• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • KARTHIKA DEEPAM SERIAL KARTHIK GIVES TASK TO MONITHA MNJ

Karthika Deepam: లోలోపల కుమిలిపోతున్న కార్తీక్.. దీపను నిలదీసేందుకు వెళ్లిన ఆదిత్య

Karthika Deepam: లోలోపల కుమిలిపోతున్న కార్తీక్.. దీపను నిలదీసేందుకు వెళ్లిన ఆదిత్య

కార్తీక దీపం సీరియల్

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునే కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ ఇప్పుడు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. కార్తీక్‌కి నిజం తెలియ‌డంతో హిమ‌, సౌర్య ఇద్ద‌రినీ దీప త‌న‌తోనే తీసుకెళ్లింది. మరోవైపు హిమ‌ను మ‌రిచిపోలేక‌పోతున్న కార్తీక్

 • Share this:
  Karthika Deepam: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునే కార్తీక దీపం సీరియ‌ల్ ఇప్పుడు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. కార్తీక్‌కి నిజం తెలియ‌డంతో హిమ‌, సౌర్య ఇద్ద‌రినీ దీప త‌న‌తోనే తీసుకెళ్లింది. మరోవైపు హిమ‌ను మ‌రిచిపోలేక‌పోతున్న కార్తీక్.. ఆమెను త‌లుచుకుంటూ అరుస్తూ ఉంటాడు. అత‌డి అరుపులు విన్న ఆదిత్య‌, శ్రావ్య‌లు కార్తీక్ రూమ్‌లోకి వెళ్తారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో.. హిమ‌ను నేను రేపు తీసుకొస్తాను అన్న‌య్య అని చెప్తాడు ఆదిత్య‌. కానీ హిమ‌ను ఆ దీప పంపాలి క‌దా అని మ‌న‌సులోనే అనుకుంటాడు కార్తీక్. నిన్ను చూస్తుంటే భ‌యంగా, బాధ‌గా ఉంది అన్న‌య్య అని ఆదిత్య చెప్ప‌గా.. నాకేం కాలేదు మిమ్మ‌ల్ని డిస్ట‌ర్బ్ చేశా క్షమించండి. మీరు వెళ్లండి అని చెప్తాడు కార్తీక్. మాకేం ఇబ్బంది లేదు బావ‌గారు. మీరే ఎలానో అవుతున్నారు అని శ్రావ్య బాధ‌ప‌డుతుంది. దీపు గాడు లేచాడు. మీరు వెళ్లండి అని కార్తీక్ వాళ్ల‌ను అక్క‌డి నుంచి పంపిస్తాడు. వాళ్లు వెళ్లిన త‌రువాత హిమ అని అంటూ మ‌ళ్లీ అంద‌రికీ వినిపిస్తుందన్న ఆలోచ‌న‌తో త‌న నోరును నొక్కి పెట్టుకుంటూ లోలోప‌ల కుమిలిపోతాడు కార్తీక్.

  ఇక ముర‌ళీకృష్ణ‌, భాగ్యం మ‌ధ్య కార్తీక్, దీప గురించి సంభాష‌ణ మొద‌ల‌వుతుంది. వారిద్ద‌రి జీవితాన్ని వారిద్ద‌రే ఇలా చేసుకుంటున్నారు. నేనేం నీ కూతురు విష‌యంలో క‌ల‌గ‌జేసుకోవాల‌నుకోవ‌ట్లేదు. కానీ వారిద్ద‌రి మ‌ధ్య ఏదో చిచ్చు మొద‌లై.. ఇంత‌వ‌ర‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికైనా ఆ చిచ్చు ఏంటో తెలుసుకొని, వారి స‌మస్య‌ను వారే ప‌రిష్క‌రించుకోవాల‌ని అని చెబుతుంది. దాంతో ముర‌ళీకృష్ణ ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు.

  ఆ త‌రువాత పొద్దున్నే కారులో వెళ్తోన్న కార్తీక్‌కి ఒకవైపు హిమ‌, మ‌రోవైపు మౌనిత మాట‌లు గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. దీంతో త‌న‌లో తానే కుమిలిపోతుంటాడు కార్తీక్. అదే స‌మ‌యానికి హిమ ఫోన్ చేస్తుంది. హ‌లో డాడీ ఎలా ఉన్నావు..? ఎక్క‌డ ఉన్నావు..? అంటూ ప్ర‌శ్నిస్తుంది. దీంతో హిమ‌తో మాట్లాడాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. మౌనిత మాట‌లు గుర్తుకు తెచ్చుకుంటూ స‌రిగా మాట్లాడ‌లేక‌పోతాడు కార్తీక్. హిమ ఎంత మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నించినా.. మ‌ళ్లీ చేస్తాను అని బాధ‌ప‌డుతూ ఫోన్ పెట్టేస్తాడు. ఆ త‌రువాత ఎప్పుడు వ‌స్తావు డాడీ అని అడుగుదామ‌నుకున్నా ఆ లోపే ఫోన్ పెట్టేశాడు అని హిమ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ స‌మ‌యంలో హిమ‌ను చూసిన దీప‌.. ఎవ్వ‌రికైనా ఫోన్ చేశావామ్మ అని అడుగుతుంది. దానికి అవును అమ్మా.. డాడీకి ఫోన్ చేశా. కానీ ఏదోలా మాట్లాడారు. ఎవ‌రో తెలియ‌ని వారితో మాట్లాడిన‌ట్లు మాట్లాడారు. మీతో మాట్లాడుతుంటాడు క‌దా..? అలానే మాట్లాడాడు అని బాధ‌ప‌డుతుంది. ఏం కాద‌మ్మా, నువ్వు బాధ‌ప‌డకు అంటూ హిను ఓదారుస్తుంది దీప‌.

