Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్లో కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్క ట్విస్ట్ బయటకు వస్తుండగా.. ఇవాళ్టి ఎపిసోడ్లో మరింత రసవత్తరంగా ఉండనుంది. సౌర్య, హిమ ఇద్దరు దీప పిల్లలు అనే విషయం తనకు తెలిసిపోయిందని డాక్టర్ బాబు(కార్తీక్) చెబుతాడు. ఆ విషయాన్ని దీప కూడా ఒప్పుకుంటుంది. ఆ ఇద్దరు మా పిల్లలేనని చెబుతోంది. దాంతో దీపను కొట్టిన కార్తీక్.. మన కాదు నీ పిల్లలని చెబుతాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య, శ్రావ్య, మురళీ కృష్ణ, భాగ్యం సంతోషపడతారు. ఆ ఇద్దరు దీప పిల్లలు అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అయితే ఈ నిజాన్ని తన దగ్గర దాచిన సౌందర్య, దీప, ఆనందరావులకు గట్టి క్లాస్ తీసుకుంటాడు కార్తీక్. తన దగ్గర ఎందుకు నిజాన్ని దాచావు మమ్మీ. నాకు పుట్టని పిల్లలకు నన్ను ఎందుకు తండ్రిని చేశావు అని సౌందర్యను నిలదీస్తాడు.
అలాగే మీరు నాకు పిల్లలు పుట్టరన్న నిజాన్ని ఆ రోజే మీ కూతురికి నిజం చెప్పి ఉంటే బావుండేది. అప్పుడు మీ కుమార్తెకు పెళ్లి అవుతుందిలే అన్న స్వార్థంలో చెప్పలేదు. మామగా గెలవలేదు. తండ్రిగా తలదించుకోండి అంటూ మురళీకృష్ణపై కార్తీక్ ఫైర్ అవుతాడు. అయితే మీ ఇద్దరినీ కలపాలని, మీ కాపురాన్ని నిలబెట్టాలని నేనే అలా చేశాను రా. నిజం నిలకడ మీద తెలుస్తుంది. నేను నీకు అన్యాయం చేయలేదు. కానీ దాని దగ్గర నుంచి బిడ్డను తీసుకొని దానికి అన్యాయం చేశాను అంటూ దీప గురించి చెప్పుకొచ్చింది సౌందర్య. ఇక హిమ, దీప కూతురు అని మాకు చెప్పకపోయినా.. అన్నయ్యకు చెప్పాల్సింది కదా మమ్మీ.. అప్పుడు హిమ కోసం అయినా వారిద్దరు కలిసి ఉండేవారు అని ఆదిత్య చెప్తాడు.
దాంతో ఆదిత్య కాలర్ని పట్టుకున్న కార్తీక్.. ఇంకా మీరందరూ ఎందుకు మా ఇద్దరిని కలపాలని చూస్తున్నారు. మీరంతా బావుండండి. నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోతా అంటూ తన బ్యాగ్‌ని తీసుకొని వస్తాడు. తరువాత దీప దగ్గరకు వచ్చి.. నేను నీకు న్యాయం చేయలేకపోయినా, అన్యాయం చేయలేదు. ఇప్పుడు నా ఆస్తిని నీకే వదిలేసి వెళ్తున్నా అని చెప్తాడు. అప్పుడు దీప, కార్తీక్ కాళ్లపై పడగా.. ఆమెను వదిలించుకొని వెళ్తుంటాడు. అదే సమయానికి బయట నుంచి గిఫ్ట్‌లతో సౌర్య, హిమలు ఇంట్లోకి వస్తారు. అప్పుడు హిమను చూసిన కార్తీక్.. ఆమెతో ఙ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆగిపోతాడు. మరోవైపు ఎక్కడికి వెళ్తున్నావు డాడీ అంటూ హిమ అడుగుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమోలో కార్తీక్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తుండటం, హిమ అడ్డుకోవడం చూపించారు.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.