కార్తీక దీపంలో ఒక్కటైన వంటలక్క, డాక్టర్ బాబు...పిల్లలతో కలిసి వీడియో అదిరిపోయిందిగా

సీరియల్ ఒక అనుకోని మలుపు తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే మలయాళ మాతృకలో కార్తీక్, దీపలకు ఒక్క కూతురే ఉంటుంది. అయితే తెలుగులో మాత్రం కవల పిల్లలు అని చూపించారు. దీంతో తెలుగులో కథలో మార్పులు ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: December 4, 2019, 7:33 PM IST
కార్తీక దీపంలో ఒక్కటైన వంటలక్క, డాక్టర్ బాబు...పిల్లలతో కలిసి వీడియో అదిరిపోయిందిగా
కార్తీక దీపం (Image: Youtube)
  • Share this:
కార్తీక దీపం సీరియల్ ఒక కీలక దశకు వచ్చేసింది. ఇప్పటికే దీప దగ్గర పెరుగుతున్నసౌర్యకు తన తండ్రి డాక్టర్ కార్తీక్ అన్న విషయం తెలిసిపోయింది. మరోవైపు కార్తీక్ దగ్గర పెరుగుతున్న హిమకు సైతం వంటలక్క దీపతో డాక్టర్ బాబును ఇచ్చి పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. అలాగే అటు కోర్టు ఇచ్చిన గడువు సైతం పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో సీరియల్ ఒక అనుకోని మలుపు తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే మలయాళ మాతృకలో కార్తీక్, దీపలకు ఒక్క కూతురే ఉంటుంది. అయితే తెలుగులో మాత్రం కవల పిల్లలు అని చూపించారు. దీంతో తెలుగులో కథలో మార్పులు ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. మరోవైపు వంటలక్క దీపను ఎలాగైనా కార్తీక్ తో కలిపేయాలనే సౌర్య, హిమ పంతం నెగ్గడం ఖాయమని ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది. అయితే అటు డాక్టర్ బాబు, దీప, హిమ, సౌర్య సరదాగా గడిపిన వీడియో మీ కోసం..First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...