Karthika Deepam:.. ఆ పిల్లల దగ్గరకు వెళ్లాలని ఆనందరావుతో అంటుంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్లో సౌందర్య, ఆనందరావుల మధ్య మాటలు కొనసాగుతున్నాయి. ఆ పిల్లలకు మన అవసరం ఉంది, అందుకే మనమిద్దరం వెళ్లి అక్కడ ఉందామండి అని సౌందర్య, ఆనందరావుతో అంటుంది. కోడలిని, పిల్లలను చూసుకుంటూ ఏ లోటు లేకుండా చూసుకుంటూ ప్రశాంతంగా ఉందాం అని అంటుంది. దానికి ఆనందరావు ఇది తాత్కాలిక ఉపశమనం సౌందర్య, శాశ్వతమైన పరిష్కారం కాదు, పైగా మనం వెళ్లి అక్కడ ఉంటే ఇక్కడ వీడిని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఫీల్ అవుతాడు, ఇది మంచి నిర్ణయం కాదు. ఇద్దరిని కలపడం ఆలస్యం అవుతుందేమో కానీ ఆ ఇద్దరు కలవడం తప్పదు అని అంటాడు. నా వల్ల కావడం లేదండి, ఆ పసివాళ్ల పరిస్థితి గుర్తొస్తుంటే, ఆ దృశ్యమే నా మనసంతా కలిచివేస్తోంది. చూస్తూ చూస్తూ వదిలి రావాలంటే గుండె తరుక్కుపోతోంది. దీనికంతటి కారణం వాడే అని అంటుంది.
అదే సమయంలో కార్తీక్ ఇంట్లోకి రాగా.. సౌందర్య అతడితో మాట్లాడుతుంది. కార్తీక్ ఇందాక లంచ్ టైమ్‌లో నేను హిమ వాళ్లను చూడటానికి వెళ్లాను అని అంటుంది. హిమ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని కార్తీక్ అనగా.. ఇద్దరు మనవరాళ్లను చూడటానికి వెళ్లాను అని చెబుతుంది. కోడలి పేరు మర్చిపోయావేంటి అనగా.. అది లేదు అని సౌందర్య అంటుంది. ఉండదు అని కార్తీక్ అనగా.. హిమ, నువ్వు వచ్చి తీసుకొచ్చే వరకు ఇక్కడకు రానని ఖరాఖండిగా చెప్పేసింది. అక్కడ వాళ్ల పరిస్థితి ఏం బాలేదు అని సౌందర్య అనగా.. ఆ స్థితి నేను ఇచ్చింది కాదు అని కార్తీక్ అంటాడు. కానీ ఆ పరిస్థితి నీ వల్లే వచ్చిందని సౌందర్య అనగా.. ఆ దుస్థితికి కారణం నేను కాదు అని కార్తీక్ చెబుతాడు. నేను ఇప్పుడు కారణాలు శోధించడం లేదు అని సౌందర్య అనగా.. నేను ఇప్పుడు వినదలుచుకోలేదు అని కార్తీక్ అంటాడు. దానికి సౌందర్య వినాల్సిన అవసరం ఉందని చెబుతుంది. నీకు చెప్పాల్సిన అవసరం ఉంది అని కార్తీక్ అనగా.. చెప్పాల్సిన బాధ్యత ఉంది అని సౌందర్య అంటుంది. అది ఏక పక్షంగా ఉంటుందని కార్తీక్ అనగా.. వెన్నెల కావాలంటే శుక్లపక్షాన్నే అడగాలి, అది పౌర్ణమి వైపు ప్రయాణస్తూ ఉంటుంది. వాళ్లందరు ఇప్పుడు కృష్ణపక్షంలో ఉన్నారు. అమావాస్య వైపు అడుగులు వేస్తూ.. ఇప్పుడు నేను ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవాలో.. ఏ పక్షంగా నిర్ణయాలు తీసుకోవాలో నువ్వే చెప్పు అని సౌందర్య అంటుంది.