  ఆ తరువాత దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ఎన్ని రోజులు ఈ నింద‌ను మోయాలి. ఈ పసిపిల్ల‌ల‌ను బాధ‌పెట్టాలి. ఇది అబ‌ద్దం అని నిరూపించే దారి చూపించు అంటూ వేడుకుంటుంది. మ‌రోవైపు మౌనిత ద‌గ్గ‌ర‌కు వెళ్లిన కార్తీక్.. నువ్వు చెప్పింది నిజ‌మే మౌనిత‌. భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ఏ విష‌యంలోనైనా అభిప్రాయ బేధాలు రావొచ్చు కానీ. న‌మ్మ‌కం విష‌యంలో కాదు. అయినా నేను దీప‌కు ఒక‌సారి అవ‌కాశం ఇచ్చా. త‌ప్పు చేసినా ఏలుకుంటాన‌ని చెప్పా. కానీ దీప దానికి ఒప్పుకోలేదు. అందుకే ఒక ప‌ని చేయ్‌. నా లోపం నిజ‌మే క‌దా. డాక్ట‌ర్లు అయినా కొన్నిసార్లు రిపోర్టు త‌ప్పు వ‌స్తుంటాయి. అది మ‌నం ఒప్పుకోవాలి. కానీ ఇప్పుడు వారిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌ని నువ్వు నిరూపించాలి. అప్పుడు హిమ విష‌యంలోనూ మానసికంగా నిర్ణ‌యం తీసుకుంటా. అలాగే నీ విష‌యంలో కూడా న‌దేను గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటా అని చెప్తాడు. దాంతో కాస్త ఆలోచ‌న‌లో ప‌డ్డ మౌనిత‌.. అబ‌ద్దాన్ని అబ‌ద్ధ‌మ‌ని నిరూపించ‌డం ఎంత‌సేపు. ఇది ప‌క్క‌న‌పెడితే నా విష‌యంలో గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటా అని అంటున్నాడు. అంటే న‌న్ను పెళ్లి చేసుకుంటాడు అని లోలోప‌ల సంతోషప‌డుతూ హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది మౌనిత‌.

  ఇక మ‌రోవైపు బ‌య‌టి నుంచి వ‌చ్చే ఆనంద‌రావు.. సౌంద‌ర్య చిన్నోడు ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా అని ప్ర‌శ్నిస్తాడు. తెలీదు ఎక్క‌డికి వెళ్లాడు అని అడ‌గ్గా.. నిజాలు ఎందుకు చెప్ప‌లేద‌ని దీప‌ను నిల‌దీస్తాన‌ని వెళ్లాడు అని చెప్తాడు. అంద‌రు క‌లిసి దాన్ని నిల‌దీసేవాళ్లే. అయినా హిమ విష‌యంలో న‌న్ను క‌దా అడ‌గాల్సి. వాడు అస‌లే ఏదైనా కోపం వ‌స్తే గ‌ట్టిగా అరుస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడో అని సౌంద‌ర్య చెబుతూ.. ఆదిత్య‌కు ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ స్విచ్ఛాప్ వ‌స్తుంది. రాత్రంతా నిద్ర‌పోలేదు అత్త‌య్య‌. ఏమ‌ని అడిగితే నా మీద క‌సురుకున్నాడు అని శ్రావ్య చెబుతోంది. అస‌లు వీడు ఏం చేస్తాడో అన్న టెన్ష‌న్‌లో సౌంద‌ర్య ఉంటుంది.

  ఇక దీప ద‌గ్గ‌ర‌కు ఆదిత్య వెళ్ల‌గా.. కారును చూసి కార్తీక్ వ‌చ్చాడ‌నుకొని డాడీ వ‌చ్చాడంటూ సంతోషంగా వెళుతుంది హిమ‌. కానీ లోప‌లి నుంచి ఆదిత్య దిగ‌డం చూసి కాస్త ఫీల్ అవుతుంది. ఆ త‌రువాత ఏంటి హిమ‌.. అలా అయిపోయావు. డాడీ వ‌చ్చాడ‌నుకున్నావా..? వ‌స్తాడులే రాకుండా ఎక్క‌డికి పోతాడు అని చెబుతాడు. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో మీరు విడిపోయి ఎన్ని సంవ‌త్స‌రాలు అయ్యింది వ‌దిన‌. ఇన్ని ఏళ్ల‌లో ఎందుకు నీ గురించి అన్న‌య్య‌కు నిరూపించ‌లేక‌పోయావు అని అడుగుతాడు. దానికి ఇదే ప్ర‌శ్న‌ను మీ అన్న‌ను వేశావా..? అది అబ‌ద్ధ‌మ‌ని నిరూపించ‌మ‌ని అని అడుగుతుంది. మ‌రోవైపు హిమ ఎండ‌లో నెత్తిపై కుర్చీ పెట్టుకొని పోతుండ‌టాన్ని కారులో నుంచి చూసి బాగా ఫీల్ అవుతుంటాడు కార్తీక్.
  Published by:Manjula S
  First published:

  అగ్ర కథనాలు