కార్తీక దీపం వంటలక్క ఇకపై బుల్లితెర బాహుబలి...దేశంలోనే అరుదైన రికార్డు...

మొత్తం 650 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుంది. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా వివిధ చానెల్స్ లో ప్రసారం అవుతున్న ఫిక్షన్ తరహా కార్యక్రమాల్లో కార్తీక దీపం సీరియల్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.

news18-telugu
Updated: December 4, 2019, 10:14 AM IST
కార్తీక దీపం వంటలక్క ఇకపై బుల్లితెర బాహుబలి...దేశంలోనే అరుదైన రికార్డు...
కార్తీక దీపం (Image: Facebook)
  • Share this:
కార్తీక దీపం సీరియల్ తెలుగులో అత్యంత ప్రజాదరణతో దూసుకుళ్తోంది. ఇప్పటికే తెలుగు టెలివిజన్ రేటింగ్స్ లో అత్యధిక పాయింట్లు సాధించి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోను సైతం తోసి రాజని టాప్ పొజిషన్ లో నిలిచిన కార్తీక దీపం బుల్లితెరపై ఓ సంచలనం అనే చెప్పవచ్చు. మొత్తం 650 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుంది. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా వివిధ చానెల్స్ లో ప్రసారం అవుతున్న ఫిక్షన్ తరహా కార్యక్రమాల్లో కార్తీక దీపం సీరియల్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే కార్తీక దీపం ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగ్స్ పరంగా చూసినా, ఈ సీరియల్ తెలుగులో నెంబర్ వన్ స్థానంలో ఉంది.

కార్తీక దీపం ఆదరణతో అటు స్టార్ మా చానెల్ అయితే తన మాతృసంస్థ అయిన స్టార్ ప్లస్ ను సైతం రేటింగ్స్‌లో దాటేసింది. కాగా స్టార్ మా ఈ ఘనత సాధించడం వెనుక బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్ ఉందని అంటున్నప్పటికీ, అదంతా తూచ్ అని స్టార్‌మా టాప్‌లో నిలిచేందుకు వంటలక్క ఆదరణే కారణమని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు సీరియల్స్‌లో విశేష ఆదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం, అయితే ఈ సీరియల్ లో దీప కేరక్టర్ అంటే మహిళలకు బాగా ఇష్టమనే చెప్పవచ్చు.

Karthika Deepam Episode 668, Karthika Deepam 669 Episode, Karthika Deepam Today Episode, Karthika Deepam Today, Karthika Deepam Serial Today, Karthika Deepam Promo, Karthika Deepam 668, Karthika Deepam 669, Karthika Deepam Telugu Daily Serial, Karthika Deepam, Karthi, Deepa, Karthika Deepam Episode, Karthika Deepam Full episode, Karthika Deepam Serial, Karthikadeepam, Deepakka fans, Karthika Deepam Today Full episode, Karthika Deepam December 4, Karthika Deepam 2019
కార్తీక దీపం (Image: Facebook)
Published by: Krishna Adithya
First published: December 4, 2019, 10:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading