గుడ్‌న్యూస్ చెప్పిన వంటలక్క...పార్టీ చేసుకున్న కార్తీక దీపం సీరియల్ యూనిట్...

తాజాగా కార్తీక దీపం సీరియల్ మొదటి సీజన్ పూర్తి కావొచ్చింది. అంతేకాదు రేటింగ్స్ లో కూడా టాప్ లో నిలిచింది. దీన్ని పురస్కరించుకొని దీప యూనిట్ మొత్తానికి పార్టీ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: November 14, 2019, 11:07 PM IST
గుడ్‌న్యూస్ చెప్పిన వంటలక్క...పార్టీ చేసుకున్న కార్తీక దీపం సీరియల్ యూనిట్...
పార్టీ మూడ్ లో కార్తీక దీపం టీమ్
  • Share this:
Karthika Deepam : తెలుగు సీరియల్స్‌లో విశేష ఆదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం, అయితే ఈ సీరియల్ లో దీప కేరక్టర్ అంటే మహిళలకు బాగా ఇష్టమనే చెప్పవచ్చు. కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు. అయితే దీపగా, వంటలక్కగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమి విశ్వనాథ్, ప్రతీ మహిళను కదిలించేలా నటించింది. అయితే తాజాగా కార్తీక దీపం సీరియల్ మొదటి సీజన్ పూర్తి కావొచ్చింది. అంతేకాదు పెద్ద సినిమాలు, రియాలిటీ షోలను సైతం తోసిరాజని రేటింగ్స్ లో కూడా టాప్ లో నిలిచింది. ఈ గుడ్ న్యూస్‌ను  పురస్కరించుకొని దీప యూనిట్ మొత్తానికి పార్టీ ఇచ్చిందని బుల్లితెర ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనికి సబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పార్టీలో డాక్టర్ బాబుతో పాటు యూనిట్ మొత్తం హాజరైంది. అయితే ఈ పార్టీలో అత్తమ్మ సౌందర్య వేసుకున్న డ్రెస్ అయితే టాక్ ఆఫ్ ది టౌన్ అనే చెప్పవచ్చు.First published: November 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...