నువ్వు తీసుకునే నిర్ణయాలతో నాకు సంబంధం లేదని కార్తీక్ అనగా.. నీకు అసలు ఈ ఇంటి సభ్యులతో గానీ.. ఈ ఇంటి సభ్యులు పడే బాధతోగానీ ఎలాంటి సంబంధం లేదు అని ఆనందరావు అంటాడు. నీకు తల్లి చెడే చెబుతుంది, తండ్రి చెడే చెబుతాడు, భార్య చెడే చెబుతుంది. ఆ మౌనిత ఒక్కటే మంచి చెబుతుంది అంతేనా అని ఆనందరావు అనగా.. అసలు ఇదంతా ఏంటి అని కార్తీక్ అంటాడు. నా మానాన నేను ఉంటే నన్ను గెలిచి మరీ రెచ్చగొడుతున్నారు. అక్కడ అది, ఇక్కడ మీరు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అసలు మీ సమస్య ఏంటి..? నేనా..? నా సమస్య..? నా సమస్య మీకు సమస్యగా మారితే అందులో నా బాధ్యత లేదు అంటున్నాను. ఎందుకంటే నా సమస్యను నేనే తేల్చుకుంటాను అని అంటాడు.
మరి నా కోడలు తరఫున ఎవ్వరూ లేరు కదా అని ఆనందరావు అనగా.. మీ కోడలు తరఫున ఎవ్వరూ లేరా..? ఏం మాట్లాడుతున్నారు..? వంటలక్క తరఫున నాతో ఫైట్ చేయడానికి సరోజక్కతో సహా ఆటో వాళ్లు, బస్తీ వాళ్లు, దేశం అంతా ఎదురుచూస్తుంది. అయినా మీ కోడలు ఒకరి సహాయం అర్జించే వ్యక్తి కాదు కదా.. సెల్ఫ్ రెస్పెక్ట్ కదా, ఇంతకాలం ఇంట్లో రాజకీయాలు నడిపింది. డివైడ్ అండ్ రూల్‌ని కరెక్ట్‌గా నడిపింది. మెజారిటీని తెచ్చుకుంది. హిమను కూడా తనవైపుకు తిప్పుకొని.. హిమ రావాలంటే ఆ ఇద్దరికి కూడా తీసుకురావాలి అని కండిషన్ తీసుకొచ్చింది. ఎవడికి తెలీదు ఈ రాజకీయాలు. ఒక మాట అడుగుతాను సూటిగా చెప్పు మమ్మీ.. అది నాకు భార్య కాకపోయినా.. నా కోడలు అని బేస్ వాయిస్‌లో చెబుతావు కదా.. మరి నీ కోడలు పిల్లల ఆలనాపాలనా చూసుకోకుండా వదిలేసిందే, మరి అది చూసి నీ గుండె తరుక్కుపోయింది తప్ప నీ కోడలు మీద కోపం రాలేదే..? అది ఇంటిని, పిల్లలను పట్టించుకోకుండా నడిచే అగ్ని కణాన్ని నేను, రగిలే నిప్పు కణాన్ని నేను అంటూ కవిత్వం భాషలో సోది చెప్పుకుంటూ బలాదూర్ తిరుగుతుంటే రౌడీయిజం చేస్తుంటే అప్పుడేం పరువు పోలేదా..? మౌనితతో నేను మాట్లాడితే మాత్రం గుండెలు బాదుకుంటూ పరువు, ప్రతిష్టలు అంటారు. మీ కోడలిని మీరు అదుపు చేయలేరు, దాని మూలంగా సఫరవుతున్న పిల్లలను చూసి నా దగ్గరకు వచ్చి చెప్పే బదులు దాన్నే లాగి పెట్టి కొట్టి నోర్ముసుకొని కూర్చోమని ఎందుకు చెప్పలేరు. లేని సాక్ష్యాన్ని తీసుకొస్తానని, గులేభకావళి కథ చెబుతుంటే ప్రేక్షకుల్లా చూస్తూ ఉంటారు. దానిలా నేను మాటల గారడీ చేయడం లేదు. కాబట్టి సెంటిమెంట్ చెప్పి దాన్ని తెచ్చి నాకు అంటగట్టి, ఆదర్శ అత్తమామాలుగా చరిత్రలో నిలిచిపోవాలని ఆశలు ఏం పెట్టుకోకు అని అక్కడి నుంచి వెళతాడు.
ఇక మరోవైపు దీపపై కేసు పెట్టేందుకు ఓ లాయర్ని ఇంటికి తీసుకొస్తుంది మౌనిత. ఒకటి కాదు, రెండు కాదు మ్యాన్ హ్యాండ్లింగ్ పెట్టండి పోని అదైనా కాపురం చేసిందా..? ఒకవేళ వెళ్లినా కార్తీక్ ఆ దీపను చూసి రగిలిపోతాడు. పదేళ్ల నుంచి దూరం పెట్టాడు అని మౌనిత అంటుంది. వెంటనే ప్రియమణి పాపం ఈ అమ్మకు కార్తీక్ అంటే పంచ ప్రాణాలమ్మా. కోర్టులో తిమ్మిని బమ్మిని చేస్తారని సినిమాల్లో చూపిస్తారు కదా.. అలా ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేసి మా అమ్మకు, కార్తీక్ అయ్యకు పెళ్లి చేయండమ్మా అని అంటుంది. అది అంత ఈజీ కాదు ప్రియమణి అని లాయర్ చెబుతుంది. కానీ మీరు చెప్పినవన్నీ నిజాలేనా అని లాయర్ అడగ్గా.. అయ్యో రామా నేనే సాక్షికం. పిల్లికి ఎలక సాక్ష్యం అనుకుంటున్నారా..? మా అమ్మ పులి అమ్మా గడ్డి తినదు, నేను అంతే అని అంటుంది.
ఇక లాయర్.. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన తన భార్యను తెచ్చుకోవడానికి సుముఖంగా లేడుగా అని అడుగుతుంది. దానికి మౌనిత అస్సలు లేడు మేడమ్.. ఇది నా మాట కాదు జనం మాట. మొన్న ఓ ఫంక్షన్లో ఆయన భార్య దీప అని సభా ముఖంగా ఎవరో చెబితేనే సత్కారం వద్దని స్టేజ్ దిగి వెళ్లిపోతాడు. అక్కడ చాలా మంది జనం ఉన్నారు, అందుకే జనం మాట అంటున్నా అని మౌనిత అంటుంది. ఆ ఫంక్షన్ వీడియో ఉందా..? అని లాయర్ అనగా ఉందని మౌనిత అంటుంది. ఇక వాటిని అలాగే ఉంచండి, ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉంచండి, చట్టప్రకారం మీకు అనుకూల పరిస్థితులు వస్తాయని నాకు అర్థమవుతోంది అని లాయర్ చెబుతుంది. దానికి థ్యాంక్యు మెరీమచ్ లాయర్ గారు, నేను మీకు టచ్‌లో ఉంటాను అని చెబుతుంది. ఇక లాయర్ అక్కడి నుంచి వెళ్లగా.. మీరు చెప్పినట్లే భార్య, భర్తలను విడదీయడంలో ఈమె తోపు లాయర్ ఉన్నట్లుగా ఉంది మౌనిత అంటుంది. ఇక మౌనిత చాలా ఆనందంలో ఉంటుంది.
మరోవైపు ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోవడంతో దీప కాస్త ఆలోచనలో పడుతుంది. వెంటనే సౌర్య వచ్చి కూరగాయలు ఏం లేవు కదమ్మా అని అంటుంది. దానికి దీప.. ఇవాళ వీటితో చేస్తాను అని అంటుంది. ఉల్లిపాయలతో ఏం చేస్తావమ్మా అని సౌర్య అడగ్గా.. ఉల్లిపాయ పచ్చడి చేస్తా. చింతపండు, ఎండుమిర్చి వేసి బాగా చేస్తానులే. ఓ రోజు సరోజక్క చేసి పెడితే ఎలా చేస్తారో అడిగి తెలుసుకున్నా అని అంటుంది. డబ్బులు లేవా అమ్మా అని సౌర్య అడగ్గా.. ఎందుకు లేవు ఉన్నాయ్.. ఇప్పుడు వెళ్లి కూరగాయలు తేవడానికి బద్ధకంగా ఉంది అత్తమ్మా.. డబ్బులు ఎందుకు లేవు ఉన్నాయ్ అని దీప అంటుంది. ఏంటమ్మా.. అని సౌర్య అనగా.. ఏదో ఆలోచిస్తాను అని దీప అంటుంది.
