట్విస్ట్...ఒక్కటైన వంటలక్క, డాక్టర్ బాబు...పిల్లలు దిద్దిన కాపురం..

కార్తీక్ దగ్గర పెరుగుతున్న హిమకు సైతం వంటలక్క దీపతో డాక్టర్ బాబును ఇచ్చి పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. అలాగే అటు కోర్టు ఇచ్చిన గడువు సైతం పూర్తి కావొస్తోంది.

news18-telugu
Updated: December 9, 2019, 9:30 AM IST
కార్తీక దీపంలో ట్విస్ట్...ఒక్కటైన వంటలక్క, డాక్టర్ బాబు...పిల్లలు దిద్దిన కాపురం..
Image : Star Maa
  • Share this:
కార్తీక దీపం సీరియల్ ట్విస్టుల మీద ట్విస్టులతో దూసుకెళుతోంది. ఇప్పటికే దీప దగ్గర పెరుగుతున్నసౌర్యకు తన తండ్రి డాక్టర్ కార్తీక్ అన్న విషయం తెలిసిపోయింది. మరోవైపు కార్తీక్ దగ్గర పెరుగుతున్న హిమకు సైతం వంటలక్క దీపతో డాక్టర్ బాబును ఇచ్చి పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. అలాగే అటు కోర్టు ఇచ్చిన గడువు సైతం పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో సీరియల్ ఒక అనుకోని మలుపు తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కార్తీక్, దీప వంటలక్కను కలిపేందుకు అటు కవల పిల్లలు హిమ, సౌర్యలు ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. అటు హిమ అయితే ఏకంగా వంటలక్క తనకు అమ్మ అయితే బాగుంటుందని, డాక్టర్ బాబును ఏకంగా ఒక స్కూటీ కొనివ్వమని కోరింది. కూతురు కోరిక కాదనలేక డాక్టర్ బాబు స్కూటీ కొనివ్వడం, దానిపై వంటలక్కను ఎక్కించుకొని చక్కర్లు కొట్టడం, మోనిత కంట పడటం అంతా ఒక సీక్వెన్స్ గా జరిగిపోయాయి. దీంతో వంటలక్క కుటుంబం అంతా కలిసి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో అటు సోషల్ మీడియా వేదికగా దీప వంటలక్క ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Published by: Krishna Adithya
First published: December 8, 2019, 7:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading