Home /News /movies /

KARTHIKA DEEPAM SERIAL KARTHIK TAKES KEY DECISION TO LEAVE HIS HOUSE MNJ

Karthika Deepam: డాక్ట‌ర్ బాబు మ‌రో కీల‌క నిర్ణ‌యం.. మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా 'కార్తీక దీపం'

కార్తీక దీపం సీరియల్

కార్తీక దీపం సీరియల్

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ కీల‌క ఘ‌ట్టానికి చేరుకుంది. హిమ(Hima) పుట్టుక గురించి ఇన్నిరోజులు సౌంద‌ర్య(Soundarya), దీప(Deepa) దాచిపెట్టిన నిజాన్ని తెలుసుకున్న డాక్ట‌ర్ బాబు

ఇంకా చదవండి ...
  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ కీల‌క ఘ‌ట్టానికి చేరుకుంది. హిమ పుట్టుక గురించి ఇన్నిరోజులు సౌంద‌ర్య, దీప దాచిపెట్టిన నిజాన్ని తెలుసుకున్న డాక్ట‌ర్ బాబు ఇప్పటికే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. దీపను సామాన్ల‌తో స‌హా తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇక దీపుగాడి 100 రోజుల పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌రుపుతున్న డాక్ట‌ర్ బాబు ఇవాళ్టి ఎపిసోడ్‌లో కేక్‌ని క‌ట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా మ‌న‌సులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్న‌ట్లుగా కార్తీక్ ప్ర‌వ‌ర్తిస్తాడు. దాన్ని ప‌సిగ‌ట్టిన సౌంద‌ర్య‌, దీప.. ఏదో జ‌రగబోతోంది అని మాట్లాడుకుంటారు. త‌న‌కు భ‌యంగా ఉంది అని దీప అనడంతో.. ఎన్నో క‌ష్టాల‌ను ప‌డ్డ దానివి, నీ కాపురం కూలిపోయిన‌ప్పుడు ఇంట్లో నుంచి ఒంట‌రిగా వెళ్లిన‌ప్పుడు కూడా నువ్వు అధైర్య‌ప‌డ‌లేదు. ఇప్పుడు అదే ధైర్యంతో ఉండు అని సౌంద‌ర్య‌కు దీప చెబుతోంది.

  ఇక కేక్ క‌ట్ చేసిన డాక్ట‌ర్ బాబు, భాగ్యంకు ఇస్తూ మీరంటే నాకు ఇష్టం. మీ మ‌న‌సులో ఏది ఉన్నా బ‌య‌ట‌కు చెప్పేస్తారు. కానీ కొంద‌రు ర‌హ‌స్యాల గుట్ట‌లా ఉంటారు. మీరు నాకు అమ్మ‌గా ఉంటే బావుండేది అని అంటాడు. మ‌రోవైపు ముర‌ళీకృష్ణ.. నేను జీవితంలో రెండు సార్లు ఎక్కువ‌గా సంతోష‌ప‌డ్డా. ఒక‌టి నా కుమార్తెను పెళ్లి చేసుకుంటా అన్న‌ప్పుడు కంటే.. ప్రేమ‌తో చేసుకుంటా అని చెప్పిన‌ప్పుడు. ఇప్పుడు నా కుమార్తెను మీరే ఇంటికి తీసుకు వచ్చిన‌ప్పుడు అని అంటాడు. దానికి కార్తీక్‌.. మీరు కాదు నేను న‌మ‌స్కారం చెబుతాను. అంద‌రికీ తుది న‌మ‌స్కారం పెట్టాల్సిన స‌మ‌యం వ‌చ్చింది అని చెబుతాడు. ఇక దీపు గాడికి గిఫ్ట్ తీసుకురండి అంటూ హిమ‌, సౌర్య‌ల‌ను బ‌య‌ట‌కు పంపుతాడు కార్తీక్.

  ఆ త‌రువాత సౌందర్య‌, ఆనంద‌రావుల‌కు టెన్ష‌న్ త‌గ్గే టాబ్లెట్ల‌ను ఇచ్చి మింగ‌మ‌ని చెప్తాడు. ఇదంతా ఏంట్రా అని ఆనంద‌రావు ప్ర‌శ్నించ‌గా.. చెప్తాను డాడీ.. ఇందులో ఆశ్చ‌ర్యం ఏంటంటే.. మీ అంద‌రికీ తెలిసిందే. నేను ఇప్పుడు చెప్ప‌బోతున్నా అని చెప్తాడు. అస‌లు నీ మ‌న‌సులో ఏముంది..? ఏం చెప్పాల‌నుకుంటున్నావు..? ఏదైనా డైరెక్ట్‌గా అడిగేసెయ్ పెద్దోడా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. చెబుతాన‌ని స్టార్ట్ చేస్తాడు. హిమ ఎవ‌రు మ‌మ్మీ..? అని సౌంద‌ర్య‌ను ప్ర‌శ్నిస్తాడు. హిమ నా చేతుల్లోకి రాక‌ముందు తుల‌సి చేతుల మీదుగా నీ చేతిలోకి వ‌చ్చిందని తెలిసింది అని చెబుతాడు. వెంట‌నే ఆదిత్య‌.. అస‌లు తుల‌సి ఎవ‌రు అన్న‌య్య‌..? హిమ అనాథ అని చెప్పావు క‌దా..? అని ప్ర‌శ్నిస్తాడు. హిమ అనాథ అని నాకు చెప్పింది అమ్మ అని అంటాడు.

  అయినా నువ్వు ఎందుకురా మ‌ధ్య‌లో న‌టిస్తావు, న‌న్ను అంద‌రూ మోసం చేశారు అని కార్తీక్, ఆదిత్య‌ను ప్ర‌శ్నించ‌గా.. అస‌లు ఎవ‌రు మోసం చేశారు అన్న‌య్య అని అడుగుతాడు. దానికి దీప‌, సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌వైపు వేలు పెట్టి చూపుతాడు. వీరితో పాటు తాను పెంచిన త‌న కూతురు హిమ కూడా త‌న‌ను మోసం చేసింద‌ని బాధ‌ప‌డుతాడు. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో హిమ‌, సౌర్య ఇద్ద‌రు మా పిల్ల‌లే అని దీప చెప్ప‌డం.. కార్తీక్ ఆమెను కొట్ట‌డం.. ఎవ‌రికో పుట్టిన పిల్ల‌ల‌కు న‌న్ను ఎందుకు తండ్రి చేశావు మ‌మ్మీ అని అడ‌గ‌డం. మీరే హ్యాపీగా ఉండండి. ఈ ఇంట్లో నుంచి నేను వెళ్లిపోతాను అని కార్తీక్ త‌న ల‌గేజ్‌ని తీసుకెళ్ల‌డం చూపించారు. దీంతో కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.
  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Paritala Nirupam (Doctor Babu), Vantalakka deepa

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు