KARTHIKA DEEPAM SERIAL FAME BAGYAM ALIAS UMA DEVI LEAKS HERSELF WITH EMOTIONAL INSTAGRAM POST NR
Bigg Boss 5 Telugu: ఎమోషనల్ పోస్ట్‌తో ఎంట్రీని లీక్ చేసిన కార్తీకదీపం భాగ్యం..?
Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu: స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క సవతి తల్లిగా నటిస్తున్న భాగ్యం గురించి అందరికీ తెలిసిందే. భాగ్యం అసలు పేరు ఉమాదేవి. ఈ సీరియల్లో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Bigg Boss 5 Telugu: ఎమోషనల్ పోస్ట్‌తో ఎంట్రీని లీక్ చేసిన కార్తీకదీపం భాగ్యం..?
Bigg Boss 5 Telugu: స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క సవతి తల్లిగా నటిస్తున్న భాగ్యం గురించి అందరికీ తెలిసిందే. భాగ్యం అసలు పేరు ఉమాదేవి. ఈ సీరియల్లో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ తో పాటు ప్రేమ ఎంత మధురం, మమతల కోవెల సీరియల్ లో కూడా నటిస్తుంది. ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో సహాయ పాత్రలలో, బోల్డ్ పాత్రల్లో కూడా నటించింది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 ఎంట్రీ గురించి లీక్ చేసింది.
ప్రస్తుతం స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎపిసోడ్ ప్రారంభమవ్వగా.. ఇప్పటికే ఇందులో పలువురు సెలబ్రిటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఉమాదేవి కూడా ఈ సీజన్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉండగా.. తాజాగా తన ఎంట్రీ గురించి ముందే రివీల్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అందులో.. ప్రతి అమ్మాయి ఏదో సాధించాలని కష్టపడుతుంది అంటూ.. తాను కూడా ఎంతో ఇష్టంగా కెరీర్ ను ఎంచుకున్నానని తెలిపింది.
అలా ఎన్నో మంచి సినిమాలలో నటించాను అంటూ దాదాపు వందకు పైగా సినిమాలు చేశానని తెలిపింది. అంతేకాకుండా 15కు పైగా సీరియల్లో నటించాను అంటూ అందులో చంద్రిక, రజిని, భాగ్యం పాత్రలలో చూపించిన ఆదరణ మరిచిపోలేను అంటూ.. ఈ పాత్రలలో తనను బాగా ఎంకరేజ్ చేశారు అని చెప్పింది. ఇక ఇప్పుడు తనను తాను ఏంటో తెలుసుకోవడానికి అందరికీ తెలియజేయడానికి కొత్త అడుగు వేస్తున్నాను అంటూ అందరూ సపోర్ట్ చేయండి అంటూ కోరింది.
తను ఎప్పటిలాగే అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కష్టపడతాను అంటూ.. ప్రస్తుతం తను వేస్తున్నది 'బిగ్' స్టెప్ అని బిగ్ బాస్ ఎంట్రీ గురించి తెలిపింది. ఈ సర్ ప్రైజ్ ఏంటో ఈరోజే తెలుస్తుంది అని అభిమానులతో పంచుకుంది. ఇక ఈమె చేసిన పోస్టుకు అభిమానులు కూడా సపోర్టుగా ఉంటామంటూ కామెంట్లు పెడుతున్నారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.