దేని గురించని సౌర్య అనగా.. జీవితం గురించి, మొదటిసారి తప్పు చేశాను అని దీప అంటుంది. వెంటనే హిమ.. ఎంటమ్మా.. నువ్వు తప్పు చేశావా..? అని అడుగుతుంది. తప్పు కాదమ్మా అప్పు, అప్పు చేశాను.. మనకు తప్పులు, అప్పులు చేయడం సరిగా చేతకాదని అర్థమైంది అని.. మౌనిత ఇంట్లో జరిగిన సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటుంది. అప్పంటే ఏంటమ్మా అని హిమ అనగా.. సౌర్య నవ్వుతుంది. ఎందుకు నవ్వుతావు నాకు నిజంగా తెలీదు అని హిమ అంటుంది. ఇక దీప.. తప్పు అత్తమా.. అలా నవ్వకూడదు. ఏదైనా తెలీనప్పుడు తెలిసినట్లు ఉండటం కన్నా అడగటమే మంచిది, తెలీనంత వరకు అఙ్ఞాని, ఆ తరువాత ఙ్ఞాని, అయినా నేను నీకు చెబుతాను ఏంటి..? ఇప్పటికీ ఎన్ని వందల ప్రశ్నలు వేసి ఉంటావు. ఇంత చెబుతున్నావు గానీ.. తప్పు.. ఛీ ఛీ అప్పు గురించి చెప్పలేదు అని హిమ అడుగుతుంది. అప్పు చేయడం కూడా ఒక విధంగా తప్పు చేయడం లాంటిదే హిమ అని దీప చెబుతుంది. అంటే అని హిమ అడగ్గా.. డబ్బులు ఉన్న వాళ్ల దగ్గర మనకు ఎంత కావాలో తీసుకొని మళ్లీ ఇచ్చేటప్పుడు వడ్డీతో సహా ఇస్తామే దాన్నే అప్పు అంటారు అని సౌర్య చెబుతుంది. అవునా నాకు నిజంగా తెలీదు అని హిమ అనగా.. అక్కడ నాన్నకు గానీ, నానమ్మకు గానీ అప్పు చేసే అవసరం లేదు కదా అందుకే తెలిసి ఉండదు అని సౌర్య చెబుతుంది.
ఇప్పుడు నువ్వు అప్పు చేశావా అమ్మా అని హిమ అనగా.. డబ్బులు లేదు కదా అందుకే చేసి ఉంటుంది అని సౌర్య చెబుతుంది. నానమ్మను అడగొచ్చు కదా అని హిమ చెప్పి.. తరువాత వద్దులే అమ్మా నువ్వు ఎవ్వరినీ అడగొద్దు అని అంటుంది. ఎందుకమ్మా అనగా.. డాడీ మారిపోయాడు కదా అని చెబుతుంది. ఇక నీ చేతిలో ఉల్లిపాయ ఏదీ అమ్మా అని సౌర్య అడగ్గా.. ఒక్కో పొర తీసుకుంటూ వెళితే చివరకు ఏం మిగలలేదు అత్తమ్మా అని దీప అంటుంది. దానికి అందరూ బాధపడుతుంటారు.
