Premi Viswanath: మెగా ఫ్యామిలీ కంటే వంటలక్కకే డిమాండ్ ఎక్కువ.. ఇదే ప్రూఫ్!

Premi Viswanath

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకు ఉన్న గుర్తింపు గురించి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ ఫ్యామిలీకి ఉన్న అభిమానుల ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

  • Share this:
    Premi Viswanath: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకు ఉన్న గుర్తింపు గురించి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ ఫ్యామిలీకి ఉన్న అభిమానుల ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి నుండి ఇటీవలే ఉప్పెన సినిమాతో పరిచయమైన వైష్ణవ్ తేజ్ వరకు ఈ కుటుంబానికి మంచి క్రేజ్ ఉంది. ఇక వీళ్లు నటించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క సినిమాను మంచి సక్సెస్ తో వాళ్ల ఖాతాలో నింపుకుంటున్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీకి వంటలక్క వల్ల డిమాండ్ తగ్గిందని తెలుస్తుంది.

    వంటలక్క అంటే బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ అంటే తెలియనివారు లేరు. 2017 అక్టోబర్ లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటికీ మంచి క్రేజ్ తో దూసుకెళ్తోంది. ఈ సీరియల్ లో దీప, కార్తీక్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అనుమానం వల్ల వీరిద్దరు విడిపోయారు. ఇక ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉన్న ఈ జంట.. ఎప్పుడు కలుస్తారా..అని ప్రేక్షకులు ఎదురు చూడని రోజే లేదు. ఇక ప్రస్తుతం దీప అనారోగ్యం బాలేనందున కార్తీక్.. దీప కి దగ్గరగా అవడంతో ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారింది. ఇక దీంతో ప్రేక్షకులు ఈసారి సీరియల్ సమయం కాక ముందుకే వెళ్లి టీవీల ముందు వాలిపోతున్నారు. ఇక ఈ సీరియల్ రేటింగ్ విషయంలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే అస్సలు సంబంధంలేని మెగా ఫ్యామిలీకి, వంటలక్క కి మధ్య ఈ డిమాండ్ ఏంటో అనుకుంటున్నారా.. నిజానికి వంటలక్క తో మెగా ఫ్యామిలీ డిమాండ్ తగ్గిందనే చెప్పవచ్చు. ఎలాగో చూడండి..

    ఇటీవలే విడుదలైన ఉప్పెన సినిమా బుల్లి తెర స్టార్ మా లో ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన సంగతి తెలిసిందే. ఇక స్టార్ మా లో ప్రసారమైన ఈ సీరియల్ రేటింగ్ విషయంలో 13320 లో ఉండగా.. ఇక అదే స్టార్ మా లో ప్రసారమయ్యిన వంటలక్క సీరియల్ కార్తీకదీపం ఆ రోజు 14053 రేటింగ్ తో పై స్థానంలో ఉంది.

    karthika deepam
    karthika deepam


    థియేటర్ లో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డు సాధించుకున్న ఉప్పెన సినిమా.. బుల్లితెర లో ప్రసారం అవ్వగా ఏకంగా వంటలక్క సీరియల్ కంటే తక్కువ రేటింగ్ సాధించుకుంది. ఈ రేటింగ్ ను చూస్తే మెగా కుటుంబాన్ని వంటలక్క తన రేటింగ్ తో తగ్గించేసిందని అర్థమవుతుంది. మొత్తానికి అన్ని సీరియల్ లో కంటే పై స్థానంలో ఉన్న వంటలక్క సీరియల్.. ఏకంగా వెండితెర లో అది కూడా మెగా ఫ్యామిలీ తో పోటీతో పై స్థానంలో ఉందని అర్థం అవుతుంది.
    Published by:Navya Reddy
    First published: