హోమ్ /వార్తలు /సినిమా /

Premi Viswanath: షూటింగ్‌లో మామ‌, మ‌రిదితో వంట‌ల‌క్క ఏం చేస్తుందో చూడండి

Premi Viswanath: షూటింగ్‌లో మామ‌, మ‌రిదితో వంట‌ల‌క్క ఏం చేస్తుందో చూడండి

ఏంటి.. కార్తీక దీపం సీరియల్ వంటలక్క చేయదా.. చేయకూడదు అనుకుందా..? ఇదెప్పుడు జరిగింది..? అసలు వంటలక్క లేని సీరియల్ ఎలా ఉంటుంది.. ఎలా చూడగలరు ప్రేక్షకులు అనుకుంటున్నారా..?

ఏంటి.. కార్తీక దీపం సీరియల్ వంటలక్క చేయదా.. చేయకూడదు అనుకుందా..? ఇదెప్పుడు జరిగింది..? అసలు వంటలక్క లేని సీరియల్ ఎలా ఉంటుంది.. ఎలా చూడగలరు ప్రేక్షకులు అనుకుంటున్నారా..?

Karthika Deepam: కార్తీక దీపం సీరియ‌ల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న ప్రేమి విశ్వ‌నాథ్.. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్ర‌మంలో తాజాగా ఈ సీరియ‌ల్ షూటింగ్‌లో సంద‌డి చేసిన ఓ వీడియోను ప్రేమి అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.

ఇంకా చదవండి ...

  Premi Viswanath: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ గ‌త కొన్నేళ్లుగా రేటింగ్‌లో టాప్‌లో దూసుకుపోతోంది. ఈ సీరియ‌ల్‌లో దీప అలియాస్ వంట‌ల‌క్క పాత్ర‌లో న‌టిస్తోన్న ప్రేమి విశ్వ‌నాథ్ ఇక్క‌డ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. కేర‌ళ‌లో పుట్టి పెరిగిన‌ప్ప‌టికీ.. అక్క‌డి కంటే ఇక్క‌డే ఆమెకు క్రేజ్ ఎక్కువ‌గా ఉంది. అంతేకాదు ఇక్క‌డ ఆమెకు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. కాగా ప్రేమి విశ్వ‌నాథ్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అందులో అప్పుడ‌ప్పుడు కార్తీక దీపం షూటింగ్ విశేషాల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ సీరియ‌ల్‌లోని ప్ర‌ధాన పాత్రాధారుల‌తో ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు ఆ ఫొటోలు, వీడియోల‌ను ప్రేమి పోస్ట్ చేస్తుంటారు. ఈ క్ర‌మంలో తాజాగా ఒక వీడియోను అభిమానుల‌తో పంచుకున్నారు ప్రేమి.

  అందులో ఆనంద‌రావు(అరుణ్ కుమార్), ఆదిత్య‌(య‌శ్వంత్‌)ల‌తో క‌లిసి ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్‌ను చూస్తున్నారు ప్రేమి. మ‌ధ్య‌మ‌ధ్య‌లో వారు ముగ్గురు మాట్లాడుకుంటూ క‌నిపించారు. ఇక ఈ వీడియో వంట‌ల‌క్క అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.


  ఇదిలా ఉంటే కార్తీక దీపం సీరియ‌ల్ ఇప్పుడు మరింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. టెస్ట్ చేసుకునేందుకు కార్తీక్ సిద్ధ‌మ‌య్యాడు. ఈ విష‌యం మోనిత ద‌గ్గ‌ర చెప్ప‌గా.. ఆమె త‌న నిజాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని టెన్ష‌న్ పడుతూ ఉంటుంది. మ‌రోవైపు దీప‌, పిల్ల‌ల జాడ‌కు సంబంధించిన చిన్న విష‌యం మోనిత‌కు దొరుకుతుంది. అలాగే వారి కోసం ముర‌ళీకృష్ణ వెతుకులాట కొన‌సాగుతూ ఉంటుంది. దీంతో ఈ సీరియ‌ల్ ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందోన‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika Deepam serial, Premi Viswanath

  ఉత్తమ కథలు