news18-telugu
Updated: December 2, 2020, 7:20 PM IST
కార్తీక దీపం దీప (Image : Star maa)
కార్తీక దీపం దెబ్బకు పెద్ద పెద్ద సీరియల్స్ అన్నీ రేటింగుల్లో చాలా వెనకబడిపోతున్నాయి. ఇప్పటికే ప్రతీ వారం విడుదల చేసే బార్క్ రేటింగ్స్ లో కార్తీక దీపం సీరియల్ దూసుకెళ్తోంది. తాజాగా విడుదల చేసిన 42వ వారం రేటింగ్స్ లో సైతం కార్తీక దీపం మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాటు, వదినమ్మ, కోయిలమ్మ, మౌనరాగం సీరియల్స్ ఉన్నాయి. అయితే తెలుగునాట సక్సెస్ ఫుల్ షోగా పేరొందిన బిగ్ బాస్ రియాలిటీ షో సైతం కార్తీక దీపం సీరియల్ రేటింగ్స్ ముందు వెనుకబడిపోయింది. స్టార్ హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో గురించి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అటు ప్రమోషన్స్ పరంగా కానీ, పబ్లిసిటీ పరంగా కానీ బిగ్ బాస్ ప్రపంచంలో అతిపెద్ద రియాలిటీ షోగా పేరొందింది. అయితే ఈ షో కూడా కార్తీక దీపం వెలుగు ముందు వెల వెల పోయింది. తాజా రేటింగ్స్ లో టాప్ 5 ప్రోగ్రామ్స్ లో అసలు బిగ్ బాస్ లేకపోవడమే ఇందుకు సాక్ష్యం.
ఆడియన్స్ బిగ్ బాస్ కన్నా టీవీ సీరియల్స్ నే ఎక్కువ సీరియస్ గా తీసుకుంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజానికి కార్తీకదీపం సీరియల్ విశేష ఆదరణతో ఇప్పటికే రికార్డు స్థాయిలో టీఆర్పీలను అందుకుంటూ దూసుకెళుతోంది. అయితే వంటలక్క అభిమానులు మాత్రం ఈ విషయంతో చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. స్టార్ హీరో నాగార్జున షోను సైతం కాదని తమ అభిమాన దీప అలియాస్ వంటలక్క నటించిన కార్తీక దీపం సీరియల్ నే జనం ఎక్కువగా ఆదరిస్తున్నారని వారంతా గర్వంగా భావిస్తున్నారు.
Published by:
Krishna Adithya
First published:
December 2, 2020, 7:20 PM IST