ఇక ఇంట్లో కార్తీక్.. సౌందర్య, హిమ గురించి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు కార్తీక్. హిమ.. రానన్నావా..? నేను పిలిచే దాకా రానన్నావా..? నేనే కదా నాన్నను కదా.. నువ్వే కదా నా హిమవు కదా.. రావచ్చు కదా వద్దంటానా.. రావద్దంటానా..? నువ్వు గుర్తు వస్తే ఏం చేయాలిరా..? నీ గుర్తులేవీ లేకుండా చేసింది అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సౌందర్య అక్కడకు రాగా.. ఆమెను సోఫాలో కూర్చోబెట్టి, కాళ్ల దగ్గర కూర్చుంటాడు. వెంటనే ఏంటి నాన్న అని సౌందర్య అడగ్గా.. ఒంటరిని అయిపోయాననిపిస్తుంది మమ్మీ అని అంటాడు. అర్థమవుతోందిరా అని సౌందర్య అనగా.. నాకేం అర్థం కావడం లేదు మమ్మీ అని అంటాడు. ఈ పరిస్థితి తెచ్చిన దోషిని నేనే కదా అని సౌందర్య అంటుంది. నాకు ఇప్పుడు ఎవ్వరినీ దోషిగా నిల్చోబెట్టాలని లేదు అని కార్తీక్ అంటాడు. కానీ నైతిక బాధ్యత వహించాల్సింది నేనే కదా అని సౌందర్య అనగా.. చెప్పకుండా ఉండాల్సిందేమో మమ్మీ అని కార్తీక్ అంటాడు. ఏదీ అని సౌందర్య అడగ్గా.. హిమ, దీప కూతురేనని హిమతో చెప్పకుండా ఉండాల్సింది అని అంటుంది. చెప్పక తప్పని పరిస్థితి అదే తీసుకొచ్చింది కదా సౌందర్య అనగా.. ఒకవేళ ముందే తెలిసి ఉంటే, నేను అసలు చెప్పేవాడిని కాదు మమ్మీ అని అంటాడు. నీకే చెప్పేదాన్ని కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అని సౌందర్య అంటుంది. నేనేమీ రాక్షసుడిని కాదు మమ్మీ అని కార్తీక్ అనగా.. తెలుసురా కానీ పరిస్థితులు ఎంతలా మారిపోతూ ఉంటాయో నీకు తెలీదు అని సౌందర్య చెబుతుంది. ఈ పరిస్థితులకు కారణం ఎవరు మమ్మీ.. కన్నతల్లా, పెంచిన తండ్రా, నా కన్న తల్లా, మన అందరినీ పుట్టించిన ఆ దేవుడా.. ఎవరు కారణం అని బాధపడుతూ ఉంటాడు.
దానికి సౌందర్య నేనే అంటుంది. వెంటనే కార్తీక్.. అంటాను కానీ కోపంలో ఎన్నో అంటాను కానీ.. ఒక్కోసారి నువ్వు మాట్లాడుతుంటే నిజమే కదా అనిపిస్తుంది. అమ్మే కదా నా గురించి ఇంతలా ఆలోచించేది అని అనుకుంటూ ఉంటాను. కానీ నాకు తెలిసిన నిజం, నువ్వు నమ్మిన నిజాన్ని రాహువులా మింగేస్తోంది. నమ్ము నమ్మకపో మమ్మీ ఎప్పుడో తప్పటడుగు పడింది. అది నాకు తెలుసు, దానికి తెలుసు, ఆ తరువాత అది మారిపోతే మాత్రం ఏం లాభం, లాభం లేదు, నువ్వు అన్నట్లు పిల్లలిద్దరు అలా బీదరికం అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను మమ్మీ.. పిల్లలు కదా వాళ్లేం పాపం చేశారు. ఆ పిచ్చిది డబ్బులు తీసుకొని ఉండొచ్చు కదా. పిల్లలకు ఆ గతి పట్టేది కాదు కదా.. శాపం తగిలింది మమ్మీ.. నాకు పిల్లలకు.. మళ్లీ వరాలు ఇచ్చేదెవరు..? ఇప్పుడు నేను హిమను మర్చిపోలేను, వదులుకోలేను, తెచ్చుకోలేను, హిమను వెనక్కి తెచ్చుకోవాలంటే ఏ చట్టాన్ని ఆశ్రయించాలి, ఏ న్యాయమూర్తికి నా బాధను నివేదించాలి, ఏ దేవుడిని కొలవాలి..? ఏం చేయాలి..? ఆ ఒక్క తప్పు అది చేసి ఉండకపోతే కాలం వెనక్కి మళ్లీ.. మళ్లీ నాకు ఆత్మ సౌందర్యమే కంటపడితే.. ఈ గుండె చల్లబడితే ఎంత బావుంటుందో కదా మమ్మీ అని ఏడుస్తాడు. ఇక కార్తీక్‌ని చూసి సౌందర్య కూడా ఏడుస్తుంది.
కాగా మరోవైపు అంజి, మౌనిత, సౌందర్య, అంజి మాటలను గుర్తు చేసుకుంటూ.. మౌనిత విషయం డాక్టర్ బాబుకు చెప్పాలని అనుకుంటాడు. సోమవారం నాటి ఎపిసోడ్ ప్రోమోలో తాను హిమను చంపిన విషయాన్ని అంజి దీపతో చెబుతాడు.