Karthika Deepam - Nirupam Paritala: డాక్టర్ బాబుకు ప్రమాదం.. ఆ షోలో ఒక్కసారిగా కిందపడి నేలకు గుద్దుకోవడంతో?

Nirupam Paritala

Karthika Deepam - Nirupam Paritala: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ తో మంచి అభిమానాన్ని అందుకున్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్ తో మంచి గుర్తింపు అందుకున్నాడు నిరుపమ్.

  • Share this:
    Karthika Deepam - Nirupam Paritala: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ తో మంచి అభిమానాన్ని అందుకున్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్ తో మంచి గుర్తింపు అందుకున్నాడు నిరుపమ్. అంతేకాకుండా బుల్లితెర శోభన్ బాబు గా కూడా నిలిచాడు. ఇక ఈ సీరియల్ తో పాటు జీ తెలుగులో ప్రసారమవుతున్న హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో కూడా బిజీగా ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా నిరుపమ్ కు ఓ ప్రమాదం జరిగింది.

    బుల్లితెరలో ఎన్నో ఏళ్ళ నుండి నటిస్తున్న నిరుపమ్ కు.. స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ తో మంచి క్రేజ్ అందింది. నిజానికి ఈ సీరియల్ తోనే తన కెరీర్ మొదలైందని చెప్పవచ్చు. మొత్తానికి కార్తీక దీపం తో డాక్టర్ బాబు గా బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు నిరుపమ్. ఇక గతంలో ఈయనకు వెండితెరపై కూడా హీరోగా అవకాశం కూడా వచ్చింది. కానీ డేట్స్ కుదరకపోవడంతో వదులుకున్నాడు. ఇక ఇప్పటికీ పలు సీరియల్స్ లో, సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు.

    ఇక హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ తో మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు డాక్టర్ బాబు. ఈ సీరియల్ లో తన లుక్ తో మరింత ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జీ తెలుగులో 'సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్' షో ప్రసారమవుతుంది. ఇక వచ్చే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో హిట్లర్ గారి పెళ్ళాం - వైదేహి పరిణయం సీరియల్ మధ్య పోటీ జరిగింది.



    ఇందులో యాంకర్ ప్రదీప్ హోస్టింగ్ చేస్తున్నాడు. ఈ ప్రోమో లో చూసినట్లయితే నిరుపమ్ పంచ్ లతో బాగా సందడి చేశాడు. యాంకర్ ప్రదీప్ కూడా వీళ్ళతో బాగా ఆడుకున్నాడు. ఇక ఇందులో ఓ గేమ్ లో భాగంగా నిరుపమ్ ఉయ్యాల మీద కూర్చొని గేమ్ లో పాల్గొనగా.. వెనకాల ఉన్న వ్యక్తి గట్టిగా నెట్టడంతో నిరుపమ్ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అవగా కింద స్పాంజి లు ఉండటంతో నేలకు గుద్దుకున్న కూడా అంత గాయాలు కాలేదని తెలుస్తుంది.
    Published by:Navya Reddy
    First published: