హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam- Archana Ananth: అందమైన అత్త 'కార్తీక దీపం' సౌందర్య బ్యాక్‌గ్రౌండ్ తెలుసా.. !

Karthika Deepam- Archana Ananth: అందమైన అత్త 'కార్తీక దీపం' సౌందర్య బ్యాక్‌గ్రౌండ్ తెలుసా.. !

Karthika Deepam- Archana Ananth: తెలుగు బుల్లితెర‌పై నంబ‌ర్ 1 సీరియ‌ల్‌గా సాగుతోంది కార్తీక దీపం. స్టార్ మాలో వ‌చ్చే ఈ సీరియ‌ల్‌కి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్ర‌జాద‌ర‌ణ ఉంది. సామాన్యులే కాదు సెల‌బ్రిటీల ఇళ్ల‌లోనూ రోజు రాత్రి గం.7.30ని.ల‌కు కార్తీక దీపం చూస్తూ ఉంటారు.

ఇంకా చదవండి ...

  Karthika Deepam- Archana Ananth: తెలుగు బుల్లితెర‌పై నంబ‌ర్ 1 సీరియ‌ల్‌గా సాగుతోంది కార్తీక దీపం. స్టార్ మాలో వ‌చ్చే ఈ సీరియ‌ల్‌కి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్ర‌జాద‌ర‌ణ ఉంది. సామాన్యులే కాదు సెల‌బ్రిటీల ఇళ్ల‌లోనూ రోజు రాత్రి గం.7.30ని.ల‌కు కార్తీక దీపం చూస్తూ ఉంటారు. ఇక ఈ సీరియ‌ల్‌లో ప్రధాన పాత్రాధారులైన దీప(ప్రేమి విశ్వ‌నాథ్), కార్తీక్(ప‌రిటాల నిరుప‌మ్‌), సౌంద‌ర్య(అర్చ‌నా అనంత్), మౌనిత‌(శోభా శెట్టి)లు బ‌య‌ట మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నారు. వీరిలో కార్తీక్ ఒక్క‌డే తెలుగువాడు కాగా.. అర్చ‌నా అనంత్, శోభా శెట్టి క‌ర్ణాట‌క‌కు చెందిన వారు. ఇక ప్రేమి విశ్వ‌నాథ్ కేర‌ళ‌కు చెందిన వారు. వీరు ఇక్క‌డ కూడా అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

  ఇక అర్చ‌నా అనంత్ వివ‌రాల్లోకి వెళ్తే.. ఈమె బెంగ‌ళూరులో జ‌న్మించారు. ఆమె మాతృభాష త‌మిళ్ అయిన‌ప్ప‌టికీ.. క‌న్న‌డిగ‌లాగా పెరిగారు. అర్చ‌నా అనంత్ త‌ల్లి ఒక ప్ర‌భుత్వ ఉద్యోగి కాగా.. ఆమె తండ్రి కూడా న‌టుడు. క‌న్న‌డ సీరియ‌ల్‌, సినిమాల్లో ఆయ‌న న‌టించిన‌ట్లు స‌మాచారం. ఇక న‌టిగా త‌న కెరీర్‌ని ప్రారంభించ‌క‌ముందు అర్చ‌నా.. బ్యూటీషియ‌న్‌గా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో కాస్త బొద్దుగా కూడా ఉండేది ఈ న‌టి.

  అయితే కార్తీక దీపం ప్రారంభ‌మైన త‌రువాత కొన్ని అనారోగ్య కార‌ణాల వ‌ల‌న ఆమె బ‌రువును త‌గ్గారు. ఇక ఫ్యాష‌న్ డిజైనింగ్‌లోనూ అర్చ‌న‌కు కాస్త ప్ర‌వేశం ఉంది. ఈ క్ర‌మంలో త‌న ఫ్యాష‌న్ డిజైనింగ్‌ని తానే చేసుకుంటార‌ట అర్చ‌నా. కాగా అర్చ‌నాకు అనంత్ అనే వ్యక్తితో వివాహం జ‌రిగింది. అత‌డొక బిజినెస్‌మ్యాన్. వీరిద్ద‌రికి ఒక బాబు ఉన్నాడు. ఇక ఇప్పుడు ప‌లు సీరియ‌ళ్ల‌లో న‌టిస్తోన్న అర్చ‌నా.. అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన థ్యాంక్యు బ్ర‌ద‌ర్‌లో ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించారు.

  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial

  ఉత్తమ కథలు